Brahmapuranamu    Chapters   

అథ ఏకవింశత్యధిశతతమో7ధ్యాయః

సదాచారవర్ణనమ్‌

వ్యాస ఉవాచ

ఏవం సమ్యగ్గృహస్థేన దేవతాః పితరస్తథా | సంపూజ్యా హవ్యకవ్యాభ్యా మన్నేనాతిథిబాంధవాః || 1

భూతాని భృత్యాః సకలాః పశుపక్షిపిపీలికాః | భిక్షవో యాచమానాశ్చ యే చాన్యే పాంథకా గృహే || 2

సదాచారరతా విప్రాః సాధునా గృహమేధినా | పాపం భుంక్తే సముల్లంఘ్య నిత్యనైమిత్తికీః క్రియాః || 3

మునయ ఊచుః

కథితం భవతా విప్ర నిత్యంనైమిత్తికం చ యత్‌ | నిత్యం నైమిత్తికం కామ్యం త్రివిధం కర్మ పౌరుషమ్‌ || 4

సదాచారం మునే శ్రోతుమిచ్ఛామో వదతస్తవ | యం కుర్వస్సుఖమాప్నోతి పరత్రేహ చ మానవః || 5

వ్యాసుండిట్లనియె.

ఇట్లు గృహస్థు దేవతలను పితృదేవతలను హవ్యకవ్యములచేతను అతిథులను బంధువులను భూతములను నౌకరులను పశుపక్ష్యాదులను జీమలను బిచ్చగాండ్రను సన్యాసులను యాచకులను బాటసారులను సదాచారవంతులను అన్నాద్యాహారములచే పానీయములచే బూజించి నిత్యములయిన సంధ్యావందనాదులను నైమిత్తికములయిన యా యా వర్వాదులందు విహితములైన క్రియలను నిర్వర్తించి తీరవలెను. వీని నతిక్రమించినయెడల పాపమనుభవించును. అన మునులిట్లనిరి.

ఓ విప్రుడా! నీవలన నిత్యము నైమిత్తకము కామ్యము (ఏదేని కోరిక సఫలము కావలెనని చేయు కర్మ) అను త్రివిధమైన పురుష కర్తవ్యము (కర్మను) తెలిసికొన్నాము. ఇక సదాచారమనగా నేమో ఇహమందు బరమందు మానవు డాచరించి సుఖపడు దానిని గురించి వినగోరుచున్నామన మునులకు వ్యాసుండిట్లనియె.

వ్యాస ఉవాచ

గృహస్థేన సదాకార్య మాచారపరిరక్షణమ్‌ | న హ్యాచార విహీనస్య భద్రమత్ర పరత్ర వా|| 6

యజ్ఞదాన తపాంసీహ పురుషస్య స భూతయే | భవంతి యః సదాచారం సముల్లంఘ్య ప్రవర్తతే || 7

దురాచారో హి పురుషో నేహా7యుర్విందతే మహత్‌ | కార్యో ధర్మః సదాచార ఆచారసై#్యవ లక్షణమ్‌ || 8

తస్య స్వరూపం వక్ష్యామి సదాచారస్య భోద్విజాః | ఆత్మనైకమనా భూత్వా తథైవ పరిపాలయేత్‌ || 9

త్రివర్గసాధనే యత్నః కర్తవ్యో గృహమేధినా | తత్సంసిధ్ధౌ గృహస్థస్య సిద్ధిరత్ర పరత్ర చ || 10

పాదేనాప్యస్య పారత్ర్యం కుర్యాచ్ఛ్రేయః స్వమాత్మవాన్‌ | అర్థేన చా77త్మభరణం నిత్యనైమిత్తికాని చ || 11

పాదేనైవ తథా7ప్యస్య మూలభూతం వివర్ధయేత్‌ | ఏవమాచరతో విప్రా అర్థః సాఫల్యమృచ్ఛతి || 12

తద్వత్పాపనిషేధార్థం ధర్మః కార్యో విపశ్చితా | పరత్రార్థస్తధైవాన్యః కార్యో7త్రైవ ఫలప్రదః || 13

ప్రత్యవాయభయాత్కామ స్తథా7న్యశ్చావిరోధవాన్‌ | ద్విధా కామో7పి రచితస్త్రివర్గాయావిరోధకృత్‌ || 14

పరస్పరానుబంధాంశ్చ సర్వానేతాన్విచింతయేత్‌ | విపరీతానుబంధాంశ్చ బుధ్యధ్వం తాన్ద్విజోత్తమాః || 15

ధర్మో ధర్మానుబంధార్థో ధర్మోనా77త్మార్థపీడకః | ఉభాభ్యాం చ ద్విధాకామం తేన తౌ చ ద్విధా పునః || 16

గృహస్థు నిరంతరమును అచార రక్షణము సేసికొనవలెను. ఆచారహీనుని కిహపరములందు క్షేమము లేదు. సదాచారము నుల్లంఘించి వర్తించు వానికి యజ్ఞదాన తపస్సులు సుఖమీయవు. దురాచారుడు ఇక్కడ పూర్ణాయుర్దాయము పొందడు. సదాచార సంపన్నమైన ధర్మమును జేయవలెను. అట్టి ఆచారముయొక్క లక్షణము స్వరూపమును దెల్పెద వినుండు. తానేకాగ్రమనస్కుడై దానిని పరిపాలింపవలెను. (నిర్వహింపవలె నన్నమాట) గృహస్థు త్రివర్గమును (ధర్మ అర్ధ కామములను పురుషార్థములను) సాధించు ప్రయత్నము సేయవలెను. అది సిద్ధించిన యెడల ఇహవర సిద్ధియు గల్గును. ఈ త్రివర్గమందు నాల్గవభాగమేని జరిపిన పరలోకశ్రేయస్సు చేకూర్చును. సగము నిర్వర్తించినచోదన్నుదాను భరించుకొన గలవాడగును. నిత్యనైమిత్తికములజేయగల్గును. నాల్గవవంతుసదాచారస మాచరణమున ధర్మమూలమునువృద్ధిగావింపగలడు. ఈధర్మాచరణముచే అర్ధముసిద్ధించును. అట్లేపాపమునునిషేధించుటకు దెలిసినవాడు ధర్మమాచరింపనగును. పరమందర్ధముదానితరువాతిదికామముఫలప్రదములగుటకు వాని నిహమందనుష్ఠింప వలయును. ప్రత్యవాయ భయముతో (పొరపాటుగ జేసిన పాపము వచ్చునను భయముతో) కామముగాని మఱి యే పురుషార్థమునకు విరుద్ధము గాకుండను (రెండు విధములుగాను) గావించిన కామపురుషార్థము గూడ త్రివర్గసాధనమందు విరోధకరముగాదు. ఈ పురుషార్థము నొకదానినొకటి యనుబంధింపబడునవిగా నున్నవా? విపరీతానుబంధములుగా నున్నవా? అను విషయము తెలిసికొనవలయును. ధర్మము ధర్మానుబంధియైన అర్ధమును బాధింపని ధర్మము అట్లే ధర్మార్దానుబంధియైన కామము ఆ రెండిటిని బాధింపని కామము దానిచే (కొమముచే) బాధింపబడని ధర్మార్థములును ఆత్మబాధకములు గావు. అనగాదనకు కృతార్ధతను గల్గించి తీరునన్నమాట. పురుషార్థములొకదానికొకటి యనుబంధపడి పరస్పర విరుద్ధములు గాకుండ జాగరూకుడై చేసినయెడల మానవుడు అన్నింటి ఫలమును బూర్తిగ పొందునని భావము.

బ్రాహ్మే ముహూర్తే బుధ్యేత ధర్మార్ధావనుచింయేత్‌ | సముత్థాయ తథా77చమ్య ప్రస్నాతో నియతఃశుచిః || 17

పూర్వాం సంధ్యాం సనక్షత్రాం పశ్చిమాం సదివాకరామ్‌ | ఉపాసీత యథాన్యాయం నైనాం జహ్యాదనాపది || 18

అసత్ప్రలాపమనృతం వాక్పారుష్యం చ వర్జయేత్‌ | అసచ్ఛాస్త్రమసద్వాద మసత్పావాం చ వై ద్విజాః || 19

సాయం ప్రాతస్తథా హోమం కుర్వీత నియతాత్మవాన్‌ | నోదయాస్తమనే చైవ ముదీక్షేత వివస్వతః || 20

కేశప్రసాధనాదర్శ దంతధావనమంజనమ్‌ | పూర్వాహ్ణ ఏవకార్యాణి దేవతానాం చ తర్పణమ్‌ || 21

గ్రామావసథతీర్థానాం క్షేత్రాణాం చైవ వర్త్మని | న విణ్మూత్రమనుష్ఠేయం న చ కృష్టే న గోవ్రజే || 22

సగ్నాం పరస్త్రియం నేక్షేన్నపశ్యేదాత్మనః శకృత్‌ | ఉదక్యా దర్శనస్పర్శ మేవం సంభాషణం తథా || 23

నాఫ్సు మూత్రం పురీషంవా మైథునం వా సమాచరేత్‌ | నాధితిష్ఠేచ్ఛకృన్మూత్రే కేశభస్మసపాలికాః || 24

తుషాంగార విశీర్ణాని రజ్జువస్త్రాదికాని చ | నాధితిష్ఠేత్తథా ప్రాజ్ఞః పథివస్త్రాణి వా భువి || 25

బ్రాహ్మ ముహూర్తమున (తెల్లవారుజాము) మేలుకొని తా నానాడు సేయవలసిన ధర్మము అర్థము నను పురుషార్థసాధనను గురించి యాలోచన సేయవలెను. అటుపై లేచి యాచమము నేసి స్నానము చేసి నియమవంతుడై శుచియై సంధ్యావందనమును నక్షత్రములుండగా నొనరింపవలెను. సాయం సంధ్యను సూర్యుడుండగా గావింపవలెను. ఈ సంధ్యోపాసనను ఆపదయేమియు లేనప్పుడు తప్పక సేసితీరవలసినది. చెడ్డ ప్రేలాపనను అనృతమును పరుష భాషణమును వదలవలెను. అట్లే ఆసచ్ఛాస్త్రమును (నాస్తికాది మతములను) అసద్వాదమును (దుష్టనాదము) అసత్సెవను (అధర్మవరుల సేవించుటను) మానవలెను. నియమవంతుడై సాయం ప్రాతః కాలమందు హోమము సేయవలెను. సూర్యుని యుదయాస్తమయములను జూడరాదు. తల దువ్వుకొనుట అద్దము చూచుట దంతధావనము కాటుక వెట్టుకొనుటయు పూర్వాహ్ణమందే చేయవలెను. దేవతర్పణము కూడ నప్పుడే కావింపనగును. గ్రామములు ఇండ్లు తీర్థములు క్షేత్రములు ననువానికేగు దారులందు దున్నిన పొలములో గోశాలలందు విణ్మూత్రములు సేయరాదు.

దిగంబరమైయున్న పరస్త్రీని తన పురీషమును జూడరాదు. బహిష్ఠమైన స్త్రీని చూచుట తాకుట పలకరించుట గూడదు! నీళ్ళలో మూత్రపురీషములు సేయుట మైధునము పనికిరాదు. మూత్ర పురీషములు వెంట్రుకలు బూడిద పొల్లు బొగ్గులు తెగిపోయిన త్రాళ్ళు గుడ్డపీలికలు దారిలో పడియున్న చింపిగుడ్డలు మొదలగువానిని ద్రొక్కరాదు.

పితృదేవమనుష్యాణాం భూతానాం చ తథా7ర్చనమ్‌ | కృత్వా విభవతః పశ్చాద్గృహస్ధో భోక్తుమర్హతి || 26

ప్రాఙ్ముఖో దఙ్ముఖో వా7పి స్వాచాంతో వాగ్యతః శుచిః | భుంజీత చాన్నం తచ్చిత్తో హ్యంతర్జానుః సదా నరః ||

ఉపఘాతమృతే దోషా న్నాన్నస్యోదీరయేద్బుధః | ప్రత్యక్షలవణం వర్జ్యమన్న ముచ్ఛిష్టమేవ చ || 28

న గచ్ఛన్న చ తిష్ఠన్వై విణ్మూత్రోత్సర్గమాత్మవాన్‌ | కుర్వీత చైవ ముచ్ఛిష్టం న కించిదపి భక్షయేత్‌ || 29

ఉచ్ఛిష్టో నాలపేత్కించి త్స్వాధ్యాయం న వివర్జయేత్‌ | న పశ్యేచ్చ రవించేందుం నక్షత్రాణి చ కామతః || 30

భిన్నాసనం చ శయ్యాం చ భాజనం చ వివర్జయేత్‌ | గురూణామాసనం దేయ మభ్యుత్ధానాదిసత్కృతమ్‌ || 31

అనుకూలం తథా77లాప మభికుర్వీత బుద్ధిమాన్‌ | తత్రానుగమనం కుర్యాత్ప్రతికూలం న పంచరేత్‌ || 32

నై కవస్త్రశ్చభుంజీత న కుర్యాద్దేవతార్చనమ్‌ | నా77వాహయేద్ద్విజానగ్నౌ హోమం కుర్వీత బుద్ధిమాన్‌ || 33

న స్నాయీత నరో నగ్నో న శయీత కదాచన | నపాణిభ్యా ముభాభ్యాం తు కండూయేత శిరస్తథా || 34

న చాభీక్షణం శిరఃస్నానం కార్యం నిష్కారణం బుధైః | శిరః స్నాతశ్చ తైలేన నాంగం కించిదుపసృశేత్‌|| 35

అనధ్యాయేషు సర్వేషు స్వాధ్యాయం చ వివర్జయేత్‌ || బ్రాహ్మణానల గోసూర్యా న్నావమన్యేత్క దాచన || 36

పితృదేవ మనుష్యులను భూతములను అర్చించి అటుపై గృహయజమాని భోజనము సేయవలెను. తూర్పు ఉత్తరము దిశలవైపున కున్ముఖుడై ఆచమనముసేసిమౌనమూని శుచియై మనసుం దాను దిను నాహారమువైపు నిలిపి మోకాళ్ళలోపల చేయి యుంచి భోనము సేయవలెను. తెలిసినవాడు చెడిన యన్నమొక్కటి తప్ప మఱి యే యన్న దోషములను తెలుపరాదు. కేవలలవణము తినరాదు. ఉచ్ఛిష్టాన్నమును (ఎంగిలిని) విడిచిపెట్ట వలెను. నడుచుచు లేక నిలువబడి మూత్రపురీషములు విడువరాదు. ఎంగిలి నే కొంచము తినరాదు. ఎంగిలి నోటితో మాటలాడరాదు. వేదము చెప్పగూడదు. సూర్యచంద్ర నక్షత్రములను బుద్ధిపూర్వకముగ జూడరాదు. విరిగిన ఆసనము మంచము పగిలిన పాత్రమును వాడుకొనరాదు. పెద్దలు వచ్చినపుడు తాను లేచి నిలువబడుట యెదురేగుట మొదలగు సత్కారములు చేసి యాసనము(పీట కుర్చీ చాప మొదలయినవి) వేయవలెను. అనుకూలముగ సంభాషణము సేయవలెను. వారు వెడలి చనునపుడు కొంతదూరము వెంబడింపవలెను. ప్రతికూలముగ సంచరింపరాదు: ఒంటి గుడ్డతో భోజనము దేవతార్చనము బ్రాహ్మణాహ్వానము అగ్నియందు హోమము సేయరాదు. నగ్నుడై (దిన్పమొలతో దిగంబరియై) స్నానము సేయరాదు. పండుకొనరాదు. రెండుచేతులతోను నెత్తిని గోకుకొనరాదు. నిష్కారణముగ మాటిమాటికి తలనిండ స్నానము సేయరాదు. శిరఃస్నానము చేసి తైలముతో అంగస్పర్శ చేయరాదు. అనధ్యయన దినములం దన్నిట వేదాధ్యయనము మానవలెను. బ్రాహ్మణులను అగ్నిని గోవులను సూర్యుని ఎన్నడు నవమానింపరాదు.

ఉదఙ్ముభో దివా రాత్రా వుత్సర్గం దక్షిణాముఖం | ఆబాధాసు యథాకామం కుర్యాన్మూత్రపురీషయోః || 37

దుష్కృతం స గురోర్బ్రూయా త్కృద్ధం చైనం ప్రసాదయేత్‌ | పరీవాదం న శృణుయా దన్యేషామపి కుర్వతామ్‌ ||

పంథా దేయో బ్రాహ్మణానాం రాజ్ఞో దుఃఖాతురస్యచ | విద్యాధికస్య గర్భిణ్యా రోగార్తస్య మహీయసః || 39

మూకాంధబధిరాణాంచ మత్తస్యోన్మత్తకస్య చ | దేవాలయం చైత్యతరుం తథైవ చచతుష్పథమ్‌ || 40

విద్యాధికం గురుం చైవ బుధః కుర్యా త్ప్రదక్షిణమ్‌ | ఉపానద్వస్త్రమాల్యాది ధృతమన్యైర్న ధారయేత్‌ || 41

చతుర్దశ్యాం తథా7ష్టమ్యాం పంచదశ్యాం చ పర్వసు | తైలాభ్యంగం తథా భోగం యోషితశ్చ విర్జయేత్‌ || 42

నోతిక్షప్తబాహుజంఘశ్చ ప్రాజ్ఞస్తిష్ఠేత్కదాచన | నచాపి విక్షిపేత్పాదౌ పాదం పాదేన నా77క్రమేత్‌ || 43

పుంశ్చల్యాః కృతకార్యస్య బాలస్య పతితస్యచ | మర్మాభిఘాతమాక్రోశం పైశున్యం చ వర్జయేత్‌ || 44

దంభాభిమానం తైక్షణ్యంచ న కుర్వీత విచక్షణః | మూర్ఖోన్మత్తవ్యసనినో విరూనానపి వా తథా || 45

న్యూనాంగాంశ్చాధానాంశ్చైవ నోపహాసేన దూషయేత్‌ | పరస్య దండం నోద్యచ్ఛే చ్ఛిక్షార్ధం శిష్యపుత్రయోః || 46

తద్వన్నో పవిశేత్ర్పాజ్ఞః పాదేనా77కృష్య చాసనమ్‌ | సంయావం కృశరం మాంసం నా77త్మార్థముపసాధయేత్‌ ||

సాయం ప్రాతశ్చ భోక్తవ్యం కృత్వా చాతిథి పూజనమ్‌ | ప్రాఙ్ముఖో దజ్ముశోవా7పి వాగ్యతో దంతధావనమ్‌ || 48

కుర్వీత సతతం విప్రా వర్జయేద్వర్జ్యవీరుధమ్‌ | నోదక్ఛిరాః స్వపేజ్జాతు న చ ప్రత్యక్ఛిరా నరః || 49

శిరస్త్వా గస్త్వా మాధాయ శయీతాథ పురందరీమ్‌ | నతు గంధవతీష్వప్సు శయీత న తధోషసి || 50

ఉపరాగేపరం స్నాన మృతే దినముదాహృతమ్‌ | ఆపమృజ్యాన్న వస్త్రాంతై ర్గాత్రాణ్యంబరపాణిభిః || 51

నాచావధూనయేత్కేశా న్వాససీ న చ నిర్ధునేత్‌ | అనులేపనమాదద్యా న్నాస్నాతః కర్హిచిద్బుధః || 52

నచాపి రక్తవాసాః స్యా చ్చిత్రాసితధరో7పివా | సచకుర్యా ద్విపర్యాసం వాససోర్నాపి భూషయోః || 53

వర్జ్యం చ విదశం వస్త్ర మత్యంతోపహతం చ యత్‌ | కీటకేశావపన్నం చ తథా శ్వభిరవేక్షితమ్‌ || 54

అవలీఢం శునాచైవ సారోద్ధరణ దూషితమ్‌ | పృష్ఠమాంసం వృథామాంసం వర్జ్యమాంసం చ వర్జయేత్‌ || 55

నభక్షయేచ్చ సతతం ప్రత్యక్షం లవణం నరః | వర్జ్యం చిరోషితం విప్రాః శుష్కం పర్యుషితం చ యత్‌ || 56

పిష్టశాకేక్షు పయసాం వికారా ద్విసత్తమాః | తథా మాంసవికారాశ్చ నైవ వర్జ్యాశ్చిరోషితాః || 57

ఉదయా స్తమనే భానోః శయనంచ వివర్జయేత్‌ | నాస్నాతో నైవ సంవిష్టో నచైవాన్యమనా నరః || 58

నచైవ శయనే నోర్వ్యా ముపవిష్టో న శబ్దకృత్‌ | ప్రేష్యాణామప్రదాయాథ న భుంజీత కదాచన || 59

భుంజీత పురుషః స్నాతః సాయం ప్రాతర్యధావిధి | పరదారా న గంతవ్యాః పురుషేణ విపశ్చితా || 60

ఇష్టాపూర్తాయుషాం హంత్రీ పరదారగతిర్నృణామ్‌ | స హీదృశ మనాయుష్యం లోకే కించన విద్యతే || 61

పగలు ఉత్తరాభిముఖముగను రాత్రి దక్షిణాభిముఖముగను సంకటసమయములందు యదేష్టముగను మూత్రపురీషోత్సర్జన మొనరింప నగును. గురువు తప్పునుజెప్పరాదు. ఆయన కోపించినయెడబ్రతిమాలి క్షమాపణసెప్పి కొని ప్రసన్నునిం జేసికొనవలెను. ఇతరులుచేయునపవాదమును వినరాదు. బ్రాహ్మణులకు రాజునకు దుఃఖాతురునికివిద్యాధికునికి గర్భిణికి రోగికి పూజ్యునకు మూగ గ్రుడ్డి చెవుటివాండ్రకు మత్తెక్కినవానికి ఉన్మత్తునికి దారియిచ్చి తొలగి నడువవలెను. దేవాలయమును చైత్యవృక్షమును (ఆలయాది పుణ్యస్థానములందు నాటించిన పుణ్యవృక్షము రావి మొదలయిన వానిని) నాల్గుదారులు గలిగిన కూడలిని ప్రదక్షిణముసేసి వెళ్లవలయును. అప్రదక్షిణముగా బోరాదన్న మాట. ఇంకొకడు వాడిన చెప్పులు బట్టలు పూలమాలలు మొదలయినవానిని దానుధరింపరాదు. చతుర్దిశి అష్టమి పూర్ణిమ పర్వములునయిననా డభ్యంగము స్త్రీసంభోగము గూడదు. బాహువులు పిక్కలు పైకెత్తి నిలుచుండరాదు. పాదము లిట్టట్టు నాడింవరాదు. ఒకకాలితో నింకొకకాలు త్రొక్కరాదు. జారిణిని తప్పు జరిగిపోయిన తరువాత బాలుని జాతిభ్రష్టుని మర్మాఘాతముగ దిట్టుటను దెప్పి పోవుటను (సాధించుటను) మానవలెను. వివేకి దాంభికత్వము (డంబములు పలుకుట) నేనేఘనుడనను దురభిమానము తీక్షణత్వమును జూపరాదు. మూర్ఖులను పిచ్చివాండ్రను వ్యసనములలో నుండు వారిని (కష్టములలోనున్నవారిని) విరూపులను అంగవైకల్యముగలవారిని నిర్ధనులను బరిహసించి కించపఱుపరాదు శిష్యులను పుత్రులను శిక్షించుట కింకొకచేతికి దండమును (కఱ్ఱను)ఈయరాదు. కాలితో నాసనము దగ్గరగా నీడ్చికొని దానిపై కూర్చుండరాదు. తనకుదాను దినుటకు సంయావము గోధుమపిండితోచేయు కృశరము (పులగము) మాంసమును సేకరింపరాదు. సాయం ప్రాతఃకాలములం దతిథులను బూజించి భుజింపవలెను. తూర్పు ఉత్తరము మొగమై మౌనియై పండ్లుతోముకొన వలెను. నిషిద్ధములయిన దంతకాష్ఠములను వాడరాదు. ఉత్తరదిశగా పడమరగా తలపెట్టి పండుకొనరాదు. దక్షిణదిశగాగాని తలపెట్టి పండుకొనవలెను. పరివళోదకములతో నిద్రపోరాదు. ఉషఃకాలమందు నిదురింపరాదు. గ్రహణమునందు విడుపుస్నానము రాత్రియేచేయవలెను. విడుపుకాగానే రాత్రియే చేయవలెనుగాని మరునాడు పగలుచేయరాదని యర్థము. ఉప్పును దినరాదు. నిలువయున్నది తడియారినది పాసినదియునగు నన్నము తినరాదు. పిండికూరలు చెఱకుపాలుఅను వానియొక్కయు మాంసముయొక్కయు వికారములు అనగావానివానితోదయారైన పదార్థములను చిరకాలము నిలువయున్నవైనను దినవచ్చును. సూర్యోదయాస్తమయ కాలములందు పండుకొనరాదు. స్నానముచేయక కూర్చుండక మనస్సునిలుపక మంచముమీద వట్టినేలమీద కూర్చుండి చప్పుడుచేయుచు లేకమాట లాడుచు బోజనముసేయరాదు. సేవకులకు పెట్టకుండ తినరాదు. సాయం ప్రాతః కాలములందు స్నానముసేసి భోజనము సేయనగును. పరదారసంగము కూడదు. ఆదోషము ఇష్టాపూర్తముల వలనగల్గు ఫలమును ఆయుర్దాయమును నాశముసేయును. ఇష్టమనగా యజ్ఞము, వాపీకూప తటాకాది నిర్మాణము సత్రము పెట్టుట గోడకట్టించుట తోటలు వేయించుట మొదలయిన ధర్మకార్యములు పూర్తములుపరదారగమనమంత ఆయుర్దాయమునుహరించుతప్పిదముమఱియొకటిలేదు.

యాదృశం పురుషస్యేహ పరదారిభిమర్శనమ్‌ | దేవాగ్ని పితృ కార్యాణి తథా గుర్వభివాదనమ్‌ || 62

కుర్వీత సమ్యగాచమ్య తద్వదన్న భుజిక్రియామ్‌ | అఫేన శబ్దగంధాభి రద్భి రచ్చాభిరాదరాత్‌ || 63

ఆచమేచ్ఛైవ తద్వచ్చ ప్రాఙ్ముఖో దఙ్ముఖో7పి వా | అంతర్జలా దావ సథా ద్వల్మీకాన్మూషికా స్థలాత్‌ || 64

కృతశౌచా వశిష్టాచ్చ వర్జయెత్పంచ వై మృదః | ప్రక్షాశ్య హస్తౌ పాదౌ చ సమభూమ్యాంసమాహితః || 65

అంతర్జానుస్తథా77చామే త్త్రిశ్చతుర్వా7పి వై నరః | పరిమృజ్య ద్విరావర్త్య ఖాని మూర్ధానమేవ చ || 66

సమ్యగాచమ్య తోయేన క్రియాం కుర్వీత వైశుచిః | క్షుతేవలీఢే వాతే చ తథా నిష్ఠీవనాదిషు || 67

కుర్యాదాచమనం స్పర్శే వా7స్పృశ్యస్యార్కదర్శనమ్‌ | కుర్వీతా77లంభనం చాపి దక్షిణ శ్రవణస్య చ || 68

యథావిభవతో హ్యే తత్పూర్వాభావే తతః పరమ్‌ | న విద్యమానే పూర్వోక్త ఉత్తరప్రా ప్తిరిష్యతే || 69

న కుర్యా ద్దంతసంఘర్షం నా77త్మనో దేహతాడవమ్‌ | స్వాపే7ధ్వని తథా భుంజ న్ప్వాధ్యాయంచ విపర్జయేత్‌ ||

సంధ్యాయాం మైథునం చాపి తథా ప్రస్థానమేవ చ | తథా7పరాహ్ణే కుర్వీత శ్రద్ధయా పితృతర్పణమ్‌ || 71

శిరఃస్నానం చ కుర్వీత దైవం పిత్ర్యమథా7పి చ | ప్రాఙ్ముభోదఙ్ముఖో7పి శ్శశ్రుకర్మచ కారయేత్‌ || 72

వ్యగినీం వర్జయేత్కన్యాం కులజాం వా7ప్యరోగిణీమ్‌ | ఉద్వహేత్పితృమాత్రోశ్చ సప్తమీం పంచమీం తథా || 73

శిక్షేద్దాంరాం స్త్యజే దీర్ష్యాం తథా7హ్ని స్వప్నమైథునే | పరోపతాపకం కర్మ జంతుపీడాం చ సర్వదా || 74

ఆచమనముచేసియే దేవాగ్నిపితృకార్యములు గురువందనము భోజనమును జేయవలెను. ఆచనమునకుపయోగించు జలము నురుగు వాసనలేనివిగానుండవలెను. చప్పుడుకాగూడదు. తూర్పుగ ఉత్తరముగదిరిగి యాచమనముసేయవలెను. నీళ్ళనుండి తీసినది ఇంటిపెరటిలోనున్నది పుట్టలోనిది ఎలుకకలుగులోని శౌచక్రియయందుపయోగింపగా మిగిలినదియునుగా నీయైదువిధములమన్ను శౌచవిధికుపయోగింపరాదు. కాలుసేతులు గడిగికొనివానిని ప్రోక్షణముసేసికొని స్థిరమనస్కుడై మూడుసార్లుగాని నాల్గుసార్గుగాని యాచమనముసేసి రెండుసార్లు పెదవులను దుడిచికొని యింద్రియములను రెండుసార్లు స్పృశించి శుచియై సంధ్యావందనాది క్రియలను జేయవలెను. తుమ్మునందునాకుటయందు అపానవాయువు నందు ఉమ్మివేయుట మొదలగుపనులందు ఆచమనముసేయవలెను. అంటరానివానినంటినపుడు సూర్యదర్శనము సేయవలెను. మఱియు కుడిచెవి స్పృశింపవలెను. ఈ చెవినిస్పృశించుట యింతకుమున్నుచెప్పిన ఆచమన సూర్యదర్శనముల కవకాశములేప్పుడే. మున్నుచెప్పినది యున్నప్పుడు తరువాతజెప్పిన పనులు సమ్మతములుగావు. పండ్లుకొఱుకరాదు. తనదేహమును గ్రుద్దుకొనరాదు. పండుకొన్నపుడు దారినడచునపుడు భుజించునపుడు స్వాధ్యాయము పనికిరాదు. సంధ్యలందు మైథునము ప్రయాణమునుజేయగూడదు. అపరాహ్ణమున (కుతపకాలమందు) పగటికాలమును మూడుభాగములుసేయగా మూడవభాగమున పితృతర్పణము సేయవలెను. దేవపితృకార్యములముందు శిరఃస్నానముసేయనగును. తూర్పు ఉత్తర దిశమొగమై క్షురకర్మచేయించుకొనవలెను. వికలాంగిని వివాహమాడరాదు. ఉత్తమకులమున బుట్టినది రోగములులేనిదియగు కన్యను బెండ్లాడవలెను. తండ్రివైపున నేడవతరము దానిని తల్లివైపున నైదవతరము దానిని మాత్రమే స్వీకరింపనగును. భార్యను సత్ప్రవృత్తివయందు బెట్టవచ్చును. శిక్షణయీ యవచ్చునుగాని యీర్ష్య పనికిరాదు. పగటియందు నిద్రామైథునములుగూడవు. ఇతరులకు తాపముగల్గించుపని జంతుపీడయు సేయరాదు.

ఉదక్యా సర్వవర్ణాణాం వర్జ్యా రాత్రి చతుష్టయమ్‌ | స్త్రీజన్మ పరిహారార్థం పంచమీం చాపి వర్జయేత్‌ || 75

తతః షష్ఠ్యాం వ్రజేద్రాత్ర్యాం జ్యేష్ఠయుగ్మాసు రాత్రిషు|యుగ్మాసు పుత్రా జాయంతే స్త్రియో7యుగ్మాసు రాత్రిఘ||

విధిర్మిణో వై పర్వాదౌ సంధ్యాకాలేషు షండకాః | క్షురకర్మణి రిక్తాం వై వర్జయీత వచక్షణః || 77

బ్రువతామవితావినాం నశ్రోతవ్యం కదాచన | న చోత్కృష్టాసనం దేయ మనుత్కృష్టస్య చా77దరాత్‌ 78

క్షురకర్మణి చాంతే చ స్త్రీసంభోగే చ భోద్విజాః | స్నాయీత చై లవాన్ప్రాజ్ఞః కూటభూమిముపేత్యచ || 79

దేవవేదద్విజాతీనాం సాధుసత్యమహాత్మనామ్‌ | గురోః పతివ్రతానాం చ బ్రహ్మ¸్ఞుతపస్వినామ్‌ || 80

ముట్టయిన స్త్రీని అన్ని వర్ణములవారు నాల్గురాత్రులు వెలుపల నుంచవలెను. అయిదవరోజు కూడ దూరముగ నుంచినచో నామెకు మఱి స్త్రీ జన్మము రాదు. ఆఱవరాత్రి యామెను బొందవచ్చును. మఱియు జ్యేష్ఠయుగ్మాసు అనగా ఋతు దినములయిన మొదటి పదియారు దినములలో సరిరాత్రులందు బొందనగును. సరిరాత్రులందు గూడిన పుత్రులు బేసిరాత్రులందు గూడిన ఆడుపిల్లలు గల్గుదురు. పర్వదినములందు బొందిన నధర్మవరులు సంధ్యాకాలమందు గూడిన నపుంసకులు పుట్టుదురు. రిక్తాతిథి క్షురకర్మ నిషిద్ధము. వినయము లేనివాండ్రేదేని చెప్పుచుండ నది వినరాదు. నీచున కున్నతస్థాన మీయరాదు. క్షురకర్మ సేసికొన్నపుడు స్త్రీ నంభోగానంతరము సంతకు వెళ్ళినపుడు సచేల స్నానము చేయవలెను. దేవతలను వేదములను ద్విజులను సాధువులు సత్యవంతులు మహాత్ములు నైనవారిని గురువును పతివ్రతలను బ్రహ్మయజ్ఞములు తపస్సు సేయువారిని దూషించుట (అప్రతిష్ఠపాలు చేయుట) పరిహసించటము కూడదు.

పరివాదం న కుర్వీత పరిహాసం చ భోద్విజాః | ధవళాంబరసంవీతః సితపుష్పవిభూషితః || 81

సదా మాంగల్యవేషః స్యాన్న వా7మాంగల్యవాన్భవేత్‌ | నోద్ధతోన్మత్త మూఢైశ్చ నావినీతైశ్చ పండితః || 82

గచ్ఛేన్మైత్రీమశీలైశ్చ న వయోజాతి దూషితైః | నచాతివ్యయశీలైశ్చ పురుషైర్నైవ వైరిభిః || 83

కార్యాక్షమై ర్నిందితైర్న న చైవ విటసంగిభిః | నిఃసై#్వర్న వాదైకపరై ర్నరైశ్చాన్యైస్తథా7ధమైః|| 84

అచ్చపు తెలుపు వస్త్రములను దెల్లని పువ్వులను దాల్చి ఎపుడును మాంగల్యవేషియై శుభ##వేషము గొన్నవాడై యుండవలెను. అట్టివాని కమంగళములు గల్గవు. తలబిరుసు గలవారితో ఉన్మత్తులతో మూఢులతో వినయహీనులతో నీచశీలురలో వయస్సుచే జాతిచే దూషితులైనవారితో డబ్బు దుబారా చేయువాండ్రతో శత్రువులతో కార్యదక్షులుగాని వారితో నింద్యులతో జారులతో జేరినవాండ్రతో నిరుపేదలతో వాదపరులతో మఱిపెక్కుతెఱగులయధములతో చెలిమిసేయరాదు.

సుహృద్దీక్షిత భూపాల స్నాతకశ్వశురైః సహ | ఉత్తిష్ఠే ద్విభవాచ్చైనా నర్చయే ద్గృహమాగతాన్‌ || 85

యథావిభవతో విప్రాః ప్రతిసంవత్సరోషితాన్‌ సమ్యగ్గృహే7ర్చనం కృత్వా యథా స్థానమనుక్రమాత్‌ || 86

సంపూజయే త్తథా వహ్నౌ ప్రదద్యాచ్చా77హుతీః క్రమాత్‌|

ప్రథమాం బ్రాహ్మణ దద్వా త్ప్రజానాం పతయే తతః || 87

తృతీయాం చైవ గృహేభ్యః కశ్యపాయ తథా7పరామ్‌ | తతో7నుమతయే దద్యాద్గృహ బలింతతః || 88

పూర్వం ఖ్యాతా మయాయా తు నిత్యక్రమవిధౌ క్రియా | వైశ్వదేవం తతః కుర్యా ద్వదతః శృణుతద్విజాః ||

మిత్రుడు దీక్షితుడు (యజ్ఞము సేసినవాడు) భూపాలుడు స్నాతకుడు (గురుకులమందు విద్య పూర్తిసేసినవాడు) మామగారు అనువారితో గూడ తానును వేచి వారు వచ్చినపుడు ప్రత్యుత్దానము చేసి యాసన పాద్యాదులీయవలెను. వీరు తన యింటికి వచ్చినపుడు తనకున్నంతలో (యథావిభవముగ) లోటుసేయకుండ పూజింపవలెను.

ప్రతి సంవత్సరోషితాన్‌ = సంవత్సరమున కొకసారి వచ్చియున్నవారిని అనగా ఆబ్దికమునందు యథాస్థానముగ అనగా వైశ్వేదేవస్థానము పితృస్థానము అనువానియం దర్చన సేయవలెను. అవ్వల అగ్నికి ప్రజాపతికి గృహదేవతలకు వరుసగా మూడాహుతులీయవలెను. మఱొకటి కశ్యపున కీయవలెను. అటుపైని అనుమతికొక యాహుతి నీయవలెను. పిమ్మట గృహబలి నీయవలెను. నిత్యకర్మ విధానమందు నేనింతమున్ను జెప్పిన వైశ్వదేవ క్రియను సేయవలెను. ఆ విధానము తెలుపుచున్నాను వినుడు.

యథాస్థానవిభాగం తు దేవానుద్దిశ్య వై పృథక్‌ | పర్జన్యాపోధరిత్రీణాం దద్యాత్తు మణికే త్రయమ్‌ || 90

వాయవే చ ప్రతిదిశం దిగ్భ్యః ప్రాచ్యాదిషు క్రమాత్‌ | బ్రహ్మణ చాంతరిక్షాయ సూర్యాయ చ యథాక్రమమ్‌|| 91

విశ్వేభ్యశ్చైవ దేవోభ్యో విశ్వభూతేభ్య ఏవచ | ఉషసే భూతపతయే దద్యాద్వోత్తరతః శుచిః || 92

స్వధా చ సమ ఇత్యుక్త్వా పితృభ్యశ్చైవ దక్షిణ | కృత్వా7పసవ్యం వాయవ్యాం యక్ష్మైత త్తేతి సంవదన్‌ || 93

అన్నావశేష మిశ్రం వై తోయం దద్యాద్యథావిధి | దేవానాంచ తతః కుర్యా ద్ర్బాహ్మణానాం నమస్క్రియామ్‌ ||

అంగుష్ఠోత్తరతో రేఖా పాణర్యా దక్షిణస్య చ | ఏతద్ర్బాహ్మమితి ఖ్యాతం తీర్థమాచమనాయ వై || 95

తర్జన్యంగుష్ఠయోరంతః పిత్ర్యం తీర్థముదాహృతమ్‌ | పితౄణాం తేన తోయాని దద్యాన్నాందీ ముఖాదృతే || 96

అంగుళ్యగ్రేతథా దైవం తేన దివ్యక్రియావిధిః | తీర్ధం కనిష్ఠికామూలే కార్యం తత్ర ప్రజాపతేః || 97

ఏవమేభిః సదా తీర్ధైర్విధానం పితృభిః సహ | సదా కార్యాణి కుర్వీత నాన్యతీర్ధై కదాచన || 98

బ్రాహ్మేణా77చమనం శస్తం పైత్ర్యం పిత్ర్యేణ సర్వదా |

దేవతీర్థేన దేవానాం ప్రాజాపత్యం జితే (త్యజలే)న చ || 99

నాందీముఖానాం కుర్వీత ప్రాజ్ఞః పిండోదక క్రియామ్‌ | ప్రాజాపత్యేన తీర్థేన యచ్చ కించిత్ప్రజాపతేః || 100

పర్జన్యదేవతకు (వరుణునికి) అబ్దేవతకు భూదేవతకు మూడు స్థానములందు విడివిడిగా బలి వేయవలెను. ఆ వేయుట మణిక మందు. (మణికమనగా మట్టిపాత్ర) వాయువునకు అన్ని దిశలందు దిగ్ధేవతలకు వరుసగా తూర్పు నుండి బ్రహ్మ అంతిరిక్షము సూర్యుడు విశ్వేదేవులు విశ్వభూతములు ఉషస్సు భూతపతి అనువారికి ఉత్తరము వైపు బలివేయవలెను. ''స్వధాయైనమః|| అని పలుకుచు పితరులకు దక్షిణమునను ప్రాచీనావీతిగ వేయవలెను. యక్ష్మైతత్తే అను మంత్రము పఠించుచు వాయవ్యమూలలో అన్నావశేషలతో గూడిన యుదకము యథావిధిగ వదలవలెను. అటుపై దేవతలకు బ్రాహ్మణులకు నమస్కారము సేయవలెను. కుడిచేతి అంగుష్ఠమునకు (బొటనవ్రేలికి) కుత్తరమువైపుననున్న రేఖ బ్రాహ్మతీర్థమనబడును. అచమనము సేయవలసిన తీర్థమిది. తర్జనికి (చూపుడువేలు) అగుష్ఠమునకు నడిమిది పితృతీర్థము. నాందీముఖములోగాక మఱి యెల్లవిధులందును పితరులకు తర్పణాదు లీతీర్థమున జేయవలెను. వేళ్ళఅగ్రము దైవతీర్థము. దేవతలనుద్దేశింతి చేయు తర్పణాదివిధులాతీర్థమున జేయవలెను. చిటికెనవ్రేలి మొదలు ప్రజాపతితీర్థము. అక్కడ ప్రజాపతికి జేయవలయును. ప్రజాపతి కాండర్షిగావున ఋషితీర్థమున జేయవలె నన్నమాట. బ్రాహ్మ తీర్థమునం దాచమనము ప్రశస్తము. పితృక్రియ పితృతీర్థమున, దేవతలకు దేవతీర్థమున, ప్రజాపతికి నాందీముఖ దేవతలకు పిండతర్పణాదులు ప్రజాపతికివలె ప్రాజాపత్యతీర్థమున (చిటికెనవ్రెలి మొదట) చేయవలెను.

యుగపజ్జల మగ్నిం చ బిభృయాన్న విచక్షణః | గురుదేవ పితౄన్విప్రాన్న చ పాదౌ ప్రసారయేత్‌ || 101

నా77చక్షీత ధయంతీం గాం జలం నాంజలినా పిబేత్‌ | శౌచకాలేషు సర్వేషు గురుష్వల్వేషు వా పునః ||

న విలంబేత మేధావీ న ముఖేనానలం ధమేత్‌ || 102

తత్రవిప్రా న వస్తవ్యం యత్రనాస్తి చతుష్టయమ్‌ | ఋణప్రదాతా వైద్యశ్చ శ్రోత్రియః సజలా నదీ || 103

జితభృత్యో నృపో యత్ర బలవాన్ధర్మతత్పరః | తత్ర నిత్యం వసే త్ర్పాజ్ఞః కుతః కునృపతౌ సుఖమ్‌ || 104

పౌరాః సుసంహతా యత్ర సతతం న్యాయవర్తినః | శాంతామత్సరిణో లోకా స్తత్ర వాసః సుభోదయః|| 105

యస్మిన్కృషీవలా రాష్ట్రే ప్రాయశో నాతిమానినః | యత్రౌషధాన్యశేషాణి వసేత్రత్ర విచక్షణః || 106

తత్రవిప్రా న వస్తవ్యం యత్రైతత్త్రితయం సదా | జిగీషుః పూర్వవైరశ్చ జనశ్చ సతతోత్సవః || 107

వసేన్నిత్యం సుశీలేషు సహచారిషు పండితః | యత్రాప్రధృష్యో నృపతి ర్యత్ర సస్యప్రదా మహీ || 108

ఇత్యేతత్కథితం విప్రా మయా వో హితకామ్యయా | అతఃపరం ప్రపక్ష్యామి భక్ష్యభోజ్య విధిక్రియామ్‌ || 109

నీటిని అగ్నిని ఒక్కసారి కలిపి పట్టుకొనరాదు. గురువులు దేవతలు తల్లిదండ్రులు బ్రాహ్మణులవైపు పాదములు చాచరాదు. పాలు గుడుపుచున్న గోవును జూడరాదు. దోసిలితో నీరు త్రావరాదు. చిన్న పెద్ద శౌచకాలములందు విలంబము సేయరాదు. నవేగాన్‌ధార యేత్క్వచిత్‌ అని యిదే విషయము మఱియొకచో దెలుపబడినది. నోటితో నగ్ని నూదరాదు. ఈ క్రింది నాలుగును లేనియూరిలో వసింపరాదు. ఇదేమాట సుమతిశతకమం దిట్లున్నది.

అప్పిచ్చువాడు వైద్యుడు

నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్‌

జొప్పడిన యూర నుండుము

చొప్పడుకున్నట్టి యూరు సొరకుము సుమతీ!

భృత్యులను జయించినవాడు నౌకరులకు లొంగనివాడన్నమాట బలశాలి ధర్మతత్పరుడు నయిన రాజు గల దేశమందు ప్రాజ్ఞుడు పసింపవలెను. చెడ్డరాజు కలచోట సుఖమెక్కడిది? ఎక్కడ పౌరులు (ప్రజలు) కలిసిమెలిసి న్యాయవర్తనులై శాంతులు మాత్స్యర్యహీనులునై యుందురో అక్కడ నివాసము సుఖోదయము. ఎక్కడ వ్యవసాయదారులు (కృషికులు) దురభిమాన దురహంకారములు లేనివారో యెక్కడ ఓషధులు సర్వముగలవో యచట వివేకి వసింపవలె. జయింపవలెనను కోరిక కలవారు పూర్వవైరము కలవారు నిరంతరము వేడుకలకై వేడుకపడు జనము ఈ మూడులక్షణములు గలచోట వసింపరాదు. ఉత్తీమశీలురైనవారు సహచరులు శత్రువుల బెదిరింపులకు లొంగని రాజు సస్యసమృద్ధమైన భూమిగలచోటు నిత్యనివాసార్హము. ఇదంతయు మీ హితముకోరి తెల్పితిని. ఈమీద భక్ష్యాభక్ష్యవిధానము తెల్పెద వినుండు.

భోజ్యమన్నం వర్యుషితం స్నేహాక్తం చిరసంభృతమ్‌ | ఆస్నేహా అపి గోధూమ యవగోరసవిక్రియాః || 110

శశకః కచ్ఛపో గోధా శ్వావిన్మత్స్యో77థ శల్యకః | భక్ష్యాశ్చైతే తథా వర్జ్యో గ్రామశూకర కుక్కుటౌ || 111

పితృదేవాదిశేషం చ శ్రాద్ధే బ్రాహ్మణకామ్యయా | ప్రోక్షితం చౌషధార్థం చ ఖాదన్మాంసం న దుష్యతి || 112

శంఖాశ్మ స్వర్ణరూప్యాణాం రజ్జునామథ వాససామ్‌ | శాకమూలఫలానాంచ తథావిదల చర్మణామ్‌ || 113

మణివస్త్ర ప్రవాళానాం తథాముక్తాఫలస్యచ | పాత్రాణాం చమసానాంచ ఆంబునా శౌచమిష్యతే || 114

తథాక7శ్మకానాం తోయేన ఆశ్మసంఘర్షణనచ | సస్నేహానాం చ పాత్రాణాం శుద్ధిరుష్ణేన వారిణా || 115

శూర్పాణామజినానాంచ ముసలోలూఖలస్య చ | సంహతానాం చ వస్త్రాణాం ప్రోక్షణాత్సంచ యస్యచ || 116

వల్కలానా మశేషాణా మంబుమృచ్ఛౌష మిష్యతే | ఆవికానాం సమస్తానాం కేశానాం చై వమిష్యతే || 117

సిద్ధార్థకానాం కల్కేన తిలకల్కేన వా పునః | శోధనం చైవ భవతి ఉపఘాతవతాం సదా || 118

తథాకార్పాసికానాం చ శుద్ధిః స్యాజ్జలభస్మనా | దారుదంతాస్థి శృంగాణాం తతక్షణాచ్ఛుద్ధిరిష్యతే || 119

పునః పాకేన భాండానాం పార్థివానా మమేధ్యతా | శుద్ధంభైక్ష్యం కారుహస్తః పణ్యం యోషిన్ముఖం తథా || 120

రథ్యాగత మవిజ్ఞాతం దానవర్గేణ సంస్కృతమ్‌ | ప్రాక్ప్రశ స్తంచిరాతీత మనేకాంతరితం లఘు|| 121

అంతఃప్రభూతం వాలం చ వృద్ధాతురవిచేష్టితమ్‌ | కర్మాంతాగారశాలాశ్చ స్తనద్వయం శుచిస్త్రియాః || 122

శుచయశ్చ తథైవా77పః స్రవంత్యో గంధవర్జితాః | భూమిర్విశుధ్యతే కాలా ద్దాహమార్జనగోకులైః || 123

లేపాదుల్లే ఖనాత్సేకా ద్వేశ్మ సంమార్జనాదినా | కేశకీటావపన్నే చ గోఘ్రాతే మక్షికాన్వితే || 124

మృదంబు భస్మ చాపన్నే ప్రక్షేప్తవ్యం విశుద్ధయే | ఔదుంబరాణా మవ్లుెవ వారిణా త్రపుసీసయోః || 125

భస్మాంబుభిశ్చ కాంస్యానాం శుద్ధః ప్లావో ద్రవస్య | చ అమేధ్యాక్తస్య మృత్తోయై ర్గంధాపహరణన చ || 126

అన్యేషాం చైవ ద్రవ్యాణాం వర్ణగంధాంశ్చ హారయేత్‌ | శుచి మాంసం తు చాండాల క్రవ్యాదైర్విని పాతితమ్‌ ||

రథ్యాగతం చ తైలాది శుచి గోతృప్తిదం పయః | రజో7గ్ని రశ్వ గోఛాయా రశ్మయః పవనో మహీ || 128

విప్లుషో మక్షికాద్యాశ్చ దుష్ట సంగాద దోషిణః | అజాశ్వం ముఖతో మేధ్యం న గోర్వత్సస్య చా77ననమ్‌|| 129

మాతుః ప్రస్రవణ మేధ్యం శకునిః ఫలపాతనే | ఆసనం శయనం యానం తటౌసద్యాస్తృణానిచ || 130

సోమసూర్యాంశుపవనైః శుద్యంతే తాని పణ్యవత్‌ | రథ్యాపసర్పణ స్నానే క్షుత్పానానాం చ కర్మసు || 131

ఆచామేత యథాన్యాయం వాససః పరిధాపనే | స్పృష్టానామథ సంస్పర్శై ర్ద్విరథ్యా కర్దమాంభసి || 132

పక్వేష్టక చితానాం చ మేధ్యతా వాయుసంశ్రయాత్‌ | ప్రభూతోపహతాదన్నా దగ్రముద్ధృత్య సంత్యజేత్‌ || 133

శేషస్య ప్రోక్షణం కుర్యా దాచమ్యాద్భిస్తథా మృదా | ఉపవాసస్త్రిరాత్రం తు దుష్టభక్తాశినో భ##వేత్‌ || 134

అజ్ఞానే జ్ఞాన పూర్వేతు తద్దోషోపశిమే నతు | ఉదక్యాం వావలగ్నాం చ సూతికాంత్యావసాయినః |7 135

స్పృష్ట్వా స్నాయీత శౌచార్థం తథైవ మృతహారిణః | నారం స్పృష్టా7స్థి సస్నేహం స్నాత్వా విప్రోవిశుధ్యతి|| 136

ఆచమ్యైవ తు నిఃస్నేహం గామాలభ్యార్క మీక్ష్య వా | న లంఘమేత్తథైవాథ ష్ఠీవనోద్వర్తనాని చ || 137

గృహాదుచ్ఛిష్ట విణ్మూత్రం పాదాంభస్తతిక్ష పేద్బహిః | పంచపిండాననుద్ధృత్య న స్నాయాత్పర వారిణి || 138

స్నాయీత దేవఖాతేషు గంగా హ్రదసరిత్సుచ | నోద్యానాదౌ వికాలేషు ప్రాజ్ఞస్తిష్ఠేత్కదాచన || 139

నా77లపేజ్జనవిద్విష్టా న్వీరహీనాస్తథా స్త్రియః | దేవతా పితృసచ్ఛాస్త్ర యజ్విసంన్యాసి నిందకైః || 140

కృత్వా తు స్పర్శనాలాపం శుధ్యత్యర్కావ లోచనాత్‌ | అవలోక్య తథోదక్యాం సంన్యాస్తం పతితం శవమ్‌|| 141

విధర్మిసూతికాషంఢ వివస్త్రాన్త్వా సాయినః | మృతనిర్యాతకాంశ్చైవ పరదార రతాశ్చ యే || 142

ఏతదేవ హి కర్తవ్యం ప్రాజ్ఞైః శోధనమాత్మనః | అభోజ్యభిక్షుపాఖండ మార్జారఖరకుక్కుటాన్‌ || 143

పతితాపవిద్ధచాండాల మృతాహారాంశ్చ ధర్మవిత్‌ | సంప్పృశ్య శుద్ధ్యతే స్నానా దుదక్యాగ్రామశూకరౌ || 144

తద్వచ్చ సూతికాశౌచ దూషితౌ పురుషావపి | యస్య చానుదినం హానిర్గృహే నిత్యస్య కర్మణః || 145

యశ్చ బ్రాహ్మణ సంత్యక్తః కిల్బిషాశీ నరాధమః | నిత్యస్య కర్మణో హానిం న కుర్వీత కదాచన || 146

తస్య త్వకరణం వక్ష్యేకేవలం మృత జన్మసు | దాశాహం బ్రాహ్మణస్తిష్ఠే ద్దానహోమ వివర్జితః || 147

క్షత్రియో ద్వాదశాహం చ వైశ్యో మాసార్ధమేవచ | శూద్రశ్చ మాసమాసీత నిజకర్మ వివర్జితః || 148

తతః పరం నిం కర్మ కుర్యుః సర్వే యథోచితమ్‌ | ప్రేతాయ సలిలం దేయం బహిర్గత్వా తు గోత్రకైః || 149

ప్రథమే7హ్ని చతుర్థే చ సప్తమే నవమే తథా | తస్యాస్థి సంచయః కార్య శ్చతుర్థే7హని గోత్రజైః || 150

ఊర్ధ్వం సంచయనాత్తేషా మంగస్పర్శో విధీయతే | గ్రోత్రైజైస్తు క్రియాఃసర్వాః కార్యాః సంచయనాత్పరమ్‌ || 151

స్పర్మ ఏవ సపిండానాం మృతాహని తథోభయోః | అన్వర్థ మిచ్ఛయా శస్త్ర రజ్జుబంధన వహ్నిషు || 152

విషప్రతాపాది మృతే ప్రాయానాశకయో రపి | బాలే దేశాంతరస్థే చ తథా ప్రవ్రజితే మృతే || 153

సద్యః శౌచం మనుష్యాణాం త్ర్యహముక్తమశౌచకమ్‌ | సపిండానాం సపిండస్తు మృతే7న్యస్మిన్మృతోయది|| 154

పూర్వశౌచం సమాఖ్యాతం కార్యాస్తత్ర దినక్రియాః | ఏషఏవ విధిర్దృష్టో జన్మన్యపి హి సూతకే || 155

సపిండానాం సపిండేషు యథావత్సోదకేషు చ | పుత్రే జాతే పితుః స్నానం సచైలస్య విధీయతే || 156

తత్రాపి యది వా77న్యస్మిన్న నుయాతస్తతః పరమ్‌ | తత్రాపి శుద్ధిరుదితా పూర్వజన్మవతో దినైః || 157

దశద్వాదశమాసార్ధ మాస సంఖ్యైర్దినైర్గతైః | స్వాః స్వాః కర్మక్రియాః కుర్యుః సరే వర్ణా యథావిధి || 158

ప్రేతముద్దిశ్య కర్తవ్య మేకోద్దిష్ట మతః |పరమ్‌ | దానాని చైవ దేయాని బ్రాహ్మణభ్యోమనీషిభిః || 159

యద్యదిష్టతమం లోకే యచ్చాస్య దయితం గృహే | తత్తద్గుణవతే దేయం తదేవాక్షయమిచ్ఛతా || 160

పూర్ణైస్తు దివసైః స్పృష్ట్వా సలిలం వాహనాయుధైః | దత్తప్రేతోదపిండాశ్చ సర్వే వర్ణాః కృతక్రియాః || 161

కుర్యుః సమగ్రాః శుచినః పరత్రేహ చ భూతయే | అధ్యేతవ్యా త్రయీ నిత్యం భవితవ్యం విపశ్చితా || 162

ధర్మతో ధనమాహార్యం యష్టవ్యం చాపి యత్నతః | యేన ప్రకుపితో నా77త్మా జుగుప్సామేతి భోద్విజాః || 163

తత్కర్తవ్య మశంకేన యన్నగోప్యం మహాజనైః | ఏవమాచరతో విప్రాః పురుషస్య గృహే సతః || 164

ధర్మార్థకామం సంప్రాప్య పరత్రేహ చ శోభనమ్‌ | ఇదం రహస్య మాయుష్యం ధన్యం బుద్దివివర్ధనమ్‌ || 165

సర్వపాపహరం పుణ్యం శ్రీ పుష్ట్యారోగ్యదం శివమ్‌ | యశః కీర్తప్రదం నౄణాం తేజోబలవివర్ధనమ్‌ || 166

అనుష్ఠేయం సదా పుంభిః సర్వసాధనముత్తమమ్‌ | బ్రాహ్మణౖః క్షత్రియైర్వైశ్యైః శూద్రైశ్చ మునిసత్తమాః || 167

జ్ఞాతవ్యం సుప్రయత్నేన సమ్యక్శ్రేయోభి కాంక్షిభిః | జ్ఞాత్వైవ యః సదాకాల మనుష్టానం కరోతి వై || 168

సర్వపాప వినిర్ముక్తః స్వర్గలోకే మహీయతే | సారాత్సారతరం చేద మాఖ్యాతం ద్విజసత్తమాః || 169

శ్రుతిస్మృత్యుదితం ధర్మం న దేయం యస్య కస్యచిత్‌ | న నాస్తికాయ దాతవ్యం న దుష్టమతయే ద్విజాః ||

న దాంభికాయ మూర్ఖాయ న కుతర్కప్రలాపినే || 170

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే వ్యాసర్షి సంవాదే సదాచార నిరూణం నామ ఏకవింశత్యధిక ద్విశతతమోధ్యాయః

నేయి నూనెలతో మిశ్రితమైనచో పర్యుషితమైన (నిలువయున్నది చలిది) అన్నముగూడ త్యాజ్యమే. నేయినూనెల స్పర్శలేకున్నను గోధుమ యవ పదర్థములు అవుపాలు పెరుగు నేయి మొదలయినవి వానితో జేసిన వంటలును నిలువయున్నవైనను భుజింపతగినవే. కుందేలు తాబేలు ఉడుము పంది చేప ఒక రకము చేప యనునవి తినదగినవి. ఊరబంది కోడియు తినరానివి. పితృశేషము దేవశేషము శ్రాద్ధమందు బ్రహ్మణులకు బెట్టు నుద్దేశముతో బ్రోక్షింప బడినదియు ఔషధముకొరకైనదియు నగు మాంసము దిన్న దోషము గల్గదు.

శంఖము రాయి బంగారము వెండి త్రాళ్ళ వస్త్రములు కూరలు దుంపలు పండ్లు పప్పులు చర్మము మణులు వస్త్రములు పవడములు ముత్యాలు పాత్రలు చమసలు (చతురన్రములైన యజ్ఞపాత్రలు) నీటితో గడిగిన శుద్దములగును. రాతిచిప్పలు(రాచ్చిప్ప అని వాడుక) నీటిచేతను రాతితో సంఘర్షించుటచేతను శుద్దములగును. నూనె జిడ్డున్న యెడల వానిని వేడినీట గడుగవలయును. చేట చర్మము ఱోకలి ఱోలు ముతక బట్టలు ప్రోక్షణ చేసిన శుద్దిగల్గును. నారబట్టలు నీరు మట్టి(చవుడుమన్ను) ఎండబెట్టుట అనువానిచే పరిశుద్ధములగును. గొర్రెయున్నితో నేసినబట్టలు (ముదుకగానున్న బట్టలు) అవాలముద్ద నువ్వులముద్దచే శోధనము సేయవలెను. దట్టమైన నూలు బట్టలు గూడపూర్వోక్తరీతిగానే స్వచ్చములగును. కఱ్ఱదంతములు ఎముకలు కొమ్ములు అనునవి నీటితో గడిగినను భస్మముతో దోమినను శుద్ధములగును. అంటుకుండలు మరల పంటకు పనికిరావు. తోమి మఱివంట చేయవలెను. బ్రహ్మచారి సంన్యాసి మొదలగు వారి భిక్షాన్నము వడ్రంగి (శిల్పి) హస్తము బజారువస్తువులు స్త్రీముఖమును శుద్ధములు. బాటలోపడియున్నది తెలియకుండ స్పృశించినది (త్రోక్కినది) దాసిచే తోమబడినది అదిలో పరిశుద్దమే. చిరకాలమయినను. వస్తుసమృద్దితో చేరిన ఆశుచియైన అల్పవస్తువుగూడ పరిశుద్దమే. స్థానభ్రంశము పొందని వెంట్రుక మునలివాండ్రు రోగాదిపీడితులు సేసినవనిసత్కర్మమరిగిన యిండ్లు వాకిండ్లు స్త్రీయొక్క పాలిండ్లు పవిత్రములు. ప్రవాహోదకము వాసనలేని నీరు పరిశుద్దము. భూమి కాలముచేతను అగ్ని దాహముచేత ఉదకము మార్జనముచేత అవులు త్రొక్కులు చేత పవిత్రమగును. గృహము అలుకుట త్రవ్వుట నీటతడువుట నీళ్లు చల్లుటవలన శుచియగును. వెంట్రుకల పురుగులచే ధూషి తమయినపుడు ఆవువాసన చూచినపుడు ఈగలు వ్రాలినపుడు అన్నము మట్టి నీరు భస్మము నించుక చిమ్ముటవలన శుచియగును. చింతపండు రసముచేత మేడికర్రతో జేసిన పాత్రలు తగరపు సీనపుగిన్నెలు చింతపండు రసముచేతను కంచుగిన్నెలు బూడిద నీరు చేతను శుద్ధిచెందును. ద్రవపదార్థము అశుచియైనతఱి కొంచెము క్రింద పోయుటవలన పవిత్రమగును. అపవిత్ర వస్తువులతో గూడిన ద్రవ్యము మట్టి నీరువలనను వాసనపోవుదాక తోముట వలనను పవిత్రమగును. మఱి యితర వస్తువులు వాని రంగు వాసనను దొలగించిన శుభ్రములగును. చండాలుడు పచ్చిమాంసము తినువాడు తెచ్చిన మాంసము శుచి. దుకాణమునుండి తెచ్చిన నూనె గోవునకు దృప్తిగూర్చిన నీరు (ఆవులు త్రావినది) ధూళి అగ్ని గుర్రములు గోవులయొక్క నీడ కిరణములు గాలి భూమి నీటిచినుకులు ఈగలు మొదలయిన దుష్టవస్తుస్పర్శ పొందినను మైలపడవు. మేకలు గుర్రములు ముఖముచే పవిత్రములు.

ఇది శ్రీ బ్రహ్మపురాణమునందలి సదాచారవర్ణనమును రెండువందల ఇరువది యొకటవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters