Brahmapuranamu    Chapters   

అథ ద్వావింశో7ద్యాయః

నరకవర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ-

తతశ్చానంతరం విప్రా నరకా రౌరవాదయః | పాపితో యేషు పాత్యంతే తాన్‌ శృణుధ్వం ద్విజోత్తమాః || 1

లొమహర్షణు డిట్డనెయె-

ఓ విప్రులాఠా! పాపాత్ములు పడవేయబడు రౌరవాది నరకములనుగూర్చి యిక వినుడు.

రౌరవ శ్శ్‌కరో రోద స్తాలో విశసన స్తథా | మహాజా9ల స్తప్తకుంఢో మహాలోభో విమోహనః || 2

రుధిరాంధో వసాత ప్తః కృమీశః కృమిభోజనః | అసిపత్రవనం కృష్ణో లాలాభక్షశ్చ దారుణః || 3

తథా పూయవహః పాపో వహ్నిజ్వాలో హ్యధశ్శిరాః | సదంశః కృష్ణసూత్రశ్చ తమ శ్చావీచిరేవ || 4

శ్వభోజనో7థాప్రతిష్ఠో మావీచిశ్చ తథా7పరః | ఇత్యేవమాదయశ్చాన్వే నరకా భృశదారుణాః || 5

యమస్య విషయే ఘోరాః శస్త్రాగ్ని విషదర్శినః | పతంతి యేషు పురుషాః పాపకర్మరతాశ్చ యే || 6

రౌరవము - శౌకరం - రోధము తాలము - విశసనము - మహాజ్వాల - త ప్తకుడ్యము మహాలోభము - వియోచనము రుధిఠాంధము - వసాతప్తము - కృమీశము - కృమిభోజనము - అసిపత్రవనము - కృష్ణము - లాలాభక్షము - పూయ వహము - వహ్నిజ్వాలం - అధశ్శిరము - సదంశము - కృష్ణసూత్రము - తమస్సు - ఆవీచి - శ్వభోజనము - అప్రతిష్టము మావీచి అనునవి. పరమ దారుణములైన మరిపెక్కు నరకములు గలవు. ఇవి యముని పరిపాలన దేశములు శస్త్ర - అగ్ని - విషములం బ్రయోగించు యమభటులు పాపకర్మాసక్తిగల వారు వీనియందుందురు.

కూటసాక్షీ తథా సమ్యక్పక్షపాతేన యో వదేత్‌ | య శ్చావ్య దనృతం వ క్తి స నరో యాతి రౌరవమ్‌ || 7

భ్రూణహా వురహంతా చ గోఘ్నశ్చ మునిసత్తమాః | యాతి తే రౌరవం ఘోరం యశ్చోచ్ఛ్యాస నిరోధకః || 8

సురాపో బ్రహ్మహా హర్తా సువర్ణస్య చ శూకరే | ప్రయాతి నరకే యశ్చత్తెః సంసర్గ ముపైతివై || 9

రాజన్యవైశ్యహాచైవ తథైవ గురుతల్పగః | తప్తకుంభే స్వసృగామీ హంతి రాజభటం చయః || 10

మాధ్వీ విక్రయకృ ద్వధ్యపాలః కేసరవిక్రయీ | తప్తలోహే పతంత్యేతే యశ్చ భక్తం పరిత్యజేత్‌ || 11

దొంగ సాక్ష్యమచ్చినవాడు, పక్షపాతబుద్ధితో మాట్లాడువాడు, అబద్ధము చెప్పువాడు రౌరవమున కేగును. భ్రూణహత్య నగరధ్వంసము గోహత్య చేసినవాడు జీవుల యూపిరియాడకుండచేసినవాడు భయంకర రౌరమున కేగుదురు. బ్రహ్మహత్యా కారకుడు బంగారమును దొంగిలించినవాడు వాని స్నేహితుడు శూకర నరకమున బడుదురు. క్షత్రియవైశ్య ఘాతకురు, గురుపత్నిని, అప్పచెల్లెండ్రను గూడినవాడు రాజభటుని హత్యచేసపినవాడు త స్తకుంభమనునరకమున గూలును. మద్య విక్రేత వధ్యపాలుడు ఉరితీయుస్థానమును గాయువాడు (లేక) వధింపదగిన వానినిగాపాడినవాడు కేసరవిక్రేత (విషమమ్మువాడు.) భక్తుని విడిచినవాడు తప్తలోహమను నరకమున గూలుదురు.

సుతాం స్నుషాం చాపి గత్వా మహాజ్వాలే నిపాత్యతే| అవమంతా గురూణాం యోయశ్చా77క్రోష్టా నరాధమః|| 12

వేదదూషయితా యశ్చ వేదవిక్రయకశ్చ యః | అగమ్యగామీ యశ్చ స్యా తే యాంతి శబలం ద్విజాః || 13

చౌరో విమోహే పతతి మర్యాదాదూషక స్థథా | దేవద్విజ పితృద్వేష్టా రత్నదూషయితా చ యః || 14

స యాతి కృమిభ##క్ష్యే వై కృమీశే తు దురిష్టికృత్‌ | పితృదేవాతిథీ న్యస్తు పర్యశ్నాతి ద్విజోత్తమాః || 15

లాలాభ##క్ష్యే స యా త్యుగ్రే శరకర్తా చ వేధకే | కరోతి కర్ణినో యశ్చ యశ్చ ఖడ్గాదికృన్నరః || 16

ప్రయాం త్యేతే విశసనే నరకే భృశదారుణ | అసత్ర్పతిగ్రహీతా చ నరకే యా త్యధోముఖే || 17

అయాజ్యయాజక స్తత్ర తథా నక్షత్రసూచకః | కృమిపూయే నరశ్చైకో యాతి మిష్టాన్నభుక్సదా || 18

లాక్షామాంసరసానాం చ తిలానాం లవణస్య చ | విక్రేతా బ్రాహ్మణో యాతి తమేవ నరకం ద్విజాః || 19

మార్జారకుక్కుటచ్ఛాగశ్వవరాహ విహంగమాన్‌ | పోషయ న్నరకం యాతి తమేవ ద్విజసత్తమాః || 20

రంగో పజీవీ కైవర్తః కుండాశీ గరదస్తథా | సూచీ మాహిషకశ్త్చెవ పర్వగామీ చ యో ద్విజః || 21

అగారదాహీ మిత్రఘ్నః శకునీ గ్రామయాజకః | రుధిరాంధే పతం త్యేతే సోమం విక్రీయతే చ యః || 22

మధుహా గ్రామహంతా చ యాతి వైతరిణీం నరః |

కూతురును కోడలిని సంగమించినవాడు, మహాజ్వాలమను నరకమున పడవేయబడును. వేద దూషకుడు. వేదవిక్రయి అగమ్యగామి, శబలమును నరకము పాలగును. దొంగ హద్దుమీరినవాడును విమోహనరకమున బడును. దైవబ్రాహ్మణ పితృ ద్వేషియు రత్నములను (శ్రేష్ఠవన్తువులను) దూషించినవాడు కృమిభక్ష్వమును నరకమును పొందు. దుర్యాగము చేసిన వాడు కృమీశమును నరకము పాలగును. పితృదేవతా తిధులను విడిచి కుడిచినవాడు లాలా (చొంగ) భక్ష్యమను నరకమున బడును. బాణములను చేయువాడు వేధకనరకమున బడును, ఖడ్గాదులను చేయువాడును, కర్ణికారుడు, (కర్ణి+ఒకవిధమైన యాయుధము) పరమదారుణమైన విశసనమను నరకమున పడుదురు. అపాత్రదానము పట్టినవాడు అయాజ్యయాజనము చేయ కూడని వానిచే యజ్ఞము చేయించినవాడు నక్షత్రసూచకుడు జ్యోతిషశాస్త్రము వెలియకయే జాతరముహూ ర్తములు చెప్పువాడు అధోముఖ నరకము సందును అతిథికి పెట్టక మృష్టాన్న మారగించువాడు కృమిపూయనరకమున కేగును. లాక్ష = లక్క మాంసము రనములు మధురపానీయములు నువ్వులు ఉప్పు అనువానినమ్ము బ్రాహ్మణుడుకూడ కృమిఫూయనరకమున పడును. పల్లి, కోడి, మేక, కుక్క, పంది పఱులు వీనిని పెంచువానికీని అదేగతి. రంగోపజీవి నాటకాములందు నటించి జీవించు వాడు జాలరి కుండాశి భగభక్షకుడు (వీర్యపానము చేయువాడు) లేక జూరజుని అగ్రము నుతించువాడు విషము పెట్టువాడు సూచి చాడీకోరు పేచీకోరు మూహిషకుడు దున్నపోతుల వ్యాపారి పర్వములందు స్త్రీ సంయోగము సేసిన బ్రాహ్మణుడు, కొంపలంటించువాడు మిత్రఘాతకుడు శకునములు చెప్పువాడు గ్రామపాచకుడు సోమవిక్రయ రుధిరాంధ కూపమున పడుదురు తేనెపుట్టలను రేపినవాడు గ్రామనాశనము చేసినవాడు వై తరిణింబడును.

రేతః పానాదిక ర్తారో మర్యాదాభేదినశ్చ యే || 23

తే కృచ్ఛ్రే యాంత్యశౌచాశ్చ కుహకాజే వినశ్చయే | అసిపత్రవనం యాతి వనచ్ఛేదీ వృథైవ యః || 24

జారభ్రికా మృగవ్యాధా వహ్నిజ్వాతే పతంతివై | యాంతి తత్త్రెవ తే విప్రా యశ్చాపాకేషు వహ్నిదః || 25

వ్రతోపలోపకో యశ్చ స్వాశ్రమాద్విచ్యుతశ్చ యః | సందంశయాతనామధ్యే పతత స్తా వుభావపి || 26

దివాస్వప్నే షు స్యందంతే యే నరా బ్రహ్మచారిణః | పుత్త్రెరధ్యాపితా యేతు తే పతంతి శ్వభోజనే || 27

ఏతే చాన్యే చ నరకాః శతశో7థ సహస్రశః | యేషు దుష్కృతకర్మాణః పచ్యంతే యాతనాగతాః || 28

తథ్తేవ పాపాన్యేతాని తథా7న్యాని సహస్రశః | భుజ్యంతే జాతిపురుషై ర్నరకాంతరగోచరైః || 29

వర్ణాశ్రమ విరుద్ధం చ కర్మ కుర్వంతి యే నరాః |

కర్మణా మనసా వాచా నిరయేషు పతంతి తే || 30

అధఃశిరోభి ర్దృశ్యంతే నారక్తె ర్దివి దేవతాః | దేవాతాశ్చాధో ముఖా న్సర్వా నధః పశ్యంతి నారకాన్‌ || 31

స్థావరాః కృమయో7 బ్జాశ్చ పక్షిణః పశవో నరాః | ధార్మికా స్త్రిదశా స్తద్వ న్మోక్షిణశ్చ యథాక్రమమ్‌ || 32

సహస్రభాగః ప్రథమా ద్ధితీయే7నుక్రమాత్తథా | సర్వే హ్యేతే మహాభాగా యావన్త్మ సమాశ్రయాః || 33

రేతః పానము చేసనవాడు, మర్యాదోల్లంఘనము చేసినవాడు [సదాచారములను కట్టుబాట్లను దప్పినవాడు] మాయా జీవనులు, ఆచారహీనులు, కృచ్ర్ఛ నరకమున బడుదురు. జౌరభ్రికులు (గొఱ్ఱల మందచే జీవించువారు.) మృగవ్యాధులు వహ్ని జ్వాలమను నరకమునంబడుదురు. అపాక మలందు [(వండగూడనివస్తవులకు)] అగ్నిని పెట్టినవాడు అదే నరకమునం బడును. వ్రతలోపము ఆళ్రమధర్మచ్యుతి చేసినవాడు సందంశ యాతనమను నరకమునబడును. దివాస్వా పకాలయిన బ్రహచారులు, కొడుకులదగ్గర యధ్యయనము చేసినవారు శ్వభోజనమను నరకమున బడుదురు. ఇట్టివి నూర్లకొలది వేలకొలది నరకములు కలవు. పాపములను చేసినవారు ఈ బొంది విడిచియాతనాశరీరములనొంది యిందు హిసింప బడుదురు. వర్ణాశ్రమవిరుద్గమైన కర్మను త్రికరణములచే చేసినవారు నరకము పాలగుదురు. ద్యులోకమందలి దేవతలు, తలక్రిందులుగా సుండు నరకలోక జీవులచే చూడబడుచుందురు. దేవతలు నరకలోక వాసులను అథోముఖులుగా జూచుచుందురు. జీవులు స్థావరములు, కృములు, జలజంతువులు, పక్షులు పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు నను వరుసలో జన్మించి క్రమముక్తి నందుదురు.

యావంతో జంతవః స్వర్గే తావంతో నరకౌకసః | పాపకృ ద్యాతి నరకం ప్రాయశ్చిత్త పరాజ్ముఖః || 34

పాపానా మనురూపాణి ప్రాయశ్చిత్తాని యద్యథా | తథా తధైవ సంస్కృత్య ప్రోక్తాని పరమర్షిభిః || 35

పాపే గురూణి గురుణి స్వల్పా న్యల్పేచతద్విదః| ప్రాయశ్చిత్తాని విప్రేంద్రా జగుః స్వాయంభువాదయః || 36

ప్రాయశ్చిత్తాన్యశేషాణి తపఃకర్మాత్మకానివై | యాని తేషా మవేషాణాం కృష్ణానుస్మరణం పరమ్‌ || 37

కృతే పాపే7నుతాపో వై యస్య వుంసః ప్రజాయతే| ప్రాయశ్చిత్తంతు తస్త్యెకం హరిసంస్మరణమ్‌ పరమ్‌|| 38

ప్రాత ర్నిశి తథా సంధ్యామధ్యాహ్నాదిషు సంస్మరన్‌ | నారాయణమవాప్నోతి సద్యః పాపక్షయా న్నరః || 39

విష్ణుసంస్మరణా తీణసమస్తక్లేశ సంచయః | ము క్తిం ప్రయాతి భో విప్రా విష్ణో స్త స్యానుకీర్తనాత్‌ || 40

వాసుదేవే మనో యస్య జపహోమార్చనాదిషు | తస్యాంతరాయో విప్రేంద్రా దేవేంద్రత్వాదికం ఫలమ్‌ || 41

క్వ నాకపృష్ఠగమనం పునరావృత్తిలక్షణమ్‌ | క్వ జపో వాసుదేవేతి ముక్తిబీజ మనుత్తమమ్‌ || 42

తస్మా దహర్నిశం విష్ణుం సంస్మర న్పురుషో ద్విజాః | న యాతి నరకం శుద్ధః సంక్షీణాఖిలపాతకః || 43

మనఃప్రీతికర్మః స్వర్గో నరక స్తద్విపర్యయః | నరకస్వర్గ సంవై పావపుణ్య ద్విజోత్తమాః || 44

స్వర్గమందెందరు జీవులుందురో సరకమందు నందరుందురు పాపము చేసి ప్రాయశ్చిత్తము చేసికొనని వాడు నరకమేగును. ఆయా పాపముల కనురూపములైన ప్రాయశ్చిత్తములను పరమర్షులు స్మరించి (స్మృతులలో) పెద్ద పాపమునకు పెద్దగ చిన్నదానికి చిన్నగా ప్రాయశ్చిత్తములను దెల్పిరి. స్వాయంభువ మనువు మొదలయినవారా ప్రాయశ్చిత్తకాండను రచించిరి. అన్నిటికిని ప్రాయశ్చిత్తము క్భష్ణస్మరణము. దానిని మించినదిలేదు. ప్రాయశ్చిత్తమనగా తపస్సు. పాపముజేసి యను తాపమి నొందెనేని హరిన్మరణ చేసెనేని దానిని మించిన పుణ్యసాధనము లేదు. దాన జీవి నారాయణుని జెందును. ప్రాతఃకాలాహో రాత్రములందు సంధ్యాసమయములందు నారాయణ స్మరణ చేసి పాపక్షయమంది నరుడు నారాయణుని పొందును. ఎవ్వని మనస్సు జపహోమార్చనములందు వాసుదేవునందు లగ్నమై యుండునో వాడుము క్తినొందును. విష్ణువునందప్పుడప్పుడు మనసు నిలువక చలించెనేని, వానికి దేవేంద్రాది వదవిలభించును. పుసరావృత్తి లక్షణమ్తెన స్వర్గగమనమెక్కడ? ముక్తి బీజమైన వాసుదేవ నామ స్మరణమెక్కడ? కావునఅహర్నిశము పురుషుడు, విష్ణుస్మరణ జేయుచుపాపక్షయమంది. శుద్ధుడైనచో నరకధర్మనము జేయుడు. స్వర్గము మనఃప్రీతి గూర్చినది, దానికి వ్యతిరేకము నరకము. నరక స్వర్గము లసగా పాప- పుణ్యములే. అవి వానికి పర్యాయ పదములు, వాసుదేవై కచిత్తుడు అపునరావృత్తి లక్షణమైన సాయుజ్యముక్తి కర్హుడన్నమాట

వస్త్వేకమేవ దుఃఖాయ సుఖా యేర్ష్యోదయాయచ | కోపాయ చ యత స్తస్మా ద్వస్తు దుఃఖాత్మకం కుతః || 45

తదేవ ప్రీతయే భూత్వా పునర్దుఃఖాయ జాతయే | తదేప కోపాయ యతః ప్రసాదాయ చ జాయతే || 46

తస్మాద్దుఃఖాత్పకం నాస్తి న చ కించి త్సుఖాత్మకమ్‌ | మనసః పరిణామో7యం సుఖదుఃఖాది లక్షణః || 47

జ్ఞానమేవ పరం బ్రహ్మా7జ్ఞానం బంధాయ చేష్యతే | జ్ఞానాత్మక మిదం విశ్వం న జ్ఞానాద్ద్విద్యతే పరమ్‌ || 48

విద్యావిద్యేహి భో విప్రా జ్ఞానమే వావధార్యతామ్‌ | ఏవ మేత న్మయా7ఖ్యాతం భవతాం మండలం భువః|| 49

పాతాళాని చ నర్వాణి తధైవ నరకా ద్విజాః | సముద్రాః పర్వతాశ్చైవ ద్వీపావర్షాణి నిమ్నగా || 50

సంక్షేపా త్సర్యమాఖ్యాతం కిం భూయః శ్రోతు మిచ్ఛథ |

శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే నరకవర్ణనం నామ ద్వావింశో7ధ్యాయః

ఒకే వస్తువు దుఃఖమునకు, సుఖముకు ఈర్ష్యకు కోపముననకు కారణమగును. కావున నేవస్తువైనను దుఃఖాత్మకమే. ఆ వస్తువే యొకప్పుడు కోపమునకు హేతువై యదే ప్రనన్నతకు గారణ మగును. కావున కేవలము దుఃఖాత్మకము కేవలము సుఖాత్మకము నయిన వస్తువు లేనేలేదు. సుఖ దుఃఖాది లక్షణమైన యీపరిణామము కేవలమానసికము, బ్రహ్మజ్ఞానమొక్కటియె జ్ఞానము. లౌకిక మయిన జ్ఞానము బంధమునకు బ్రహ్మజ్ఞానము ముక్తికిని కారణమగును, ఈ ప్రపంచవ్యవహారము తెలివి వలననే జరుగును. కాని ధీనికే మందదు. విద్య అవిద్య యనువానిని బ్రహ్మజ్ఞానము. లౌకికజ్ఞానమునుగా గ్రహింపపలెను. (మోక్ష విషయకమైన జ్ఞానమే జ్ఞానమనియు, తదన్యవిషయకమైన తెలివి విజ్ఞాన మనియు సమరుడు చెప్పెను.) అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా7మృత మశ్నుతే అనగా నవిద్యచే జరా మరణములను లేకుండజేసికొని విద్యచేసమృత స్థితిని (మోక్షమును) బొందునని శ్రుతిచెప్పినది. ఔపనిషదమైన జ్ఞానము బ్రహ్మజ్ఞాన మగును. పేర విద్యాశబ్దవాఛ్యమై కేవల మవునరావృత్తికమైన ముక్తికి హేతువగును తక్కిన వేదవేదాంగాది విద్యలు, తదుదిత కర్మానుష్ఠానమునవిద్యగా బేర్కొనబడి స్వర్గాదిభోగమాత్ర సాధనములగు నన్నమాట. వీనిచే జిత్తశుద్ది వడసి పునరావృత్తి సహితములయిన పుణలోక భోగములను బొదవచ్చును. కేవలము విద్యవలననే మోక్షస్థితి కలుగునను భావము. ఈవిధముగ నాచే భూమండలము సమస్త పాతాళములు, నరకములు, మీము చెప్పబడినవి, సముద్రము, పర్వతములు, ద్వీపములు, నదులు, సంక్షేపముగ చెప్పబడినవి. ఇంకేమి వినగోరు చున్నారు.

ఇది యాది బ్రహ్మమహావురాణమునందు నరకవర్ణనమను ఇరువదిరెండవయధ్యాయము.

Brahmapuranamu    Chapters