Brahmapuranamu    Chapters   

అష్టాధికద్విశతతమో7ధ్యాయః

బలదేవ మాహాత్మ్యవర్ణనమ్‌

మునయ ఊచుః

శ్రోతుమిచ్ఛామహేభూయో బలభద్రస్య ధీమతః | మునే పరాక్రమంశౌర్యం త న్నో వ్యాఖ్యాతు మర్హసి || 1

యమునాకర్షణాదీని శ్రుతాన్యస్మాభి రత్రవై | తత్కథ్యతాం మహాభాగ యదన్య త్కృతవా న్బలః || 2

వ్యాస ఉవాచ

శృణుధ్వం మునయః కర్మ7యద్రణభవత్కృతమ్‌ | అనంతే నాప్రమేయేన శేషేణ ధరణీభృతా || 3

దుర్యోధనస్య తనయాం స్వయంవరకృతేక్షణామ్‌ | బలా దాదత్తవా న్వీరః సాంబో జాంబవతీసుతః || 4

తతః క్రుద్ధా మహావీర్యాః కర్ణదుర్యోధనాదయః | భీష్మద్రోణాదయ శ్చైవ బబంధు ర్యుధి నిర్జితమ్‌ || 5

త చ్ఛ్రుత్వా యాదవాః సర్వే క్రోధం దుర్యోధనాదిషు | మునయః ప్రతిచక్రుశ్చ తాన్విహంతుం మహోద్యమమ్‌ ||

తా న్నివార్య బలః ప్రాహ మదలోలాకులాక్షరమ్‌ | మోక్ష్యంతి తే మద్వచనా ద్యాస్యా మ్యేకో హి కౌరవాన్‌|| 7

బలదేవ స్తతోగత్వా నగరం నాగసాహ్వయమ్‌ | బాహ్యోపవనమధ్యే7భూ న్న వివేశ చ తత్పురమ్‌ || 8

బల మాగత మాజ్ఞాయ తదా దుర్యోధనాదయః | గా మర్ఘ్య ముదకంచైవ రామాయ ప్రత్యవేదయన్‌||

గృహీత్వా విధివత్సర్వం తతస్తా నాహ కౌరవాన్‌ || 9

బలదేవ ఉవాచ

ఆజ్ఞాపయ త్యుగ్రసేనః సాంబ మాశు విముంచత || 10

వ్యాస ఉవాచ

తత స్తద్వచనం శ్రుత్వా భీష్మద్రోణాదయో ద్విజాః | కర్ణదుర్యోధనాద్యాశ్చ చుక్రుధు ర్ద్విజసత్తమాః || 11

ఊచుశ్చ కుపితాః సర్వే బాహ్లికాద్యాశ్చ భూమిపాః | అరాజార్హం యదోర్వంశ మవేక్ష్య ముసలాయుధమ్‌ || 12

బలరామప్రభావము

మునులనిరి.

ధీశాలి బలభద్రుని పరాక్రమము శౌర్యమును గూర్చి వినగోరెదము. యమునానదీ సమాకర్షణము మొదలగునవి విన్నాము. అతడు మఱియేమిసేసె నన వ్యాసుడు అనంతుడు భూమినిమోయునాదిశేషుడు నగు బలరామమూర్తి లీలలు వినుండు -

స్వయంవరమున దృష్టివెట్టుకున్న దుర్యోధనుని కూతురును జాంబవతికుమారుడు సాంబుడు బలాత్కారముగ హరించెను. దాన కోపించి కర్ణదుర్యోధనాదులు భీష్మద్రోణాదులును వానిని బోరనోడించి బంధించిరి. అది విని యాదవులు దుర్యోధనాదులందు కోపము గొని వారిని గడతేర్తుమని ప్రతిక్రియకుం బూనుకొనిరి. వారిని వారించి బలరాముడు సగర్వముగ నేనొక్కడన యేగెద. నామాటచే వానిని విడచెదరని నాగసము అను పురికేగి వెలుపలి యుద్యానవనమందు విడిసెను. నగరములోని కేగడయ్యె. బలభద్రుడు పచ్చెనని తెలిసి దుర్యోధనాదులు హలికి గోవును పాద్యార్ఘ్యములను నొసంగిరి. అవి స్వీకరించి కౌరవులతో ఉగ్రసేను నాజ్ఞ యిది. సాంబుని వెంటనే విడుపుడు. ఆన భీష్మద్రోణాదులు కర్ణదుర్యోధనులును విని కోపించిరి. బాహ్లికాదులతో నందరును యదువంశము రాజ్యార్హము గాదని చూచి ముసలాయుధునితో నిట్లనిరి.

కౌరవా ఊచుః

భోభోః కిమేతద్భవతా బలభ ద్రేరితం వచః | ఆజ్ఞాం కురు కులోత్థానం యాదవః కః ప్రదాస్యతి || 13

ఉగ్రసేనో7పి యద్యాజ్ఞాం కౌరవాణాం ప్రదాస్యతి | తదలం పాండురైశ్చత్రై ర్నృపయోగ్యై రలంకృతైః || 14

తద్గచ్ఛ బలభద్ర త్వం సాంబ మన్యాయచేష్టితమ్‌ | విమోక్ష్యామో న భవతో నోగ్రసేనస్య శాసనాత్‌ || 15

ప్రణతి ర్యా కృతా7స్మాకం మాన్యానాం కుకురాంధకైః | న నామ సా కృతా కేయ మాజ్ఞాస్వామిని భృత్యతః || 16

గర్వమారోపితా యూయం సమానాసనభోజనైః | కోదోషో భవతాం నీతి ర్యత్ప్రీణా త్యనపేక్షితా || 17

అస్మాభి రర్చ్యో భవతా యో7యం బలనివేదితః | ప్రేమైణవ స త దస్మాకం కులాద్యుష్మ త్కులోచితమ్‌ || 18

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా కురవః సర్వే నాముంచంత హరేః సుతమ్‌ | కృతైక నిశ్చయాః సర్వే వివిశుర్గజసాహ్వయమ్‌ || 19

బలభద్ర! నీయన్నమాట యిదేమి? ఉత్తమ వంశమందు బుట్టిన వారి కొకయాదవు డెవ్వడాజ్ఞ యిచ్చుటా? ఉగ్రసేనుడు గూడ కౌరవుల కాజ్ఞ సేయునేని రాజుల కుచితమైన శ్వేతచ్ఛత్ర మీ కెందులకు. అలంకారప్రాయములివి యెందులకు? బలభద్ర ! నీవు సనుము. అన్యాయవర్తనుని సాంబుని నీ యొక్కకాని ఉగ్రసేనుని యొక్కకాని యాజ్ఞను విడిచిపెట్టము. కుకురాంధకాదులు రాజులు మాకు ప్రణతులైనారు. అట్టి ప్రణతిసేయకపోగా పైని స్వామికి భృత్యుడిచ్చి నట్టాజ్ఞ సేయుటయేమి? సహాసన సహపంక్తి భొజనములచే మీరు గర్వమెక్కింపబడినారు. మీ తప్పేమి! ఓ బల! నీ చెప్పిన యీ యుగ్రసేనుడు మాకు పూబనీయుడగుట ప్రేమచేతనే. కులమును బట్టి కాదు. ఈ మా మర్యాద మీ కులమునకు దగదు. అని కౌరవులందురు హరికుమారుని సాంబుని విడువరైరి. అంద రేకనిశ్చయమున గజసానగరముం జొచ్చిరి.

మత్తః కోపేన చా77ఘూర్ణన్‌ తతో7ధిక్షేపజన్మనా | ఉత్థాయ పార్షాణ్యపసుధాం జఘాన స హలాయుధః || 20

తతో విదారితా పృథ్వీ పార్షిణఘాతాన్మహాత్మనః | అస్ఫోటయామాస తదా దిశః శ##బ్దేన పూరయన్‌ || 21

ఉవాచ చాతితామ్రాక్షో భ్రుకుటీకుటిలాననః |

బలదేవ ఉవాచ

అహోమహావలేపో7య మసారాణాం దురాత్మనామ్‌ | కౌరవాణా మాధిపత్య మస్మాకం కిల కాలజమ్‌ 22

ఉగ్రసేనస్య యే నా77జ్ఞాం మన్యంతే చాప్యలంఘనామ్‌ | ఆజ్ఞాం ప్రతీచ్ఛే ద్ధర్మేణ సహదేవైః శచీపతిః || 23

సదా7ధ్యాస్తే సుధర్మాం తా ముగ్రసేనః శచీపతేః | ధిఙ్మనుష్యశతోచ్ఛిష్టే తుష్టి రేషాం నృపాసనే || 24

పారిజాతతరోః పుష్పమంజరీ ర్వనితాజనః | బిభర్తి యస్యభృత్యానాం సో7ప్యే షాం న మహీపతిః 25

సమస్తభూభుజాం నాథ ఉగ్రసేనః స తిష్ఠతు | ఆద్య నిష్కౌరవా ముర్వీం కృత్వా యాస్యామి తాం పురీమ్‌|| 26

కర్ణం దుర్యోధనం ద్రోణ మద్య భీష్మం సబాహ్లికమ్‌ | దుఃశాసనాదీ న్భూరిం చ భూరిశ్రవసమేవ చ|| 27

సోమదత్తం శలం భీమ మర్జునం సయుధిష్ఠిరమ్‌ | యమజా కౌరవాంశ్చాన్యా న్హన్యాం సాశ్వరథద్విపాన్‌ || 28

వీర మాదాయ తం సాంబం సపత్నీకం తతః పురీమ్‌ | ద్వారకా ముగ్రసేనాదీ న్గత్వా ద్రక్ష్యామి బాంధవాన్‌ || 29

అథవా కౌరవాదీనాం సమసై#్తః కురుభిః సహ | భారావతరణ శీఘ్రం దేవరాజేన చోదితః || 30

భాగీరథ్యాం క్షిపామ్యాశు నగరం నాగసాహ్వయమ్‌ |

ఇత్యుక్త్వా క్రోధరక్తాక్ష స్తాలాంకో7ధోముఖం హలమ్‌ | ప్రాకారవప్రే విన్యస్య చకర్ష ముసలాయుధః || 31

అదిక్షేపముచే గల్గిన కోపముచే మత్తుగొని ఘూర్ణించుచు లేచి నేలను మడమలం ద్రొక్కి తాటించెను. దాన నీ భూమి పగిలిపోయెను. పెద్దధ్వని దిక్కుల బిక్కటిల్ల హలి బాహువులంజరచి కనులెఱ్ఱవడ కనుబొమలుముడిపడి మొగము కుటిలము గాగ బలదేవుం డిట్లనియె - అహో! వట్టినీరసులు దురాత్ములైనవారి కేమిపొగరిది! మాపై కౌరవుల పెత్తనము కాల ప్రభావము. ఉగ్రసేను నానతి యనుల్లంఘనీయము (దాటగూడనిది) అని యనుకొనరే : ఆయనయాజ్ఞను దేవతలతో గూడ శచీపతి సధర్మముగ గైకొనునే. శచీప్రియునియాసుధర్మాసభను ఉగ్రసేనుడేవేళ నధిష్ఠించుచున్నాడు. ఛీ ఛీ! నూరుగురు మనుష్యుల యుచ్ఛిష్టమైన రాజాసనమునందు వీరికి సంతుష్టియట. పారిజాతతరుపుష్ప మంజరులను ఎవ్వని బంట్రౌతులయబలాజనముకొప్పులం దురుముకొందుఱో యట్టి యుగ్రసేనుడు గూడ వీరికి దొరగాడట. సమస్తసార్వభౌములకు నధినాథుడైన యుగ్రసేనుం డట్లుండుత! ఇప్పుడు ఉర్వినెల్ల నిష్కౌరవ మొనర్చి యా పురికే నేగెదను. కర్ణుని దుర్యోధను ద్రోణుని యిప్పుడ భీష్ముని బాహ్లికుని దుశ్శాసనాదులను భూరిశ్రవస్సును సోమదత్తుని శలుని భీముని అర్జునుని యాధిష్ఠిరునితో కవలను (నకుల సహదేవులను) మరియుంగల కౌరవులను సాశ్వరథకుంజరముగ హత మొనర్చెదను. ఆ మీద సాంబుని సభార్యకముగ జేకొని యాపురి కేగెదెను. ద్వారక కేగి యుగ్రసేనాది బంధువులం జూచెదను. లేదా! ఎల్ల కురువర్గముతో కౌరవులభారము హరింప దేవాధీశు ప్రేరణమున శీఘ్రముగ నాగసమను నా నగరమును భాగీరథిలోనికి విసరివై చెదను. అని యిట్లు కోపమున నెఱువువారిన చూవులతో దాలాంకుడుగ ప్రాకారవ్రప్రముస అధోముఖముగ నాగలి (క్రిందు ముఖముగ) గ్రుచ్చి లాగెను. అతట కౌరవులు గగ్గోలువడి యిట్లు గోలవెట్టిరి.

కౌరవా ఊచుః

రామరామ మహాబాహో క్షమ్యతాం క్షమ్యతాం త్వయా | ఉపసంహ్రియతాం కోపః ప్రసీద ముసలాయుధ || 32

ఏషసాంబః సపత్నీక స్తవ నిర్యాతితో బల | అవిజ్ఞాత ప్రభవాణాం క్షమ్యతా మపరాధినామ్‌ || 33

వ్యాస ఉవాచ

తతో నిర్వాతయామాసుః సాంబం పత్న్యాసమన్వితమ్‌ | నిష్క్రమ్య స్వపురీం తూర్ణం కౌరవా మునిసత్తమాః || 34

భీష్మ ద్రోణకృపాదీనాం ప్రణమ్య వదతాం ప్రియమ్‌ | క్షాంతమేవ మ యేత్యాహ బలో బలవతాం పరః || 35

ఆద్యా ప్యాఘార్ణితాకారం లక్ష్యతే తత్పురం ద్విజాః | ఏష ప్రభావో రామస్య బలశౌర్యవతో ద్విజాః || 36

తతస్తు కౌరవాః సౌంబం సంపూజ్య హలినా సహ | ప్రేషయామాసు రుద్వాహధనభార్యాసమన్వితమ్‌ || 37

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే శ్రీకృష్ణచరితే బలదేవ మహాత్మ్యనిరూపణం నామ అష్టాధిక ద్విశతతమో7ధ్యాయః

రామ! రామ! మహావీర! క్షమింపు క్షమింపుము. కోపము నుపసంహరింపుము. ప్రసన్నుడవగుము! ఇడుగో సాంబుడు పత్నితో నిదె వెలువరింపబడినాడు : నీ ప్రభావ మెఱుగని యపరాధులను క్షమింపుము. అని కౌరవులు త్వరగ దమపురమున కేగి భార్యతో సాంబుని విడిచిరి. బలవంతులకెల్ల బలవంతుడగు బలుడు భీష్మ ద్రోణ కృపా చార్యాదులకు ప్రణామములు సేసి శాంతుడనైతినని పలికెను. ఇప్పటికిని ద్వారక పెల్లగిలినది పెల్లగిలినట్లు కనబడు చున్నది. ఇది బలశౌర్యశాలి బలరాముని ప్రభావము. ఓ ద్విజులార! అవ్వల కౌరవుల సాంబుని హరిసహితంబుగ బూజించి పెండ్లికానుకలు సారె చీరలు వెట్టి భార్యతో ద్వారకకు బంపిరి.

ఇది శ్రీ బ్రహ్మపురాణమున శ్రీకృష్ణచరిత్రమందు బలరామ ప్రభావమును రెండువందల యెనిమిదవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters