Brahmapuranamu    Chapters   

ద్వితీయోధ్యాయః

సృష్టికథనము

లోమర్షణ ఉవాచ-----

స సృష్ట్వాతు ప్రజాస్త్వేవ మాపవో వై ప్రజాపతిః | లేఖే వై పురుషః పత్నీం శతరూపా మయోనిజామ్‌ || 1

ఆపవస్య మహిమ్నా తు దివ మావృత్య తిష్ఠతః | ధర్మేణౖవ మునిశ్రేష్ఠాః శతరూపా వ్యజాయత || 2

సాతు వర్షాయుతం తప్త్వా తపః పరమదుశ్చరమ్‌ | భర్తారం దీప్తతపనం పురుషం ప్రత్యపద్యత || 3

స వై స్వాయంభువో విప్రాః పురుషో మను రుచ్యతే | తసై#్యకసప్తతియుగం మన్వంతర మిహోచ్యతే || 4

ఇట్లు ప్రజాపతి ప్రజలను సృజించి అయోనిజయైన శతరూపను బత్నిగ బడసెమ. ద్యులోకము నావరించి యుండెడి ఆపవునియొక్క మహిమచే ధర్మముచే శతరూప జనించినది, ఆమె పదివేలేండ్లు దుశ్చరతపమ్ముజేసి తపోదీప్తుని స్వాయంభువమనువును భర్తనుగ బొందెను. డెబ్బదియొక్క మహాయుగములా మనువుయొక్క ఆయుర్దాయము. అదే మన్వంతర మనబడును. (1-4)

వైరాజాత్పురుషా ద్వీరం శతరూపా వ్యజాయత | ప్రియవ్రతోత్తానపాదౌ వీరా త్కామ్యా వ్యజాయత || 5

కామ్యానామ సుతా శ్రేష్ఠా కర్దమస్య ప్రజాపతేః | కామ్యాపుత్రాస్తు చత్వారః సమ్రా ట్కుక్షిర్విరాట్ప్రభుః || 6

ఉత్తానపాదం జగ్రాహ పుత్రమత్రిః ప్రజాపతిః | ఉత్తానపాదా చ్చతురః సూనృతా సుషువే సుతాన్‌ || 7

ధర్మస్య కన్యా సుశ్రోణీ సూనృతా నామ విశ్రుతా | ఉత్పన్నా వాజిమేథేన ధ్రువస్య జననీ శుభా || 8

ధ్రువం చ కీర్తిమంతం చ ఆయుష్మంతం వసుం తథా | ఉత్తానపాదోజనయత్సూనృతాయాం ప్రజాపతిః || 9

ధ్రువో వర్షసహస్రాణి త్రీణి దివ్యాని భోద్విజాః | తపస్తేసే మహాభాగః ప్రార్థయ న్సుమహద్యశః || 10

ఆ పైరాజుని వలన శతరూప వీరుడను కుమారునిగనెను. ప్రియవ్రత-ఉత్తానపాదులనుగూడ గనెను వీరునికి కామ్యజనించెను. కామ్యయొక్క కుమారులు నల్వురు సమ్రాట్టు కుక్షి విరాట్టు ప్రభువు అనువారు, ఉత్తాసపాదుని వలన సూసృత నల్వురు కొడుకులంగాంచెను. ఆమె ధర్ముని కూతురు. సూనృత (సునీత) అశ్వమేధము చేయుటచే జనించినది. ఆమె ధ్రువుని తల్లి. ఉత్తానపాదునికి ధ్రువుడు కీర్తిమంతుడు ఆయుష్మంతుడు వసువు అను నల్వురు కుమారులు సూనృతయందు గల్గిరి. ధ్రువుడు గొప్పకీర్తి కావలెననికోరి మూడువేల దివ్య సంవత్సరములు తప మాచరించెను. (5-10)

అహోస్య తపసోవీర్యమహో శ్రుత మహోద్భుతమ్‌| య మద్య పురతఃకృత్వాధ్రవంస ప్తర్షయః స్థితాః || 13

తస్మాచ్ల్ఛిష్టిం చ భవ్యం చ ధ్రువా చ్ఛంభుర్వ్యజాయత | శ్లిష్టేరాధత్తసుచ్ఛాయపంచపుత్రా నకల్మషాన్‌ || 14

రిపుం రిపుంజయం వీరం వృకలం వృకతేజసమ్‌ | రిపో రాధత్త బృహతీ చక్షుషం సర్వతేజసమ్‌ || 15

అజీజన త్సుష్కరిణ్యాం వైరిణ్యాం చాక్షుషం మనుమ్‌ | ప్రజాపతే రాత్మజాయాం వీరణస్య మహాత్మనః || 16

ఆతనికబ్జయోని ప్రీతుcడై తన స్థాసమునకు సమానమైన స్థానము నిచ్చెను. అది సప్తర్షులపురోభాగమందు అచలమయి (ధ్రువమయి) వెలుగుచున్నది. ఆతని అభిమానము సమృద్ధిని మహిమను గని దేవాసుర గురుండు శుక్రు డీక్రింది శ్లోకమును జెప్పెను. ''ఆహా ఈ ధ్రువునితపస్సు-వీర్యము-శ్రుతము (పాండిత్యము) అద్భుతము. ఈతని ముందిడుకొని సప్తర్షులు విలసించుచున్నారు. అని. ధ్రువుని వలన శంభువను నామె శ్లిష్టి భవ్యుడు నను కుమారుల గనెను. శ్లిష్టి వలన సుచ్ఛాయ యను నామె రిపువు-రిపుంజయుడు-వీరుడు-వృకలుడు-వృకతేజనుడు నను నైదుగురు తనయులం గాంచెను. రిపువువలన బృహతి యను నంగన సర్వ తేజశ్శాలియైన చక్షుస్సును గనెను. అతడు వీరణుడును ప్రజాపతి యొక్క కూతురగు పైరణి యందు చాక్షుషమునువుం గాంచెను. (11-16)

మనో రజాయంత దశ నడ్వలాయాం మహౌజసః | కన్యాయాం మునిశార్దూల వై రాజస్య ప్రజాపతేః || 17

కుత్సః పురుః శతద్యుమ్న స్తపస్వీ సత్యవా క్కవిః | అగ్నిష్టు దతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చేతి తే నవ || 81

అభిమన్యుశ్చ దశమో నడ్వలాయాం మహౌజసః | పురో రజనయత్పుత్రా న్ష డాగ్నేయీ మహాప్రభాన్‌ || 19

అంగంసుమనసంస్వాతిం క్రతుమంగిరసం గయమ్‌ | అంగాత్సునీథా పత్యం వై వేన మేకం వ్యజాయత || 20

అపచారేణ వేనస్య ప్రకోపః సుమహానభూత్‌ | ప్రజార్థ మృషయో యస్య మమంథు ర్దక్షిణం కరమ్‌ || 21

వేనస్య మథితే పాణౌ సంభభూవ మహా న్నృపః | తందృష్ట్వామునయః ప్రాహురేష వై ముదితాః ప్రజాః || 22

కరిష్యతి మహాతేజా యశశ్చ ప్రాప్స్యతే మహత్‌ | స ధన్వీ కవచీ జాతో జ్వలజ్జ్వలన సంనిభః|| 23

అతనికి నడ్వలయను నామెయందు పదిమంది పుట్టిరి. నడ్వల పైరాజప్రజాపతి కుమార్తె ఆపదిమంది కుత్సుడు-పురుషుడు శతద్యుమ్నుడు-తపస్వి-సత్యవాక్కు-కవి-అగ్నిష్టుత్తు-అతిరాత్రుడు-అభిమన్యుడు సనువారు, పురుని వలన ఆగ్నేయియనునామె అంగుడు-సుమనసుడు-ఖ్యాతి-క్రతువు-అంగిరసుడు-గయుడునను నాఱ్వురు కుమారులం గనెను. అంగునివలన సునీథుని కుమారి వేనుడను కొడుకుం గాంచెను. వాడు చేసిన యపచారముచే ఋషులు కోపోద్రిక్తులైరి. వానిసంతాసముసకై వాని కుడి హస్తమును మథించిరి. అపుడు ఒక మహానుభావుడుదయించెను. మునులాతనిం గని యితడు ప్రజారంజకుడుగ ననిరి. ఆ బాలుడు ధనువూని కవచముతొడిగికొని జ్వలించు నగ్నివోలె నుదయించెను. అతడెపృథువు. ఈనేల నేలినవాడు. (అతని పేర నిల పృథివి నాబడెను.) (17-23)

పృథుర్వైన్య స్తథా చేమాం రరక్ష క్షత్ర పూర్వజః | రాజసూయాభిషిక్తానా మాద్యః స వసుధాధిపః || 24

తస్మాచ్చైవ సముత్పన్నౌ నిపుణౌ సూత మాగధౌ | తేనేయం గౌర్ముని శ్రేష్ఠా దుగ్ధా సస్యాని భూభృతా|| 25

ప్రజానాం వృత్తికామేన దేవైః సర్షిగణౖ స్సహ | పితృభి ర్దానవైశ్చైవ గంధర్వై రప్సరోగణౖః || 26

సర్పైః పుణ్యజనైశ్చైవ వీరుద్భిః పర్వతై స్తథా | తేషు తేషు చ పాత్రేషు దుహ్యమానా వసుంధరా || 27

ప్రాణా ద్యథేప్సితం క్షీరం తేన ప్రాణా నధారయన్‌ | పృథోస్తు పుత్రౌ ధర్మజ్ఞౌ యజ్ఞాం తేంతర్థిపాతినౌ|| 28

శిఖండినా హవిర్ధాన మంతర్ధానా ద్వ్యజాయత | హవిర్థానాత్‌ షడాగ్రేయీ ధిషణా జనయ త్సుతాన్‌ || 29

ప్రాచీన బర్హిషం శుక్రం గయం కృష్ణం వ్రజాజినౌ | ప్రాచీన బర్హిర్భగవాన్మహా నాసీత్ప్రజాపతిః || 30

హవిర్ధానా న్మునిశ్రేష్ఠా యేన సంవర్ధితాః ప్రజాః | ప్రాచీనబర్హి ర్భగవాన్‌ పృథివీతలచారిణీః|| 31

సముద్రతనయాయాంతు కృతదారో భవత్ప్రభుః | మహతస్తపసః పారే సవర్ణాయాం ప్రజాపతిః || 32

సవర్ణా ధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిషః | సర్వాన్‌ ప్రచేతసోనామ ధనుదర్వేదస్య పారగాన్‌ || 33

అపృథగ్ధర్మాచరణా స్తేతప్యంత మహత్తపః | దశవర్షసహస్రాణి సముద్రసలిలేశయాః || 34

తపశ్చర్యత్సు పృథివీం ప్రపచేతస్సు మహీరుహాః | అరక్ష్యమాణా మావవ్రు ర్బభూవాథ ప్రజాక్షయః || 35

నాశక న్మారుతో వాతుం వృతం ఖ మభవ ద్ద్రుమైః | దశవర్షసహస్రాణి న శేకు శ్చేష్టితుం ప్రజాః || 36

తదుపశ్రుత్య తపసా యుక్తాః సర్వేప్రచేతనః | ముఖేభ్యో వాయు మగ్నించ ససృజు ర్జాతమన్యవః || 37

ఉన్మూలా నథ వృక్షాంస్తు కృత్వా వాయు రశోషయత్‌ | తానగ్ని రదహ ద్ఘోర ఏవ మాసీ ద్ద్రుమక్షయః || 38

ద్రుమక్షయ మథోబుద్ధ్వా కించి చ్చిష్టేషు శాఖిషు | ఉపగమ్యాబ్రవీ దేతాం స్తదా సోమః ప్రజావతీన్‌ || 39

కోపం యచ్ఛత రాజానః సర్వే ప్రాచీనబర్హిషః వృక్షశూన్యా కృతా పృధ్వీ శామ్యేతా మగ్నిమారుతౌ || 40

రత్నభూతా చ కన్యేయం వృక్షాణాం వరవర్ణినీ | భవిష్యం జానతా తాత ధృతాగర్భేణ వైమయా || 41

మారిషా నామ నామ్నైనా వృక్షాణా మితి నిర్మితా | భార్యా వోస్తు మహాభాగాః సోమవంశవివర్థినీ || 42

యుష్మాకం తేజసోర్థేన మమ చార్ధేన తేజసః | అస్యా ముత్పత్స్యతే విద్వా న్దక్షోనామ ప్రజాపతిః || 43

న ఇమాం దగ్ధభూయిష్ఠాం యుష్మ త్తేజోమయేన వై | అగ్నినా గ్నిసమో భూయః ప్రజాః సంవర్థయిష్యతి|| 44

తతః సోమస్య వచనా జ్జగృహుస్తే ప్రచేతసః | సంహృత్య కోపం వృక్షేభ్యః పత్నీం ధర్మేణ మారిషామ్‌ || 45

దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః | దక్షో జిజ్ఞే మహాతేజాః సోమస్యాంశేన భో ద్విజాః || 46

ఆ వసుధాధీశుడు రాజసూయయాగాభిషేకము నందిన రాజులకెల్ల మొట్టమొదటివాడు. అతనికి నిపుణులయిన సూతమాగధులిర్వురు జనించిరి. అతనే భూమిని గోవు నొనరించి సస్యరూపమయిన క్షీరమును బిదికిన మహానుభావుడు. అట్లు పిదుకబడిన గోవు (భూమి) ప్రజాజీవనమునకు పాలు చేపినది. దేవతలు ఋషులు పితృదేవతలు దానవులు అప్సరసలు నాగులు (సర్పములు) పుణ్యజనులు (రాక్షసులు) వీరుధులు పర్వతులు తమతమ కాయాపాత్రములందు పిదుకబడిన క్షీరమును ద్రావి ప్రాణధారణ మొనరించుకొనిరి. వసుంధర వారివారికి పాలిచ్చెను. వృథుని కుమారులు ధర్మజ్ఞులు అంతర్థి పాతి యనువారు గల్గిరి. అంతర్థానునివలన శిఖండిని యను నామె హవిర్ధానుడను కొడుకుం గాంచె. హవిర్ధానునివలన ఆగ్నేయి యార్వురు కుమారులం గాంచెను. వారు ప్రాచీన బర్హి-శుక్రుడు-గయుడు-కృష్ణుడు-వ్రజుడు-అజినుడు ననువారు. ప్రాచీనబర్హి భగవానుడు మహానుభావుడు ప్రజాపతి యయ్యెను. హవిర్ధానుని కుమారుడు ప్రాచీనబర్హి యేలు నేలలో నీటిలో దర్భలు ప్రాచీనాగ్రములుగానే మొలచెనట. (అందుచే నాతడు ప్రాచీన బర్హియయ్యె.). ఆప్రభువు సముద్రుని కూతురు సవర్ణ యను నామెం బరిణయమాడెను. తీవ్రతపస్సుచేసిన మీదటనే యతడు పెండ్లిచేసికొని సవర్ణ యందు పదిమంది కుమారులను ధనుర్వేదపారగులను గాంచెను. ప్రాచేతసులగు వారందరు నొక్కటియై తపమాచరించిరి. ఏక రీతిగ ధర్మము నిర్వహించిరి. పదివేలేండ్లు సముద్రజలములందుండి తీవ్రతపము సేసిన మహానుభావులు వారు. వారు తపము సేయు తఱి-రక్షణలేనితన మహావృక్షములు (అంగుళ##మెడములేకుండ) మొలచి యీ పృథివిని కప్పివేసినవి. అందువలన ప్రజాక్షయ మేర్పడెను. వాయువు వీచరాదయ్యె. వాయుపధము చెట్లచే నిండి నిబిడీకృతమయ్యె. పదివేలేండ్లు ప్రజలు కదలను మెదలను వశముగాదయ్యె. అది విని తపస్సులు ప్రాచేతనులు కోపించి మొగములనుండి వాయువును అగ్నిని జనింపజేసిరి. వాయువు తరువులనెల్ల మొదలిటికి బెల్లగించి బడద్రోసి తడియార్చివైచెను. వాని నగ్ని దహించెను. ఇట్లు సర్వద్రుమ నాశనమయ్యెను. కొలదిగ మిగిలినతరువులం గని సోముడేతెంచి వారింగని యిట్లనియె. రాజులారా ! కోపము నాపుడు. పృథివియెల్ల వృక్షశూన్యయయ్యె. అనలానిలములను శమింపజేయుడు. ఈ వృక్షములు గన్న కన్యారత్నమిదిగో పరమసుందరి-భవిష్యవృత్తాంత మెరిగి నేనీమెంగడుపులో దాచితిని. ఇది మారిషయను పేరుగలది. ఈమె మీకు భార్య యగుగాక ! సోమవంశవర్ధని ఈమె. మీ తేజస్సులు సగము నా తేజస్సులో సగము వహించి యీమె యందు దక్షుడను ప్రజాపతి ఉదయింపగలడు. మీ తేజముచే దగ్ధమయిన యీ పృథివిని అగ్నికల్పుడగు నాతడు చల్లార్చి ప్రజలను వృద్ధినందింపగలడు. ప్రచేతసులా సోముని పలుకులాచరించి కోపముపసంహరించి వృక్షముల నుండి మారిషయను నాకన్యం గైకొనిరి. ఆ ప్రచేతసులు పదిమందివలన మారిషయందు సోమాంశమున మహాతేజస్వి దక్షుడుదయించెను. (34-46)

అచరాంశ్చ చరాంశ్చైవ ద్విపదోథ చతుష్పదః | స సృష్ట్యా మనసా దక్షః పశ్చా దసృజత స్త్రియః || 47

దదౌ దశ స ధర్మాయ కశ్యపాయ త్రయోదశ | శిష్టాః సోమాయ రాజ్ఞేచ నక్షత్రాభ్యా దదౌ ప్రభుః || 48

తాసు దేవాః ఖగాః గావో నాగా దితిజ దానవాః | గంధ ర్వాప్సర శ్చైవ జజ్జిరేన్యాశ్చ జాతయః || 49

తతః ప్రభృతి విప్రేంద్రాః ప్రజా మైథునసంభవాః | సంకల్పాద్దర్శనా త్స్పర్శాత్పూర్వేషాం ప్రోచ్యతే ప్రజా|| 50

మునయ ఊచుః-

దేవానాం దానవానాం చ గంధర్వోరగ రక్షసామ్‌ | సంభవస్తు శ్రుతో స్మాభి ర్దక్షస్యచ మహాత్మనః || 51

అంగుష్ఠా ద్బ్రహ్మణో జజ్ఞే దక్షః కిల శుభవ్రతః | వామాంగుష్ఠా త్తదా చైవం తస్య పత్నీ వ్యజాయత || 52

కథం ప్రాచేతసత్వం న పున ర్లేభే మహాతపాః | ఏతం నః సంశయం సూత వ్యాఖ్యాతుం త్వ మి హార్హసి || 53

దౌహిత్ర శ్చైవ సోమస్య కథం శ్వశురతాం గతః|| 54

లోమహర్షణ ఉవాచ-

ఉత్పత్తిశ్బ నిరోధశ్చ నిత్యం భూతేషు భో ద్విజాః | ఋషయోత్ర సముహ్యంతి విద్యావంతశ్చ యే జనాః || 55

యుగేయుగే భవంత్యేతే పున ర్దక్షాదయో నృపాః | పునశ్చైవ నిరుధ్యంతే విద్వాం స్తత్ర నముహ్యతి || 56

జ్యైష్ఠ్యం కానిష్ఠ్య మప్యేషాం పూర్వం నా೭೭సీ ద్ద్విజోత్తమాః | తవ ఏవ గరీయో భూత్ప్రభావ శ్చైవ కారణమ్‌ || 57

ఇమాం విసృష్టిం దక్షస్య యో విద్యాత్సచరాచరమ్‌ | ప్రజావా నాయురుత్తీర్ణః సర్వలోకే మహీయతే || 58

ఇతి శ్రీ మహాపురాణ బ్రాహ్మే సృష్టికథనం నామ ద్వితీయోధ్యాయః||

అతడు చరాచరభూతములను ద్విపాచ్చతుష్పాదపశువులను మననుచేతనే సృజించి యామీదట స్త్రీసంతానమునం గనెను. అందు ధర్మునికి పదిమందిని, కశ్యపునకు ఐదుమువ్వురనిచ్చి తక్కినవారిని నక్షత్రనామధారిణుల నిర్వదియేడ్గురను సోముని కొసంగెను. వారియందు దేవతలు-పక్షులు-గోవులు-నాగులు-దైత్యులు. గంధర్వులు-అప్సరసలు మఱి పెక్కుజాతులు జనించెను. అది మొదలు మైథునసంభవులయిన ప్రజలు పుట్టనారంభించిరి. పూర్వము సంకల్పమాత్రమున-దర్శనమాత్రము-స్పర్శమాత్రమున సృష్టి యయ్యెడజరుగుచుండెను.

మునులిట్లనిరి. . .

సూత! శుభవ్రతియైన దక్షుడు బ్రహ్మయొక్క అంగుష్ఠమునుండి కదా జనించెనని వినబడును. ఆయన బొటనవ్రేలినుండి కదా | యీయన భార్య జనించెను. అట్టితఱి దక్షుడు ప్రాచేతసులకు జనించెనంటిరే! ఇది సంశయము వివరింప నీవ యర్హుడవు. సోముని కూతురుబిడ్డ వీరి మామ యెట్లయ్యె అన-

లోమహర్షణు డిట్లనియె. . .

విప్రులార! భూతములందు జరుగు పుట్టువు నిరోధమును గురించి తెలియక మునులే తికమకపడుచుందురు. విద్యావంతులకే ఇది దురవగాహము. ఈ దక్షాదులు రాజులు యుగయుగమందు తిరిగి పొడము చుందురు. తిరిగి చాటగుచుందురు. విద్వాంసుడేని యక్కడ పొరబడును. వీరిలో జ్యేష్ఠకనిష్ఠ భావములు మున్ను లేకుండెను. తపస్సు-ప్రభావమును బట్టియే చిన్న పెద్ద పరిగణనము. దక్షుని యీ విసృష్టి నెఱింగిన యాతడు సంతానవతుడయి, పూర్ణాయువై స్వర్గమందు వసించును. (47-58)

ఇది శ్రీ బ్రహ్మమహాపురాణమునందు సృష్టికథనమను ద్వితీయాధ్యాయము సమాప్తము.

Brahmapuranamu    Chapters