Brahmapuranamu    Chapters   

అథ సప్తనవత్యధికశతతమో7ధ్యాయః

గోకులేబలప్రత్యాగమనవర్ణనమ్‌

వ్యాస ఉవాచ

ఇత్థంస్తుత స్తదా తేన ముచుకుందేన ధీమతా | ప్రాహేశః సర్వభూతానా మానాదినిధనో హారిః || 1

యధాభివాంఛితాంల్లోకాన్‌ దివ్యాన్‌ గచ్ఛనరేశ్వర | అవ్యాహత పరైశ్వర్యో మత్ప్రసాదోపబృంహితః || 2

భుక్తాదివ్యాన్‌ మహాభోగాన్‌ భవిష్యసి మహాకులే | జాతిస్మరో మత్ప్రసాదా త్తతో మోక్షమవాప్స్యసి || 3

ఇత్యుక్తః ప్రణిపత్యేశం జగతామచ్యుతంనృపః | గుహాముఖాద్ధి ష్క్రాంతోద దృశే సో7ల్పకాన్నరాన్‌ || 4

తతః కలియుగం జ్ఞాత్వాప్రాప్తంతప్తుంతతో నృపః | నరనారాయణస్థానం ప్రయ¸° గంధమాదనమ్‌ || 5

వ్యాసులిట్లనిరి.

ఇట్లు ముచుకుందునిచే బొగడబడి సర్వభూతేశ్వరుండగు హరి నీకోరిన దివ్యలోకముల నందుమని యారాజునకు దెల్పెను. నా సాకతము అవ్యాహతైశ్వర్యముతో దివ్యభోగము లచట ననుభవించి పూర్వజన్మ స్మృతి వడసి యుత్తమ కులమందు బుట్టి యవ్వల ముక్తి నందుదువు. అన నారాజు పరమేశ్వరునకు మ్రొక్కి గుహనుండి వెలువడి వచ్చి వెలినున్న అల్పాల్ప శరీరులను నరులం జూచును. దానిచే కలియుగము వచ్చెనని గ్రహించి నరనారాయణస్థానమైన గంధమాదనమున (బదరికాశ్రమమున) తపముసేయ నేగెను.

కృష్ణో7పి ఘాతయిత్వా7రిముపాయేనహితద్బలమ్‌ | జగ్రాహమథురామేత్య హస్త్యశ్వస్యందనోజ్జ్వలమ్‌ || 6

ఆనీయ చోగ్రసేనాయద్వారవత్యాంన్యవేదయత్‌ | పరాభిభవనిశ్శంకం బభూవ చ యదోః కులమ్‌ || 7

బలదేవో7పి విప్రేంద్రాః ప్రశాంతాఖిల విగ్రహః | జ్ఞాతి సందర్శనోత్కంఠః స్రయ¸° నందగోకులమ్‌ || 8

తతో గోపాశ్చ గోప్యశ్చ యథా పూర్వమమిత్రజిత్‌ | తథైవా భ్యవసత్ప్రేవ్ణూ మహుమాన పురస్సరమ్‌ || 9

కైశ్చాపి సంపరిష్వక్తః కాంశ్చిత్స పరిషష్వజె | హాసంచక్రే సమంకైశ్చిద్గోప గోపీజనై స్తథా || 10

ప్రియాణ్యనేకాన్యవదన్‌ గోపాస్తత్రహలాయుధమ్‌ | గోప్యశ్చ ప్రేమ ముదితాః ప్రోచుః సేర్ష్యమథాపరాః || 11

కృష్ణుడు నుపాయముచే శత్రువును గాలయవనుని గూర్చి వాని సేననెల్ల గొనివచ్చి ద్వారకయం దుగ్రసేనునికి సమర్పించెను. అవ్వల యదుకులము శత్రుభయశంక వోయి స్వస్థత నందెను. బలరాముడును యుద్ధములెల్ల శాంతింప తన జ్ఞాతులను దర్శించు వేడుకతో నంద గోకులమున కేగెను. గోపికలు గోపకులును ముందటియట్ల సబహుమానముగ బ్రేమతో గలిసికొని యచ్చట నుండెను. కొందఱు వచ్చి కౌగిలింప గౌగలించుకొనెను. కొందఱితో నవ్వెను. కొందఱితో ముచ్చటలాడెను. వారు నెన్నో ప్రియ వాక్యములను బలరాముం బలుకరించిరి. కొందఱు గోపికలు ప్రేమతో కొందరీర్ష్యతోడను గూడ ప్రశ్నసేసిరి.

గోప్యః పప్రచ్ఛురపరా నాగరీజనవల్లభః కచ్చిదాస్తే సుఖం కృష్ణశ్చలత్‌ ప్రేమరసాకులః || 12

అస్మచ్చేష్టోపహసనం నకచ్చిత్‌ పురయోషితామ్‌ | సౌభాగ్యమాన మధికంకరోతిక్షణ సౌహృదః || 13

కచ్చిత్‌ స్మరతినఃకృష్ణోగీతానుగమనం కృతమ్‌ | అప్యసౌమాతరం ద్రష్టుం సకృదప్యాగమిష్యతి || 14

ఆథవాకింతదాలాపైః క్రియంతామపరాః కథాః | యదస్మాభిర్వినాతేన వినా7స్మాకం భవిష్యతి || 15

పితామాతా తథాభ్రాతా భర్తాబంధుజనశ్చకః | నత్యక్తస్తత్కృతే7స్మాభిర కృతజ్ఞస్తతోహినః || 16

తథా7పికచ్చిదాత్మీయ మిహా7గమన సంశ్రయమ్‌ | కరోతికృష్ణో వక్తవ్యంభవతా వచనామృతమ్‌ || 17

దామోదరో7సౌగోవిందః పురస్త్రీసక్తమానసః | అపేతిప్రీతరస్మాసు దుర్దర్శః ప్రతిభాతినః || 18

నాగరిక కామినులకు ప్రాణమైనవాడు నిలకడలేని వలపు తీపులను దొలకు కృష్ణుడు సుఖముగ నున్నాడుగదా! ఆ క్షణమాత్రసౌహృదుడు (నిమిషమాత్రము వట్టి మెఱపువలె మెరమిచ్చులు గొలుపువాడు) నైన చెలిమిగల హరి వారికడ మాచైదముల యెడ బరిహాసము వారి సౌభాగ్య గర్వాతిశయము చేయుటలేదుగదా! బృందావనమున వేణుగానమును విని అనుసరించి వచ్చిన మారాకను తలంచుచున్నాడా? కన్నతల్లిని జూడ నొకమాటైన నితడు ఇటకు వచ్చునా! ఐనను వాని ప్రసంగము లెందుకు? వేరుమాటలు చెప్పుకొందుము, మనము లేకుండ ఆతనికి, అతడు లేకుండ మనకు సాగదు. అతనికై మేము తండ్రి, తల్లి సోదరుడు భర్త బంధుజనము అను వీరిలో వదలిపెట్టని వారెవరు? అనగా తనకొఱ కిందరను గాదని వచ్చినారము. అట్టి మమ్ములను వదలియున్న యాతడు కృతఘ్నుడు గదా! ఐన నటకు తిరిగి తాను రాదగిన ఆత్మీకమగు నేదో వస్తువు నుద్దేశించి యుండును. లేదా అట్టివారెవరికో తన సందేశమిచ్చి యుండవలెను. అతని వచనామృతము నీవు తెలుపదగును. ఈ దామోదరుడు గోవిందుడు పురస్త్రీలపై నంటిన మనస్సుచే నాయెడల ప్రీతి తొలగినాడు. ఇక మాకు కనపడడని తోచుచున్నది.

వ్యాస ఉవాచ

ఆమంత్రితః స కృష్ణేతి పునర్దామోదరేతిచ | జహసుః సుస్వరం గోప్యోహరిణా కృష్టచేతసః || 19

సందేశః సౌమ్యమధురైః ప్రేమగర్భైరగర్వితైః | రామేణా7శ్వాసితా గోప్యః కృష్ణస్యాతి మధుస్వరైః || 20

గోపైశ్చ పూర్వవద్రామః పరిహాసమనోహరై ః | కథాశ్చకార ప్రేవ్ణూచ సహ తైర్వ్రజ భూమిషు || 21

ఇతి శ్రీబ్రహ్మపురాణ గోకులే బలప్రత్యా గమన వర్ణనం నామ సప్తనవత్యధికశతతమో7ధ్యాయః

ఇట్లు గోపికలు బలరామునితో పలుకుచునే మైమరచి కృష్ణా దామోదరా యని సుస్వరముగ బిలుచుచు గలకలనవ్విరి. అవ్వల కృష్ణుని సందేశమును మంచిగ మధురముగ నిండుప్రేమ దొలుక స్వాతిశయ మించుకయు గనపడకుండ మధురస్వరసరసముగ కృష్ణుడు పంపిన సందేశము వినిపించి బలకామునిచే నా గొల్లభామలోదార్చబడిరి. అవ్వల బలభద్రుడు మునుపటియట్ల పరిహాస సుందరులగు గోపకులతో నా వ్రేపల్లెయందు ప్రేమపూర్వకముగా సంభాషణములు నెఱపెను.

ఇది బ్రహ్మపురాణమందు బలరాముడు గోకులమునకు తిరిగి వచ్చుట యను నూట తొంబది యేడవ అధ్యాయము.

Brahmapuranamu    Chapters