Brahmapuranamu    Chapters   

అథషణ్ణవత్యధికశతతమో7ధ్యాయ

కాలయవనోపాఖ్యానమ్‌

గార్గ్యం గోష్ఠే ద్విజం శ్యాలః షండ ఇత్యుక్తవాన్‌ ద్విజాః | యదూనాంసంనిధౌ సర్వేజహసుర్యాదవా స్తదా || 1

తతఃకోపసమావిష్టో దక్షిణాపథమేత్యసః | సుతమిచ్ఛంస్తపస్తేపే యదుచక్రభయావహమ్‌ || 2

ఆరాధయన్మహాదేవం సో7యశ్చూర్ణ మభక్షయత్‌ | దదౌవరంచ తుష్టో7సౌ వర్షే ద్వాదశ##కే హరః || 3

సంభావయామాస స తం యవనేశోహ్యనాత్మజమ్‌ | తద్యోపిత్సంగమా చ్ఛాస్యపుత్రో7భూద్రవిసప్రభః || 4

తంకాలయవనంనామ రాజ్యేస్వే యవనేశ్వరః | అభిషిచ్య వనంయాతో వజ్రాగ్రకఠినోరసమ్‌ || 5

కాలయవనోపాఖ్యానము

గోష్ఠమందు గార్గ్యుని బావమరదియతనని (పురోహితుని) యదువులదరి సన్నిధియందు షండుడని (నపుంసకుడని) తూలనాడెను. యాదవులందఱు నవ్విరి.అంతనతడు కినుకగొని దక్షిణాపథమునకు వచ్చి యదువంశ భయంకరుడగు పుత్రునింగోరి తపస్సుచేసెను. ఆతడు శివునారాధించుచు లోహచూర్ణ మాత్రముదిని యుండెను. హరుడాతనికి సంతుష్టుడై పండ్రెండవ సంవత్సరమున వరమిచ్చెను. పుత్రసంతతిలేని యాతనిని యవనాధీశ్వరుడు గౌరవించెను. వానియంగనతో నతడు సంగమించినంతట భ్రమర (తుమ్మెద) సమాన ప్రభగల కొడుకు పుట్టెను. కాలయవనుడను పేరుగలవానిని వజ్రకఠినమైన రొమ్ముగల వానిని తనరాజ్యమున పట్టాభిషేకించి యడవికింబోయెను.

సతువీర్యమదోన్మత్తః పృథివ్యాం బలినో నృపాన్‌ | పప్రచ్ఛనారదశ్చాసై#్మకథయామాపయాదవాన్‌ || 6

వ్లుెచ్ఛకోటి సహస్రాణాం సహసై#్రఃసో7పి సంవృతః | గజాశ్వరథసంపన్నైశ్చకార పరమోద్యమమ్‌ || 7

ప్రయ¸°చా7తపచ్ఛన్నైః ప్రయాణౖః స దినేదినే | యాదవాన్‌ ప్రతిసామర్షోమునయో మథురాంపురీమ్‌ || 8

కృష్ణో7పి చింత యామాస క్షపితం యాదవంబలమ్‌ | యవనేన సమాలోక్య మాగధః సంప్రయాస్యతి || 9

మాగధస్యబలం క్షీణం సకాలయవనోబలీ | హంతా తదిదమాయాతం యదూనాం వ్యసనంద్విధా || 10

తస్మాద్దుర్గం కరిష్యామి యదూనామతిదుర్జయమ్‌ | స్త్రియో7పి యత్రయుధ్యేయుః కింపునర్వృష్ణి యాదవాః || 11

మయిమత్తే ప్రమత్తే వాసుప్తే ప్రవసితే7పివా|యాదవాభిభవం దృష్ట్వామాకుర్యుర్వైరిణో7ధికమ్‌ || 12

ఇతి సంచింత్య గోవిందో యోజనాని మహోదధిమ్‌ | యయాచేద్వాదశ పురీంద్వారకాంతత్ర నిర్మమే|| 13

మహోద్యానాం మహావప్రాంతడాగశత శోభితామ్‌ | ప్రాకారశతసంబాధా మింద్రస్యేవామరావతీమ్‌ || 14

మథురావాసినంలోకం తత్రానీయ జనార్ధనః | ఆసన్నేకాలయవనే మథురాంచ స్వయంయ¸° || 15

బహిరావాసితే సైన్యే మథురాయా నిరాయుధః | నిర్జగామ సగోవిందో దదర్శయవనశ్చతమ్‌ || 16

సజ్ఞాత్వా వాసుదేవంతం బహుప్రహరణోనృపః | అనుయాతో మహాయోగీచేతోభిః ప్రాప్యతే న యః || 17

తేనానుయాతః కృష్ణో7పి ప్రవివేశ మహాగుహామ్‌ | యత్రశేతే మహావీర్యోముచుకుందో నరేశ్వరః || 18

సో7పిప్రవిష్టో యవనో దృష్ట్వా శయ్యాగతంనరమ్‌ | పాదేనతాడయామాస కృష్ణంమత్వా స దుర్మతిః || 19

దృష్టమాత్రశ్చతే నాసౌజజ్వాల యవనోగ్నినా | తత్‌ క్రోథజేనమునయోభస్మీభూతశ్చతత్‌ క్షణాత్‌ || 20

సహిదేవాసురేయుద్ధేగత్వాజిత్వా మహాసురాన్‌ | నిద్రార్తః సుమహాకాలం నిద్రాంవవ్రేవరంసురాన్‌ || 21

ప్రోక్తశ్చదేవైః సంసుప్తం యస్త్వాముత్థాపయిష్యతి | దేహజేనాగ్నినా సద్యఃసతుభస్యీ భవిష్యతి || 22

ఆ కాలయవనుడు బలమున మదమెక్కి యవనింగల బలవంతులు రాజులెవ్వడనియడుగ నారదుండు యాదవులని తెల్పెను. వాడు కోటివేలమంది వ్లుెచ్ఛులతో జతురంగ బలముతో పెద్ద యుద్యమము సేసెను. దినదినమెండలంబడివాడు పయనించి కసిగొని యాదవులనుగూర్చి మధురాపురికేగెను. అంతట గృష్ణుడిట్లాలోచించెను యవనులచె యాదవులము నశించుటచూచి మాగధుడు (జరాసంధుడు) యుద్ధమునకేతెంచును. మాగధునిబలము క్షీణించినపుడు యవనుడు వచ్చును ఈవిధముగ రెండువైపులనుండియు యాదవులకు కష్టము వచ్చివడినది. అందుచే యాదవులకొరకభేద్యమైన దుర్గమొకటి నిర్మించెదను. తద్రక్షణచే నబలలు (స్త్రీలు) కూడ యుద్ధము చేయగలరు. అట్టియెడ పృష్టి యదువంశములవారిమాటచెప్పనేల? నేను మత్తుకొనికాని ప్రమత్తుడనై కానియున్నను నిద్రపోయినను నెటకేని ప్రవాసము వెళ్ళినగాని యాదవుల లోకువచూచి శత్రువులు వారిపై నెక్కువ విజృంభింపరు. అని గోవిందు డాలోచించి మహాసముద్రుని పండ్రెండు యోజనముల మేరనిమ్మని (సముద్రమును దూరముగా తొలగుమనికోరి) యచట ద్వారకాపుర నిర్మాణము సేసెను. అది మహోద్యానములు పెద్దకోట పెక్కుతటాకములు ప్రాకారములతో నింద్ర రాజధాని యమరావతివలెనుండెను. మధురాపురవాసుల నక్కడికి గొనివచ్చి యందుంచి కాలయవనునికి దగ్గరగా నుండునని తాను మధురకేగెను. అందుండి సైన్యము తరలింపబడగా దాన నిరాయధుడై యటకేగినంత నతనిని గాలయవనుడు చూచెను. వాడాయన వాసుదేవుడని గ్రహించి చేత నాయుధములూని మహాయోగులేని మనసుల చేబట్టరాని యా స్వామిని వెన్నంటి తరిమె. అట్లు తరుమబడి కృష్ణుడచ్చట ముచుకుందుడను రాజు మహా పరాక్రముడు నిద్రించుచున్న గుహలో బ్రవేశించెను. ఆ యవనుడు నటదూరి యటపరుండియున్న నరునిగని కృష్ణుడనుకొని పాదముచే దన్నెను. అతడు కన్దెఱచి చూచిన క్షణములో యవనుడగ్నిచే గాలిపోయెను. ఆ ముచుకుందుడు మున్ను దేవాసురయుద్దమునకేగి మహారాక్షసులందఱిం జయించి దేవతలను నిద్రకావలెనని కోరెను. వారును నిదురించిన నిన్నెవ్వడువచ్చి లేపునో వాడుదేహమునంబుట్టిన యగ్నిచే నప్పుడ భస్మము గాగలడు అని వరమిచ్చిరి.

ఏవందగ్ధ్వా స తం పాపం దృష్ట్వా చ మధుసూదనమ్‌ | కస్త్వమిత్యాహసో7ప్యాహ జాతో7హంశశినఃకులె|| 23

వసుదేవస్యతనయోయదువంశసముద్భవః | ముచుకుందో7పితచ్ఛృత్వా వృద్ధగార్గ్యవచః స్మరన్‌|| 24

సంస్మృత్యప్రణి పత్యైనం సర్వం సర్వేశ్వరం హరిమ్‌ | ప్రాహజ్ఞాతోభవాన్‌ విష్ణోరంశస్త్వం పరమేశ్వరః || 25

పురాగార్గ్యేణ కథితమష్టావింశ త్తమేయుగే | ద్వాపరాంతే హరేర్జన్మ యదువంశే భవిష్యతి || 26

స త్వం ప్రాప్తోన సందేహో మర్త్యానాముపకారకృత్‌ | తథాహిసుమహత్తేజోనాలం సోఢుమహంతవ|| 27

తథాహిసుమహాంభోదధ్వని ధీరతరంతతః | వాక్యంతమితిహోవాచ యుష్మత్‌ పాదసులాలితమ్‌ || 28

ఇట్లాపాపాత్ముని యవనునింగాల్చి మధుసూదనుంగని ఎవడవీవన నేను చంద్రవంశమున వసుదేవునికి బుట్టినాడను యాదవుడనని హరిపల్కెను. ముచుకుందుడువిని వృద్ధగార్గ్యుని మాటస్మరించి సర్వేశ్వరుండని యెఱింగి హరికి ప్రణతుడై యిట్లనియె. అవును నిన్నెఱుగుదును నీవు విష్ణు నంశమున నుదయించినవాడవు. మున్ను గార్గ్యుడు ఇరువదియెనిమిదవ ద్వాపరముచివర యదువంశమున హరియవతారము జరుగుననిచెప్పెను. అతడేనీవు. మర్త్యులకుపకారము చేయదయచేసిన వాడవు. సంశయములేదు. నీ అప్రాకృత దివ్యతేజము నేని సహింపలేను. అని మహామేఘగర్జాగంభీరమైన ధ్వనితో ముచుకుందుడు కృష్ణస్వామినిట్లు స్తుతించెను.

దేవాసురే మహాయుద్ధే దైత్యాశ్చసుమహాభటాః | నశేకుస్తే మహత్తేజ స్తత్తేజో నసహామ్యహమ్‌ || 29

సంసార పతితసై#్యకోజంతో స్త్వం శరణంపరమ్‌ | సంప్రసీద ప్రపన్నార్తి హర్తాహర మమాశుభమ్‌ || 30

త్వం పయోనిధయః శైలాః సరితశ్చవనానిచ | మేదినీగగనం వాయురాపో7గ్నిస్త్వంతథాపుమాన్‌ || 31

పుంసః పరతరం సర్వం వ్యాప్యజన్మ వికల్పవత్‌ | శబ్దాదిహీనమజరం వృద్ధి క్షయ వివర్జితమ్‌ || 32

త్వత్తో7మరాస్తు పితరో యక్షగంధర్వ రాక్షసాః | సిద్ధాశ్చాప్సరస స్త్వత్తో మనుష్యాః పశవఃఖగాః || 33

సరీసృపాః మృగాస్పర్వే త్వత్తశ్చైవ మహీరుహాః | యచ్చభూతం భవిష్యద్వాకించి దత్రచరాచరే || 34

అమూర్తం మూర్త మథవాస్థూలం సూక్ష్మతరంతథా | తత్సర్వం త్వం జగత్కర్త ర్నాస్తికించి త్త్వయావినా || 35

మయాసంసార చక్రేస్మిన్‌ భ్రమతా భగవన్‌ సదా | తాపత్రయాభిభూతేన నప్రాప్తా నిర్వృతిః క్వచిత్‌ || 36

దుఃఖాన్యేవ సుఖానీతి మృగతృష్ణా జలాశయః | మయానాథ గృహీతాని తాని తాపాయమే7భవన్‌ || 37

రాజ్యముర్వ్యాం బలంకోశోమిత్ర పక్షస్తథా7త్మజాః | భార్యా భృత్యజనా యేచశబ్దాద్యా విషయాః ప్రభో || 38

సుఖబుద్ధ్యామయా సర్వం గృహీతమిద మవ్యయ | పరిణామేచదేవేశతాపాత్మక మభూన్మమ || 39

దేవలోక గతింప్రాప్తోనాధ దేవగణో7పిహి | మత్తఃసాహాయ్య కామో7భూచ్ఛాశ్వతే కుత్ర నిర్వృతిః || 40

త్వామనారాధ్య జగతాం సర్వేషాం ప్రభవాస్పదమ్‌ | శాశ్వతీ ప్రాప్యతేకేన పరమేశ్వర నిర్వృతిః || 41

త్వన్మాయామూఢమనసో జన్మమృత్యుజరాదికాన్‌ | అవాప్య పాపాన్‌ పశ్యంతి ప్రేతరాజాన మంతరా || 42

తతఃపాశశ##తైర్బద్ధా నరకేష్వతిదారుణమ్‌ | ప్రాప్నువంతి మహద్దుఃఖం విశ్వరూప మిదంతవ || 43

అహమత్యంత విషయీ మోహిత స్తవమాయయా | మమత్వాగాధగర్తాంతే భ్రమామి పరమేశ్వర || 44

సో7హంత్వాం శరణమపార మీశమీడ్యం సంప్రాప్తః పరమపదం యతోనకించిత్‌ |

సంసాన శ్రమ పరితాపత ప్తచేతా నిర్విణ్ణ పరిణతధామ్ని సాభిలాషః || 45

ఇతి శ్రీబ్రహ్మపురాణ కాలయవనోపాఖ్యానమ్‌ నామ షణ్ణవత్యధికశతతమోధ్యాయః ||

ముచుకుందుడు కృష్ణుని స్తుతించుట

స్వామి!దేవాసుర యుద్దములం దుద్భటులైన దైత్యులెందఱో నీతేజమునకు దట్టుకొనలేకపోయిరి. అట్టి నీ తేజస్సు నేనోర్వజాలను. సంసానపతితమైన జంతువునకు నీవొక్కడివే దిక్కు. ప్రసన్నుల యార్తిని హరించునీవు నా యెడ ప్రసన్నుడవుగమ్ము.నా అశుభమును హరింపుము. సముద్రములు పర్వతములు నదులు మేదిని గగనము వాయువు నీరు అగ్నియునీవే. పురుషునికంటె మిగులపరమై వికల్పాత్మకమైన యెల్లజన్మములందు వ్యాపించి శబ్దాది విషయస్పర్శలేక వృద్ధిక్షయ జరాదులు లేకయున్న కేవలమైన వస్తువునీవే. నీవలనన చరాచరాత్మకము స్థూలము సూక్ష్మము నైన జగత్తు పొడమినది. పొడముచున్నది. పొడమనున్నది. మూర్తము అమూర్తము నైవదెల్ల నీవలననైనదే. నీకంటె మఱియేదియులేదు. సంసారచక్ర పరిభ్రమణము సేయుచు తాపత్రయ తప్తుడనైన నాకాత్యంతిక సుఖమందలేదు. దుఃఖములను సుఖములని యెండమావులను జలాశయములని యనుకొంటిని. అది ఎక్కడలేని యుడుకుం దెచ్చిపెట్టినది. రాజ్యసుఖము పుత్రమిత్ర కళత్రాదికము శబ్దాది విషయభోగము సుఖమని మఱిగిననాకు తుదకది తాపాత్మకముగా పరిణమించినది. దేవలోక గతినందితినిగాని యాదేవగణము నాసాహాయ్యము గోరినది. తండ్రీ! శాశ్వతమైన నిర్వృతి (పరమ తృప్తి) యెక్కడ? సర్వజగత్ప్రభవస్థానమును నిన్నారాధింపక యాశాశ్వతానంద మెవడు పొందును? నీమాయచే మూఢులై జన్మమృత్యుజరాది పాపానుభవములనంది ప్రేతపతిం జూతురు. అవ్వల కాలపాశములం గట్టువడి యతిదారుణముగ నరకములందనేక విధములగు దుఃఖములందురు. ఇది నీవిశ్వస్వరూపము. నేను విషయలోలుదనై నీమాయచే మోహితుడనై మమకారమను మురికి గుంటలో తిరుగాడుచున్నాను. పరమేశ్వర! నిన్ను స్తుతిపాత్రుని శరణందుచున్నాను. సంసారశ్రమచే నుడికిల్లిన మనసుతో నిర్విణ్ణుడనై (దుఃఖినై) పరమపదమైన పరంధామమైన నీయందుముచ్చటగొన్నాడను.

ఇది శ్రీ బ్రహ్మపురాణమున కాలయవనోపాఖ్యానమున ముచుకుంద చరిత్రయను నూటతొంబదియారవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters