Brahmapuranamu    Chapters   

అథ త్రిసవత్యధికశతతమో7ధ్యాయః

కుబ్జోద్ధార వర్ణనమ్‌

రాజమార్గే తతః కృష్ణః సానులేపన భాజనమ్‌ | దదర్శ కుబ్జా మాయాంతీం నవ¸°వన గోచరామ్‌ || 1

తా మహ లలితం కృష్ణః కప్యేద మనులేపనమ్‌ | భవత్యానీయతే సత్యం వదేందీవరలోచనే || 2

సకామేనైవ సా ప్రోక్తా సానురాగా హరింప్రతి | ప్రాహసలలితం కుబ్జా దదర్శచ బలా త్తతః || 3

కుబ్జోవాచ

కాంత కస్తాన్న జానాసి కంసేనాపి నియోజితా | నైకవక్రేతి విఖ్యాతా మనులేపసకర్మణి || 4

నాన్యపిష్టం హి కంసస్య ప్రీతయేహ్యనులేపనమ్‌| భవత్యహబతీవాస్య ప్రసాదధవభాజనమ్‌ || 5

అవ్వల కృష్ణుడు రాజమార్గము వెంట సుగంధ ద్రవ్యపాత్రను జేకొని వచ్చుచున్న నవ¸°వనశాలని యగు కుబ్జనుజూచెను. ఇందీవరాక్షి! ఈ యనులేపన మెవఱికొఱకు గొంపోవుచున్నావు. నిజము జెప్పుమని పలుకరించెను. సాభిలాషముగ హరి ముచ్చటింప నదియు ననురక్తిగొని యా సుందరుని జూచినంత వివశ##మైన మనస్సును బలిమియై నిలిపి హరితో సొంపుగ నిట్లు పలికెను. కాంత!నీవేల యెరుగవు. నేను సుగంధద్రవ్యానులేపన కార్యక్రమమున కంసునిచే నియోగింపబడిన దానను. లనేకవక్ర యను బ్రసిద్ది గన్నదానను. కంసునికి నాకూర్చిన కలపము దప్ప ఇతరము ప్రియము కాదు. అతని యనుగహ సంపదకు నేను పాత్రమును''

శ్రీకృష్ణ ఉవాచ

సుగంధమేతద్రాజార్హం రుచిరం రుచిరాననే | ఆవయోర్గాత్ర సదృశందీయతామనులేపనమ్‌|| 6

వ్యాస ఉవాచ

శ్రుత్వాత మాహసా కృష్ణం గృహ్యతామితి సాదరమ్‌ | అనులేపంచ ప్రదదౌ గాత్రయోగ్యమథోభయోః || 7

భక్తిచ్ఛేదాను విప్తాంగౌ తతస్తౌ పురుషర్షభౌ | సేంద్రచాపౌ విరాజంతౌ పితకృష్ణా వివాంబుదౌ || 8

తత స్తాం చిబుకే శౌరిరుల్లాపన విధానవిత్‌ | ఉల్లాప్యతోలయామాసద్వ్యంగులేనాగ్రపాణినా || 9

చకర్షపద్బ్యాంచతదా ఋజుత్వంకేశవో7నయత్‌ | తతః సాఋజుతాం ప్రాప్తాయోషితా మభవద్వరా || 10

వాలాసలలితం ప్రాహ ప్రేమ గర్భభరాలసమ్‌ | వస్త్రే ప్రగృహ్య గోవిందం వ్రజ గేహం మమేతివై || 11

ఆయాస్యే భవతీగేహమితి తాంప్రాహకేశవః | విససర్జ జహాసోచ్చై రామస్యాలోక్య చా7ననమ్‌ || 12

భక్తిచ్ఛేదాను లిప్తాంగౌ నీలపీతాంబరావుభే | ధను శ్శాలాంతతోయాతౌ చిత్రమాల్యోపశోభితౌ || 13

అధ్యాస్యచధనూరత్నంతాభ్యాం పుష్టైస్తు రక్షిభిః | ఆఖ్యాతం సహపా కృష్ణో గృహీత్వా7 పూరయద్ధనుః || 14

తతః పూరయతా తేన భజ్యమానం బలాద్ధనుః | చకారాతి మహాశబ్దం మధురాతేన పూరితా || 15

అనుయుక్తా తతస్తౌచ భ##గ్నేధనుషి రక్షిభిః | రక్షిసై న్యం నికృత్యోభౌ నిష్క్రాంతౌ కార్ముకాలయాత్‌ || 16

అన కృష్ణుడు ''సుందరముఖి ; రాజున కర్హమైన యీ మంచి గంధము మేమిద్దరము పూసికొనదగినది. అది మాకిమ్ము''. అన నది వెనువెంటన 'దీసికొమ్మ'ని యాదరముతో వారికిచ్చెను. వారు చిత్ర చిత్ర రచనలుగా నా గంధమును బూసికొని యింద్రధనస్సుతో శోభించు తెల్లని నల్లని మేఘములట్ల భాసించిరి. అంతట హరి యుల్లాపన నిపుణుడు గావున (మధుర హాస్యవచన రచనా నిపుణుడు గావున) దాని గడ్డముక్రింద జేయిజేర్చి దాని పాదములందన యదుగులం ద్రొక్కిపట్టి (భక్రుల నుద్ధరించు నెరజాణ గావున) యామెను మీదికెత్తి లీలగ నిట్టట్టులూచెను. దాననయ్యింతి మేని మంద్రముగ మాయింటికి రమ్మని పలికి సవిలాసముగ నతని పైవలువ గొని యాకర్షించెను. స్వామి తప్పక వచ్చెదననెను. ఆ విలాసిని బలభద్రునివంక నల్లనం గనుచు బిట్టు నవ్వి కృష్ణుని వదలెను. ఆమె యిచ్చిన యామంచి గంధము నయ్యిద్దరు బూసికొని రంగు రంగుల పూలమాలలం దాల్చి నీలాంబర పీతాంబర ధారులై ధనుశ్శాలకుం జనిరి. ధనుర్యాగమునకు నిర్దిష్టమైన ధనుశ్రేష్ఠమెక్కడ నున్నదని శాలారక్షకుల నడిగి తెలిసికొని హరి యపుడ దానం గొని యెక్కుపెట్టెను. ఎక్కిడినది తడవుగ నది విరుగ నెడలిన చప్పుడు మధుర నలుమూలల నలమెను. అవ్విల్లు విరుగుట జూచి శాలారక్షకులు మీరెవ్వరని ప్రశ్నింప బదులు వలుకకయే యా యన్నదమ్ములు ధనుశ్శాల నుండి వెడలిరి.

ఆక్రూరా గమ వృత్తాంత ముపలభ్యతథా ధనుః | భగ్నంశ్రుత్వా7థ కంసో7పి ప్రాహచాణూరముష్టికౌ || 17

కంస ఉవాచ

గోపాలదారకౌ ప్రాప్తౌ భవద్భ్యాం తౌ మమాగ్రతః | మల్లయుద్ధేన హంతవ్యౌమమ ప్రాణహరౌహితౌ || 18

నియుద్ధే తద్వినాశేన భవద్భ్యాం తోషితోహ్యహమ్‌ | దాస్యామ్యభిమతాన్‌ కామాన్నాన్యథై తౌ మహాబలౌ || 19

న్యాయతో7న్యాయతోవాపిభవద్భ్యాంతౌ మమాహితౌ | హంతవ్యౌతద్వధా ద్రాజ్యం సామాన్యం వోభవిష్యతి || 20

వ్యాస ఉవాచ

ఇత్యాదిశ్య స తౌ మల్లౌ తతశ్చాహూయ హస్తిపమ్‌ | ప్రోవాచోచ్చై స్త్వయా మత్తః సమాజద్వారికుంజరః || 21

స్థాప్యఃకువలయాపీడస్తేన తౌ గోపదారకౌ | ఘాతనీ¸° నియుద్ధాయ రంగద్వారముపాగతౌ || 22

తమాజ్ఞాప్యా7థ దృష్ట్వాచ మంచాన్‌ సర్వా నుపాహృతాన్‌ | ఆసన్నమరణః కంసః సూర్యోదయముదైక్షత||

కంసుడక్రూరుని రాకను రామకృష్ణులు ధనస్సును విరచుటను విని చాణూర ముష్ఠికులను జూచి గోపాల బాలకులిద్దరు వచ్చినారు. మల్లయుద్దమున నా ప్రాణమును హరించు వారిని మీరు సంహరింపుడు. అందువలన నేను సంతోషించెదను. న్యాయాన్యాయ విచక్షణ లేకుండ నెట్లైనను మీరు వాండ్రసు గడతేర్పవలెను. దాన మీకోరినదెల్ల దీర్చగలను. వారి వధవలన నీ రాజ్యము నాకును మీకును నుమ్మడిసొత్తు కాగలదు'' అని యా మల్లుర కాజ్ఞ యిడి మావటి వానిం బిలిచి ''నీవు మదపుటేనుగును సమాజ ద్వారమున నిలుపుము. కువలయాపీడమను నమ్మదగజము చేత మల్లరంగ ద్వారమునకు వచ్చిన యా గొల్లపిల్లలను ద్రొక్కింపుము. అని యాన యిచ్చి కంసుడు పోగాలము దాపురించిన యా దుష్ఠుడు సూర్యోదయమున కెదురు చూచుచుంచెను.

తతః సమస్త మంచేషు నాగరఃస తదా జనః | రాజమంచేషు7రూఢాః సహభృత్యైర్మహీభృతః || 24

మల్లప్రాశ్నికవర్గశ్చరంగమధ్యే సమీపగః | కృతః కంసేన కంసో7పి తుంగమంచే వ్యవస్థితః || 25

అంతఃపురాణాం మంచాశ్చయథాన్యే పరికల్పితాః | అన్యేచ వారముఖ్యానా మన్యే నగరయోషితామ్‌ || 26

నందగోపాదయోగోపామంచేష్వన్యేష్వవస్థితాః | అక్రూరవాసుదేవౌచ మంచప్రాంతేవ్యవస్థితౌ || 27

నగరీ యోషితాం మధ్యే దేవకీ పుత్రగర్థినీ| అంతకాలేపి పుత్రస్య ద్రక్ష్యామీతి ముఖం స్థితా || 28

పౌరులు మంచెములందును రాజులు భృత్యులతో నేగి రాజుల కుచితములగు మంచెములం దధిష్ఠించిరి. మల్లురు ప్రాశ్నికులు (మధ్యవర్తులు) అ సభారంగమున నడిమి భాగమున వసించిరి. కంసుడు అందరికంటె నెత్తైన మంచెమునందు (సోఫా) ఆసీనుడయ్యెను. అంతఃపుర జనము వసింప వేర్వేర మంచెము లమర్పబడెను. వారస్త్రీలకు నొకచోనగరాంగనల కొకచో నందాది గోపకులొకచో నాసీనులయ్యిరి. అక్రూర వాసుదేవులు ఆ మంచె ప్రాంతమున నుండిరి. పౌరాంగనల నడుమ పుత్రవాత్సల్య భరితయగు దేవకి నాబిడ్డ నెమ్మోము తుది గడియలోనైన జూతును గాకయని కూర్చుండెను.

వాద్యమానేషుతూర్యేషు చాణూరే చాతివల్గతి | హాహాకారపలే లోక అస్ఫోటయతి ముష్టికే ||29

హత్వాకువలయాపీడం హస్త్యారోహప్రచోదితమ్‌ | మదాసృగనులిప్తాంగౌ గజదంతవరాయుధౌ || 30

మృగమధ్యేయథాసింహౌగర్వలీలావలోకనౌ | ప్రవిష్టౌ సుమహారంగం బలదేవజనార్దనౌ || 31

హాహాకారోమహాన్‌ జజ్ఞే సర్వరంగేష్వనంతరమ్‌ | కృష్ణోయంబలభద్రో7యమితిలోకస్యవిస్మయాత్‌|| 32

సో7యం యేన హతా ఘోరా పూతనాసానిశాచరీ | ప్రక్షిప్తం శకటంయేన భగ్నౌచ యమలార్జునౌ ||33

సో7యం యఃకాలియం నాగం ననర్తారుహ్య బాలకః | ధృతో గోవర్ధనోయేన సప్తరాత్రం మహాగిరిః || 34

అరిష్ఠోధేనుకః కేశీలీలయైన మహాత్మనా | హతోయేనచదుర్వృత్తో దృశ్యతేసోయమచ్యుతః ||35

ఆయంచాస్యమహాబాహుర్బలదేవో7గ్రజ్యోగ్రతః | ప్రయాతిలీలయాయోషిన్మనోనయననందనః || 36

ఆయం సకథ్యతే ప్రాజ్ఞైః పురాణార్థావలోకిభిః | గోపాలోయాదవం వంశం మగ్నమభ్యుద్ధరిష్యతి || 37

అయం స సర్వభూతస్య విష్ణోరఖిల జన్మనః | అవతీర్ణో మహీమంశోనూనంభారహరోభువః || 38

ఇత్యేవం వర్ణితే పౌరైరామేకృష్ణేచతత్‌ క్షణాత్‌ | ఉర స్తతాపదేవక్యాః స్నేహస్నుతపయోధరమ్‌ || 39

మహోత్సవమివాలోక్య పుత్రావేవవిలోకయన్‌ | యువేవవాసుదేవో7 భూద్విహాయాభ్యాగతాం జరామ్‌ || 40

విస్తారితాక్షియుగలా రాజాంతఃపురయోషితః | నాగర స్త్రీసమూహశ్చ ద్రష్టుం న విరరామతౌ || 41

ఉత్సవ వాద్యములు మ్రోయ చాణూరు డెగిరెగిరి గంతులిడుచుండ ముష్ఠికుడు బాహువులు చరచ లోకము హాహాకార మొనరింప మావటీడు తమ మీదికి దోలిన కువలయా పీడమును జంపి దాని మదముచే రక్తముచే శరీరములు పూతవడ దాని దంతములు పెరికి ఆయుధములుగ ధరించి సగర్వ విలాసమున జూచుచు మృగముల నడుమమృగరాజు లట్లు బలరామకృష్ణులు మల్లరంగమును బ్రవేశించిరి. అంతట నన్ని రంగములందు నితడే కృష్ణుడు ఇడుగో బలభద్రుడని వింతగొని జనము చేయు ఆహాకారము మిన్నంటెను. ఘోర రాక్షసిని పూతనను జంపిన యతడే యితడు. శకటాసుర భంజనము యమలార్జునోన్మూలనము జేసిన యతడు కాళియ ఫణి ఫణాగ్రమన నర్తనము జేసిన యా బాలుడితడే. గోవర్థన మహాగిరిని యేడురోజులు ఎత్తిపట్టిన బలుదిట్ట యాతడు. అరిష్ట, ధేనుకులను గేశి యను హయమును విలాసముగ జంపిన మహాత్ము డచ్యుతుడీతడే. ఇతని ముందు సవిలాసముగ నీ మల్లరంగమున వచారు చేయుచున్న సుందరీ నయనానందనుడు యదునందనుండిడుగో! బలరాముడు. ఈ స్వామి హరి పురాణార్ధములను లెస్సగ చూచిన ప్రాజ్ఞులు. గోపాలమూర్తియై కంసునిచే దిగబడియున్న యదువంశము నుద్ధరింపగలడని పొగడొందిన బాలుడిడుగొ. ఇతడు సర్వసృష్టిహేతువు సర్వము దానైన విష్ణువు నంశమున నవతరించి భూభారము హరింపనున్నాడు.'' అని యిట్లు బలరామ కృష్ణులను బౌరులు కొనియాడుచుండ దేవకి పాలుచేపుకొన నాబిడ్డలంగని మనసుసందాపము వొందెను. మహోత్సవము చూచుచున్న నెపమున తన పుత్రులనే చూచుచు పై గదిసిన ముదిమిని (వార్ధక్యము) బాసి యువకుడట్లై వసుదేవుడు తనిసెను. శుద్ధాంతః స్త్రీలు నాగర స్త్రీసమాజము కనుగవలల్లార్చి యవిరామముగ నా రామకృష్ణులను దిలకించిరి- మఱియు నిట్లొండొరులతో మురిసి ముచ్చటింప జొచ్చిరి.

స్త్రియ ఊచుః

సఖ్యః పశ్యత కృష్ణస్య ముఖమప్యంబుజేక్షణమ్‌|గజయుద్ధకృతాయాసస్వేదాంబు కణికాంచితమ్‌ ||42

వికాసీవసరోంభోజ మవశ్యాయ జలోక్షితమ్‌ | పరిభూతాక్షరం జన్మసఫలం క్రియతాం దృశః || 43

శ్రీవత్సాంకం జగద్ధామ బాలసై#్యత ద్విలోక్యతామ్‌ | విపక్షక్షపణం వక్షో భుజయుగ్మంచ భామిని || 44

వల్లతా ముష్టికేనైవ చాణూరేణ తథా పరై ః |క్రియతే బలభద్రస్య హాస్యమీష ద్విలోక్యతామ్‌ || 45

సఖ్యః పశ్యత చాణూరం ని యుద్ధార్థ మయంహరిః | సముపైతి నసంత్యత్ర కింవృద్ధా యుక్తకారిణః || 46

క్వ ¸°వనోన్ముఖీభూతః సుకుమార తనుర్హరిః | క్వ వజ్రకఠినాభోగశరీరో7యం మహాసురః || 47

ఇమౌసుఉలలితౌరంగే వర్తేతే నవ¸°వనౌ | దైతేయమల్లాశ్చాణూర ప్రముఖాస్త్వతి దారుణాః || 48

నియుద్ధప్రాశ్నికానాంతు మహానేష వ్యతిక్రమః | యద్బాల బలినోర్యుద్ధం మధ్యస్థైః సముపేక్ష్యతే || 49

వ్యాసఉవాచ

ఇత్థం పురస్త్రీలోకస్య వదతశ్చాలయన్‌ భువమ్‌ | వవర్ష హర్షోత్కర్షంచ జనస్య భగవాన్‌ హరిః || 50

బలభద్రో7పిదా7స్ఫోట్యవవల్గ లలితం యదా | పదేపదే తదాభూమిర్న శీర్ణా యత్తదద్భుతమ్‌ ః 51

సఖులార! కమలము లట్లింపు గొలుపు కృష్ణుని నెమ్మోము గనుడు. ఏనుగుతోడి పెనుగులాట నొడవిన శ్రమచే గ్రమ్మిన చెమటబిందువులతో హరివదనము మంచుబిందువులు పైబడిన వికసిత నవాంబుజమట్లు సొcపు గులుకు చున్నది. అల్లదే చూడుడు. అక్షరము (ఆవినాశి) అయిన పరబ్రహ్మమును మరచి వినశ్వరమగు నీ జగద్దృశ్యమును మరిగిన మనయీజన్మమును మనకన్నులను సఫలములను జేసుకొందము. శ్రీవత్సలాంచితమై సర్వజగదావాసమై వివక్షక్షపణమైన (శత్రువులను మట్టువెట్టు) ఈవీరుని పెడద యురంబును విశాలభుజయుగమును సఖీ!కన్గొనవె. గంతులిడు ముష్ఠికునితో రంతులుచేయి చాణూరునితో తక్కుంగల మల్లురతో వీరాలాపముల మేలమాడు బలరాముని నెమ్మోము గనరె! సఖులారా. బలుదిట్టయగు చాణూరునితో బసిబాలుడు గోపాలుడుతలపడుచున్నాడు. అన్యాయమిది యని చెప్పగల పెద్దలెవ్వర నిక్కడలేరా? ఇపుడిప్పుడ యంకురించు యూవనమున కున్ముఖుడై సుకుమార శరీరుడైయున్న యీహరియెక్కడ వజ్రకఠినమై నిండుమదమెక్కి యుక్కుమిగులు నెమ్మేనయున్న యీమహారాక్షసుడెక్కడ? పరమసుకుమారులు చిరుతప్రాయమువారు గోపాలురీకంగమందున్నవారు. వీరితో నుజ్జీగ పరమరాక్షసులు నతిదారుణులు చాణూరాదులు మల్లులెదురనున్నారు. ఈవిపర్యయము నీమర్యాదనుఇటనున్న మధ్యపర్తులుల్లంగించుట కడువిపరీతము. మధ్యస్థులిదిచూచి యుపేక్షించుచున్నారు. అనియిట్లూరక పౌరసుందరులు పరితపించుటగని పుడమిగంపింప హరి చూపరులకానందోత్కర్షమును వర్షించుచు సమరసన్నద్దుడయ్యెను. బలరాముడును బాహువులు చరచి చక్కగ నిటునిటు దూకినంతట నడుగడుగున నవని పగులుపడవలసిన దట్లుగాకుండుట యదియు నొకయద్భుతమయ్యెను.

చాణూరేణ తతః కృష్ణో యుయుధ్యే7మితవిక్రమః | నియుద్ధ కుశలో దైత్యో బలదేవేన ముష్టికః || 52

సంనిపాతావధూతైశ్చచాణూరేణ సమంహరిః | క్షేపణౖర్ముష్టిశ్చైవ కీలీ వజ్రనిపాతనై ః || 53

పాదోద్ధూతైః ప్రమృష్టాభి స్తయోర్యుద్ధమభూన్మహత్‌ | అశస్త్రమతియోరం తత్తయోర్యుద్ధం సుదారుణమ్‌ || 54

స్వబలప్రాణనిష్పాద్యం సమాజోత్సవసంవిధౌ | యావద్యావచ్చచాణూరో యుయుధేహరిణాసహ ||55

ప్రాణహానిమవాపాగ్ర్యాం తావత్తావన్న బాంధవమ్‌ | కృష్ణో7పియుయుధేతేన లీలయైవ జగన్మయః || 56

అంతట చాణూరునితో కృష్ణుడును మల్లయుద్ధవిశారదుడైనముష్టికుడు బలదేవునితోను దలవడిరి. ఒండొరులం దూరముగవిసరుట గ్రుద్దుట పట్టుగ దచినంతచేబట్టి దిగనడచుటబాదములందన్నుట మర్దించుట మొదలగు మల్లయుద్దభంగిములచే వారి కస్త్రములులేని యతిధారుణమైన సమరమయ్యెను ధనుర్యాగోత్సవమందు దన బల ప్రాణములచే నెంతెంత సేయగలదో అంతకు చుట్టరిక మని లేకుండ బోరెను. జగదంతర్యామియైన కృష్ణుడును వానితో విలాసమాత్రముగనే పోరెను.

ఖేదాచ్చాలయతాకోపాన్నిజశేఫకరే కరమ్‌ | బలక్షయం వివృద్ధించ దృష్ట్వా దాణూర కృష్ణయోః || 57

వారయమాస తూర్యాణి కంసః కోపపరాయణః | మృదంగాదిషువాద్యేషు ప్రతిషిద్ధేషు తత్‌ క్షణాత్‌ || 58

అంతట కంనుడు ఖేదాత్‌=ఖేదమువలన నిజ=తనయొక్క శేష=పధను కరం= చేయనున్న కరం= చేతిని చాలయతా= చలింపజయుచున్న కృష్ణుచేగల్గిన కోపాత్‌=కోపమువలనను (అనగా కృష్ణుడు వజృంభించిచేయు భీషణమైన యుద్ధముచూచి నందువలన గల్గిన బాధవలనను తనను జంపనున్న హస్తమును పాముపడగనట్లోడించుచున్న కృష్ణుని యెడల నుడుకు మోతుతనమువలన గల్గిన క్రోథమువలనను) చాణూరుని యందు బలక్షయమును కృష్ణుని యందు బలవృద్దినింజూచి యుద్ధవాద్యముల నావుచేసెను. మృదంగాది వద్యములట్లాపబడినంత నాక్షణము నాకసమందలి దేవవాద్యములు (దుందుభులు మొదలయినవి) భోరన మ్రోసినవి.

ఖసంగతాన్య వాద్యంత దైవతూర్యాణ్యనేకశః | జయగోవింద చాణూరం జహి కేశం దానవమ్‌ || 59

ఇత్యంతర్ధిగతాదేవాస్తుష్టువుస్తే ప్రహర్షితాః | చాణూరేణచిరంకాలం క్రీడిత్వా మధుసూదనః || 60

ఉత్పాట్య భ్రామయామాస తద్వధాయ కృతోద్యమః | భ్రామయిత్వా శతగుణం దైత్యమల్లమమిత్రజిత్‌ || 61

భూమా వాస్ఫోటయామాస గగనే గతజీవితమ్‌ ! భూమావాస్ఫోటిత స్తేన చాణూరః శతధా భవన్‌ || 62

రక్తస్రావ మహాపంకాం చకార సతదా భువమ్‌ |

జయింపుము గోవింద! చాణూరుని సంహరింపుము కేశవ యీదానవుని అని అంతర్థానగతులై వేల్పులానందమంది హరిని స్తుతించిరి. మధుసూదనుడు చాలసేపు చాణూరునితో నాడికొని తుదముట్టింపదలచి వానిలేవనెత్తి యంతకు నూఱఱట్లు యూపున గిరగిరం ద్రిప్పి గగనమంద ప్రాణములు వాసిన వానిం బుడమిపై విసరివేసెను. ఆవ్రేటునవాడు నూరువ్రక్కలై రక్త స్రావముసేసికొని యానేలనెల్లం బెనుబెందడి గావించెను.

బలదేవస్తు తత్కాలం ముష్టికేన మహాబలః || 63

యయుధే దైత్యమల్లేన చాణూరేణ యథాహరిః | సో7ప్యేనం ముష్టినా మూర్థ్ని వక్షస్యాహత్య జానునా || 64

పాతయిత్వా ధరాపృష్ఠే నిష్పిపేష గతాయుషమ్‌ | కృష్ణస్తోశలకం భూమౌ మల్లరాజం మహాబలమ్‌ || 65

వామముష్టి ప్రహారేణ పాతయామాస భూతలే | చాణూరే నిహతే మల్లేముష్ఠికేచ నిపాతితే || 66

నీతే క్షయం తోశలకే సర్వే మల్లాః ప్రదుద్రువుః | వవల్గతు స్తదా రంగే కృష్ణ సంకర్షణావుభౌ || 67

సమానవయసో గోపాన్‌ బలాదాకృష్య హర్షితౌ | కంసో7పి కోపరక్తాక్షః ప్రాహోచ్చైర్వ్యాయతాన్నరాన్‌ ||

గోపావేతౌ సమాజౌఘాన్నిప్ర్కమ్యేతాం బలా దితః | నందో7పిగృహ్యతాం పాపో నిగడై రాశుబధ్యతామ్‌ || 69

అవృద్ధార్హేణ దండేన వసుదేవో7పి వధ్యతామ్‌ | వల్గంతిగోపాః కృష్ణేన యే చేమే సహితాః పునః || 70

గావో హ్రియంతామేషాంచ యచ్చాస్తివసుకించన |

బలదేవుండును చాణూరునితో హరియట్ల ముష్టికునితో బోరెను. అతడును వీని ముష్టిచే నడితల నడచి మోకాలను ఱొమ్మునంబొడిచి పుడమిపై బడవేసి ప్రాణములు వోవ గాలఱాచెను. కృష్ణుడెడమ పిడికిలింగ్రుద్ది మల్లవీరునిమహాబలుని నవ్విధమున భూతలమునం బడనేసెను. చాణూరుడు నిహతుడు కాగా ముష్టికుడు గూల్పబడగా నెల్ల మల్లురుంబారిపోయిరి. అపుడు కృష్ణ సంకర్షణు లిద్దరు నవ్వీరవిహారమున తమ యీడువారలంబలాత్కారముగ నాకర్షించి యారంగభూమిపై గుప్పించి గంతులు వెట్టిరి. అంతట గంసుడు గినుకచే గనులెఱ్ఱవడ యటచెదఱియున్న తనమనుజులతో ఈ గోపకులనిద్దరినీ సమాజము గుంపునుండి బలత్కారమున గెంటివేయుడు. పాపాత్ము నందుని నిప్పుడ సంకెళ్ళంబంధింపుడు వృద్ధుల కుచితముగాని దండనమున వసుదేవుం గూడ గట్టివేయుడు? కృష్ణునితో నెగిరెగిరి గంతులునెట్టు నీగొల్లల గోధనములను గొల్లగొట్టుడనియె.

ఏవమాజ్ఞాపయంతం తంప్రహస్యమధుసూదనః || 71

ఉత్సత్యా7రుహ్య తన్మంచం కంసం జగ్రాహవేగతః | కేశేష్వాకృష్యతవిగలత్కిరీట మవనీతలే || 72

స కంసం పాతయామాస తస్యోపరి పపాతచ | నిశ్శేష జగదాధారగురుణా పతతోపరి || 73

కృష్ణేన త్యాజితః ప్రాణా న్నుగ్రసేనాత్మజో నృపః | మృతస్య కేశేషు తదాగృహీత్వా మధుసూదనః || 74

చకర్ష దేహం కంసస్య రంగమధ్యే మహాబలః | గౌరవేణాతిమహతా పరిపాతేన కృష్యతా |

కృతా కంసస్యదేహేన వేగితేన మహాత్మనా | కంసే గృహీతే కృష్ణేన తద్ర్భతా7భ్యాగతోరుషా || 75

సునామా బలభ##ద్రేణ లీలయేవ నిపాతితః | తతోహాహాకృతం సర్వమాసీత్త ద్రంగ మండలమ్‌ || 76

అవజ్ఞయా హతం దృష్ట్వా కృష్ణేన మధురేశ్వరమ్‌ | కృష్ణొ7పి వసుదేవస్య పాదౌ జగ్రాహ సత్వరమ్‌ || 77

దేవక్యాశ్చ మహాబాహుర్బలదేవసహాయవాన్‌ | ఉత్థాప్యవసుదేవస్తు దేవకీచ జనార్దనమ్‌ || 78

స్మ్పతజన్యోక్తవచనౌ తా వేవ ప్రణతౌ స్థితౌ || 79

ఇట్లాజ్ఞయిచ్చు నాకంసుని గని యల్లన నవ్వి మధుసూదనుడు మీదికిందూకి యమ్మంచ మెక్కి కంసునింబట్టి జుట్టువట్టిలాగి కిరీటము దొలగియిలపై బడ వానిం బడవైచి వానిపై బడెను. ఎల్లజగముల కాధారమైన బరువుచే మీద బడిన కృష్ణునిచే నయ్యుగ్రసేని (ఉగ్రసేనునికొడుకు) కంసరాజు ప్రాణములం బాసెను. చచ్చినవాని కేశములంబట్టి కేశవుడు వానిదేహము నారంగమధ్య మందు బరబర యీడ్చివైచెను. సహజముగ నది పెద్దది బరువైనది క్రోధముచే మఱియు బరువెక్కినది అగు కంసుని శరీరము మహాత్మడగు కృష్ణునిచే గూల్పబడికడువేగమున నీడ్వబడినది కూడ. అది చూచి వానితమ్ముడుసునిముడెత్తి రాగ బలభద్రుడు లీలగవానిబడగొట్టెను. హరిచేనవమాసమునకుగురియైమధురాధీశ్వరుడు కంసుడు హతుడౌటగని యారంగ మండపమెల్ల హాహాకారముల నిండిపోయెను. కృష్ణుడును వెనువెంటనే బలరామునిలో చని దేవకీ వసుదేవుల పాదములం బట్టుకొనెను. వసుదేవుడు దేవకియుం జనాక్దనునెత్తి జన్మసమయమున (పురిటింట) స్వామిపల్కిన పల్కులం దలచికొని వారే వారికి ప్రణతులై నిలిచిరి. అయ్యెడ వసుదేవుడాప్రభువు నిట్లు వినుతించెను.

వసుదేవ ఉవాచ

ప్రసీద దేవదేవేశ##దేవానింప్రవర ప్రభో | తథా7వయోః ప్రసాదేప కృతాభ్యుద్ధార కేశవ || 80

ఆదాధితోయద్‌ భగవా నవతీర్ణో గృహేమమ | దుర్వృత్తనిధనార్ధాయ తేన నః పావితం కులమ్‌ || 81

త్వమంతః సర్వభూతానాం సర్వభూతే ష్వవస్థితః | వర్తతేచ సమస్తాత్మం స్త్వత్తో భూతభవిష్యతీ || 82

యజ్ఞే త్వమిజ్యసే7చింత్య సర్వదేవమయా చ్యుత | త్వమేవ యజ్ఞా యజ్వాచ యజ్ఞానాం పరమేశ్వర || 83

సాపహ్నవం మమ మనో యదేతత్త్వ యి జ జాయితే | దేవక్యాశ్చా7త్మజప్రీత్యా తదత్యంత విడంబనా || 84

త్వంకర్తాసర్వభూతానా మనాదినిధనో భవాన్‌ | క్వచమే మానుష సై#్యషా జిహ్వా పుత్రేతి వక్ష్యతి || 85

జగదేత జ్జగన్నాధసంభూత మఖిలం యతః | కయా యుక్త్యా వినామాయాంసో7స్మత్తః సంభవిష్యతి || 86

యస్మిన్‌ ప్రతిష్ఠితం సర్వం జగత్‌స్థావర జంగమం | సకోష్ఠోత్సంగ శయనోమనుష్యాజ్జాయతే కథమ్‌ || 87

సత్యం ప్రపీద పరమేశ్వరపాహి విశ్వమంశావతారకరణౖర్న మమాసిపుత్రః |

ఆబ్రహ్మపాదపమయం జగదీశ సర్వం చి త్తేవిమోహయసి కిం పరమేశ్వరాత్మన్‌ || 88

మయావిమోహితదృశా తన యోమమేతి కంసాద్‌ భయం కృతవతా తుమయాతి7 తీవ్రమ్‌ ||

నీతో7సి గోకుల మరాతి భయాకులస్య వృద్ధింగతో7సి మమచైవ గవామధీశ || 89

కర్మాణి రుద్రమరుదశ్వితక్రతూనాం సాధ్యాని యాని నభవంతి నిరీక్షితాని |

త్వం విష్ణురీశజగతా ముపకారహేతోః ప్రాప్తోసి నః పరిగతః పరమో విమోహః || 90

ఇతి శ్రీబ్రహ్మపురాణ బాలచరితే కంసవధ కథనం నామ త్రినవత్యధిక శతతమో7ధ్యాయః

వసుదేవకృతకృష్ణస్తుతి

స్వామి! ప్రసన్నుcడౌము సురవంద్య సురేశ్వర! మాకునై కదా

యీమహి నుద్ధరింప భజియింపగ నేము ననుగ్రహింపcగా

దామఱి నిగ్రహింప ఖలులందఱ మాగృహమందుcబుట్టినా

వో మహనీయ! మాకుల మహో! యిది పావనమయ్యెరా హరీ!

భూతములన్నిటం గలవు భూతములన్నిట నంతరాత్మవున్‌

భూత భవిష్య మిప్పుడు ప్రభూ! జఱుగుంగదనీదు చేతనే

నేతవునీవు యజ్ఞమును నీవ యజించుట నీవ యజ్ఞమం

దాతతమైన ద్రవ్యనుదియైనను నీవ పరాత్పరా! హరీ!

నామనసేని దేవకి మనన్ముదియున్‌ నిను బిడ్డవంచు న

జ్ఞానమునం బడెన్‌ నిజము చాటెద! కర్తవు నీదభర్తవున్‌

దేనికి మొదల్తుదయు దేవరకుం గనరావు మానుష

మ్మౌనొక నాల్క పుత్రియని యర్భక యంచిది పిల్చు నంతియే

జగములకెల్లనుం బ్రభువ! సర్వజగమ్మిది మాయగాక వే

రగు మఱియేమియు క్తినిది యైనది అయ్యెడనీవు మాకుc

ల్గగ సబబేమి! సృష్టిసక లమ్మిటచుట్టినదున్న చట్టిసౌ

భగముమనుష్య కోష్ఠమున బావురె యయ్యొడినుంట యెట్లనే

ఇట్టడ వీవు పాహి పరమేశ్వర విశ్వము; విష్ణునంశ##మై

పట్టివి గావునాకు విను బ్రహ్మమొదల్మఱి చెట్టుపుట్టదా

కట్టిమమున్‌ విమోహమున నర్భకుడం చనిపించుమాయ యా

కట్టిడిచేcత చిట్టులికిగాసిలితిం డయcజూడవే హరీ!

కన్నులcగ్రమ్ము మాయ ననుగన్నయ వీవని కంసభీతి నా

పన్నత చెంది వారిపరివారముచే నట జేరినాడ నో

యన్న యట్లైన నాతలపునం దొకయించుకయేని దొలంగ కీ

పున్నదినిక్క మీశ్వర! ఆహో! జగదీశ్వర! గోకులేశ్వరా!

రుద్రమరుత్తు లశ్వినులు రూఢిశతక్రతుముఖ్యులేని ని

ర్నిద్రులు సేయలేని కననేరని వింతలు సేసినావు సా

ముద్రికమేటికిం దడవ భూమిపయిం దిగినావు విశ్వమున్‌

భద్రమొనర్ప విష్ణువవు పాహి హరీ! తలcగెన్‌ విమోహమున్‌

ఇది బ్రహ్మపురాణమున బాల చరితమన కంసవధయను నూట తొంబది మూడవ యధ్యాయము

Brahmapuranamu    Chapters