Brahmapuranamu    Chapters   

ఏకోనవింశో7ధ్యాయః

జంబూద్వీపవర్ణనమ్‌

రోమహర్షణ ఉవాచ -

ఉత్తరేణ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణ | వర్షం తద్భారతం నామ భారతీ యత్ర సంతతిః || 1

నవయోజనసాహస్రో విస్తారశ్చ ద్విజో త్తమాః!|కర్మభూమిరియం స్వర్గ మపవర్గం గంతు మిచ్ఛతామ్‌ || 2

సూతుడిట్లనియె-

సముద్రమునకుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారతవర్షముగలదు. అందలిసంతతి ''భారతి'' యనబడును. ఇతి తొమ్మిదివేల యోజనముల వైశాల్యము గలది. కర్మభూమియని దీనికిపేరు. కోరినవారికి స్వర్గము మోక్షమును గూడ నిందే యున్నవి.

మహేంద్రో మలయః సహ్యః శు క్తిమా న్నృక్ష పర్వతః | వింధ్యశ్చ పారియాత్రశ్ఛ సప్తాత్ర కులపర్వతాః|| 3

అతః సంప్రాప్యతే స్వర్గో ముక్తి మస్మా త్ర్పయాతి వై | తిర్యక్త్వం నరకం చాపి యాం త్యతః పురుషాః ద్విజాః ఇతః స్వర్గంచ మోక్షంచ మధ్యే చాంతే చ గచ్ఛతి | న ఖల్వన్యత్ర మార్త్యానాం కర్మభూమౌ విదీయతే || 5

ఇందు మహేంద్రము-మలయము-సహ్యము-శుక్తిమంతము-ఋక్షము-వింధ్యము-పారియాత్రము లను సప్తకులపర్వతములున్నవి. భారతపర్షము నుండియే స్వర్గమోక్షముల జీవులు పొందుదురు. పశుపక్ష్యాది జన్మములను నరకమునుగూడ నిటనుండియే పొందుదురు. ఆవాంతరకర్మఫలము స్వర్గము పర్యవసానమందాత్యంతికఫలమైన మోక్షముగూడ ఇటనుండియే మానవుడు పొందును. ఈ భూమండలమందిక్కడనే కర్మానష్ఠానము విధింపబడినది. అందుచేతనే దీనికికర్మభూమియనుపేరుసార్ధకము.

భారతస్యాస్య వర్షస్య నవభేదా న్నిశామయ | ఇంద్రద్వీపః క సేరుశ్చ తామ్రపర్ణో గభస్తిమాన్‌ || 6

నాగద్వీప స్తథా సౌమ్యో గంధర్వ స్త్వథ వారుణః | అయం తు సవమస్తేషాం ద్వీపః సాగరసంవృతః || 7

యోజనానాం సహస్రం చ ద్వీపో7యం దక్షిణో త్తరాత్‌ | పూర్వే కిరాతా స్తిష్ఠంతి పశ్చిమే యవనాః స్ధతాః || 8

బ్రహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్రాశ్చ భాగశః | ఇజ్యాయుద్ధ వణిజ్యాది వృత్తిమంతో వ్యవస్థతాః || 9

భారతవర్షమున తొమ్మిది ద్వీప విభాగ మయులున్నవి. ఇంద్రద్వీపము, కశేరుపు (కశేతుమంతమని కూడయందురు) తామ్ర పర్ణము, గభస్తిమంతయు, నాగద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము. ఈ భారత ఖండ మందు తొమ్మిదవది. సముద్రసంవృతము ఇది దక్షిణదివనుండి యుత్తరదిక్కుకు వేయియోజనములు.

తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నుందురు. యజన యాజనములు. యుద్ధము వాణిజ్యము కృష్యాదులు వృత్తులు క్రమముగా వీరికి విహితములు,

శతద్రు చంద్ర భాగాద్యా హిమవత్పాదనిస్పృతాః | వేదస్మృతిముఖాశ్చాన్యాః పారియాత్రోద్భవా మునే || 10

నర్మదాసురసాద్యాశ్చ వింధ్య పాదవిని స్తృతాః | తాపీ పయోష్ణీ నిర్వింధ్యా కావేరీ ప్రముఖా స్తథా || 11

ఋక్షపాదోద్భవా హ్యేతాః శ్రుతాః పాపం హరంతి యాః| గోదావరీ భీమరధీ కృష్ణవే ణ్యాదికా శ్చయా || 12

సహ్యపాదోద్భవా నద్యః స్మృతాః పాపభయాపహాః | కృతమాలా తామ్రపర్ణీప్రముఖా మలయోదభవాః || 13

త్రిసాంధ్య ఋషికుల్యాద్యాః మహేంద్రప్రభవాః స్మృతాః|ఋషికుల్యాకుమార్యాద్యాః శుక్తిమత్పాద సంభవాః||

హిమవత్పర్వత ప్రత్యంతపర్వతమునుండి శతద్రు (సట్‌లజ్‌) చంద్రభాగ వేదము, స్మృతి మొదలయిన నదులు ప్రవహించు చున్నవి. నర్మద-సురస మొదలయినవి వింధ్యగిరినుండి వెడలుచున్నవి. తాపి-పయోష్ణి నిర్వింధ్య-కావేరి మొదలయినవి ఋక్షపర్వత పాదమందు జనించినవి, గోదావరి-ఖీమరధి-కృష్ణవేణి మొదలగునవి సహ్యగిరి పాదమందు బుట్టినవి. కృతమాలా-తామ్రపర్ణీప్రముఖములు మలయాద్రి సంభవములు. త్రిసాంధ్య-ఋషికుల్య మొదలయినవి మహేంద్రగిరి జన్యములు. ఋషికుల్యా-కుమారి మొదలైనవి శు క్తిమత్పర్వత పాదమందు బుట్టినవి. వీనియుపనదులు వేలకొలదియుగలవు.

ఆసాం నద్యుపనద్యశ్చసం త్యన్యాస్తు సహస్రశః | తా స్విమే కురుపాంచాల మధ్యదేశాదయో జనాః || 15

పూర్వదేశాదికాశ్చైవ కామరూప నివాసిసః | పౌండ్రాః కళింగా మగధా దాక్షిణాత్యాశ్చ సర్వశ || 16

తథాపరాంత్యాః సౌరాష్ట్రాః శూద్రాభీరా స్తథా7ర్బుదాః | మారుకా మాళవా శ్చైవ పారియాత్రనివాసినః || 17

సౌవీరాః సైంధవాపన్నాః శాల్వాః శాకలవాసినః | మద్రారామా స్తథా7ంబష్ఠాః పారశీకాదయ స్తథా || 18

ఆసాం పిబంతి సలిలం వసంతి సరితాం సదా | సమోపేతా మహాభాగా హృష్టపుష్టజనాకులాః || 19

వాని యందు కురుపాంచాల దేశ ప్రజ నివసించుచున్నది. తూర్పనకామరూప దేశవాసులు, కళింగులు మగధులు నున్నారు. దాక్షిణాత్యులు-దక్షిణమునందుండువారు. పశ్చిమమున సౌరాష్ట్రులు శూద్రులు ఆభీరులు-అర్బుదులు మారుకులు మాళవులు పారియాత్రనివాసులు మద్రులు రాములు, అంబష్ఠులు పారసీకాదులు వీరందరు నీయీనదుల జలములం ద్రావుదురు. ఈ దేశమలు కలిసిమెలసి ఆనందభరితులై పుష్టివంతులు నైన జనులతో నిండియుండును.

వసంతి భారతే వర్షే యుగాన్యత్రమహామునే | కృతం త్రేతా ద్వాపరం చ కలి శ్చాన్యత్ర న క్వచిత్‌ః || 20

తపస్తప్యంతి యతయో జుహ్వతే చాత్ర యజ్వనః | దానాని చాత్ర దీయంతే పరలోకార్థ మాదరాత్‌ః || 21

కృత త్రేతా ద్వాపర కలియుగ విభాగమిక్కడనే కలదు. అన్యత్రలేదు, ఇందు యతులు తపస్సు చేయుదురు. యజ్వలు హోమములు (యాగములు) సేయుదురు. పరలోకముగోరి యిచట దానము లాచరింపబడును.

పురుషై ర్యజ్ఞ పురుషో ఙంబూద్వీపే స దేజ్యతే | యజ్ఞైర్యజ్ఞ మయో విష్ణు రన్యద్వీ పేషుచాన్యథా || 22

అత్రాపి భారతం శ్రేష్ఠం జంబూద్వీపే మహామునే | యతోహి కర్మభూ రేషా యతో7న్యా భోగభూమయః || 23

అత్ర జన్మసహస్రాణాం సహసై#్రరపి సత్తమ | కదాచి ల్లభ##తే జంతు ర్మానుష్యం పుణ్యసంచయాత్‌ || 24

జంబూద్వీపమందు యజ్ఞపురుషు డుపాసింపబడును విష్ణువు యజ్ఞరూపుడుగ యజ్ఞేవ్వరుడుగ నిచట నుపాసింపబడును ఇతరద్వీపములందు మఱియొక పేరున గొల్వబడును. ఈ జంబూద్వీపమున భారతవర్షము శ్రేష్ఠము. ఇదికర్మభూమి. తక్కినవి భోగభూములు, బహుజన్మఫలభోగముగ నిందెంతో కాలమునకు మనుష్య జన్మము గల్గును.

గాయంతి దేవాః కిల గీతకాని ధన్యాస్తుయే భారత భూమిభాగే | స్వర్గాపవర్గాస్పదహేతుభూతే భవంతి భూయః పురుషా మనుష్యా || 25

కర్మాణ్య సంకల్పితతత్ఫలాని నంన్యస్య విష్ణౌ పరమాత్మరూపే|అవాప్య తాం కర్మమహీ మనంతే తసిలయం యే త్వమలాః ప్రయాంతి || 26

జానీమ నో తత్క్వవయం విలీనే స్వర్గప్రదే కర్మణి దేహబంధమ్‌ | ప్రాప్నువంతి ధన్యాః ఖలు తే మనుష్యా యే భారతే నేంద్రియవిప్రహీనాః || 27

నవర్షం చ భో విప్రా జంబూద్వీపమిదం మయా | లక్షయోజన విస్తారం సంక్షేపా త్కథితం ద్విజాః || 28

జంబూద్వీపం సమావృత్య లక్షయోజన విస్తరః భో ద్విజా వలయాకారః స్థితః క్షీరోదధి ర్బహిః || 29

దేవతలీ భారతభూమిని గూర్చి యిట్లు గానము సేయుచుందురు. స్వర్గాపవర్గములొసంగు భారతభూమియందు మనుష్యులయి, వారిలో పురుషులయి పుట్టి, అట్టి కర్మభూమియందు జన్మము వడసియు ఫలాభిసంధిలేక సర్వ కర్మఫలమును పరమేశ్వరార్పణమని పరమాత్మయగు విష్ణువునందర్పించి పాపదూరు లై యాపరబ్రహ్మ మందు లీనమగు వారు ధన్యులు. అనగా పరమేశ్వరార్పణముగ నాచరించినస్వర్గప్రదమగు కర్మ లీనమైపోయిన తర్వాత దేహబంథమును మఱియెందుపొందుదురో యెఱుగము. ఇంద్రియవంతులై భారత వర్షమున పుట్టినవారు ధన్యులు. తొమ్మిది వర్షములుగల్గి లక్షయోజనముల విరివి గల యీజంబూద్వీపమునుగూర్చి సంక్షేపముగా దెల్పితిని. ఈ ద్వీపమునావరించి లక్షయోజనములు విస్తారముగల క్షీర సముద్రము వలయాకారముగ నున్నది.

ఇది శ్రీబ్రహ్మపురాణయమున భువనకోశమందు జంబూద్వీప నిరూపణ మను పందొమ్మిదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters