Brahmapuranamu    Chapters   

అథపంచాశీత్యధికశతతమో7ధ్యాయః

కాలీయదమనమ్‌

వ్యాసు ఉవాచ

ఏకదాతు వినారామం కృష్ణో బృందావనం య¸° | విచచార వృతో గోపైరవ్న్య పుష్పస్రగుజ్వలః || 1

నజగామాథ కాలిందీం లోలకల్లోల శాలినీమ్‌ | తీరసంలగ్న ఫేనౌఘై ర్హసంతీమివ సర్వతః || 2

తస్యాం చాతి మహాభీమం విషాగ్నికణ దూషితమ్‌ | హ్రదం కాశీయనాగస్య దదర్శాతి విభీషణమ్‌ || 3

విషాగ్నినా విసరతా దగ్ధతీర మహాతరుమ్‌ | వాతాహతాంబు విక్షేప స్పర్శదగ్ధ విహంగమమ్‌ || 4

తమతీవ మహారౌద్రం మృత్యువక్తృమివాపరమ్‌ | విలోక్య చింతయామాస భగవాన్మధు సూదనః || 5

అస్మిన్వసతి దుష్టాత్మా కాశీయోసౌ విషాయుధః | యోమయా నిర్జిత స్త్యక్త్వా దుష్టో నష్టః పయోనిధౌ || 6

తేనేయం ధూషితా సర్వా యమునా సాగరంగమా | న సరైర్గోధనై ర్వాపి తృషారైరుపభుజ్యతే || 7

తదస్య నాగరాజస్య కర్తవ్యో నిగ్రహో మయా | నిత్యత్రస్తాః సుఖం యేన చరేయుర్ర్వవాసినః || 8

ఏదర్థం నృలోకే7స్మిన్నవతారో మయా కృతః | యదేషాసత్పథస్థానాం కార్యా శాస్తిర్దురా త్మనామ్‌ || 9

తదేత న్నాతి దూరస్థం కదంబ మురుశాఖినమ్‌ | అధిరుహ్యోత్పతిష్యామి హ్రదే7ష్మిన్‌ జీవనాశినః || 10

వ్యాస ఉవాచ

ఇతం విచింత్య బద్ధ్వా చ గాఢం పరికరం తతః | నిపపాత హ్రదే తత్ర సర్పరాజస్య వేగతః || 11

కాలీయదమనము

వ్యాసుడిట్లనియె. కృష్ణుడు గోవకులతో నడవిపూలమాలలు దాల్చిబలరాముడు రాకుండ నొకతరి బృందావనమునకు వెళ్ళెను. అచట తరగలులేచి నురుగులోడ్డులం దొరయ నవ్వుచున్నదా యన్నట్లున్న కాళిందీనదికిజని యందొక భయంకరమైన విషాగ్నిని జిమ్ము కాశీయసర్పమునకు నివానమైన మడుగును జూచెను. విషాగ్ని వ్యాపించి మాడిపోయి యాతీర మందలి తరువులతో గాలితాకిడికి లేచినవిషజల స్పర్శచే మాడిపోయిన పక్షులతో మరొక మృత్యుముఖమోయన్నట్లు మహారౌద్రమై యున్న యమ్మడుగుజూచి మధుసూదనుడు ఈమడుగులో విషాయుధుడు. కాశీయుడు అనుదుష్ట సర్పరాజున్నాడు. ఇంతమున్ను వీనిని సముంద్రమందు నిర్జించి వదలిపెట్టితిని. వానిచేత సాగరమున గలియు యమునానది విషదూషితయైనది. దాన నరులు గోవులు దప్పికగొనియు దీనిదరి జేరురు. కావున వీనివశ్యము నిగ్రహింపవలెను. వ్రేపల్లెలోని జనము నిత్యము వీనికి జడియుచుందురు. వారెల్లరు నిక నిట సుఖముగ సంచరింతురుగాక. ఇందుకొఱకే నీలోకమునందవతరించిలని. ఇది సత్పురుషులకి రాకపోకలంకనువైన చోటు. దురాత్ములకు శాస్తి చేయవలెను. కావున ననతి దూరములోనున్న కదంబ వృక్షమును(కడిమిచెట్టును) యొక్కి జీవనాశకమైన యీ విషవుమడుగులో దూకెదను. అని తలచినడుమున వలువ బిగించికొని యాకాశీయుని మడుగునందు కృష్ణుడు దూకిపడెను.

తేనాపి పతతా తత్ర క్షోభితః స మహాహ్రదః | అత్యర్థ దూరజాతాంశ్చ తాం శ్చా సించన్మహీరుహాన్‌ || 12

తే7హి దుష్ట విష జాజ్జ్వలా తప్తాంబు తపనోక్షితాః |జజ్వలుః పాదపాః సద్యో జ్వాలా వ్యాప్త దిగంతరాః 13

అ స్ఫోటయామస తదా కృష్ణో నాగహ్రదం భుజైః తచ్చబ్ద శ్రవణాచ్చాథ నాగరాజో7భ్యు పాగమత్‌ || 14

అ తామ్రనయనః కోపా ద్విష జ్వాలాకులైః ఫణౖః | వృతో మహావిషైశ్చాన్యైర రుణౖ రనిలాశ##నై ః 15

నాగ పత్న్యశ్చ శతశో హారిహారోపశోభితాః | ప్రకంపిత తనూత్జేపచల త్కుండలకాంతయః || 16

తతః ప్రవేష్టితః |సర్పైః స కృష్ణో భోగబంధనైః | దదంశు శ్చాపి తే కృష్ణం విషజ్వాలా విలై ర్ముఖైః 17

తంతత్ర పతితం దృష్ట్వా నాగభోగనిపీడితమ్‌ | గోపా వ్రజ ముపాగత్య చుక్రుశుః శోకలాలసాః 18

గోపాఊచుః

ఏష కృష్ణో గతో మోహమగ్నో వైకాలియే హ్రదే | భక్ష్యతే సర్పరాజేన తదాగచ్ఛత మా చిరమ్‌. 19

అట్లు దూకినహరిచే నామడుగు కలగబడి దూరదూరముననున్న వృక్షములను గూడ దనజలములచే దడపెను. విషజ్వాలలచే గ్రాగిన నాయుడుకు నీటిచే దడుపబడిన చెట్లంటుకొని నలుచెసలజ్వాలలు గ్రమ్ముకొనియె. కృష్ణుడు అ ముడుపును బాహువులచే గలకుండుపరచెను. అ శబ్దమువిని నాగరాజు కోపముచే నిండనెరుపెక్కిన కనులతో విషజ్వాలా కులమైన బుడగలతో మఱిపెక్కు యెఱ్ఱని మహావిషసర్పములతో జుట్టుకొనబడియుండెను. అనాగుని భార్యలు మనోహరహారముల దాల్చి మేనులుకంపింప కుండలముల జలించి మణికాంతులు మిరుమిట్లు గొలుప నూరునకుమించి యందందగ్రమ్ముకొనిరి. అఫణిరాజు ఫణాగ్రమందు జొచ్చి కృష్ణడు పడగలబంధమందు జిక్కుకొనియె. కాళియుని బరివారమగు పాములు విషజ్వాలలు జిమ్ముముఖమలం గరచెను. అమ్మడుగునబడి నాగని భోగమునందు నిరుకుగొనియున్న హరిని గాంచి గోపకులు వ్రేపల్లెకుజని శోకవివశులై గోలపెట్టిరి. ఇడిగోకృష్ణుడు కాశీయుని మడుగున విషముచే మూర్ఛవోయినాడు. సర్పరాజు వీనిని దినివేయగలడు. రండు, త్వరగారండని కేకలు పెట్టిరి.

వ్యాస ఉవాచ

ఏతచ్చ్రుత్వా తతోగోపా వజ్రపాతోపమం వచః | గోప్యశ్చ త్వరితా జగ్ము ర్యశోదా ప్రముఖాహ్రదమ్‌ || 20

హాహా క్వాసావితి జనో గోపీనా మతి విహ్వలః | యశోదయా సమంభ్రాంతో ద్రుతః ప్రస్ఖలితోయ¸° || 21

నందగోపశ్చ గోపాశ్చ రామాశ్చాద్భుగత విక్రమాః | త్వరితం యమునాం జగ్ముఃకృష్ణ దర్శన లాలసాః || 22

దదృశుశ్చాపి తే తత్ర సర్పరాజ వశంగతమ్‌ | నిష్ర్పయత్నం కృతం కృష్ణం సర్పభోగేన వేస్టితమ్‌ || 23

నందగోపశ్చ నిళ్చేష్టః పశ్యన్‌ పుత్రముఖం భృశమ్‌ | యశోదాచ మహాభాగా బభూప ముని సత్తమాః || 24

గోప్యస్త్వ న్యా రుదత్యశ్చ దదృశుః శోకకాతరాః | ప్రోచుశ్చ కేశవం ప్రీత్యా భయకాతర గద్గదమ్‌ || 25

సర్వా యశోదయా సార్థం విశామో7త్ర మహాహ్రదే | నాగరాజస్య నో గంతు మస్మాకం యుజ్యతే వ్రజే || 26

దివసః కోవినా సూర్యం వినా చంద్రేణ కా నిశా వినా దుగ్దేన గావో వినా కృష్ణేన కోవ్రజః

వినాకృతా న యాస్యామః కృష్ణే నానేన గోకులమ్‌ || 27

వ్యాస ఉవాచ

ఇతి గోపివచః శ్రుత్వా రౌహిణయో మహాబలః | ఉవాచ గోపాన్విధురా న్విలోక్య స్తిమితేక్షణః || 28

నంద చ దీన మత్యర్థం న్యస్తదృష్టిం సుతాననే | మూర్చాకులాం యశోదాంచ కృష్ణమాహాత్మ్యసంజ్ఞయా 29

ఆదివిని గోపకులు గోపికలు పిడుగుపడినట్లై యశోద మున్నుగా నందరు మడువు దరికేగిరి. ''కృష్ణడెక్కడ'' యనుచు వ్రేపల్లెలో యశోదతో దెదరిబెదరి తడబడుచు నటకు వచ్చిరి. నందుడు గోపకులు బలరాముడు మొదలగు నద్భుత పరాక్రమసంపన్నులు కూడ హడలెత్తి కృష్ణునిజూడ యమునకేగిరి. సర్పరాజు వశమునుండి యన్నిపడగలచే జుట్టబడి యేమిజేయక మిన్నకున్న కృష్ణుని జూచిరి. నందగోవుడు నిశ్చేష్టుడై కొడుకు నెమ్మోము చూచుచు నిలువబడెను. యశోదయు నిశ్చేష్టు రాలయ్యెను. మఱియుంగల గోపికలు ఏడ్చుచు కేశవుని గూర్చి శోకాక్రాంతులై భయభ్రాంతలై యశోదతో గూడ నీపెనుమడువున జొత్తుము చత్తుముగాక తిరిగి పల్లెకులబొరాదు.సూర్యుడు లేని పగలేమి చంద్రుడు లేని రాత్రియేమిరాత్రి పాలులేని యావులు ఏమి యావులు. కృష్ణుడు లేని వ్రేపల్లె యేమి పల్లె. ఈ కృష్ణుడులేకుండ గోకులమునకు బోనేపోము. అను నీ గోపకల మాటివిని రోహిణికొడుకు బలరాముడు కృష్ణదూరులైన గోపకులను జూచి చూపు నిలిపి బిడ్డముఖమున జూవు వెట్టి దిగులు పడియున్న నందుని మూర్చాకులయైన యశోదను నుద్దేశించి కృష్ణుప్రభావ మెఱిగి యిట్లనియె.

బలరామ ఉవాచ

కిమయం దేవదేవేశ ! భా7వోయం మానుషస్త్వయా | వ్యజ్యతే స్వం తమాత్మానం కిమన్యం త్వం నవేత్సియత్‌ 30

త్వమస్య జగతోనాభిః సురాణామేనఛాశ్రయః | కర్తాపహర్తా పాతాచ త్రైలోక్యం త్వం త్రయీమయః || 31

అత్రావతీర్ణయోః కృష్ణగోపా ఏవ హి బాంధవాః | గోప్యశ్చ సీదతః | కస్మాత్త్వం బంధూన్‌ సముపేక్షసే 32

దర్శితో మానుషో భావో దర్శితం బాల చేష్టితమ్‌ తదయం దమ్యతాం కృష్ణ దురాత్మా దశనాయుధః || 33

వ్యాస ఉవాచ

ఇతి సంస్మారితః కృష్ణః స్మిత భిన్నౌష్ట సంపుటః అస్ఫాల్య మోచయామాస స్వందేహం భోగబంధనాత్‌ || 34

''దేవదేవ! నీ మానుష భావము వెల్లడించు చుంటివా? ఆత్మ స్వరూపమును నీ వెరుగవా? వేరొకరూపే చూపనేల? నీవేజగత్తునకు నాభిభూతుడవు. దేవతల కాశ్రయుడవు. త్రైలోక్యమునకు కర్తవు. భర్తవు హర్తవును. వేదత్రయీరూపుడవు. ఇట నవతరించిన మనకిద్దరకు కృష్ణాగొల్లచే చుట్టాలుకదా! గోపికలునంతేకదా! ఇట్లుపరితపించు నీ బంధువులనుచూచి యెందువలన నుపేక్షించుచున్నావు. మానుష భావము చూపితివి. బాలచేష్టలు ప్రదర్శించితివి. కోరలాయుధముగ గొనిన ఈ దురాత్ముని దమింపుము.'' అని హలిచే జ్ఞప్తిచేయబడి కృష్ణుడు చిరునవ్వున నధరిబింబము దెరచుకొన భూజాస్పాదన ముజేసి పాము పడగల బంధములనుండి తన మేనిని వదలంచు కొనెను.

అనామ్యచాపి హస్తాభ్యా ముభాభ్యా మధ్యమం ఫణమ్‌ | ఆరుహ్య భుగ్నశిరసః ప్రననర్తోరువిక్రమః || 35

వ్రణాః ఫణ7భవం స్తస్య కృష్ణ స్యాంఘ్రి వికుట్టనైః యత్రోన్నతిం చకురుతే ననా మాస్య తతః శిరః || 36

మూర్చాముపాయ¸° భ్రాంత్వా నాగః కృష్ణస్యకుట్టనై | దండపాతనిపాతేన పవామ రుధిరంభహు || 37

తం నిర్భుగ్న శిరోగ్రీవ మాస్యప్ర నృతశోణితమ్‌ | విలోక్యశరణం జగ్మున్తత్పత్య్నో మధుసూదనమ్‌ || 38

నాగపత్న్య ఊచుః

జ్ఞాతో7సి దేవదేవః సర్వేశస్త్వమనుత్తమ | పరం జ్యోతిరచింత్యం యత్తదంశః పరమేశ్వరః || 39

నసమర్థాః సురాస్తోతుం యమనన్యభవం ప్రభుమ్‌ | స్వరూప వర్ణనం తస్యకథం యోషిత్కరిష్యతి || 40

యస్యాఖిల మహీవ్యోమ జలాగ్ని పవనాత్మకమ్‌ | బ్రహ్మండ మల్పకాంశాంశః స్తోష్యామస్తంకథం వయమ్‌ 41

తతః కురుజగత్య్వామిన్‌ ప్రసాద మవసీదతః | ప్రాణాంస్త్యజతి నాగోయం భర్తృ భిక్షాప్రదీయతామ్‌ || 42

వ్యాస ఉవాచ

ఇత్యుక్తే తాభిరాశ్వాస్యక్లాంత దేహో7పి పన్నగః | ప్రసీద దేవదేవేతి ప్రాహవాక్యం శ##నైః శ##నైః 43

కాళీయ ఉవాచ

తవాష్ట గుణ మైశ్వర్యం నాథ స్వాభావికమ్‌ పరమ్‌ నిరస్తాతిశయం యస్య తస్య స్తోష్యామి కిన్వహమ్‌ 44

త్వం పరస్త్వం పరస్యా7ద్యః పరమ్‌త్వం తత్పరాత్మకమ్‌ ||

పరాస్మాత్‌ వరమో యస్త్వం తస్యస్తోష్యామి కిన్వహమ్‌ || 45

యథాహం భవతా సృష్టో జాత్యారూపేణ చేశ్వరః | స్వభావేన చ సంయుక్త స్తథేదమ్‌ చేష్టితం మయా 46

యద్యన్యథా ప్రవర్తేయ దేవదేవ తతోమయి | న్యాయ్యో దండనిపాత స్తే తవైవ వచనం యథా 47

తథా7పి యం జగత్న్వావీ దండం పాతితవాన్మయి | స సోడోయం వరో దండ స్త్వత్తో నాన్యోస్తు మేవరః || 48

హతవీర్యో హతవిషో దమితోహం త్వయాచ్యుత | జీవితం దీయతామేక మాజ్ఞాపయ కరోమికిమ్‌ || 49

శ్రీభగవానువాచ

నాత్రస్థేయం త్వయా సర్ప కదాచిద్యమునాజలే | సభృత్య పరివారస్త్వం సముద్ర సలిలం వ్రజ || 50

మత్పదాని చ తే సర్ప దృష్ట్వా మూర్థని సాగరే | గరుడః పన్నగరిపుస్త్వయి నప్రహరిష్యతి || 51

వ్యాస ఉవాచ

ఇత్త్యుక్త్వా సర్పరాజానం ముమోచ భగవాన్‌ హరిః | ప్రణమ్యసో7పి కృష్ణాయ జగామ పయసాంనిధిమ్‌ || 52

పశ్యతాం సర్వ భూతానాం సభృత్యాపత్య భాందవః | సమస్త భార్యసహితః పరిత్యజ్య స్వకంహ్రదమ్‌ || 53

గతే సర్పే వరిష్వజ్య మృతం పురివా77గతమ్‌| గోపా మూర్థని గోవిందం సిషి చుర్నేత్రజైర్జలైః 54

కృష్ణమక్లిష్ట కర్మాణమన్యే విస్మిత చేతసః | తుష్టుపుర్ముదితా గోపా దృష్ట్వా శివజలాం నదీమ్‌ || 55

గీయమనో7థ గోపీభిశ్చరి తైళ్చారుచేష్టితైః | సంస్తూయమానో గోపాలైః కృష్ణో వ్రజముపాగమత్‌ || 56

ఇతి శ్రీ బ్రహ్మపురాణ కాలీయదమన నిరూపణంనామ పంచాశీత్యధిక శతతమోధ్యాయః

రెండు చేతుల నా పాము మధ్యమ ఫణమును వంచి వ్రాలిన వాని తలపై నెక్కి యవక్ర విక్రమమున నర్తనము జేసెను. హరి పాదకుట్టనములచే (రాపిడిచే) వాని పడగలు పుళ్ళుపడెను. త్రోక్కిన తల వొంగిపోయెను కాశియుడు కృష్ణపాద ఘట్టమున మూర్చనొంచెను. దండపాతమట్లు పడిపోయి నెత్తురు గ్రక్కెను. శిథలములైన శిరస్సుల ముఖముల నుండి రక్తము స్రవించ జూచి వాని భార్యలు మధుసూదడమని శరణోందిరి.

దేవదేవ! సర్వేశ్వర! పురుషోత్తమ ! నీవు పరంజ్యోతి స్వరూపుడవు. అత్మయొక్క భాగమేనీవు. నిన్నుస్తుతింప దేవతలును జాలరు. అట్టి నీ స్వరూప వర్ణన డుది యెట్లు చేయడలదు. పృథివ్యప్తేజో వాయ్వాకాశములను జాలవు. అట్టి నీస్వరూప వర్ణన మడుది యెట్లుచేయకలదు. పృథివ్వప్తేజో వాయ్వాకాశ రూపమయిన బ్రహ్మండమనీలో యల్పాల్పమైన యంశము. అట్టి నిన్నేమి స్తుతింపగలను. కావున నోజగత్ప్రభో! ఈ నాగని యెడ దయ జూపుము. అణగి మణగి ప్రాణములు వదలు చున్నాడు. భర్తృభిక్ష పెట్టుము. అని నాగపత్నులు వలుకకాళీయుడు వొడలెల్ల నలుగుడువడి కూడ దేవదేవ! యనుగ్రహింపుమని మరిమరి ఇట్లుపలికెను.

నీ ఐశ్వర్య మెనిమిది విధములు. అది స్వభావసిద్ధము. దానిని యతిశయించునది మఱి లేదు. అట్టియణిమాది విభూతిసంపన్నుడగు నిన్నేమి స్తుతింపగలడు. నీవు పరుడవు పరున కును మూలము నీవు. నీకంటె పరమైనతత్వము నీవె. పరతత్వమునకు వరమునీవు. అట్టినిన్నేమి స్తుతింపగలను. జాతిచే రూపముచే దామిట్లునన్ను సృజించితిరి. దానికణుగుణ మైన స్వభావముకూడినవాడను. తదనుగుణమైన చేష్టను చేసితిని. సర్పస్వభావమైప కాటు వేయుటను గరచుటను మాని వేఱొకతీరున ప్రవర్తింతునేని స్వామి! నన్ను దండించుటన్యాయము. అట్లయ్యు నోజగత్ప్రభు నాపై దండనము వైచితివి. ఈ దండనము నీవు విధించినది కావున యిది వరముగనేను స్మరింపవలసినదే. ఇంతకంటె నీవలన మఱొకవరమువలదు. అచ్యుత! వీర్యము హతమైనది, విషము హతమైనది. నీచే నేను దమితుడనైతిని. బ్రాణ మొక్కటి మాత్రమిమ్ము. మఱియేమి నేనుసేయవలేనో ఆజ్ఞాపింపుము అనవిని శ్రీభగవానుడు ఓ పాము! ఈ యమున జలమున నిక్కడ నీవెపుడు నుండవలదు. భృత్యపరివారముతో నీవు సముద్రజలములం జనుము నీతలపై నాపాదములను జూచి సముద్రమున పన్నగారియైన గరుడుడు నిన్ను జంపడు అని హరి సర్పరాజును వదలెను. వాడును కృష్ణునకు మ్రొక్కి సముద్రమునకేగెను. సర్వభూతములు చూచుచుండ భృత్యులతో సంతతితో బంధువులతో భార్యలందరితో నమ్మడుగు విడిచి సర్పము వోయినంత గోపకులు చనిపోయి మఱివచ్చిన వానినట్లు గోవిందుని కౌగిలించుకొని భాష్పములచే నాతని శిరస్సుదడిపిరి. ఎల్లరు మనసులచ్చరువుబడ నానందభరితులై యానది మధురమంగళ రసపూరితముగాజూచి స్వామిని స్తుతించిరి. గోపికలచే గీర్తింపబడి గోవకులతో గృష్ణుడు వ్రేపల్లెకరుదెంచెను.

ఇది బ్రహ్మపురాణమున కాలీయదమనమను నూటయెనుబదియైదవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters