Brahmapuranamu    Chapters   

అథ చతురశీత్యధికశతతమో7ధ్యాయః

బృందావనగమనమ్‌

వ్యాస ఉవాచ

విముక్తో వసుదేవో7పి నందస్య శకటంగతః | ప్రహృష్టం దృష్టవాన్నందం పుత్రోజాతోమమేతివై || 1

వసుదేవో7పి తం ప్రాహ దిష్ట్యాదిష్ట్యేతిసాదరమ్‌ | వార్థకే7పి సముత్పన్నస్తనయో7యం తవాధునా || 2

దత్తోహి వార్షికః సర్వోభవద్భిర్నృపతేః కరః | యదర్థమాగత స్తస్మాన్నాత్ర స్థేయం మహాత్మనా || 3

యదర్థమాగతః | కార్యం తన్నిష్పన్నం కిమాస్యతే | భవద్భిర్గమ్యతాం నంద తచ్ఛీఘ్రం నిజగోకులమ్‌ || 4

మమాపిబాలకస్తత్ర రోహిణీప్రసవో హియః | స రక్షణీయో భవతా యథాయం తనయో నిజః || 5

బృందావన గమనము

వ్యాసులిట్లనిరి.

వసుదేవుడు కారాగృహముక్తినం నందుని బండియెక్కి నాకు పుత్రుడుగల్గినాడని యానంద భరితుడగు చున్న నందుని జూచెను. మఱియు నతనితో నాదరము గొని నీకి వార్థకమందు పిల్లవాడు గల్గినాడు. రాజునకు మీరేటేట జెల్లింపవలసిన పన్ను గట్టుటకు వచ్చియది చెల్లింపబడెగదా వచ్చినపనియైనది. శీఘ్రముగ గోకులమున కేగుడు నాకునక్కడ రోహిణియందు శిశువు పుట్టినవాడు మీ బిడ్డనట్లు వానిని తమరు రక్షింపవలయును. అనియె.

వ్యాస ఉవాచ

ఇత్యుక్తాః ప్రయయుర్గోపా నందగోపపురోగమాః | శకటారోపితైర్భాండై కరందత్త్వా మహాబలాః || 6

వసతాం గోకులేతేషాం పూతనా బాలఘాతనీ | సుప్తం కృష్ణముపాదాయ రాత్రౌచ ప్రదదౌస్తనమ్‌ || 7

యసై#్మ యసై#్మస్తనం రాత్రౌపూతనా సంప్రయచ్ఛతి | తస్యతస్యక్షణనాంగం బాలకస్యోపహన్యతే || 8

కృష్ణస్తస్యాః స్తనం గాఢం కరాభ్యామతిపీడితమ్‌ | గృహీత్వా ప్రాణసహితం పపౌక్రోధసమన్వితః || 9

సా విముక్తమహారావా విచ్చిన్నస్నాయుబంథనా | పపాత పూతనా భూమౌ మ్రియమాణా7తిభీషణా || 10

తన్నాదశ్రుతి సంత్రాసాద్విబుద్దాస్తే వ్రజౌకసః | దదృశుః పూతనోత్సంగే కృష్ణంతాంచ నిపాతితామ్‌ || 11

ఆదాయ కృష్ణం సంత్రస్తా యశోదాచ తతోద్విజాః | గోపుచ్చభ్రమణాధ్యైశ్చ బాలదోషమపాకరోత్‌ || 12

గోపురీష ముపాదాయ నందగోపో7పిమస్తకే | కృష్ణస్య ప్రదదౌ రక్షాం కుర్వన్నిద ముదైరయత్‌ || 13

నందాది గోపకులిట్లు తెలుపబడి బండ్లమీద ధనభాండముల నెక్కించుకొని తెచ్చిన ధనమును పన్ను జెల్లించి వ్రే పల్లె యందుండగా బాలఘాతినియైన పూతన వచ్చి నిదిరించుచున్న కృష్ణునెత్తుకొని యొకరేయి పాలిచ్చెను. ఆమెయెవనెవ్వనికి చనుగుడిపేనో వానివాని శరీరము నశించుచుండును. కృష్ణుడా రాక్షసి స్తనము నిరుచేతులనొత్తిపట్టుకొని కోపమున పాలతో బాటు ప్రాణములం ద్రావివైచెను. అది యార్చుచు ప్రేవులు దెగి ప్రాణములు వాసి పుడమిం బడి పోయెను. దానియార్పువిని హడలిపోయి మేల్కని వ్రేపల్లెలోని జనముపూతన యొడిలో నున్న కృష్ణుని గూలిపడి యున్న యారక్కసినిం గాంచిరి. యశోద తటాలున కృష్ణునెత్తుకొని జడిసిపోయి అవుతోక తలచుట్టు తిప్పుట నుదుట గోమయము బొట్టువెట్టుట మున్నగు నంగరక్షలు సేసి చంటిపిల్లలకగు దోషమును వారించెను. మఱియు నాతల్లి యిట్లు రక్షాకవచముం బఠించెను.

నందగోప ఉవాచ

రక్షతు త్వామశేషాణాం భూతానాం ప్రభవోహరిః | యస్యనాభిసముద్భూతాత్పంకజాద భవజ్జగత్‌ || 14

యేన దంష్ట్రాగ్రవిధృతా ధార యత్యవనీ జగత్‌ | వరాహరూప ధృగ్దేవః స త్వాం రక్షతుకేశవః || 15

గుహ్యం స జఠరం విష్ణుర్జంఘే పాదౌ జనార్దనః | వామనో రక్షతు సదా భవంతంయః క్షణాదభూత్‌ || 16

త్రివిక్రమక్రమాక్రాంత త్రైలోక్య స్పురదాయుధః | శిరస్తేపాతు గోవిందః కంఠం రక్షతు కేశవః || 17

ముఖబాహూ ప్రబాహూచమనః సర్వేంద్రియాణిచ | రక్షత్వవ్యాహతైశ్వర్యస్తవ నారాయణో7వ్యయః || 18

త్వాం దిక్షుపాతు వైకుంఠో విదిక్షు మధుసూదనః | హృషీకేశో7బరే భూమౌ రక్షతు త్వాంమహీధరః || 19

వ్యాస ఉవాచ

ఏవం కృతస్వస్త్యయనో నందగోపేన బాలకః | శాయితః శకటస్యాధో బాలపర్యంకికాతలే || 20

తే చ గోపా మహద్దృష్ట్వా పూతనాయాః కలేబరమ్‌ | మృతాయాః పరమంత్రాసం విస్మయం చ తదాయయుః || 21

ఎవని బొడ్డునంబొడమిన తామర పువ్వునుండి జగత్తు పొడమినదో యా సర్వభూతకర్తయగు హరి నిన్ను రక్షించుగాక! ఎవ్వని కోరుతుట్టతుద ధరింపబడిన ధారుణి సర్వజగత్తును ధరించు చున్నదో అవరాహరూపములదాల్చిన వేల్పు కేశవుడు నిన్ను రక్షించుగాక! నీ గుహ్యమును జఠరమును విష్ణువు నీపిక్కలను బాదములను జనార్దనుడు రక్షించుగాక! ఎవ్వడు వామనమూర్తియై క్షణములో మూడడుగులిడి ముల్లోకముల నాక్రమించె నావామన మూర్తియాయుధములగొని నిన్ను బ్రోచుగాక, గోవిందుడు నీశిరస్సును గాపాడుగాక! కేశవుడు నీకంఠమును రక్షించుత ! నీముఖము నీబాహువులు నీముంజేతులను మనస్సును సర్వేంద్రియములను అవ్యాహతైశ్వర్యుడు అవ్యయుడు నగు నారాయణుడు రక్షించుగాక! నలుదిక్కుల నిన్ను వైకుంఠుడేలుగాక! విదిక్కులందు మదుసూదనుడు బ్రోచుగాక! అంబర వీథిని హృషీకేశుడు మహీధరుడు భూమియందును నిన్ను రక్షించుత! అనియిట్లు యశోదమ్మచేత మంగళా శాసనములు సేయబడి బాలకుడు బండిక్రింద పొత్తళ్ల బరుండ బెట్టబడియె. గోపకులట గూలిన పూతన కళేబరముం జూచి చచ్చిన దానిం జూచియు నడలిపోయి యబ్బురమందిరి.

కదాచిచ్ఛకటస్యాధః శయానోమధుసూదనః | చిక్షేప చరణాపూర్ద్వం స్తనార్థీ ప్రరురోద చ || 22

తస్య పాదప్రహారేణ శకటం పరివతర్తితమ్‌ | విధ్వస్త భాంఢకుంభం తద్విపరీతం పపాతవై || 23

తతో హాహాకృతః సర్వో గోపగోపీజనో ద్విజాః | ఆగత్యచ తదాజ్ఞాత్వా బాలము త్తానశాయినమ్‌ || 24

గోపాః కేనేతిజగదుః శకటం పరివర్తితమ్‌ | తత్రైవ బాలకాః ప్రోచుర్బాలే నానేస పాతితమ్‌ || 25

రుదతా దృష్ట మస్మాభిః పాదవిక్షేపతాడితమ్‌ | శకటం పరివృత్తం వై నైతదన్యస్య చేష్టితమ్‌ || 26

ఒకతఱి నాబండిక్రింద బరుండిన మధుసూదనుండు రెండు పాదములు మీదికెత్తి పాలకై యేడ్చుచుండెను. ఆ స్వామి పాదముల తోవున కాబండి తలక్రిందులాయె. అందున్న పాలకడవలెల్ల బోర్లపడియె. అంత నాగోప గోపీ జనము హాహాకారమొనరించిరి. అందఱు వచ్చి వెల్లగిలపరున్న శిశువుంగని యీ బండి యెవ్వని వలన దిరుగువడినదనియడిగిరి. అటనున్న పిల్ల లీపిల్లవానివలననే యిదివడినది. ఏడ్చుచు నీతడు పాదములాడింప నవి తగిలి యీ బండి తలక్రిందులైనదీపని మఱి యెవ్వనిది గాదనిరి. అదివిని గోపకులింకను వింతవడిరి.

తతః పునరతీవా77సన్‌గోపా విస్మితచేతసః |నందగోపో7పి జగ్రాహ బాలమత్యంత విస్మితః || 27

యశోదా విస్మయారూఢా భ్నగభాండ కపాలకమ్‌ | శకటం చార్చయామాస దధి పుష్పఫలాక్షతైః || 28

గర్గశ్చ గోకులేతత్ర వసుదేవప్రచోదితః | ప్రచ్చన్న ఏవ గోపానాం సంస్కారము కరోత్తయోః || 29

జ్యేష్ఠం చ రామమిత్యాహ కృష్ణం చైవ తథా7పరమ్‌ | గర్గో మతిమతాం శ్రేష్ఠో నామ కుర్వన్‌ మహామతిః || 30

అల్పేనైవ హి కాలేన విజ్ఞాతౌతౌ మహాబలౌ | ఘృష్ట జానుకరౌ విప్రా బభూవతు రుభావపి || 31

కరీష భస్మ దిగ్ధాంగౌ భ్రమమాణా వితస్తతః | న నివారయితుం శక్తా యశోదా తౌన రోహిణీ || 32

గోవాటమధ్యే క్రీడంతౌ వత్సవాటగతౌ పునః | తదహర్జాతగోవత్స పుచ్ఛాకర్షణ తత్పరౌ || 33

యదాయశోదా తౌ బాలావేక స్థానచరావుభౌ | శశాక నో వారయిత్తుం క్రీడంతా వతిచంచలౌ || 34

దామ్నా బద్‌ధ్వా తదా మధ్యేనిబబంధ ఉలూఖలే | కృష్ణ మక్లిష్టకర్మాణమాహ చేద మమర్షితా || 35

యశోదోవాచ

యదిశక్తో7సి గచ్ఛ త్వమతి చంచల చేష్టిత || 36

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా చ నిజం కర్మ సా చకార కుటుంబినీ | వ్యగ్రాయా మథ తస్యాం స కర్షమాణ ఉలూఖలమ్‌ || 37

యమలార్జునయోర్మధ్యే జగామ కమలేక్షణః | కర్షతా వృక్షయోర్మధ్యే తిర్యగేవ ములూఖలమ్‌ || 38

భగ్నావుత్తుంగ శాఖాగ్రౌ తేన తౌ యమలార్జునౌ | తతః కటకటాశబ్ద సమాకర్ణన కాతరః || 39

అజగామ వ్రజజనో దదృశే చ మహాద్రుమౌ | భగ్నస్కందౌ నిపతితౌ భగ్నశాఖౌ మహితలే || 40

దదర్శచాల్పదంతాస్యం స్మితహాసం చ బాలకమ్‌ | తయోర్మధ్యగతం బద్ధం దామ్నాగాఢం తథోదరే || 41

నందగోపుడాబిడ్డ నెత్తికొని వెఱగు వడియె. యశోద యబ్బురపడి పగిలిన కుండ పెంకులుగల బండిని పెరుగు పూలుపండ్లు నక్షతలచే నర్చించెను. గర్గాచార్యుల గోకులమందు వసుదేవు ప్రేరణముచే (కంపభీతిచే) నెవ్వనికిందెలియరాకుండనే యాబలరామ కృష్ణులకు జాతకర్మాది సంస్కారములొనరించె. ఆ ముని పెద్దవానిని రాముడని యవ్వలి వానిని కృష్ణుడని పేర్కొనియె. అత్యల్పకాలముననే యా బాలురు మహాబల సంపన్నులయిరి. కాలుసేతులాడించుచు గ్రమముగా బ్రాకుచు వెలిబూడిద మెడల బూనుకొని యిట్టుటు నడయాడుచుండ నాయన్నదమ్ముల నా తల్లి యశోద పట్టలేని దయ్యెను. గోవాటమునందు లేగల దొడ్డియందు నాబాలు రానాడే పుట్టిన లేగదూడల తోకలు గొని లాగుచు నిద్దరోక్కచోట నడయాడుచు నాటలాడుచుండ యశోదవారిబట్ట లేనిదయ్యె. ఒక్కతఱి నాతల్లి కినుకుగని కృష్ణుని ద్రాడుగొని ఱోలికిం గట్టి ఓరోరి అల్లరిపిల్ల వాడ ! నీ చేత నైన నేది వెళ్లు మెటువోదవో చూచెదనని యింటి పనులు సక్కవెట్టు తొందరలో నుండ రోలిడ్చుకొంచు పోయిపోయి కమల నయనుడు హరి రెండు మద్ది చెట్లనడుమం జొచ్చి యిరుకుత్రోవం జనుచుండ ఱోలు తిఱగుడువడి తాక నాచెట్లు పెనుగొమ్మల గూలి పడిపోయెను. అంత నచ్చట పొడమిన కటకటా శబ్దము విని బెదరి వ్రేపల్లెనము గ్రమ్ముకొని యా పెనుమ్రాకుల మొదళ్ళు పెల్లగిలి కొమ్మలు విఱిగి పుడమిబడం జూచిరి. దానితోబాటు వచ్చియురాని పలువరుస మందహాస నింపుగులుక నామ్రాకులజంట నట్టనడుమ బొజ్జదిఱుగ పెనురజ్జువున గట్టబడినా పలుదిట్టనా చిట్టి కుఱ్ఱంగనిరి.

తతశ్చ దామోదరతాం స య¸° తామబంధనాత్‌ | గోపవృద్ధాస్తతః సర్వే నందగోవ పురోగమాః || 42

మంత్రయామసురుద్విగ్నా మహోత్పాతాతిభీరవః | స్థానేనేహ న నః కార్యం వ్రజామో7న్యత్‌ మహావనమ్‌ || 43

ఉత్పాతా బహవో హ్యత్ర దృశ్యంతే నాశ##హేతవః | పూతనాయా వినాశశ్చ శకటస్య విపర్యయః || 44

వినా వాతాది దోషేణ ద్రుమయోః పతనం తథా | బృందాపనమితః స్థానాత్తస్మాద్గచ్చామ మాచిరమ్‌ || 45

యావద్భౌమమహోత్పాత దోషో నాభిభ##వేద్‌ వ్రజమ్‌ | ఇతి కృత్వా మతిం సర్వే గమనే తే వ్రజౌకసః || 46

ఊచుః స్వం స్వం కులం శీఘ్రం గమ్యతాం మా విలంబ్యతామ్‌ | తతః క్షణన ప్రయయుః శకటైర్గోధనైస్తథా ||

యూథశో వత్సపాలీశ్చ కాలయంతో వ్రజౌకసః | సర్వావయవ నిర్దూతం క్షణమాత్రేణ తత్తదా || 48

దామముచే నుదరమునం గట్టబడినవాడు గావున దాన నాతడు దామోదరుడయ్యె. అవ్వల గోపవృద్దులు నందాదులు చెదరిపోయి యెడనెడ నిట్లుగల్గు మహోత్పాతములకు జడిసిపోయి యిచ్చోటు వలనబని లేదెటకేని కారడవికి బోవుదమనికొనిరి. పెక్కురకముల వ్రేపల్లెందోచు నుత్పాతములివి. పూతనగూలుట బండి తలక్రిందులగుట పెనుగాలి మఱి యేదోషములేక చెట్లుగూలిపడుట యివన్నియు మనకు నాశనహూతువులు అందుచే నిటనుండి లేచి యిపుడు బృందావనమున కేగుదుముగాక ! భౌమమయిన యుత్పాతదోష మేర్పడకుండ నీ పల్లెను విడచి పోవలయునని నిశ్చయించిరి. మఱియు దమదమ వారిని బందుగులనువిలంబము వలదులెండునిహెచ్చరించియందఱు బండ్లెక్కి గోధనములతో (మందలతో) నాలమేపరులను వ్రజవాసులను పిలిచికొనుచు మందలుగా దరలి చనిరి. క్షణ ములో నా వ్రజవాటము సర్వావయవ భంగము పొంది కాకికూతలవెఱవై పోయెను.

కాకకాకి సమాకీర్ణం వ్రజస్థాన మభూద్విజాః | బృందావనం భగవతా కృష్ణేనా క్లిష్టకర్మణా || 49

శుభేన మనసా ధ్యాతం గవాం వృద్దిమభీప్సతా | తతస్తత్రాతి రూక్షే7పి ఘర్మకాలే ద్విజోత్తమాః || 50

ప్రావృట్కాల ఇవాభూచ్చ సవశష్పం సమంతతః || స సమావాసితః సర్వోవ్రజో బృందావనే తతః || 51

శకటీవాట పర్యంత చంద్రార్థా కార సంస్థితిః | వత్సపాలౌ చ సంవృత్తౌ రామదామోదరౌతతః || 52

తత్ర స్తితౌ తౌ గోష్ఠే చ చేరతుర్భాలలీలయా | బర్హిపత్ర కృతాపీడౌ వన్య పుష్పావతంసకౌ || 53

గోపవేణు కృతాతోద్య పత్రవాద్య కృతస్వనౌ | కాక పక్ష ధరౌ బాలౌ కుమారా వివపావకౌ || 54

హసంతౌ చరమంతౌ చ చేరతుస్తం మహద్వనమ్‌ | క్వచిద్ధనంతా వన్యోన్యం క్రీడమానౌ తథాపరైః || 55

గోపపుత్రైః సమం వత్సాంశ్చారయంతౌ విచేరతుః | కాలేన గచ్చతా తౌతు సప్తవర్షౌ బభూవతుః || 56

భగవంతుడు కృష్ణుడు గోవులక్షేమాభివృద్దులంగోరి శుభమయిన మనస్సుతో బృందావనమును ధ్యానించెను. అందుచే మిక్కిలి పరుషమైన గ్రీష్మకాలమున గూడ వర్షరతు ధర్మములుదోచి వానకారునంబోలె నెటజూలన లేత పచ్చికలచ్చెరవు గొలిపె. సర్వ గోకులమట్లు బృందావన నివాసమ్యె. వారెక్కివెళ్లినబండ్లు నిలిపిన యవ్వనవాట మర్ధచంద్రా కారమున శృంగార మొలకించె. రామదామోదరులక్కడ యాలకాపరులైరి. ఆ గోవుల మందలందు గోశాలలందు (గోష్ఠములందు) సవిలానముగ నా బలరామకృష్ణులాడుకొన జోచ్చిరి. కొండెసిగలం నెమలి పించెములను జెఱవికొని యయ్యడవి పూలంజుట్టు లందురిమి పిల్లగ్రోవులూదినోనుచు లయన గుణముగ వాద్యములు వాయిం చుచు నిరువంక జునుపములు వ్రెల నగ్ని కుమారులలోయన్నట్లు(కుమారస్వామి పోలికలతోనన్నమాట) నవ్వుచు గేరుచు గేరింతలుకొట్టుచు నవ్వనమందు సంచరింపదొదంగిరి. ఒండొరులంగని పరియాచకములాడుకొనుచు నంగడికాండ్రగూడి దూడల మరలించుకొనుట నిట్లు సరసన వారేడేండ్ల ప్రాయము వారైరి.

సర్వస్య జగతః పాలౌ వత్సపాలౌ మహాప్రజే | ప్రాపృట్కాల స్తతో7తీవ మేఫ°ఘ స్థగితాంబరః || 57

బభూవ వారిథారాభిరైక్యం కుర్వన్‌దిశామివ | ప్రరూఢనవం పుష్పాఢ్య శక్రగోపవృతామహీ || 58

యథా మారకతే77వాసీత్పద్మ రాగవిభూషితా | ఊహురున్మార్గగామీని నిమ్నగాంబాంసి సర్వతః || 59

మనాంసి దుర్వినీతానాం ప్రాప్య లక్ష్మీం నవామివ | వికాలేచ యథాకామం వ్రజమేత్య మహాబలౌ || గోపైః సమానైః సహితౌ చిక్రీడాతే7మరావివ || 60

ఇతి శ్రీ బ్రహ్మపురాణ బృందావన ప్రవేశవర్ణనం నామ చతురశీత్యధికశతతమో7ధ్యాయః

ఎల్లలోకముల గాచువారచ్చటనట్లు దూడలంగాచువారైన తఱి నింగినెల్ల మబ్బులగ్రమ్మ వారిధారల దశదిశ లోక్కటి గావించి వానకాలమేతెంచె. ఎటుచూచిన చెట్లుచేమలు తీవలు మొగ్గదొడిగి కొన్ననలుపూసె. ఇంద్రగోపములు మెఱసి మరకత మణింబద్మరాగములు పొదవినట్లందముగుల్కి నదీ జలపూరములు కట్టలుద్రెంచుకొని నడిమంత్రపు సిరినొంది దుందుడుకువడు చెడగరుల మనస్సులట్లు ఉన్మార్గములు(దారితప్పి నడచునవి) అయ్యె. సమయముగాని సమయమునేని స్వేచ్చగ నా మందకువచ్చి యావీరులు బలరామకృష్ణు లీడుజోడు వారింగలిసి యమరులట్లా బృదావన మందాటలాడిరి.

ఇది బ్రహ్మపురాణమున బృందవనగమనము అను నూటయెనుబదినాల్గవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters