Brahmapuranamu    Chapters   

ద్యశీత్యధికశతతమో7ధ్యాయః

శ్రీ కృష్ణజననకథనమ్‌

వ్యాస ఉవాచ

యథో క్తం సాజగద్ధాత్రీ దేవదేవేన వై పురా | షడ్గర్భ గర్భ విన్యాసం చక్రేచాన్యస్య కర్షణమ్‌ || 1

సప్తమే రోహిణీం ప్రాప్తే గర్భే గర్భేతతోహరిః | లోకత్రయోపకారాయ దేవక్యాః ప్రవివేశ##వై || 2

యోగనిద్రా యశోదాయా స్తస్మిన్నేవతతోదినే | సంభూతాజఠరే తద్వద్యథోక్తం పరమేష్ఠినా || 3

తతోగ్రహగణం సమ్యక్ప్రచచార దివిద్విజాః | విష్ణోరంశే మహీంయాతే ఋతవో7ప్యభవన్‌ శుభాః || 4

నోత్సేహే దేవకీం ద్రష్ఠుం కశ్చిదప్యతితేజసా | జాజ్వల్యమానాం తాం దృష్ట్వా మనాంసి క్షోభమాయయః || 5

అదృష్టాం పురుషైః స్త్రీభి ర్దేవకీం దేవతాగణాః | బిభ్రాణాం వపుషా విష్ణుం తుష్టువు స్తా మహర్నిశమ్‌ || 6

శ్రీ కృష్ణజన్మకథనము

వ్యాసులిట్లనియె. జగత్కర్త్రియైన యా విష్ణుమాయ దేవదేవుడు సెప్పినట్లు దేవకి యారుకాన్పులనొనరించి తరువాతి గర్భమును నాకర్షించెను. ఈ తరువాత దేవకీ గర్భమందు హరి ప్రవేశించెను. అదే సమయమున యోగనిద్ర యశోదయుదరమందు బ్రహ్మ చెప్పిన విధముగ జనించినది అంతట గ్రహములు శుభస్థానములందు సంచరించినవి. విష్ణ్వంశము భూమియందవతరించు సమయమున ఋతువులు సుశోభనమయ్యెను. దేవకి ముఖకాంతి యతిశయించి యామెవంక జూచుటకు నెల్లరకు నశక్యమయ్యెను. దేదీప్యమానమైయున్న యామెను జూచినవారి మనసులు కలతజెందినవి. ఏరికిని తేరిపారచూడ శక్యముగాని దివ్యప్రభతో విష్ణువును దనయుదరమందు భరించుచున్న యామెను దేవతలహర్నిశము నిట్లు స్తుతించిరి.

దేవా ఊచుః

త్వం స్వాహా త్వం స్వధా విద్య సుధా త్వం జ్యోతిరేవచ | త్వం సర్వలోకరక్షార్థమవతీర్ణా మహీతలే || 7

ప్రసీద దేవి సర్వస్య జగత స్త్వం శుభంకురు | ప్రీత్యాత్వం ధారయేశానం ధృతం యేనాఖిలం జగత్‌ || 8

వ్యాస ఉవాచ

ఏవం సంస్తూయమానాసా దేవైర్దేవమధారయత్‌ | గర్భేణ పుండరీకాక్షం జగతాం త్రాణకారణమ్‌ || 9

తతో7ఖిలజగత్పద్మబోధాయా చ్యుత భానునా | దేవక్యాః పూర్వసంధ్యాయా మావిర్భూతం మహాత్మనా || 10

మధ్యరాత్రే7ఖిలాధారే జాయమానే జనార్దనే | మందం జగర్జు ర్జలదాః పుష్ప వృష్టి ముచః సురాః || 11

పుల్లేందీవరపత్రాభం చతుర్బాహుముదీక్ష్య తమ్‌ | శ్రీవత్సవక్షసం జాతం తుష్టావా77నక దుందుభిః || 12

అభిష్టూయ చతంవాగ్భిః ప్రసన్నాభిర్మహామతిః | విజ్ఞాపయామాస తదా కంసాద్భీతో ద్విజోత్తమాః || 13

వసుదేవ ఉవాచ

జ్ఞాతో7సి దేవదేవేశ శంఖ చక్రగదాధర | దివ్యం రూపమిదం దేవ ప్రసాదేనోపసంహర || 14

అద్యైవ దేవ కంసో7యం కురుతే మమ యాతనామ్‌ | అవతీర్ణ ఇతి జ్ఞాత్వా త్వా మస్మిన్మందిరే మమ || 15

దేవక్యువాచ

యో7నంత రూపో7ఖిల విశ్వరూపో గర్భే7పి లోకాన్వపుషాబిభర్తి |

ప్రసీదతామేష స దేవదేవః స్వమాయయా77విష్కృత బాలరూపః || 16

ఉపసంహర సర్వాత్మన్రూప మేతచ్చతుర్భుజమ్‌ | జానాతు మా7వతారం తే కంసో7యం దితిజాంతక || 17

శ్రీభగవా నువాచ

స్తుతోహం యత్త్వయా పూర్వం పూత్రార్థిన్యా త దద్య తే | సఫలం దేవి సంజాతం జాతో7హం యత్తవోదరాత్‌ ||

దేవతలు దేవకీ దేవిని స్తుతించుట

దేవీ నీవు స్వాహా స్వధా విద్యా సుధా స్వరూపిణివి. జ్యోతి స్వరూపురాలవు. సర్వలోక రక్షణమునకై భూలోకమందవతరించితివి. దేవీ ప్రసన్నురాలవగుము. ఎల్లజగత్తునకు మేలొనరింపుము. ఎవ్వనిచే నెల్ల జగము తరింపచేయబడెనో యయ్యీశ్వరుని నీవు ప్రీతితో ధరింపుము. ఇట్లు స్తుతింపబడి యాతల్లి జగద్రక్షిణకారణమైన పుండరీకాక్షుని గర్భము నదాల్చెను. అవ్వలయెల్ల లోకములనెడి పద్మములను వికసింప జేయుటకు నత్యుతుడను సూర్యడు పూర్వసంధ్యా సమయమందు దేవకీయందావిర్భావము జేసెను. అఖిల జగదాధారమూర్తియైన జనార్దనుడు నడిరేయి జనించుచుండగ మేఘములల్లన గర్జనము చేసినవి. దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. వికసించిన నల్లకలువరంగులో నాల్గు బాహువులతో శ్రీవత్సవక్షుడైయున్న యామూర్తినిచూచి వసుదేవుడు స్తుతించెను. ప్రసాద గుణభరితములైన వాక్కులతో స్తుతించి యాతడు కంసునివలన జడిసి యిట్లు విన్నవించెను. ఓ దేవదేవ శంఖచక్ర గదాధరా నీకలరూపుజూపితివి. నేనది తెలిసి కొంటిని. దయచేసి ఈ రూపమును మరుగుపరపుము. ఇది తెలిసిన యెడల కంసుడీక్షణమ నన్ననేక యాతనలకు గురిచేయును. ఈ కారాగారమున నీవవతారముజేసితివని వానికి దెలియుట ప్రమాదము. అవ్వల దేవకియు నిట్లనియె. అనంతరూపుడు విశ్వరూపుడునై తనయందెల్లలోకములను భరించు దేవదేవుడు తన మాయంగొని బాలరూపమున వెలువడిన యీస్వామి మాయెడల బ్రసన్నుడగుగాక! ఓసర్వాత్మమూర్తి ఈ చతుర్భుజరూపము నుపనంహరింపుము. ఓ దైత్యాంతక నీయీ యవతారమును కంసుడెరుగకుండుగాక. అనవిని శ్రీ భగవంతుడు పుత్రార్థినివై మున్ను నన్ను స్తుతించితివికావున నదియిపుడు సఫలమైనది. నీ యుదరమునుండి యిపుడందులకే యవతరించితిని. అని స్వామి మిన్నకుండెను.

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా భగవాంస్తూష్ణీం బభూవ మునిసత్తమాః | వసుదేవోపి తం రాత్రావాదాయ ప్రయ¸° బహిః || 19

మోహితాశ్చాభవం స్తత్ర రక్షిణో యోగనిద్రయా | మధురాద్వార పాలాశ్చ వ్రజత్యానక దుందుభౌ || 20

వర్షతాం జలదానాంచ తత్తోయ ముల్బణం నిశి | సంఛాద్య తం య¸° శేషః ఫణౖ రానకదుందుభిమ్‌ || 21

యమునాం చాతి గంభీరాం నానావర్తశతాకులామ్‌ | వసుదేవో వహాన్విష్ణుం జానుమాత్ర వహాం య¸° || 22

కంసస్య కరమాదాయ తత్త్రెవాభ్యాగతాంస్తటే | నందాదీన్గోపవృద్ధాంశ్చ యమునాయాం దదర్శసః || 23

వసుదేవో7పి విన్యస్య బాలమాదాయ దారికామ్‌ | యశోదాశయనే తూర్ణమాజగామామితద్యుతి || 24

వసుదేవుడారాత్రియే యాశిశువునెత్తుకొని కారాగారము వెడలెను. కారాగార రక్షకులు యోగనిద్రా మోహితులైరి. మధురానగర పాలకులుగూడ నయ్యెడ నిద్రావశులయిరి. నడిరేయిమేఘములు మిక్కిలిగా వర్షించుచుండ శేషుడు తన పడగలు విప్పి పైనిగప్ప సుళ్ళుతిరిగి కెరట మువ్వెత్తుగ పరవళ్ళు ద్రొక్కు లోతైన యమునానదిని మోకాలిబంటి లోతు గొన్నదానిని వసుదేవుడు విష్ణువునెత్తుకొని దాటెను. అదే సమయమున కంసునికి గప్పము జెల్లింపనటకు వచ్చియున్న నందుడు మొదలగు గోపవృద్దుల నాతడు యమున దరిని దర్శించెను. మఱియునతడు బాలుని యశోదప్రక్కలోనుంచి యందున్న పిల్లనెత్తుకొని వచ్చెను.

దదర్శ చ విబుద్ధ్వా సా యశోదా జాతమాత్మజమ్‌ | నీలోత్పల దశశ్యామం తతో7త్యర్థం ముదంయ¸° || 25

ఆదాయ వసుదేవో7పి దారికాం నిజమందిరమ్‌ | దేవకీ శయనే న్యస్య యథా పూర్వ మతిష్ఠత || 26

తతో బాలధ్వనిం శ్రుత్వా రక్షిణః సహసోత్థితాః | కంస మావేదయామాసు ర్దేవకీ ప్రసవం ద్విజాః || 27

కంసస్తూర్ణ ముపేత్యైనాం తతో జగ్రాహ బాలికామ్‌ | ముంచ ముంచేతి దేవక్యా7సన్న కంఠం నివారితః || 28

చిక్షేప చ శిలాపృష్ఠే సా క్షిప్తా వియతి స్థితిమ్‌ | అవాప రూపం చ మహత్సాయుధాష్ట మహాభుజమ్‌ || 29

వ్రజహాస తథైవోచ్చైః కంసం చ రుషితా7బ్రవీత్‌ ||

యోగమాయోవాచ

కిం మయా77క్షిప్తయా కంస ! జాతో యస్త్వాం హనిష్యతి || 30

సర్వస్వభూతో దేవానా మాసీ న్మృత్యుః పురా స తే | తదేత త్సం ప్రధార్యా77శు క్రియతాం హిత మాత్మనః ||

వ్యాస ఉవాచ

ఇత్యుక్త్వా ప్రయ¸° దేవీ దివ్యస్రగ్గంధభూషణా | పశ్యతో భోజరాజస్య స్తుతా సిధ్ధై ర్విహాయసా || 32

ఇతి బ్రహ్మపురాణ శ్రీకృష్ణ ఉత్పత్తికథననిరూపణంనామ ద్య్వశీత్యధికశతతమో7ధ్యాయః

అవ్వల యశోద మెళుకువగొని పుట్టిన కుమారుని జూచెను. నల్లకలువరేకుల బోలి నిగనిగలాడు నల్లనిమేనివానిని శిశువునుచూచి యెంతేని సంబరబడెను. అట వసుదేవుడును నా బాలికంగొని యింటికివచ్చి దేవకి పక్కలోనునిచి యప్పటియట్ల నుండెను. అవ్వల కారాగార రక్షకులు పిల్లయేడుపువిని తటాలునలేచి దేవకి ప్రసవించిన వార్తను కంసునికి నివేదించిరి. కంసుడు నపుడువేవేగవచ్చి యా పిల్లను బట్టుకొనెను. దేవకి మృదుస్వరమున విడువు విడువుమని వారించుచున్నను వాడటనున్న బండపై నాబాలకను విసరికొట్టెను. ఆ శిశువాక్షణమ యాకశమందు నిలచి యాయుధములతో గూడిన ఎనిమిది బాహువులతో నపురూపమైన రూపుగొని బిగ్గరగానవ్వి రోషముగొని కంసునింగని కంసా ! నన్ను విసరినంతన నేమయ్యెను. నిన్నుజంపువాడొకడు పుట్టియున్నాడు. క్రూరుడవగు నీ పాలిటికి మృత్యువు దేవతల సర్వస్వ మూర్తి యవతరించియున్నాడు ఇదినీమనస్సులో బెట్టుకొని నీకేది హితమో యది చేసికొనుము. ఇట్లాదేవి దివ్యగంధ మాల్యభూషణదారిణియైన కంసుడు చూచుచుండ సిద్ధులు పొగడుచుండ నాకసమువెంట జనియె.

ఇది బ్రహ్మపురాణమున శ్రీకృష్ణజననకథనమును నూటయెనుబదిరెండవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters