Brahmapuranamu    Chapters   

అథసప్త సప్త తత్యధికశతతమో7ధ్యాయః

పురుషోత్తమక్షేత్రమాహాత్మ్యవర్ణనమ్‌

బ్రహ్మోవాచ

ఏవం వో7నంత మహాత్మ్యం క్షేత్రం చ పురుషోత్తమమ్‌|భుక్తిముక్తి ప్రదంనృణాంమయాప్రోక్తంసుదుర్లభమ్‌||

యత్రా77స్తే పుండరీకాక్ష శ్శంఖ చక్రగదాధరః|పీతాంబరధరః కృష్ణఃకంసకేశినిషూదనః|| 2

యేతత్ర కృష్ణం పశ్యంతి సురాసుర నమస్కృతమ్‌|సంకర్షణం సుభద్రాం చ ధన్యాస్తే నాత్ర సంశయః || 3

త్రైలోక్యాధిపతిం దేవం సర్వకామఫలపన్రదమ్‌|యే ధ్యాయంతి సదా కృష్ణం ముక్తాస్తే నాత్ర సంసయః || 4

కృష్ణేరతాః కృష్ణమను స్మరంతి

రాత్రౌ చ కృష్ణం పునరుత్థితా యే

తే భిన్నదేహాః ప్రవిశంతి కృష్ణం

హవిర్యథా మంత్ర హృతం హుతాశసమ్‌|| 5

తస్మాత్పదా మునిశ్రేష్ఠాః కృష్ణః కమలలోచనః| తస్మిన్‌క్షేత్రే ప్రయత్నేన ద్రష్టవ్యో మోక్షకాంక్షిభిః || 6

శయనో త్థాపనే కృష్ణం యే పశ్యంతి మనీషిణః|హలాయుధం సుభద్రాం చ హరేః స్థానం వ్రజంతితే|| 7

సర్వ కాలే7పి యే భక్త్వా పశ్యంతి పురుషోత్తమమ్‌|రౌహిణయం సుభద్రాంచ విష్ణులోకం వ్రజంతితే || 8

ఆస్తే యశ్చతురో మాసాన్‌ వార్షి కాన్‌ పురుషోత్తమే| ప్రథివ్యా స్తీర్థ యాత్రాయాః ఫలంప్రాప్నోతి చాధికమ్‌|| 9

యే సర్వకాలం తత్రైవ నివసంతి మనీషిణః|జితేంద్రియా జితక్రోథా లభంతే తపసః ఫలమ్‌ || 10

పురుషోత్తమక్షేత్రమాహాత్మ్యవర్ణనము

బ్రహ్మ ఇట్లనియె

ఇట్లేను అనంతమహిమ పురుషోత్తమక్షేత్ర మహిమయు భుక్తిముక్తుల నిచ్చునని తెల్పితిని. అచ్చట గృష్ణుని సంకర్షణుని సుభద్రను దర్శించినవారు ధన్యులు ముక్తులును సమంత్రకముగా నొనంగిన హవిస్సు అగ్నింబొందినట్లు కృష్ణుని రాత్రులందు నుషఃకాల మునందు జేయుధ్యానమువలర భక్తులు దేహమువిడిచి కృష్ణుని బొందుదురు. శయనము నుండి లేవగానే కమలాక్షుని హరిని బలరాముని సుభధ్రను దలచుకొనువారు హరిసాలోక్య మందుదురు. వర్ష ఋతువునాల్గుమాసములా పురుషోత్తమమక్షేత్ర నివాసముచేయువారు భూమింగల సర్వతీర్థములు సేవించిన ఫలముగాంతురు. ఇంద్రియనిగ్రహముసేసి కోపము జయించి యెల్లపుడు నచట వసించివారు తపఃఫలముము నొందుదురు.

తప స్తప్త్వా7న్యతీర్థేషు వర్షాణామ యుతం సరః|యదాప్నోతి తదాప్నోతి మాసేన పురుషోత్తమే|| 11

తపసా బ్రహ్మచర్యేణ సంగత్యాగేన యత్ఫలమ్‌| తత్ఫలం సతతం తత్ర ప్రాప్నువంతి మనీషిణః || 12

సర్వతీర్థేషు యత్పుణ్యం స్నానదానేన కీర్తితమ్‌|తత్ఫలం సతతం తత్ర ప్రాప్నువంతి మనీషిణః ||13

సమ్యక్తీర్థేన యత్‌ ప్రోక్తం వ్రతేన నియమేనచ|తత్ఫలం లభ##తే తత్ర ప్రత్యహం ప్రయతః శుచిః || 14

యస్తు నానా విధై ర్యజ్ఞై ర్యత్ఫలం లభేతే నరః|తత్ఫలం లభ##తే తత్ర ప్రత్యహం సంయతేంద్రియః || 15

దేహం త్యజంతి పురుషా స్తత్ర యే పురుషోత్తమే|కల్పవృక్షం సమాసాధ్య ముక్తాస్తే నాత్ర సంశయః || 16

వటసాగరయోర్మధ్యే యే త్యజంతి కలేబరమ్‌| తే దుర్లభం పరం మోక్షం ప్రాప్నువంతి నసంశయః || 17

అనిచ్ఛన్నపి యస్తత్ర ప్రాణాం స్త్యజతి మానవః| సో7పి దుఃఖవినిర్ముక్తో ముక్తిం ప్రాప్నోతి దుర్లభామ్‌ || 18

కృమికీట పతంగాద్యా స్తిర్యగ్యోనిగతాశ్చ యే|తత్ర దేహం పరిత్యజ్య తే యాంతి పరమాం గతీమ్‌ || 19

భ్రాంతిం లోకస్య పశ్యధ్వ మన్యతీర్థం ప్రతిద్విజాః|పురుషాఖ్యేన యత్ర్పాప్త మన్యతీర్థ ఫలాదికమ్‌ || 20

సకృత్పశ్యతి యో మర్త్యః శ్రద్ధయా పురుషోత్తమమ్‌|పురుషాణాం సహస్రేషు స భ##వేదు త్తమః పుమాన్‌ 21

ప్రకృతే స్సపరో యస్మా త్పురుషాదపి చోత్తమః | తస్మాద్వేదే పురాణ చలోకే7స్మిన్‌ పురుషోత్తమః || 22

యో7సౌపురాణవేదాంతే పరమాత్మే త్యుదాహృతః | ఆస్తే విళ్వోపకారాయ తేనానౌ పురుషోత్తమః || 23

పథి శ్మశానే గృహమండపే వా |

రథ్యాప్రదేశే ష్వపియత్ర కుత్ర

ఇచ్ఛన్ననిచ్ఛపి తత్రదహం

సంత్యజ్య మోక్షం లభ##తే మనుష్యః ||24

అన్యతీర్థములందుపదివేలేండ్లు సేసిన తపస్సుఫలము పురుషోత్తమ క్షేత్రముననొక్క మాసమాచదించినలభించును. బ్రహ్మచర్యాదులచే నిస్సంగులై చేయుపుణ్యమిచ్చట సేవించి న గల్గును. ఇది సర్వయజ్ఞ ఫలప్రదము. ఇచట దేహము విడిచిన ముక్తికల్గును. మఱ్ఱివృక్షము నకు సాగరమునకును నడుమ మేనువిడిచిన ముక్తిసిద్ధము. కృమికీటకాదులు పశుపక్షులునిక్కడ శరీరము వాసిన బరమగతినందను. అన్యతీర్థములవెంట దిరుగవలెననుకొనుట వట్టభ్రాంతి పురు షోత్తమ దర్శనమొనరించినవాడుపురుషోత్తమడగును. ప్రకృతికతీతుడాతడు. వేదపురాణము లందుచేత నేహరి పురుషోత్తముడని కీర్తించెను. దారిలో స్మశానములో గృహమున మఱి యొటనేని శ్రీపురుషోత్తమక్షేత్రమున నిష్టమున్నను లేకున్నను దేహములంబాసిన మనుజు డు మోక్షమందితీరును.

తస్మాత్పర్వ ప్రయత్నేన తస్మిన్‌క్షేత్రే ద్విజోత్తమాః | దేహత్యాగో సరైః కార్యః సమ్యజ్‌ మోక్షాభి కాంక్షిభిః ||

పురుషాఖ్యస్య మాహాత్మ్యం న భూతం న భంష్యతి | త్యక్త్వా యత్రనరో దేహం ముక్తిం ప్రాప్నోతి దుర్లభామ్‌||

గుణానామేకదేశో7యం మయాక్షేత్రస్య కీర్తితః | క స్సమస్తాన్‌ గుణా న్వక్తుం శక్తోవర్షశ##తైరపి || 27

యది యూయం మునిశ్రేష్ఠా మోక్షమిచ్ఛథ శాశ్వతమ్‌| తస్మిన్‌ క్షేత్రవరే పుణ్య వివసధ్వ మతంద్రితాః || 28

వ్యాసఉవాచ

తే తస్య వచనం శ్రుత్వా బ్రహ్మణో7వ్యక్త జన్మనః | నివాసం చక్రిరే తత్ర ఆవాపుఃపరమం పదమ్‌ || 29

తస్మాద్యూయం ప్రయత్నేన నివసధ్వం ద్విజోత్తమాః పురుషాఖ్యే వరేక్షేత్రేయది ముక్తి మభీప్సధ || 30

ఇతి శ్రీబ్రహ్మపురాణ పురుషోత్తమక్షేత్రమాహాత్మ్య వర్ణనంనామ సప్త సప్తత్యధికశతతమో7ధ్యాయః

అందువలన మోక్షకాంక్షులు పురుషోత్తమక్షేత్రమున దేహము త్యాగముచేయ యత్నింపవలెను. పురుషోత్తమ మాహాత్మ్యమును మించినది కలుగదు కలుగబోదు. క్షేత్ర గుణసంపదలో గొంతమాత్రమే నేనుచెప్పితిని. సమగ్రముగా తెలుపసాధ్యపడదు. ఓమునులారా! మీరు మోక్షార్థుడేని యాపుణ్యక్షేత్రమందు వసింపుడు. వ్యాసుడు పలికెను. బ్రహ్మ వచనమాలించి యామునులా క్షేత్రమందు వసించి పరమపదమందిరి. కావున బ్రహ్మాదు లారా! మీరునట్లు గావింపుడు.

ఇది బ్రహ్మపురాణమునందు పురుషోత్తమక్షేత్రమాహాత్మ్యవర్ణనమను నూటడెబ్బదియేడవ అధ్యాయము

Brahmapuranamu    Chapters