Brahmapuranamu    Chapters   

అథషట్సప్తత్యుతరశతతమో7ధ్యాయః

అనంతవాసుదేవమాహాత్య్యమ్‌

ఋషయ ఊచుః

సహి న స్తృస్తి ర స్తీహ శృణ్వతాం భగవత్కథామ్‌ | పునరేప పరం గుహ్యం వక్తు మర్హ స్యశేషతః || 1

అనంత వాసుదేవస్య న సమ్యగ్వర్ణితం త్వయా | శ్రోతు మిచ్ఛామహే దేవ! విస్తరేణ వదస్వ నః || 2

అనంతవాసుదేవమాహాత్మ్యము

ఋషులిట్లనిరి

భగవంతుని కథను ఎంత విన్నను మాకు దృప్తికలుగటలేదు. అనంతవాసుదేవుని మహిమను దాము వర్ణించినారు. కాని యందలి రహస్యమును విస్తరించి పలుకుడు అన బ్రహ్మయిట్లనియె.

బ్రహ్మోవాచ

ప్రవక్ష్యామి మునిశ్రేష్ఠాః సారాత్సారతరం పరమ్‌ | అనంతవాసుదేవస్య మాహాత్మ్యం భువి దుర్లభమ్‌ || 3

ఆదికల్పే పురా విప్రా స్త్వహ మవ్యక్తజన్మవాన్‌ | విశ్వకర్మాణ మాహూయ వచనం ప్రోక్తవా నిదమ్‌ || 4

వరిష్ఠం దేవశిల్పీంద్రవమ విశ్వకర్మాగ్ర కర్మిణమ్‌ | ప్రతిమాం వాసుదేవస్య కురుశైలమయీం భువి || 5

యాం ప్రేక్ష్య విధివద్భక్తా స్సేంద్రా వై మానుషాదయః | యేన దానవ రక్షోభ్యో విజ్ఞాయ సుమహద్భయమ్‌ || 6

త్రిదివం సమనుప్రాప్య సుమేరుశిఖరం చిరమ్‌| వాసుదేవం సమారాధ్య నిరాతంకా వసంతి తే || 7

మునిశ్రేష్ఠులార! పరమ సారమైన అనంత వాసుదేవుని మహిమ భూలోకవాసులకందనిది. ఆదికల్పమందు అవ్యక్తజన్యుండనగు నేను విశ్వకర్మం బిలిచి యిట్లంటిని. ఆతడు దేవశిల్పి శ్రేష్ఠుడు విశ్వకర్మలందరికి నగ్రేసరుడయిన పనివాడు. వాసుదేవుని ప్రతిమను శిలామయ మైన దానిం జేయుము. దానిం దర్శించి ఇంద్రాది దేవతలు మనుష్యాది భూలోకవాసులు దానవుల వలన రక్షస్సుల వలన గలుగు భయము తొలగి స్వర్గముంబొంది సుమేరు శిఖర మంచెల్ల కాలము నావాసుదేవునారాధించి యే యడ్డును లేక నివశింపగలరు.

మమ తద్వచనం శ్రుత్వా విశ్వకర్మాతు తత్‌క్షణాత్‌ | చకార ప్రతిమాం శుద్ధాం శంఖచక్రగదాధరామ్‌ || 8

సర్వలక్షణ సంయుక్తాం పుండరీకాయతేక్షణామ్‌ | శ్రీవత్స లక్ష్మ సంయుక్తా మత్యుగ్రాం ప్రతిమోత్తమామ్‌ || 9

వన మాలావృతోరస్కాం ముకుటాంగదధారిణీమ్‌ | పీతవస్త్రాం సుపీనావసాం కుండ లాభ్యామలంకృతామ్‌ || 10

ఏవం సా ప్రతిమా దివ్యా గుహ్యయంత్రైస్తదా స్వయమ్‌ ప్రతిష్ఠాకాల మాసాద్య మయా7సౌ నిర్యితాపురా || 11

తస్మిన్‌ కాలే తదా శక్రో దేవరాట్‌ ఖేచరై స్సహ జగామ బ్రహ్మ సదన మారుహ్య గజము త్తమమ్‌ || 12

ప్రసాధ్య ప్రతిమాం శక్రః స్నానదానై ః పునః పునః | ప్రతిమాం తాం సమారాధ్య (దాయ) స్వపురం పునరాగమత్‌

తాం సమారాధ్య సుచిరం యతవాక్కాయ మానసః వృత్రాద్యానసురాన్‌ క్రూరా న్నముచి ప్రముఖానపి || 14

నిహత్యం దానవాన్‌ భీక్తవాన్‌ భువనత్రయం |

ఇట్లేను తెలుప విని విశ్వకర్మ యాక్షణము యొక్క ప్రతిమం దయారు సేసెను. శంఖచక్ర గదలంగొని శ్రీవత్సచిహ్నము వనమాలయుందాల్చి తెల్లదామర పూవులట్టి నేత్రములు గల్గి కిరీటము భుజకీర్తులు ధరించి పీతాంబరము గట్టకొని మణికుండలము మెఱయ శోభించు నందమగు విగ్రహమది నిర్మింజేసి రహస్య మంత్రములచే నేనే యొక పుణ్యలగ్నమందు ప్రతిష్ఠ సేసితిని. ఆసుముహూర్తమునకు దేవరాజు వేల్పులం గూడి యైరావతమెక్కి బ్రహ్మసదనమున కేగి స్నానదానాదులొనరించి యా విగ్రహమును మఱి మఱి పూజించి తననగరమునకు తిరిగి వచ్చెచు. అచటనవ్విగ్రహము నర్చించి త్రికరణములను నియమించు కొని వృత్రుడు సముచియ మొదలుగాగల యసురులంజంపి ముల్లోకముల నేలెను.

ద్వితీయే చ యుగే ప్రాప్తే త్రేతాయాం రాక్షసాధిపః ||15

బభూవ సుమహావీర్యో దశగ్రీవః ప్రతాపవాన్‌ | దశవర్ష సహస్రాణి నిరాహారో జీతేంద్రియః || 16

చచార వ్రత మత్యుగ్రం తపః పరమ దుశ్చరమ్‌ | తపసా తేన తుష్టో7హం వరం తసై#్మ ప్రదత్తవాన్‌ || 17

అవధ్యః సర్వదేవానాం సదైత్యోరగరక్షసామ్‌ | శాపప్రరహరణౖ రుగ్రై రవద్యో యమకింకరైః || 18

వరం ప్రాప్య తదారక్షయక్షాన్‌ సర్వగణానిమాన్‌ | ధనా ధ్యక్షం వినిర్జిత్య శక్రం జేతుం పముద్యతః || 19

సంగ్రామం సుమహాఘోరం కృత్వా దేవైః సరాక్షసః దేవరాజం వినిర్జిత్య తదా ఇంద్రజిదాహ్వయః || 20

రాక్షస స్తత్పుతో నామ మేఘనాదః ప్రలబ్థవాన్‌ ఆమరావతీం తతః ప్రాప్య దేవ రాజగృహే శుభే || 21

దర్శాంజన సంకాశాం రావణస్తు బలాన్వితః ప్రతిమాం వాసుదేవస్య సర్వలక్షణ సంయుతాం || 22

శ్రీవత్స లక్ష్మ సంయుక్తాం పద్మపత్రాయతేక్షణామ్‌ | వనమాలావృతోరస్కాం ముకుటాంగద భూషితామ్‌ || 23

శంఖచక్రగదా హస్తాం పీతవస్త్రాం చతుర్భుజామ్‌ | సర్వాభరణ సంయుక్తాం సర్వకామ ఫలప్రదామ్‌ || 24

విహాయ రత్న సంఘాంశ్చ ప్రతిమాంశుభలక్షణామ్‌| పుష్పకేణ విమానేన లంకాం ప్రాస్థాపయత్‌ ద్రుతమ్‌ || 25

రెండవ త్రేతాయుగము రాగా మహావీర్యుడు రావణుడు పుట్టెను. పదివేలేండ్లు నిరాహారియై జితేంద్రియుడై యసాధ్యమైన ఉగ్రతపముల జేసెను. దాన నేను సంతుష్టుడనై దేవతలకు దైత్యులకు నాగులకు రక్షస్సులకును నీవవధ్యుడగుదువని వరమిచ్చితిని. యమ కింకరులకుకూడ వాడవధ్యుడయ్యె. వానికొడుకింద్రజిత్తు మేఘనాదుడను పేరొంది యింద్రు నిం గెల్చి స్వర్గరాజ్యము వడసె. రావణుడమరావతిని స్వాధీనము సేసుకొని యింద్రగృహ మందు వాసుదేవ మూర్తిని యింతమున్ను వర్ణించినయ యాతృతిని దర్శించెను. అంతట నట గెల్చుకొన్న రత్నములను (శ్రేష్ఠములగు సామగ్రిని) వదలివేసి యా వాసుదేవ విగ్రహ మును విమానముమీద లంకకు గొని తెచ్చెను.

పురాధ్యక్షః స్థితః శ్రీమాన్‌ ధర్మాత్మా స విభీషణః | రావణస్యానుజో మంత్రీ నారాయణ పరాయణః || 26

దృష్ట్వా తాం ప్రతిమాం దివ్యాం దేవేంద్ర భవనచ్యుతామ్‌ | రోమాంచితతను ర్భూత్వా విస్మయం సమపద్యత || 27

ప్రణమ్య శిరసాదేవం ప్రహృష్టే నాంతరాత్మనా | ఆద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తపః || 28

ఇత్యుక్త్వా స తు ధర్మాత్మా ప్రణిపత్య ముహుర్ముహుః | జ్యేష్ఠం భ్రాతర మాసాద్య కృతాంజలి రభాషత || 29

రాజన్‌ ప్రతిమయా త్వం మే ప్రసాదం కర్తుమర్హసి | యామా రాధ్య జగన్నాధ ని స్తరేయం భవార్ణవమ్‌ || 30

భ్రాతుర్వచన మాకర్ణ్య రావణస్తం తదాబ్రవీత్‌ | గృహాణ ప్రతిమాం వీర త్వనయా కిం కరోమ్యహమ్‌ || 31

స్వయంభువం సమారాధ్య త్రైలోక్యం విజయీ త్వహమ్‌ | నానాశ్చర్యమయం దేవం స్వర్వభూత భవోద్భవమ్‌ || 32

అప్పుడు మంత్రియు నగరాధ్యక్షుడనయియున్న విఖీషణుడు ధర్మమూర్తి గావునను నారాయణ భక్తిపరాయణుడయినందున నింద్రభవనమునుండి దిగివచ్చినయావిష్ణు విగ్రహ ముంగని మేను పులకరించి యచ్చెరువంది తలవంచినమస్కరించి సంతుష్టాంతరంగుడై ఇప్పుడు నాజన్మము ధన్యమయ్యె. ఇప్పుడు నాతపస్సు ఫలించినది. అని మఱిమఱి సాలి మ్రొక్కి పెద్దన్నయగు రావణుని కడకేగి దోసిలొగ్గి ప్రభూ! ఈ ప్రతిమను నాకు బ్రసాదింపుము. దీని నారాధించి సంసార సముద్రముం దాటెదను. అస దశాననుడు తీసికొనుమిదిగో విగ్రహము. దీనితో నేనేమి చేయుదును. సర్వభూత కారణుడగు బ్రహ్మనారాధించి ములోక విజయము గావించితిననియె.

విభీషణో మహాబుద్ధి స్తదాతాం(రాసాద్య) ప్రతిమాం శుభామ్‌| శతమష్టోత్తరం చాబ్దం సమా రాధ్య జనార్దనమ్‌ || 33

అజరామరణంప్రాప్త మణిమాదిగుణౖ ర్యుతమ్‌| రాజ్యం లంకాధిపత్యం చభోగాన్‌ భుంక్తే యథేప్సితాన్‌ || 34

మునయ ఊచుః

అహోనో విస్మయో జాతః శ్రుత్వేదం పరమామృతమ్‌ | అనంతవాసుదేవస్య సంభవం భువి దుర్లభమ్‌ || 35

శ్రోతు మిచ్ఛామహే దేవ విస్తరేణ యథాతథమ్‌ | తస్య దేవస్య మాహాత్మ్యం వక్తు మర్హస్యశేషతః|| 36

విభీషణు డచ్చెరువు గొలుపు నామూర్తిని గ్రహించి నూట యెనిమిదేండ్లు పూజించి జరామరణములు లేనిస్థితిని (చిరజీవిత్వమను) అణిమాది విభూతులను బడసి లంకారాజ్యా ధిపతియైయభీష్ట భోగముల ననుభవించు చున్నాడు. అనవిని మునులహో! చాలయాశ్చర్య కరమైన కధ వింటిమి. అయ్యనంత వాసుదేవ ప్రభావమింకను విస్తరముగ తెలుపుమన బ్రహ్మ యిట్లనియె

బ్రహ్మోవాచ

తదా స రాక్షసః క్రూరోదేవగంధర్వకింసరాన్‌ | లోకపాలాన్‌ సమనుజాన్‌ మునిసిద్ధాంశ్చ పాపకృత్‌ || 37

విజిత్య సమరే సర్వా నాజహార తదంగనాః| సంస్థాప్యనగరీంలంకాం పునః సీతార్థ(తాంచ)మోహితః || 38

చలితోమృగరూపేణ సౌవర్ణేన చరావణః| తతః క్రుద్ధేన రామేణ రణ సౌమిత్రిణాసహ|| 39

రావణస్య వధార్థాయ హత్వావాలిం మనోజవమ్‌ | అభిషి క్తశ్చసుగ్రీవో యువరాజో7ంగద స్తథా || 40

హనుమన్నలనీలశ్చ జాంబవాన్‌ పనసస్తథా| గవయశ్చగవాక్షశ్చపాఠీనః పరమౌజసః || 41

ఏతెశ్చాన్యేశ్చబహుభి ర్వానరైః సమహాబలై ః | సమావృతో మహాఘోరై రామో రాజీవలోచనః|| 42

గిరీణాం సర్వసంఘాతైః సేతుం బధ్వా మహోదధౌ| బలేనమహతారామః సము త్తీర్య మహోదధిమ్‌ || 43

సంగ్రామ మతులంచక్రే రక్షోగణసమన్వితః | యమహస్తం ప్రహస్తం చనికుంభంకుంభ##మేవచ || 44

నరాంతకం మహావీర్యం తథాచైవ యమాంతకమ్‌ | మాలాఢ్యం మాలాకాఢ్యం చ హత్వా రామస్తు వీర్యవాన్‌ || 45

పునరింద్రజితం హత్వాకుంభకర్ణం సరావణమ్‌| వై దేహీం చాగ్నినా77శోధ్యదత్వా రాజ్యం విభీషణ|| 46

వాసుదేవం సమాదాయ యానం పుష్పకమారుహత్‌| లీలయా సమనుపప్రాప దయోధ్యాం పూర్వపాలితామ్‌|| 47

కనిష్ఠం భరితం స్నేహాచ్ఛత్రుఘ్నం భక్తవత్సలః| అభిషిచ్య తదారామః సర్వరాజ్యే7థి రాజవత్‌|| 48

పురాతనీం స్వమూర్తిం చ సమారాధ్య తతోహరిః | దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ|| 49

భుక్త్వా సాగరపర్యంతాం మేదినీం సతురాఘవః| రాజ్యమాసాధ్య సుగతిం వైష్ణవం పదమావిశత్‌ ||50

తాంచాపి ప్రతిమాం రామః సముద్రేశాయ దత్తవాన్‌ | ధన్యోరక్షయితాసి త్వం తోయరత్నసమన్వితః|| 51

అయ్యెడ నా రాక్షసుడు దశకంఠుడు దేవగంధర్వ కిన్నరుల వోడించి లోకపాలుర నవని పాలురందపస్వులను సిద్ధులను గెలిచి వారి యిల్లాండ్ర గొనితెచ్చి తన రాజధానియందు లంకలో ననుచి సీతాదేవియెడ మోహవివశుడై బంగారు లేడిరూపు (మారీచు) నితో బయలు దేరి సీతనపహరించెను. అంత కోపించిప రాముడు లక్ష్మణునితో గూడి యుద్ధమునందు రావణునిం జంపుటకై తొలుత వాలిం జంపి సుగ్రీవుని వానర రాజ్యమంద భిషిక్తుని గావించెను. అంగదుని యువరాజుం జేసెను. హనుమదాది కపి వీరులతో కొండలం బలవైచి సముద్రమునకు సేతువుం గట్టి సేనలతో వార్థిదాటిఅనువమ మైన రణమొనరించి ప్రహస్త నికుంభ కుంభకర్ణాదుల నింద్రజిత్తునుంజంపి రావణం బరిమార్చి అగ్నిశోధనముసేసి జానికింగ్రహించి విభీషణునికి లంకారాజ్య మొసంగి యటనున్న వాసుదేవమూర్తింగొని పుష్పకమెక్కి యవలీలగ లీలామానుషమూర్తి రామచంద్రమూర్తి యయోధ్యకేతెంచి భక్తవత్సలుండ రామచంద్ర ప్రభువు భక్తిభరితునిందమ్ముని భరతుని పినతమ్ముని శత్రుఘ్నుని సర్వసామ్రాజ్యధినేతలట్లు గౌరవించి సనాతన వాసుదేవమూర్తి నారాధించి పదనొకండు వేలేండ్లు అయోధ్యను బాలించి యా విష్ణువిగ్రహమును సముద్రుని కొసంగెను. అట్లొసంగుచునోవాకిథీ! నీవు ధన్యుడవు. ఈమూర్తిరక్షణము నీపని. నీవు సర్వరత్ననిధివి అనెను.

ద్వాపరం యుగమాసాద్యయదాదేవో జగత్పతిః| ధరణ్యాశ్చానురోధేన భావశైథిల్య కారణాత్‌|| 52

అవతీర్ణః స భగవాన్‌ వసుదేవకులే ప్రభుః | కంసాదీనాం వథార్థాయ సవకర్షణసహాయవాన్‌|| 53

తదా తాం ప్రతిమాం విప్రాః సర్వవాంఛాఫలప్రదామ్‌| సర్వలోక హితార్థాయ కస్యచిత్కా రణాంతరే|| 54

తస్మింక్షేత్రవరే పుణ్య దుర్లభే పురుషోత్తమే| ఉజ్జహార స్వయా తోయాత్‌ సముద్రఃసరితాంపతిః || 55

అనియె ద్వాపర యుగమందు జగన్నాధుండు హరి భూదేవి ప్రార్థనచే ఆమెకు గల్గిన భావ వైకల్యమును వారింప వసుదేవు కులము నందవతరింపగా సర్వాభిష్ట ప్రదమగు నీ విగ్రహమును సర్వలోక క్షేమము కొఱకు మరి కారణాంతరమునను ''పురుషోత్తమము'' అను పుణ్యక్షేత్ర మందు సముద్రుడు నీళ్ళనుండి తానుగా నీమూర్తిని పైకి లేవనెత్తెను.

తదాప్రభృతి త్రైవ క్షేత్రే ముక్తిప్రదే ద్విజాః ఆ స్తేసదేవో దేవానాం సర్వకామ ఫలప్రదః|| 56

యే సంశ్రయంతి చానంతం భక్త్యా సర్వేశ్వరం ప్రభుమ్‌| వాజ్మనః కర్మభిర్నిత్యం తే యాంతి పరమంపదమ్‌ || 57

దృష్ట్వా7నంతం సకృద్భక్త్యా సంపూజ్య ప్రణిపత్య చ| రాజసూయాశ్వమేధాభ్యాంఫలం దశగుణం లభేత్‌ || 58

సర్వకామ సమృద్ధేన కామగేన సువర్చసా| విమానే నార్కవర్లేన కింకణీజాలమాలినా|| 59

త్రిఃసప్తకులముద్ధృత్య దివ్యస్త్రీగణసేవితః| ఉపగీయమానో గంధర్వై ర్నరో విష్ణుపురం వ్రజేత్‌|| 60

తత్రభుక్త్వా వరాన్‌ భోగాన్‌ జరామరణవర్జితః| దివ్యరూపధరః శ్రీమా న్యావదాభూతవంప్లవమ్‌ ||61

పుణ్యక్షయా దిహా77యాత శ్చతుర్వేదీ ద్విడోత్తమః| వైష్ణవంయోగ మాస్థాయ తతోమోక్షమవాప్నుయాత్‌||62

ఏవంమయా త్వనంతో7సౌకీర్తితో మునిత్తమాః | కశ్శక్నోతి గుణాన్వక్తుం తస్య వర్షశ##తైరపి|| 63

ఇతి శ్రీమహాపురాణ ఆదిబ్రాహ్మే స్వయం భ్వృషి సంవాదే7నంతవాసుదేవమాహాత్మ్య నిరూపణం నామషట్‌ సప్తత్యధికశతతమోధ్యాయః

అప్పటినుండి ముక్తిదమయిన యాక్షేత్రమున నీమూర్తి వెలసియున్నది. భక్తితో నీ సర్వేశ్వ రుని త్రికరణములను నిగ్రహించి యారాధించు భక్తులు పరమ పదమందుదురు. ఈ అనంత వాసుదేవు నొకమారేని దర్శించి నమస్కరించిన యతడు దశాశ్వమోధ రాజసూయ ఫల మందును. ఆమీద కామగ విమానమెక్కి సూర్య సమానవర్చస్సుతో చిఱు గంటలు మ్రోయ నానంద భరితుడై విష్ణులోక మేగును. ఇరువది యొక్కతరములవారి నుద్ధరింప గలడు. దేవగంధర్వ గీయామానుడగును. ప్రళయ పర్యంతము నచట ననంత భోగములను భవించి పుణ్యానుభవమయిన తరువాత నీ యవనికేతెంచి చతుర్వేద విదుడై వైష్ణవ యోగమున మోక్షములంబిందును. అనంత వాసుదేవుని మహిమ యిది నేనుగీర్తించితిని. ఓమునివరులారా! వందలేండ్లు వర్ణించిన నిది తుదముట్ట స్తుతింప శక్యముగాదు.

ఇది బ్రహ్మపురాణములో అనంతవాసుదేవమాహాత్మ్యమను నూటడెబ్బదియారవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters