Brahmapuranamu    Chapters   

ఏకాదశోధ్యాయః

సోమ వంశ వర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ-

అయోః పుత్రాశ్చతే పంచ సర్వే వీరా మహారదాః స్వర్భాను తనయాయాంచ ప్రభాయాం జఙ్ఞిరే నృపాః|| 1

సహూషః ప్రథమం జఙ్ఞే వృద్దశరార్మా తతః పరమ్‌ | రంబో రజి రనేనాశ్చ త్రిషు లోకేషు విళ్రుతాః || 2

రజిః పత్ర శతానీహ జనయామస పంచవై | రాజేయమితి విఖ్యాతం క్షత్ర మింద్రభయావహమ్‌ || 3

యత్ర దేవాసురే యుద్దే సముత్పన్నే సుదారుణ | దేవా శ్త్చేవాసురా శ్త్చేవ పితామహ మధాబ్రువన్‌ || 4

అవయే ర్భగవ న్యుద్ధే కో విజేత భవిష్యతి | బ్రూహి నః సర్వభూతేశ | శ్రోతు మిచ్ఛామ తత్త్యతః ||5

బ్రహ్మ పురాణము

లోమహర్షణు డిట్లనియె - ఆయుఫుపుత్రులు మహరధు లయిదుగురు స్వర్భానుని (రాహువు) కుముర్తె ప్రభయనునామెయందు జన్మించిరి. వారు సహుషుడు - వృద్ధశర్మ-రంభుడు - రజి - అనేనుడు, అనువారు త్రిలోకప్రసిద్దులు. రజి యైదువందలమంది కుమారులంగనెను. ఈ క్షత్రకుటుంబము రాజేయమని ప్రసిద్దికెక్కినది. ఇంద్రునికి గూడ ఇది భయంకరమయ్యెను. దేవాసురయుద్దమైన

తఱి నయ్యుభయులును మా యిర్వురకును జరుగు యుద్దమందెవ్వరు జయింతురో వినవలతుము నిజమేఱిగింపుమని బ్రహ్మనడిగిరి.

బ్రహోవాచ-

యోషా మర్ధాయ సంగ్రామే రజి రాత్తాయుథః ప్రభుః | యోత్స్యతే తే విజేష్యంతేతాన్‌ లోకాన్నాత్ర సంశయః|| 6

యతో రజి ర్దతి స్తత్ర శ్రీశ్చ తత్ర యతో ధృతిః | యతోతిశ్చ శ్రీశ్చైవ ధర్మస్తత్ర జయన్తధా|| 7

బ్రహ్మ యిట్లనియె - రజియనుప్రభు వాయుధమెత్తి యెవ్వరివంక పోరాడునో వారు ముల్లోకములం గెలువగలరు.

రజి యెటుండునో యటనే ధైర్యము ఉండును. ధృతి యెటుండనో యట లక్ష్మి యుండును . థృతియు శ్రీయు నెందుండునో నక్కడ ధర్మము జయమును గల్గును.

తే దేవా దానవాః ప్రీతా దేవే నోక్తా రజిం తదా | అభ్యయు ర్జయ మిచ్ఛంతో వృణ్యాన స్తం నరర్షభమ్‌ || 8

సహి న్వర్భానుదౌహిత్రః ప్రభాయాం సమపద్యత | రాజా పరమతేజస్వీ సోమంశవివర్థనః ||9

తే హృష్టమనసః సర్వే రజిం వై దేవదానవాః | ఊచు రన్మజ్జయాయ త్వం గృహాన వరకార్ముకమ్‌ || 10

అథోవాచ రజి స్తత్ర తయోర్వై దేవదైత్యయోః | అర్థజ్ఞః స్వార్ధ ముద్దిశ్య యశః స్వంచ ప్రకాశయన్‌ || 11

దేవదానవు లది వివి ప్రీతులై రజిని దమవంక రమ్మని వరించిరి. స్వర్బానుని దౌహిత్రుడు (రాహువుయొక్క కూతురు కొడుకు) ప్రభయందు పుట్టినవాడు, పరమతేజస్వి, సోమవంశవర్ధనుడు నగు రజింగని వారు మాకు జయము కల్గుట కీపు విల్లుగైకొను మని వేడికొనిరి. అతడు విని అర్ధజ్ఞుడుగావున స్వార్ధమెంచి తన కిర్తిం బ్రకాశింపజేయుచు నిట్లనియె.

రజి ఠువాచ--

యది దైత్యగణా న్సర్వా న్జిత్వా వీర్యేణ వానవః | ఇంద్రో భవామి ధర్మేణ తతో యోత్స్యామి సంయుగే || 12

దేవాః ప్రథమతో విప్రాః ప్రతీయ ర్హృష్టమానసాః | ఏవం యధేష్టం నృపతే కామః సంపద్యతాం తవ || 13

శ్రుత్వా సురగణానాంతు వాక్యం రాజా రజిస్తదా | పప్ర చ్ఛాసురముఖ్యాంస్తు యథా దేవా నపృచ్ఛత || 14

దానవాదర్పసంపూర్ణాః స్వార్థ మేవావగమ్యహ | ప్రత్యూచు స్తం నృపవరం సాభిమాన మిదం వచః || 15

దైత్వగుణముల నెల్ల గెలిచి ధర్మమున సేవింద్రుడనగుదునేని యప్పుడు యుద్ధమున బోరెదను. అని రజియనగా వేల్పులు మొదట సంతోషపడిరి. అట్లే నీ కోరిక సఫలము నేసికొమ్మనిరి. అవ్వల నసురముఖ్యుల జూచి దేవతలనడిగినట్లడిగెను. దానవులు దర్పసంపూర్ణులు గావున స్వార్ధముసే చూచికొని సాభిమానముగ నతని కిట్లు బదులుపలికిరి.

దానవా ఉచుః--

అస్మాక మింద్రః ప్రహ్లాదో యస్యార్థే విజయామహే | అస్మింస్తు సమరే రాజం స్తిష్ఠ త్వం రాజసత్తమ || 16

రాక్షసులిట్లు పలికీరి - మా కింద్రుడు ప్రహ్లాదుడు. ఆయనకొరకే మేము గెలుపు పడయనెంతుము. రాజా! నీవీ సమరమున నిలువుమనిరి.

స తధేతి బ్రువన్నేప దేవై ర ప్యతిచోదితః | భవిష్య సీంద్రో జిత్వైనం దేవైరుక్తస్తు పార్ధివః 16

జఘాన దానవా స్సర్వా న్యేవధ్యా వజ్రపాణినః | స విప్రనష్టాం దేవానాం పరమశ్రీః శ్రియం వశీ || 17

నిహత్య దానవ న్సర్వా నాజహార రజిః ప్రభుః | తతో రజిం మహా వీర్యం దేవైఃసహ శతక్రతుః || 18

రజిపుత్రోహవిత్యుక్త్వా పునరేవాబ్రవీ ద్వచః | ఇంద్రోసి తాత దేవానాం సర్వేషాం నాత్ర సంశయః || 19

యస్యాహమింద్రః పుత్రస్తే ఖ్యాతిం యాస్యామి కర్మభిః | సతు శత్రువచః శ్రుత్వా వంచిత స్తేవ మాయమా || 20

త థై వే త్యబ్రవీద్రాజా ప్రీయమాణః శతక్రతుమ్‌ | తస్మింస్తు దేవైః సదృశే దివం ప్రాప్తే మహీపతౌ || 21

దాయాద్యమింద్రా దాజహ్రూ రాజ్యం తత్తనయా రజెః | పంచపుత్రశతా న్యస్య తద్వై స్థానం శతక్రతోః || 22

నమాక్రామంత బహుధ స్వర్గలోకం త్రివిష్టపమ్‌ | తే యదాతు స్వసంముఢా రాగోన్మత్తా విధర్మిణః || 23

బ్రహ్మద్విషశ్చ సంవృత్తా హతవీర్యపరాక్రమాః | తతో లేభే స్వమైశ్వర్య మింద్రః స్థానం తధోత్తమమ్‌ || 24

హత్వా రజిసుతా న్సర్వా న్కామక్రోధపరాయణాన్‌ | య ఇదం చ్యావనం స్థానా త్ర్పతిష్ఠానం శతక్రతోః || 25

శృణుయా ద్ధారయేద్వాపి న స దౌర్గత్య మాప్నుయాత్‌ || 26

అతడెట్లేయని దేవతలచేతగూడ వీనిని (ప్రహ్లాదుని) గెలిచి యింద్రుడవైతీరెదవని ప్రేరేపింపబడి దానవులందఱ సంహరించెను. వజ్రపాణికిగూడ వధింపవలవిగానివారింగూడ తుదముట్టించి పరమశ్రీమంతుడైన రజి మున్ను నష్టమైపోయిన వేల్పుల ఐశ్వర్యమును పునఃప్రతిష్ఠ చేసెను. అప్పుడింద్రు డమరులతోcగూడి మహాధీరుడయినరజింజూచి నిక్కముగనీవు దేవేంద్రుడవ నావనులచే నేను నీకు పుత్రుడనను ప్రఖ్యాతిcగాంచెద ననెను. రజి యునట్లు మాయచే శత్రువుచే మోసగింపబడి యట్లే యగుగాక య సంప్రీతినెంచెను. అట్లా నృపతి దేవసముడై దివమ్మునకరుగ, నాతని పుత్రులైదువందలమంది యాతని ఆస్తిని (పిత్రార్జితమును ఇంద్రునుండి గైకొనిరి, అట్లు స్వర్గమాక్రమించి వారు రాగమత్తుతైc దమకుదాము మూఢులై ధర్మదూరులై బ్రహ్మద్వేషులై వీర విక్రమముల గోల్పోయిరి. అందుపై కామక్రోథవశులైన వారింజంపి ఇంద్రు డెప్పటియట్ల స్వస్థానమును బొంది స్వస్థుడయ్యెను ఈ శతముఖుని స్థానభ్రంశమును పునఃప్రతిష్ఠానమును విన్నవాడును ధారణ జేసినయతడును దుర్గతిపాలుగాడు.

లోమహర్షణ ఉవాచ-

రంభోనపత్య స్త్వాసీడ్‌ వంశం పక్ష్యా మ్యనేనసః | అనేననః సుతో రాజా ప్రతిక్షత్రో మహాయశాః || 27

ప్రతిక్షత్రసుతశ్చాసీ త్సంజయో నామ విశ్రుతః | సంజయస్య జయః పుత్రో విజయ స్తస్యచా೭೭త్మజః || 28

విజయస్య కృతిః పుత్ర స్తస్య హర్యత్వతః సుతః | హర్యత్వతసుతో రాజా సహదేవః ప్రతాపవాన్‌ || 29

సహదేవస్య ధర్మాత్మా నదీన ఇతి విశ్రుతః | నదీనస్య జయత్సేనో జయత్సేనస్య సంకృతిః || 30

సంకృతేరపి ధర్మాత్మా క్షత్రవృద్ధో మహాయశాః | ఆనేనసః సమాఖ్యాతాః, క్షత్రవృద్ధస్య చాపరః || 31

క్షత్రవృద్థాత్మజ స్తత్ర సునహోత్రో మహాయశాః | సునహోత్రస్య దాయాదా స్త్రయః పరమధార్మికాః || 32

కాశః శలశ్చ ద్వావేతౌ తధా గృత్సమదః ప్రభుః | పుత్రో గృత్యమదస్యాపి శునకో యస్య శౌనకః || 33

బ్రాహ్మణాః క్షత్రియాశ్చైవ వైశ్యాః శూద్రాస్తధైవచ | శలాత్మజ ఆర్షిసేన స్తనయ స్తస్య కాశ్యపః || 34

కాశస్య కాశిపో రాజా పుత్రో దీర్ఘతపా స్తదా | ధనుస్తు దీర్ఘతపసో విద్వా స్ధన్వంతరి స్తతః || 35

తపసోంతే సుమహతో జాతో వృద్ధస్య జాతో వృద్ధస్య ధీమతః | పున ర్ధన్వంతరి ర్దేవో మానుషేష్విహ జన్మని || 36

తస్య గేహే సముత్పన్నో దేవో ధన్వంతరి స్తదా | కాశిరాజో మహారాజః సర్వరోగ ప్రణాశనః || 37

ఆయుర్వేదం భరద్వాజా త్ర్పాష్యేహ న భిషక్క్రియః | త మష్టధా పునర్వ్యస్య శిష్యేభ్యః ప్రత్యపాదయత్‌ || 38

సూతుడిట్లనియె - రంభునకు సంతానములేదు. ఇcక యనేనసుని వంశము వర్ణించెద. అనేననుని కుమారుడు యశస్వియైన ప్రతిక్షత్రుడు అనురాజు. వాని తనయుడు సంజయుడు. వాని బిడ్డడు జయుడు. వానివాడు విజయుడు. వాని తనయుడు కృతి. వాని సుతుడు హర్యత్వతుడు. వాని యాత్మజుడు సహదేవుడు. మంచి ప్రతాపశాలి. వానికొడుకు ధర్మశీలియగు నదీనుడు. జయత్సేనుడు వానికుమారుడు. వాని ¸°రసుడు సంకృతి. వానిబిడ్డడు ధర్మపరుడైన క్షత్రవృద్ధుడు కీర్తిశాలి. అనేననులు చెప్పబడిరి. క్షత్రవృద్ధుని వంశము చెప్పెదను. క్షత్రవృద్ధుని తనయుడు సునహోత్రుడు. యశస్వి వాని సంతానము, పరమధార్మికులు కాశుడు, శలుడు గృత్సమదుడు ననువారు. గృత్సమదుని కుమారుడు శునకుడు. వానికొడుకు కొడుకు శౌనకుడు వానివలన బ్రహ్మణ క్షత్రియులు, వైశ్య శూద్రులు కలిగిరి. అర్షిసేనుడు శలుని కుమారుడు. వానితనయుడు కాశుడు. కాశునికొడుకులు కాశిపుడు దీర్ఘతవుడు. ధనవు దీర్ఘతవుని కుమారుడు.

విద్వాంసుడు. వానితయుడు ధన్వంతరి. ఆయన మహత్తరతప మ్మొనరించి వృద్ధుడయినదశలో ధనువునకు గల్గినాడు. దేవతాంశమున మున్నుదయించిన ధన్వంతరియే యిపుడు మానవాంశమున జన్మించెను. కాశీమహారాజై భరద్వాజుని వలన నాయుర్వేదమును జదివి వైద్యము సేసి సర్వరోగహరుడై యాశాస్త్రము నెనిమిదిభాగములుగావించి, (అష్టాంగమొనరించి) శిష్యుల కుపదేశించెను.

ధన్వంతరేస్తు తనయః కేతుమా నితి విశ్రుతః | అధ కేతుమతః పుత్రో వీరో భీమరథం స్మతః || 39

పుత్రో భీమరధస్యాపి దివోదాసః ప్రజేశ్వరః | దివోదాసస్తు ధర్మాత్మా వారాణ స్యధిపోభవత్‌ || 40

ఏతస్మిన్నేవ కాలేతు పురీం వారాణసీం ద్విజాః | శూన్యాం నివేశయామాన క్షేమకో నామ రాక్షసః || 41

శప్తా హి సా మతిమతా నికుంభేన మహాత్మనా | శూన్యా వర్షసమస్రంవై భవిత్రీ తి న సంశయః || 42

తస్యాం హి శప్తమాత్రాయాం దివోదాసః ప్రజేశ్వరః విపయాంతే పురీం రమ్యాం గోమత్యాం సంస్యవేశయత్‌ || 43

భద్రశ్రేణ్యస్య పూర్వం తు పురీ వారాణసీ అభూత్‌ | భద్రశ్రేణ్యస్య పుత్రాణాం శత ముత్తమధన్వినామ్‌ || 44

హత్వా నివేశయామాస దివోదాసో నరాధిపః | భద్రశ్రేణ్యస్య తద్రాజ్యం హృతం యేన బలీయసా || 45

ఆ ధన్వంతరి తనయుడు కేతుమంతుడు. భీమరధు డాతని తనయుడు. దివోదాసు డతని తనయుడు. అతడు ధార్మికుడు. కాశినగరము నేలినవాడు. ఈతని కాలముననే క్షేమకుడను రాక్షసుడు వారణాసిని శూన్యముం గావించెను. మహాత్ముడైన నికుంభుని శాపముచే వేయేండ్లు కాశీక్షేత్రమట్లుగావలసి వచ్చెను. అట్లు శాపనష్టమైన రమ్యమైన నగరమున దివోదాసుడు గోమతీతీరమందు పునర్నిర్మించెను. ఇంతకుముందు వారణాసి భద్రశ్రేణ్యుని పాలనయందుండెను. దివోదాసుడు వాని కుమారులను నూర్వురను మేటి విలుకాండ్రను జంపి భద్రశ్రేణ్యుని రాజ్యము గెలిచి నూతన నగర నిర్మాణముసేసెను.

భద్రశ్రేణ్యస్య పుత్రస్తు దురమో నామ విశ్రుతః | దివోతాసేన బాలేతి ఘృణయా స విసర్జితః || 46

హైహయస్య తు దాయాద్యం హృతవా న్వై మహీపతిః | అజహ్రే పితృదాయాద్యం దివోదానహృతం బలాత్‌ || 47

భద్రశ్రేణ్యస్య పుత్రేణ దుర్దమేన మహాత్మనా | వైరస్యాంతో మహాభాగాః కృతశ్చాత్మీయతేజసా || 48

దివోదాసా ద్దృషద్వత్యాం వీరో జజ్ఞే ప్రతర్దనః | తేన బాలేన పుత్రేణ ప్రహృతం తు పునర్బలమ్‌ || 49

ప్రతర్దనస్య పుత్రౌ ద్వౌ వత్సభర్గౌ సువిశ్రుతౌ | వత్సపుత్రో హ్యలర్కస్తు సంనతి స్తస్య చాత్మజః || 50

అలర్క స్తస్య పుత్రస్తు బ్రహ్మణ్యః సత్యసంగరః | అలర్కం ప్రతి రాజర్షిం శ్లోకో గీతః పురాతనైః || 51

షష్టివర్షసహస్రాణి షష్టివర్షశతాని చ | యువా రూపేణ సంపన్నః ప్రాగాసీచ్చ కులోద్వహః || 52

లోపాముద్రాప్రసాదేన పరమాయ రవాప్తవాన్‌ | తస్యా೭೭ సీ త్సుమహద్రాజ్యం రూప¸°వనశాలినః || 53

శాపస్యాంతే మహాబాహు ర్హ త్వా క్షేమక రాక్షసమ్‌ | రమ్యాం నివేశయామాస పురీం వారాణసీం పునః || 54

భద్రశ్రేణ్యునితనముయుడు దుర్దముడు దివోదాసునిచే బాలుడనికరుణచేవిడుపబడినవాడై హైహయుని దాయాద్యమును (పరంపరా గతమైన రాజ్యసంపదను) హరించెను. బలాత్కరించి హరించిన సామ్రాజ్యమును మహానుభావుడగు దుర్దముడు లాగికొనెను తన ప్రతాపముచే వైరమును అంతముచేసెను. దివోదాసునికి దృషద్వతియందు వీరుడగు ప్రతర్ధను డుదయించెను, బాలుడయ్యునాతడు పరబలమును హరించెను. వాని తనయులు వత్సుడు, భర్గుడు ననువారు మిక్కిలి కీర్తిశాలురు. వత్సుని కుమారు డలర్కుడు. అలర్కుడు బ్రహ్మజ్ఞాని. సత్యప్రతిజ్ఞుడు. వానికొడుకు సంనతి. రాజర్షియగు అలర్కునిగూర్చి ప్రాచీనుల శ్లోకమొకటిc గలదు. అతడు యరువదియారు వేలేండ్లు కులోద్ధారకుడై లోపాముద్రానుగ్రహ పాత్రుడయ్యెను. రూప¸°వనసంపన్నుడైన అతనికి సువిశాలమైన సామ్రజ్యముండెను. శాపాంతమున క్షేమకుడను రాక్షసుని జంపివారణసీనగరమును రమ్యముగ పునర్మిర్మాణము గావించెను.

సంనతేరపి దాయాదః సునీథోనామ ధార్మికః | సునీథస్య తు దాయాదః క్షేమో నామ మహాయశాః || 55

క్షేమస్య కేతుమా న్పుత్రః సుకేతు స్తస్య చాత్మజః | సుకేతో స్తనయశ్చాపి ధర్మకేతురితి స్మృతః || 56

ధర్మకేతోస్తు దాయాదః సత్యకేతు ర్మహారథః | సత్యకేతు సుతశ్చాపి విభు ర్నామ ప్రజేశ్వరః || 57

ఆనర్తస్తు విభోః పుత్రః సుకుమారశ్చ తత్సుతః | సుకుమారస్య పుత్రస్తు ధృష్టకేతుః సుధార్మికః || 58

ధృష్టకేతేస్తు దాయాదో వేణుహోత్రః ప్రజేశ్వర ః | వేణుహోత్రసుతశ్చాపి భార్గో నామ ప్రజేశ్వరః || 59

వత్సస్య వత్సభూమిస్తు భార్గభూమిస్తు భార్గజః | ఏతే త్వంగిరసః పుత్రా జాతా వంశేథ భార్గవే || 60

బ్రాహ్మణాః క్షత్రియో వైశ్యాస్త్రయః పుత్రాః సహస్రశః | ఇత్యేతే కాశ్యపాః ప్రోక్తా సహుషస్య నిబోధత || 61

ఇతి శ్రీ మహాపురాణ బ్రాహ్మే సోమవంశే వృద్ధక్షత్రప్రసూతి నిరూపణం నామ ఏకాదశోధ్యాయః.

సంనతి కొడుకు సునీధుడు. వానినుండి క్షేముడు, వానికి కేతుమంతుడు. వానికి సుకేతువు, వానికి ధర్మకేతువు వానికి మహారధుడగు సత్యకేవువు, వానికి విభువు. వానికి అనర్తుడు, వానికి సుకుమారుడు, వానికి ధృష్టకేతువు, వానికి వేణుహోత్రుడు, వానికిభార్గుడు ననుపుత్ర పరంపరయేర్పడెను. వత్సునికి వత్సభూమి, యనువాడు భార్గునకు భార్గభూమి యనువారు పుత్రులు. నీరందరును అంగిరసుని పుత్రులు భార్గవ వంశమువారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వేలకొలది జన్మించిరి. ఇది కాశ్యపవంశము ఇక సహూషుని పరంపర వినుండు.

శ్రీ బ్రహ్మమహాపురాణమునందు సోమవంశమున వృద్ధక్షత్ర ప్రసూతి నిరూపణమను పదునొకండవ యధ్యాయము.

Brahmapuranamu    Chapters