Brahmapuranamu    Chapters   

దశమో7ధ్యాయః

సోమ వంశ వర్ణనమ్‌

లోమహర్షణ ఉవాచ-

బుధస్య తు మునిశ్రేష్ఠా విద్వా న్సుత్రః పురూరవాః | తేజస్వీ దానశీలశ్చ యజ్వా విపుల దక్షిణః ||1

బ్రహ్మవాదీ పరాక్రాంతః శత్రుభి ర్యుధి దుర్ధమః | ఆహర్తా చాగ్నిహోత్రస్య యజ్ఞానాంచ మహీపతిః || 2

సత్యవాదీ పుణ్యమతిః సమ్య క్సంవృతమైథునః | అతీవ త్రిషు లోకేషు యశసా7 ప్రతిమ స్సదా || 3

తం బ్రహ్మవాదివం శాంతం ధర్మజ్ఞం సత్యవాదినం | ఉర్వశీ వరయామాస హిత్వా మనాం యశస్వినీ || 4

నూతు డిట్లనియె - ఓ మునిశ్రేష్ఠులారా ! బుధుని కుమారుడు పురూరవుడు. విద్వాంసుడు, తేజశ్శాలి. దాత. విపుల దక్షిణలిచ్చిన యజ్వ. బ్రహ్మవాదీ యుద్ధమునందు శత్రువునలకందని వాడు. నిత్యాగ్నిహోత్రి-యజ్ఞకర్త. మహీపతి సత్యవాది. పుణ్యమతి, నిగూఢమైథనుడు, ముల్లోకములందు అనుపమ కీర్తిశాలి. అట్టివానిని బ్రహ్మవాదిని (వేదాధ్యయన రతుని) శాంతుని ధర్మజ్ఞుని సత్యవచనుని యశస్విని యగు ఊర్వశి అభిమానము (గుట్టు) విడిచి వరించెను. (1-4)

తయా సహావస ద్రాజా దశ వర్షాణి పంచచ | షట్పంచ సప్త చాష్టా చ దశ చాష్టౌచ భోద్విజాః || 5

వనే చైత్రరథే రమ్యే తథా మందాకినీ తటే | అలకాయాం విశాలాయాం నందనేచ వనోత్తమే || 6

ఉత్తరాన్స కురూ న్ప్రాప్య మనోరమఫలద్రుమాన్‌ | గంధమాదనపాదేషు మేరుశృంగే తథోత్తరే || 7

ఏ తేషు వనముఖ్యేషు సురైరా చరితేషు చ | ఉర్వస్యా సహితో రాజా రేమే పరమయా ముదా || 8

దేశే పుణ్యతమే చైవ మహర్షిభిరభిష్టుతే | రాజ్యం స కారయామాస ప్రయాగే పృథివీపతిః || 9

ఏవం ప్రభావో రాజా77సీ దైలస్తు నరసత్తమః (ఉత్తరే జాహ్నవీ తీరే ప్రతిష్ఠానే మహాయశాః) || 10

బ్రాహ్మణులారా ! ఆ రాజు ఊర్వశితోగూడి చైత్ర రథమను సుందరవనమందు పదిసంవత్సరములు, మందాకినీ నదీ తీరముననైదు సంవత్సరములు, అలకాపురమందు ఆరుసంవత్సరములు, బదరీ పురమునందు అయిదు సంవత్సరములు, నందనవనమునం దేడు సంవ్సతరములు, మనోహర ఫలవృక్షములతో గూడిన ఉత్తర కురు దేశమునందెనిమిది సంవత్సరములు, గంధమాదన పర్వతముపై పది సంవత్సరములు సుమేరు పర్వతోత్తర భాగమున నెనిమిది సంవత్సరములు నివసించెను. ఈ ప్రధాన వనములందును, దేవతల క్రీడా స్థానములందును, ఊర్వశితో గూడ నారాజు పరమ హర్షమున క్రీడిచెను. ఇలా పుత్రుడగు పురూరవుడు పవిత్ర తమము మహర్షులచే స్తుతింపబడినదియు నగు పృయాగక్షేత్రమునందు రాజ్యము నేలుచు మహాప్రభావశాలి యగు నరశ్రేష్ఠుడై యొప్పెను.(5-10)

లోమహర్షణ ఉవాచ -

ఐలపుత్రా బభూవు స్తే సప్త దేవసుతోపమాః | గంధర్వలోకే విదితా ఆయు ర్దీమా నమావసుః | 11

విశ్వాయిశ్చైవ ధర్మాత్మా శుత్రాయుశ్చ తథా7పరః | ధృఢాయుశ్చ వనాయుశ్చ బహ్వాయుశ్చోర్వశీ సుతాః || 12

అమావసోస్తుదాయాదో భీమోరాజాథ రాజరాట్‌ | శ్రీమాన్భీమస్య దాయాదో రాజా77సీ త్కాంచన ప్రభః || 13

విద్వాంస్తు కాంచనస్యాపి సుహోత్రో7భూ న్మహాబలః | నుహోత్రస్యాభవ జ్జహ్నుః కేసిన్యా గర్భసంభవః|| 14

సూతుడిట్లనియె - ఆ ఇలుని (పురూరవుని) కుమారు లేడుగురు. దేవ కుమారోపములు, గంధర్వలోక ప్రసిద్దులు. ఆయువు ధీమంతుగు అమావసువు | ధర్మాత్ముడగు విశ్వాయివు - శ్రుతాయివు - దృఢాయువు-వనాయువు-బహ్వాయువు నసువారూర్వశికి జనించినారు.

అమావసుపుత్రుడు రాజరాజగు ఖీముడు. వాని కొడుకు శ్రీమంతుడగు కాంచనప్రభనామధేయుడు. వాని తనయుడగు సుహోత్రుడు బలశాలి, విద్వాంసుడు. వాని తనయుడు. జహ్నువు కేశిని కుమారుడు (11-14)

అజహ్రే యో మహాసత్రం సర్పమేధం మహామఖమ్‌ | పతిలోభేన గంగా పతిత్వేన ససారహ || 15

నేచ్ఛతః ప్లావయామాస తస్య గంగా తదాసదః సతయా ప్లావితం దృష్ట్వా యజ్ఞవాటం సమంతతః || 16

సౌహోత్రి రశపద్గంగాం క్రుద్దో రాజాద్విజోత్తమాః| ఏష తే విఫలం యత్నం పిబ న్నంభః కరోమ్యహమ్‌|| 17

అస్య గంగే7వలేపస్య సద్యః ఫల మవాప్నుహి | జహ్ను రాజర్షిణా పీతాం గంగాందృష్ట్వా మహర్షయః || 18

ఉపనిన్యు ర్మహాభాగాం దుహితృత్వేన జాహ్నవీమ్‌ |

అతడు సర్పమేధమను మహాయాగమను, అచరించెను. గంగపతి లోభముచే నతని బతిగ వరించి యభి సరించెను. అతని యంగీకారము లభింప యజ్ఞ సదస్సును ముంచెత్తెను. యజ్ఞవాటము నట్లు ముంచుట జూచి సుహోత్రుని కుమారుడు ఆ జహ్నువు క్రుద్ధుడై '' నీ జతనమిది విఫలమొనరింప నిదిగో నీ నీటినెల్ల ద్రావెదను. నీ గర్వమునకు ఫలమిపుడే యనుభవింపుమని శపించి అతడెల్ల గంగను ద్రావివైచెను. అవ్వింతగని మహర్షు లాతనికి అభ్రాపగను గన్నకూతురి గావించిరి. దాన నామె జాహ్నవియయ్యె. (15-18)

యువనాశ్వస్య పుత్రీం తు కావేరీం జహ్ను రావహత్‌ | 19

యువనాశ్వస్య శాపేన గంగార్ధేన వివిర్గతా | కావేరీం సరితాం శ్రేష్ఠాం జహ్నోర్భార్యామనిందితామ్‌|| 20

జహ్నుస్తు దయితం పుత్రం సునద్యం నామ ధార్మికమ్‌ | కావేర్యాం జనయామాస అజక స్తస్య చా77త్మజః || 21

అబకస్యతు దాయాదో బలాకాశ్వీ మహీపతిః|| బభూవ మృగయాశీలః కుశ స్తస్యా77త్మజో7భవత్‌ 22

కుశపుత్రా బభూవుర్హి చత్వారో దేవవర్చనః || కుశికః కుశనాభశ్చ కుశాంభో మూర్తిమాంస్తథా ||23

వల్లవైః సహ సంవృద్దో రాజా వనచరః సదా| కుశికస్తు తపస్తేపె పుత్ర మింద్రసమం ప్రభు ః || 24

యువనాశ్వుని పుత్రియగు కావేరిని జహ్నుమహర్షి పరిణయమాడెను. యువనాశ్వుడిచ్చిన శాపముచే గంగలో నర్దాంశమయి ఏతెంచి జహ్ను భార్య, సరిద్వరయగు కావేరిలో కలసెను. జహ్నుడు ధర్మపరుడయిన సునద్యుడను కుమారుని కావేరియందు బడెసెను. వాని కుమారుడు అజకుడు. వాని బిడ్డడు బలాకాశ్వుడనురాజు. మృగయా భిరక్తుడగు కుశుడు వాని కొడుకు. వాని కుమారులు దేవ వర్చస్కులు నల్వురు. 1. కుశికుడు 2. కుశనాభుడు 3. కుశాంబుడు 4. మూర్తిమంతుడను వారు. వల్లవులతో నిరంతరము పెంపు వడసి వనచరుడై కుశికుడు ఇంద్రతుల్యుడైన కొమరునిం గోరి తపమెనరించెను. ( 19-24)

లభేయమితి తం శక్ర స్త్రాసా దభ్యేత్య జజ్ఞివాస్‌ | పూర్ణే వర్షసహస్రే వై తతః శక్రో హ్యపశ్యత || 25

అత్యుగ్రతపసం దృష్ట్వా సహస్రాక్షః పురందరః సమర్థః పుత్రజననే స్వయమే వాస్య శాశ్వతః || 26

పుత్రార్థం కల్పయామాస దేవేంద్రః సురసత్తమః | స గాధి రభవ ద్రాజా మఘవా న్కౌశికః స్వయమ్‌ || 27

అతనికి బెదరి వేయేండ్లు ముగియగా నుగ్ర తపమ్మున యాఱనింగని పుత్రునీయ సమర్థుండయ్యు తాన యాతనికి పుత్రుడాయెను. కుశికు పుత్రుడగు ఇంద్రుడే గాధియను రాజాయెను.

పౌరా యస్యాభవ ర్భార్యా గాధిస్త్యస్యా మజాయత | గాధెః కన్యామహాభాగా నామ్నా సత్యవతీ శుభా|| 28

తాం గాధిఃకావ్య పుత్రాయ బుచీకాయ దదౌ ప్రభుః | తస్యాః ప్రీతః సవై భర్తా భార్గవో భృగునందనః|| 29

పుత్రార్థం సాధయామాస చరుం గాధే స్తథైవచ | ఉవాచా77హూయ తాం భార్యామృచీకో భార్గవస్తదా || 30

ఆజయ్యః క్షత్రియై ర్లోకే క్షత్రియర్షభసూదనః | తవాపి పుత్రం కల్యాణి ధృతిమంతం తపోధనమ్‌|| 31

ళమాత్మకం ద్విజశ్రేష్టం చరు రేష విదాస్యతి | ఏవ ముక్తా తు తాం భార్యా మృచీకో భృగునందనః || 32

తపప్యభిరతో నిత్య మరణ్యం ప్రవివేశ హ |

కుశికుని భార్య యగు పౌరయందు గాధిపుట్టెను. గాధి కుమార్తె సత్యవతి. మహానుభావురాలు. గాధిరాజామెను సక్రునిపుత్రుడగు బుచీకుని కిచ్చెను. అమె యెడగల ప్రీతిచే భార్గవుడు (బుచీకుడు) గాథికి (మామగారికి) కుమారుడు గలుగవలెనని యజ్ఞమున చరువును సాధించి యిచ్చెను. బుచీకుడు తాన భార్య సత్యవతిcబిల్చి ఈ చరువుగు నీవును మీ అమ్మయి స్వీకరింపుడు అమెయందు దీప్తిగల క్షత్రియోత్తము డుదయించును. క్షత్రియుల కతడజయ్యుడు క్షత్రియాంతకుడును కాగలడు. కల్యాణీ! నీవీ రెండవ చరువు సేవించినంతట ధృతమంతుడు తపోధనుడు శాంతడునైన ద్విజశ్రేష్ఠుడుదయించును. అని పలికి దపోనిరతుడై యరణ్యముం బ్రవేశించెను.

గాధిః సదారస్తు తదా బుచీకాశ్రమ మభ్యగాత్‌ || 33

తీర్థయాత్రాప్రసంగేన సుతాం ద్రష్టుం సరేశ్వరః | చరుద్వయం గృహీత్వా సా ఋషేః సత్యవతీ తదా|| 34

చరు మాదాయ యత్నేన సాతు మాత్రే న్యవేదయత్‌ | మాతా తు తుస్యా దైవేన దుహిత్రే స్వం చరుం దదౌ || 35

తస్యాశ్చరు మధాజ్ఞానా దాత్మసంస్థం చకార హ | అథ సత్యవతీ సర్వక్షత్రియాంతకరం తదా || 36

ధారయామస దీప్తేన వవుషా ఘోరదర్శవా | తా మృచీకస్తతో దృష్ట్వా యోగే నాభ్యుపసృత్యచ || 37

తతో7బ్రవీ ద్ద్విజ శ్రేష్ఠః స్వాం భార్యాం వరవర్ధినీమ్‌| మాత్రా7సి వంచితా భ##ద్రే చరువ్యత్యాస హేతునా || 38

జనిష్యతి హి పుత్రస్తే క్రూర కర్మాతిదారుణః | భ్రాతా జనిష్యతే చాపి బ్రహ్మభూత స్తపోధనః || 39

విశ్వం హి బ్రహ్మ తపసా మయా తస్మిన్స మర్పితమ్‌ | ఏవముక్తా మహాభాగా భర్త్రా సత్యవతీ తదా || 40

ప్రసాదయామాస పతిం పుత్రో మే నేదృశో భ##వేత్‌ | బ్రాహ్మణాపసదస్త్వత్త్వ ఇత్యుక్తో మునిరబ్రవీత్‌ || 41

గాథియు నింతితో నప్పుడు బుచీకునాశ్రమమున కేగెను. తీర్థయాత్రా ప్రసంగమున కూతుం జూడ ఆ రాజు జామాతృన గృహంబున కేతెంచెను. సత్యవతి యా రెండు చరువులనుc గైకొని తల్లికి నివేదించెనుc అ తల్లిదైవవశమున తాను దైకొనవలసిన చరువును కూతురునకిచ్చి అమెకీయదగినదానిని తాను గైకొనెను. అటుపై సత్యవతి సర్వక్షత్రియాంతక తేజముం గర్భమునc దాల్చిన కతన ఘోరమైన యాకారముతో గననయ్యెను. బుచీకుడా యింతింగాని యోగదృష్టిచే గ్రహించి ద్విజశ్రేష్ఠుండాతడు భార్యంగని కల్యాణీ ! చరువ్యత్యాసముచే మీ అమ్మచే నీవు వంచింపcబడితివి. నీకు క్రూరవర్తనుడు అతిదారుణుడు సగు తనయుడుదయించు వానికి భ్రాత బ్రహ్మణ్యుడు తపోధనుడు గల్గును. తపస్సుచే నేనీ యెల్ల బ్రహ్మమునువాని యందర్పించితిని. అన విని సత్యవతి నీవలన నాకిట్టి క్రూరకర్ముడు బ్రాహ్మణావసదుడు కొడుకుగావలదనిన బుచీకముని యిట్లనియె.

నైష సంకల్పితః కామో మయా భ##ద్రే తథా7స్త్వితి | ఉగ్రకర్మా భ##వేత్పుత్రః పితుర్మాతుశ్చ కారణాత్‌ || 42

పునః సత్యవతీ వాక్య మేవ ముక్త్వా7బ్రవీదిదమ్‌ | ఇచ్ఛల్లోకానపి మునే సృజెథాః కిం పునస్సుతమ్‌ || 43

శమాత్మక మృజుం త్వమే పుత్రం దాతు మిహార్హసి | కామమేవం విథః పౌత్రో మమ స్యాత్తవచ ప్రభో|| 44

యద్యన్యధా న శక్యం వైకర్తు మేతద్ద్విజోత్తమ ! తతః ప్రసాద మకరో త్సతస్వా స్తపసో బలాత్‌ || 45

పుత్రే నాస్తి విశేషోమే పౌత్రే వా వరపర్ణిని | త్వయా యధోక్తం వచనం తథా భ##ద్రే భవిష్యతి || 46

తత స్సత్యవతీ పుత్రం జనయామస భార్గవమ్‌ | తపస్యభిరతం దాంతం జమదగ్నిం శమాత్మకమ్‌ || 47

భృగోర్జగత్యాం వంశే7 స్మిన్‌జమదగ్నిరజాయత | సా హి సత్యవతీ పుణ్యా సత్య ధర్మపరాయణా || 48

కౌశికీతి సమాఖ్యాతా ప్రవృత్తేయం మహానదీ

బుచీకు డిట్లనియె:- కల్యాణి ! నేనిట్లకావలయునని సంకల్పింపలేదు. పితృమాతృనిమిత్తమునc దనయు డుగ్రమూర్తి కాగలడు. ఇది విని మరల సత్యవతి యిట్లనియె. నీవు, తలచిన లోకములను సృజింపగలవాడవు. కొడుకునిచ్చు మాట తెక్కేమి శమాత్మకుని బుజుస్వభావుని పుత్రుని నాకనుగ్రహింపుము. ఇది వేరొక విధముగc జేయవలను పడటేని మనకుదయింపcగల మనుమడు మీరన్నట్లు క్రూరమూర్తియగునట్లనుగ్రహింపుడని భర్తను వేడుకొనెను. అది విని యమ్ముని తపోబలమున నట్ల యగుగాక యనియనుగ్రహము సేసెను. మరియు సుందరి పుత్రునందును పౌత్రునందును నాకుభేదములేదు. నీవెట్లంటి పట్టేయగుట నాయభిమతమని యామెనా తపస్విలాలించెను. అవ్వల సత్యవతి భార్గవునిం గుమారునిం గనెను. అతడే తపోనిరతు డతిదాంతుడు శాంతుడునగు జమదగ్ని ఈ భృగువంశముందవతరించెను. పుణ్యురాలు సత్యవతి సత్యధర్మపరాయణ కౌశికియనుc బేర మహానదియై ప్రవర్తిల్లె.

ఇక్ష్వాకువంశ ప్రభవో రేణుర్నాను నరాధిపః || 49

తస్య కన్యా మహాభాగా కామలీనామ రేణుకా | రేణుకాయాంతు కామల్యాం తపోవిద్యాసమన్విత || 50

ఆర్చీకో జనయామాస జామదగ్న్యం సుదారుణమ్‌ | సర్వ విద్యాంతగం శ్రేష్ఠం ధనుర్వేదస్య పారగమ్‌ || 51

రామం క్షత్రియహంతారం ప్రదీప్త మివ పావకమ్‌ | ఔర్వసైన మృచీకస్య సత్యపత్యాం మహాయశాః || 52

జమదగ్నిస్తపో వీర్యా జ్జజ్ఞే బ్రహ్మవిదాం వరః | మధ్యమశ్చ శునశ్శేఫః శునః పుచ్చఃకనిష్ఠకః || 53

విశ్వామిత్రం తు దాయాదం గాధిః కుశికనందనః | జనయామాస పుత్రంతు తపోవిద్యాశమాత్మకమ్‌ || 54

ప్రాప్య బ్రహ్మర్షిసమతాం యోయం బ్రహ్మర్షితాం గతః | విశ్వామిత్రస్తు ధర్మాత్మా నామ్నా విశ్వరథః స్మృతాః || 55

జజ్ఞే భృగు ప్రసాదేన కౌశికా ద్వంశవర్ధనః | విశ్వామిత్రస్య చ సుతా దేవరాతాదయః స్మతాః || 56

ప్రఖ్యాతా స్త్రిషు లోకేషు తేషాం నామాన్యతః పరమ్‌ | దేవరాతః కతిశ్చైవ యస్మాత్కాత్యాయనాః స్మృతాః|| 57

శాలావత్యాం హిరణ్యాక్షో రేణు ర్జజ్ఞే7థ రేణుకః | సాంకృతి ర్గాలవశ్చైవ ముద్గలశ్చైవ విశ్రుతః 58

మధుచ్ఛందో జయశ్చైవ దేవలశ్చ తధాష్టమః | కచ్చపో హారిత శ్చైవ విశ్వామిత్రస్య తే సుతాః || 59

తేషాం ఖ్యాతాని గోత్రని కౌశికానాం మహాత్మనామ్‌ |పాణినో బభ్రవశ్చైవ ధ్యానజప్యాస్తధైవచ || 60

పార్థివా దేవరాతాశ్చ శాలంకాయన బాష్కలాః | లోహితా యమదూతాశ్చ తధా కారూశకాః స్మృతాః || 61

పౌరవస్య ముని శ్రేష్ఠా బ్రహ్మర్షేః కౌశికస్య చ | సంబంధ్దో7ప్యస్య వంశేస్మిన్‌ బ్రహ్మక్షత్రస్య విశ్రుతః || 62

విశ్వామిత్రాత్మజానాం తు శునః శేఫో7గ్రజః స్మృతః | భార్గవః కౌశికత్వం హి ప్రాప్తః స మునిసత్తమః || 63

విశ్వామిత్రస్య పుత్రస్తు శునశ్శేఫో7భవత్కిల | హరిదశ్వస్య యజ్ఞేతు పశుత్వే వినియోజితః || 64

దేవైర్దత్తః శున శ్శేఫో విశ్వామిత్రాయ వై పునః | దే వైర్దత్తః స వై యస్మా ద్దేవరాత స్తతో7భవత్‌ || 65

దేవరాతాదయః సప్త విశ్వామిత్రస్య వై సుతాః | దృషద్వతీ సుతశ్చాపి వైశ్వామిత్ర స్త7థాష్టకః|| 66

అష్టకస్య సుతో లౌహిః ప్రోక్తో జహ్నుగణో మయా | అత ఊర్ద్వం ప్రవక్ష్యామి వంశ మాయో ర్మహాత్మనః || 67

ఇతి శ్రీ మహాపురాణ ఆదిబ్రాహ్మే సోమవంశే7 మావసువంశాను కీర్తనం నామ దాశమో7ధ్యాయః

ఇక్ష్వాకువంశజుడు రేణువనురాజుకూతురు కామలి యనుపేరుగలది (రేణుక) మహానుభావురాలు. అమెయందు తపోవిద్యా సమన్వితుడు ఆర్చీకుడు (జమదగ్ని) భయంకరుడైన జామదగ్న్యుని (పరుశురాముని) గాంచెను. అతడు సర్వవిద్యాపారంగతుడు ధనుర్వేదవిశారదుడు క్షత్రియాంతకుడు ప్రజ్వలితాగ్నివోలె నుండెను. పరశురాము డాజమదగ్ని తపోవీర్యమున జన్మించెను. మధ్యముడు శునశ్శేపుడు కనిష్టుడు శునఃపుచ్చుడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షిసముడై బ్రహ్మయు నయ్యెను. విశ్వరథుడనియు నాయనకుcబేరు. విశ్వామిత్రుని కుమారులు దేవరాతుడు మొధలయినవారు. విఖ్యాతులు. దేవరాతుడు. కలి యాయనసంతతియే కాత్యాయనులు. శాలావతియందు హిరణ్యాక్షుడు రేణువు. రేణుకుడు సాంకృతి గాలవుడు ముద్గలుడు. మధుచ్చందుడు జయుడు, దేవలుడు కచ్ఛపుడు, హారితుడు ననువారు జనించిరి. కౌశికులగోత్రములు ప్రఖ్యాతిచెందియున్నవి. పాణినులు, బభ్రవులు, ధ్యానజప్యులు, దేవరాతులు, శాలంకాయనులు, బాష్కలులు, లోహితులు, యమదూతలు, కారూషకులు ననువారు కౌశికులు, పౌరవుడను బ్రహ్మర్షియొక్కయు కౌశికుని యొక్కయు వంశమందు బ్రహ్మక్షత్ర సంబంధము ప్రసిద్దమయ్యెను. విశ్వామిత్రుని కొడుకులలో శునఃశేపుడు పెద్దవాడు. భార్గవుడు కొశికత్వముం బడసినవాడు. శునఃశేవుడు హరిదశ్వుని యజ్ఞమందు పశువుగా వినియుక్తుడయ్యె. దేవతలాతనిం దిరిగి విశ్వామిత్రునకు క్షేమముగనిచ్చిరి. దేవతలచే నీయబడినవాడగుటచే దేవరాతుడనియు పేరొందె. దేవరాతాదులేడ్వురు విశ్వామిత్రుని కుమారులు. దృషద్వతిసుతుడు అష్టకుడును వైశ్వామిత్రుడే అష్టక కుమారుడు లౌహి. జహ్నుమునిగణము నాచే చెప్ప బడినది ఇటుపైని అయువుయొక్క వంశమునుదెత్పెదను.

శ్రీ బ్రహ్మమహాపురాణమునందు సోమవంశములోఅమావసువంశాను కీర్తనమను పదియయవయధ్యాయము. సమాప్తము.

Brahmapuranamu    Chapters