Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చనవతితమోధ్యాయః

అథ ప్రతిష్ఠామాసాది సామగ్య్రాదిః

ఈశ్వర ఉవాచ:

వక్ష్యే లిఙ్గప్రతిష్ఠాం చ ప్రాసాదే భుక్తిముక్తిదామ్‌ | తాం చరేత్సర్వదా ముక్తా భుక్తే దేవదినే సతి. 1

వినా చైత్త్రేణ మాఘాదౌ ప్రతిష్ఠా మాసపఞ్చకే | గురుశుక్రోదయే కార్యా ప్రథమే కరణత్రయే 2

శుక్లపక్షే విశేషేణ కృష్ణే7ప్యాపఞ్చమీదినమ్‌ | చతుర్థీం నవమీం షష్ఠీం వర్జయిత్వా చతుర్దశీమ్‌. 3

శోభనాస్తిథయః శేషా క్రూరవారవివర్జితాః | శతభిషా ధనిష్ఠాద్రీ అనురాధో త్తరాత్రయమ్‌. 4

రోహిణీ శ్రవణం చేతి స్థిరారమ్భే మహోదయాః | లగ్నే చ కుద్భుసింహాలి తులాస్త్రీ వృషధన్వినామ్‌. 5

అ (35)

శస్తోజీవో నవరేషు సప్తస్థానేషు సర్వదా | బుధః షడష్టదిక్సప్తతుర్పేషు వినర్తుసితః. 6

సప్తర్తుత్రిదసాదిస్థః శశాఙ్కో బలదః సదా | రవిర్దశత్రిషట్సంస్థో రాహుస్త్రిదశషడ్గతః. 7

షట్త్రిస్థానగతాఃశస్తా మన్దాఙ్గారార్క కేవతః | శుభాః క్రూరాశ్చ పాపాశ్చ సర్వ ఏకాదశస్థితాః. 8

ఏషాం దృష్టిర్మునౌ పూర్ణా త్వార్దికీ గ్రహభూతయోః | పాదికీ రామదిక్థ్సానే చతురష్టౌ పాదవర్జితాః 9

పాదన్యూన చతుర్నాడీ భోగః స్యాన్మీనమేషయోః | వృషకుమ్భౌ చ భుఞ్జాతే చతస్రః పాదవర్జితాః 10

మకరో మిథునం పఞ్చ చాపాలిహరికర్కటాః | పాదోనాః షట్తులా కన్యే ఘటికః సార్థపఞ్చ చ. 11

కేసరీ వృషభః స్థిరాః స్యుః సిద్దిదాయకాః | చరా ధనుస్తులామేషా ద్విఃస్వభావాస్తృతీయకాః. 12

శుభః శుభగ్రహైర్ధృష్టః శస్తో లగ్నః శుభాశ్రితః | గురుశుక్రబుధైర్యుక్తో లగ్నో దద్యాద్భలాయుషీ. 13

రాజ్యం శౌర్యబలం పుత్రాన్యతో ధర్మాదికం బహు | ప్రథమస్సప్తమస్తుర్యో దశమః కేన్ద్ర ఉచ్యతే. 14

గురుశుక్రబుధాస్తత్ర సర్వసిద్ధి ప్రదాయకాః | త్య్రేకాదశచతుర్థస్థా లగ్నాత్పాపగ్రహాః శుభాః. 15

పరమేశ్వరుడు చెప్పెను. ఇపుడు భుక్తిముక్తి పద్రాయకమగు దేవాలయ లింగస్థాపన విధానమును చెప్పెదను. ముక్తికొరకు చేయులింగ ప్రతిష్ఠ ఎపుడైనను చేయవచ్చును. కాని భోగసిద్ధికై చేయులింగ ప్రతిష్ఠమాత్రము ఉత్తరాయణము నందు చేయవలెను. మాఘాది మాసపంచకములో, చైత్రమును విడచి, దేవతాప్రతిష్ఠ చేయవలెను. గురు శుక్రులు ఉదయించి నపుడు మొదటి మూడు కరణములందును చేయవలెను. రెండు పక్షములందును పంచమి వరకును ఉన్న తిథులు ప్రతిష్ఠకు శుభ##మైనవి చతుర్థి, నవమి, షష్ఠి, చతుర్దశి విడిచి మిగిలిన తిధులు క్రూరమైన వారములు కానిచో ఉత్తమమైనవి. శతభిషడ్‌ - ధనిష్ఠా - ఆర్ద్రా - అనురాధా ఉత్తరాత్రయ - రోహిణి - శ్రవణనక్షత్రములు స్థిరప్రతిష్ఠాప్రారంభమునకు ఉత్తమములు. కుంభ, సింహ, వృశ్చిక, కన్యా వృషభ లగ్నములు శ్రేష్ఠములు. గురుడు నవమ-సప్తమస్థానములలో ఉన్నచో శుభము. షష్ఠ-అష్టమ-దశమ-చతుర్థ స్థానములందు బుధుడున్నచో శుభము. షష్ఠము తప్ప పై స్థానములో శుక్రుడున్న శుభము. తృతీయ-సప్తమ-షష్ఠ-దశమ స్థానములందు చంద్రుడు సర్వదా బలదాయకుడు. సూర్యుడు దశమ-తృతీయ-షష్ఠములందున్నచో శుభఫలము నిచ్చును. తృతీయ-షష్ఠ-సప్తములందు రాహువు శుభకారకుడు శని - కుజ -కేతువు షష్ఠ-తృతీయ స్థానములందు శుభము. శుభ-క్రూర పాపగ్రహములు ఏకాదశములో నున్నచో శుభకరములు. సమస్తగ్రహముల దృష్టి సప్తమమున పూర్ణముగా నుండును. పంచమ నవమ స్థానములందు అర్ధదృష్టి, తృతీయ-దశమ దృష్టి పాదదృష్టి. అష్టమస్థానమునందు దృష్టి త్రిపాదదృష్ఠి. మీనమేష వృషకుంభ రాశుల భోగము మూడు ముప్పావు ఘడియలు, మకరమిథునముల భోగము ఐదు ఘడియలు, ధనుస్సు, వృశ్చికము, సింహము, కర్కటకము వీటి భోగము ఆరు నాడులు, తులా కన్యారాశుల భోగము ఐదున్నర నాడులు, స్థిరలగ్నముకైన సింహ, వృషభ, కుంభములు సిద్దిదాయకములు, ధనస్తులా మేషములు చరరాశులు, మూడవ సంఖ్య గల రాశులు (మిథున-కన్యాదులు) ఉభయ స్వభావములు. కర్కట - మకర- వృశ్చికములు సంన్యాసమునకు అనర్హములు, శుభ్రగ్రహదృష్టి గల లగ్నము శుభము. శుభగ్రహమున్న లగ్నము శ్రేష్ఠము. లగ్నమునందు గురు-శుక్ర-బుధులున్నచో ధన-ఆయు - రాజ్య-శౌర్య-బల-పుత్ర-యశో-ధర్మాదులను అధికముగా నిచ్చును. ప్రథమ - చతుర్థ - సప్తమ- దశమములకు పేరు కేంద్రస్థానములందున్న గురు శుక్ర బుధులు సంపూర్ణ శుభఫలముల నిత్తురు. తృతీయ-ఏకాదశ-చతుర్థ స్థానములందు పాపగ్రహములున్నచో శుభఫలము నిత్తురు.

అతో7ప్యనీచకర్మార్థం యోజ్యాస్తిథ్యాదయో బుధైః |

ధామ్నః పఞ్చగుణాం భూమిం తక్త్వా వా ధామసంమితామ్‌. 16

హస్త ద్ద్వాదశసోపానాత్కుర్యాన్మణ్డపమగ్రతః | చతురస్రం చతుర్ద్వారం స్నానార్థం తు తదర్ధతః . 17

éఏకాస్యం చతురాస్యం వా రౌద్య్రాం ప్రాచ్యుత్తరే7థవా | హాస్తికో రసహస్తీ పై మణ్డపో7ర్కకరోథవా. 18

ద్విహస్తోత్తరయా వృద్ధ్యా శేషం స్యాన్మణ్డపాష్టకమ్‌ | వేదిశ్చతుష్కరా మధ్యే కోణస్తమ్భేన సంయుతా. 19

వేది పాదాన్తరం త్యక్త్వా కుణ్డాని నవపఞ్చ వా | ఏకం వా శివకాష్టాయాం ప్రాచ్యాం వా తద్గురోః పరమ్‌.

ముష్ఠిమాత్రం శతార్దే స్యాచ్ఛతే చారత్నిమాత్రకమ్‌|

హస్తం సహస్రహోమే స్యాన్నియుతే తు ద్విహస్తికమ్‌. 21

లక్షేచతుష్కరం కుణ్డం కోటిహోమే7ష్టహస్తకమ్‌. | భగాభమగ్నౌ ఖణ్డన్దు దక్షే త్వ్రస్రం చ నైరృతే. 22

షడస్రం వా¸° పద్మం సౌమ్యే చాష్టాస్రకం శివే | తిర్యాక్పాతం శివం ఖాతమూర్ధ్వం మేఖలయా సహ. 23

తద్భహిర్మేఖలాస్తిస్రో వేదవహ్నియమాఙ్గలైః | అజ్గులైః షడ్భిరేకా వా కుణ్డాకారాస్తు మేఖలాః. 24

తాసాముపరి యోనిః స్యాన్మధ్యే7శ్వత్థదలాకృతిః | ఉచ్ఛ్రాయోణాజ్గులం తస్మాద్విస్తారేణాజ్గులాష్టకమ్‌. 25

దైర్ఘ్యం కుణ్డార్ధమానేన కుణ్డకణ్డసమోద్గరః | పూర్వాగ్నియామ్యకుణ్డానాం యోనిః స్యాదుత్తరాననా. 26

పూర్వాననా తు శేషాణామైశాన్యే7న్యతరాతయోః | కుణ్డానాం యశ్చతుర్వింశో భాగః సో7జ్గుళఇత్యతః

ప్లక్షోదుమ్భరకాశ్వత్థనటజాస్తోరణాః క్రమాత్‌ | శాన్తిభూతిబలారోగ్యపూర్వాద్యా నామతః క్రమాత్‌. 28

పఞ్చషట్‌సప్తహస్తాని హస్తఖాతస్థితాని చ | తదర్భవిస్థరాణి స్యుర్యుతాన్యామ్రదలాదిభిః. 29

అందువలన వీటిని, ఇతర శుభగ్రహములను, ఇతర శుభతిథులను ప్రతిష్ఠాకర్మ విషయమున విద్వాంసుడు నిర్ణయించుకొనవలెను. ఆలయము ఎదుట దానికంటె పదిరెట్లు లేదా దానితో సమానమైన లేదా మెట్టునుండి పది హస్తముల దూరము భూమి విడి మండప నిర్మాణము చేయవలెను. ఆ మండపము చతురశ్రమై నాలుగు ద్వారములు కలదై ఉండవలెను. దానిలో సగము భూమి గ్రహించి స్నానార్థమై మండపము నిర్మింపవలెను. దానికి ఒకటి లేదా నాలుగు ద్వారము లుండవలెను. ఈ స్నానమండపము ఈశాన్యమునందు గాని తూర్పునగాని ఉత్తరమునందు గాని ఉండవలెను. మొదటి మండపము ప్రమాణము ఎనిమిది హస్తములు పది హస్తములు, లేదా పండ్రెండు హస్తము లుండవలెను. మిగిలిన ఎనిమిది మండపములు రెండేసి హస్తములు పెంచి నిర్మించవలెను. మధ్య మండలమునందు నాలుగు హస్తముల వేది నిర్మించవలెను. దాని నాలుగు కోణములందును, నాలుగు స్తంభము లుండవలెను. వేది - పాదముల మధ్యస్థమును విడచి కుండములను నిర్మించవలెను. ఇవి తొమ్మిది లేదా పది ఉండవలెను. ఈశాన్యమునందు గాని తూర్పునందు గాని ఒకే కుండమును నిర్మించవలెను. ఇది గురుస్థానము. ఏబది హోమములు చేయు కుండము ప్రమాణము పిడికిలి ఉండవలెను. నూరు హోమములైనచో జానెడు, వెయ్యి హోమములు చేయవలసియున్నచో ఒక హస్తము, పది వేల హోమములైనచో రెట్టింపు ఉండవలెను. లక్ష హోమములకు నాలుగు హస్తములు, ఒక కోటి హోమములకు ఎనిమిది హస్తములు ఉండవలెను. కుండమును అగ్నేయమునందు భగాకారముగను, దక్షిణమున అర్ధచంద్రాకారమునను, నైరృతియందు త్రికోణాకారముగను, వాయవ్యమున షట్కోణముగను, ఉత్తరమున కమలాకారముగను, ఈశాన్యమునందు అష్టకోణముగను నిర్మించవలెను. కుండము అన్ని వైపుల సమముగను, పల్లముగను ఉండవలెను. పైన మేఖలలు నిర్మించవలెను బైట వరుసగ నాలుగు, మూడు, రెండు అంగుళముల వెడల్పు గల మేఖల నిర్మించవలెను. మేఖలలు కుండా కారముతో సమానాకారములై ఉండవలెను. వాటిపై మధ్య భాగమున రావి యాకు ఆకారముగల యోనియుండవలెను. దాని ఎత్తు ఒక అంగుళము వెడల్పు ఎనిమిది అంగుళములు ఉండవలెను. పొడవు కుండార్థముతో సమానముగా ఉండవలెను. యోని మధ్యభాగము కుండ కంఠము వలె నుండవలెను పూర్వ-ఆగ్నేయ-దక్షిణములందు కుండముల యోని ఉత్తరాభి ముఖముగనుండవలెను. ఇతరదిక్కులందున్న కుండముల యోని పూర్వాభిముఖముగ నుండవలెను. ఈశాన్యకుండయోని ఉత్తరాభి ముఖముగాని, పూర్వాభిముఖముగా గాని ఉండవలెను. కుండములో ఇరువది నాల్గవ భాగము అంగుళము, తదనుసారము విభజించి మేఖలా-కంఠ-నాభులను నిశ్చయించవలెను. మండపము పూర్వాదిదిక్కులందు ద్వారములు వరుసగ ప్లక్ష ఉదుంబర అశ్వత్థ వటదారువులతో నిర్మింపబడవలెను. పూర్వాదిదిక్కులనుండి వరుసగ వాటి పేర్లు శాంతిభూతి బల ఆరోగ్యము ద్వారముల ఎత్తు ఐదు, ఆరు, లేదా ఏడు హస్తము లుండవలెను. వాటిని చేతిలోతు త్రవ్విన గోతులలో నిలుపవలెను. వాటి విస్తారము ఎత్తులో సగము ఉండవలెను. వాటిపై మామిడాకులు మొదలుగు నవి కట్టవలెను.

ఇన్ద్రా యుద్గోపమారక్తాకృష్ణా ధూమ్రా శశిప్రభా | శుక్లాభా హేమవర్ణా చ పతాకా స్ఫాటికోపమా. 30

éపూర్వాదితో7బ్జజే రక్తా నీలానన్తస్య నైరృతే | పఞ్చహస్తాస్తదర్ధాశ్చ ధ్వజా దీర్ఘాశ్చ విస్తరాః. 31

హస్తప్రదేశితాదణ్డా ధ్వజానాం పఞ్చహస్తకాః | వర్మ కాద్దన్తిదన్తాగ్రాతథా వృషభశృఙ్గతః. 32

పద్మషణ్డాద్వరాహాచ్చ గోష్ఠాదపి చతుష్పథాత్‌ | మృత్తికా ద్వాదశ గ్రాహ్య వైకుణ్ఠ7ష్టౌ పినాకిని. 33

నగ్రోధోదుమ్భరాశ్వత్థచూతజమ్భూత్వగుద్భవమ్‌ | కషాయపఞ్చకం గ్రహ్యామార్తవం చ ఫలాష్టకమ్‌. 34

తీర్థామ్భాంసి సుగన్దీని తథా సర్వౌషధీజలమ్‌ | శస్తం పుష్పఫలం వక్ష్యే రత్నగోశృజ్గావారి చ. 35

స్నానాయాపాహరేత్పఞ్చ పఞ్చ గవ్యామృతం తథా | పిష్టనిర్మితవస్త్రాదిద్రవ్యం నిర్మజ్జనాయ చ. 36

సహస్రసుషిరం కుమ్భం మణ్డలాయ చ రోచనా | శతమౌషధిమూలానాం విజయా లక్ష్మణా బలా. 37

గూడూచ్యతిబలా పాఠా సహదేవీ శతావరీ | బుద్ధిః సువర్చలా వృద్దిః స్నానే ప్రోక్తా పృథక్‌ పృథక్‌. 38

రక్షాయై తిలదర్భౌఘో భస్మస్నానం తు కేవలమ్‌ | యవగోధూమబిల్వానాం చూర్ణాని చ విచక్షణః 39

విలేపసం సకర్పూరం స్నానార్థం కుమ్భగణ్డకాన్‌ | ఖట్వాం చ తూలికాయుగ్మం సోపధానం సవస్త్రకమ్‌.

కుర్యాద్విత్తానుసారేణ శయనే లక్ష్యకల్పనే | ఘృతక్షాద్రయుతం పాత్రం కుర్యాత్స్వర్ణశలావికామ్‌. 41

వర్దనీం శివకుమ్భం చ లోకపాలఘటానపి | ఏకం నిద్రాకృతీ కుమ్భే శాన్త్యర్థం కుణ్డసఙ్ఖ్యయా. 42

ద్వారపాలాదిధర్మాన్తప్రశాన్తదిఘటానపి | వాస్తులక్ష్మీగణశానాం కలశానపరానపి. 43

ధాన్యపుఞ్జకృతాధీరాన్సవస్త్రాన్‌ స్రగ్విభూషితాన్‌ | సహిరణ్యాన్‌ సమాలబ్దాన్‌ గన్దపానీయపూరితాన్‌. 44

పూర్ణపాత్రఫలాధారాన్‌ పల్లవాఢ్యాన్‌ సలక్షణాన్‌ | వసై#్త్రరాచ్ఛాదయేత్కుమ్భానాహరేద్గౌరసర్షపాన్‌. 45

వికిరార్థం తథా లాజాన్‌ జ్ఞానఖడ్గం చ పూర్వవత్‌ | సమిథశ్చ చరుస్థాలీం దర్పీ చ తామ్రనిర్మితామ్‌. 46

ఘృతక్షాద్రాన్వితం పాత్రం పాదాభ్యజ్గకృతే తథా | విష్డరాం స్త్రింశతా దర్భదవైర్శాహుప్రమాణకాన్‌. 47

చతురశ్చతురస్తద్యత్పాలాశాన్పరధీనపి |

మండప పూర్వాది దిక్కులందు వరుసగ ఇంద్రాయుధము వలె అనేక వర్షములు గల పతాకను, రక్త-కృష్ణ-ధూసర-శ్వేత-హరిత-సువర్ణవర్ణ-స్ఫటికవర్ణపతాకలను ఎగురవేయవలెను. ఈశాన్యమునందును, పూర్వమధ్యమునందును బ్రహ్మకొరకు రక్తవర్ణపతాకను, నైరృతి-పశ్చిమమధ్య భాగములందు అనంతునికొరకు నీలవర్ణపతాకను ఎగురవేయవలెను. ధ్వజముల పతాకలు ఐదు హస్తముల పొడవు. అందులో సగము వెడల్పు ఉండవలెను. ధ్వజదండము ఎత్తు ఐదు హస్తములుండవలెను. ధ్వజము లావురెండు చేతులతో పట్టుకొనుటకు వీలగు నట్లు ఉండవలెను. పర్వతశిఖర-రాజద్వార-నదీతట-అశ్వశాలా-హస్తిశాలా-వల్మీకముల మట్టిని, ఏనుగుదంతములలో పెకలించిన మట్టిని, ఎద్దు కొమ్ములతో పెకలించిన మట్టిని, వరాహము పెకలించిన మట్టిని,గోష్ఠ చతుష్పథముల మట్టిని ఈ పండ్రెండు విధములమట్టిని గ్రహించవలెను. విష్ణుస్థాపనమునకు పండ్రెండు విధముల మట్టిని, శివస్థాపనమునకు ఎనిమిది విధముల మట్టిని ఉపయోగించవలెను. న్యగ్రోధ-ఉదుంబర-అశ్వత్థ-చూత-జంబూవృక్షముల బెరడునుండి తీసి ఐదు కషాయములు, ఎనిమిది విధములైన ఋతుఫలములు సంగ్రహించవలెను. తీర్థజల-సుగంధిత జలములు, సర్వౌషధి మిశ్రజలము, సస్యపుష్పమిశ్రిత జలము, స్వర్ణమిశ్రిత జలము, రత్నమిశ్రిత జలము, గోశృంగ స్పర్శయుక్త జలము, పంచగవ్య-పంచామృతములు-వీటిన్నిటిని దేవతాస్నానముకొరకై సిద్దము చేసికొనవలెను. విఘ్మము కలిగించువారిని భయపెట్టుటకై పిండితో చేసి వజ్రాద్యాయుధములను గూడ సిద్ధము చేసికొనవలెను. సహస్రఛిద్రములున్న కలశమును, మంగళార్థమై గోరోచనమును సిద్దము చేసికొనవలెను. స్నానార్థమై వందవిధములైన ఓషధుల మూలములు, విజయా-లక్ష్మణా-బలా-గుడూచీ-అతిబలా-పాఠా-సహదేవా-శతావరీ-బుద్ధి-సువర్చలా-వృద్ధులను వేరువేరు గా సిద్ధము చేసికొనవలెను. రక్షకొరకు తిలకుశాదులు, భస్మస్నానము కొరకు భస్మము, స్నానార్థము యవగోధుమలపిండి, బిల్వచూర్ణము, విలేపనము, కర్పూరము, కలశము, చెంబు సిద్ధము చేసికొనవలెను. మంచము, రెండు పరుపులు, తలగడ, దుప్పటి మొదలైన ఇతరవస్త్రములు గూడి తన శక్తిని అనుసరించి సిద్ధము చేసికొని, వివిధ చిహ్నములతో సిద్ధము చేయబడిన శయనాగారమునందు ఉంచవలెను. ఘృత-మధు పూర్ణపాత్రములు, బంగారు సూది, వర్ధని శివకుంభము లోకపాల ఘటములను కూడ సిద్ధము చేసికొనవలెను. నిద్రకొరకు ఒక కలశ, కుండము లెన్ని ఉన్నవో అన్ని శాంతికలశములు. ద్వారపాలాది-ధర్మాది-ప్రశాంతాదుల కొరకై కలశలు, వాస్తుదేవ-లక్ష్మీ-గణశులకై వేరు వేరు కలశలు, సమకూర్చుకొనవలెను. ఈ కలశల క్రింద ఆధారముగా నుండు నట్లు పోయుటకు ధాన్యము ఉంచుకొనవలెను. అన్ని కలశలను వస్త్ర పుష్పాదులతో అలంకరించవలెను. వీటి లోపల సువర్ణముంచి స్పృశించి సుగంధజలముతో నింపవలెను. అన్ని కలశల మీదను పూర్ణ పాత్రలు, ఫలములు ఉంచవలెను. వాటి ముఖభాగమునందు పంచపల్లవము లుంచవలెను. ఆ కలశలు ఉత్తమ లక్షణ సంపన్నములై ఉండవలెను. కలశములను వస్త్రములచే ఆచ్ఛాదించవలెను. నలుమూలల చల్లుటకై తెల్ల ఆవాలు, పేలాలు సిద్ధము చేసికొనవలెను. పూర్వమునందు చెప్పినట్లు జ్ఞానఖడ్గము ఉంచుకొనవలెను. సమిధలు, చరుపాత్ర, రాగి గరిటి, పాదాభ్యంగము కొరకై ఘృత మధవులున్న పాత్రను, ముప్పది కుశదక్షములతో నిర్మించిన నాలుగు ఆసనములను, పలాశ నిర్మితములగు నాలుగు పరిధులను సమకూర్చుకొనవలెను.

తిలపాత్రం హవిః పాత్రమర్ఘ్యపాత్రం పవిత్రకమ్‌. 48

పలవింశాష్టమానాని ఘటీధూప ప్రదానకమ్‌ | స్రుక్‌స్రురౌ పిటకం పీఠం వ్యజనం శుష్క మిన్ధనమ్‌. 49

పుష్పం పత్రం గుగ్గులుం చ ఘృతైర్దీపాంశ్చ ధూపకమ్‌ |

అక్షతాని త్రిసూత్రీం చ గవ్యమజ్యం యవాం స్తలాన్‌. 50

కుశః శాన్త్యై త్రిమద్గురం సమిధో దశ పర్వికాః | బాహుమాత్రం స్రువం హస్తమర్కాదిగ్రహశాన్తయే. 51

సమిధో7ర్కపలాశోత్థాః ఖాదిరామార్గపిప్పలాః | ఉదుమ్బర శమీదూర్వాః కుశోత్థాః శతమష్ట చ. 52

తదభావే యవతిలా గృహోపకరణం తథా | స్థాలీదర్వీ పిధానాధి దేవాదిభ్యోజ్కు7శద్వయమ్‌. 53

ముద్రాముకుట వాసాంసి హారకుణ్డలకఙ్కణాన్‌ | కుర్యాదాచార్య పూజార్థం విత్తశాఠ్యం వివర్జయేత్‌. 54

తత్పాద పాదహీనా చ మూర్తిభృదస్త్రజాపినామ్‌ | పూజా స్యాజ్జపిభిస్తుల్యా విపుదైవజ్ఞశిల్పినాం. 55

వజ్రార్కశాన్తౌ నీలాతినీల ముక్తాఫలాని చ | పుష్పపద్మాదిరాగం చ వైఢూర్యం రత్నమష్టమం. 56

ఉశీరమాధవక్రాన్తా రక్తచన్దనకాగురుమ్‌ | శ్రీఖణ్డం సారికం కుష్ఠంశఙ్ఖినాహ్యోషధీగణః. 57

హేమతామ్రమయం రక్తం రాజతం చ సకాంస్యకమ్‌ | సీసకం చేతి లోహాని హరితాలం మనఃశిలా. 58

గైరికం హేమమాక్షీకం పారదో వహ్నిగైరికమ్‌ | గన్దకాభ్రకమిత్యష్టౌ ధాతవో వ్రీహయస్తథా. 59

గోధుమాన్‌ సలిలాన్‌ మాషాన్‌ ముద్గానప్యాహరేద్యవాన్‌ | నీవారాఞ్చ్యామీకానేనం వ్రీహయోప్యష్ట కీర్తితాః.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ప్రతిష్ఠా మాసాదిసామగ్ర్యాదికం నామ పఞ్చనవతితమో7ధ్యాయః.

తిలపాత్ర-హవిష్యపాత్ర-అర్ఘ్యపాత్ర-పవిత్రకములను కూడ సిద్ధము చేసికొనవలెను. వీటి ప్రమాణము ఇరువదేసి ఫలములు ఘంటి, ధూపపాత్ర, స్రుక్కు, స్రువము, పిటకము, పీఠము, వ్యజనము, ఎండిన సమిధలు, పుష్పములు, సత్రములు గుగ్గులు, ఘృత దీపములు, ధూపము, అక్షతలు, మూడు పోచల ద్వారము, గౌఘృతము, యవలు, తిలలు, కుశలు, శాంతికర్మపై త్రివిధమధుర పదార్థములు, పది పర్వముల సమిధలు, ఒక హస్తము ప్రమాణము గల స్రువము, సూర్యాది గ్రహశాంతికై అర్క-పలశా-ఖాదిర-అపామార్గ-అశ్వత్థ-ఉదుంబక-శమీవృక్షసమిధలు, ధూర్వలు, కుశలు, సిద్దము చేసికొనవలెను. అర్కాదిసమిధలు నూట ఎనిమిది చొప్పన ఉండవలెను. ఇవి లభించనిచో వాటి స్థానమున యవలు, తిలలు హోమము చేయవలెను. ఇంకను గృహోపకరణములు కూడ సిద్ధముచేసికొనవలెను. గిన్నెలు, గరిటె, మూతలు మొదలగునవి. దేవాదుల కొరకు వస్త్రద్వయము, ఆచార్యపూజనిమిత్తము ముద్రా-ముకుట-వస్త్ర-హార-కుండల-కంకణాదులును సిద్ధము చేయవలెను. ధనవ్యయము విషయమున లుబ్ధత్వముచూపరాదు. మూర్తిధారణము, అస్త్రమంత్రాదిజపము చేయు బ్రాహ్మణులకు ఆచార్యున కిచ్చిన దానిలో నాల్గవవంతు తగ్గించి దక్షిణ ఈయవలెను. సామాన్య బ్రాహ్మణులకును, జ్యోతిష్కులకును, శిల్పులకును, జపకర్తల కిచ్చినట్లుగనే ఇవ్వవలెను. వజ్రము, సూర్యకాంతమణి, నీలమణి, అతినీలమణి, ముత్యము, పుష్పరాగము, పద్మరాగము, వైదూర్యము - వీటిని సంగ్రహించుకొనవలెను వట్టివేరు, విష్ణుకాంత, రక్తచందనము, అగురువు, శ్రీ ఖండము, శాంబ, కుష్ఠము, శంఖిని ఈ ఓషదులను సంగ్రహించవలెను. బంగారము, రాగి, ఇనుము, రక్తము, రజతము, కంచు, సీసము అను లోహములను, హరితాలము, మనఃశిల గైరికము, హేమమాక్షీకము, పాదరసము, వహ్నిగైదికము, గంధకము, అభ్రకము అను ఎనిమిది ధాతువులను కూర్చుకొనవలెను. ఈ విధముగనే ఎనిమిది విధములగు ధ్యానములు-వరి, గోధములు తిలలు, పెసలు, మినుములు, యవలు, నీవారములు శ్యావాకములు సమకూర్చుకొనవలెను.

అగ్నిమహాపురాణమునందు ప్రతిష్ఠాకాల సామగ్య్రాది విధి వర్ణనమను తొంబదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters