Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుర్నవతితమో7ధ్యాయః

అథ శిలాన్యాస విధానమ్‌

ఈశాదిషు చరక్యాద్యాః పూర్వవత్పూజయేద్బహిః | ఆహుతిత్రితయం దద్యాత్ప్రతిదేవమనుక్రమాత్‌. 1

దత్త్వా భూతబలిం లగ్నే శిలాన్యాసమనుక్రమాత్‌ | మధ్యసూత్రే న్యసేచ్ఛక్తిం కుమ్భం జాన్వన్తముత్తమమ్‌.

నకారరూఢమూలేన కుమ్భే7స్మిన్‌ ధారయేచ్ఛిలామ్‌ | కుమ్భానష్టౌ సుభద్రాదీన్‌ దిక్షు పూర్వాదిషు క్రమాత్‌.

లోకపాలాణుభిర్న్యస్య శ్వభ్రేషు న్యస్తశ క్తిషు | శిలాస్తేష్వథ నన్దాద్యాః క్రమేణ వినివేశ##యేత్‌. 4

శమ్బరైర్మూర్తినాథానాం యథాస్యు ర్భిత్తిమధ్యతః | తాసు ధర్మాదికానష్టౌ కోణాత్కోణ విఖాగశః. 5

సుభద్రాదిషు నన్దాద్యాశ్చతస్రో7గ్న్యాది కోణగాః | అజితాద్యశ్చ పూర్వాదిజయాదిష్వథ విన్యసేత్‌. 6

బ్రాహ్మణం చోపరి న్యస్య వ్యాపకం చ మహేశ్వరమ్‌ | చిన్తయేదేషు చాధానం వ్యోమప్రాసాదమధ్యగమ్‌. 7

బలిం దత్త్వా జపేదస్త్రం విష్నుదోషనివారణమ్‌ | శిలాపఞ్చకపక్షే7పి మనాగుద్దిశ్యతే యథా. 1 8

మధ్యే పూర్ణశిలాన్యాసః సుభద్రకలశే7ర్దతః | పద్మాదిషు చ నన్దాత్యాః కోణష్వగ్న్యాదిషు క్రమాత్‌. 9

మధ్యభావే చతస్రో7పి మాతృవద్భావసంమతాః |

పరమేశ్వరుడు చెప్పెను-స్కందా! వాస్తుమండలమునకు బైట, ఈశాన్యదిక్కులందు వెనుకటి వలె చరకి మొదలగు దేవతలను పూజించవలెను. ఒక్కొక్క దేవతకును మూడేసి హోమములు చేయవలెను. భూతబలి ఇచ్చి, నిశ్చితమగు లగ్నమునందు శిలాన్యాసోపక్రమము చేయవలెను. ఖాతమధ్యభాగమున ఆధారశక్తిన్యాసముచేయవలెను. అచట అనంతుని మంత్రముచే అభిమత్రించిన ఉత్తమకలశము స్థాపింపవలెను. "లం పృథివ్యై నమః" అను మంత్రముతో ఆ కలశముపై పృఠివీస్వరూప మగు శిలను ఉంచవలెను. దానికి పూర్వాదిదిక్కులందు క్రమముగ సుభద్రము మొదలగు ఎనిమిది కలశలను స్థాపించవలెను. మొదట వాటికొరకై గోతులు త్రవ్వి, వాటిలో ఆధారశక్తిన్యాసముచేసిన పిమ్మట ఆ కలశలను ఇంద్రాదిలోకపాలుల మంత్రములతో స్థాపించవలెను. పిదప ఆ కలశలపై నందాది శిలలను ఉంచవలెను. ఆ శిలలు తత్త్వ మూర్త్యాధి దేవతావస్త్రములతో కూడి యుండవలెను. గోడలపై మూర్తులను, అస్త్రాదుల చిహ్నములుంచినట్లు ఆ శిలలపై దిగ్విదిక్కులను చక్కగా విభజించి ధర్మాదిదేవతాష్టకమును స్థాపించవలెను. సుభద్ర మొదలగు నాలుగు కలశములపై నందాది శిలాచతుష్టయమును, నాలుగు కోణములందును స్థాపించవలెను. పిదప జయాది కలశచతుష్టయముపై అజితాది శిలాచతుష్టయమున, పూర్వాదిదిక్చతుష్టయమున స్థాపించవలెను. వాటి అన్నింటి పైనను, బ్రహ్మను, వ్యాపకు డగు మహేశ్వరుని స్థాపించి మందిరమధ్యమునందున్న ఆకాశ మను పేరు గల అధ్వను చింతించవలెను. ఈ అన్నింటికిని బలి సమర్పించి విఘ్నదేష నివారణార్థమై అస్త్రమంత్రమును జపించవలెను. పంచశిలాపక్షమున ఈ విధముగ చేయవలెను. మధ్య భాగమున సుభద్ర కలశముపై పూర్ణయను శిలను స్థాపించవలెను. ఆగ్నేయాది దిక్కులందు క్రమముగా, పద్మాది కలశములపై, నందాది శిలలను స్థాపించవలెను. మధ్య శిల లేని పక్షమున నాలుగు శిలలనే మాతృభావముతో పూజించిస్థాపించవలెను. ఆ శిలల నైదింటిని ఈ విధముగ ప్రార్థించవలెను.

ఓం పూర్ణే త్వం మహావిద్యే సర్వసన్దోహలక్షణ | 10

éసర్వం సంపూర్ణమేవాత్ర కురుష్వాఙ్గిరసః సుతే |

ఓం నన్దే త్వం నన్దినీ పుంసాం త్వామత్ర స్థాపయామ్యహమ్‌. 11

ప్రాసాదే తిష్ఠ సంతృప్తా యావచ్చన్ద్రార్కతారకమ్‌ | ఆయుః కామం శ్రియం నన్దే దేహి వాసిష్ఠి దేహినామ్‌.

అస్మిన్‌ రక్షా సదా కార్యా ప్రసాదే యత్నతస్త్వయా |

ఓం భ##ద్రే త్వం సర్వదా భద్రం లోకానాం కురు కాశ్యపి 13

ఆయుర్దా కామదా దేవి శ్రీ ప్రద చ సదా భవ | ఓం జయో7త్ర సర్వదా దేవి శ్రీదాయుర్దా సదా భవ. 14

ఓం జయేత్ర సర్వదా దేవి తిష్ఠ త్వం స్థాపితా మయా | నిత్యం జయాయ భూత్త్యె చ స్వామినీ భవ భార్గవి.

ఓం రిక్తే7తిరిక్తదోషఘ్నే సిద్ధిము క్తిప్రదే శుభే | సర్వదా సర్వదేశ##స్థే తిష్ఠాస్మిన్‌ విశ్వరూపిణి. 16

గగనాయతనం ధ్యాత్వా తత్ర తత్త్వత్రయం న్యసేత్‌ |

ప్రాయశ్చిత్తం తతో హుత్వా విధినా విసృజేన్మఖమ్‌. 17

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శిలాన్యాసధానం నామ చతుర్నవతితమో7ధ్యాయః

సర్వసందోహస్వరూపిణివి, మహావిద్యవు ఆయిన ఓ పూర్ణా నీవు అంగిరోఋషి పుత్రికవు. ఈ ప్రతిష్ఠాకర్మయందు అంతయు చక్కగ పూర్ణ మగు నట్లు చేయుము. నందా! నీవు సమస్త పురుషులను ఆనందింపచేయుదానవు. నిన్ను ఇచట స్థాపించున్నాను. ఆకాశమునందు సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశించుచున్నంత వరకును నీవు పూర్తిగా తృప్తురాలవై ఈ ప్రాసాదమును స్థిరముగా నుండుము, వసిష్ఠనందిని యైన ఓ నందా! నీవు ప్రాణులకు ఆయువును, సంపూర్ణమనో రథములను లక్ష్మిని ఇమ్ము. నీ వీ ప్రాసాదమునందు స్థిరముగా నుండి దీనిని యత్నముతో రక్షింపుము. కశ్యపనందిని యైన భద్రా నీవు సమస్తలోకములకును సర్వదా కల్యాణము చేయుము. దేవీ! నీవు సర్వాద మాకు ఆయుర్మనోరథలక్ష్ములను ఇచ్చుచుండుము. ఒ దేవీ! జయా నీవు సర్వదా మాకు లక్ష్మిని, ఆయువును ఇచ్చుచుండుము. భృగు పుత్రియైన జయా! నీవు ఇచట స్థాపితురాలవై ఇచటనే ఉండి ఈ గృహస్వామినైన నాకు నిత్యము విజయైశ్వర్యాదుల నిమ్ము. ఓ రిక్తా! నీవు అతిరిక్తదోషములను నశింపచేయుదానవు. సిద్ధిమోక్షదాయినివి అగుము. ఓ శుభా సంపూర్ణదేశకాలములందు నీ నివాసము. ఈశరూపిణీ నీవు సర్వదా ఈ ప్రాసాదమున ఉండుము. ఈ విధముగ ప్రార్థించి ఆకాశరూపమగు గృహమును ధ్యానించి, దాని యందు మూడు తత్త్వముల న్యాసము చేయవలెను. యథా విధిగ ప్రాయశ్చిత్త హోమములు చేసి యజ్ఞ సమాప్తి చేయవలెను.

అగ్నిమహాపురాణమునందు శిలాన్యాస విధివర్ణన మను తొంబదినాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters