Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథద్విసప్తతితమోధ్యాయః

అథ స్నానవిశేషాదికథనమ్‌.

ఈశ్వర ఉవాచ :

వక్ష్యామి స్కన్ద నిత్యాదిం స్నానం పూజాం ప్రతిష్ఠయా | ఖత్వాసినా సముద్ధృత్య మృదమష్టాజ్గులాం తతః 1

సర్వాత్మనా సముద్ధృత్య పునస్తేనైవ పూజయేత్‌ | శిరసా పయసస్తీరే నిధాయాస్త్రేణ శోధయేత్‌. 2

తృణాని శిఖయోద్ధృత్య వర్మణా విభ##జేత్‌ త్రిధా | ఏకయా నాభిపాదాన్తం ప్రక్షాల్య పునరన్యయా. 3

అస్త్రాభిలబ్దయా లభ్య దీప్తయా సర్వవిగ్రహమ్‌ | నిరుధ్యాక్షాణి పాణిభ్యాం ప్రాణాన్సంయమ్య వారిణి. 4

నిమజ్యాసీత హృద్యస్త్రం స్మరన్కాలానలప్రభమ్‌ | మల స్నానం విధాయేత్థం సముత్థాయ జలాన్తరాత్‌. 5

అస్త్రసంధ్యాముపాస్యాథ విధిస్నానం సమాచరేత్‌ | సారస్వతాది తీర్థానామేక మఙ్గుశముద్రయా. 6

హృదాకృష్య తథాస్థాప్య తథాస్థాప్య పునః సంహారముద్రయా | శేషం మృద్భాగమాదాయ ప్రవిశ్యానాభి వారిణి. 7

వామపాణితలే కుర్యాద్భాగత్రయ ముదఙ్ముఖః | అఙ్గైర్దక్షిణమేకాద్య పూర్వమన్త్రేణ సప్తధా. 8

శివేన దశధా సౌమ్యం జపేద్భాగత్రయం క్రమాత్‌ | సర్వదిక్షు క్షిపేత్పూర్వం హుం ఫడన్తశరాత్మనా. 9

కుర్యాచ్ఛివేన సౌమ్యేన శివతీర్థం భుజక్రమాత్‌ | సర్వాఙ్గమఙ్గజప్తేన మూర్దాదచరణావధి. 10

పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! ఇపుడు నిత్యనైమిత్తికాది స్నానమును గూర్చియు, సంధ్యను గూర్చియు, ప్రతిష్ఠాసహితపూజను గూర్చియు చెప్పెదను, కత్తితో (లేదా 'ఫట్‌' అను అస్త్రమంత్రముతో) ఎనిమిది అంగుళముల లోతునుండి మట్టి త్రవ్వి, దానిని పూర్తిగా పైకి తీసికొని వచ్చి, ఆ మంత్రముతోడనే పూజించి, 'స్వాహా' మంత్రముతో ఆ మృత్తి కనుతటముపై ఉంచి, అస్త్రమంత్రముచే శోధింపవలెను. 'వషట్‌' మంత్రముచే దానినుండి తృణాదికమును తొలగించి 'హుమ్‌' అను మంత్రముచే దానిన మూడుభాగములు చేయవలెను. మొదటి భాగపు మట్టిని జలసహిత మైనదానిని నాభినుండి పాదములవరకు అవయవములకు పూయవలెను. దానిని కడిగివేసి, అస్త్రమంత్రముచే అభిమంత్రిత మగు రెండవభాగమునందలి, కాంతి గల మట్టితో మిగిలిన శరీరము నంతయు పూసి, రెండు చేతులతో చేవులు, ముక్కు మొదలగు ఇంద్రయరంధ్రములను మూసికొని, ఊపిరి బిగపట్టి, మనస్సులో కాలాగ్నితుల్య మగు తేజోమయాస్త్రమును ధ్యానించుచు నీటిలో మునకలు వేసి స్నానము చేయవలెను. దీనికి మలస్నాన మని పేరు. ఈ స్నానము చేసిన పిదప నీటినుండి బైటకు వచ్చి, సంధ్య చేసిన పిమ్మట విధిస్నానము చేయవలెను. హృదయమంత్రముచే (నమః) అంకుశముద్రతో సరస్వత్యాది తీర్థములలో ఏదో ఒక తీర్థమును ఆకర్షించి, సంహారముద్రతో, దానిని తన సమీపమున నున్న జలాశయములో స్థాపింపవలెను. పిమ్మట మూడవభాగము మట్టి తీసికొని నాభి వరకు జలములో మునిగి, ఉత్తరాభిముఖుడై, ఎడమచేతిలో దానిని మూడు భాగములు చేయవలెను. దక్షిణ భాగమునం దున్న మట్టిని అంగన్యాస మంత్రములచే ఒక మారు అభిమంత్రించి, తూర్పున నున్న మట్టిని ''అస్త్రాయ ఫట్‌'' అని ఏడు పర్యాయములు జపించి అభిమంత్రించి, ఉత్తరభాగము మట్టిని ''ఓం నమః శివాయ'' అను మంత్రము పది పర్యాయములు జపించి అభిమంత్రించవలెను. పిమ్మట ఈ మృత్తికలనుండి కొంచెము కొంచెము గ్రహించి ''అస్త్రాయ హుం ఫట్‌'' అనుచు అన్ని దిక్కులందును చిమ్మవలెను. పిమ్మట ''ఓం నమః శివాయ'' అను శివమంత్రమును, ''ఓం సోమాయస్వాహా'' అను సోమమంత్రమును జపించుచు, నీటిలో తన భుజములు త్రిప్పి, దానిని శివతీర్థస్వరూపముము చేయవలెను; అంగన్యాస మంత్రములను జపించుచు దానిని శిరస్సునుండి పాదముల వరకు, మొత్తము శరీరముపై పూసికొనవలెను.

దక్షిణన సమాలభ్య వఠన్నఙ్గచతుష్టయమ్‌ | పిధాయ ఖాని సర్వాణి సమ్ముఖీకరణన చ. 11

శివం స్మరన్నిమజ్జీత హరిం గఙ్గేతి వా స్మరన్‌ | వౌషడన్తషడఙ్గేన కే కుర్యాదభిషేచనమ్‌. 12

కుమ్భపాత్రేణ రక్షార్థం పూర్వాన్ని క్షిపేజ్జలమ్‌ | స్నాత్వా రాజోపచారేణ సుగన్ధామలకాదిభిః. 13

స్నాత్వా చోత్తీర్య తత్తీర్థం సంహారిణ్యోపసంహరేత్‌ | అథాతో విధిశుద్ధేన సంహితామన్త్రితేన చ. 14

నివృత్త్యాదివిశుద్ధేన భస్మనా స్నానమాచరేత్‌ | శిరస్తః పాదపర్యన్తం హుంఫడన్తశరాత్మనా. 15

తేన కృత్వామలస్నానం విధిస్నానం సమాచరేత్‌ | తే పతత్పురుషా ఘోరగుహ్యకాజాతసంచరైః. 16

క్రమేణోద్ధూనయేన్మూర్ధ్ని వక్తహృద్గుహ్యవిగ్రహాన్‌ | సన్ధ్యాత్రయే నిశీథే చ వర్షాపూర్వావసానయోః. 17

సుప్త్వా భుక్త్వా పయః పీత్వా కృత్వా చవశ్యకాదికమ్‌ | స్త్రియం నపుంసకం శూద్రం బిడాంశశమూషికమ్‌.

స్నానమాగ్నేయకం సృష్ట్వా శుచావుద్ధూలకం చరేత్‌ |

సూర్యాంశువర్షసంపర్కైః ప్రాఙ్ముఖేనోర్ధ్వబాహునా. 19

మాహేన్ద్రం స్నానమైశేన కార్యం సప్తపదావధి | గోసంఘమధ్యగః కుర్యాత్ఖురోద్ఘాతకరేణుభిః. 20

పావనం నవమన్త్రేణ స్నానం తద్వర్మణాథవా | సద్యోజాతాదిభిర్మన్త్రైరమ్భోభిరభిషేచనమ్‌. 21

మన్త్రస్నానం భ##వేదేవం వారుణాగ్నేయయోరపి | మనసా మూలమన్త్రేణ ప్రాణాయామపురస్సరమ్‌. 22

కుర్వీత మానసం స్నానం సర్వత్ర విహితం చ యత్‌ |

వైష్ణవాదౌ చ తన్మన్త్రైరేవం స్నానాది కారయేత్‌. 23

పిమ్మట అంగన్యాసమంత్రములను నాల్గింటిని చదువుచు కుడినుండి ప్రారంభించి ఎడమవైపువరకు హృదయము, శిరస్సు, శిఖ, రెండు భుజములు స్పృశించి, చెవులు, ముక్కు మొదలగు రంధ్రములు మూసికొని, సంముఖీకరణముద్రతో శివ - విష్ణు - గంగలను స్మరించుచు, నీటిలో మునగవలెను. షడంగన్యాస మంత్రములను ఉచ్చరించుచు (ఓం హృదయాయనమః, శిరసే స్వాహా, శిఖాయై వషట్‌, కవచాయ హుమ్‌, నేత్రత్రయాయ వౌషట్‌, అస్త్రాయ ఫట్‌) నీటిలో నిలచి, రెండు చేతులును కలిపి కుంభముద్రలో స్నానము చేయవలెను. స్నానానంతరము నీటినుండి బైటకు వచ్చి సంహారిణీముద్రతో తీర్థమును ఉపసంహరించవలెను. పిమ్మట యథావిధిగా పరిశుద్ధము, సంహితామంత్రములచే అభిమంత్రితము, నివృత్త్యాదులచే శోధితము అగు భస్మచే స్నానము చేయవలెను. ''ఓం అస్త్రాయ హుం ఫట్‌'' అను మంత్ర ముచ్చరించుచు శిరస్సునుండి పాదములవరకు భస్మముతో మలస్నానము చేసి, పిదప, యధావిధిగ శుద్ధస్నానము చేయవలెను. ఈశాన - తత్పురుష - అఘెర - గుహ్యక (దేదా వామదేవ) సద్యోజాత మంత్రములతో క్రమముగ శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యాంగము, శరీరమునందలి ఇతరావయవములు వీటిపై ఉంచవలెను. మూడు సంధ్యలందును, అర్ధరాత్రమునందును, వర్షాకాలమునకు పూర్వము, అనంతరము, నిద్రానంతరము, భోజనానంతరము, జలపానానంతరము. ఇతరమైన ఆవశ్యకకార్యములు చేసిన పిమ్మట నీవు, ఆగ్నేయస్నానము చేయవలెను. స్త్రీని, నపుంసకుని, శూద్రుని పిల్లిని, శవమును. ఎలుకను స్పృశించి నపుడు ఆగ్నేయస్నానము విధింపబడినది,చుళుకము నిండ పవిత్రజలము పోసికొని త్రాగవలెను. ఇదియే ఆగ్రేయస్నానము, సూర్యకిరణములు కనబడు చున్నపుడు ఆకాశమునుండి వర్షము కురియుచున్నచో, పూర్వాభిముఖుడై రెండు భుజములు పైకెత్తి ఈశాన మంత్రముచ్చరించుచు, ఏడు అడుగులు నడిచి, ఆ వర్షాజలమునందు స్నానముచేయవలెను. ఇది ''మాహేంద్ర స్నానము'', గోసముదాయము మధ్య నిలిచి, గోవుల డెక్కలచే పైకి ఎగురగొట్టబడిన ధూళిలో ఇష్టదేవతా మూలమంత్రము జపించుచు, లేదా కవచమంత్రము (హుం) జపించుచు చేయు స్నానము ''పావనస్నానము'' సద్యోజాతాది మంత్రముల నుచ్చరించు జలముతో చేయు స్నానము ''మంత్రస్నానము'', ఈ స్నానము వరుణదేవతా మంత్రములను, అగ్ని దేవతామంత్రములను ఉచ్చరించుచు గూడ చేయవచ్చును. మనస్సులో మూలమంత్రముచ్చరించుచు ప్రాణాయామము చేయుట ''మానసిక స్నానము''. ఈ స్నానము సర్వకర్మలయందును విధింపబడినది. విష్ణుదేవతాదులకు సంబంధించిన కార్యములలో ఆ యా దేవతల మంత్రములతో ఈ స్నానము చేయవలెను.

సన్ధ్యావిధిం ప్రవక్ష్యామి మన్త్రైర్భిన్నైః సమం గుహ | సంవీక్ష్య త్రిః పిబేదమ్బు బ్రహ్మతీర్థేన శఙ్కరైః . 24

స్వధా న్తైరాత్మతత్త్వాద్యైస్తతః ఖాని స్సృశేన్మృదా | శకలీకరణం కృత్వా ప్రాణాయామేన సంస్థితః. 25

త్రిః సమావర్తయేన్మ న్త్రీ మనసా శివసంహితామ్‌ |

ఆచమ్య న్యస్య సన్ధ్యాం చ బ్రాహ్మీం ప్రాతః స్మరేన్నరః. 26

హంసపద్మాసనాం రక్తాం చతుర్వక్త్రాం చతుర్భుజామ్‌ |

ప్రస్కన్దమాలినీం దక్షే వాదమే దణ్డం కమణ్డలమ్‌. 27

తార్యే పద్మాసనాం ధ్యాయేన్మధ్యాహ్నే వైష్ణవీం సితామ్‌ | శఙ్ఖచక్రధరాం వామే దక్షిణ సగదాభయామ్‌. 28

రౌద్రీం ధ్యాయేద్వృషాబ్జస్థాం త్రినేత్రాం శశిభూషితామ్‌ | త్రిశూలాక్షధరాందక్షే వామే సాభయశక్తికామ్‌. 29

సాక్షిణీం కర్మణాం సన్ధ్యామాత్మానం తత్ర్పభానుగమ్‌ | చతుర్ధీ జ్ఞానినః సన్ధ్యా నిశీథాదౌ విభావ్యతే. 30

హృద్భిన్దుబ్రహ్మరన్ద్రేషు అరూపా తు పరే స్థితా | శివబోధపరా యా తు సా సన్ధ్యా పరమోచ్యతే. 31

పైత్ర్యం మూలే ప్రదేశిన్యాః కనిష్ఠాయాః ప్రజాపతేః | బ్రామ్మ మఙ్గుష్ఠమూలస్థం తీర్థం దైవం కరాగ్రతః. 32

సవ్యపాణితలే వహ్నేస్తీర్థం సోమస్య వామతః | ఋషీణాం చ సమగ్రేషు అఙ్గులీపర్వసన్ధిషు. 33

తతః శివాత్మకైర్మన్త్రైః కృత్వా తీర్థం శివాత్మకమ్‌ | మార్జనం సంహితామన్త్రైస్తత్తోయేన సమాచరేత్‌. 34

వామపాణిపతత్తోయే యోజనం సవ్యపాణినా | ఉత్తమాఙ్గే క్రమాన్మన్త్రైర్మార్జనం సముదాహృతమ్‌. 35

కార్తికేయా! విభిన్న మంత్రములతో సంధ్యావిధిని గూర్చి చెప్పెదను బాగుగా చూచి జలమును, మంత్రపాఠపూర్వకముగ బ్రహ్మతీర్థము ద్వారా మూడు పర్మాయములు గ్రహించవలెను. ఆచమన సమయమున ఆత్మతత్త్వ - విద్యాతత్త్వ - శివతత్త్వములకు 'నమః' సహిత 'స్వాహా' శబ్దమును చేర్చి మంత్రము చదువవలెను. అనగా ఇచ్చట ఆత్మాతత్త్వాయ నమః స్వాహాః, ఓం విద్యాతత్త్వాయ నమః స్వాహా, ఓం శివతత్త్వాయ నమః స్వాహా'' అను మంత్రములతో ఆచమనము చేయవలెను. పిదప ముఖము, నాసిక, నేత్రములు, కర్ణములుస్పృశింపవలెను. ప్రాణాయామముచేసి, సఫలీకరణక్రియను సంపన్నము చేసి స్థిరముగ కూర్చుండవలెను. పిమ్మట మంత్రసాధకుడు శివసంహితను మనస్సులోనే ఆవృత్తిచేసి, ఆచమనము, అంగ న్యాసములచేసి ప్రాతఃకాలమునందు బ్రాహ్మీ సంధ్యను ఈ విధముగ ధ్యానించవలెను. ప్రాతఃకాలమున సంధ్యాదేవి బ్రాహ్మీ రూపమున ప్రత్యక్షమగును. హంసారూఢ యై కమలాసనముపై కూర్చుండి యుండును. శరీరకాంతి ఎర్రగా నుండును. ఆమెకు నాలుగు ముఖములు, నాలుగు చేతులు ఉండును. కుడి చేతులలో కమలము, స్ఫటికాక్షమాల, ఎడమ చేతులలో దండకమండలములు ప్రకాశించుచుండును. మధ్యాహ్న కాలమున సంధ్యను వైష్ణవీశక్తిరూపమున ధ్యానించవలెను. ఆమె గరుత్మంతుని వీపు మీద పరచిన కమలాసనముపై కూర్చుండును. శరీరకాంతి తెల్లగా నుండును. వామహస్తముచే శంఖచక్రములను, దక్షిణహస్తములచే గదా - అభయముద్రలను ధరించి యుండును. సాయంకాలమున సంధ్యను రుద్రశక్తిరూపమున ధ్యానింపవలెను. త్రినేత్రయై శిరస్సుపై అర్ధచంద్రముకుటముతో విరాజిల్లు చున్న ఆమె వృషభపీఠముపై కమలాసనమున కూర్చుండి యుండును. కుడిచేతులలో త్రిశూల - రుద్రాక్షమాలలతోను, ఎడమచేతులలో అభయముద్రా - శక్తులతోను ప్రకాశించుచుండును. ఈ సంధ్యలు కర్మసాక్షులు. సాధకుడు ఈ శక్తుల కాంతులు తనను అనుసరించి యున్నట్లు భావన చేయవలెను. ఇవి కాక మరొక సంధ్య నాల్గవది కూడ ఉన్నది. అది కేవలము జ్ఞానికి మాత్రమే. అర్ధ రాత్రి ప్రారంభమున, దాని బోధాత్మక సాక్షాత్కారము కలుగును. ఈ మూడు సంధ్యలును క్రమముగ, హృదయ - బిందు - బ్రహ్మరంధ్రములలో నుండును. నాల్గవ సంధ్యకు రూపముండదు. ఆ సంధ్య పరమశివునిలో ప్రకాశించుచుండును. ఈమె శివునికంటె అతీత మగుటచే 'పరాసంధ్య' అని పేరు. తర్జనీ మూలము పితృతీర్థము. కనిష్ఠికామూలము ప్రజాపతి తీర్థము అంగుష్ఠ మూలము బ్రహ్మతీర్థము. హస్తాగ్రభాగము దేవతా తీర్థము. కుడి అరచేయి అగ్నితీర్థము. ఎడమ అరచెయ్యి సోమతీర్థము. అంగుళుల అన్ని పర్వములును, సంధులును ఋషితీర్థము. సంధ్యాధ్యానానంతరము, శివమంత్రములచే జలాశయమును శివస్వరూపము చేసి, ''ఆపోహిస్ఠా'' ఇత్యాది సంహితామంత్రములతో, ఆ జలముతో మార్జనము చేసికొనవలెను. ఎడమ చేతిలో తీర్థజలము పోసికొని కుడి చేతితో మంత్రపఠన పూర్వకముగ శిరస్సుపై ఆ నీరు చల్లుకొనుటకు మార్జన మని పేరు.

నీత్వా తదుపనాసాగ్రం దక్షపాణిపుటస్థితమ్‌ | బోధరూపం సితం తోయం వామమాకృష్య స్తమ్భయేత్‌.

తత్పాపం కజ్జలాభాసం పిఙ్గయా రిచ్య ముష్టినా | క్షిపేద్వజ్రశిలాయాం తు తద్భవేదఘమర్షణమ్‌. 37

స్వాహా న్తశివమన్త్రేణ కుశపుష్పాక్షతాన్వితమ్‌ | శివాయార్ఘ్యాఞ్జలిం దత్వా గాయత్రీం శక్తి తోజపేత్‌. 38

తర్పణం సంప్రవక్ష్యామి దేవతీర్థేన మన్త్రకాత్‌ |

తర్పయేద్వై శివాయేతి స్వాహాన్యాన్స్వాహయా యుతాన్‌. 39

హ్రాం హ్రీం శిరసే హ్రూం శిఖాయై హ్రైం కవచాయ | అస్త్రాయాష్టౌ దేవగణాన్హృదా దిత్యేభ్య ఏవ చ. 40

హ్రాం వసుభ్యోథ రుద్రేభ్యో విశ్వేభ్యశ్చైవ మరుద్భ్యః |

భృగుభ్యో హ్రామఙ్గిరోభ్య ఋషీన్‌ కణ్ఠోపవీత్యథ. 41

అత్రయేథవసిష్ఠాయ నమశ్చాథ పులస్తయ | క్రతవే భారద్వాజాయ విశ్వామిత్రాయ వై నమః. 42

ప్రచేతసే మనుష్యాంశ్చ సనకాయ వషట్‌ తథా | హాం పనన్దాయ వషట్‌ సనాతనాయ వై వషట్‌. 43

సనత్కుమారాయ వషట్‌ కపిలాయ తథా వషట్‌ | పఞ్చశిఖాయ ద్యుభ##వే సంలగ్నకరమూలతః. 44

సర్వేభ్యో భూతేభ్యో వషడ్భూతాన్ధేవపితౄనథ | దక్షస్కన్ధోపవీతీ చ కుశమూలాగ్రతస్తిలైః 45

కవ్యవాహానలాయాథ సోమాయ చ యామాయ చ |

అర్యవ్ణుె చాగ్నిసోమాయ బర్హిషద్భ్యః న్వధాయుతాన్‌. 46

ఆజ్యపాయ చ సోమాయ విశేషసురవత్పితౄన్‌ | ఓం హ్రామీశనాయ పిత్రే స్వదా దద్యాత్పితామహే. 47

శాన్తప్రపితామహాయ తథా ప్రేతపితౄంస్తథా | పితృభ్యః పితామహేభ్యః స్వధాథ ప్రపితామహే. 48

వృద్ధప్రపితామహేభ్యో మాతృభ్యశ్చ స్వధా తథా |

హ్రాం మాతామహేభ్యః స్వధా హ్రాం ప్రమాతామహేభ్యశ్చ. 49

వృద్ధప్రమాతామహేభ్యః సర్వేభ్యః పితృభ్యస్తథా | సర్వేభ్యః స్వధా జ్ఞాతిభ్యః సర్వాచార్యేభ్య ఏవ చ. 50

దిశాం దిక్ర్పతిసిద్ధానాం మాతౄణాం గ్రహరక్షసామ్‌ |

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే స్నానతర్పణాదివిధిర్నామ ద్విసప్తతి తమోధ్యాయః.

పిమ్మట అఘమర్షణము చేయవలెను. కుడిచేతిలో బోధరూప శివమయ మగు ఉదకము పోసికొని, ముక్కు దగ్గరకు తీసికొనిపోయి, (వామ) ఇడానాడి ద్వారా శ్వాస పీల్చి లోపల నిలిపి, లోపలినుండి నల్లని పాప పురుషుని (దక్షిణ) పింగళానాడి ద్వారా బైటకు తీసికొని వచ్చి ఆ జలమునందు స్థాపించవలెను. ఆ పాపపురుషునితో కూడిన జలమును, ఒక వజ్రమయ శిలను భావన చేసి, దానిపై పడవేసి చంపవలెను. దీనితో అఘమర్షణము సంపన్న మగును. పిమ్మట కుశ - పుష్ప - అక్ష తలతో కూడిన జలముతో అర్ఘ్యాంజలి పట్టి దానిని ''ఓం నమః శివాయ స్వాహా'' అను మంత్రముతో శివునకు సమర్పించి యథాశక్తిగ గాయత్రీ మంత్రము జపింపవలెను.

ఇపుడు తర్పణవిధిని చెప్పెదను. దేవతలకు వారి నామ మంత్రముల నుచ్చరించుచు, దేవతీర్థము ద్వారా తర్పణము చేయవలెను. ''ఓం హూం శివాయ స్వాహా'' అని చెప్పి శివునకు తర్పణమీయవలెను. ఇతర దేవతలకు కూడ ఈ విధముగనే వారి వారి పేర్లకు ''స్వాహా'' చేర్చి తర్పణము లీయవలెను. ''ఓం హాం హృదయాయ నమః, ఓం హీం శిరసే స్వాహా; ఓం హూం శిఖాయై వషట్‌; ఓం హై కవచాయ హుం; ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్‌; ఓం హః అస్త్రాయ ఫట్‌'' అను వాక్యము లుచ్చరించుచు క్రమముగ హృదయ - శిరః - శిఖా - కవచ - నేత్ర - అస్త్రన్యాసములు చేయవలెను. ఎనిమిది దేవగణములకు వారి పేర్ల చివర నమః అను పదము చేర్చి తర్పణము చేయవలెను. ''ఓం హాం ఆదిత్యేభ్యో నమః; ఓం హాం వసుభ్యో నమః; ఓం హాం రుద్రేభ్యో నమః; ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యో నమః; ఓం హాం మరుద్భ్యో నమః; ఓం మాం భృగుభ్యో నమః, ఓం హాం అంగిరోభ్యో నమః'' - ఈ విధముగ చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కంఠమునందు మాల వలె ధరించి (ఉపవతి) ఋషితర్పణము చేయవలెను. ''ఓం హాం అత్రయే నమః; ఓం హాం విశ్వామిత్రాయ నమః; ఓం హాం ప్రచేతసే నమః; ఓం హాం మరీచయే నమః'' అను మంత్రములు పఠించుచు అత్ర్యాది ఋషులకు ఋషితీర్థము ద్వారా తర్పణములు చేయవలెను. పిమ్మట ఈ క్రింది వాక్యములు చదువుచు, సనకాది మునులకు (రెండేసి అంజలులు ఇచ్చుచు) తర్పణము చేయవలెను - ''ఓం షాం సనకాయ వషట్‌; ఓం హాం సనన్దనాయ వషట్‌; ఓం హాం సనాతనాయ వషట్‌; ఓం హాం సనత్కుమారాయ వషట్‌; ఓం హాం కపిలాయ వషట్‌; ఓం హాం పఞ్చశిఖాయ వషట్‌; ఓం హాం ఋభ##వే వషట్‌'' అను వాక్యములు చదువుచు దగ్గరగా ఉంచిన చేతుల కనిష్ఠికామూల భాగములనుండి జలాంజలి ఈయవలెను. ''ఓం హాం సర్వేభ్యో భూతేభ్యో వషట్‌'' అను మంత్రముచే వషడ్రూపభూతగణములకు తర్పణము చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కుడిభుజముపై ఉండునట్లులు వేసికొని ప్రాచీనావీతి రెండుగా మణచిన కుశ మూలాగ్రముల నుండి తిలసహిత జలమును మూడేసి పర్యాయములు దివ్యపితృదేవతకలు అర్పించి తర్పణము చేయవలెను. ''ఓం హాం కవ్యవాహనాయ స్వధా; ఓం హాం అనలాయ స్వధా; ఓం హాం సోమాయ స్వధా; ఓం హాం యమాయ స్వధా; ఓం హాం అర్యవ్ణుె స్వధా; ఓం హాం అగ్నిష్వాత్తేభ్యః స్వధా; ఓం హాం బర్హిషద్భ్యః స్వధా; ఓం హాం ఆజ్యపేభ్యః స్వధా'' ఇత్యాదిమంత్రము లుచ్చరించుచు విశిష్ట దేవతలకు వలెనే దివ్య పితృదేవతలకును తర్పణము లీయవలెను.

''ఓం హాం ఈశానాయ పిత్రే స్వధా'' అని చెప్పి తండ్రికిని, ఓం హాం పితామహాయ స్వధా'' అని చెప్పి పితామహునకును, ''ఓం హాం శాన్తప్రపితామహాయ స్వధా'' అని చెప్పి ప్రపితామహునకును తర్పణము లీయవలెను. సమస్త ప్రేతపితృదేవతలకును ఈ విధముగనే తర్పణము చేయవలెను. ఎట్లనగా - ''ఓం హాం పితృభ్యః స్వధా; ఓం హాం పితామహేభ్యః స్వధా; ఓం హాం ప్రపితామహేభ్యః స్వధా; ఓం హాం పృద్ధప్రపితామహేభ్యః స్వధా; ఓం హాం మాతృభ్యః స్వధా; ఓం హాం మాతామహేభ్యః స్వధా; ఓం హాం ప్రమాతామహేభ్యః స్వధా; ఓం హాం వృద్ధమాతామహేభ్యః స్వధా; ఓం హాం సర్వేభ్యః పితృభ్యః స్వధా; ఓం హాం సర్వేభ్యః జ్ఞాతిభ్యః స్వధా, ఓం హాం సర్వాచార్యేభ్యః స్వధా; ఓం హాం దిగ్భ్యః స్వధాః ఓం హాం దిక్పతిభ్యః స్వధా; ఓం హాం సిద్ధేభ్యః స్వధాః ఓం హాం మాతృభ్యః స్వధా; ఓం హాం గ్రహేభ్యః స్వధా; ఓం మాం రక్షోభ్యః స్వధా'' - ఈ వాక్యముల నుచ్చరించుచు క్రమముగ పితృ-పితామహ-ప్రపితామహ-వృద్ధ ప్రపితామహ - మాతృ - సర్వజ్ఞాతి - సర్వాచార్య - సర్వదిక్‌ - దిక్పతి - సిద్ధ - మాతృకా - గ్రహ - రాక్షసులకు తర్పణము లీయవలెను.

అగ్ని మహాపురాణమునందు స్నానతర్పణాదివిధి యను డెబ్బదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters