Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకస ప్తతితమో7ధ్యాయః

అథ గణశపూజావిధిః

ఈశ్వర ఉవాచ :

గణపూజాం ప్రవక్ష్యామి నిర్విఘ్నామఖిలార్థదామ్‌ | గణాయ స్వాహా హృదయ మేకదంష్ట్రాయ వై శిరః .1

గజకర్ణినే చ శిఖా గజవక్త్రాయ వర్మ చ | మహోదరాయ స్వదన్తహస్తాయాక్షితథాస్త్రకమ్‌. 2

గణో గురుః పాదుకా చ శక్తానన్తౌ చ ధర్మకః | ముఖ్యాస్థిమణ్డలం చాధ శ్చోర్ధ్వ చ్ఛదనమర్చయేత్‌. 3

పద్మకర్ణిబీజం చ జ్వలినీం నన్దయార్చయేత్‌ | సూర్యేశా కామరూపా చ ఉదయా కామవర్తినీ. 4

సత్యా చ విఘ్ననాశా చ అసనం గన్ధమృత్తికా | యం శోషా రం చ దహనం ప్లవో లం వం తథామృతమ్‌.

లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి | తన్నో దన్తిః ప్రచోదయాత్‌.

గణపతిర్గణాధిపో గణశో గణనాయకః | గణక్రీడో వక్రతుణ్డ ఏకదంష్ట్రో మహోదరః . 6

గజవక్త్రోలమ్బకుక్షిర్వికటో విఘ్ననాశనః | ధూమ్రవర్ణోమహేన్ద్రాద్యాః పూజ్యాగణపతేః స్మృతాః. 7

ఇత్యాది మహాపురాణ అగ్నేయే వినాయకపూజాకథనం నామైకసప్తతితమోధ్యాయః.

ఈశ్వరుడు పలికెను; విఘ్నవినాశమునకై గణపతిపూజను గూర్చి చెప్పెదను. ఇది సకలాభీష్టములను ఇచ్చును. ''గణంజయాయస్వాహా హృదయాయనమః; ఏకదంష్ట్రాయ హుం ఫట్‌ శిరసే నమః, అచల కర్ణినే నమో నమః శిఖాయై నమః, గజవక్త్రాయ నమో, నమః కవచాయ నమః, మహోదరాయ చణ్డాయ నమః నేత్రాభ్యాం నమః, సుదణ్డహస్తాయనమః అస్త్రాయనమః'' అని అంగన్యాసములు చేసికొనవలెను. ముఖ్యకమలమండలముపైదళములందు, క్రిందిదళములందును గణ - గురు - గురుపాదుకా - శక్తి - అనంత - ధర్మములను, పూజించి కమలకర్ణికమీద బీజమును పూజింపవలెను. తీవ్రా, జ్వాలినీ, నందా! భోగదా, కామరూపిణీ, ఉగ్రా-తేజోవతీ, సత్యా, విఘ్ననాశినీ అను తొమ్మిది పీఠశక్తులను పూజించవలెను. పిమ్మట చందన చూర్ణను అసనముగ సమర్పించవలెను. 'యం' అనునది శోషకవాయుబీజము, 'రం'అగ్ని బీజము. 'లం' పృథివీబీజము, 'వం' అమృతబీజము, '' ఓం లమ్బోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి, తన్నో దన్తిః ప్రచోదయాత్‌'' అనునది గణశగాయత్రీ మంత్రము, గణపతి-గణాధిప-గణశ-గణనాయక-గణక్రీడ-వక్రతుండ-ఏకదంష్ట్ర-మహోదర-గజవక్త్ర - లంబోదర-వికట-విఘ్ననాశన-ధూమ్రవర్ణులను, మహేంద్ర దిక్పాలకులను గణపతిపూజంగముగ పూజించవలెను.

శ్రీ అగ్ని మహాపురాణమునందు గణపతిపూజావిధికథన మను డెబ్బదియొకటవ అధ్యాము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters