Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్విషష్టితమో7ధ్యాయః

అథ లక్ష్మీప్రతిష్ఠావిధిః

శ్రీ భగవానువాచ:

సముదాయేన దేవాదేః ప్రతిష్ఠాం ప్రవదామి తే | లక్ష్మ్యాః ప్రతిష్ఠాం ప్రథమం తథా దేవీగణస్య చ. 1

పూర్వవత్సకలం కర్యాన్మణ్డలస్నాపనాదికమ్‌ | భద్రపీఠే శ్రియం న్యస్య స్థాపయేదష్ట వై ఘటాన్‌. 2

ఘృతేనాభ్యజ్య మూలేన స్నాపయేత్పఞ్చగవ్యకైః | హిరణ్యవర్ణాం హరిణీం నేత్రే చోన్మీలయేచ్ఛ్రియాః. 3

తాం మా ఆవహ ఇత్యేవం ప్రదద్యాన్మధురత్రయమ్‌ | అశ్వపూర్వేతి పూర్వేణం తాం కుమ్భేనాభిషేచయేత్‌. 4

కాంసోస్మితేతి యామేన పశ్చిమేనాభిషేచయేత్‌ | చన్ద్రాం ప్రభాసాముచ్చార్యాదిత్యవర్ణేతి చోత్తరాత్‌. 5

ఉపైతు మేతి చాగ్నే యాత్‌క్షు త్పి పాసేతి నైరృతాత్‌ | గన్ధద్వారేతి వాయవ్యాం మనసః కామమాకూతిమ్‌ . 6

ఈశానకలశేనైవ శిరః సౌవర్ణకర్దమాత్‌ | ఏకాశీతిఘటైః స్నానం మన్త్రేణాపః సృజన్‌ క్షితిమ్‌. 7

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు సామూహికరూపమున దేవతాదిప్రతిష్ఠను గూర్చి చెప్పెదను. మొదట లక్ష్మీస్థాపన గూర్చియు, పిదప ఇతరదేవతాస్థాపన గూర్చియు చెప్పెదను. మండప-అభిషేకాదు లన్నియు వెనుకటి అధ్యాయములలో చెప్పినట్లే చేయవలెను. పిమ్మట భద్రపీఠమును లక్ష్మిని స్థాపించి ఎనిమిది దిక్కలందును ఎనిమిది కలశలు స్థాపించవెలను. దేవీప్రతిమకు అజ్యము పూసి మూలమంత్రము చదువుచు, పంచగవ్యములతో స్నానము చేయించవలెను. "హిరణ్యవర్ణాం హరిణీమ్‌" ఇత్యాదిమంత్రము చదువుచు నేత్రములను తెరువవలెను, "తాం మ ఆవహ" అను మంత్రము చదివి దేవికి తేనె, నెయ్యి, పంచదార సమర్పింపవలెను. 'అశ్వపూర్వామ్‌' ఇత్యాదిమంత్రముతో తూర్పున నున్న కలశతో స్నానము చేయించవలెను. "కాంసోస్మితామ్‌" ఇత్యాదిమంత్రముతో దక్షిణకలశజలముతోను, "చన్ద్రాంప్రభాసామ్‌" ఇత్యాదిమంత్రముతో పశ్చిమకలశజలముతోను, "అదిత్యవర్ణే" ఇత్యాదిమంత్రముతో ఉత్తరకలశ జలముతోను 'ఉపైతు మాం" ఇత్యాదిమంత్రముతో అగ్నేయకలశజలముతోను, "క్షుత్పిపాసామలామ్‌" ఇత్యాదిమంత్రముతో నైరృతికలశ జలముతోను, "గన్ధిద్వారాం" ఇత్యాదిమంత్రముతో వాయవ్యకోణ కలశజలముతోను "మనసః కామాకూతిమ్‌" ఇత్యాది మంత్రముతో ఈశాన్యకలశజముతోను, లక్ష్మీదేవికి అభిషేకము చేయవలెను. "కర్దమేన ప్రజాభూతా" అను మంత్రము చదువుచు సువర్ణకలశజలముతో దేవి శిరస్సుపై అభిషేకము చేయవెలను. "అపః సృజస్తు" ఇత్యాదిమంత్రముతో ఎనుబది యొక్క కలశలతో శ్రీదేవి ప్రతిమకు స్నానము చేయించవలెను.

అర్ధ్రాం పుష్కరిణీం గన్దైరార్ధ్రామిత్యాది పుష్పకైః | తాం మ ఆవహమన్త్రేణ య అనన్దఋచాఖిలమ్‌. 8

శ్రయన్తీయే శయ్యాయాం శ్రీసూక్తేన చ సన్నిధిమ్‌ | లక్ష్మీబీజేన చిచ్ఛక్తిం విన్యస్యాభ్యర్చయేత్పునః. 9

శ్రీసూక్తేన మణ్డపే7థ కుణ్డష్వబ్జాని హోమయేత్‌ | కరవీరాణి వా హుత్వా సహస్రం శతమేవ వా. 10

గృహోపకరణాన్తాది శ్రీసూక్తేనైవ చార్పయేత్‌ | తతః ప్రాసాదసంస్కారం సర్వం కృత్వా తు పూర్వవత్‌. 11

మన్త్రేణ పిణ్డికాం కృత్వా ప్రతిష్ఠానం తతః శ్రియః |

శ్రీసూక్తేన రచ సాన్నిధ్యం పూర్వవత్ప్రత్యృచం జపేత్‌. 12

చిచ్ఛక్తిం బోధయిత్వాతు మూలాత్సాన్నిధ్యకం చరేత్‌.

భూస్వర్ణవస్త్రగోన్నాది గురవే బ్రహ్మణ7ర్పయేత్‌. 13

ఏవం దేవ్యో7ఖిలాః స్థాప్య రాజ్యస్వర్గాదిభాగ్భవేత్‌. 14

ఇత్యాదిమహాపురాణ అగ్నేయే లక్ష్మీస్థాపనం నామ ద్విషష్టితమో7ధ్యాయః.

పిమ్మట "అర్ద్రాం పుష్కరిణీమ్‌" ఇద్యాదిమంత్రముతో గంధ మర్పించి, "అర్ద్రాం యః కరిణీమ్‌ ఇత్యాదిమంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. పిమ్మట "తాం మ ఆవహా జాతవేదః" ఇత్యాదిమంత్రముతోను, "ఆనన్దః" ఇత్యాదిశ్లోకములతోను మిగిలన ఉపచారములన్నియు సమర్పింపవలెను. 'శ్రాయన్తీ' ఇత్యాదిమంత్రము చదువుచు శయ్యపై పరుండపెట్టవలెను. శ్రీసూక్తము పఠించుచు సంనిధీకరణము చేసి, లక్ష్మీబీజముతో (శ్రీం) చిచ్ఛక్తి విన్యాసము చేసి మరల పూజింపవలెను. పిదప శ్రీసూక్తముతో మండపముపైనున్న కుండములలో కమలముతో గాని, కరవీరపుష్పములతో గాని వెయ్యి లేదా వంద హోమములు చేయవలెను. గృహోపకరణాది సమస్తపూజాసామగ్రి మొదటి నుండియు శ్రీసూక్తమంత్రములతోడనే సమర్పింపవలెను. వెనుకటి వలె ప్రాసాదమునకు సంస్కారము చేసి, లక్ష్మికి పిండికానిర్మాణము చేయవలెను. పిమ్మట పిండికపై లక్ష్మిని ప్రతిష్ఠచేసి, శ్రీసూక్తముతో సంనిధీకరణము చేయుచు వెనుకటి వలె శ్రీసూక్తమునందలి ఒక్కొక్క ఋక్కును జపించవలెను. మూలమంత్రముచే చిచ్ఛక్తిని జాగృత మొనర్చి మరల సంనిధీకరణము చేయవలెను. పిమ్మట ఆచార్యునకు, బ్రహ్మకు, ఇతరఋత్విక్కులకు, బ్రహ్మణులకు భూ-సువర్ణ-వస్త్ర-గోదానాదులు చేయవలెను. ఈ విధముగ అందరి దేవులను స్థాపించినవాడు-రాజ్య-స్వర్గాదులను పొందును.

శ్రీ అగ్నిపురాణమునందు లక్ష్మీస్థాపన మను ఆరువదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters