Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ స ప్తపఞ్చాశత్తమోధ్యాయః

అథ కుమ్భాధి వాసవిధి:

శ్రీ భగవానువాచ:

భూమేః పరిగ్రహం కుర్యాత్‌క్షిపేద్వ్రీహింశ్చ సర్షపాన్‌ | నారసింహేన రక్షోఘ్నాన్ప్రోక్షయేత్పఞ్చ గవ్యతః. 1

భూమిం ఘటేతు సంపూజ్య సరత్నే సాంగకం హరిమ్‌ | అస్త్రమన్త్రేణకరకం తత్ర చాష్టశతం యజేత్‌. 2

అచ్ఛిన్నధారయా సిఞ్చన్‌ వ్రీహీన్‌ సంస్కృత్యధారయేత్‌ | ప్రదక్షిణం పరిభ్రామ్య కలశం వికిరోపరి. 3

సవస్త్రే కలశేభూయః పూజయేదచ్యుతం శ్రియమ్‌ | యోగేయోగేతిమన్త్రేన న్యసేచ్ఛయ్యాంతు మణ్డలే. 4

కుశోపరి తూలికాచ శయ్యయాం దిగ్విదిక్షుచ | విద్యాధి పాన్‌ యజేద్విష్ణుం మధువాతంత్రి విక్రమమ్‌. 5

వామనం దిక్షువాయ్వాదౌ శ్రీధరం చహృషీపకమ్‌ | పద్మనాభం దామోదర మైశాన్యాం స్నానమణ్డపే. 6

అభ్యర్చ్య పశ్చాదైశాన్యాం చతుష్కమ్భే సవేదికం | స్నానమణ్డ పకేసర్వ ద్రావ్యాణ్యానీయ నిక్షిపేత్‌. 7

స్నానకుమ్భేషు కుమ్భాంస్తాంశ్చ తుర్దిక్ష్వుధి వాసయేత్‌ | కలశాః స్థాపనీయాస్తు అభిషేకార్థ మాదరాత్‌. 8

వటోదుమ్బర కాశ్వత్థాంశ్చమ్పకా శోక శ్రీద్రుమాన్‌ | పలాశార్జున ప్లక్షాంస్తు కదంబబకులామ్రకాన్‌. 9

పల్లవాంస్తు సమానీయ పూర్వకుమ్భే వినిక్షిపేత్‌ | పద్మకంరోచనాం దూర్వం దర్భ పిఞ్జాలమేవచ. 10

జాతీపుష్పం కున్దపుష్పం చన్ధనం రక్తచన్దనమ్‌ | సిద్దార్థం తగరం చైవ తణ్డులందక్షిణ న్యసేత్‌. 11

సువర్ణం రజతంచైవ కూలద్వయమృదం తథా | నద్యాః సముద్రగామిన్యా విశేషాజ్ఞాహ్నవీ మృదమ్‌. 12

గోమయం చయవాఞ్చా తీంస్తిలాంశ్త్చెవా పరేన్యసేత్‌ |

హయగ్రీవుడు చెప్పెను: దేవతాప్రతిష్ఠా పూజల కొరకై గ్రహంచిన భూమిపై నారసింహా మంత్రము చదువుచు రాక్షసులను తొలిగించు అక్షతలు, ఆవాలు, పంచగవ్యములు చెల్లవెలను. రత్నయుక్తమగు కలశ##పై అంగదేవతా సమేతుడగు శ్రీహరిని పూజింపవలెను. అస్త్ర మంత్రముతో నూట ఎనిమిది పాత్రలను పూజింపవలెను. అవిచ్ఛిన్న ధారతో వేదిని తడిపి, ధాన్యము చల్లవలెను. కలశను ప్రదక్షిణాక్రమమున త్రిప్పి చిమ్మిన అన్నముపై ఉంచవలెను. కలశకు వస్త్రము చుట్టి దానిపై లక్ష్మీ నారాయణులను పూజింపవలెను. "యోగే యోగే" ఇత్యాది మంత్రము పఠించుచు మండలమున శయ్యను స్ధాపింపవలెను. (స్నాన మండపమున కుశలపపై శయ్యదానిపై పరువు పరిచి దిక్కుల యందును. విదిక్కుల యందును విద్యాధిపతులను) (విష్ణువు యొక్క విభిన్న విగ్రహములను) పూజింపవలెను. పూర్వాది దిక్కులందు క్రమముగ విష్ణు-మధు సూదన-త్రివిక్రమ-వామనులను, ఆగ్నేయాది విదిక్కులందు క్రమముగ శ్రీధర-హృషీకేశ-పద్మనాభ-దామోదరులను పూజింపవలెను. దామోదరుని ఈశాన్యమున పూజింపవలెను. పిమ్మట స్నాన మండపమున, ఈశాన్యమునందున్న వేదిపై ఉన్న నాలుగు కలశలలో స్నానమునకు ఉపయోగించు అన్ని ద్రవ్యములను ఉంచవలెను. ఆకలశమును నాలుగు దిక్కులందును ఉంచవలెను. భగవదభిషేకము నమిత్తమైన ఏర్పరచిన ఆ కలశలను చాల గౌరవభావముతో ఉంచవలెను. తూర్పున నున్నకలశ##పైవట-ఉదుంబర-అశ్వత్థ-చంపక-అశోక-బిల్వ-పలాశ-అర్జున-ప్లక్ష-కదంబ- వకుల-చూతపల్లవములను ఉంచవలెను. దక్షిణ దిక్కుందున్న కలశలో కమల-రోచనా-దూర్వాదర్భ- జాతీపుష్ప-కుంద-చందన-రక్త చందన-సిద్దార్థ-తగర- తండులములను ఉంచవలెను. పశ్చిమ దిక్కునందున్న కలశలో బంగారము, వెండి, సముద్రములోనికి ప్రవహించునది యొక్క రెండు తటములందిలి మట్టి, విశేషముగ, గంగామృత్తు, గోమయము, యవలు, వరిబియ్యము, తిలలు ఉంచవలెను.

వివ్ణుపర్ణీం శ్యామలతాం భృంగరాజం శతావరీమ్‌. 13

సహదేవీంవచాం సైంహీం బలంవ్యఘ్రీం సలక్ష్మణామ్‌| ఐశాన్యామపరే కుమ్భే మంగ లాన్వినివేశ##యేత్‌.

వల్మీకకమృత్తికాం సప్తస్థానోత్థా మపరే న్యసేత్‌ | జాహ్నవీవాలుకాం తోయం విన్యసే దపరే ఘటే. 15

వరాహవృష నాగేన్ద్ర విషాణోద్ధృతమృత్తికామ్‌ | మృత్తికాం పద్మమూలస్య కుశస్య త్పరే న్యసేత్‌. 16

తీర్థపర్వ తమృద్భిశ్చ యుక్త మప్యపరే న్యసేత్‌ | నాగకేసర పుష్పంచ కాశ్మీరమపరే న్యసేత్‌. 17

చన్ధనాగు రుకర్పూరైః పుష్పంచైవాపరే న్యసేత్‌ | వైదూర్యం వద్రుమం ముక్తాం స్ఫటికం వజ్రయేవచ. 18

ఉత్తర దిక్కునందున్న కలశలో విష్ణువర్ణి, శాలపర్ణి, భృంగరాజము, శతావరి, సహదేవి, వచ, సైంహి, బల, వ్యాఘ్రి, లక్ష్మణ అను ఓషధులనుంచవలెను. ఈశాన్యము నందున్న మరొక కలశలో మాంగలిక వస్తువుల నుంచవలెను. అగ్నికోణము నందును రెండువ కలశలో ఏడు స్థాలనముల నుండి గ్రహింపబడిన మట్టి, ఉంచవలెను. నైరృతి దిక్కునందున్న కలశలో గంగ ఇసుకను, గంగా జలమును ఉంచవలెను. వాయవ్య కోణము నందునన్న మరొక కలశము నందు సూకర-వృషభ-గజముల దంతముల చేతను. కొమ్ముల చేతను పెకలించన మట్టిని, పద్మము మొదట్లో నున్న మట్టిని, ఇతర కలశము నందు దర్భల మొదట్లో నున్న మట్టిని ఉంచవలెను. మరొక కలశములనందు నాగకేసర పుష్ప కేసరముల నుంచవలెను. మరొక కలశము నందు చందనము, అగురు, కర్పూరము కలిసిన ఉదకము నింపి, వైదూర్య-విద్రుము-ముక్తా-స్ఫటిక-వజ్రములనుంచవలెను.

ఏతాన్యేకత్ర నిక్షిప్య స్థాపయేద్దేవ సత్తమమ్‌ | నదీనద తడాగానాం సలిలైరపరే న్యసేత్‌.19

ఏకాశీతిపదే చాన్యన్ముణ్డపే కలశాన్న్యచసేత్‌ | గన్దోదకాద్యైః సంపూర్ణఞ్చ్రీ సూక్తేనాభి మన్త్రయేత్‌. 20

యవాన్సిద్దార్థ కంగన్ధం కుశాగ్రం చాక్ష తాంస్తథా | తిలాన్‌ఫలం తథా పుష్పమర్ఘ్యార్థం పూర్వతో న్యసేత్‌. 21

పద్మం శ్యామలతాం దూర్వాం విష్ణుపర్ణీం కుశాంస్తథా | పాద్యార్థం దక్షిణభాగే మధుపర్కంతు పశ్చిమే. 22

కక్కోలకం లవంగంచ తథా జాతీఫలం శుభమ్‌ | ఉత్తరేహ్యా చమనీయ మగ్నౌ దూర్వాక్షతాన్వి తమ్‌. 23

పాత్రం నీరాజనార్ధంచ తథోద్వర్తన మానిలే | గన్ధ పుష్పాన్వితం పాత్రమైశాన్యాం పాత్రకే న్యసేత్‌. 24

సురామాంసీం చామలకం సహదేవీం నిశాదికమ్‌ | పుష్టిదీపాన్న్యసే దష్టౌ న్యసేన్ని రాజనాయచ. 25

శంఖం చక్రంచ శ్రీవత్సం కులిసంపఙ్క జాదికమ్‌ | హేమాదిపాత్రే కృత్వాతు నానావర్ణాది పుష్పకమ్‌. 26

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కుమ్భాది వాసో నామ సప్తపఞ్చాశత్తమోధ్యాయః.

వీటనన్నింటిని ఒక కలశలో నుంచి, దానిపై ఇష్టదేవతను స్థాపింపవలెను. ఇతర కలశయందు, నదులు కొండ కాలువలు, చెరువులు-వీటి నీటితో కూడిన జలము నుంచవలెన. ఎనుబది యొక్క పదముల వాస్తుమండపము నందు ఇతర కలశలను స్థాపింపవలెను. ఈ కలశలను గందోదకాదులతో నింపవలెను. వాటినన్నిటివి శ్రీ సూక్తముతో అభిమంత్రించవలెను. ఒక పాత్రలో, అర్ఘ్యము కొరకై, ఆవాలు, గంధము, కుశాగ్రములు, అక్షతములు, ఫలములు పుష్పములు ఉంచి తూర్పున ఉంచవలెను. కమలములను, శ్యామాలతను, దూర్వాదలములను, విష్ణుక్రాంతము, కుశములను పాద్యముకొరకై దక్షిణమునుంచవలెను. మధుపర్కము పశ్చిమము నందుంచవలెను. కక్కోల-లవంగ-జాతీఫలములను అచమనీయర్థమై ఉత్తరము నందుంచవలెను. దూర్వాక్షతలతో కూడిన ఒక పాత్రను నీరాజనమునకై అగ్నేయము నందుంచవలెను. ఉద్వర్తనపాత్రను వాయవ్యమునందును, ఈశాన్యమున గంధపిష్టపాత్రను ఉంచవలెను. కలశలో సురామాంసి. ఉసిరికాయ, సహదేవి, పసుపు మొదలైనవి వేయవలెను. నీరాజనము కొరకై ఆరువది ఎనిమిది దీపములుంచవలెను. శంఖము, చక్రము శ్రీవత్సము, వజ్రము, కమలములు మొదలైన వివిధ వర్ణముల గల పుష్పము సువార్ణాది పాత్రలలో సమకూర్చుకొనవలెను.

అగ్ని మహాపురాణము నందు కుంభాధివాసమున ఎనుబది ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters