Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకపఞ్చాశత్తమోధ్యాయః

అథ సూర్యాది ప్రతిమాలక్షణమ్‌.

శ్రీ భగవానువాచ:

ససప్తాశ్వేసైక చక్రే రథేసూర్యో ద్వివద్మధృక్‌ | మషీభాజన లేఖన్యౌ బిభ్రద్దణ్డీతు దక్షిణ. 1

వామేతు పిఙ్గలోద్వారి దణ్డభృత్సరవేర్గణః | వాలవ్యజనధారిణ్యౌ పార్శ్వే రాఙ్ఞీచనిష్ప్రభా. 2

అథవాశ్వ సమారూఢః కార్యఏకస్తు భాస్కరః | వరదార్వబ్జినః సరేవ దిక్పాలాః శస్త్రకరాః క్రమాత్‌. 3

హయాగ్రీవుడు చెప్పెను: సూర్యుడు ఏడు గుఱ్ఱములు కట్టిన, ఒకే చక్రముగల రథముపై రెండు పద్మములను హస్తములలో ధరించి యుండును. ఆతని దక్షిణ పార్శ్వమున దండి సిరా బుడ్డి లేఖిని ధరించి యుండును. వామపార్శ్వమున పింగళుడు దండమును ధరించి ద్వారము నందుండును. వీరిరువురను సూర్యుని పార్షదులు. పార్శ్వములందు ఇద్దరు స్త్రీలు వాలవ్యజనమును ధరించుయందురు. రాణియైన (భార్యయైన) ఛాయాదేవి ప్రక్క నుండును. లేదా అశ్వము పైన కూర్చున్న ఒక్క సూర్యుని ప్రతిమ మాత్రమే కన్పించవలెను. సమస్త దిక్పాలకులును వరద ముద్రతో, రెండేసి పద్మములు ధరించి సాయుధులై దిక్కుల వరుసలో నుందురు.

ముద్గరః శూల చక్రాబ్జభృతోగ్న్యాది విదిక్‌స్థితాః | సూర్యార్యమాది రక్షోన్తాశ్చతుర్హస్తా ద్విషడ్దలే. 4

పండ్రెండు దళముల కమలమును నిర్మింపవలెను. సూర్యుడు, అర్యమ మొదలగు ద్వాదశ సూర్యులను ఆ ద్వాదశ దళములపై స్థాపింపవలెను. ఈ స్థాపనము పశ్చిమవాయవ్య దిక్కలతో ప్రారంభించి నైరృతిదిక్కు వరకును ఉన్న దళములపై చేయవలెను ఈ ఆదిత్య గణమునకు నాలుగేసి చేతులు చేతులలో ముద్గర - శూల - చక్ర - కమలములు ఉండును. అగ్నేయము నుండి నైరృతి వరకు, నైరృతి నుండి వాయవ్యము వరకు, వాయవ్యము నుండి ఈశాన్యము వరకు, ఈశాన్యము నుండి అగ్నేయము వరకు ఉన్న దళములపై స్థాపింపవలెను.

వరుణః సూర్యనామాచ సహస్రాం శుస్తథాపరః | ధాతా తపన సంజ్ఞశ్చ సవితాథగభస్తికః. 5

రవిశ్త్చెవాథ పర్జన్య స్త్వష్టా మిత్రో7థ విష్ణుకః | మేషాదిరాశి సంస్థాశ్చ మార్గాది కార్తికాన్తకాః. 6

కృష్ణో రక్తో మనాగ్రక్తః పీతః పాణ్డురకః సితః | కపిలః పీతవర్ణశ్చ శుకాభో ధవల స్తథా. 7

ధూమ్రోనీలః క్రమాద్వర్ణాః శక్తయః కేసరాగ్రగాః ఇడా సుషుమ్నావిశ్వార్చి రిన్తు సంజ్ఞా ప్రమర్దినీ. 8

ప్రహర్షిణీ మహాకాలీ కపిలాచ ప్రబోధినీ | నీలామ్బర ఘనాన్త స్థా అమృతాఖ్యాచ శక్తయః. 9

వరుణాదేశ్చ తద్వర్ణాః కేసరాగ్రేషు విన్యసేత్‌ | తేజశ్చణ్డో మహావక్త్రో ద్విభుజః పద్మఖడ్గభృత్‌. 10

వరుణుడు, సూర్యుడు, సహస్రాంశువు, ధాత, తపనుడు, సవిత, గభస్తికుడు, రవి, పర్జన్యుడు, త్వష్ట, మిత్రుడు, విష్ణువు అనువారు ద్వాదశాదిత్యులు. వీరు మేషాది ద్వాదశరాసులలో నుందురు. వరుణాది ఆదిత్యులు క్రమముగా మార్గశీర్షము మొదలు (వృశ్చికము మొదలు) కార్తికము వరకు నున్న మాసములో (తుల వరకు నున్న రాశులలో) ఉందురు. వీరి శరీరకాంతి క్రమముగ నలుపు, ఎరుపు, కొంచెము ఎరుపు, పసుపు పాండువు, తెలుపు, కపిలము, పీతము, ఆకుపచ్చ, ధవళము, ధూమ్రము, నీలము రంగులలో నుండును. వీరి శక్తులు ద్వాదశదలకమల కేసరాగ్రములందు ఉండును. వారి పేర్లు-ఇడ, సుషుమ్న, విశ్వార్చి, ఇందు, ప్రమర్దిని, ప్రహర్షిణి, మహాకాలి, కపిల, ప్రబోధిని, నీలాంబర, వనాంతస్థ (ఘనాంతస్థ) అమృతాఖ్య. ఈశక్తుల శరీర కాంతి గూడ వరుణాదుల శరీర కాంతి వలెనే ఉండును. ఈ శక్తులను కేసరాగ్ర భాగములపై స్థాపింపవలెను. సూర్యుని తేజస్సు ప్రచండముగా, విస్త్రతముగా ఉండును. ఈతనికి రెండు భుజములుండును. కమలమును, ఖడ్గమును ధరించి యుండును.

కుణ్ణికాజపమాలీన్దుః కుజః శక్త్యక్షమాలికః | బుధశ్చాపాక్షపాణిః స్యాజ్జీవః కుణ్డ్యక్షమాలికః. 11

శుక్రః కుణ్డ్యక్షమాలీ స్యాత్కిఙ్కణీసూత్రవాఞ్చనిః | అర్ధ చన్ద్రధరో%ాహుః కేతుః ఖడ్గీచ దీపభృత్‌. 12

అనన్త స్తక్షకః కర్కః పద్మో మహోబ్జః శఙ్ఖకః | కులికః సూత్రిణః సర్వే ఫణవక్త్రామహప్రభాః. 13

ఇన్ద్రోవజ్రీ గజారూఢశ్చాగగో7గ్నిశ్చశక్తిమాన్‌ | యమోదణ్డీ చ మహిషే నైరృతః ఖడ్గవాన్‌కరే. 14

మకరేవరుణః పాశీ వాయుర్ద్వజధరోమృగే | గదీకుబేరో మేషస్థ ఈశానశ్చ జటీవృథషే. 15

ద్విబాహవోలోకపాలా విశ్వకర్మాక్షసూత్రభృత్‌ | హనుమాన్వజ్రహస్తః స్యాత్పద్భ్యం సంపీడితాసురః. 16

వీణాహస్తాః కిన్నరాః స్యుర్మాలా విద్యాధరాశ్చఖే | దుర్బలాఙ్గాః పిశాచాః స్యుర్వేతాలా వికృతాననాః. 17

క్షేత్రాపాలః శూలవన్తః ప్రేతా షుహోదరాః కృశాః |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సూర్యాదిప్రతిమాలక్షణంనామైక పఞ్చాశత్తమోధ్యాయః.

చంద్రుడు చేతులలో కుండిక-జపమాలలను ధరించును. కుజునకు చేతులలో శక్తి, అక్షమాలయు, బుధునకు ధనస్సు అక్షమాలయు, బృహస్పతికి కుండిక, అక్షమాల శక్రునకు కుండిక, అక్షమాల ఉండును. శని మువ్వలు కట్టిన సూత్రమును ధరించును. లరాహువు అర్ధ చంద్రుని ధరించును. కేతువు చేతులో ఖడ్గము దీపము ఉండును. అనంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖుడు, కులికుడు మొదలగు ప్రముఖ నాగ గణములన్నియు సూత్రమును ధరించును. వీరందరును పడగల ఆకారముల గల ముఖములతో, గొప్ప తేజఃపుంజముతో ప్రకాశించు చుందురు, ఇంద్రుడు వజ్రము ధరించి గజముపై ఎక్కియుండును. అగ్ని శక్తి హస్తుడై మేక మీద కూర్చుంéడును. యుముడు దండము ధరించి మహిషాధిరూఢుడై ఉండును. ఖడ్గధారియైన నిరృతికి వాహనము మనిషి. వరుణుడు పాశహస్తుడా మకరముపై ఉండును. వజ్రధారియైన వాయుదేవునకు లేడి వాహనము. కుబేరుడు గద ధరించి గొఱ్ఱపై ఉండును. జటధారియైన ఈశానునకు వాహనము వృషభము.

లోకపాలులందరును ద్విభుజులు. విశ్వకర్మ చేతిలో అక్షసూత్రముండును. హనుమంతుని హస్తమునందు వజ్రయుధముండును. రెండు పాదములతో ఒక ఆసురుని అణగ ద్రొక్కి నిలబడును. కింనరులు వీణాధారులు, విద్యా ధరులు మాలాదారులై ఆకాశమున విహరించు చుందురు. పిశాచముల శరీరములు అస్థిపంజరమాత్ర శేషములుగ నుండును. వేతాళముల ముఖములు భయంకరముగ నుండును. క్షేత్రపాలులు శూలములు ధరించుయుందురు. ప్రేతముల ఉదరములు పెద్దవిగ నుండును. శరీరములు కృశించి యుండును.

అగ్ని మహాపురాణమునందు సూర్యాది ప్రతిమాలక్షణమను ఏబది ఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters