Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రిచత్వారింశో7ధ్యాయః

అథ ప్రాసాద దేవతాస్థాపన భూతశాన్త్యాదికథనమ్‌.

భగవానువాచ :

ప్రాసాద దేవతాః స్థాప్యా వక్ష్యే బ్రహ్మన్‌ శృణుష్వమే | పఞ్చాయతనమధ్యేతు వాసుదేవం నివేశ##యేత్‌. 1

వామనం నృహరిం చాశ్వశీర్ష తద్వచ్చసూకరమ్‌ | ఆగ్నేయే నైరృతే చైవ వాయవ్యే చేశగోచరే. 2

అథనారాయణం మధ్యే హ్యాగ్నే య్యామమ్భికాంన్యసేత్‌ |

నైరృత్యాం భాస్కరం వా¸° బ్రహ్మాణం లిఙ్గమీశ##కే. 3

అథవా రుద్రరూపం తు అథవానవధామసు | వాసుదేవం న్యసేన్మధ్యే పూర్వాదౌ రామరామకాన్‌. 4

ఇన్ద్రాదీన్‌లోకపాలాంశ్చ అథవానవధామసు | పఞ్చాయతనకం కుర్యాన్మధ్యేతు పురుషోత్తమమ్‌. 5

లక్ష్మీవైశ్రవణ పూర్వే దక్షేమాతృగణం న్యసేత్‌ | స్కన్దం గణశమీశానం సూర్యాదీన్‌ పశ్చిమేగ్రహాన్‌. 6

ఉత్తరే దశమత్స్యాదీనాగ్నేయ్యాం చణ్డికాం తథా | నైరృత్యా మమ్బికాం స్థాప్య వాయవ్యేతు సరస్వతీమ్‌ 7

పద్మామైశే వాసుదేవం మధ్యే నారాయణం చవా | త్రయోదశాల యేమధ్యే విశ్వరూపం న్యసేద్ధరిమ్‌. 8

పూర్వాది కేశవాదీన్వా అన్యధామ స్వయం హరిః | మృన్మయీ దారఘటితా లోహజారత్నజాతథా 6

శైలజాగన్ధజాచైవ కౌసుమీసప్తధా స్మృతా | కౌసుమీగన్ధజాతచైవ మృన్మయీప్రతిమా తథా. 10

తత్కాలపూజితాశ్త్చెతాః సర్వాకామఫలప్రదాః |

హయగ్రీవుడు చెప్పెను:- బ్రహ్మదేవా! దేవాలయములో స్థాపింపదగిన దేవతలను గూర్చి చెప్పెదను; వినుము; పంచాయ తన దేవాలయమునందు, మధ్యనున్న ప్రధానాలయమున వాసుదేవుని స్థాపింపవలెను. మిగిలిన నాలుగు ఆలయములలో ఆగ్నేయయాలయమునందు వామనుని, నైరృతాలయమునందు నరసింహుని, వాయవ్యాలయమునందు హయగ్రీవుని, ఈశాన్యాలయమునందు వరాహమూర్తిని స్థాపింపవలెను లేదా మధ్యయందు నారాయణుని స్థాపించినచో ఆగ్నేయమున దుర్గాదేవిని, నైరృతియందు సూర్యుని, వాయవ్యమున బ్రహ్మను, ఈశాన్యమున లింగరూపుడుగా శివుని స్థాపింపవలెను లేదా ఈశాన్యమున రుద్రమూర్తిని స్థాపింపవలెను. లేదా ఎనిమిది దిక్కలందును ఎనిమిది ఆలయములను, మధ్యయందు ఒక ఆలయమును నిర్మించి. వాటిలో మధ్యనున్న ఆలయమునందు వాసుదేవుని స్థాపించి, తూర్పు మొదలగు దిక్కలందు పరశురాముడు మొదలగు ముఖ్యమైన తొమ్మిది అవతారములను, ఇంద్రాదిలోకపాలులను స్థాపింపవలెను. లేదా మొత్తము తొమ్మిది స్థానములందు ఐదు ప్రధానాంయములను కట్టించి మధ్యాలయమునందు పురుషోత్తముని స్థాపింపవలెను.

తూర్పున లక్ష్మిని, కుబేరుని, దక్షిణమున మాతృకాగణ - కుమారస్వామి, గణపతి, శివులను పశ్చిమమున సూర్యాది నవగ్రహములను, ఉత్తరమున మత్స్యాది దశావతారములను స్థాపింపవలెను. అట్లే ఆగ్నేయుమున చండీదేవిని, నైరృతిదిక్కున అంబికను, వాయన్యమున సరస్వతిని, ఈశాన్యమున లక్ష్మిని స్థాపింపవలెను మధ్యభాగమునందు వాసుదేవుని లేదా నారాయణుని స్థాపింపవలెను. లేదా పదమూడు గదులుగల దేవాలయమున మధ్యభాగమునందు విశ్వరూపుడగు మహా విష్ణువును స్థాపింపవలెను.

లేదా తూర్పు మొదలగు దిక్కులతో కేశవాది ద్వాదశ విగ్రహములను స్థాపించి మిగిలన గృహమునందు సాక్షాత్తు శ్రీహరిని స్థాపింపవలెను. భగవత్ర్పతిమను మట్టి, కఱ్ఱ, లోహము, రత్నములు, ఱాయి, చందనము, పుష్పము అను ఏడువస్తువులతో నిర్మింపబడి ఏడువిధములుగ నుండును. పుష్పములతోమట్టితో, చందనముతో నిర్మించిన ప్రతిమను వెంటనే పూజింపవలెను. చాల సమయము ఉంచకూడదు. పూజింపబడిన ఈ ప్రతిమలు సమస్తకామములను శీఘ్రముగ ఫలింపజేయును.

అథ శైలమయీం వక్షే శిలాయత్ర చ గృహ్యతే. 11

పర్వతానామభావేచ గృహ్ణీ యాద్బూగతాం శిలమ్‌ | పాణ్ణురాహ్యరుణాపీతా కృష్ణా శస్తాతు వర్ణినామ్‌.12

నయదాలభ్యతే సమ్యగ్వర్ణినాం వర్ణతః శిలా | వర్ణాద్యాపాదనం తత్రజుహుయాత్సింహ విద్యయా. 13

శిలాయాం శుక్లరేఖగ్రా కృష్ణాగ్య్రా సింహహోమతః | కాంస్యఘణ్టానినాదా స్యాత్పుంలిఙ్గా విస్పులిఙ్గికా. 14

తన్మన్ధలక్షణాస్త్రీ స్యాద్రూపాభావాన్న పుంసకా | దృశ్యతే మణ్ణలం యస్యాం సగర్బాంతాం వివర్జయేత్‌. 15

ఇప్పుడు శిలానిర్మిత ప్రతిమను గూర్చి చెప్పెదను. పర్వతమునుండి తీసికొనివచ్చిన ఱాయితో చేసిన ప్రతిమ ఉత్తమమైనది. పర్వతములు లేని పక్షమున భూమిలో లభించిన ఱాయి ఉపయోగింపవచ్చును. బ్రాహ్మణాదివర్ణముల వారికి వరుసగ తెల్లని, ఎఱ్ఱని, పచ్చని, నల్లని ఱాళ్ళు ఉత్తమమైనవి. తగిన వర్ణముగల శిల లభించినచో ఆలోపమును తీర్చుచటకై నరసింహ మంత్రముతో హోమము చేయవలెను. శిలపై తెల్లని రేఖఉన్నచో అది చాల ఉత్తమమైనది. నల్లరేఖ ఉన్నచో నరసింహ హోమము చేసిన పిమ్మట అది ఉత్తమముగాను కంచుఘంటవంటి ధ్వని వచ్చుచు, భేదించినపుడు అగ్నికణములు వచ్చు శిల ''పులింగము'' ఆ చిహ్నహములు తక్కువగా ఉన్న శిల ''స్త్రీ లింగము'' ఈ రెండు చిహ్నములను తేనిది ''నపుంసకలింగము'' ఏదైన మండలము వంటి గుర్తు ఉన్న శిల 'సగర్భ'; దానిని పరిత్యజింపవెలను.

ప్రతిమార్థం ధనందత్త్వా వనయాగం సమాచరేత్‌ | తత్రఖాత్వోపలిప్యాథ మణ్ణపే తుహరిం యజేత్‌. 16

బలిందత్త్వా కర్మశస్త్రం టఙ్కాదిక మథార్చయేత్‌ | హుత్వాథ శాలితోయేన అస్త్రేనప్రోక్షయేచ్ఛిలామ్‌. 17

రక్షాం కృత్వా నృసింహేన మూలమన్త్రేణ పూజయేత్‌ | హుత్వా పూర్ణాహుతిందద్యాత్తతోభూతబలిం గురుః . 18

అత్రయే సంస్థితాః సత్త్వాయాతుధానాశ్చగుహ్యకాః | సిద్ధాదయోవాయేచాన్యే తాన్సంపూజ్యక్షమాపయేత్‌. 19

విష్ణుబిమ్బార్థ మస్మాకం యాత్త్రెషా కేశవాజ్ఞయా | విష్ణ్వర్థం యద్బవేత్కార్యం యుష్మాకమపి తద్భవేత్‌. 20

అనేన బలిదానేన ప్రీతాభవత సర్వథా | క్షేమేణ గర్భితాన్యత్ర ముక్త్యాస్థానమిదం తర్వాత్‌. 21

ఏవం ప్రబోధితా ముక్త్వాయాన్తి తృప్తా యథాసుఖమ్‌ | శిల్పిభిశ్చ చరుంప్రాశ్య స్వప్నమన్త్రం జపేన్నిశి. 22

ఓం నమః సకలలోకాయ విష్ణవే ప్రభవిష్ణవే | విశ్వాయవిశ్వరూపాయ స్వప్నాధిపతయే నమః . 23

ఆచక్ష్వదేవదేవేశ ప్రసుప్తో7స్మితవాన్తికమ్‌ | స్వప్నే సర్వాణి కార్యాణి హృదిస్థానితు యానిమే. 24

ఓం ఓం హ్రూం ఫట్‌చ స్వాహా |

శుభే స్వప్నం సర్వంంహ్యశుభే సింహహోమతః | ప్రాతరర్ఘ్యం శిలాయాంతు దత్త్వాస్త్రేణాస్త్రకంయజేత్‌. 25

కుద్దాల టఙ్క శస్త్రాద్యం మధ్వాజ్యాక్తముఖం చరేత్‌ |

ఆత్మానం చిస్తయేద్విష్ణుం శిల్పినం విశ్వకర్మకమ్‌. 26

శస్త్రం విష్ణ్వాత్మకం దద్యాన్ముకపృష్ఠాది దర్సయేత్‌ | జితేన్ద్రియష్టఙ్కహస్తః శిల్పీతు చతురస్రకామ్‌. 27

శిలాంకృత్వా పిణ్ణికార్థం కిఞ్చిన్న్యూనాంతు కల్పయేత్‌ | రథేస్థాప్య సమానీయసవస్త్రాం కారువేశ్మని . 28

పూజయిత్వాథ ఘటయేత్‌ ప్రతిమాంసతు కర్మకృత్‌|

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ ప్రాసాదదేవతాస్థాపనశాన్త్యాది వర్ణనంనాతు త్రిచత్వారింశో7ధ్యాయః.

ప్రతిమలను నిర్మించుటకై అడవిలోనికి వెళ్లి వనయాగము ప్రారంభిపవలెను. అచట ఒక కుండము త్రవ్వి, దానిని అలికి, మండపముపై విష్ణుమూర్తిని పూజింపవలెను. విష్ణువునకు బలి సమర్పించి ప్రతిమా నిర్మాణకర్మ యందు ప్రయోగించు టంకము మొదలగు శస్త్రములను పూజించవలెను. హోమము చేసిన పిమ్మ బియ్యపు నీళ్ళతో అస్త్ర మంత్రమును (అస్త్రాయఫట్‌) ఉచ్చరించుచు ఆ శిలను తడుపవలెను. నరసింహమంత్రముతో దానికి రక్షచేసి మూలమంత్రముతో (ఓం నమోనారాయణాయ) పూజచేయవలెను. పూర్ణాహుతి హోమము చేసిన పిమ్మట ఆచార్యుడు భూతములకు బలి సమర్పింపవలెను. అచట కనబడకుండ నివసించు జంతువులు, రాక్షసులు, యక్షులు సిద్ధులు మొదలగు వారికందరకు పూజలు చేసి ''కేశవుని ఆజ్ఞచే మేము ప్రతిమల కొరకై ఈయాత్రపై వచ్చితిమి. శ్రీమహావిష్ణుని కార్యము మీ కార్యముకూడ అగును అందుచే మేమిచ్చిన ఈ బలిచే తృప్తులై మీరు వెంటనే ఈ స్థానమును విడచి, కుశల పూర్వకముగ మరొక చోటికి వెళ్ళుడు'' అని చెప్పుచు క్షమా ప్రార్థన చేయవలెను. ఈ విధముగ ప్రార్థింపబడిన వారందరును ప్రసన్నులై సుఖముగ ఆ స్థానమును విడిచి మరొక ప్రదేశమునకు వెళ్ళి పోవుదారు. పిమ్మట శిల్పులతో కలసి యజ్ఞ చరువును భక్షించి రాత్రి నిద్రించు సమయమున స్వప్న మంత్రమును ఈ విధముగ జపించవలెను. ''సమస్తప్రాణులకును వాసస్థానమైన వాడును, సర్వవ్యాపకుడును సర్వస్రష్టయు, విశ్వరూపుడును, స్వప్నాధివతియు అగు శ్రీహరికి నమస్కారము దేవా! దేవేశ్వరా! నేను నీసమీపమున నిద్రించుచున్నాను నా మనస్సులో ఏకార్యములను సంకల్పించితినో వాటి విషయమున నాకంతయు తెలుపుము'' ఇట్లు ప్రార్థించి ''ఓం ఓం హ్రూంఫట్‌ విష్ణవే స్వాహా'' అను మంత్రమును జపించి నిద్రించగా శుభస్వప్నము వచ్చినచో శుభము కలుగును. చెడు స్వప్నము వచ్చినచో నరసింహమంత్రముచే హోమము చేయగా శుభ##మే కలుగును. ఉదయమున లేచి, అస్త్ర మంత్రముతో శిలపై అర్ఘ్యమీయవలెను. పిమ్మట అస్త్రపూజ చేయవలెను. గునపము, టంకము మొదలగు అస్త్రముల ముఖమును అతనికి చూపవలెను.

శిల్పి ఇంద్రియ నిగ్రహవంతుడై, టంకము చేతగైకొని ఆ శిలను చతురస్రముగా నుండునట్లు చేయవలెను. పిమ్మట పిండిన చేయుటకై దానిని కొంచెము చిన్నది చేయవలెను. పిమ్మట ఆ శిలకు వస్త్రము చుట్టి, రథముపై ఉంచి, శిల్పా శాలకు తీసికొని వచ్చి, మరల దానికి పూజ చేయవలెను. పిమ్మట ప్రతిమ నిర్మింపవలెను.

అగ్ని మహాపురాణమునందు ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనమను నలుబదిమూడవ అధ్యాయము సమాస్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters