Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకచత్వారింశో7ధ్యాయః.

అథశిలావిన్యాసవిధిః

భగవానువాచ :

పాదప్రతిష్ఠాం వక్ష్యామి శిలావిన్యాస లక్ష్మణమ్‌ | అగ్రతో మణ్డపః కార్యః కుణ్డానాంతు చతుష్టయమ్‌. 1

కుమ్బాన్యాసేష్టకాన్యాసౌ దారఃస్తమ్భోచ్ఛ్రయం శుభమ్‌| పాదోనం పూర యేత్ఖాతం

తత్రవాస్తు యజేత్సమే.

ఇష్టకాశ్చసుపక్వాఃస్యుఃద్వాదశాఙ్గుల సంమితాః | సువిస్తారత్రి భాగేణ వైపుల్యేన సమన్వితాః. 3

కరప్రమాణాశ్రేష్ఠాస్యాచ్ఛిలాప్యథ శిలామయే | నవకుమ్భాంస్తామ్రమయన్థ్సాపయేదిష్టగాకాఘాటాన్‌. 4

అద్భిః పఞ్చకషాయేణ సర్వౌషధిజలేనచ | గన్దతోయేన చ తథా కుమ్భైః

స్తోయసుపూరితైః. 5

హిరణ్యవ్రీహిసంయుక్తైర్గన్ధచన్దచర్చితైః | ఆపోహిష్ఠేతి తిసృభిః శన్నోదేవేతి చాప్యథ.

6

తరత్సమన్దీరితి చ పావమానీభిరేవచ | ఉదుత్తమం వరణమితి కయానశ్చ తథైవచ. 7

వరుణస్యేతి మన్త్రేణ హంసం శుచిషదిత్యపి | శ్రీసూక్తే నాపిచ తథా శిలాం సంస్థాప్య సంయుతాః. 8

శయ్యాయాం మణ్డపే ప్రాచ్యాం మణలే హరిమర్చయేత్‌ | జుహుయాజ్జ్నయిత్వాగ్నిం సమిధోద్వా దశీస్తతః.

హయగ్రీవుడు చెప్పెను: శిలాన్యాసరూపమగు పాదప్రతిష్ఠను గూర్చి చెప్పెదను; వినుము. మొదట మండపము నిర్మించి పిదపదానిపై నాలుగు కుండములు నిర్మింపవలెను. ఆ కుండములు క్రమముగ కుంభన్యాస-ఇష్టకాన్యాస-ద్వార-స్తంభములకు మంగళకరమైన ఆశ్రయములుగా నుండును, కుండములోని నాలుగువంతులలో మూడవంతుల భాగము కంకరమొదలైనవాటితో నింపి, సమముచేసి, దానిపై వాస్తుదేవతాపూజ చేయవలెను. పునాదిలో వేయు ఇటుకలు బాగుగా కాలినదై యుండవలెను. వాటి పొడవు పండ్రెండు అంగుళములు, దళసరి పొడవులు మూడవవంతు, అనగా నాలుగు అంగుళములుండవలెను. ఱాళ్ళతో దేవాలయమును నిర్మింపదలచిన పక్షమున ఇటుకలకు బదులు ఱాళ్లనీ పునాదిలో వేయవలెను. ఒక్కొక్క ఱాయి హస్తము పొడవుండవలెను. తొమ్మిది రాగికలశములుగాని, మట్టికలశములుగాని స్థాపింపవలెను. ఆ కలశములను జలముతోను, సర్వౌషధుతోను, చందనముకలిపిన జలముతోను నింపవలెను. వాటిలో బంగారము, ధాన్యములు మొదంగునవి కూడవేసి, గంధాదులతో పూజించి, ఆ జలపూర్ణకలశలతో ''అపోహిష్ఠామ'' ఇత్యాది బుక్‌త్రయమును, ''శంనోదేవి రభిష్టయ'' ఇత్యాదిమంత్రమును, ''తరత్సమన్దీః'' ఇత్యాది మంత్రమును, పావమానఋక్కులను, ఉదుత్తమం వరుణ,'' కయానః'' ''వరుణస్యోత్తమ్భనమసి'' ఇత్యాదిమంత్రములను పఠించుచు, ''హంసః శుచిషత్‌'' ఇత్యాదిమంత్రమును, శ్రీసూక్తమునకూడ పఠించుచు, అధికసంఖ్యాకములగు శిలలను, ఇటుకలను తడుపవలెను. వాటిని పునాదిలో స్థాపించి, మండపలములోపల, ఒక శయ్యపై, పూర్వమండలమునందు శ్రీ మహావిష్ణువును పూజింపవలెను. అరణిని మథించి పుట్టించిన అగ్నియందు ద్వాదశాక్షరమంత్రమును పఠించుచు, సమిధలను హోమము చేయవలెను.

అఘారావాజ్యభాగౌతు ప్రణవేనైన కారయేత్‌ | అష్టాహుతీస్తథాష్టాన్తైరాజ్యం వ్యాహృతిభిః క్రమాత్‌ .10

లోకేశానామగ్నయే వై సోమాయావగ్రహేషు చ | పురోషోత్తమాయేతి చ వ్యాహృతీర్జు హుయాత్తతః 11

ప్రాయశ్చిత్తం తతః పూర్ణాం మూర్తిమాంసఘృతాం స్తిలాన్‌ |

వేదాద్యైర్ద్వాదశాన్తేషు కుమ్భేషుచపృథక్‌పృథక్‌. 12

ప్రాఙ్ముఖస్తుగురుః కుర్యాదష్ట దిక్షువిలిప్యచ | మధ్యేచైకాం శిలాం కుమ్బాన్‌న్యసేదేతాన్‌ సురాన్‌ క్రమాత్‌.

పద్మంచైవ మహాపద్మం మకరం కచ్ఛపం తథా | కుముదం చ తథా నన్దం పద్మశ##జ్ఖే చ పద్మినీమ్‌ 14

కుమ్భాన్నచాలయే, త్తేషున్యసేదష్టేష్టకాః క్రమాత్‌ | ఈశానాన్తాశ్చ పూర్వాదావిష్టకాః ప్రథమంన్యసేత్‌. 15

శక్తయో విమలాద్యాస్తు ఇష్టకానాంతు దేవతాః | న్యసనీయా యథాయోగం మధ్యేన స్యాత్వనుగ్రహా. 16

అవ్యఙ్గే చాక్షతేపూర్ణే మునీ రఙ్గిరసః సుతే | ఇష్టకే త్వంప్రయచ్ఛేష్టం ప్రతిష్ఠాం కారయామ్యహమ్‌. 17

మన్త్రేణానేన విన్యస్య ఇష్టకాదేశికోత్తమః | గర్భాధానం తతఃకుర్యాన్మధ్యాస్థానే సమాహితః 18

కుమ్భోపరిష్టాద్దేవేశం పద్మినీంన్యస్యదేవతామ్‌ | మృత్తికాశ్చైవపుష్పాణి ధాతవోరత్నమేవచ. 19

లోహానిదిక్‌పతేరస్త్రం యజేద్వై గర్భభాజనే | ద్వాదశాఙ్గలివిస్తారే చతురఙ్గు

లకోచ్ఛ్రయే. 20

ఆ ఘారము, ఆజ్యభాగము అను ఆహుతులను ప్రణవముతో చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ఎనిమిది అహుతులిచ్చి ''ఓం భూః స్వాహా'' ''ఓం భువః స్వాహా'' ''ఓం సువః స్వాహా'' అని మూడు వ్యాహృతులతో క్రమముగాలోకేశ్వరుడైన అగ్నికిని, సోమగ్రహమునకును, శ్రీ మహావిష్ణువునకును ఆహుతులర్పింపివలెను. పిమ్మట ప్రాయశ్చిత్తహోమముచేసి, ప్రణవయుక్తమగు ద్వాదశాక్షరమంత్రముతో మినుములు, ఘృతము, తిలలు కలిపి పూర్ణాహుతి చేయవలెను. పిమ్మట ఆచార్యుడు పూర్వాభిముఖుడై, ఎనిమిది దిక్కులందు స్థాపించిన కలశములపై వేరువేరుగ పద్మాదిదేవతలను స్థాపించి పూజింపవలెను. మధ్య యందు కూడ భూమి అలికి ఒక శిలను కలశమును స్థాపింపవలెను. ఈ తొమ్మిదికలశములపై ఈ క్రింద జెప్పిన దేవతలను స్థాపింపవలెను. పద్మ-మహాపద్మ-మకర-కచ్ఛప-కుముద-ఆనంద-పద్మ- శంఖములను ఎనిమిది కలశములపై స్థాపించి, పద్మినిని మధ్యనున్న కలశముపై స్థాపింపవలెను.

ఈ కలశలను కదపగూడదు., వాటి సమీపమున తూర్పునుండి ప్రారంభించి ఈశాన్యదిక్కువరకును ఒక్కొక్క ఇటుక ఉంచవలెను. వాటిపై వాటి దేవతలైన విమలమొదలగు శక్తులను స్థాపింపవలెను. మధ్య అనుగ్రహ అను దేవతలను స్థాపింపవలెను. పిమ్మట- ''మునిశ్రేష్ఠుడైన అంగిరసుని పుత్రియై ఓ ఇష్టకాదేవీ! నీ ఏ అవయవము కూడ విరుగలేదు. వికృతము కాలేదు, నీవు నీ సర్వాంగములతో పూర్ణమై యున్నావు. ఇపుడు నిన్ను నేను ప్రతిష్ఠంచుచున్నాను అని'' ప్రార్థింపవలెను. ఉత్తముడైన ఆచార్యుడు ఈ మంత్రముతో ఇష్టకాస్థాపనముచేసి, ఏకాగ్రచిత్తుడై మధ్యప్రదేశము నందు గర్భాధానము చేయవలెను. దాని విధి-ఒక కలశముపై శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మిని స్థాపించి వారి సమీపమున మట్టి, పుష్పములు, ధాతువులు, రత్నములు ఉంచవలెను. పిమ్మట పండ్రెండు అంగుళముల వైశాల్యము, నాలుగు అంగుళముల ఎత్తగల, లోహాదినిర్మితమగు గర్భపాత్రలో అస్త్రపూజ చేయవలెను. పిమ్మట కమలాకారమగు తామ్రపాత్రలో పృథివిని పూజించి ఈ విధముగ ప్రార్థింపవలెను.

పద్మాకారే తామ్రమయే భాజనే పృథివీంయజేత్‌ | ఏకాన్తే సర్వభూతేశే పర్వతాసనమణ్డితే. 21

సముద్రపరివారేత్వం దేవిగర్భం సమాశ్రయ | నన్దే నన్దయ వాసిష్ఠే వసుభిః ప్రజయాసహ. 22

జయేభార్గవదాయదే ప్రజానాంవి నయావహే | పూర్ణే7ఙ్గిరసదాయాదే పూర్ణకామం కురుష్వమామ్‌ . 23

భ##ద్రేకాశ్యపదాయాదే కురుభద్రాంమతింమమ | సర్వబీజసమూయుక్తే సర్వరత్నౌషధీవృతే. 24

జయేసురుచిరే నన్దే వాసిష్ఠే రమ్యతామిహ | ప్రజాపతిసుతే దేవి చతురస్రే మహీయసి.

25

సుభ##గే నుప్రభే భ##ద్రే గృహే కాశ్యపి రమ్యతామ్‌ | పూజతే పరమాశ్చర్యేగన్దమాల్త్యేరలఙ్కృతే. 26

భవభూతికరీదేవి గృహే భార్గవిరమ్యతామ్‌ | దేశస్వామి పురస్వామి గృహస్వామి పరిగ్రహే. 27

మనుష్యాదిక తుష్ట్యర్థం పశువృద్దికరాభవ | ఏవముక్త్వా తతః ఖాతం గోమూత్రేణ తుసేచయేత్‌. 28

''సకలభూతముల అధీశ్వరివైన ఓ భూదేవీ! పర్వతాసమనముపై విరాజిల్లుచు, సముద్రములచే చుట్చబడియున్న నీవు ఏకాంతమునందు గర్భధారణము చేయుము. వసిష్ఠకన్యవైన ఓ నందా! వసువులతోడను, ప్రజలతోడను కూడియున్న నీవు నన్ను ఆనందింపచేయుము. భార్గవ పుత్రివైన ఓ జయా! నీవు ప్రజలకు విజయము నిచ్చుదానవు. (నాకు కూడ విజయము నిమ్ము.) అంగిరసుని పుత్రివైన ఓ పూర్ణా! నీవు నాకోరికలను తీర్పుము. కశ్యపమహర్షి పుత్రికవైన ఓభద్రా! నీవు నాకు కల్యాణమైన బుద్ధినిమ్ము. సకలబీజములతో నిండి, సమస్త రత్నౌషధుంతో సంపన్నమైన, సుందరియైన ఓ జయాదేవీ! వసిష్ఠ పుత్రికయైన ఓ నందాదేవీ! ఇచట ఆనంద పూర్వకముగ రమింపుము. కశ్యపుని కన్యయైన ఓ భద్రా! నీవు ప్రజాపతికి పుత్రివి. నాలుగు దిక్కులందును వ్యాపించినదానవు. చాలగొప్పదానవు సుందరివి, మనోహరమైనదానవు. ఈగృహమునందు రమింపుము. ఓ భార్గవీదేవీ! నీవు చాల ఆశ్చర్యమయురాలవు. గంధమాల్యాదులతో పూడింపబడి ప్రకాశించచున్నావు. జనులకు ఐశ్వర్యమునిచ్చు ఓదేవీ! నీవీ గృహమునందు విహరింపుము. ఈదేశాధిపతికిని, నగరాధిపతికిని, గృహాధిపతికిని, దీనియందు నివసించు బాలాదులకును, మనుష్యాది ప్రాణులకును ఆనందము కలిగించుటకై పశ్వాదులను వృద్ధిపొందింపుము.'' ఈవిధముగా ప్రార్థించి వాస్తుకుండమును గోమూత్రముతో తడుపవలెను.

కృత్వా నిధాపయేద్గర్భం గర్బాధానం భ##వేన్నిశి | గోవస్త్రాది ప్రదగ్యాచ్చ గురవే7న్యేషు భోజనమ్‌ . 29

గర్బంన్యస్యేష్టకాన్యస్య తతోగర్బం ప్రపూరయేత్‌ | పీఠబన్ధమతః కుర్యాన్మిత ప్రాసాదమానతః. 30

వీఠోత్తమం చోచ్ఛ్రయేణ ప్రాసాదస్యార్ద విస్తరాత్‌ | పాదహీనం మధ్యమం స్యాత్కనిష్ఠం చోత్తమార్దతః. 31

పీఠబన్దో పరిష్టాత్తు వాస్తుయాగం పునర్యజేత్‌ | పాదప్రతిష్ఠాకాలేతు నిష్పాపో దివిమోదతే.

32

ఈ విధి యంతయు పూర్తి చేసి కుండమునందు గర్భమును స్థాపింపవలెను. ఆ సమయమున ఆచార్యునకు గోవస్త్రాదిదానమును, ఇతరులకు అన్నదానమును చేయవలెను. ఈ విధముగ గర్భపాత్రనుంచి, ఇటకలను గూడ ఉంచి ఆ కుండమును నింపవలెను. పిమ్మట దేవాలయము ఎత్తు ననుసరించి ప్రధాన దేవతకు పీఠమును నిర్మింపవలెను. ఆలయము వైశాల్యములో సగము ఎంతయో అంత ఎత్తుగల పీఠము ఉత్తమపీఠము. దానికంటె నాల్గవవంతు ఎత్తు తగ్గినది మధ్యమ పీఠము. ఉత్తమ పీఠము ఎత్తులో సగము ఎత్తు ఉన్నది. కనిష్ఠ పీఠము. పీఠ బంధము చేసిన పిమ్మట మరల వాస్తు పూజ చేయవలెను. కేవల పాద ప్రతిష్ఠ చేయువాడు కూడ సకల పాపవిముక్తుడై దేవలోకములో ఆనంద మగుభవించును.

దేవాగారం కరోమీతి మనసా యస్తు చిన్తయేత్‌ | తస్యకాయగతం పాపం తదహ్నాహి ప్రణశ్యతి. 33

కృతేతు కింపునస్తస్య ప్రాసాదే విధినైవతు| అష్టేష్టక సమాయుక్తం యంకుర్యాద్దేవతాలయమ్‌. 34

నతస్యఫలసంపత్తిర్వక్తుం శ##క్యేతకేనచిత్‌ | అనే నైవానుమేయంహి ఫలం ప్రాసాదవిస్తారాత్‌. 35

గ్రామమధ్యేచ పూర్వేచ ప్రత్యగ్ద్వారం ప్రకల్పయేత్‌ | విదిశాసుచసర్వాసు గ్రామేప్రత్యఙ్ము ఖోభ##వేత్‌. 36

దక్షిణ చోత్తరంచైవ పశ్చిమేప్రాఙ్మఖోభ##వేత్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ శిలావిన్యాస కథనం నామైకచత్వారింశో7ధ్యాయః

''నేను దేవాలయ నిర్మాణము చేసెదను'' అతని సంకల్పించిన వాని శారీరక పాపము లన్నియు ఆదివసమునే నశించిపోవును. యథాశాస్త్రముగా దేవాలయ నిర్మాణము చేయువాని మాట చెప్పవలెనా! ఎనిమిది ఇటుకలతో దేవాలయము నిర్మించువానికి కలుగు ఫలము కూడ వర్ణింపశక్యము కానిది. దీనిని పట్టి విశాలమైన దేవాలయములను నిర్మించిన వానికి కలుగు ఫలమును ఊహించుకొన వచ్చును.

గ్రామ మధ్యము నందుగాని, గ్రామమునకు తూర్పుగా గాని దేవాలయమును నిర్మించినచో దాని ద్వారము పశ్చిమమున కుండవలెను. విదిక్కులందు నిర్మించినచో దానిద్వారము గ్రామాభి ముఖముగ ఉండవలెను. గ్రామమునకు దక్షిణ-ఉత్తర-పశ్చి దిక్కులందు నిర్మించిన దేవాలయము ద్వారము తూర్పు వైపు ఉండవలెను.

అగ్నేయ మహాపురాణమునందు శిలావిన్యాసకథనమను నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters