Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుస్త్రింశో7ధ్యాయః.

అథ హోమాది విధిః

అగ్ని రువాచ :

విశేదనేన మన్త్రేణ యాగస్ధానం భూషయేత్‌ | నమో బ్రహ్మణ్యదేవాయ శ్రీధరాయావ్యయాత్మనే. 1

బుగ్యజుః సామరూపాయ శబ్దదేవహాయ విష్ణవే | విలిఖ్య మణ్డలం సాయం యాగద్రవ్యాది చాహరేత్‌. 2

ప్రక్షాళితకరాఙ్ఠ్రిః సన్విన్యస్యార్ఘ్యకరో నరః | అర్ఘ్యాదిభిస్తు శిరః ప్రోక్ష్య ద్వారదేశాదికం తథా. 3

అరభేద్ద్వారయాగం చ తోరణశాన్‌ ప్రపూజయేత్‌ | అశ్వత్థోదుమ్బరవటవృక్షాః పూర్వాదిగా నగాః. 4

ఋగిన్ద్రశోభనం ప్రాచ్చాం యజుర్యమసుభద్రకమ్‌ | సామాపశ్చ సుధన్వాఖ్యం సోమాథర్వసుహోత్రకమ్‌. 5

అగ్నిదేవుడు పలికెను : సాధకుడు ఈ ''ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ నమః'' అను మంత్రము చదువుచు యాగమండపమును ప్రవేశింపవలెను. యజ్ఞశాలను అలంకరింపవలెను. (ఈ క్రింది శ్లోకమును చదువుచు భగవంతునకు నమస్కారము చేయవలెను). ''వేదములకును బ్రాహ్మణులకును హితమును చేయు, అవ్యయ స్వరూపు డగు శ్రీధరునకు నమస్కారము. బుగ్యజుః సామాథర్వవేదములు విష్ణుస్వరూప మైనవి. శబ్దము లన్నియు విష్ణుస్వరూపమే. అట్టి, భగవంతు డైన విస్ణువునకు నమస్కారము'' సాయంకాలమున సర్వతోభద్రము మొదలగు మండలముల రచన చేసి పూజాద్యుపయుక్తము లగు ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. కాళ్లు చేతులు కడుగుకొనవలెను. ఆ యా ద్రవ్యములను తగు స్థానములందుంచి, చేతితో అర్ఘ్యము గ్రహించి, ఆ జలముతో తన శిరముపై ప్రోక్షించుకొనవలెను. ద్వారాదిప్రదేశములందు నీళ్లు చల్లవలెను. ద్వారయాగ (ద్వారస్థదేవతాపూజాప్రారంభము చేయవలెను. మొదటతోరణాధిపతులను బాగుగా పూజింపవలెను. తూర్పు మొదలగు దిక్కులలో అశ్వత్థ-ఉదుమ్బర-వట-ప్లక్షవృక్షములను పూజింపవలెను. ఇవి కాక, తూర్పున బుగ్వేదమును, ఇంద్రుని, శోభనుని, దక్షిణమున యజుర్వేదమును, యముని, సుభద్రుని పశ్చిమమున సామవేదమును, వరుణుని సుదన్వుని, ఉత్తరమున అథర్వవేదమును, సోముని, సుహోత్రుని పూజింపవలెను.

తోరణాన్తాః పతాకాశ్చ కుమాదాద్యా ఘటద్వయమ్‌ |

ద్వారి ద్వారి స్వనామ్నార్చ్యాః పూర్వే పూర్ణశ్చ పుష్కరః. 6

ఆనన్దనన్దనో దక్షో వీరసేనః సుషేణకః | సంభవప్రభవో సౌమ్యే ద్వారసాంశ్చైవ పూజయేత్‌. 7

అస్త్రజప్తపుష్పక్షేపాద్విఘ్నానుత్సార్య సంవిశేత్‌ | బూతశుద్ధిం విధాయాథ విన్యస్య కృతముద్రకః. 8

ఫట్‌కారాన్తం శిఖాం జప్త్వా సర్షపాన్‌ దిక్షు నిక్షి పేత్‌ | వాసుదేవేన గోమూత్రం సఙ్కర్షణన గోమయమ్‌. 9

ప్రద్యుమ్నేన పయస్తజ్జాదధి నారాయణాద్ఘృతమ్‌ | ఏకద్విత్ర్యాదివారేణ ఘృతాద్యై భాగతో7ధికమ్‌. 10

ఘృతపాత్రే తదేకత్ర పఞ్చ గవ్యముదాహృతమ్‌ | మణ్డపప్రోక్షణాయైకం చాపరం ప్రాశనాయ చ. 11

ఆనీయ దశకుమ్బేషు ఇన్ద్రాద్యాన్‌ లోకపాన్యజేత్‌ |

పూజ్యాజ్ఞాం శ్రావయేత్తాంశ్చ స్తాతవ్యం చాజ్ఞయా హరేః. 12

తోరనము (ద్వారము) లోపల పతాకలు కట్టి రెండేసి కలశములను స్థాపింపవలెను. కుముదము మొదలగు దిగ్గజములను పూజింపవలెను. ఒక్కొక్క గుమ్మమువద్దను ఇద్ద రిద్దరు ద్వారపాలకును, వారి నామమంత్రములు చదువుచు పూజింపవలెను. తూర్పున పూర్ణ-పుష్కరులు, దక్షిణమున అనంద-నందనులు, పశ్చిమమున వీరసేన- సుషేణులు, ఉత్తరమున సంభవ-ప్రభవులు అను ద్వారపాలులను పూజింపవలెను. 'ఫట్‌' అను అస్త్రమంత్రమును ఉచ్చరించుచు (పుష్పములు చల్లి విఘ్నములను తొలగించిన పిదప మండలములోనికి ప్రవేశించవలెను. భూతశుద్ధి, న్యాసము, ముద్రలు చేసి, శిఖకు ('వషట్‌'కు) చివర 'ఫట్‌' చేర్చి జపించుచు నాలుగు దిక్కులందును ఆవాలు చల్లవలెను. పిమ్మట వాసుదేవమంత్రముతో గోమూత్రమును, సంకర్షణమంత్రముతో గోమయమును, ప్రద్యుమ్నమంత్రముతో గోదుగ్ధమును, అని రుద్ధమంత్రముతో పెరుగును, నారాయణమంత్రముతో ఘృతమును గ్రహించి, వాటి నన్నింటిని ఘృతపాత్రమునందు కలపవలెను. ఇతరవస్తువుల భాగములు నేతికంటె ఎక్కువ ఉండవలెను. వీటి నన్నింటిని కలుపగా పంచగవ్య మేర్పడును, పంచగవ్యమును ఒక పర్యాయము, రెండు పర్యాయములు, లేదా మూడు పర్యాయములు వేరు వేరుగ చేయవలెను. వీటిలో ఒకటి మండపప్రోక్షణమున కుపయోగింపవలెను. రెండవది తినుటకును, మూడవది స్నానమునందును ఉయోగింపవలెను. పది కలశలును స్థాపించి వాటిపై ఇంద్రాదిలోకపాలులను పూజింపవలెను. పూజ చేసి వారికి శ్రీహరి అజ్ఞను వినిపింపవలెను. ''ఓ లోకపాలులారా! శ్రీహరి అజ్ఞ ప్రకారము మీరు ఈ యజ్ఞమును రక్షించుటకై ఎల్లపుడును ఇచట నుండవలెను. ''

యాగద్రవ్యాది సంరక్ష్య వికిరాన్వికిరేత్తతః | మూలాష్టశతసంజప్తాన్‌ కుశకూర్చాన్‌ హరేచ్చ తాన్‌. 13

ఐశాన్యాం దిశి తత్రస్థం స్థాప్యం కుమ్భం చ వర్దనీమ్‌ |

కువ్ఖుె సాఙ్గం హరిం ప్రార్చ్య కర్దన్యామస్త్రమర్చయేత్‌? 14

ప్రదక్షిణం యాగగృహం వర్దన్యా7చ్ఛిన్నధారయా | సిఞ్చన్నయేత్తతః కుమ్భం పూజయేచ్చ స్థిరాసనే. 15

నపఞ్చరత్నవస్త్రాభఢ్యకుమ్భే గన్ధాదిభిర్హరిమ్‌ | వర్దన్యాం హేమగర్భాయాం యజేదస్త్రం చ వామతః. 16

తత్సమీ పే వాస్తులక్ష్మీం భూవినాయకమర్చయేత్‌ | స్నపనం కారయేద్విష్ణోః సంక్రాన్త్యాదౌ తథైవ చ. 17

పూర్ణకుమ్భానవస్థాప్య నవకోణషు నిర్ర్వణాన్‌ | పాద్యమ ర్ఘ్యమాచమనీయం పఞ్చగవ్యం చ నిక్షిపేత్‌. 18

పూర్వా దికలశే7గ్న్యాదౌ పఞ్చామృతజలాదికమ్‌ | దధి క్షీరం మధూష్ణోదం పాద్యం స్యాచ్చతురఙ్గకమ్‌. 19

యాగద్రవ్యాదులను సంరక్షించుకొని వికిరద్రవ్యములను (విఘ్ననివారణముకొరకై నాలుగు వైపులను చల్లు ఆవాలు మొదలుగువాటికి విరము లనిపేరు) చల్లవలెను. అస్త్రమూలమంత్రమును (అస్త్రాయ ఫట్‌ ) ఏడు సార్లు జపించుచు ఈ వికిరములను చల్లవలెను. మరల అదే విధముగ అస్త్రమంత్రమును జపించుచు కుశనిర్మితకూర్పమును తీసికొనవలెను. వాటిని ఊశానకోణమునందుంచి వాటి పైన కలశములను వర్ధనిని ఉంచవెను. కలశ##పై సాంగముగ శ్రీహరి పూజ చేసి, వర్ధనిలో అస్త్రపూజ చేయవలెను. అచ్ఛిన్నమగు వర్ధనీధారచే యాగమండపములను ప్రదక్షిణక్రమమున తడుపుచు కలశమును దానికి ఉపయుక్త మగు స్థానమున చేర్చి, ఆసనముపై ఉంచి, దాని పూజ చేయవలెను. కలశలో పంచరత్నము లుంచవలెను, దానిపై వస్త్రము చుట్టవలెను. దానిపై గంధాద్యుపచారమలతో శ్రీహరిని పూజింపవలెను. వర్ధనిలో కూడ బంగారు ముక్క ఉంచవలెను. దానిపై అస్త్రపూజ చేసి, దాని ఎడమ భాగమున, సమీపమునందే వాస్తులక్ష్మీ-భూవినాయకులను పూజింపవలెను. సంక్రాంత్యాదికాలములందు ఈ విధముగనే శ్రీమహావిష్ణువు స్నానాభిషేకముల ఏర్పాటు చేయవలెను. మండపముయొక్క కోణములందును, దిక్కులందును ఎనిమిది కలశములను, మధ్యయందు ఒక కలశమును- మొత్తము భద్రములు లేని తొమ్మిది కలశములు-ఉంచి, వాటిలో పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, పంచగవ్యములు వేయవలెను. పూర్వాదికలశములలో పైన చెప్పిన పస్తువులను, అగ్నికోణాదులందలి కలశములలో ఆ ద్రవ్యములతో పాటు పంచామృతయుక్తజలమును వేయవలెను. పెరుగు, పాలు, తేనె, వేడినీళ్ళు- ఇవి పాద్యాంగములు.

పధ్మశ్యామాకదూర్వాశ్చ విష్ణువర్ణీ చ పాద్యకమ్‌ | తథాష్టాఙ్గార్ఘ్యమాఖ్యాతం యవగన్ధఫలాక్షతమ్‌. 20

కుశాః సిద్ధార్థపుష్పాణి తిలద్రవ్యాణి చౌర్హణమ్‌ | లవఙ్గకజ్కోలయుతం దద్యాదాచమనీయకమ్‌. 21

స్నాపయేన్మూలమన్త్రేణ దేవం పఞ్చామతైరపి | శుద్దోదం మధ్యకుమ్భేన దేవమూర్ధ్ని వినిక్షిపేత్‌. 22

కలశాన్నిః సృతం తోయం కూర్చాగ్రం సంస్పృశేన్నరః |

శుద్ధోదకేన పాద్యం చ అర్ఘ్య మాచమనం దదేత్‌. 23

పరిమృజ్య పటేనాఙ్గం సవస్త్రం మణ్డలమ్‌ నయేత్‌ | తత్రాభ్యర్చ్యాచరేద్గోమం కుణ్డాదౌ ప్రాణసంయమీ. 24

ప్రక్షాల్య పాదౌ రేఖాశ్చ తిస్రః పూర్వాగ్రగామినః | దక్షిణాదుత్తరాన్తాశ్ఛ తిస్రశ్చైవౌత్తరాగ్రగాః. 25

కమలములు, శ్యామాకము, దూర్వాదలములు, విష్ణుక్రాన్తోషధి అను నాలుగు వస్తులతో కూడిన జలము పాద్య మని చెప్పబడును, అర్ఘ్యమునకు కూడ ఎనిమిది అంగములు చెప్పబడినవి. అర్ఘముకొరకు యవలు, గంధము, ఫలములు, అక్షతలు, కుశలు, ఆవాలు, పుష్పములు, తిలలు సమకూర్చుకొనవలెను. జాతీ-లవంగ-కంకోలములతో కూడిన జలమును ఆచమనీయముగా ఇవ్వవలెను. ఇష్టదేవతకు, మూలమంత్రము చదువుచు, పంచామృతస్నానము చేయించవలెన. మధ్య నున్న కలశమునుండి శుద్ధోదకమును గ్రహించి దేవుని శిరముపై చల్లవలెను. కలశనుండి వచ్చు జలమును, కూర్చాగ్రమును స్పృశింపవలెను. పిమ్మట శుద్ధోదకముతో పాద్య-అర్ఘ్య-ఆచమనీయములు సమర్పింపవలెను. వస్త్రముచే దేవతామూర్తిని తుడిచి, వస్త్రధారణము చేయించి, సవస్త్రకముగ మండలముమీదికి దీసికొని వెళ్ళవలెను. అచట బాగుగా పూజచేసి, ప్రాణాయామపూర్వకముగ కుండాదులలో హోమము చేయవలెను. (హవనవిధానము) : రెండు చేతులు కడిగికొని, అగ్నికుండమునందు గాని, చేదిపై గాని మూడు పూర్వాగ్రరేఖలు గీయవలెను. వాటిని దక్షిణమునుండి ప్రారంభించి, ఉత్తరము వైపు గీయవలెను. మరల వాటిపై మూడు ఉత్తరాగ్రరేఖలు గీయవలెను. (వీటిని కూడ కుడినుండి ప్రారంభించి ఎడమకు గీయవలెను).

అర్ఘ్యోద కేన సంప్రోక్ష్య యోనిముద్రాం ప్రదర్శయేత్‌ |

ధ్యాత్వాత్మరూపం చాగ్ని ం తు యోన్యాం కుణ్డ క్షిపేన్నరః. 26

పాత్రాణ్యాసాదయేత్పశ్చాద్దర్భసృక్‌ స్రువకాదిభిః | బాహుమాత్రాః పరిధయ ఇధ్మవ్రశ్చనమేవ చ. 27

ప్రణీతా ప్రోక్షణీపాత్రమాజ్యస్థాలీ ఘృతాదికమ్‌ | ప్రస్థద్వయం తణ్డులానాం యుగ్మం యుగ్మమధోముఖం. 28

ప్రణీతా ప్రోక్షణీపాత్రే న్యసేత్ర్పాగగ్రం కుశమ్‌ |

అద్బిః పూర్వప్రణీతాం తు ధ్యాత్వా దేవం ప్రపూజ్య చ. 29

ప్రణీతాం స్థాపయేదగ్రే ద్రవ్యాణాం చైవ మధ్యతః |

ప్రోక్షణీమద్బిః సంపూర్య ప్రార్చ్య దక్షే తు విన్యసేత్‌. 30

చరుం చ శ్రపయేదగ్నౌ బ్రహ్మానాం దక్షిణ న్యసేత్‌ | కుశానాస్తీర్య పూర్వదౌ పరిధీన్‌ స్థాపయేత్తతః. 31

వైష్ణవీకరణం కుర్యాద్గర్భాధానాదిని నరః | గర్భాధానం పుంసవనం సీమన్తోన్యయనం జనిః. 32

నామాదిసమావర్తాన్తం జుహుయాదష్టచాముతీ | పూర్ణాహుతిః ప్రతికర్మ సృచా స్రువసుయుక్తయా. 33

పిమ్మట అర్ఘ్యజలముతో ఈ రేఖలను కడిగి యోనిముద్ర చూపవలెను. అగ్నిని ఆత్మరూపముగా భావించుచు యోనియుక్త మగు కుంమునందు స్థాపింపవలెను. పిమ్మట దర్బ-సృకో-స్రువాదులతో కూడ పాత్రాసాదనము చేయవలెను. బాహుప్రమాణము గల పరిధులు, ఇధ్మవ్రశ్చనము, ప్రణీతాపాత్రము, ప్రోక్షణీపాత్రము, ఆట స్థాలి, ఆజ్యము, రెండు రెండు ప్రస్థముల బియ్యము; లధోముఖములగా నున్న సృకస్రువములు. ప్రణీతయుందును, ప్రోక్షణియందును పూర్వాగ్రముగ కుశ లుంచవలెను. ప్రణీతను నీటితో నింపి, భగవద్థ్యానము చేపి, దానిని అగ్నికి పశ్చిమమున, తన ఎదుట, సమకూర్చిన ద్రవ్యముల మధ్య ఉంచవలెను. ప్రేక్షణిని నీటితో నింపి పూజానంతరము కుడి వైపున ఉంచవలెను. చరువును అగ్నిపై ఉంచి ఉడికించవలెను. అగ్నికి దక్షీణమున బ్రహ్మను స్థాపింపవలెను. అగ్నికుండమునకు లేదా వేదికి, నాలుగు ప్రక్కల, పూర్వాది దిక్కులందు బర్హిస్సు పరిచి పరిధులను ఉంచవలెను. పిమ్మట గర్భాధానాది సంస్కారముల ద్వారా అగ్నికి వైష్ణవీకరణము చేయవలెను, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము మొదలు సమావర్తనము వరకు నున్న సంస్కారములు చేసి ఒక్కొక్క కర్మకు ఎనిమిదేసి ఆహుతుల నివ్వవలెను. స్రువతో కూడిన సృక్కుతో పూర్ణాహుతి ఇవ్వవలెను.

కుణ్డమధ్యే బుతుమతీం లక్ష్మీం సంచిన్త్య హోమయేత్‌ | కుణ్డలక్ష్మీః సమాఖ్యాతా ప్రకృతిస్త్రిగుణాత్మికా. 34

సా యోనిః సర్వభూతానాం విద్యా మన్త్రగణస్య చ |

విముక్తేః కారణం వహ్నిః పరమాత్మా చ ముక్తిదః. 35

ప్రాచ్యాం శిరః సమాఖ్యాతం బాహూ కోణ వ్యవస్థితౌ | ఈశానాగ్నేయకోణ తు జజ్ఝే వాయవ్యన్తెరృతే. 36

ఉదరం కుణ్డమిత్యుక్తం యోనిర్యోనిర్విధీయతే | గుణత్రయం మేఖలాః స్యుర్ధ్యాత్వైవం సమిధో దశ. 37

పఞ్చాధికాంస్తు జుహుయాత్ర్పణవాన్ముష్టిముద్రయా |

పునరాఘారౌ జుహుయాద్వాయ్వగ్న్యన్తం తతః శ్రయేత్‌. 38

ఈశాన్తం మూలమన్త్రేణ ఆజ్యభాగౌ తు హోమయేత్‌ | ఉత్తరే ద్వాదశాన్తేన దక్షిణతేన మధ్యతః. 39

వ్యాహృత్యా పద్మమధ్యస్థం ధ్యాయేద్వహ్నిం తు సంస్కృతమ్‌ |

వైష్ణవం సప్తజిహ్వం చ సూర్యకోటిసమప్రభమ్‌. 40

చన్ద్రవక్త్రం చ సూర్యక్షం జుహుయాచ్ఛతమష్ట చ| తదర్థం చాష్టమూలేన అఙ్గానాం చ దశాంశతః.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అగ్ని కార్యకథనం నామ చతుస్త్రింశో7ధ్యాయః.

కుండము మధ్య, బుతుస్నాత యగు లక్ష్మిని ధ్యానించి హోమము చేయవలెను. కుండములోపల నున్న లక్ష్మికి కుండలక్ష్మీ అని పేరు. త్రిగుణాత్మిక యగు ప్రకృతి ఈ లక్ష్మియే. ఈమెయే సకలభూజములకును, సకలమంత్రములకును, విద్యలకును ఉత్పత్తిస్థానము. వరమాత్మస్వరూప డగు అగ్నిదేవుడు మోక్షమునకు కారణ మైనవాడు; ముక్తిదాత. కుండలక్ష్మి శిరస్సు తూర్పుదిక్కు వైపునను, భుజములు ఈశాన - ఆగ్నేయదిక్కులవైపునను, కాళ్ళు వాయవ్యనైరృతిదిక్కులవైపునకును ఉండును. కుండమే ఉదరము. కుండమునందలి యోనిస్థానము యోని. మూడు మేఖలలు సత్త్వరజస్తమోగుణములు. ఈ విధముగ ధ్యానించి ముష్టిముద్రతో పదునైదు సమిధలను హోమము చేయవలెను పిదప వాయవ్యదిక్కునుండు ఆగ్నేయదిక్కువరకును 'ఆధారములు' అనెడురెండు ఆహుతుల నివ్వవలెను. ఇదే విధమున ఆగ్నేయమునుండి ఈశాన్యము వరకు ఆజ్యభాగములను ఆహుతులు చేయవలెను. ఆజ్యస్థాలినుండు ఉత్తర-దక్షిణ-మధ్యభాగములనుండి ఆజ్యము గ్రహించి ద్వాదశాంతముతో, అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి, అగ్నియందు, ఆ దిక్కులందే హోమము చేసి, అచటనే త్యాగము చేయవలెను. పిమ్మట ''భూః స్వాహా'' ఇత్యాదిక్రమమున వ్యాహృతిహోమము చేయవలెను. కమలమధ్యభాగమున సంస్కాసంపన్నుడగు అగ్నిదేవుని ధ్యానింపవలెను. '' ఈ ఏడు జహ్వలతో కోట్లకొలది సూర్యుల ప్రకాశముతో ప్రకాశించును. ఆతని ముఖము చంద్ర సదృశము. నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగ నున్నవి''. ఈ విధముగ ధ్యానించి అగ్నిదేవునకు నూటఎనిమిది ఆహుతులు సమర్పింపవలెను. లేదా మూలమూలమంత్రముచే అందులో సగము సంఖ్యగల ఆహుతులను, మరి యోనిమిది ఆహుతులమ ఇవ్వవలెను. అంగములకు కూడ పదేసి ఆహుతులు ఇవ్వవలెను.

ఆగ్ని మహాపురాణమున అగ్ని కార్యకథన మను ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters