Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రింశో7ధ్యాయః.

అథ మణ్డలవిధిః

నారద ఉవాచ :

మధ్యే పద్మే యజేద్బ్రహ్మ సాఙ్గం పూర్వే7బ్జనాభకమ్‌ | ఆగ్నేయే7బ్జే చ ప్రకృతిం యామ్యే7బ్జే పురుషంయజేత్‌. 1

పురుషాద్దక్షిణ వహ్నిం నైరృతే వారుణ7నిలమ్‌ | ఆదిత్యమైన్దవే పద్మే బుగ్యజుశ్చే శపద్మ కే. 2

ఇన్ద్రాదీంశ్చ ద్వితీయాయాం పద్మే షోడశ##కే తథా | సామాథర్వాణమాకాశం వాయుం తేజ స్తథా జలమ్‌. 3

పృథివీం చ మనశ్చైవ శ్రోత్రం త్వక్చక్షురర్చయేత్‌. |

రసనాం చ తథా ఘ్రాణం భూర్భువశ్చైవ షోడశమ్‌. 4

నారదుడు చెప్పెను : భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతాసహితబ్రహ్మను పూజింపవలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను, నైరృతిదిక్కున నిరృతిని, పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని, వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును, ఉత్తరదిక్కునందున్న కమలమున ఆదిత్యుని, ఈశాన్యదిక్కునందున్న కమలమున బుగ్వేదయజుర్వేదములను పూజింపవలెను. రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశదలకమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.

మహర్జనస్తపఃసత్యమత్యగ్నిష్టోమమేవ చ | తథాగ్నిష్టోమకం చోక్థం షోడశీం వాజపేయకమ్‌. 5

అతిరాత్రం చ సంపూజ్య తథాప్తోర్యామమర్చయేత్‌ | మనోబుద్ధిమహఙ్కారం శబ్ధం స్పర్శం చ రూపకమ్‌. 6

రసం గన్ధం చ పద్మేషు చతుర్వింశతిషు క్రమాత్‌ | జీవం మనో ధియం చాహం ప్రకృతిం శబ్దమాత్రకమ్‌.

వాసుదేవాదిమూర్తీశ్ఛీ తథా చైవ దశాత్మకమ్‌ | మనః శ్రోతం త్వచం ప్రార్చ్య చక్షుశ్చ రసనం తథా. 8

ఘ్రాణం వాక్పాణిపాదం చ ద్వాత్రింశద్వారిజేష్విమాన్‌ | చతుర్థావరణ పూజ్యాః సాఙ్గాః సపరివారకాః. 9

పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవసరము లేదు. ఇరువదియైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగసపరివార దేవతాపూజ చేయవలెను.

పాయూపస్థౌ చ సంపూజ్య మాసానాం ద్వాదశాధిపాన్‌ |

పురుషోత్తమాదిషడ్వింశాన్‌ బాహ్యావరణ కే యజేత్‌. 10

చక్రాబ్జే తేషు సంపూజ్యా మాసానాం పతయః క్రమాత్‌ | అష్టౌ ప్రకృతయః షడ్వా పఞ్చాథ చతురోపరే. 11

రజఃపాతం తతః కుర్యాల్లిఖితే మణ్డలే శృణు | కర్ణికాపీతవర్ణా స్యాద్రేవాః సర్వాః సితాః సమాః. 12

ద్విహస్తే7ఙ్గుష్ఠమాత్రాః స్యుర్హస్తే చార్ధసమాః సితాః | పద్మం శుక్లేన సన్ధీంస్తు కృష్ణేన శ్యామతో7థవా. 13

కేసరా రక్తపీతాః స్యుః కోణాన్రక్తేన పూరయేత్‌ | భూషయేద్యోగపీఠం తు యథేష్టం సార్వవర్ణికైః. 14

లతావితానపత్రాద్యైర్వీథికాముపశోభ##యేత్‌ | పీఠద్వారే తు శ##క్లేన శోభారక్తేన పీతతః. 15

ఉపశోభాం చ నీలేన కోణసంఖ్యాశ్చ వై సితాన్‌ | భద్రకే పూరణం ప్రోక్తమేవమన్యేషు పూరణమ్‌. 16

త్రికోణం సితరక్తేన కృష్ణేన చ విభూషయేత్‌ | ద్వికోణం రక్తపీతాభ్యాం నాభిం కృష్ణేన చక్ర కే. 17

పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు-ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. మాసాధిపతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను. ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను. ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింపవలెను. వీథిని లతలతోడను, పత్రాదులతోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణములతోడను నింపవలెను. ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతరమండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింపవలెను. ద్వికోణమును ఎరుపు-పసుపురంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.

అరకాన్పీతరక్తాభిః శ్యామన్నే మిం తు రక్తతః | సితశ్యామారుణాః కృష్ణాః పీతా రేఖాస్తు బాహ్యతః. 18

శాలిపిష్టాది శుక్లం స్యాద్రక్తం కౌసుంభకాదికమ్‌ | హరిద్రయా చ హారిద్రం కృష్ణం స్యాద్దగ్ధధాన్యతః. 19

శమీపత్రాదికైః శ్యామం బీజానాం లక్షమప్యతః | చతుర్లక్షస్తు మన్త్రాణాం విద్యానాం లక్షసాధనమ్‌. 20

అయుతం బుద్ధవాద్యానాం స్తోత్రాణాం చ సహస్రకమ్‌ | పూర్వమేవాథ లక్షేణ మన్త్రశుద్తిస్తథాత్మనః. 21

తథాపరేణ లక్షేణ మన్త్రః క్షేత్రీకృతో భ##వేత్‌ | పూర్వసేవాసమో హోమో బీజానాం సంప్రకీర్తితః. 22

పూర్వసేవాదశాంశేన మన్త్రాదీనాం ప్రకీర్తితా | పురశ్చరణమన్త్రే తు మాసికం వ్రతమాచరేత్‌. 23

భువి న్యసేద్వామపాదం న గృహ్ణీయాత్ర్పతిగ్రహమ్‌ | ఏవం ద్విత్రిగుణన్తెవ మధ్యమోత్తమసిద్ధయః. 24

మన్త్రధ్యానం ప్రవక్ష్యామి యేన స్యాన్మన్త్రజంఫలమ్‌ |

స్థూలం శబ్దమయం రూపం విగ్రహం బాహ్యమిష్యతే. 25

సూక్ష్మం జ్యోతిర్మయం రూపం హార్దం చిన్తామయం భ##వేత్‌ |

చిన్తయా రహితం యత్తు తత్పరం పరికీర్తితమ్‌. 26

వారాహసింహశక్తీ నాం స్థూలరూపం ప్రధానతః | చిన్తయా రహితం రూపం వాసుదేవస్య కీర్తితమ్‌. 27

చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను. వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్షజపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును. రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు చేయవలెను. మంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడురెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమశ్రేణికి చెందిన ఫలముల లభించును.

ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్రధ్యానమును చెప్పెదను - మంత్రముయొక్క స్థూలరూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రముయొక్క సూక్ష్మరూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రముయొక్క పరరూపము. వరాహ-నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.

ఇతరేషాం స్మృతం రూపం హార్దచిన్తామయం సదా |

స్థూలం వై రాజమాఖ్యాతం సూక్ష్మం వై లిఙ్గితం భ##వేత్‌. 28

చిన్తయా రహితం రూపమైశ్వరం పరికీర్తితమ్‌ | హృత్పుణ్డరీకనిలయం చైతన్యం జ్యోతిరవ్యయమ్‌. 29

బీజం బీజాత్మకం ధ్యాయేత్కదమ్బకుసుమాకృతి | కుమ్భాన్తరగతో దీపో నిరుర్ధప్రసవౌ యథా. 30

సంహతః కేవలస్తిష్ఠేదేవం మన్త్రేశ్వరో హృది | అనేక సుషిరే కుమ్భే తావన్మాత్రా గభస్తయః. 31

ప్రసరన్తి బహిస్తద్వన్నాడీభిర్బీజరశ్మయః | అథావభాసతో దైవీమాత్మకృత్యతనుం స్థితా. 32

హృదయాత్ర్పస్థితా నాడ్యో దర్శనేన్ద్రియగోచరాః | అగ్నీ షోమాత్మ కే తాసాం నాడ్యౌ నాసాగ్ర సంస్థితే. 33

సమ్యగ్గుహ్యేన యోగేన జిత్వా దేహసమీరణమ్‌ | జపధ్యానరతో మన్త్రీ మన్త్రలక్షణమశ్నుతే. 34

దేవాత్మకో భూతమాత్రాన్ముచ్యతే చేన్ద్రియగ్రహాత్‌ |

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మణ్డలాదివర్ణనం నామ త్రింశో7ధ్యాయః

ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది. విరాట్టుయొక్క స్వరూపము స్థూలము. లింగమయస్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయకమలమునందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతిస్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము. ఈ విధముగ ధ్యానింపవలెను. కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహతరూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయమునందు ప్రకాశించుచుండును. అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయబీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మకదేహముతో ప్రకాశించును. నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియమువరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్రభాగమునందుడును. మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాదిసిద్ధులను పొందును. వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయస్వరూపముతో నుండి, భరూతమాత్రలనుండియు, ఇంద్రియము లనెడు గ్రహములనుండి సర్వదా విముక్తుడగును.

అగ్ని మహాపురాణమునందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters