Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షడుత్తర ద్విశతతమో7ధ్యాయః

అథ అగస్త్యపూజా

అగ్నిరువాచ :

అగస్త్యో భగవాన్విష్ణుస్తమభ్యర్చ్యాప్ను యాద్ధరిమ్‌ | అప్రాప్తే భాస్కరే కన్యాం సత్రిభాగైస్త్రిభిర్దినైః 1

అర్ఘ్యం దద్యాదగస్త్యాయ పూజయిత్వా హ్యుపోషితః | కాశపష్పమయీం మూర్తిం ప్రదేషే విన్యసేద్ఘటే. 2

మునేర్యజేత్తాం కుమ్భస్థాం రాత్రౌ కుర్యాత్ప్రజాగరమ్‌ | అగస్త్య మునిశార్దూల తేజోరాశే మహామతే. 3

ఇమాం మమ కృతాం పూజాం గృహ్ణీష్వ ప్రియయా సహ |

ఆవాహ్యార్ఘ్యైశ్చ సాంముఖ్యం ప్రార్చయేచ్చన్దనాదినా. 4

జలాశయ సమీపే తు ప్రాతర్నీత్వార్ఘ్యమర్పయేత్‌ | కాశపుష్ఫప్రతీకాశ అగ్నిమారుతనంభవ. 5

మిత్రావరుణయోః పుత్ర కుమ్భయోనే నమో7స్తుతే | ఆతాపిర్భక్షితో యేన వాతాపిశ్చమహాసురః. 6

సముద్రః శోషిత యేన సో7గస్త్యః సంముఖో7స్తుమే | అగస్తిం ప్రార్థయిష్యామి కర్మణా మనసా గిరా. 7

అర్చయిష్యామ్యహం మైత్రం పరలోకాభికాంక్షయా | ద్వీపాన్తరసముత్పన్నం దేవానాం పరమం ప్రియమ్‌. 8

రాజానం సర్వవృక్షాణాం చన్దనం ప్రతిగృహ్యాతామ్‌ | ధర్మార్థకామమోక్షాణాం భాజనీ పాపనాశనీ. 9

సౌభాగ్యారోగ్యలక్ష్మీదా పుష్పమాలా ప్రగృహ్యాతమ్‌ |

ధూపో7యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు. 10

ఈప్సితం మే వరం దేహి పరత్ర చ శుభాం గతిమ్‌ | సురాసురైర్మునిశ్రేష్ఠసర్వకామఫలప్రద. 11

వస్త్రవ్రీహిఫలైర్హేమ్నా దత్తస్వర్ఘ్యో హ్యాయం మయా |

అగస్త్యం బోధయిష్యామి యన్మయా మనసోద్ధృతమ్‌. 12

ఫలైరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణార్ఘ్యం మహామునే |

అగస్త్య ఏవం ఖనమానః ఖనిత్రైః ప్రజాపత్యం బలమీహమానః |

ఉభౌ కర్ణావృషిరుగ్రతేజాః పుషోష సత్యా దేవేష్వాశిషో వై జగామ. 13

రాజపుత్రి నమస్తుభ్యం మునిపత్ని మహావ్రతే | అర్ఘ్యం గృహ్ణీష్వ దేవేశి లోపాముద్రేయశస్విని. 14

పఞ్చరత్న సమాయుక్తం హేమరూప్యసమన్వితమ్‌ | సప్తధాన్యవృతం పాత్రం దధిచన్దసంయుతమ్‌. 15

అర్ఘ్యం దద్యాదగస్త్యాయ స్త్రీశూద్రాణామవైదికమ్‌ | అగస్త్యమునిశార్దూల తేజోరాశే చ సర్వదా. 16

ఇమాం మమ కృతాం పూజాం గృహీత్వా వ్రజ శాన్తయే | త్యజేదగస్త్యముద్దిశ్య ధాన్యమేకం ఫలం రసమ్‌.

తతో7న్నం భోజయేద్విప్రాన్‌ ఘృతపాయసమోదకాన్‌ |

గాం వాసాంసి సువర్ణం చ తేభ్యో దద్యాచ్చదక్షిణామ్‌.18

ఘృతపాయసయుక్తేన పాత్రేణాచ్ఛాదితాననమ్‌ | సహిరణ్యం చ తం కుమ్భం బ్రాహ్మణాయోపకల్పయేత్‌. 19

సప్త వర్షాణి దత్త్వార్ఘ్యం సర్వే సర్వమవాప్నుయుః | నారీ పుత్రాంశ్చ సౌభాగ్యం పతిం కన్యా నృపోద్భవమ్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే అగస్త్యార్ఘ్యదానవ్రతం నామ షడధికద్విశతతమోధ్యాయః.

అగ్ని దేవుడు చెప్పెను. వసిష్ఠా! అగస్త్య మహర్షి సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. అతని పూజ చేసినవాడు శ్రీమహావిష్ణు సన్నిధి చేరును. సూర్యుడు కన్యారాశి చేరకముందు, దానికి దగ్గరగా నున్నపుడు 3 1/3 రోజులు ఉపవాసముండి, అగస్త్య పూజ చేసి ఆర్ఘ్యము ఇవ్వవలెను. మొదటి దినమున నాలుగు గంటలు పగటి భాగము మిగిలి యుండగా వ్రత ప్రారంభము చేసి, ప్రదోషకాలమున కాశపుష్పమయ మగు అగస్త్యుని మూర్తి కలశముపై స్థాపించి, మూర్తి పూజ చేయవలెను. అర్ఘ్యము నిచ్చువాడు రాత్రి జాగరణము చేయవలెను; "ముని శ్రేష్ఠుడవైన అగస్త్యా! నీవు తేజో రాశివి-మహాబుద్ధి మంతుడవు. నీ భార్యయగు లోపాముద్రతో కలిసి వచ్చి-నేనిచ్చు పూజను గ్రహింపుము" అని అగస్త్యుని ఆవాహనము చేసి, గంధ-పుష్ప-ఫల-జలాదులతో అర్ఘ్యము సమర్పించవలెను. పిదప ముని శ్రేష్ఠుడైన అగస్త్యుని వైపు తిరిగి చందనాద్యుపచారములతో పూజించవలెను. రెండవ రోజున ప్రాతఃకాలమున కలశస్థిత-అగస్త్యమూర్తిని ఏదైన జలాశయము వద్దకు తీసికొని పోయి, ఈ విధముగ చెప్పుచు అర్ఘ్యము సమర్పించవలెను. "కాశపుష్పమువలె ప్రకాశించువాడా! ఆగ్నివాయు సంభూతుడా! మిత్రావరుణ పుత్రా! కుంభసంభవా! అగస్త్యా! నీకు నమస్కరించుచున్నాను. ఆతాపి- వాతాపు లను రాక్షసులను భక్షించిన వాడవును, సముద్రమును ఎండింప చేసిన వాడవును అగు అగస్త్యా! నా ఎదుట సాక్షాత్కరించుము. నేను మనోవాక్కాయములతో అగస్త్యుని ప్రార్థించుచున్నాను ఉత్తమలోకప్రాప్త్యాశ##చే అగస్త్యుని ప్రార్థించుచున్నాను. జంబూద్వీపమునకు బైట పుట్టినదియు, దేవతలకు ప్రియమును, సకల వృక్ష శ్రేష్ఠము అగు చందనమును స్వీకరింపుము. అగస్త్యా! ధర్మార్థ కామమోక్షముల నిచ్చునదియు, సౌభాగ్యా రోగ్యలక్ష్మీ వర్ధకమును పాపవినాశకమును అగు ఈ పుష్పమాలను స్వీకరింపును. ఈధూపమును గ్రహించి నాకు స్థిరభక్తిని ప్రసాదింపుము ఈ లోకమున మనోవాంఛిత ఫలములను, పరలోకమున శుభగతిని ఇమ్ము. దేవాసుర పూజితుడ వగు మునీంద్రా! నీవు సకల కామఫలప్రదాతవు. వస్త్ర - వ్రీహి-ఫల - సువర్ణములతో కూడిన. ఆర్ఘ్యము నిచ్చుచున్నాను. మహామునీ! నా మనస్సులో నున్న విషయమును అగస్త్యునకు (నీకు) తెలిపెదను. నీకు ఫలార్ఘము సమర్పించు చున్నాను. గ్రహింపుము. పిదప "అగస్త్యఏవం ... జగామ" అను వైదిక మంత్రముతో అర్ఘ్యము నీయవలెను మహావ్రత పరిపాలకురాలివి రాజపుత్రివి ముని పత్నివి దేవేశ్వరివి ఆయిన లోపాముద్రా ! నీకు నమస్కారము ఓ యశస్వినీ ! ఈ అర్ఘ్యము గ్రహింపుము. పంచరత్న-సువర్ణ-రజత-సప్తధాన్య పూర్ణమగు పాత్రను, దధి చందన సమన్విత మగు అర్ఘ్యమును అగస్త్యునకు సమర్పించవలెను. స్త్రీ శూద్రాదులు "కాశపుష్పప్రతీకాశ" ఇత్యాది పౌరాణిక మంత్రముతో అర్ఘ్యప్రదానము చేయవలెను. "మునిశ్రేష్ఠుడ డైన అగస్త్యా! దేజఃపుంజముతో ప్రకాశించు నీవు నరకమును ప్రసాదించువాడవు. నేను చేసిన పూజ గ్రహించి శాంతి పూర్వకముగా వెళ్ళుము. ఈవిధముగా పూజానంతరము అగస్త్యుని విసర్జించి అతనిని ఉద్దేశించి ఏదైన ఒక ధాన్యమును ఫలమును, రసమును పరిత్యజించవలెను. పిదప బ్రాహ్మణులకు ఘృతమిశ్రిత క్షీరాన్నము, లడ్డులు, మొదలైన వాటితో సంతర్పణము చేసి గోవస్త్ర సువర్ణాదుల దానము చేయవలెను. పిదప, ఆ కుంభము ముఖమును ఘృతమిశ్రక్షీరయుక్త పాత్రచే మూసి, దానియందు సువర్ణముంచి బ్రహ్మణునకు దానము చేయవలెను. ఈ విధముగా ఏడు రోజులు అగస్త్యార్ఘ్యము నిచ్చువారెల్లరును సర్వవాంఛితములను పొందగలరు. దీనివలన స్త్రీ సౌభాగ్యమును పుత్రులను పొందును. కన్య పతిని పొందును. రాజు రాజ్యము పొందును.

అగ్ని మహాపురాణమునందు అగస్త్యార్ఘ్యధాన మను రెండు వందల ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters