Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్ర్యధిక ద్విశతతమో7ధ్యాయః

అత నరకస్వరూపమ్‌

అగ్నిరువాచ :

పుష్పాద్యైః పూజానాద్విష్ణోర్న యాతి నరకాన్వదే | ఆయుషో7న్తే నరః ప్రాణౖరనిచ్ఛన్నపి ముచ్యతే. 1

జలమగ్నిర్విషం శస్త్రం క్షుద్వ్యాధిః పతనం గిరేః | నిమిత్తం కిం చిదాసాద్య దేహీప్రాణౖర్విముచ్యతే. 2

అన్యచ్ఛరీరమాదత్తే యాతనీయం స్వకర్మభిః | భుఙ్కై7థ పాపకృద్దుఃఖం సుఖం ధర్మాయ సఙ్గతః 3

నీయతే యమాదూతైస్తు యమం ప్రాణిభయఙ్కర్తెః | కుపదే దక్షిణద్వారి ధార్మికః పశ్చిమాదిభిః 4

యమాజ్ఞపై#్తః కిఙ్కరైస్తు పాత్యతే నరకేషు చ | స్వర్గే తు నీయతే ధర్మాద్వసిష్ఠాద్యుక్తిసంశ్రయాత్‌. 5

గోఘాతే తు మహావీచ్యాం వర్షలక్షం తు పీడ్యతే | తామ్రకుమ్భే మహాదీప్తే బ్రహ్మహా భూమిహారకః 6

మహాప్రలయకం యావద్రౌరవై పీడ్యతే శ##నైః | స్త్రీబాలవృద్ధహన్తా తు యావదిన్ద్రాశ్చతుర్దశ. 7

మహారౌరవకే రౌద్రే గృహక్షేత్రాదిదీపకః | దహ్యతే కల్పమేకం చ చౌరస్తామిస్రకే పతేత్‌. 8

నైకకల్పం తు శూలాద్యైర్బిద్యతే యమకిఙ్కరైః | మహాతామిస్రకే సర్పజలౌకాద్యైశ్చ పీడ్యతే. 9

యావద్భూమిర్మాతృహాద్యా హ్యసిపత్రవనే7సిఖిః | నైకకల్పం తు నరకే కరమ్భవాలుకాసు. చ 10

యేన దగ్దో జనస్తత్ర దహ్యతే వాసుకాదిభిః | కాకోలే కృమివిష్ఠాశీ ఏకాకీ మిష్టభోజనః 11

కోట్టలే మూత్రరక్తాశీ పఞ్చయజ్ఞక్రియోజ్ఘితః | సుదుర్గన్ధే రక్తభోజీ భ##వేచ్చాభక్ష్యభక్షకః. 12

అగ్నిదేవుడు పలికెను; వసిష్ఠా! ఇపుడు నరకములను గూర్చి చెప్పెదను. పుష్పాద్యుపచారములతో శ్రీమహావిష్ణువును పూజించువారికి నరకప్రాప్తి ఉండదు. ఆయుర్దాయము పూర్తి యైనపిమ్మట వలదన్నను మానవుడు మరణించి తీరును. దేహధారి యైన జీవుడు అగ్ని, జలము, విషము, శస్త్రఘాతము, ఆకలి, వ్యాధి, పర్వతమునుండి పడుట మొదలైన ఏదియో యొక నిమిత్తముచే ప్రాణములు విడచును. స్వకర్మానుసారముగ యాతనలు అనుభవించుటకై మరొక శరీరమును గ్రహించును. పాపకర్మ చేసినవాడు దుఃఖమును అనుభవించును. పుణ్యకర్మచేసినవాడు సుఖ మనుభవించును. మరణానంతరము యమదూతలు వచ్చి పాపాత్ముని దుర్గమార్గము ద్వారా యమపురిలోనికి దక్షిణమార్గముద్వారా తీసికొని పోయి యమధర్మరాజు ఎదుట నిలుపుదురు. ఆ యమదూతలు చాల భయంకరముగ నుందురు. ధర్మాత్ములను మాత్రము వశ్చిమాదిద్వారములద్వారా తీసికొనిపోవుదురు. యముని ఆజ్ఞ ప్రకారము పాపాత్ములు నరకమునందు పడవేయబడుదురు. వసిష్ఠాదిఋషులు బోధించిన ధర్మమును ఆచరించువారిని స్వర్గమునకు తీసికొనిపోవుదురు. గోహత్య చేసినవాడు 'మహావీచి' నరకమునందు ఒక లక్ష సంవత్సరములు బాధ లనుభవించును. బ్రహ్మహత్యచేసినవారు చాల ఉష్ణమైన 'తామ్రకుంభ' నరకమునందు పడద్రోయబడుదురు. భూమిని అపహరించిన పాపాత్మునకు రౌరవాదినరకమునందు మహాప్రలయమువరకును మెల్ల మెల్లగ దుస్సహ మైన పీడ కల్గింపబడును. స్త్రీ - బాలృ-వృద్ధులను చంపిన పాపాత్ములు పదునలుగురు ఇంద్రుల రాజ్యము పూర్తియగునంత కాలము మహారౌరవ మను రౌద్రమైన నరకమునందు బాధ అనుభవింతురు. ఇతరుల ఇళ్లను, పొలములను తగులబెట్టిన వారిని ఒక కల్పమువరకు మహారౌరవనరకమునందు కాల్చివేయుదురు. దొంగతనము చేయవారు. తామిస్రమను నరకమునందు బాధ లనుభవింతురు. పిదప యముని అనుచరులు వానిని బల్లెములతో పొడుచుచుందురు. 'మహాతామిస్ర' నరకమున సర్పములచేతను జలగలచేతను పీడింతురు. మాతృహత్యాది పాపములు చేసినవారిని అసిపత్రవనమను నరకమునందు పడవేయుదురు. అచటవాని అవయములను కత్తులతో, ఈ భూమి ఉన్నంతవరకును, ఛేదించుచుందురు. ఈ లోకమునందలి ఇతర ప్రాణుల హృదయములు కాల్చినవారిని అనేకకల్పముల వరకును 'కరంభ వాలుక' అను నరకమునందు, వేడిగా నున్న ఇసుకపై వేయించెదరు. ఇతరులకు పెట్టకుండ మిష్టాన్నమును తిన్నవాడు 'కాకోల' మను నరకమునందు పురుగులను, రెట్టలను తినుచుండును. పంచమహాయజ్ఞములను, నిత్యకర్మలను త్యజించువాడు కుట్టల మను నరకమునందు మూత్రమును, రక్తమును త్రాగుచుండును. అభక్ష్యవస్తువులు భక్షించువాడు మహాదుర్గంధమయమగు నరకములో పడి రక్తమును ఆహారముగ గొనును.

తైలపాకే తు తిలవత్పీడ్యతే పరపీడకః | తైలపాకే తు పచ్యేత శరణాగతఘాతకః 13

నిరుచ్ఛ్వాసే దాననాశీ రసవిక్రయకో7ధ్వరీ | నామ్నా వజ్రకవాటేన మహాపాతే తదానృతీ. 14

ఇతరులకు కష్టము కలిగించువాడు తైలపాకనరకమునందు తిలల వలె నలుగగొట్టబడును. శరణాగతుని చంపినవాడు గూడ తైలపాక నరకమునందు పక్వము చేయబడును. యజ్ఞమునకై ఏదైన ఒక వస్తువు నిచ్చెద నని చెప్పి ఇవ్వనివాడు 'నిరుచ్ఛ్వాస' నరకమునందును, రసవిక్రయము చేయువాడు 'వజ్రకటాహ' నరకమునందును, అసత్యములాడువాడు 'మహాపాత' నరకమునందు పడవేయబడును.

మహాజచ్వాలే పాపబుద్ధిః క్రకచే7గమ్యగామినః | సంకరీ గుడపాకే చ ప్రతుదేత్పరమర్మనుత్‌. 15

క్షారహ్రదే ప్రాణిహన్తా క్షురధారే చ భూమిహృత్‌ | అమ్బరీషే గోస్వర్ణహృద్ద్రుమచ్ఛిద్వజ్రశస్త్రకే. 16

మధుహర్తా పరీతాపే కాలసూత్రే పరార్థహృత్‌ | కశ్మలే7త్యన్తమాంసాశీ ఉగ్రగన్ధే హ్యపిణ్డదః.17

దుర్దరే తూత్కోచభక్షీ బన్దిగ్రాహరతాశ్చ యే | మఞ్జూషే నరకే7ప్రతిష్ఠే శ్రుతినిన్దకః. 18

పూతివక్త్రే కూటసాక్షీ పరిలుణ్ఠద్ధనాపహా | బాలస్త్రీవృద్ధఘాతీ చ కరాలే బ్రాహ్మణార్తికృత్‌. 19

విలేపే మద్యపో విప్రో మహాతామ్రే తు భేదినః | తథాక్రమ్య పరదారాన్‌ జ్వలన్తీమాయసీం శిలామ్‌. 20

శాల్మలాగ్రే తమాలిఙ్గేన్నారీ బహునరంగమా | అస్ఫోటే జిహ్వోద్దరణం స్త్రీక్షణాన్నేత్రభేదనమ్‌. 21

అఙ్గారరాశౌ క్షిప్యన్తే మాతా పుత్య్రాదిగామినః | చౌరాః క్షారైశ్చ భిద్యన్తే స్వమాంసాశీ చ మాంసభుక్‌. 22

మాసోపవాసకర్తా వై న యాతి నరకం నరః | ఏకాదశీవ్రతకరో భీష్మపఞ్చక సద్ర్వతీ. 23

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నరకస్వరూపవర్ణనం నామ త్య్రధికద్విశతతమో7ధ్యాయః.

పాపాత్ముడు 'మహాజ్వాల' నరకమునందును, అగమ్యాగమనము చేసినవాడు 'క్రకచము' నందును, వర్ణసంకర సంతానోత్పత్తి చేసినవాడు ''గుడపాకము'' నందును, ఇతరుల మర్మస్థానములందు బాధకలిగించినవాడు 'ప్రతుదము' నందును, ణిహింస చేయువాడు 'క్షారహ్రదము' నందును, భూమి అపహరించివాడు 'క్షురధారా' నరకమునందును, గోస్వర్ణాపహారి 'అంబరీషము' నందును. వృక్షములను భేదించువాడు ''వజ్రశస్త్రము'' మధువు దొంగిలించినవాడు 'పరీతాపము' నందును, ఇతరుల సొత్తు అపహరించిన వాడు 'కాలసూత్రము' నందును అధినముగా మాంసమును తినువాడు ''కశ్మలము'' నందును, పితరులకు పిండప్రదానము చేయనివాడు ''ఉగ్రగంధము'' నందును యమభటులచే పడద్రోయబడును. లంచము తీసికొను వానిని ''దుర్ధుర'' నరకమునందును, నిరపరాధులను బంధించిన వానిని ''లోహమయమంజూష'' యను నరకమందును వేదనిందకుని ''అప్రతిష్టము'' నందును అబద్ధపు సాక్ష్య మిచ్చు వానిని ''పూతివక్త్రము'' నందును, ధనము నపహరించిన వానిని ''పరిలుంఠము'' నందును, బాలస్త్రీ, వృద్ధులను చంపిన వానిని, బ్రాహ్మణపీడకుని ''కరాలము' నందును, మద్యపానము చేయు బ్రాహ్మణుని ''విలేపము'' నందును, మిత్రులందు భేదభావము కలిగించు వానిని ''మహాప్రేతము'' నందును, పడద్రోయుదురు. పరస్త్రీగామి యగు పురుషుడును, అనేక పురుషగామిని యగు స్త్రీయు ''శాల్మలము'' అను నారకమునందు కాలుచున్న లోహము ఆకారములో ఉన్న ఆ ప్రియురాలిని, లేదా ప్రియుని ఆలింగనము చేసికొనవలసివచ్చును. చాడీలు చెప్పువాని నాలుకను లాగిపారవేయుదురు. పరస్త్రీలను కదృష్టితో చూచిన వాని కండ్లు పీకి వేయుదురు. మాతా- పుత్రీగామిని కణకణలాడు చున్న నిప్పులపై పడద్రోయుదురు. చోరులనుచురికతో ఖేదింతురు. మాంసభక్షణము చేయు నరపిశాచులకు వారి మాంసమే కోసి తినింపితురు. మాసోపవాసము గాని, ఏకదాశీ వ్రతముగాని, భీష్మపంచవ్రతము గాని చేయువాడు నరకములను వెళ్ళడు.

అగ్ని మహాపురాణమునందు నరకస్వరూపవర్ణన మను రెండువందల మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters