Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథః వింశోధ్యాయః 20

పునః జగత్సర్గ వర్ణనమ్‌

అగ్ని రువాచ :

ప్రథమో మహతః సర్గో విజ్ఞేయో బ్రహ్మణస్తున ః | తన్మాత్రాణాం ద్వితీయస్తు భూతసర్గో హి స స్మృతః. 1

మొదటిది మహత్తు యొక్క సృష్టి అది బ్రహ్మ యొక్క సృష్టిగా తెలియదగినది. తన్మాత్రల సృష్టి రెండవది. అది భూత సర్గము (సృష్టి) అని చెప్పబడును.

వైకారికస్తృతీయస్తు సర్గ ఐన్ధ్రియకః స్కృతః | ఇత్యేష ప్రాకృతః సర్గః సంభూతో బుద్దిపూర్వకః. 2

మూడవ సృష్టి వైకారికము. అదియే ఐంద్రియికసృష్టి యని చెప్పబడుచున్నది. ఈ విధముగా బుద్ధి (మహత్తత్త్వము)తో ప్రారంభించిన సృష్టి ప్రాకృత సృష్టి

ముఖ్యః సర్గశ్చతోర్థస్తు ముఖ్యా వై స్థావరాః స్మృతాః |

తిర్యకోస్రోతాస్తు యః ప్రోక్తసై#్తర్యగ్యోన్యస్తతః స్మృతః. 3

నాల్గవది ముఖ్యసర్గము. స్థావరములు ముఖ్మములని చెప్పబడుచున్నవి. తిర్యక్ర్సోతస్సు అని చెప్పబడిన సృష్టికి ''తైర్యగ్యోన్యము'' (తిర్యగ్జంతువుల సృష్టి) అని పేరు.

తథోర్ధ్వస్రోతసాం షష్ఠో దేవసర్గస్తు స స్మృతః |

తతో7ర్వక్ర్సోతసాం సర్గః సప్తమః స తు మానుషః. 4

ఊర్ధ్వస్రోతస్సుల సృష్టి ఆరవిది ఆదియే దేవనర్గము పిమ్మట అర్వాక్ర్సోతసుల సృష్టి అది ఏడవదైన మానుష సర్గము

అష్టమో7నుగ్రహః సర్గః సాత్త్వికస్తామసశ్చ యః |

సఞ్చైతే వై కృతాః సర్గాః ప్రాకృతాశ్చ త్రయః స్మృతాః. 5

ఎనిమిదవ సర్గము అనుగ్రహ సరము. సాత్త్వికము, తామసము అని అది రెండు విధములు. ఈ చివరి ఐదును వైక్బత నర్గముల, మొదటి మూడును కృతసర్గములు,

ప్రాకృతో వైకృతశ్చైవ కౌమారొ నవమస్తథా | బ్రహ్మణో నవ సగ్గాస్తు జగతో మూలహేతవః. 6

ప్రాకృతసర్గములు మూడును, వైకృతసర్గములు ఐదును, తొమ్మిదవ దైన కౌమారసర్గము, బ్రహ్మ చేసిన తొమ్మిది సర్గములును జగత్తు యొక్క మూలకాణములు.

నిత్యో నైమిత్తకః సర్గస్త్రిధా ప్రకథితో జనైః | ప్రాకృతో దైనన్దినః స్యాదాన్తరప్రలయాదను. 7

జాయతే యత్రాసుదినం నిత్యసర్గో హి స స్మృతః

సృష్టి నిత్యము, నైమిత్తికము ప్రాకృతము అని రెండు విధములైనిదిగా కొందరిచే చెప్పబడినది. అవాంతర ప్రళయముచే నిత్యము జరుగునది నిత్యసర్గము, అది దైనందిన సర్గము ప్రతి దినము నందును జరుగు సర్గము గాన ఇది నిత్యము.

ఖ్యాత్యాద్యా దక్షకన్యాస్తు భృగ్వాద్యా ఉపయేమీరే. 8

దేవౌ ధాతా విధాతారౌ భృగోః ఖ్యాతిరసూయత | శ్రియంచ పత్నీ విష్ణౌర్యా స్తుతా శ##క్రేణ వృద్దయే. 9

భృగువు మొదలైనవారు ఖ్యాతి మొదలగు దక్ష కన్యలను వివాహ మాడిరి. ఖ్యాతి భృగువు వలన ధాత, విధాత అను దేవతలను లక్ష్మిని కనెను. విష్ణుపత్నియైన ఈ లక్ష్మినీ ఇంద్రుడు వృద్ధికొరకై స్తుతించెను.

ధాతుర్విధాతుర్ధ్వౌ పుత్రౌ క్రమాత్ర్పాణో మృకణ్డుకః | మార్కణ్డయో మృకణ్డోశ్చ జజ్ఞే వేదశిరాస్తతః 10

పౌర్ణమాసశ్చ సమూత్యాం మరీచేరభవత్సుతః | స్మృత్యామఙ్గిరసః పుత్రాః సినీవాలీ కుహూస్తథా. 11

ధాతకు ప్రాణుడు, విధాతకు మృకండుడు అను పుత్రుడు జనించిరి. మృకండునకు మార్కండేయుడును. ఆతనికి వేదశిదస్సు జనించిరి.

రాకా బానుమతీశ్చాత్రే రనసూయాప్యజీజనత్‌ | సోమం దుర్వాసనం పుత్రం దత్తాత్రేయం చ యోగినమ్‌. 12

అంగిరసుని వలన స్మృతియందు సినీవాలి, కుహ, రాక, అనుమతి అను కుమార్తెలు పుట్టిరి. అనసూయ అత్రి వలన సోముని, దుర్వాసుని, యోగియైన దత్తాత్రేయుని కనెను.

ప్రీత్యాం పులస్త్యభార్యాయాం దత్తోలిస్తత్సుతో7భవత్‌ |

క్షిమాయాం పులహాజ్జాతా సహిష్ణుక్రమపాదికాః. 13

పులస్త్యుని భార్యయైన ప్రీతికి దత్తోలియను కుమారుడు పట్టెను. క్షమకు పులహుని వలన సహిష్ణువు, క్రముడు, పాదికుడు అను పుత్రులు జనించిరి.

సన్నత్యాం చ క్రతోరాసన్వాలఖిల్యా మహౌజనః | అఙ్గుష్ఠపర్వమాత్రాస్తే మే హి షష్టి సహస్రిణః 14

క్రతువునకు సన్నతియందు గొప్ప తేజస్సు గలవారును, బొటన వేలు కణుపు ప్రమాణము కలవారును. అగు ఆరవైవేలమంది వాలఖిల్యులు పుట్టిరి.

ఉర్జాయాం చ వసిష్ఠాచ్చ రాజా గాత్రోర్ధ్వబాహుకౌ | సవనశ్చాలఘుః శుక్రసుతపాః సప్త చర్షయః .15

సావక ః పవమానో7భూచ్ఛుచిః స్వాహిగ్నిజో7భవత్‌ |

అగ్ని ష్వాత్తా బర్హిషదో7నగ్నయః సాగ్నయో హ్యజత్‌. 16

వసిష్ఠుని వలన ఉర్జయందు రాజు, గా తుడు, ఊర్ధ్వబాహుడు సవనుడు, అలఘుడు, శక్రుడు, సుతపుడు అను ఏడుగురు బుషులు జనించిరి. స్వాహా - అగ్నులకు పావకుడు, పవమానుడు, శుచి అను కుమారులు పుట్టిరి. అజునినుండి అగ్నిష్వాత్తుడు, బర్హిషత్‌, అనగ్ని, నాగ్ని అను కుమరులు జనించిరి.

పితృభ్యశ్చ స్వధాయాం చ మేనా వై ధారిణీ సుతే | హింసా భార్యా త్వధ్మస్యతయోర్జజ్ఞే తథానృతమ్‌ 17

పితృదేవతలకు స్వధయందు మేన, వైధారిణి అను కుమార్తెలు పట్టిరి. అధర్ముని భార్య హింస. వారిరువురికిని అనృతము పుట్టెను.

కన్యా చ నికృతిస్తాభ్యాం భయం నరకమేవ చ | మాయా చ వేదనా చైవ మిథునం త్విదమ్‌తయోః 18

తయోర్జజ్ఞే7థ వై మాయా మృత్యుం భూతాపహరణం |

వేదనా చ సుతం చాపి దుఃఖ జజ్ఞే7థ దౌరవాత్‌ 19

అధర్మహింసలకు నికృతి అను కన్యయు పుట్టినది. ఈ అనృతము నికృతియు మిథునమయ్యెను. వారివలన భయము, నరకము పుట్టెను వారికి వరసగా మాయయు, వేదనయు భార్యలైరి. వారిలో మాయ భూతములను నశింపచేయు మృత్యువును కనెను. వేదన నరకము వలన దుఃఖమనే కుమారుని కనెను.

మృత్యోర్వాధిజరాశోకతృష్ణాక్రోధిశ్చ జజ్ఞిరే | బ్రహ్మణశ్చ రుధఞాతో రోదనాద్రుద్రనామకః 20

భవం సర్వమీధీశానాం తథా పశుపతిం ద్విజ | భీమముగ్రం మహాదేవమువాచ స పితాహః. 21

మృత్యువునకు వ్యాధి, జర శోకము, తృష్ణ, క్రోధము సంతానముగా జనించిరి బ్రహ్మదేవుని నుంచి రోదించుచు (ఏడ్చుచు) పుట్టుటచే రుద్రుడను పేరు గల కుమారుడు పెట్టెను. ఆనతికే పితామహుడు --భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవడు అను పేర్లు పెట్టెను.

దక్షకోపాచ్చ తద్భార్యా దేహం తత్యాజ సా సతీ | హిమవద్దుహితా భూత్వా పత్నీ శవ్ఖూెరభూత్పునః. 22

ఆతని భార్యయైన సతీదేవి దక్షునిపై కోపముచే దేహము విడచి, హిమవంతుని కుమార్తెగా జనించి మరల ఆతని (రుద్రుని) భార్య ఆయెను.

ఋషిభ్యో నారదాద్యుక్తాః పూజాః స్నానాదిపూర్వికాః |

స్వాయమ్భువాద్యాస్తాః కృత్వా విష్ణ్వాదేర్భుక్తిముక్తిదాః. 23

స్వాయంభువాదులు నారదాదులచ బుషులకు చెప్పబడినవియు, భుక్తి ముక్తి ప్రదములను అగు విష్ణ్వాదులకు చేయదగిని స్నానాది పూజలను చేసి (చరితార్థులైరి)

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే జగత్సర్గవర్ణనం నామ వింశతితమో7ధ్యయః

అగ్ని మహాపురాణమునందు జగత్సర్గవర్ణన మను ఇరువదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters