Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ నవత్యుత్తర శతతమో7ధ్యాయః

అథ అఖణ్డద్వాదశీవ్రతమ్‌

అగ్నిరువాచ :

అఖణ్డద్వాదశీం వక్ష్యే వ్రతసంపూర్ణతాకృతమ్‌ | మార్గశీర్షే సితే విష్ణుం ద్వాదశ్యాం సముపోషితః. 1

పఞ్చ గవ్యజలే స్నాతో యజేత్తత్ర్పాశనో వ్రతీ |

యవవ్రీహియుతం పాత్రం ద్వాదశ్యాం హి ద్విజేర్పయేత్‌. 2

సప్తజన్మని యత్కిఞ్చిన్మయా ఖణ్డం వ్రతం కృతమ్‌ | భగవం స్త్వత్ర్పసాదేన తదఖణ్డమిహాస్తు మే. 3

యథా ఖణ్డం జగత్సర్వం త్వమేవ పురుషోత్తమ | తథాఖిలాన్యఖణ్డాని వ్రతాని మమ సన్తు వై. 4

ఏవమేవానుమాసం చ చాతుర్మాస్యో విధిః స్మృతః | అన్యచ్చైత్రాదిమాసేషు సక్తుపాత్రాణి చార్పయేత్‌. 5

శ్రావణాదిషు చారభ్యకార్తికాన్తేషు పారణమ్‌ | సప్తజన్మసు వైకల్యం వ్రతానాం సఫలం కృతే. 6

ఆయురారోగ్యసౌభాగ్య రాజ్యభోగాది మాప్నుయాత్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అఖణ్డ ద్వాదశీ వ్రతం నామ నవత్యధిక శతతమోధ్యాయః.

అగ్ని పలికెను: ఇపుడు సమస్త వ్రతములకు సంపూర్ణత్వమును సంపాదించు అఖండద్వాదశీ వ్రతమును గూర్చి చెప్పెదను. మార్గశీర్షశుక్లద్వాదశినాడు ఉపవాసము చేసి శ్రీమహావిష్ణువును పూజించవలెను. పంచగవ్యమిశ్ర జలముతో స్నానము చేసి దానితోనే పారణము చేయవలెను. శ్రీమహావిష్ణువు ఎదుట ఈ విధముగా ప్రార్థన చేయవలెను- ''భగవంతుడా! ఏడు జన్మలనుండి నేను చేసిన వ్రతాలలో ఏదైన ఖండ మైనచో అది అఖండ ఫలదాయక మగు నట్లు అను గ్రహించుము. పురుషోత్తమా! నీవు ఈ అఖండచరాచర విశ్వరూపమున ఉన్నట్లు నా వ్రతము కూడ అఖండ మగుగాక'' ఈ విధముగ నాలుగు మాసములు ఈ వ్రతము చేయవలెను. చైత్రమునుండి అషాఢము వరకును చేసిన పక్షమున పేలాల పిండి నింపిన పాత్రము దానము చేయవలెను. శ్రావణమునందు ప్రారంభించి కార్తికమునందు కూడ సమాప్తము చేయవచ్చును. ఈ విధముగా అఖండద్వాదశీవ్రతము చేయుటచే ఏడుజన్మలలో ఖండితము లైపోయిన (అసంపూర్ణములైన) వ్రతములు సంపూర్ణఫలప్రదము లగును. దీనిని చేసినవానికి దీర్ఘాయురారోగ్య - సౌభాగ్య - రాజ్యాది వివిధభోగములు లభించును.

అగ్నిమహాపురాణమునందు అఖండద్వాదశీవ్రతవర్ణన మను నూటతొంబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters