Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోననవత్యుత్తర శతతమోధ్యాయః.

అథ శ్రవణద్వాదశీవ్రతమ్‌.

అగ్నిరువాచ :

శ్రవణద్వాదశీం వక్ష్యే మాసి భాద్రపదే సితే | శ్రవణన యుతా శ్రేష్ఠా మహతీ సా హ్యుపోషితా. 1

సఙ్గమే సరితాం స్నానాచ్ఛ్రవణద్వాదశీఫలమ్‌ | బుధశ్రవణసంయుక్తా దానాదౌ సుమహాఫలా. 2

నిషిద్ధమపి కర్తవ్యం త్రయోదశ్యాం తు పారణమ్‌ | ద్వాదశ్యాం చ నిరాహారో వామనం పూజయామ్యహమ్‌.

ఉదకుమ్భే స్వర్ణమయం త్రయోదశ్యాం తు పారణమ్‌ | ఆవాహయామ్యహం విష్ణుం వామనం శఙ్ఖచక్రిణమ్‌.

సితవస్త్రయుగచ్ఛన్నౌ ఘటౌ సచ్ఛత్రపాదుకౌ | స్నాపయామి జలైః శుద్ధైర్విషుణం పఞ్చామృతాదిభిః. 5

ఛత్రదణ్డధరం విష్ణుం వామనాయ నమో నమః | అర్ఘ్యం దదామి దేవేశః అర్ఘ్యార్హాద్యైః సదార్చితః. 6

భుక్తిముక్తి ప్రజాకీర్తి సరైశ్వర్యయుతం కురు | వామనాయ నమో గన్ధంహో మోనేనాష్టకం శతమ్‌. 7

ఓం నమో వాసుదేవాయ శిరః సంపూజయేద్ధరేః | శ్రీధరాయ ముఖం తద్వత్కణ్ఠ కృష్ణాయ వై నమః. 8

నమః శ్రీపతయే వక్షో భుజౌ సర్వాస్త్రధారిణ | వ్యాపకాయ నమో నాభిం వామనాయ నమః కటిమ్‌. 9

త్రైలోక్యజననాయేతి మేఢ్రం జఙ్ఘే యజేద్ధరేః | సర్వాధిపతయే పాదౌ విష్ణోః సర్వాత్మనే నమః. 10

ఘృతపక్వం చ నైవేద్యం దద్యాద్దధ్యోదనైర్ఘటాన్‌ |

రాత్రౌ చ జాగరం కృత్వా ప్రాతః స్నాత్వా చ సఙ్గమే. 11

గన్ధపుష్పాదిభిః పూజ్య వదేత్పుష్పాఞ్జలి స్త్విదమ్‌ | నమో నమస్తే గోవిన్ద బుధశ్రవణసంజ్ఞిత. 12

అఫ°ఘసంక్షయం కృత్వా సర్వసౌఖ్యప్రదో భవ | ప్రీయతాం దేవదేవేశ మమ నిత్యం జనార్దన. 13

వామనో బుద్ధిదో దాతా ద్రవ్యస్థో వామనః స్వయమ్‌ | వామనః ప్రతిగృహ్ణాతి వామనో మే దదాతి చ. 14

ద్రవ్యస్థో వామనో నిత్యం వామనాయ నమో నమః |

ప్రదత్తదక్షిణో విప్రాన్‌ సంభోజ్యాన్నం స్వయం చరేత్‌. 15

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శ్రవణద్వాదశీవ్రతం నామ ఏకోననవత్యధిక శతతమోధ్యాయః.

(అ) 62

అగ్ని దేవుడు చెప్పెను :- ఇప్పుడు భాద్రపదశుక్లపక్షమున చేయబడు ''శ్రవణద్వాదశీ'' వ్రతమును గూర్చి చెప్పెదను. శ్రవణనక్షత్రయుక్త మైన చో ఈ ద్వాదశి శ్రేష్ఠ మైనది. ఉపవాసము చేసినచో గొప్ప ఫలము నిచ్చును. శ్రవణ ద్వాదశినాడు నదీసంగమస్నానము విశేశఫలప్రదము. బుధవార శ్రవణ నక్షత్రములు కలిసిన ద్వాదశినాడు చేయు దానాదులు గొప్పఫలముల నిచ్చును. త్రయోదశినాడు నిషిద్ధ మైనను ఈ వ్రతముయొక్క పారణము త్రయోదశినాడు చేయవలెను.'' ''నేను ద్వాదశినాడు ఉపవాస ముండి జలపూర్ణ కలశము పైనున్న సువర్ణనిర్మిత వామనమూర్తిని పూజించి వ్రతపారణము త్రయోదశినాడు చేసెదను'' అని సంకల్పించవలెను. ''రెండు శ్వేతవస్త్రములు ధరించినవాడును, ఛత్రపాదుకాధారియు, శంఖ చక్రములు ధరించినవాడును అగు వామనుని కలశముపై ఆవాహనము చేయుచున్నాను.'' వామనునకు నమస్కారము. ''అర్ఘ్యమునకు తగువారిచేతను, ఇతరుల చేతను పూజితుడ వగు ఓదేవేశా! నీకు అర్ఘ్యము సమర్పించుచున్నాను. నాకు భోగ - మోక్ష - సంతాన - యశః - పరమైశ్వర్యాదుల నిమ్ము'' 'వామనాయ నమః' అను మంత్రముతో గంధద్రవ్యములు సమర్పించి ఈ మంత్రముతోనే నూట ఎనిమిది హోమములు చేయవలెను. ఈ క్రింది విధముగ సర్వాంగపూజ చేయవలెను. ఓం నమో వాసుదేవాయ శిరః పూజయామి. శ్రీధరాయనమః ముఖం పూజయామి. కృష్ణాయ నమః కణ్ఠంపూజయామి. శ్రీపతయే నమః వక్షస్థలం పూజయామి. సర్వాస్త్రధారిణ నమః భుజౌ పూజయామి. వ్యాపకాయనమః నాభిం పూజయామి. వామనామ నమః కటిం పూజయామి త్రైలోక్యజననాయ నమః మేఢ్రం పూజయామి. సర్వాధిపతయే నమః జఙ్ఘే పూజయామి సర్వాత్మనేనమః పాదౌ పూజయామి''. పిదప వామనునకు ఘృతపక్వ పదార్థముల నైవేద్యము దధ్యోదనపూర్ణ పాత్రమును సమర్పించవలెను. రాత్రియందు జాగరము చేసి ప్రాతః కాలమున సంగమమునందు స్నానము చేయవలెను. పిదప గంధపుష్పాదులతో పూజించి ఈ విధముగా ప్రార్థించుచు పుష్పాంజలి సమర్పించవలెను - ''బుధుడు, శ్రవణుడు అను పేర్లు గల గోవిందా! నీకు నమస్కారము, నమస్కారము. నాపాపములన్నీ తొలగించి సమస్త సౌఖ్యములను ఇమ్ము. దేవదేవేశ్వరా! జనార్దనా! నే నిచ్చిన ఈ పుష్పాంజలిచే సర్వదా ప్రసన్నుడవు కమ్ము.'' పిదప పూజాద్రవ్యము లన్నియు ఈ క్రింది విధముగా చెప్పుచు బ్రాహ్మణునకు దానము చేయవలెను. ''వామనుడే బుద్ధి నిచ్చువాడు. వామనుడే దాత. ఈ ద్రవ్యములలో ఉన్నవాడు వామనుడే. వామనుడే దీనిని గ్రహించుచున్నాడు. వామనుడే ఇచ్చుచున్నాడు. వామనుడు అన్ని ద్రవ్యములందును ఉన్నాడు. వామనరూపుడగు విష్ణువునకు నమస్కారము.'' పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను భోజనము చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు శ్రవణద్వాదశీవ్రత మను నూట ఎనుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters