Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రిసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః

అథ పునః ప్రాయశ్చిత్తాని

అగ్నిరువాచ :

ప్రాయశ్చిత్తం బ్రహ్మణోక్తం వక్ష్యే పాపోపశాన్తిదమ్‌ |

స్యాత్ప్రాణవియోగఫలో వ్యాపారో హననం స్మృతమ్‌. 1

రాగద్వేషాత్ప్రమాదాచ్చ స్వతః పరత ఏవ వా | బ్రాహ్మణం ఘాతయేద్యస్తు స భ##వేద్ర్బహ్మఘాతకః. 2

బహూనామేకకార్యాణాం సర్వేషాం శస్త్రధారిణామ్‌ | యద్యేకో ఘాతకస్తత్ర సర్వేతే ఘాతకాః స్మృతాః. 3

ఆక్రోశితస్తాడితో వా ధనైర్వాపరిపీడితః | యముద్దిశ్య త్యజేత్ప్రాణాం స్తమాహుర్బ్రహ్మఘాతకమ్‌. 4

ఔషధాద్యుపకారే తు న పాపం స్యాత్కృతే మృతే |

పుత్రం శిష్యం తథా భార్యాం శాసనే న మృతేహ్యఘమ్‌. 5

దేశం కాలం వయః శక్తిం పాపం చావేక్ష్య యత్నతః |

ప్రాయశ్చిత్తం ప్రకల్ప్యం స్యాద్యత్ర చోక్తా న నిష్కృతిః. 6

గవార్థే బ్రాహ్మాణార్థే వా సద్యః ప్రాణాన్పరిత్యజేత్‌ |

ప్రాస్యేదాత్మానమగ్నౌ వా ముచ్యతే బ్రహ్మహత్యయా. 7

శిరఃకపాలీ ధ్వజవాన్‌ భైక్షాశీ కర్మ వేదయన్‌ | బ్రహ్మహా ద్వాదశాబ్దాని మితభుక్‌ శుద్ధిమాప్నుయాత్‌. 8

షడ్బిర్వర్షైః శుద్దచారీ బ్రహ్మహా పూయతే నరః | విహితం యదకామానాం కామాత్తు ద్విగుణం స్మృతమ్‌.

ప్రాయశ్చిత్తం ప్రవృత్తస్య వధేస్యాత్తు త్రివార్షికమ్‌ |

బ్రహ్మఘ్ని క్షత్రే ద్విగుణం విట్ఛూద్రే ద్విగుణం త్రిధా. 10

అన్యత్ర విప్రే సకలం పాదోనం క్షత్రియే మతమ్‌ | వైశ్యే7ర్థపాదం శూద్రేస్యాద్వృద్దస్త్రీబాలరోగిషు. 11

తురీయో బ్రహ్మహత్యాయాః క్షత్రియస్య వధే స్మృతమ్‌ |

వైశ్యే7ష్టమాంశో వృత్తస్థే శూద్రే జ్ఞేయస్తు షోడశః. 12

పాపములను నశింపచేయు ప్రాయశ్చిత్తమును బ్రహ్మ చెప్పిన విధముగ చెప్పెదను. ప్రాణములను తీయు పని 'హననము' రాగమువలన గాని, ద్వేషము వలన గాని, ప్రమాదము వలన గాని, ఒక బ్రహ్మణుని, తానే గాని, పరప్రేరణచే గాని చంపినవాడు బ్రహ్మఘాతకుడు. ఒకే కార్యమును చేయుటకై ఉద్యుక్తులై చాలమంది శస్త్రములు ధరించి వచ్చి నపుడు వారిలో ఒక్కడే బ్రాహ్మణుని చంపినను, వారందరు బ్రహ్మహత్య చేసినట్లే. తిట్టబడి గాని, థనాపహారాదులచే పీడింపబడి గాని ఒక బ్రాహ్మణుడు ఎవని మూలముగా తన ప్రాణములు కోల్పోవునో అతడు బ్రహ్మహత్య చేసినవాడు. ఔషధాద్యుపకారము చేసి నపుడు మరణించినను బ్రహ్మహత్యాదోషము లేదు. పుత్రుని శిష్యుని, భార్యను శాసించు నపుడువారు మృతులైనను పాపము లేదు. దేశమును, వయస్సును, శక్తిని, పాపమును బాగుగ పరీక్షించి, మరొక విమోచనోపాయము లేనపుడు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. బ్రహ్మహత్య చేసినవాడు మరొక బ్రాహ్మణుని కాపాడుటకు గాని తన ప్రాణములు విడచినచో లేదా అగ్నిలో దుమికినచో ఆతని బ్రహ్మహత్యాపాపము తొలగును. శిరస్సుకపాలమును గుర్తుగా ధరించి, తాను చేసిన పాపము చెప్పుచు, భిక్షాన్నము మితముగా తినుచు పండ్రెండు సంవత్సరములు గడపినచో శుద్ధిపొందును పరిశుద్ధమైన నడవడిక కలవాడై ప్రవర్తించు వాడు బ్రహ్మహత్య దోషమునుండి ఆరు సంవత్సరములలో విముక్తుడగును. కావలె నని ఈ పాపము చేసినవారు ఇష్టములేకుండ చేసినవారికి చెప్పిన ప్రాయశ్చిత్తమునకు రెట్టింపు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. బ్రహ్మహత్య చేయుటకై ఉద్యమించినవానికి మూడు సంవత్సరములు ప్రాయశ్చిత్తము. బ్రహ్మహత్య చేసిన క్షత్రియునకు రెట్టింపు ప్రాయశ్చిత్తము, వైశ్యునకు రెండు రెట్లు, శూద్రునకు మూడు రెట్లు. ఇతర పాపముల విషయమున బ్రహ్మణునకు పూర్తిప్రాయశ్చిత్తము, క్షత్రియునకు మూడు పాదములు, వైశ్యునకు, స్త్రీ-వృద్ధ-బాల రోగులకు ఒక పాదము ప్రాయశ్చిత్తము. క్షత్రియవధ చేసినవారికి బ్రహ్మహత్యాప్రాయశ్చిత్తములో నాల్గవ వంతు ప్రాయశ్చిత్తము; వైశ్యహత్యయందు ఎనిమిదవ వంతు; సదాచారవంతు డగు శూద్రుని హత్యయందు పదహారవ వంతు.

అప్రదుష్టాం స్త్రియం హత్వా శూద్రహత్యావ్రతం చరేత్‌ |

పఞ్చగవ్యం పిబేద్గోఘ్నో మాసమాసీత సంయతః. 13

గోష్ఠేశయో గోనుగామీ గోప్రదానేన శుధ్యతి | కృచ్ఛ్రం చైవాతికృచ్ఛ్రం వా పాదహ్రాసో నృపాదిషు. 14

అతివృద్ధామతికృశామతిబాలాం చ రోగిణీమ్‌ | హత్వా పూర్వవిధానేన చరేదర్దవ్రతం ద్విజః 15

బ్రహ్మణాన్‌ భోజయేచ్ఛక్త్యా దద్యాద్దేమతిలాదికమ్‌ | ముష్టిచ పేటకీలేన తథా శృఙ్గాదిమోటనే. 16

లగుడాదిప్రహారేణ గోవధం తత్ర నిర్దిశేత్‌ | దమనే దామనే చైవ శకటాదౌ చ యోజనే. 17

స్తమ్భశృంఖలపాశైర్వా మృతే పాదోనమాచరేత్‌ | కాష్ఠే సాన్తపనం కుర్యాత్ప్రాజాపత్యం తు లోష్ఠకే. 18

తప్తకృచ్ఛ్రం తు పాషాణ శ##స్త్రే చాప్యతికృచ్ఛ్రకమ్‌ | మార్జారగోధానకుల మణ్డూకశ్వపతత్త్రిణః. 19

హత్వా త్య్రహం పిబేతీరం కృచ్ఛ్రం చాన్ద్రాయణం చరేత్‌|

వ్రతం రహస్యే రహసి ప్రకాశే7పి ప్రకాశకమ్‌. 20

ప్రాణాయామశతం కార్యం సర్వపాపాపనుత్తయే | పానకం ద్రాక్షమధుకం ఖార్జూరం తాలమైక్షవమ్‌. 21

మాధ్వీకం టఙ్కమాధ్వీకం మైరేయం నారి కేలజమ్‌ |

న మద్యాన్యపి మద్యాని పౌష్టీ ముఖ్యా సురా స్మృతా. 22

త్రైవర్ణ్యస్య నిషిద్దాని పీత్వా తప్త్వాప్యపః శుచిః | కణాన్వా భక్షయేదబ్దం పిణ్యాకం వా సకృన్నిశి. 23

సురాపానాపనుత్త్యర్థం బాలవాసా జటీ ధ్వజీ.

దుష్టురాలు కాని స్త్రీని చంపినవాడు శూద్రహత్యకు చెప్పిన ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. గోవును చంపినవాడు మాసము పాటు పంచగవ్యములు భక్షించుచు నియతుడై, గోష్ఠమునందు శయనించుచు, గోవును అనుసరించుచు, గోవును దానము చేయుటచే శుద్ధు డగును. లేదా కృచ్ఛ్రమును, అతికృచ్ఛ్రమును చేయవలెను. క్షత్రియాదులందు పాదము చొప్పున ప్రాయశ్చిత్తము తగ్గును. చాల ముసలిది, చాల దుర్బలముగానున్నది, చాలా బాల్యావస్థలో నున్నది యగు గోవును చంపిన ద్విజుడు పైన చెప్పిన వ్రతమును సగము చేయవలెను. యథాశక్తిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టి బంగారము, తిలలు మొదలగునవి ఇవ్వవలెను. గుద్దుచేత గాని, చెంపదెబ్బచేత గాని, కీలముచేత గాని గోవును హింసించినను; చెవులు మొదలగు నవి మిరుగగొట్టి నపుడును, కఱ్ఱ మొదలగువాటితో కొట్టినను దానిని గోవధగా చెప్పవలెను. లొంగదీసికొను నపుడును, లొంగదీయించే టప్పుడును బండమొదలైనవాటికి కట్టి నపుడును, స్తంభము, గొలుసు, త్రాడు మొదలైన వాటిచే చనిపోయినను ఒక పాదము తక్కువ చేయవలెను. కఱ్ఱచే కొట్టగా చనిపోయినచో సాంతపనము, మట్టి బెడ్డతో కొట్టినపుడు చనిపోయినచో ప్రాజాపత్యమును, ఱాయితో కొట్టగా చనిపోయినచో తప్తకృచ్ఛ్రమును, శస్త్రముచే మరణించగా అతికృచ్ఛ్రమును ఆచరించవలెను. పిల్లిని, ఉడుమును, ముంగిసను, కప్పను, కుక్కను, పక్షిని చంపినవాడు మూడు దినములు క్షీరము మాత్రమే త్రాగి, కృచ్ఛ్రమును, చాంద్రాయణమును చేయవలెను. ఈ వధ రహస్యముగా చేసినచో వ్రతము కూడ రహస్యముగా చేయవలెను. ప్రకాశముగా చేసినపుడు ప్రకాశముగా చేయవలెను. సర్వపాపములను తొలగించుకొనుటకు నూరు ప్రాణాయామములు చేయవరెను. పానకము, ద్రాక్షామధువు, ఖర్జూరజన్యము, తాళవృక్షభవము ఇక్షురసభవము. మాధ్వీకము, టంకమాధ్వీకము, మైరేయము, నారికేలవృక్షమలము, ఇవన్నియు మద్యములే (మాదకములే) యైనను మద్యములు కావు. పిష్టముతో తయారు చేసినదే నిజమైన సుర. మూడు వర్ణముల వారికిని నిషిద్ధము లగు మద్యములను త్రాగినవాడు బాగా మరుగుచున్న నీళ్ళు త్రాగి శుద్ధుడగును. లేదా ఒక సంవత్సరము ధాన్యకణములను మాత్రమే తినవలెను. లేదా ఒక పర్యాయము మాత్రమే రాత్రి యందు తెలకపిండి తినుచు సంవత్సరముగడపవలెను. సురాపానదోషనివృత్తికొరకు జటాధారియై, సురాపానము చేసిన గుర్తు ధరించి కంబళధారియై ఉండవలెను.

అజ్ఞానాత్ప్రాశ్య విణ్మూత్రం సురాసంస్పృష్టమేవ చ. 24

పునః సంస్కారమర్హన్తి త్రయో వర్ణా ద్విజాతయః | మద్యభాణ్డస్థితా అపః పీత్వా సప్తదినం వ్రతీ. 25

చాణ్డాలస్య తు పానీయం పీత్వా స్యాత్‌ షడ్దినం వ్రతీ | చాణ్డాకూపభాణ్డషు పీత్వాసాన్తపనం చరేత్‌. 26

వఞ్చగవ్యం త్రిరాత్ర్యన్తే పీత్వా చాన్త్యజలం ద్విజః | మత్స్య కణ్టక శమ్బూక శఙ్ఖ శుక్తి కపర్దకాన్‌. 27

పీత్వా నవోదకం చైవ పఞ్చగవ్యేన శుధ్యతి | శవకూపోదకం పీత్వా త్రిరాత్రేణ విశుధ్యతి. 28

అన్త్యావసాయినామన్నం భుక్త్వా చాన్ద్రాయణం చరేత్‌ | ఆపత్కాలే శూద్రగృహే మనస్తాపేన శుధ్యతి. #9; 29

శూద్రభాజనభుగ్విప్రః పఞ్చగవ్యాదుపోషితః | కన్దుపక్వం స్నేహపక్వం స్నేహం చ దధి సక్తవమ్‌. 30

శూద్రదనిన్ద్యాన్యేతాని గుడక్షీరరసాదికమ్‌ | అస్నాతభుక్చోపవాసీ దినాన్తే తు జపాచ్ఛుచిః. 31

మూత్రోచార్యశుచిర్భుక్త్వా త్రిరాత్రేణ విశుధ్యతి | కేశకీటావపన్నం చ పాదస్పృష్టం చ కామతః. 32

భ్రూణఘ్నావేక్షితం చైవ సంస్పృష్టం వాప్యుదక్యయా | కాకాద్యైరవలీఢం చ శునా సంస్పృష్టమేవ చ. 33

గవాద్యైరన్నమాఘ్రాతం భుక్త్వా త్య్రహముపావసేత్‌ | రేతోవిణ్మూత్రభక్షీ తు ప్రాజాపత్యం సమాచరేత్‌.

మలమూత్రములను, సుర తగిలిన ఆహారమును తెలియకభుజించిన మూడు వర్ణములవారును పునః సంస్కారార్హులు మద్యభాండములో నున్న నీళ్ళు త్రాగినవాడు ఏడు రోజులు వ్రతము చేయవలెను. చాండాలోదకము త్రాగినవాడు ఆరు దినములు వ్రత మాచరించవలెను. చాండాలుల కూపభాండములయందు నీరు త్రాగినవాడు సాంతపనము చేయవలెను. అంత్యజాతీయుల జలము త్రాగిన ద్విజుడు త్రిరాత్రోపవానము చేసి పంచగవ్యవ్రాశనము చేయవలెను. మత్స్యములు, కంటకములు, శంబూకము (నత్తగుల్ల) శంఖములు, ముత్యపు చిప్పలు, కపర్దములు, తిన్నవాడును, నవోదకము త్రాగినవాడును పంచగవ్యముచే శుద్ధు డగును. శవకూపోదకము త్రాగినవాడు మూడరాత్రులలో శుద్ధుడగును. చాండాలాన్నము తిన్నవాడు చాంద్రాయణవ్రతము చేయవలెను. ఆపత్కాలమునందు శూద్ర గృహమున భుజించినవాడు మనస్తాపముచే శుద్ధు డగును. శూద్రుల పాత్రతో భుజించిన విప్రుడు ఉపవాస ముండి పంచగవ్య భక్షణ చేయుటచే శుద్ధు డగును. కందుపక్వమును (మంగలములో వేయించిన పదార్థము) తైల పక్వమును స్నేహ పదార్థము, పెరుగుతో కలసినసక్తువు గుడక్షీరరసాదికము కూడ శూద్రునినుండి గ్రహించినను అనింద్యములు. స్నానము చేయకుండ భుజించినవాడు ఉపవాసము చేసి దినాంతమునుందు జపము చేయుటచే శుద్ధుడగును. మూత్రవిసర్జన చేసి అశుచిగా నున్నపుడు భుజించినాడు మూడు రాత్రుల ఉపవాసముచే శుద్ధుడగును. కేశకీటాదులతో కూడినదానిని, కావలె నని పాదముతో స్పృశించిన దానిని కాకులు తిన్న దానిని, కుక్క ముట్టినదానిని, గవాదులు వాసనచూచినదానిని తిన్నవాడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. రేతస్సును, మలమూత్రములను భక్షించినవాడు ప్రాజాపత్యము నాచరింపవలెను.

చాన్ద్రాయణం నవశ్రాద్దే పరాకో మాసికే మతః | పక్షత్రయే7తికృచ్ఛ్రం స్యాత్‌ షణ్మాసే కృచ్ఛ్రమేవచ.

ఆబ్దికే పాదకృచ్ఛ్రం స్యాదేకాహః పునరాబ్దికే | పూర్వేద్యుర్వార్షికం శ్రాద్ధం పరేద్యుః పునరాబ్దికమ్‌. 36

నిషిద్దభక్షణ భుక్తే ప్రాయశ్చిత్తముషోషణమ్‌ | భూతృణం లశునం భుక్త్వా శిశుకం కృచ్ఛ్రమాచరేత్‌. 37

అభోజ్యానాం తు భుక్త్వాన్నం స్త్రీశూద్రోచ్ఛిష్టమేవ చ |

జగ్ధ్వా మాంసమభక్ష్యం చ సప్తరాత్రం పయః పిబేత్‌. 38

మధు మాంసం చ యో7శ్నీయాచ్ఛావం సౌతకమేవ వా|

ప్రాజాపత్యం చరేత్కృచ్ఛ్రం బ్రహ్మచారీ యతిర్వ్రతీ. 39

అన్యాయేన పరస్యాపహరణం స్తేయముచ్యతే | ముసలేన హతో రాజ్ఞా స్వర్ణస్తే యీ విశుధ్యతి.40

అధఃశాయీ జటాధారీ పర్ణమూలఫలాశనః | ఏకకాలం సమశ్నానో ద్వాదశాబ్దే విశుధ్యతి. 41

రుక్మస్తేయీ సురాపశ్చ బ్రహ్మహా గురుతల్పగః |

స్తేయం కృత్వా సురాంపీత్వా కృచ్ర్ఛం చాబ్దం చరేన్నరః. 42

మణిముక్తాప్రవాళానాం తామ్రస్య రజతస్య చ | అయస్యాంస్యోపలానాం చ ద్వాదశాహం కణాన్నభుక్‌.

మనుష్యాణాం తు హరణ స్త్రీణాం క్షేత్రగృహస్య చ | వాపీకూపతటాకానాం శుద్ధిశ్చాన్ద్రాయణం స్మృతమ్‌.

భక్షభోజ్యాపహరణ యానశయ్యాసనస్య చ | పుష్పమూల ఫలానాం చ పఞ్చగవ్యం విశోధనమ్‌. 45

నవశ్రాద్ధమునందు భోజనము చేసిన వాడు చాంద్రాయణమును, మాసికమునందు పరాకప్రాయశ్చిత్తము, పక్షత్రయశ్రాద్ధమునందు అతికృచ్ఛ్రమును, షణ్మాసమునందు కృచ్ఛ్రమును, అభ్దికమునందు పాదకృచ్ఛ్రమును, మరల ఆబ్దికమునందు ఏకాహము వెనుకటిరోజున వార్షికశ్రాద్ధము మరునాడు మరల ఆబ్దికము నందు ఏకాహము చేయవలెను. నిషిద్ధవస్తువులను భక్షించినచో ఉపవాసముండుట ప్రాయశ్చిత్తము. భూతృణమును. లశునమును తిన్నవాడు శిశుకకృచ్ఛ్రము చేయవలెను. అభోజ్యుల అన్నము తిన్నను, స్త్రీశూద్రోచ్ఛిష్టమును తిన్నను, అభక్ష్యమాంసమును తిన్నను ఏడు దినములు పాలు త్రాగవలెను. మధుమాంసములను, శావాశౌచాన్నమును తిన్న బ్రహ్మచారియు, యతియు వ్రతస్థుడును ప్రాజాపత్య - కృచ్ఛ్రములు చేయవలెను. అన్యాయముచే పరధనాప హరణము స్తేయము. స్వర్ణస్తేయము చేసినవాడు రాజుచే ముసలముతో కొట్టిచంపబడినచో శుద్ధు డగును. స్వర్ణస్తేయము చేసినవాడును, సురాపానము చేసినవాడును, బ్రహ్మహత్య చేసినవాడును, గురుతల్పగుడును క్రిందపండుకొనుచు, జటాధారియై ఆకులు, దుంపలు, ఫలములు మాత్రము ఒక పూట మాత్రమే తినుచు ఉన్నచో పండ్రెండు సంవత్సరములలో శుద్ధుడగును (కృచ్ఛ్రము) స్తేయము చేసినవాడును సురాపానము చేసినవాడును ఒక సంవత్సరము సురాపానము చేయవలెను. మణులు, ముత్యములు, పొగడములు, రాగి, వెండి, ఇనుము, కంచు రాళ్ళు అపహారించినవాడు పండ్రెండు దినములు కణములు మాత్రమే భుజించవలెను. మనుష్యులను స్త్రీలను పొలమును, గృహమును, వాపీకూపతడాగములను హరించినవాడు చాంద్రాయణము చేయవలెను. భక్ష్యములను, భోజ్యములను, వాహనములను శయ్యను ఆసనమును, పుష్పమూలఫలములను అపహరించినచో పంచగవ్యముచే శుద్ధి యగును.

తృణకాష్ఠద్రుమాణాం చ శుష్కాన్నస్య గుడస్య చ |

చైలచర్మామిషానాం చ త్రిరాత్రం స్యాదభోజనమ్‌. 46

పితుః పత్నీం చ భగీనీమాచార్యతనయాం తథా |

ఆచార్యాణీం సుతాం స్వాంచ గచ్ఛంశ్చ గురుతల్పగః. 47

గురుతల్పే7భిభాషై#్యనస్తప్తే పచ్యాదయోమయే | సూక్ష్మం జ్వల న్తీం చాశ్లిష్య మృత్యునా స విశుధ్యతి. 48

చాన్ద్రాయణాన్వా త్రీన్‌ మాసానభ్యస్య గురుతల్పగః | ఏవమేవ విధిం కుర్యాద్యోషిత్సు పతితాస్వపి. 49

యత్పుంసః పరదారేషు తచ్చైనాం కారయేద్ర్వతమ్‌ | రేతః సిక్త్వా కుమారీషు చాణ్డాలీషు సుతాసు చ. 50

సపిణ్డాపత్యదారేషు ప్రాణత్యాగో విధీయతే | యత్కరోత్యేక రాత్రేణ వృషలీసేవనం ద్విజః. 51

తద్భైక్ష్యభుగ్జపన్నిత్యం త్రిభిరర్షైర్వ్యపోహతి | పితృవ్యదారగమనే భ్రాతృభార్యాగమే తథా. 52

చాణ్డాలీం పుక్కసీం వాపి స్నుషాం చ భగినీం సఖీమ్‌|

మాతుః పితుః స్వసారం చ నిక్షిప్తాం శరణాగతామ్‌. 53

మాతులానీస్వసారం చ స్వగోత్రామన్యమిచ్ఛతీమ్‌ |

శిష్యభార్యాం గురోర్భార్యాం గత్వా చాన్ద్రాయణం చరేత్‌. 54

ఇత్యాది మహాపురాణ అగ్నేయే ప్రాయశ్చిత్తనిరూపణం నామ త్రిసప్తత్యధిక శతతమోధ్యాయః.

తృణ-కాష్ఠ-ద్రుమములను, శుష్కాన్నమును, బెల్లమును, వస్త్ర-చర్మ-మాంసములను అపహరించినవాడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. తండ్రిభార్య, సోదరి, ఆచార్యపుత్రి, గురుభార్య, స్వసుత వీరితో సంగము చేసినవాడు గురుతల్పగుడు. ఈ పాపము చేసినవాడు చేసిన పాపమును చెప్పుచు, కాలుచున్న ఇనుప పెనముపై ప్రజ్వలించుచున్న ఇనుప స్త్రీమూర్తిని కౌగలించుకొని మరణించినచో శుద్ధి పొందును. లేదా గురుతల్పగుడు మూడు చాంద్రాయణములను చేయవలెను. పతితస్త్రీలు కూడ ఇట్లే చేయవలెను. పరభార్యాగాము లైన పురుషుల కేది ప్రాయశ్చిత్తమో స్త్రీలకు గూడ అదే ప్రాయశ్చిత్తము. బాలికలు, చాండాలస్త్రీలు, కుమార్తెలు, సపిండులు కుమార్తెలు భార్యలు, వీరి సంగము చేసినవానికి మరణమే ప్రాయశ్చిత్తము. ఒక రాత్రి శూద్రస్త్రీ సంగము చేసిన ద్విజుడు భిక్షాన్నము తినుచు, నిత్యము జపము చేసినచో మూడు మాసములలో ఆ దోషము పోగొట్టుకొనును. తండ్రి సోదరుని భార్య, సోదరుని భార్య, చాండాలస్త్రీ పుక్కసీస్త్రీ, కోడలు సోదరి, సఖురాలు, తలిదండ్రుల సోదరి, తన దగ్గర దక్షణ నిమిత్తమై ఉంచిన స్త్రీ, శరణుజొచ్చిన స్త్రీ, మేనమామ కూతురు, సోదరి, సగోత్ర యైన స్త్రీ, అన్యుని కోరుచున్న స్త్రీ, శిష్యభార్య, గురుభార్య వీరితో సంగము చేసినవాడు చాంద్రాయణము చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు ప్రాయశ్చిత్తనిరూపణ మను నూటడెబ్బదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters