Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చోత్తరపఞ్చాశదధిక శతతమోధ్యాయః.

అథాచారః

పుష్కర ఉవాచ :

బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ విష్ణ్వాదీన్‌ దేవతాః స్మరేత్‌ |1

ఉభే మూత్రపురీషే తు దివా కుర్యాదుదఙ్ముఖః.

రాత్రౌ చ దక్షిణ కుర్యాదుభే సన్ద్యే యథా దివా | న మార్గాదౌ జలే వీథ్యాం సతృణాయాం సదాచరేత్‌. 2

శౌచం కృత్వా మృదాచమ్య భక్షయేద్దన్తధావనమ్‌ | నిత్యం నైమిత్తికం కామ్యం క్రియాఙ్గం మలకర్షణమ్‌. 3

క్రియాస్నానం తథా షష్ఠం షోడా స్నానం ప్రకీర్తితమ్‌ | అస్నాతస్యాఫలం కర్మ ప్రాతఃస్నానం చరేత్తతః.

భూమిష్ఠముద్ధృతాత్పుణ్యం తతః ప్రస్రవణోదకమ్‌ | తతోపి సారసం పుణ్యం తస్మాన్నాదేయముచ్యతే. 5

అ (53)

తీర్థతోయం తతః పుణ్యం గాఙ్గం పుణ్యం తు సర్వతః | సంశోధితమలః పూర్వం నిమగ్నశ్చ జలాశ##యే. 6

ఉపస్పృశ్య తతః కుర్యాదమ్భసః పరిమార్జనమ్‌ | హిరణ్యవర్ణాస్తిసృభిః శన్నో దేవీతి చాప్యథ. 7

ఆపోహిష్ఠేతి తిసృభిరిదమాపస్తథైవ చ | తతో జలాశ##యే మగ్నః కుర్యాదన్తర్జలం జపమ్‌. 8

తత్రాఘమర్షణం సూక్తం ద్రుపదాం వా తథా జపేత్‌ | యుఞ్జతే మన ఇత్యేవం సూక్తం వాప్యథ పౌరుషమ్‌.

గాయత్రీం తు విశేషేణ అఘమర్షణసూక్తకే | దేవతా భావవృత్తం తు బుషిశ్చైవాఘమర్షణః. 10

ఛన్దశ్చానుష్టుభం తస్య భావవృత్తో హరిః స్మృతః | ఆపీడ్యమానః శాటీం తు దేవతాపిత్పతర్పణమ్‌. 11

పౌరుషేణ తు సూక్తేన దదేచ్చైవోదకాఞ్జలిమ్‌ | తతోగ్ని హవనం కుర్యాద్దానం దత్త్వా తు శక్తితః. 12

తతః సమభిగచ్ఛేత యోగక్షేమార్థమీశ్వరమ్‌ | ఆసనం శయనం యానం జాయాపత్యం కమణ్డలుః. 13

ఆత్మనః శుచిరేతాని పరేషాం న శుచిర్భవేత్‌.

పుష్కరుడు చెప్పెను : ప్రతిదినము ప్రాతః కాలమునందు బ్రాహ్మముహూర్తమునందే విష్ణ్వాది దేవతలను స్మరించ వలెను. పగలు మలమూత్రత్యాగము ఉత్తరాభిముఖుడై చేయవలెను. రాత్రియందు దక్షిణాభిముఖుడై, సంధ్యలందు పగటియందు వలె చేయవలెను. మార్గాదులందును, జలములందును, సందులు మొదలగువాటియందును ఎన్నడును మలత్యాగము చేయగూడదు. తృణముచే భూమి కప్పి దానిపై మలత్యాగము చేయవలెను. మట్టితో హస్తపాదాది శుద్ది చేయవలెను. స్నానము-నిత్యము, నైమిత్తికము, కామ్యము, క్రియాంగము, మలకర్షణము, క్రియాస్నానము అని ఆరు విధములు. స్నానముచేయనివాని కర్మ లన్ని యునిష్పలములు. అందుచే ప్రతిదినము ప్రాతఃకాలమున స్నానము చేయవలెను. కూపము నుండి తోడిన జలముకంటె భూమిస్థజలము పవిత్రము. దానికంటె సెలయేటిలోని నీరు, దానికంటె తటాకోదకము, దాని కంటె నదీజలము, దానికంటె తీర్థోదరము పవిత్రము. గంగాజలము అన్నిటికంటెను పవిత్రము. నీటిలో మునిగి శరీరము నందలి మలమును కడిగివేసుకొని, ఆచమనము చేసి, ''హిరణ్యవర్ణాః'' ఇత్యాదిఋక్త్రయముతోను, ''శం నో దేవీరభిష్టయే'' అను మంత్రముతోను, 'ఆపోహిష్ఠా' ఇత్యాదిమంత్రములు మూడింటితోను, ''ఇదమాపః'' ఇత్యాదిమంత్రముతోను మార్జనము చేసికొనవలెను. పిదప జలాశయమునందు మునిగి, లోపలనే, అఘమర్షణసూక్తము గాని 'ద్రుపదాదివ' అను మంత్రముగాని, 'యజ్ఞతేమనః' ఇత్యాదిసూక్తమును గాని 'సహస్రశీర్షా' ఇత్యాదిసూక్తమును గాని జపించవలెను. విశేషించి గాయత్రీ జపము ఉచితము. అఘమర్షణసూక్తమునందు దేవత భావవృత్తము, ఋషి అఘమర్షణుడు. ఛందస్సు అనుష్టువ్‌. తద్ద్వారా భావవృత్తు డగు హరిని స్మరించవలెను. బట్టలు పిండుచు దేవతాపితృతర్పణము చేయవలెను. పిదప పురుషసూక్తముతో జలాంజలి సమర్పించి, పిదప అగ్నిహోత్రముచేసి, యథాశక్తి దానము నిచ్చి, యోగక్షేమార్థమై పరమేశ్వరుని శరణమందవలెను. ఆసనము, శయ్య, వాహనము, స్త్రీ, సంతానము, కమండలము ఇవి తన వైనపుడే పవిత్రములు. ఇతరుల వైనచో తనకు అవి అపవిత్రములు.

భారాక్రాన్తస్య గుర్విణ్యాః పన్థా దేయో గురుష్వపి. 14

న పశ్యేచ్చార్కముద్యన్తం నాస్తం యన్తం న చామ్భసి |

నేక్షేన్నగ్నాం స్త్రియం కూపం సురాస్థానమఫ°ఘినమ్‌. 15

కార్పాసాస్థి తథా భస్మ నాక్రామేద్యచ్చ కుత్సితమ్‌ | అన్తఃపురం విత్తగృహం పరదౌత్యం వ్రజేన్న హి. 16

నారో హేద్విషమాం నావం న వృక్షం న చ పర్వతమ్‌ | అర్థాయతనశాస్త్రేషు తథైవ స్యాత్‌ కుతూహలమ్‌.

లోష్టమర్దీ తృణచ్ఛేదీ నఖచ్ఛేదీ వినశ్యతి | ముఖాదివాదనం నేహే ద్వినా దీపం న రాత్రిగః. 18

నాద్వారేణ విశేద్వేశ్మ న చ వక్త్రం విరాగయేత్‌ | కథాభఙ్గం న కుర్వీత న చ వాసోవిపర్యయమ్‌. 19

భద్రం భద్రమితి బ్రూయాన్నానిష్టం కీర్తయేత్క్వచిత్‌ |

పాలాశమాసనం వర్జ్యం దేవాదిచ్ఛాయయా వ్రజేత్‌. 20

న మధ్యే పూజ్యయోర్యాయాన్నో చ్ఛిష్టస్తారకాదిదృక్‌ |

నద్యాం నాన్యాం నదీం బ్రూయాన్న కణ్డూయేద్ద్విహస్తకమ్‌. 21

అసన్తర్ప్య పితౄన్‌ దేవాన్‌ నదీపారం చ న వ్రజేత్‌ | మలాది ప్రక్షిపేన్నాప్సు న నగ్నః స్నానమాచరేత్‌. 22

తతః సమభిగచ్ఛేత యోగక్షేమార్థమీశ్వరమ్‌ | స్రజం నాత్మనాపనయేత్ఖరాదికరజస్త్యజేత్‌. 23

హీనాన్నావహసే ద్గచ్ఛేన్నాదిశే నివసేచ్చ తైః | వైద్యరాజ నదీహీనే వ్లుెచ్ఛస్త్రీ బహునాయకే. 24

రజస్వలాదిపతితైర్న భాషేత్కేశవం స్మరేత్‌ | నాసంవృతముఖః కుర్యాద్ధాసం జృమ్భాం తథా క్షుతమ్‌. 25

ప్రభోరప్యవమానం స్వం గోపయేద్వచనం బుధః | ఇన్ద్రియాణాం నానుకూలీ వేగరోధం న కారయేత్‌ః 26

నాపేక్షితవ్యో వ్యాధిః స్యాద్రిపురల్పోపి భార్గవ | రథ్యాదిగః సదాచామేద్భిభృయాన్నాగ్నివారిణీ. 27

న హుఙ్కుర్యాచ్ఛివం పూజ్యం పాదం పాదేన నాక్రమేత్‌ |

ప్రత్యక్షం వా పరోక్షం వా కస్య చిన్నాప్రియం వదేత్‌. 28

వేదశాస్త్రనరేన్ద్రర్షిదేవనిన్దాం వివర్జయేత్‌ | స్త్రీణామీర్ష్యా న కర్తవ్యా విశ్వాసం తాసు వర్జయేత్‌. 29

ధర్మశ్రుతిం దేవరాతిం కుర్యాద్ధర్మాది నిత్యశః | సోమస్య పూజాం జన్మరే విప్రదేవాదిపూజనమ్‌. 30

షష్ఠే చతుర్దశ్యష్టమ్యామభ్యంగం వర్జయేత్తథా | దూరాద్గృహాన్మూత్రవిష్ఠే నోత్తమైర్వైరమాచరేత్‌.31

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే ఆచారవర్ణనం నామ పఞ్చపఞ్చాశదధిక శతతమోధ్యాయః.

బరువుమోయు చున్న వానికిని, గర్భిణీస్త్రీకిని, పెద్దలకును మార్గమునీయవలెను. ఉదయించుచున్న సూర్యుని, అస్తమించుచున్న సూర్యుని చూడరాదు. జలమునందు సూర్యప్రతిబింబమును చూడకూడదు. నగ్నస్త్రీని, కూపములోనికి హత్యాస్థానమును, పాపాత్ములను చూడకూడదు. దూది, ఎముకలు, భస్మము, జుగుప్సాకరములగు వస్తువులు దాటకూడదు. ఇతరుల అంతఃపురములోనికి, కోశాగారములోనికి ప్రవేశింపరాదు. ఇతరులకు దూతగా పని చేయరారు. విరిగిని నావ, చెట్టు, పర్వతము ఎక్కరాదు. ధనము, గృహము, శాస్త్రములు వీటి విషయమున కుతూహలముతో నుండవలెను. (వ్రేళ్లతో) మట్టిబెడ్డలు నలగకొట్టువాడు, తృణములు త్రుంచువాడు, గోళ్లుకొరుకువాడు నశింతురు. ముఖాదుల ద్వారా వాద్య శబ్దము పుట్టించరాదు. రాత్రి దీపము లేకుండ ఎచటికి పోరాదు. ద్వారము తప్ప మరొక మార్గమున ఇంట ప్రవేశింపరాదు. ముఖము రంగు మార్చుకొనగూడదు. సంభాషణమున ఎవరికిని బాధ కలిగించరాదు. తన వస్త్రమును ఇతరుల వస్త్రముతో మార్పు చేసికొనరాదు. ఎల్లపుడు ''భద్రము, భద్రము''అని అనుచుండవలెను. ఇతరులకు నష్టము కలిగించు మాట ఎన్నడును పలకరాదు. పలాశాసనమును ఉపయోగించరాదు. దేవతాదుల నీడనుండి దూరముగ ఉండవలెను. ఇద్దరు పూజ్యు లగువారి మధ్యనుండి వెళ్లకూడదు. ఎంగిలివాడుగా ఉండి నక్షత్రాదులను చూడరాదు. ఒక నదిలో నున్నపుడు మరొక నది పేరుపలుకరాదు. రెండు చేతులతో గోకుకొనరాదు. ఏదైన నదిని సమీపించునపుడు దేవతాపితృతర్పణము చేయకుండ దానిని దాటరాదు. మలాదులను జలములో పడవేయరాదు. నగ్నుడైస్నానము చేయగూడదు. యోగక్షేమముల కొరకై పరమాత్ముని శరణుపొందవలెను. శరీరముపైనున్న మాలను తన చేతులతో తీసివేయగూడదు గాడిద దుమ్ము నుండి దూరముగా ఉండవలెను. తనకంటె తక్కువ స్థితిలో నున్న వారిని చూచి నవ్వకూడదు. వారితో కలసి ఒక స్థానమున నివసింప గూడదు. వైద్యుడు, రాజు, నది లేని దేశమునందు నివసించగూడదు. వ్లుెచ్ఛులు, స్త్రీలు, అనేకులు అధిపతులుగా ఉన్న దేశమునందు నివసించరాదు. రణస్వలలతోను, పరితాదులతోను సంభాషణ చేయకూడదు. సదా విష్ణుస్మరణము చేయవలెను. ముఖమును అచ్ఛాదించుకొనకుండ నవ్వుట, ఆవలించుట, తుమ్ముట చేయరాదు. తెలివైనవాడు స్వామియొక్క అవమానమును, తన అవమానమును రహస్యముగా ఉంచుకొనవలెను. ఇంద్రియములు చెప్ప నట్లు చేయరాదు. మలమూత్రముల వేగము ఆపుకొనరాదు. పరశురామా! చిన్న రోగమును, చిన్న శత్రువును గూడ ఉపేక్షించరాదు. మార్గము దాటి వచ్చినపిమ్మట తప్పక ఆచమనము చేయవలెను. జలాగ్నులను ఒకేసారి ధరింపరాదు. కల్యాణమయుడగు పూజ్యుని విషయమున ఎన్నడును కోపముతో హుంకరింపగూడదు. పాదమును పాదముతో నొక్కకూడదు. ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఎవ్వరిని నిందింపరాదు. వేద- శాస్త్ర - రాజ - బుషి - దేవతలను నిందింపరాదు. స్త్రీలవిషయమున ఈర్ష్య యుండకూడదు. ఎన్నడును వారిని విశ్వసింపగూడదు. ధర్మమును వినవలెను. దేవతలపై భక్తిచూపవలెను. ప్రతిదినము ధర్మాద్యనుష్ఠానము చేయవలెను. జన్మనక్షత్రదివసమున చంద్రుని, బ్రాహ్మణులను, దేవతాదులను పూజించవలెను. షష్టీ - అష్టమీ చతుర్దశీదివసములందు తైలాభ్యంగస్నానము చేయగూడదు. ఇంటినుండి దూరముగ పోయి మలమూత్రవిసర్జన చేయవలెను. ఉత్తమపురుషులతో ఎన్నడును విరోధము చేయగూడదు.

అగ్ని మహాపురాణమునందు ఆచారవర్ణన మను నూటఏబదియైదవ అధ్యాయము సమాప్తము

Sri Madhagni Mahapuranamu-1    Chapters