Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనపఞ్చాశదుత్తరశతతోమో7ధ్యాయః.

అథ లక్షహోమకోటిహోమః

ఈశ్వర ఉవాచ :

హోమాద్రణాదౌ విజయో రాజ్యాప్తిర్విఘ్ననాశనమ్‌ | కృచ్ఛ్రేణ శుద్దిముత్ఫాద్య ప్రాణాయామశ##తేన చ. 1

అన్తర్జలే చ గాయత్రం జప్త్వా షోడశధా చఠేత్‌ |

ప్రాణాయామాంశ్చ పూర్వాహ్ణే జుహుయాత్పావకే హవిః. 2

భైక్ష్యయావకభక్షీ చ ఫలమూలాశనో7పి వా | క్షీరసక్తుఘృతాహార ఏకమహారమాశ్రయేత్‌. 3

యావత్సమాప్తిర్భవతి లక్షహోమస్య పార్వతి | దక్షిణాయాగహోమాన్తే గావో వస్త్రాణి కాఞ్చనమ్‌. 4

సర్వో త్పాతసముత్పత్తౌ పఞ్చభిర్దశభిర్ద్విజైః.

నాస్తి లోకే స ఉత్పాతో యో హ్యనేన న శామ్యతి. 5

మాఙ్గల్యం పరమం నాస్తి యదస్మాదతిరిచ్యతే . కోటిహోమం తు యో రాజా కారయేత్పూర్వవద్ద్విజైః .6

న తస్య శత్రవః సంఖ్యే జాతు తిష్ఠన్తి కర్హి చిత్‌ | న తస్య మారకో దేశే వ్యాధిర్వా జాయతే క్వచిత్‌. 7

అతివృష్టిరనావృష్టిర్మూషకాః శలభాః శుకాః| రాక్షసాద్యాశ్చ శామ్యన్తి సర్వే చ రిపవో రణ. 8

కోటిహోమే తు వరయే ద్బ్రాహ్మణాన్వింశతిం తథా|

శతం చాథ సహస్రం వా యథేష్టాంభూతిమాప్నుయాత్‌. 9

కోటిహోమం చ యః కుర్యాద్ధ్విజో భూపో7థవాచ విట్‌ |

యదిచ్ఛేత్ప్రాప్నుయాత్తత్తత్సశరీరో దివం వ్రజేత్‌. 10

గాయత్య్రగ్రహమన్తెర్వా కూష్మాణ్డజాతవేదస్తెః | ఐన్ద్రవారుణవాయవ్యయామ్యాగ్నేయైశ్చ వైష్ణవైః. 11

శాక్తేయైః శామ్భవైః సౌరైర్మన్త్రైర్హోమార్చనాత్తతః | అయుతేనాల్పసిద్ధిః స్యాల్లక్షహోమో7ఖిలార్తినుత్‌.12

సర్వపీఢాదినాశాయ కోటిహోమో7ఖిలార్థధః | యవవ్రీహితిలక్షీరఘృతకుశప్రసాతి (కాశి) కః. 13

పఙ్కజోశీరబిల్వామ్రదలా హోమే ప్రకీర్తితాః | అష్టహస్తప్రమాణన కోటిహోమేఘ ఖాతకమ్‌. 14

(తస్మాదర్దప్రమాణన కోటిహోమేషు ఖాతకమ్‌)

తస్మాధర్దప్రమాణ న లక్షహోమే విధీయతే | హోమో7యుతేన లక్షేణ కోట్యాజ్యాద్యైః ప్రకీర్తితః. 15

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే అయుతలక్షకోటి

హోమో నామైకోనపఞ్చాశదధిక శతతమో7ధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను : హోమము చేయుటచే యుద్ధమునందు విజయము కలుగును; విఘ్నము నశించును. ముందుగా కృచ్ఛ్రవ్రతము చేసి దేహమును శుద్ధముచేసికొనవలెను, నూర ప్రాణాయామములతో శరీరమును శుద్ధము చేసి కొని జలమునందు నిలిచి గాయత్రీజపము చేసి పదునారు ప్రాణాయామములు చేయవలెను. పూర్వాహ్ణమునందు ఆగ్నిలో ఆహుతలు సమర్పించవలెను. భిక్షాప్రాప్త మగు యవనిర్మితభోజ్యపదార్థములను, ఫల-మూలములను, క్షీరమును, పేలాలపిండిని, ఘృతమును యజ్ఞకాలమున ఆహారముగా తీసికొనవచ్చును. పార్వతీ! లక్షహోమములు పూర్తి యగునంతవరకు ఒక పర్యాయమే భోజనము చేయవలెను. లక్షహోమములు పూర్ణాహుతి చేసిన పిమ్మట గోవులను, వస్త్రములను, సువర్ణమును దక్షిణగా ఇవ్వవలెను. ఏ విధమైన ఉత్పాతములు కనబడినను ఐదుగురు లేదా పదిమంది ఋత్విక్కులతో పైన చెప్పిన యజ్ఞము చేయింపవలెను. ఈ లోకములో దీనిచే శాంతించని ఉత్పాత మేదియు లేదు. దీనిని మించిన మంగళకరమైనది మరేదియు లేదు. పూర్వోక్తవిధానము ప్రకారము బుత్విక్కులచే ఈ యజ్ఞము చేయించిన రాజు ఎదుట శత్రువు రణరంగమున నిలువజాలడు, ఆతని రాజ్యములో అతిపృష్టి, అనావృష్టి, ఎలుకలబాధ, మిడతలబాధ, చిలుకలబాధ, భూత రాక్షాసాదులు, యుద్ధమునందు సమస్తశత్రువులు నశించును. కోటిహోమముల కొరకు ఇరువదిమంది గాని, వందమంది గాని, వేయిమంది గాని, బ్రహ్మణుల వరణము చేయవలెను. దీనిచే యజమానునకు అభిష్టధనవైభవప్రాప్తి కలుగును. కోటిహోమాత్మక యజ్ఞము చేసిన బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని ఏది కోరిన అది పొందగలుగును. అతడు సశరీరముగ స్వర్గమునకు వెళ్ళును. హోమ పూజాదులు గాయత్రీమంత్ర - గ్రహమంత్ర - కూష్మాండమంత్ర అగ్నిమంత్ర - ఐంద్రమంత్ర -వారుణ - వాయవ్య - యామ్య ఆగ్నేయ వైష్ణవ - శాక్త - శైవ - సూర్యమంత్రములు- వీటిలో చేయు పద్ధతి చెప్పబడినది. అయుతహోమము చే అల్పమైన సిద్ధి కలుగును. లక్షహోమము సకలదుఃఖములను తొలగించును. కోటిహోమము సకలక్లేశములను నశింపచేయును, సకలపదార్థములను ఇచ్చును. యవ - ధాన్య - తిల - క్షీర - ఘృత - కుశ - ప్రాసాతికా - కమల - కల - బిల్వ - ఆమ్రదలములు హోమమునకు తగిన పదార్థములు. కోటి హోమమునకు ఎనిమిది హస్తముల లోతు అగ్నికుడంమును. లక్షహోమమునందు నాలుగు హస్తముల లోతు అగ్నికుండమును నిర్మింపవలెను. ఆయుత - లక్ష - కోటిహోమములందు ఆజ్యము ఉపయోగించవలెను.

అగ్ని మాహాపురాణమునందు యుద్ధయార్ణవమున అయుతలక్షకోటిహోమ మను నులుబదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

అ (52)

Sri Madhagni Mahapuranamu-1    Chapters