Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ పఞ్చచత్వారింశదుత్తరశతతమో7ధ్యాయః

అథ మాలినీనానామః

ఈశ్వర ఉవాచ:

నానామన్త్రాన్‌ ప్రవక్ష్యామి షోడా న్యాసపురస్సరమ్‌ | న్యాసస్త్రిధా తు షోఢా స్యుః శాక్తశామ్భవయామలాః 1

శామ్భవే శబ్దరాశిః షట్‌ షోడశగ్రన్థరూపవాన్‌ | త్రివిద్యా తద్గ్రహో న్యాసస్త్రితత్త్వాత్మాభిధానకః 2

చతుర్థో వనమాలాయాః శ్లోకద్వాదశరూపవాన్‌ | పఞ్చమో పఞ్చరత్నాత్మా నవాత్మా షష్ఠ ఈరితః 3

శాక్తే పక్షే చ మాలిన్యాస్త్రివిద్యాత్మా ద్వితీయకః | అఘోర్యష్టకరూపోన్యో ద్వాదశాఙ్గశ్చతుర్థకః. 4

éపఞ్చమస్తు షడఙ్గః స్యాచ్ఛక్తిశ్చాన్యాస్త్రచణ్డికా |

క్రీం హ్రౌం క్లీం శ్రీం క్రూం ఫట్‌ త్రయం స్యాత్తుర్యాఖ్యం సర్వసాధకమ్‌. 5

మాలిన్యా నాది ఫాన్తం స్యాన్నాదినీ చ శిఖాస్మృతా | అగ్రసనీ శిరసి స్యాచ్ఛిరోమాలా నివృత్తిః శః 6

ట శాన్తిశ్చ శిరో భూయాచ్చాముణ్డా చ త్రినేత్రగా | ఢప్రియదృష్టిర్ధ్వినేత్రే నాసాగా గుహ్యశక్తి నీ. 7

న నారాయణీ ద్వికర్ణే చ దక్షకర్ణే తమోహనీ | జప్రజ్ఞా వామకర్ణస్థా వక్త్రే చ వజ్రిణీ స్మృతా. 8

క కరాళీ దక్షదంష్ట్రా వామాంసా ఖ కపాలినీ |

గ శివా ఊర్ధ్వదంష్ట్రా స్యాత్‌ ఘ ఘోరా వామదంష్ట్రికా. 9

ఉ శిఖా దన్తవిన్యాసా ఇ మాయా జిహ్వయా స్మృతా | అ స్యాన్నాగేశ్వరా వాచి వ కణ్ఠ శిఖివాహిని. 10

పరమేశ్వరుడు పలికెను: ఇపుడు షడ్విధన్యాసపూర్వకము లగు నానావిధ మంత్రములను గూర్చి చెప్పెదను. ఈ షడ్విధన్యాసములు శాంభవ-శాక్త-యామలము లని మూడేసి విధములు. శాంభవన్యాసమునందు షట్‌షోడశ గ్రంథిరూపమగు శబ్దరాశి ప్రధానము. మూడు విద్యలు-వాటి గ్రహణము ద్వితీయ న్యాసము. త్రితత్త్వాత్మక న్యాసము మూడవది. వనమాలా న్యాసము నాల్గవది. ఇది పండ్రెండు శ్లోకములలో నున్నది. రత్నపంచక న్యాసము ఐదవది. నవాక్షర మంత్ర న్యాసము ఆరవది. శాక్తపక్షమున మాలిన న్యాసము మొదటిది. త్రివిద్యా న్యాసము రెండవది. అఘోర్యష్టక న్యాసము మూడవది. ద్వాదశాంగ న్యాసము నాల్గవది. షడంగ న్యాసము ఐదవది. అస్త్రచండిక యను శక్తి న్యాసము ఆరవది. "క్లీం (క్రీం) హ్రీం క్లీం శ్రీం క్రూం ఫట్‌" అను ఆరు బీజమంత్రముల షడ్విధ న్యాసమే 'యామల' న్యాసము. ఈ ఆరింటిలో 'శ్రీం' బీజ న్యాసము సకల మనోరథ సిద్ధి ప్రదము. '' మొదలు '' వరకు చేయు న్యాసము మాలినీ వ్యాసము '' తో ప్రారంభించు లేదా నాదమును చేయు శక్తి శిఖపై న్యాసము చేయవలెను. '' గ్రసనీశక్తి, '' శిరోమానివృత్తిశ క్తి; ఈ రెండింటి స్థానము శిరస్సు. శాంతిప్రితీక మగు '' న్యాసము కూడ శిరస్సుపై చేయవలెను. చాముండాప్రతీక యైన '' న్యాసము నేత్రత్రయముపై చేయవలెను. ప్రియదృష్టిస్వరూప మగు '' ను నేత్రద్వయ మందును గుహ్యశక్తిప్రతీక యైన 'నీ' ని నాసికాద్వయముందును, నారాయణీరూప మగు '' ను కర్ణద్వయమునందును, మోహినీరూప మగు '' ను కుడి చెవియందు, ప్రజ్ఞాప్రతీక మగు '' ను ఎడమ చెవియందును, వజ్రిణీదేవిని ముఖము నందును, కరాళీశక్తిప్రతీక మైన '' ను కుడి కోరయందును, కపాలినీరూప మగు '' ను, ఎడమ భుజముపైనను, శివప్రతీకమైన '' ను ఎడమ కోరయందును, ఘోరాశక్తి ప్రతీకమగు '' ను ఎడమకోరయందును శిఖాశక్తిసూచకమగు '' ను దంతము లందును, మాయాప్రతీక మగు '' ని జిహ్వపైనను, నాగేశ్వరీరూప మగు '' ను వాగింద్రియము పైనను, శిఖివాహినీబోకఢ మగు '' ను కంఠము నందును వ్యాసము చేయవలెను.

అ (51)

భ భీషణీ దక్షస్కన్దే వాయువేగా మ వామకే | డ నామా దక్షబాహౌ తు ఢ వామే చ వినాయకా. 11

ప పూర్ణిమా ద్విహస్తే తు ఓ కారాద్యఙ్గులీయకే | అం దర్శనీ వామాఙ్గుల్యః అః స్యాత్స ఞ్జీవనీ కరే. 12

ట కపాలినీం కపాలం శూలదణ్డ చ దీపనీ | త్రిశూలే చ జయన్తీ స్యాద్వృద్ధిర్యః సాధనీ స్మృతా. 13

జీవేశపరమాఖ్యా స్యాద్‌ హః ప్రాణ చామ్బికా స్మృతా | దక్షస్తనే భ శరీరా న వామే పూతనా స్తనే. 14

ఆ స్తనక్షీర ఆ మోటో లమ్బోదర్యుదరే చ థ | నాభౌ సంహారికా క్ష స్యాన్మహాకాలీ నితమ్భకమ్‌. 15

గుహ్యేసకుసుమమాలా ష శుక్రే శుక్రదేవికా | ఊరుద్వయే చ తారా స్యాదజ్ఞానా దక్షజానుని. 16

వామే స్యాదౌ క్రియాశక్తిరో గాయత్రీ చ జంఘగా | ఓం సావిత్రీ వామజఙ్ఘా దక్షే దో దోహనీ పదే. 17

ఫ పేత్గారే వామపదే న వాత్మామాలినీ మనుః | అ శ్రీకణ్ఠాః శిఖాయాం స్యాదా వక్త్రే స్యాదనన్తకః. 18

ఇ సూక్ష్మో దక్షనేత్రే స్యాదీ త్రిమూర్తిస్తు వామకే | ఉ దక్షకర్ణే7మరీశ ఊ కర్ణేర్ఘాంశకో7పరే. 19

ఋ భావభూతినాసాగ్రే వామనాసాతిధీశ ఋ | స్థాణుర్దక్షగణ్డ స్యాద్వామగణ్డ హరశ్చ 20

'' తో భీషణీశక్తిని కుడి స్కంధమునందు, '' తో వాయువేగను ఎడమ స్కంథమునందు '' తో వామాశక్తినికుడి భుజమునందు, '' తో వినాయకాదేవిని ఎడమ భుజమునందు, '' పూర్ణిమాశక్తులను రెండు హస్తము లందు; ప్రణవసహిత ఓంకారశక్తిని కుడిచేతి వ్రేళ్ళయందు 'అం' సహిత దర్శనీశక్తిని ఎడమ చేతివ్రేళ్ళ యందు, 'అః' సంజీవనీశక్తులను హస్తమునందు, '' కపాలినీ శక్తులను కపాలమునందు '' సహితదీపనీశక్తి శూలదండము నందు, జయన్తీశక్తిని త్రిశూలమునందు, '' సహితసాధనీదేవిని వృద్ధియందును న్యాసము చేయవలెను. '' పరమఖ్యా దేవులను జీవునియందు, '' అంబికాదేవులను ప్రాణమునందు, '' సహిత శరీరాదేవిని దక్షిణస్తమునందు, 'నీ' సహితపూతనను వామస్తనమునందు, '' సహిత ఆ మోటిని స్తనదుగ్ధమునందు, '' సహిత లంబోదరిని ఉదరమునందు, 'క్ష' సహిత సంహారికను నాభియందు '' సహితమహాకాళిని నితంబమునందు, '' సహిత కుసుమమాలాదేవిని గుహ్య దేశమునందు '' సహిత శుక్రదేవికను శుక్రమునందు, '' సహిత తారాదేవిని ఊరుద్వయమునందు, '' సహిత 'జ్ఞానా' శక్తిని కుడి మోకాలునందు, '' సహిత క్రియాశక్తిని ఎడమ మోకాలియందు, '' సహిత గాయత్రీదేవిని కుడి పిక్కయందు, 'ఓం' సహిత సావిత్రిని ఎడమ పిక్కయందు, '' సహిత దోహినిని కూడి పాదమునందు, ఫ సహిత ఫేత్కారిని ఎడమ పాదమునందు న్యాసము చేయవలెను. మాలినీ మంత్రములో తొమ్మిది అక్షరము లుండును. '' సహిత శ్రీకంఠుని శిఖయందు, '' సహిత అనంతుని ముఖమునందు '' సహిత సూక్ష్మమును కుడి కంటియందును, '' సహిత త్రిమూర్తులను ఎడమ కంటియందును, '' సహిత అమరీశుని దక్షిణ కర్ణమునందును, '' సహిత అర్ధాంశకమును వామకర్ణమునందును, '' సహిత భావభూతిని దక్షిణ నాసాగ్రమునందును, 'ఋ' సహిత తిథీశుని వామనాసాగ్రమునందను, ' ' సహిత స్థాణువును దక్షిణ కపోలమునందును, ' ' సహిత హరుని వామకపోలమునందును న్యాసము చేయవలెను.

కటేశోదన్తపఙ్త్కావే భూతీశశ్చోర్ధ్వదన్త ఐ | సద్యోజాత ఓ అధరే ఊర్ధ్వోష్ఠే7రనుగ్రహేశ ఔ. 21

అం క్రూరో ఘటకాయాం స్యాదః మహసేనజిహ్వా యా | క క్రోధీశోదక్షస్కన్దే ఖశ్చణ్డశశ్చ బాహూషు. 22

పఞ్చాన్తకః కూర్పరే గ షు శిఖీ దక్షకంకణ| ఙ ఏకపాదశ్ఛాజ్గుల్యో వామస్కన్దే చకూర్మకః 23

ఛ ఏకనేత్రో బాహౌ స్యాచ్చతుర్వక్త్రో జ కూర్పరే | ఝ రాజసః కఙ్కణగః ఞ సర్వకామదో7ఙ్గులీ. 24

ట సోమేశో నితమ్బే స్యాదృక్ష ఊ రుష్ఠసలాఙ్గలీ | డ దారుకో దక్షజానౌ జఙ్ఘా ఢోర్దజలేశ్వరః. 25

ణ ఉమాకాన్తకోజ్గుల్యస్త ఆషాడే నితమ్బకే | థ దణ్డీ వామ ఊరౌ స్యాద్దభిదో వామజానుని. 26

ధ మీనో వామజఙ్ఘాయాం న మేషశ్చరణాజ్గులీ | ప లోహితో దక్షకుక్షౌ ఫ శిఖో వామకుక్షిగః. 27

బ గలణ్డః పృష్ఠవంశే భ నాభౌ చ ద్విరణ్డకః | మ మహాకాలో హృదయే య వాణీశ స్త్వవిస్మృతః. 28

ర రక్తే స్యాద్భుజఙ్గేశో ల పినాకీ చ మాంసకే | వ ఖడ్గీశః స్వాత్మని స్యాద్బకశ్చాస్థిని శః స్మృతః. 29

ష శ్వేతశ్చైవ మజ్జాయాం సభృగుః శుక్రధాతుకే | ప్రాణ హ నకులీశః స్యాత్‌ క్షః సంవర్తశ్ఛ కోశగః.

రుద్రశక్తీ ప్రపూజ్య హ్రీం బీజేనాఖిలమాప్నుయాత్‌.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే మాలినీమన్త్రో నామ పఞ్చచత్వారింశదధిక శతతమో7ధ్యాయః

"' సహితకటేశుని క్రింది దంతపంక్తియందును, "" భూతీశులను పై దంతపంక్తినయందును, "" సద్యో జాతులను క్రింది ఓష్ఠమునందును, ఔ" అనుగ్రహీశులనుపై ఓష్ఠమునందును, "అం" క్రూరులను కంఠబిలము నందును "అః" మహాసేనులను జిహ్వయందును, "" క్రోధీశులను, దక్షిణస్కంధమునందును, '' చండీశులనుబాహువు లందును '" పంచాతకులను మోచేతియందును, "" శిఖులను దక్షిణకంకణమునందును, '" ఏకపాదులను వామాంగుళులయందును "" కూర్మకులను వామ - స్కంధమునందునున్యాసముచేయవలెను. "" ఏకనేత్రులను బాహువులందు, ''" చతుర్ముఖులను మోచేతి యందును, '' రాజసులనువామకంకణమునందును, '" సర్వకామాదులనువామాంగుళులందును. "" సోమేశ్వరులనునితంబము నందును, "" లాంగలులను కుడి తొడయందును, "" దారులకును, ఎడమ మోకాలునందును, "" అర్ధజనేశ్వరులను కుడు పిక్కయందును, "" ఉమాకాంతులను, దక్షిణ పాదాంగుళలందును, "" ఆషాడులను,' నితంబమునందు "" దండులను, ఎడమ తొడయందును. "" భిదులను ఎడమమోకాలియందును, '' మీనములను ఎడమ పిక్కలయందును,"" మేషములను వామపాదాంగుళులందును, "" లోహితులను దక్షిణకుక్షియందును, "" శిఖులును వామకుక్షియందును, "" గలండులను పృష్ఠవంశమునందును, "" ద్విరండులను నాభియందును, '' మహాకాలులను, హృదయమునందును, '' వాణీశులను, త్వక్కునందును, '" భుజంగేశులను రక్తమునందును, '' పినాకులను మాంసమునందును, వ" ఖడ్గీశులను శరీరమునందును, '" బకులను ఎముకలందును, '" శ్వేతులను మజ్జయందును, '' సహితభృగువును, శుక్ర ధాతువునందును, '" నకులీశులను ప్రాణమునందును, 'క్ష' సంవర్తకులను పంచకోశములందును న్యాసము చేయవలెను. 'హ్రీం'బీజముతో రుద్రశక్తులను పూజించినవాడు సకలమనోరథములను పొందును.

అగ్నిమహాపురాణమునందు మాలినీమంత్రాదిన్యాస మను నూట నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters