Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రిచత్వారింశదధిక శతతమోధ్యాయః.

అథ కుబ్టికాపూజా.

ఈశ్వర ఉవాచ :

కుబ్జికాక్రమపూజాం చ వక్ష్యే సర్వార్థసాధనీమ్‌ | యయా జితాః సురా దేవైశ్శస్త్రాద్యై రాజ్యసంయుతైః. 1

మాయాబీజం తు గుహ్యాఙ్గే షట్కమస్త్రంకరే న్యసేత్‌ | కాలీకాలీతి హృదయం దుష్టచాణ్డాలికా శిరః. 2

హ్రౌం స్ఫేం హ స ఖ క ఛ డ ఓంకారో భైరవః శిఖా | ఖేలఖీ కవచం దూతీ నేత్రాఖ్యా రక్తచణ్డికా. 3

తతో గుహ్యకుబ్జికాస్త్రంమణ్డలే స్థానకే యజేత్‌ | అగ్నౌ కూర్చశిరో రుద్రే నైరృత్యేథ శిఖానిలే. 4

కవచం మధ్యతో నేత్రం హ్యస్త్రం దిక్షు చ మణ్డలే |

ద్వాత్రింశతాకర్ణికాయాం స్రోం హ స క్ష మ ల న వ ష ట స చాత్మమన్త్ర బీజకమ్‌. 5

బ్రహ్మాణీ చైవ మాహేశీ కౌమారీ వౌష్ణవీ తథా | వారాహీ చైవ మాహేన్ద్రీ చాముణ్డా చాణ్డికేన్ద్రకాత్‌. 6

యజేద్రవలకసహాఞ్చి వేన్ద్రాగ్రియమేగ్నిభే | జలే తు కుసుమమాలామద్రికాణాం చ పఞ్చకమ్‌. 7

జాలన్దరం పూర్ణగిరిం కామరూపం క్రమాద్యజేత్‌ | మరుదీశాగ్నినైరృత్యే మధ్యే వై వజ్రకుబ్జికామ్‌. 8

అనాదివిమలఃపూజ్యః సర్వజ్ఞవిమలస్తతః | ప్రసిద్ధివిమలశ్చాథ సంయోగవిమలస్తతః. 9

సమయాగోథ విమలో హ్యేతద్విమలపంచకమ్‌ | మరుదీశాన నైరృత్యే వహ్నౌచోత్తరశృంగకే. 10

కుబ్జార్థం ఖింఖినీ షష్ఠా సోపన్నా సుస్థిరా తథా | రత్నసున్ధరీ చైశానే శృఙ్గే చాష్టాదినాథకా. 11

మిత్ర ఓడీశషష్ఠ్యాఖ్యా వర్ణా అగ్న్యమ్బుపేనిలే | భ##వేద్గగనరత్నం స్యాచ్చాప్యే కవచరత్నకమ్‌. 12

బ్రుం మర్త్యః పఞ్చనామాఖ్యో మరుదీశానవహ్నిగాః | యామ్యాగ్నేయే పఞ్చరత్నం జ్యేష్ఠా రౌద్రీ తథాన్తికా.

తిస్రో హ్యాసాం మహావృద్ధాః పఞ్చప్రవణతోఖిలాః | సప్తవింశత్యష్టవింశ##భేదాత్సంపూజనం ద్విధా. 14

ఓం ఐం గూం క్రమగణపతిం ప్రణవం బటుకం యజేత్‌ | చతురస్రే మణ్డలే చ దక్షిణ గణపం యజేత్‌.

వామే చ బటుకం కోణ గురూన్‌ షోడశానధకాన్‌ | వాయవ్యాదౌ చాష్టదశ ప్రతిషట్కోణకే తతః. 16

బ్రహ్మాద్యాశ్చాష్టపరిత స్తన్మధ్యే చ నవాత్మకః | కుబ్జికా కులటా చైవ క్రమపూజా తు సర్వదా.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే కుబ్జికాపూజా నామ త్రిచత్వారింశదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను : సమస్తమనోరథములను సిద్ధింపచేయు కుబ్జికా క్రమపూజను గూర్చి చెప్పెదను. 'కుబ్జికా శక్తి సహాయముచే రాజ్యమునందున్న దేవతలు అస్త్రశస్త్రదులతో అసురులపై విజయము సాధించిరి. మాయాబీజ మైన 'హ్రీం' ను హృదయాది షణ్మంత్రములను క్రమముగా గుహ్యాంగమునందును, హస్తమునందును న్యాసము చేయవలెను. 'కాలీ కాలీ' -- ఇది హృదయమంత్రము. 'దుష్టచాండాలికా' - ఇది శిరోమంత్రము. ''హ్రీం స్ఫేం హ స ఖ క ద డ ఓం కారో భైరవః '' ఇది శిఖామంత్రము. 'ఖేలఖీ దూతీ' ఇది కవచమంత్రము. 'రక్తచణ్డికా' - ఇది నేత్రమంత్రము 'గుహ్యకుబ్జికా ---ఇది అస్త్రమంత్రము. వీటితో అంగన్యాస కరన్యాసములు చేసి, యథాస్థానముగ మండలముపై వీటిని పూజించవలెను. మండలమునందు ఆగ్నేయమున 'హూం', ఈశాన్యమున 'స్వాహా' నైరృతియందు 'వషట్‌' వాయవ్యమున 'హమ్‌', మధ్యభాగమున ''వౌషట్‌'' మండలము సకల దిశలయందు 'ఫట్‌' లిఖించి పూజించవలెను. ముప్పది రెండు అక్షరములతో గూడిన ముప్పది దశముల కమలముకర్ణికలో ''స్రోం హ స క్ష మ ల న వ బ ష ట స చ '' లను, ఆత్మబీజమంత్రమును (ఆమ్‌) న్యసించి పూజించవలెను. కమలము నలు వైపుల పూర్వదిక్కుతో ప్రారంభించి క్రమముగ బ్రహ్మాణీ మాహేశ్వరీ-కౌమారీ-వైష్ణవీ-వారాహీ-మాహేన్ద్రీ-చాముండా-చండికలన్యాసము చేసి పూజించవలెను. ఈశాన్య-పూర్వ-ఆగ్నేయ-దక్షిణ-నైరృతి-పశ్చిమములందు క్రమముగా 'ర, వ, ల, క, స, హ' లను న్యసించి పూజించవలెను. పిదప ఈ దిక్కులందే క్రమముగా కుసుకుమాలలు, పర్వతములు స్థాపించి పూజించవలెను. జాలంధర-పూర్ణగిరి-కామరూపాదులు పర్వతనామములు. పిదప వాయవ్య-ఈశాన్య-ఆగ్నేయ-నైరృతులయందును, మధ్యభాగమునందును వజ్ర కుబ్జికను పూజించవలెను. పిదప వాయవ్య-ఈశాన్య-నైరృతి ఆగ్నేయ-ఉత్తరశిఖరములపై క్రమముగ అనాదివిమల, సర్వజ్ఞ విమల, ప్రసిద్ధవిమల, సంయోగవిమల, సమయవిమలు లను ఐదుగురు విమలులను పూజించవలెను. కుబ్జికాప్రసాదము కొరకై ఈ శిఖరముల మీదనే క్రమముగ ఖింఖినీ-షష్టీ-సోపన్నా-సుస్థిరా-రత్నసుందరులరు పూజించవలెను. ఈశాన్యముననున్న శిఖరముపై ఎననుండుగురు ఆదినాథులను పూజించవలెను. ఆగ్నేయ శిఖరముపై మిత్రుని, పశ్చిమశిఖరముపై ఔడీశవర్షమును, వాయవ్యశిఖరముపై షష్టి వర్షమును పూజించవలెను. పశ్చిమదిశలో నున్న శిఖరముపై గగనరత్న-కవచరత్నములను, వాయవ్య-ఈశాన్య-ఆగ్నేయములందు 'బ్రుం' బీజసహితుడగు పంచనాము డను మర్త్యుని, దక్షిణ ఆగ్నేయములందు'పంచరత్న' మును అదే దిక్కులందు జ్యేష్ఠ, రౌద్రీ, అంతిక అను త్రిసంధ్యాధిష్ఠాన దేవతలను పూజించవలెను. వీరితో సంబంధించిన ఐదుగురు మహావృద్ధలను ప్రణవోచ్చారణ పూర్వకముగ పూజించవలెను. వీరి పూజ ఇరువదియేడు లేదా ఇరువది ఎనిమిది భేదములచే ద్వి విధముగా చెప్పబడుచున్నది. చతుష్కోణమండములన కుడివైపున గణపతిని, ఎడమ వైపున వటుకుని పూజించవలెను. క్రమ గణపతిని 'ఓం ఏం గూం క్రమగణపతయే నమః'' అను మంత్రముచేతను, ''ఓం వటుకాయ నమః '' అను మంత్రముచే వటుకుని పూజించవలెను. వాయవ్యాది దిక్కులదు నలుగురు గురువులను, పదునెనిమిది షట్కోణములందు పదునారుగురు నాధులను పూజించవలెను. మండలము నలువైపుల బ్రహ్మాదిదేవతలు ఎనమండుగురిని, మధ్యభాగమున తొమ్మిదవ దేవతగా కుబ్జికను, కులటాదేవిని పూజించవలెను. సర్వదా ఈ క్రమముననే పూజచేయవలెను.

అగ్ని మహాపురాణమునందు మంత్రజయార్ణవమున కుబ్జికాపూజావిధాన మను నూట నలుబదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters