Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్విచత్వారింశదుత్తర శతతమోధ్యాయః.

అథ మన్త్రౌషధాదిః.

ఈశ్వర ఉవాచ :

మన్త్రౌషధాని చక్రాణి వక్ష్యే సర్వప్రదాని చ | చౌరనామ్నో వర్గగణో ద్విఘ్నో మాత్రాశ్చతుర్గుణాః. 1

నామ్నా హృతే భ##వేచ్ఛేషః చౌరోథ జాతకం దదే | ప్రశ్నేయే విషమావర్ణాస్తే గర్భే పుత్రజన్మదాః. 2

నామవర్ణైః సమైః కాణో వామాక్షి విషమైఃపునః | దక్షిణాక్షి భ##వేత్కాణం స్త్రీపున్నామాక్షరస్యచ. 3

మాత్రావర్ణాశ్చతుర్నిఘ్నా వర్ణపిణ్డ గుణకృతే | సమే స్త్రీ విషమే న స్యాద్విశేషే చ మృతిః స్త్రియాః. 4

ప్రథమం రూపశూన్యేథ ప్రథమం మ్రియతే పుమాన్‌ |

ప్రశ్నం సూక్ష్మాక్షరైర్గృహ్య ద్రవ్యైర్భాగేఖిలే మతమ్‌.5

శనిచక్రం ప్రవక్ష్మామి తస్యదృష్టిం పరిత్యజేత్‌ | రాశిస్థః సప్తమే దృష్టిశ్చతుర్థదశతోర్ధికా. 6

ఏకద్వ్యష్టద్వాదశగః పాదదృష్టిశ్చ తం త్యజేత్‌ | దినాధిపః ప్రహరభాక్‌ శేషాయామార్ధభాగినః. 7

శనిభాగం త్యజేద్యుద్ధే దినరాహుం పదామి తే | రవౌ పూర్వోనిలే మన్ధే గురౌ యామ్యేనలే భృగౌ. 8

అ (50)

అగ్నౌ కుజే భ##వేత్సౌమ్యే స్థితే రాహుబుధే సదా | ఫణిరాహుస్తు ప్రహరమైశేవహ్నౌ చ రాక్షసే. 9

వా¸° సంవేష్టయిత్వా చ శత్రుం హన్తీశసంముఖమ్‌ | తిథిరాహుం ప్రవక్ష్యామి పూర్ణిమాగ్నేయగోచరే. 10

అమావాస్యా వాయవే చ రాహుః సమ్ముఖశత్రుహా | కాద్యాజాన్తాః సమ్ముఖే స్యుః సాద్యాదాన్తాశ్చదక్షిణ. 11

శుక్లే త్యజేత్కా జగుణాన్దాద్యామాన్తాశ్చ పూర్వతః | యాద్యాహాన్తా ఉత్తరే స్యుస్తిథిదృష్టిం వివర్జయేత్‌. 12

పూర్వాశ్చ దక్షిణాస్తిస్రో రేఖి వై మూలభేదకే | సూర్యరాశ్యాది సంలిఖ్య దృష్టౌ హానిర్జయాన్యథా. 13

విష్టిరాహుం ప్రవక్ష్యామి అష్టౌరేఖాస్తు పాతయేత్‌ |

శివాద్యమంయమాద్వాయుం వయోరిన్ద్రం తతోమ్బుపమ్‌. 14

నైరృతాచ్చ నయేచ్చంద్రంచన్ద్రాదగ్నిం తతో జలే | జలాదీశే చరేద్రాహుర్విష్ట్యా సహ మహాబలః. 15

ఐశాన్యాం చ తృతీయాదౌ సప్తమ్యాదౌ చ యామ్యకే |

ఏవం కృష్ణేసితే పక్షే వా¸° రాహౌ చ హన్త్యరీన్‌. 16

ఇన్ద్రాద్యాన్‌ భైరవాదీంశ్చ బ్రహ్మాప్యారీన్‌ గ్రహాదికాన్‌ |

అష్టాష్టకం చ పూర్వాదౌ యామ్యాదౌ వాతయోగినీమ్‌. 17

యాం దిశం వహతే వాయు స్తత్రస్థో ఘాతయేదరీన్‌ | దృడీకరణమఖ్యాస్యే కంఠే బాహ్వాదిధారితా. 18

పుష్యోద్దృతా కాణ్డలక్ష్యం వారయేచ్ఛరపుష్పికా | తథా పరాజితా పాఠా ద్వాభ్యాం ఖడ్గం నివారయేత్‌. 19

ఓం నమో భగవతి వజ్రశృఙ్ఖలే హన హన ఓం భక్ష భక్ష ఓం ఖాద ఓం అరే రక్తం పిబ కపాలేన

రక్తాక్షి రక్తపటే భస్మాంగి భస్మలిప్తశరీర వజ్రాయుధే వజ్రప్రాకారనిచితే పూర్వాం దిశం బన్ధ బన్ధ దక్షిణాం

దిశం బన్ధ బన్ధ పశ్చిమాం దిశం బన్ధ బన్ధ ఉత్తరాం దిశం బన్ధ బన్ధ నాగాన్‌ బన్ద బన్ధ నాగపత్నీర్బన్ధబన్ధ

ఓం అసురాన్‌ బన్ధ బన్ధ ఓం యక్ష రాక్షస పిశాచాన్‌ బన్ధ బన్ధ ఓం ప్రేతభూత గన్ధర్వాదయో యేకే

చిదు పద్రవాస్తేభ్యో రక్ష రక్ష ఓం ఊర్థ్వం రక్ష రక్ష ఓం క్షురికం రక్ష రక్ష ఓం జ్వలమహాబలే ఘటిఘటి

ఓం మోటి మోటి సటావలి వజ్రాగ్ని వజ్రప్రాకారే హూం ఫట్‌ హ్రీం హ్రూం శ్రీం ఫట్‌ హ్రీం హః పూం

ఫేం ఫః సర్వగ్రహేభ్యః సర్వవ్యాధిభ్యః సర్వదుష్టోపద్రవేభ్యో హ్రీం అశేషే భ్యో రక్ష రక్ష.

గ్రహజ్వరాది భూతేషు సర్వకర్మసు యోజయేత్‌. 20

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్ణవే మన్త్రౌషధాదిర్నామ ద్విచత్వారిం శదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను : ఇపుడు సంపూర్ణమనోరథముల నిచ్చు మంత్రచక్ర - ఔషదములను గూర్చి చెప్పెదను. చౌర్యము చేసిననట్లు సందేహము గల వ్యక్తిని గూర్చి ఏదైన ఒక వస్తువు పేరు చెప్పి, దానిలో ఉన్న అక్షరముల సంఖ్య రెట్టింపు చేసి ఒక చోట ఉంచు కొనవలెను. ఆ పేరులోని మాత్రల సంఖ్యను నాలుగుచే గుణించి ఆ గుణనఫలమును మరొకచోట ఉంచుకొనవలెను. మొదట సంఖ్యతో రెండవ సంఖ్యను భాగించవలెను. శేషమున్నచో ఆ వ్యక్తి చోరుడని శేషము లేనిచో చోరుడు కాడనియు గ్రహించవలెను. ఇపుడు పుట్టబోయే శిశువును గూర్చి చెప్పదను. ప్రశ్నలోని వర్ణములు విషమ సంఖ్యలో ఉన్నచో గర్భశిశువు పురుషుడు. ప్రశ్నించువాడు చెప్పిన వస్తువు పేరు స్త్రీలింగమైనచో, దాని అక్షరములు సమసంఖ్యలో నున్నయెడల పుట్టబోయే బాలునికి ఎడమ కన్ను గ్రుడ్డి దగును. ఏతద్విపరీతమైచనో దోషము లేదు. స్త్రీ పురుషనామముల మాత్రలసంఖ్యను, అక్షరముల సంఖ్యను వేరు వేరుగా నాలుగుచే గుణించి వేరు వేరుగా ఉంచుకొనవలెను. మొదటిది మాత్రాపిండము, రెండవది వర్ణపిండము, వర్ణపిండమును మూడుచే భాగించవలెను. శేషము సమ మైనచో కన్య విషమ మైనచో పుత్రుడు జన్మించును. శూన్యము శేషమైనచో భర్తకంటె ముందు భార్య చనిపోవును. మాత్రాపిండమును మూడుచే భాగించగా శూన్యము శేషమైనచో స్త్రీకంటె ముందు పురుషుడు మరణించును. సమస్తభాగమునందు సూక్ష్మాక్షరములు గల ద్రవ్యముల ద్వారా ప్రశ్నను గ్రహించినచో అభీష్టఫలజ్ఞానము కలుగును. శనిచక్రమును గూర్చి చెప్పెదను. శనిదృష్టి యున్న లగ్నము సర్వధా త్యాజ్యము. ఏడవస్థానముపై శనిదృష్టి పూర్ణముగాను, చతుర్థదశమ రాశులపై సగము ప్రథమ-ద్వితీయ-అష్టమ-ద్వాదశములందు పాదము ఉండును. శుభకర్మలందు వీటి న్నింటిని విడువవలెను. ఏ దినమునందు ఏ గ్రహము అధిపతియో ఆ దినమునందలి మొదటి జాము ఆ గ్రహమునకు సంబంధించును, మిగిలిన గ్రహములు ఆ దివసమునందలి అర్ధయామములకు అధిపతులు. శనిభాగ మైన సమయమున యుద్ధము చేయరాదు. ఇపుడు దినమున రాహుస్థితిని గూర్చిచెప్పెదను. రాహువు రవివారమునందు తూర్పనందును శనివారమునందు వాయవ్యమునందును, గురువారమున దక్షిణమునను, శుక్రవారమునందు ఆగ్నేయమునను, మంగళవారమునందు కూడ ఆగ్నేయమునను, బుధవారమున ఉత్తరమునందును ఉండును. ఫణిరాహువు ఈశాన్య-ఆగ్నేయ-నైరృతి-వాయవ్యములందు ఒక్కొక్క జాము ఉండును. యుద్ధమునందు తన ఎదుట నున్న శత్రువును ఆవేష్టించి చంపివేయును. ఇపుడు తిథిరాహువును గూర్చి చెప్పెదను. రాహువు పూర్ణిమనాడు ఆగ్నేయమునందును, ఆమావాస్యనాడు వాయువ్యమునందును ఉండును. సంముఖరాహువు శత్రునాశకరుడు. పశ్చిమమునుండి తూర్పునకు మూడు నిలువు గీతలు గీసి ఈ మూలరేఖలను భేదించుచు దక్షిణము నుండి ఉత్తరమునకు మూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక్కొక్క దిశయందు మూడేసి రేఖ లగును. సూర్యుడు ఏ రాశిపై ఉండునో దానిని ఎదుట నున్న దిక్కున వ్రాసి క్రమముగా పండ్రెండు రాశులను ప్రదక్షిణక్రమమున ఆ రేఖాగ్రములపై వ్రాయవలెను. పిదప 'క' నుండి 'జ' వరకు అక్షరములను ఎదుట నున్న దిక్కునందు వ్రాయవలెను. 'ఝ' నుండి 'ద' వరకు అక్షరములు దక్షిణమునను, 'ధ'నుండి 'మ'వరకు తూర్పునను, 'య'నుండి 'హ' వరకు ఉత్తరమునందును వ్రాయవలెను. వీటికి రాహుగుణము లని పేరు. శుక్లపక్షమునందు వీటిని త్యజించవలెను. తిథిరాహుసమ్ముఖదృష్టి కూడ త్యజించవలెను. రాహుదృష్టి ఎదుట నున్నచో హాని కలుగును. అట్లు కానిచో విజయము కలుగును. ఇపుడు విష్టిరాహువును గూర్చి చెప్పెదను. ఈశాన్యమునుండి దక్షిణమునకు, దక్షిణమునుండి వాయువ్యమునకు వాయువ్యమునుండి తూర్పునకును, అచటి నుండి నైరృతివరకును, అచటినుండి ఉత్తరమునకు, అచటినుండి ఆగ్నేయమునకు, అచటినుండి పశ్చిమమువరకును, పశ్చిమమునుండి ఈశాన్యమువరకును, ఎనిమిది రేఖలు గీయవలెను, ఈ రేఖలపై విష్టీ (భద్ర) తో కూడ మహాబలవంతుడగు రాహువును గూర్చి విచారింతురు. కృష్ణ పక్షతృతీయాది తిథులలో విష్టీరాహువు ఈశాన్యమునందును, సప్తమ్యాదులందు దక్షిణమునందును ఉండును. ఈ విధముగ కృష్ణ-శుక్లపక్షములందు వాయువ్యమునందున్న సంముఖరాహువు శత్రువినాశనమును చేయును. విష్టీరాహుచక్రమున పూర్వాదిదిక్కులందు ఇంద్రాద్యష్టదిక్పాలకులను, మహాభైరవాద్యష్టభైరవులను, బ్రహ్మాణ్యాద్యష్టశక్తులను, సూర్యాద్యష్టగ్రహములను స్థాపించవలెను. పూర్వదిదిక్కులందు ఒక్కొక్క దానియందు బ్రహ్మాణ్యాది, అష్టశక్తుల ఎనిమిది అష్టకములను గూడ స్ధాపించవలెను. దక్షిణాదిదిక్కులందు వాత యోగినిని వ్రాయవలెను.రాహువు వాయువు వీచుచున్న వైపున వీరందరితో కలిసి ఉండి శత్రువినాశనము చేయును. ఇపుడు ఆవయవములను సుదృఢము చేయు ఉపాయమును చెప్పెదను. శరపుంభిక అను ఓషధిని పుష్యనక్షత్రమునందు పెకలించి, చెప్పబోవు అపరాజితామంత్రము జపించి, కంఠమునందుగాని, భుజమునందు గాని ధరించినచో శత్రుబాణములకు లక్ష్యము కాకుండ రక్షించును. 'అపరాజితా' 'పాఠా' అను ఓషధులను కూడ ఈ విధముగనే ధరించినచో ఖడ్గప్రహారము నుండి తప్పించికొనవచ్చును. ''ఓం నమో భగవతి ...... రక్ష రక్ష'' అను (మూలోక్తమైనది) అపరాజితామంత్రము గ్రహ-జ్వర-భూతాది బాధలు తొలగించు కొనుటకు ఈ మంత్రమును ప్రయోగించవలెను.

అగ్ని మహాపురాణముందు యుద్ధజయార్ణవమున మంత్రౌషధాదిక మను నూటనలుబదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters