Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకోనచత్వారింశదధిక శతతమోధ్యాయః.

అథ షష్టిసంవత్సరఫలమ్‌.

ఈశ్వర ఉవాచ :-

షష్ట్యబ్దానాం ప్రవక్ష్యామి శుభాశుభమతః శృణు | ప్రభ##వే యజ్ఞ కర్మాణి విభ##వే సుఖినో జనాః. 1

శుక్లే చ సర్వసస్యాని ప్రమోదేన ప్రమోదితాః | ప్రజాపతౌ ప్రవృద్ధిః స్యాదఙ్గిరా భోగవర్ధనః. 2

శ్రీముఖే వర్దతే లోకో భావే భావః ప్రవర్ధతే | యూనా చ పూర్యతే శుక్రో ధాతా సర్వౌషధీకరః. 3

ఈశ్వరః క్షేమస్వారోగ్యః బహుధాన్యః సుభిక్షదః | ప్రమాథీ మధ్య వర్షస్తు విక్రమే సస్యసమ్పదః. 4

వృషో వృష్యతి సర్వాంశ్చ చిత్రభానుశ్చ చిత్రతామ్‌ |

స్వర్భానుః క్షేమమారోగ్యం తారణ జలదాః శుభాః. 5

సార్ధివే సస్యసంపత్తి రతివృష్టిస్తథా జయః | సర్వజిత్యుత్తమా వృష్టిః సర్వధారీ సుభిక్షదః. 6

విరోధీ జలదాన్‌ హాన్తి వికృతశ్చ భయఙ్కరః | ఖరే భ##వేత్పుమాన్వీరో నన్దనే నన్దతే ప్రజా. 7

విజయః శత్రుహన్తా చ శత్రురోగాది మర్దయేత్‌ | జ్వరార్తో మన్మథే లోకో దుష్కరే దుష్కరాః ప్రజాః. 8

దుర్ముఖే దుర్ముఖో లోకో హేమలమ్బేన సంపదః | సంవత్సరో మహాదేవి విలమ్బస్తు సుభిక్షదః. 9

వికారీ శత్రుకోపాయ విజయే సర్వదా క్వచిత్‌ | ప్లవే ప్లవన్తి తోయాని శోభ##నే శుభకృత్ర్పజా. 10

రాక్షసే నిష్ఠురో లోకో వివిధం ధ్యానమానలే | సువృష్టిః పిఙ్గలే క్వాపి కాలే హ్యుక్తో ధనక్షయః. 11

సిద్ధార్ధే సిధ్యతే సర్వం రౌద్రే రౌద్రం ప్రవర్తతే | దుర్మతౌ మధ్యమా వృష్టిర్దున్దుభిః క్షమధాన్యకృత్‌. 12

స్రవన్తే రుధిరోద్గారీ రక్తాక్షః క్రోధనోజయః | క్షయే క్షీణధనో లోకః షష్టిసంవత్సరాణి తు. 13

ఇత్యాగ్నేయే మహాపురాణ యుద్ధజయార్ణవే షష్టి సంవత్సర ఫలనిరూపణం నామ ఏకోనచత్వారింశదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను : పార్వతీ! ఇపుడు అరువది సంవత్సరమల (లోకొన్నింటి) శుభాశుభ ఫలములను చెప్పెదను. సావధానముగావినుము. ప్రభవసంవత్సరమున యజ్ఞకర్మలు అధికముగా జరుగును. 'విభవ' యందు ప్రజలు సుఖవంతులు. శుక్లయందు సమప్తధాన్య సమృద్ధి. 'ప్రమోదమున సకలానందము 'ప్రజాపతి' యందు వృద్ధి. అంగిరసమందు భోగవృద్ధి శ్రీముఖమున జనసంఖ్యావృద్ధి. 'యువ' మందు ప్రచురవర్షము. 'ధాత' యందు ఔషధుల అధికోత్పత్తి. 'ఈశ్వర' యందు క్షేమ- ఆరోగ్య ప్రాప్తి. బహుధాన్యమున ప్రచురాధాన్యోత్తపత్తి 'ప్రమాదియందు మధ్యవృష్టి 'విక్రమ' యందు అన్న సమృద్ధి. 'వృష' యందు సకలప్రజాపోషణము. చిత్రభానువునందు విచిత్రత, సుభానువునందు కల్యాణ ఆరోగ్యములు. 'తారణ' యందు శుభకరములగు మేఘములు. పార్థివమున సస్యసంపత్తి. అవ్యయమున అతివృష్టి, సర్వజిత్తునందు ఉత్తమవృష్టి, సర్వధారియందు ధాన్యాది సమృద్ది, విరోధియందు మేఘ వినాశము. 'వికృతి' యందు భయము 'ఖర' యందు పురుషులలో పౌరుషాధిక్యము. నందన యందు ప్రజానందము. 'విజయ' మందు శత్రునాశనము,జయ యందు రోగవినాశనము 'మన్మథ' యందు జ్వరపీడ. దుష్కరమునందు ప్రజలకు దుష్కర్మప్రవృత్తి. దుర్ముఖమున కటు భాషిత్వము. హేమలంబమున సంపత్ర్పాప్తి. విలంబమున అన్నప్రాచుర్యము వికారియందు శత్రుకోపము. శార్వరియందు అక్కడక్కడ సర్వలాభము ప్లవయందువరదలు. 'శోధన శుభకృతు' లందు నామానుకూలముగ శుభము. 'రాక్షస' యందు ప్రజలలో నిష్ఠురత్వము 'అనల' యందు వివిధాన్యోత్పత్తి. 'పింగల' యందు అచ్చటచ్చట వృష్టి. 'కాలయుక్త' మున ధనహాని. 'సిద్దార్థమున సకల కార్యసిద్ధి. రౌద్రమునందు ప్రపంచమున రౌద్రభావప్రవృత్తి. దుర్మతి' యందు మధ్యవృష్టి 'దుందుభి' యందు మంగలము ధనధాన్యప్రాప్తి. రుధిరోద్గారి రక్తాక్షులందు రక్తపానము. క్రోధనమున విజయము. 'క్షయ' యందు ప్రజాక్షయము ఈ విధముగ అరువది సంవత్సరముల (లోకొన్నింటిని) గూర్చి చెప్పబడినది.

అగ్నిమహాపురాణమునందు సంగ్రామజయార్ణవమున షష్టి సంవత్సర ఫలనిరూపణ మను నూట ముప్పదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters