Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రయస్త్రింశదధిక శతతమోధ్యాయః.

అథ నానాబలాని.

ఈశ్వర ఉవాచ:-

గర్భజాతస్య వక్ష్యామి క్షేత్రాధిపస్వరూపకమ్‌ | నాతిదీర్ఘః కృశః స్థూలః సమాంగో గౌరపైత్తికః. 1

రక్తాక్షో గుణవాఞ్ఛూరో గృహే సూర్యస్య జాయతే | సౌభాగ్యో మృదుసారశ్చ జాతశ్చన్ద్ర గ్రహోదయే. 2

దాతాధికో7తిలుబ్ధాదిర్జాతో భూమిభువో గృహే | బుద్ధిమాన్సుభగో మానీ జాతః సౌమ్యగ్రహోదయే. 3

బృహత్ర్కోధశ్చ సుభగో జాతో గురుగృహే నరః | త్యాగీ భోగీ చ సుభగో జాతో భృగుగ్రహోదయే. 4

బుద్దిమాన్సుభగో మానీ జాతస్చార్కిగృహే నరః |

సౌమ్యలగ్నే తు సౌమ్యః స్యాత్క్రూరః స్యాత్క్రూరలగ్నకే. 5

దశాఫలం గౌరి వక్ష్యే నామరాశౌ తుసంస్థితమ్‌ | గవాశ్వధనధాన్యాని రాజ్యశ్రీర్విపులా భ##వేత్‌. 6

పునర్థనాగమశ్చాపి దశాయాం భాస్కరస్యతు | దివ్యస్త్రీదా చన్ద్రదశా భూమిలాభః సుఖం కుజే. 7

భూమిర్ధాన్యం ధనం బౌధే గజాశ్వాదిధనం గురౌ | ఖాద్యపానధనం శుక్రే శనౌ వ్యాధ్యాధిసంయుతః. 8

స్నానసేవాదినా ధ్యానం వాణిజ్యం రాహుదర్శనే | వామనాడీ ప్రవాహే స్యాన్నామ చేద్విషమాక్షరమ్‌ . 9

తదా జయతి సంగ్రామేశనిభౌమసస్తెంహికాః | దక్షనాడీ ప్రవాహే7ర్కే వాణిజ్యేచైవ నిష్పలా. 10

సంగ్రామే జయమాప్నోతి సమనామా నరో ధ్రువమ్‌ | అధశ్చారే జయం విద్యా దూర్ద్వచారే రణ మృతిమ్‌ 11

పరమేశ్వరుడు చెప్పెను: సూర్యాదిగ్రహముల రాశులందు జన్మించిన శిశువునకు క్షేత్రాధిపతిని పట్టి కలుగు ఫలము చెప్పెదను. సింహలగ్నమునందు పుట్టినవాడు సమకాయుడు, ఒకప్పుడు కృశాంగుడు, ఒకప్పుడు స్థూలశరీరము కలవాడు, గౌరవర్ణుడు, పిత్తప్రకృతి, రక్తనేత్రుడు, గుణవంతుడు, వీర్యవంతుడు అగును. కర్కటలగ్నము పుట్టినవాడు భాగ్యవంతుడు, కోమలశరీరముకలవాడు అగును. మేష-వృశ్చికజాతుడు వాతరోగి, అత్యంతలుబ్ధుడు అగును. మిథున-కన్యాలగ్న జాతుడు బుద్ధిమంతుడు, సుందరుడు అగును. ధను-ర్మీనలగ్నజాతుడు సుందరుడు, అధికకోపవంతుడును అగును. మకరకుంభలగ్న జాతుడు బుద్ధిమంతుడు, సుందరుడు, మానవంతుడు అగును, సౌమ్యలగ్నమందు పుట్టినవాడు సౌమ్యస్వభావవంతుడగును. క్రూరలగ్నజాతుడు క్రూరస్వభావుడగును. గౌరీ! ఇపుడు నామరాశులనుబట్టి సూర్యాది గ్రహదశాఫలము చెప్పెదను-సూర్యదశయందు గజములు, అశ్వములు, ప్రబలరాజ్యలక్ష్మి లభించును. ధనావాప్తి కలుగును. చంద్రదశలో దివ్యస్త్రీప్రాప్తి, కుజదశలో భూమిలాభము, సుఖము కలుగును. బుధదశలో భూమిలాభముతో పాటు ధనధాన్యప్రాప్తి కూడ కలుగును. గురుదశలో గజాశ్వధనప్రాప్తి కలుగును. శుక్రదశలో ఖాద్యాన్నము. గోదుగ్ధాదిపానము ధనలాభము ఉండును. శనిదశలో నానావిధములగు రోగములు కలుగును. రాహుదర్శనమును, అనగా గ్రహణసమయమున స్నానాదులాచరించి ధ్యానము చేయవలెను. వాణిజ్యము చేయవలెను. ఎడమ శ్వాస ఉన్నపుడు నామాక్షరము సంఖ్య విషమమైనచో ఆ సమయము కుజ-శని-రాహువులకు సంబంధించినది. అపుడు యుద్ధము చేయుటచే విజయము లభించును. కుడి శ్వాస ఆడునపుడు నామాక్షరసంఖ్య సమసంఖ్యయైనచో అది సూర్యుని సమయము. ఆ సమయమున వర్తకము చేయుట నిష్ఫలము. కాని ఆ సమయమున పదాతి యై యుద్ధము చేసినచో విజయము లభించును. ఏదైన వాహనముపై ఎక్కి యుద్ధము చేసినచో మృత్యువు కలుగను.

ఓం హూం ఓం హ్రం ఓం స్ఫే అస్త్రం మోటయ చూర్ణయ చూర్ణయ ఓం

సర్వశత్రుం మర్దయ మర్దయ ఓం హ్రూం ఓం హ్రః ఫట్‌.

సప్తవారం న్యసేన్మన్త్రం ధ్యాత్వాత్మానం తు భైరవమ్‌|

చతుర్భుజం దశభుజం వింశద్బాహ్వాత్మకం శుభమ్‌.12

శూలఖట్వాఙ్గహస్తం తు ఖడ్గకట్టారికోద్యతమ్‌ | భక్షణం పరసైన్యానామాత్మ సైన్యపరాజ్ముఖమ్‌. 13

సమ్ముఖం శతక్రుసైన్యస్య శతమష్టోత్తరం జపేత్‌ | జపాడ్డమరుకాచ్ఛబ్దాచ్ఛస్త్రం ముక్త్వా పలాయతే. 14

పరసైన్యం శృణు భంగప్రయోగేణ పునర్వది | శ్మశానఙ్గారఘాదాయ విష్ఠాం చోలూకకాకయోః. 15

కర్పటే ప్రతిమాం లిఖ్య సాధ్యసై#్యవాక్షరం యథా | నామాథ నవధా లిఖ్య రిపోశ్చైవ యథాక్రమమ్‌. 16

మూర్ద్ని వక్త్రే లలాటే చ హృదయే గుహ్యపాదయోః |

పృష్ఠే చ బాహుమధ్యే తు నామ వై నవధా లిఖేత్‌. 17

మోటయేద్యుద్దకాలే తు ఉచ్చరిత్వా తు విద్యయా |

'ఓం హూం ...' ఇత్యాది మూలోక్తమంత్రమును ఏడు పర్యాయములు న్యాసముచేసి, నాలుగు,పది, ఇరువది భుజములు కలవాడును, కటారమును ధరించినవాడును, తన సేవకు మిముఖుడై శత్రుసేనను భక్షించుచున్నావాడును. అగు భైరవుని హృదయమునందు ధ్యానించుచు, శత్రుసేన ఎదుట పై మంత్రమును నూట ఎనిమిది పర్యాయములు జపించవలెను. పిదప డమరు శబ్దము చేయగా శత్రుసేన శస్త్రములు విడచి పారిపోవును. శత్రుపరాజయము కొరకై మరొక ప్రయోగము చెప్పెదను. శ్మశానమునందలి బొగ్గులను కాకి-గుడ్లగూబ రెట్టలతో కలిపి దానితో బట్టపై శత్రువు చిత్రము వ్రాసి,వాని శిరస్సు, ముఖము, లలాటము, హృదయము, గుహ్యము, పాదములు, పృష్ఠము, బాహువులు నడుము- వాటిపై వాని పేరు తొమ్మిది పర్యాయములు వ్రాయవలెను. ఆ బట్ట మడచి యుద్ధమునందు తన దగ్గర ఉంచుకొని పూర్వోక్తమంత్రమును జపించుటచే జయము లభించును.

తార్‌క్ష్య చక్రం ప్రవక్షామి జయార్థం త్రిముఖాక్షరమ్‌ . 18

క్షిప ఓం స్వాహా తార్‌క్ష్యాత్మా శత్రురోగవిషాదినుత్‌ | దుష్టభూతగ్రహార్తస్య వ్యాధితస్యాతురస్య చ. 19

కరోతి యాదృశం కర్మ తాదృశం సిధ్యతే ఖగాత్‌ | స్థావరం జంగమం చైవ లూతాశ్చ కృత్రిమం విషమ్‌.

తత్సర్వం నాశమాయాతి సాధకస్యావలోకనాత్‌ | పునర్ధ్యాయే న్మహాతార్‌క్ష్యం ద్విపక్షం మానుషాకృతిమ్‌. 21

ద్విభుజం వక్రచఞ్చుం చ గజకూర్మధరం ప్రభుమ్‌ | అసంఖ్యరగపాదస్ధమాగచ్ఛన్తం ఖమధ్యతః 22

గ్రసన్తం చైవ ఖాదన్తం తుదన్తం చాహవే రిపూన్‌ |

చంచ్వా హతాశ్చ ద్రష్టవ్యాః కేచిత్పాదైశ్చ చూర్ణితాః. 23

పక్షపాతైశ్చూర్ణితాశ్చ కేచిన్నష్టా దిశో దశ|

తార్‌క్ష్య ధ్యానాన్వితో యశ్చత్రైలోక్యో హ్యజయో భ##వేత్‌. 24

ఇపుడు, విజచయప్రాప్తిసాధన మగు త్రిముఖాక్షరమహాతార్‌క్ష్యచక్రమును చెప్పెదను. "క్షిప ఓం స్వాహా తార్‌క్ష్యాత్మా శత్రురోగవిషాదినుత్‌" ఈ మంత్రము తార్‌క్ష్య చక్రము ఈమంత్రమును ఆనుష్ఠించుటచే దుష్టభాధ, భూతభాధ, గ్రహభాధ, అనేక విధము లగు రోగములును తొలగును. ఈ గరుడంమంత్రముచే ఏకార్యమైనను సిద్ధించును. ఈమంత్రసాధకుని దృష్టి ప్రసరించుటచే స్థావర-జంగమవిషములు, లూతావిషము,కృత్రిమవిషము అన్నియు నశించును. మహాతార్‌క్ష్యుని ఈ విధముగా ధ్యానించవలెను. మనుష్యాకృతితో రెండు భుజములు, రెండు రెక్కలు కలిగి యుండును. ముక్కు వంకరగా నుండును. మహాబలము గల హస్తములతో ఏనుగను, తాబేలును ధరించి యుండును. పాదములందు అసంఖ్యాకము లగు సర్పములు చుట్టుకొని యుండును. అకాశమార్గమున వచ్చి రణరంగమున శత్రువులను పొడిచి పొడిచి తినుచుండును. కొందరు శత్రువులు ఆతని ముట్టెచే చంపబడి యుందురు. కొందరు పంజాదెబ్బచే మరణింతురు కొందరు రెక్కల దెబ్బకు చూర్ణము చేయబడుదురు. కొందరు పది దిక్కులకు పారిపోవుచుందురు. ఈ విధముగా ధ్యాననిష్ఠుడగు సాధకుడు మూడు లోకములందును అజేయుడగును.

పిఛ్చికాం తు ప్రవక్ష్యామి మన్త్రసాధనజాం క్రియామ్‌.

ఓం హ్రూం పక్షిన్‌ క్షిప ఓం హూం సః మహాబల పరాక్రమ సర్వసైన్యం భక్షయ

భక్షయ ఓం మర్దయ ఓం చూర్ణయ చూర్ణయ వఓం విద్రావయ విద్రావయ

ఓం హూం ఖః ఓం భైరవో జ్ఞాపతియ స్వాహా|

మన్త్రయేద్భ్రామయేత్త్సెన్యం సంముఖం గజసింహయోః|

ధ్యానాద్రవాన్మర్ణయేచ్చ సింహారూఢో మృగాదికాన్‌.

శబ్దాద్భంగం ప్రవక్ష్యామి దూరం మన్త్రేణ బోధయేత్‌ | మాతౄణాం చరుకం దద్యాత్కాలరాత్య్రా విశేషతః

శ్మశానభస్మసంయుక్తాం మాలతీచామరీ తథా | కార్పాసమూలమాత్రం తుతేన దూరన్తు బోధయేత్‌. 28

ఓం అహే హే మహేన్ద్రి అహే మహేన్ద్రి హి ఓం జహి మసానంహి

ఖాహి ఖాహి లిలి కిలి ఓం హుం ఫట్‌.

అరేర్నాశం దూరశబ్దాజ్జప్తయా భంగవిద్యాయా|

అపరాజితా చ ధుస్తూరస్తాభ్యాం భఞ్జతు తిల కేన హి. 29

ఓం కిలి కిలి లికిలి ఇచ్ఛాకిలి భూతహాని శంఖిని ఉమే దణ్డహస్తే మాహేశ్వరి ఉల్కాముఖి జ్వాలాముఖి

శజ్గుకర్ణే శుష్కజఙ్ఘే అలమ్బుషే హర ఓం సర్వదుష్టాన్‌ ఖన ఓం యన్మాం నిరీక్షయేద్దేవి తాంస్తాన్‌.

మోహయ ఓం రుద్రస్య హృదయే స్థితా రౌద్రి సౌమ్యేన భావేన ఆత్మరక్షాం తతః కుర స్వాహా.

బాహ్యతో మాతౄః సంలిఖ్య సకలాకృతివేష్టితాః | నాగపత్రే లిఖేద్విద్యాం సర్వకామార్థ సాధనామ్‌. 30

హస్తాద్యైర్ధారితా పూర్వం బ్రహ్మరూద్రేన్ద్రవిష్ణుభిః | గురుసఙ్గ్రామకాలే తు విద్యయా రక్షితాః సురాః. 31

రక్షయా నారసింహ్యా చ భైరవ్యా శక్తిరూపయా | సర్వే త్రైలోక్యమోహిన్యా గౌర్యా దేవాసురే రణ. 32

ఇపుడు మంత్రసాధనచే సిద్ధించు పిఛ్చికాక్రియను గూర్చి చెప్పెదను. "ఓం హూం పక్షిన్‌...స్వాహా" అను (మూలోక్త) పచ్చికామంత్రమును చంద్రగ్రహణమునందు జపించి సిద్ధింపచేసికొనిన సాధకుడు యుద్ధమునందు గజమును, సింహమును గూడ ఎదిరించగలడు. మంత్రధ్యానముచే శత్రువులను, లేళ్శను మేకలను వలె చంపగలడు. దూరమునుండియే కేవల మంత్రోచ్చారణముచే శత్రువినాశము చేయు ఉపాయము చెప్పబడుచున్నది. కాలరాత్రియందు (అశ్విని శుక్లాష్టమినాడు) మాతృకలకు చరుప్రదానము చేసి శ్మశానభస్మము, మాలతీపుష్పములు, చామరి, పత్తి చెట్టువేరు వాటితో దూరమునుండియే శత్రువును సంబోంధించవలెను. ఓం అహే హుంఫట్‌" అనునది సంబోంధించి మంత్రము. ఈ భంగవిద్యను జపించుటచేతను, దూరమునుండియే ధ్వని చేయుట చేతను, అపరాజిత, ధత్తూరము వీటి రసము కలిపి తిలకము ధరించుట చేతను శత్రువులు నశింతురు. "ఓం కిలి కిలి ....కురుస్వాహా" అను (మూలోక్తమగు) సర్వకార్యార్థసాధకమంత్రమును భూర్జపత్రముపై వృత్తాకారముగ వ్రాసి, బహిర్భాగమున మాతృకలను వ్రాయవలెను., ఈ విద్యను మొదట బ్రహ్మవిష్ణుమహేంద్రాదులు హాస్తాదులందు ధరించిరి. ఈ విద్య ద్వారా బృహస్పతి దేవాసురసంగ్రామమునందు దేవతలను రక్షించెను. రక్షారూపిణియు, నారసింహియు, శక్తిరూపిణియు, భైరవియు, త్రైలోక్యమోహినియు అగు గౌరి కూడ దేవాసురసంగ్రామమునందు దేవతలను రక్షించెను.

బీజసంపుటితం నామ కర్ణికాయాం దలేషు చ | పూజా క్రమేణ చాఙ్గాని రక్షాయన్త్రం స్మృతం శుభే. 33

మృత్యుఞ్జయం ప్రవక్ష్యామి నామసంస్కారమధ్యగమ్‌ | కలాభిర్వేష్టితం పశ్చాత్సకారేణ నిబోధితమ్‌. 34

జకారం బిన్దుసంయుక్తం ఓంకారేణ సమన్వితమ్‌ | ధకారోదరమధ్యస్థం పకారేణ నిబోధితమ్‌. 35

చన్ద్రసంపుటమధ్యస్థం సర్వదుష్టవిమర్దకమ్‌ | అథవా కర్ణికాయాం చ లిఖేన్నామ చ కారణమ్‌. 36

పూర్వే దలే తథోఙ్కారం స్వదక్షే చోత్తరం లిఖేత్‌ |

ఆగ్నేయ్యాదౌ చ హూంకారం దలే షోడశ##కే స్వరాన్‌.37

చతుస్త్రింశద్ధలే కాద్యాన్‌ బాహ్యే మన్త్రం చ మృత్యుజిత్‌ | లిఖేద్వై భూర్జపత్రేతు రోచనాకుంకుమేన చ.

కర్పూరచన్దనాభ్యాం చ శ్వేతసూత్రేణ వేష్టయేత్‌ | సిక్థకేన పరిచ్ఛాద్య కలశోపరి పూజయేత్‌. 39

యన్త్రస్య ధారణాద్రోగాః శమ్యన్తి రిపవో మృతిః | విద్యాం తు ఖేలభీం వక్ష్యే విప్రయోగమృతేర్హరామ్‌. 40

ఆం వాతరే వితరే బిడాలముఖి ఇన్ద్రపుత్రి ఉద్భవో వాయుదేవేన ఖీలి అజి హాజా మయి వాహ ఇత్యాది

దుఃఖనిత్యకణ్ఠోచ్చైర్ముహూర్తాన్వయా అహ మాం యస్మహా ముపాడి ఓం ఖేలఖి స్వాహా

నవదుర్గా సప్తజప్తాన్ముఖస్తమ్భో ముఖస్థితాత్‌ |

ఓం చణ్డి ఓం హూం ఫట్‌ స్వాహ - గృహీత్వా సప్త జప్తం తు ఖడ్గయుద్దే7పరాజితః 41

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్దజయార్ణవే నానాబలనిరూపణం నామ

త్రయస్త్రింశదధిక శతతమో7ద్యాయః

అష్టదల కమలము కర్ణికయందును, దలములందును గౌరీబీజముతో (హ్రీం) సంపుటిత మైన తన పేరు వ్రాయవలెను. పూర్వదిక్కునందున్న ప్రథమాదిదలముపై పూజానుసారము గౌరి అంగదేవతల న్యాసము చేయవలెను. ఈ విధముగా వ్రాయగా రక్షామంత్రము ఏర్పడును. ఈ సంస్కారముల మధ్య సకలకలాపరివేష్టితము, సకారముచే ప్రబోధితము అగు మృత్యుంజయమంత్రమును చెప్పెదను. ముందుగా ఓంకారము వ్రాసి, పిదప బిందుయుక్త మగు జకారము, వ్రాయవలెను. పిదప గర్భమున వకారము వ్రాసి దానిని చంద్రబిందువుచే అంకితము చేయవలెను అనగా "ఓం జం ధ్వం" అను మంత్రము దుష్టు లందరిని నశింపచేయును. గోరోచనా-కుంకుములతో గాని, మలయగిరి చందన - కర్పూరములతో గాని భూర్జపత్రముపై గీసిన చతుర్దల కమల కర్ణికయందు తన పేరు వ్రాసి, నాలుగు దలములపై ఓంకారము వ్రాయవలెను. ఆగ్నేయాది కోణములందు హుంంకారము వ్రాయవలెను. దానిపై పదునారు దళముల కమలము వ్రాయవలెను. దాని దలముపై అకారాది షోడశస్వరములు వ్రాయవలెను. దాని దలములపై ముప్పదినాల్గు దళముల కమలము నిర్మించవలెను. దాని దలములపై '' నుండి 'క్షి' వరకు అక్షరములు వ్రాసి, ఆ యంత్రమును శ్వేతసూత్రముచే చుట్టబెట్టి, పట్టు బట్టతో కప్పి, కలశముపై స్థాపించి పూజించవలెను. ఈ యంత్రమును ధరించుటచే సకల రోగములు శాంతించును., శత్రువులు నశింతురు. ఇపుడు వియోగమునందు కలుగు మృత్యువును నివారించు 'ఖేలఖీ' విద్యను చెప్పెదను. "ఓంవాతరే .. ఓంస్వాహా" అను (మూలోక్త) మంత్రమును నవరాత్రులందు జపించి, సిద్ధి పొంది, యుద్ధమునందు ఏడు పర్యాయములు జపము చేయగా శత్రువులను ముఖస్తంభన మగును. "ఓం చండి, ఓం హూంఫట్‌ స్వాహా" అనుమంత్రమును యుద్ధసమయమునందు ఏడు పర్యాయములు జపించుటచే ఖడ్గయుద్ధమున విజయము కలుగును

అగ్నిమహాపురాణమునందు యుద్ధజయార్ణమున నానాబలవర్ణన మను ముప్పదిమూడవ అధ్యాయముసమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters