Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ త్రింశదధిక శతతమో7ధ్యాయః

అథ మణ్డలవర్ణనమ్‌

ఈశ్వర ఉవాచ :

మణ్డలాని ప్రవక్ష్యామి చతుర్ధా విజయాయ హి | కృత్తికా చ మఘా పుష్యం పూర్వాచైవ తు ఫాల్గునీ. 1

విశాఖాభరణీ చైవ పూర్వభాద్ర పదాతథా | ఆగ్నేయమణ్డలం భ##ద్రే తస్య వక్ష్యామి లక్షణమ్‌. 2

యద్యత్ర చలతే వాయుర్వేష్టనం శశిసూర్యయోః | భూమికమ్పో7థ నిర్ఘాతో గ్రహణం చన్ద్రసూర్యయోః . 3

ధూమజ్వాలా దిశాం దాహః కేతోశ్చైవ ప్రదర్శనమ్‌ | రక్తవృష్టిశ్చోపతాపః పాషాణపతనం తథా. 4

నేత్రరోగో7తిసారశ్చ అగ్నిశ్చ ప్రబలో భ##వేత్‌ | స్వల్పక్షీరాస్తథా గావః స్వల్పపుష్పఫలాద్రుమా. 5

వినాశ##శ్చైవ సస్యానాం స్వల్పవృష్టిం వినిర్దిశేత్‌ | చాతుర్వర్ణ్యాః ప్రపీడ్యన్తే క్షుధార్తా అఖిలా నరాః. 6

సైన్దవా యామునాశ్చైవ గుర్జరా భోజబాహ్లికాః | జాలన్దరం చ కాశ్మీరం సప్తమం చోత్తరాపథమ్‌. 7

దేశాశ్చైతే వినశ్యన్తి తస్మిన్నుత్పాతదర్శనే | హస్తచిత్రా మఘా స్వాతీ మృగో వాథ పునర్వసుః. 8

ఉత్తరా ఫల్గునీ చైవ అశ్వినీ చ తథైవ చ | యదాత్ర భవతీ కిఞ్చిద్వాయవ్యం తం వినిర్దిశేత్‌. 9

నష్టధర్మాః ప్రజాః సర్వా హాహాభూతా విచేతసః | డాహలః కామరూపం చ కలింగః కోసల స్తథా. 10

అయోధ్యా చ హ్యావన్తీ చ నశ్యన్తే కోఙ్కణాన్ధ్రకాః | ఆశ్లేషా చైవ మూలం తు పూర్వాషాఢా తథైవ చ.

రేవతీ వారుణం హ్యృక్షం తథా భాద్రపదోత్తరా | యదాత్ర చలతే కిఞ్చిద్దారుణం తం వినిర్దిశేత్‌. 12

బహుక్షీరఘృతా గావో బహుపుష్పఫలా ద్రుమాః | ఆరోగ్యం తత్ర జాయతే బహుసస్యా చ మేదినీ. 13

పరమేశ్వరుడు చెప్పెను : ఇపుడు నేను విజయమునకై నాలుగు విధములగు మండములను గూర్చి చెప్పెదను.కృత్తికా-మఘా-పుష్య-పూర్వఫల్గునీ-విశాఖా-భరణీ-పూర్వాభాద్రపదల మండలము ఆగ్నేయ మండలము. దాని లక్షణము చెప్పెదను. ఈ మండలమునందు వాయుప్రకోపము వచ్చినను, సూర్యచంద్రపరివేషము కలిగినను, భూమి కంపించినను, దేశమునకు వినాశము కలుగును. సూర్య-చంద్రగ్రహణములు వచ్చినను, ధూమజ్వాల కలనబడినను, దిక్కులు దహించుకొని పోవుచున్నట్లు కనబడినను, ధూమకేతువు కనబడినను, రక్తవృష్టి వచ్చినను, ఎక్కువ వేడిగా నున్నను, రాళ్ళు కురిసినను జనులకు నేత్రరోగము, అతీసారము, అగ్నిభయము కలుగును, ఆవు పాలు తక్కువ ఇచ్చును. వృక్షములందు ఫలపుష్పములు తక్కువగా ఉండును. పంట తక్కువగును. వృక్షములు కూడ తక్కువగా ఉండును. నాల్గువర్ణముల వారును దుఃఖితు లగుదురు. మనుష్యులందరును ఆకలితో బాధపడుదురు., ఇట్టి ఉత్పాతములు కలిగినపుడు సింధుయమునాప్రాంతములు, గుజరాతు, భోజ-బాహ్లీక-జాలంధర-కాశ్మిర-ఉత్తరాపథముల నశించిపోవును. హస్త-చిత్రా-మఘా-స్వాతీ-మృగశీర్ష-పునర్వసు-ఉత్తరఫల్గునీ-అశ్వినీనక్షత్రముల మండలము వాయవ్యమండలము. ఈ మండలమునందు వెనుక చెప్పిన ఉత్పాతములు కలిగినచో ప్రజలందరును, హాహాకారము చేయుచు, నష్టప్రాయ లగుదురు. డ్రాహల (త్రిపుర)-కామరూప-కలింగ-కోసల-అయోధ్యా-ఉజ్జయినీ-కోంకణ-ఆంధ్రదేశములు నష్టమగును. ఆశ్లేషా-మూల-పూర్వషాఢా-రేవతీ-శతభిషా-ఉత్తరాభాద్రపదానక్షత్రముల మండలము వారుణమండలము పైన చెప్పిన ఉత్పాతములు ఈ మండలమునందు ఉత్పన్నమైనచో ఆవు పాలు, నెయ్యి వృద్ధిపొందును. వృక్షములందు ఫలపుష్పములు అధికముగా నుండును. ప్రజలు ఆరోగ్యవంతులగుదురు. భూమి సస్యసమృద్ధముగా నుండును.

ధాన్యాని చ సమార్ఘాణి సుభిక్షం పార్థివం భ##వేత్‌ | పరస్పరం నరేన్ద్రాణాం సంగ్రామో దారుణో భ##వేత్‌. 13

జ్యేష్ఠా చ రోహిణీచైవ అనురాధా చ వైష్ణవమ్‌ | ధనిష్ఠాచోత్తరాషాఢా అభిజిత్సప్తమం తథా. 14

యదాత్ర చలతే కిఞ్చిన్మాహేన్ద్రం తం వినిర్దిశేత్‌ | ప్రజాః సముదితాస్తస్మిన్‌ సర్వరోగవివర్జితాః. 15

సన్దిం కుర్వన్తి రాజానః సుభిక్షం పార్థివం శుభమ్‌ | గ్రామస్తు ద్వివిధో ఙ్ఞేయో ముఖపుచ్ఛకరో మహాన్‌. 16

చన్ద్రో రాహుస్తథాదిత్య ఏకరాజౌ యది స్థితః | ముఖగ్రామస్తువిజ్ఞేయో యామిత్రే పుచ్ఛ ఉచ్యతే. 17

భానోః పఞ్చదశే హ్యృక్షే యదా చరతి చన్ద్రమాః | తిథిచ్ఛేదే తు సంప్రాప్తే సోమగ్రామం వినిర్దిశేత్‌. 18

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్ధజయార్జవే మణ్డలవర్ణనం నామ త్రింశదధిక శతతమో7ధ్యాయః

ధ్యానములు చౌకగా నుండును. దేశము సుభిక్షముగా నుండును. కాని రాజుల మధ్య ఘోరసంగ్రామములు చెలరేగును జ్యేష్ఠా-రోహిణీ-అనురాధా-శ్రవణ-ధనిష్ఠా-ఉత్తరాభాద్రపదా-అభిజిత్తుల. మండలము మహేంద్రమండలము. ఈ మండలమునందు పై ఉత్పాతములు సంభవించినచో ప్రజలు సౌఖ్యముతో నుందురు. రోగభయ మేమియు ఉండదు. రాజులు తమలో సంధి చేసికొందురు. రాజులకు హితకర మగునటుల సుభిక్ష మేర్పుడును. ముఖగ్రామ, పుచ్ఛ గ్రామము అని గ్రామము రెండు విధములు చంద్ర-రాహు-సూర్యులు ఒక రాశిలో ఉన్నప్పుడు ముఖగ్రామము, రాహువునుండి ఏడవ స్థానమునకు పుచ్ఛగ్రామ మని పేరు. చంద్రుడు సూర్యుడున్న నక్షత్రమునుండి షదునైదవ నక్షత్రమునకు వచ్చినపుడు, తిథిసాధనము ననుసరించి సోమగ్రామము, అనగా పూర్ణిమాతిథి అగును.

అగ్నిమహాపురాణమునందు యుద్ధజయార్ణవమున వివిధమండలవర్ణనమను నూటముప్పదియవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters