Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ చతుర్వింశత్యుత్తర శతతమో7ధ్యాయః.

అథ యుద్ధజయార్ణనే జ్యోతిఃశాస్త్రసారః.

అగ్ని రువాచ :

జ్యోతిః శాస్త్రాదిసారం చ వక్ష్యే యుద్ధజయార్ణవే | వేలామన్త్రౌషధాద్యం చ యథోమామీశ్వరో7బ్రవీత్‌. 1

దేవ్యువాచ :

దేవైర్జితా దానవాశ్చ యేనోపాయేన తద్వద | శుభాశుభవివేకాద్యం జ్ఞానం యుద్ధజయార్ణవమ్‌. 2

ఈశ్వర ఉవాచ :

మూలదేవేచ్ఛయా జాతా శక్తిః పఙ్చదశాక్షరా | చరాచరం తతో జాతం యమారాధ్యాఖిలార్థవిత్‌. 3

మన్త్రపీఠం ప్రవక్ష్యామి పఞ్చమన్త్రసముద్భవమ్‌ | తే మన్త్రాః సర్వమన్త్రాణాం జీవితే మరణ స్థితాః. 4

బుగ్యజుః సామాథర్వాఖ్యవేదమన్త్రాః క్రమేణ తే | సద్యోజాతాదయో మన్త్రా బ్రహ్మావిష్నుశ్చ రుద్రకః. 5

ఈశః సప్తశిఖా దేవాఃశ శక్రాద్యాః పఞ్చ చ స్వరాః |

అ ఇ ఉ ఏ ఓ కలాశ్చ మూలం బ్రహ్మేతి కీర్తితమ్‌. 6

కాష్ఠమధ్యే యథా వహ్నిరప్రవృద్ధో న దృశ్యతే | విద్యమానా తథా దేహే శివశక్తిర్న దృశ్యతే. 7

ఆదౌ శక్తిః సముత్పన్నా ఓఙ్కారస్వరభూషితా | తతో బిన్దుర్మహాదేవీ ఏకారేణ వ్యవస్థి తః. 8

జాతో నాద ఉకారస్తు నదతే హృది సంస్థితః | అర్దచన్ధ్ర ఇకారస్తు మోక్షమార్గస్య బోధకః. 9

అకారో వ్యక్త ఉత్పన్నో భోగమోక్షప్రదః పరః | ఆకార ఐశ్వరే భూమిర్నివృత్తిశ్చ కలా స్మృతా. 10

గన్దో నబీజః ప్రాణాఖ్య ఇడాశక్తిః స్థిరా స్మృతా | ఇకారశ్చ ప్రతిష్ఠాఖ్యో రసో పాలశ్చ పిఙ్గలా. 11

క్రూరా శక్తిరీం బీజః స్యాద్ధరబీజో7గ్నిరూపవాన్‌ | విద్యా సమానా గాంధారీ శక్తిశ్చ దమనీ స్మృతా. 12

ప్రశాన్తిర్వాయోః స్పర్శీయశ్చోదానశ్చలా క్రియా |

అగ్నిదేవుడు పలికెను : శంకరుడు పార్వతికి చెప్పిన ప్రకారము నే నిపుడు యద్ధజయార్ణవప్రకరణసారమైన సమయమును, మంత్రమును, ఔషధములు మొదలగువాటిని వర్ణించి చెప్పెదను. పార్వతి ప్రశ్నించెను : దేవా: దేవతలు అసురులపై విజయము నెట్లు సాధించిరి? ఆ విషయమును యద్ధజయార్ణవోక్తశుభాశుభ##వేకాదివజ్ఞానమును గూర్చి వర్ణింపుము. శంకరుడు చెప్పెను: పరమాత్మేచ్ఛప్రకారము పదునైదుఅక్షరముల ఒక శక్తి ఆవిర్భవించినది, దాని నుండియే చరాచరజీవుల సృష్టి ఏర్పడినది. ఆ శక్తిని ఆరాధించుటచే మానవుడు అన్ని విషయములను తెలిసికొనగల్గును. ఇపుడు ఐదు మంత్రములతో ఏర్పడిన మంత్రపీఠమును వర్ణించెదను. ఆ మంత్రములు అన్ని మంత్రముల జీవన మరణములం దున్నవి. ఋగ్యజుఃసామాథర్వవేదమంత్రములు ప్రథమమంత్రములు. సద్యోజాతమంత్రములు ద్వితీయ మంత్రములు. బ్రహ్మవిష్ణురుద్రులుతృతీయ మంత్రస్వరూపులు. ఈశ్వరుడు, సప్తశిఖలు గల అగ్ని, ఇంద్రాదిదేవతలు వీరు చతుర్థమంత్రస్వరూపులు, అ,ఇ,ఉ,ఏ,ఓ, అను ఐదు స్వరములు పంచమమంత్రస్వరూపులు. ఈ స్వరములకే మూలబ్రహ్మ అని కూడ పేరు. కఱ్ఱలో వ్యాపించి యున్న అగ్ని ఆ కఱ్ణను అంటించకుండ పైకి కనబడ నట్లు శరీరమున నున్న శివశక్తిప్రతీతి జ్ఞానము లేకుండ కాజాలదు. పార్వతీ! ఓంకారస్వరవిభూషితమైన శక్తిమొదట ఆవిర్భవించినది. తరువాత బిందువు ఏకారరూవమున పరిణత మైనది. పిదప ఓంకారమునందు శబ్ద మావిర్భవించినది. దానినుండి ఉకార మావిర్బవించినది. ఈ ఉకారము హృదయములో శబ్దము చేయుచు ఉండును. అర్ధచంద్రునినుండి మోక్షమార్గప్రదర్శకముగ ఇకారము ఆవిర్భవించినది. పిదప భోగమోక్షముల నిచ్చు అవ్యక్త'అ'కారము ఆవిర్భవించినది. ఆ అకారము సర్వశక్తిమత్తు. ప్రవృత్తి నివృత్తి బోధకము. 'అ' కారము ప్రాణ (శ్వాస) రూపమున శరీరమునందు స్థిరముగా నుండును. దీనికే 'ఇడ' అని పేరు, ఇకారము 'ప్రతిష్ఠ' అను పేరుతో రసరూపమునను, పాలకస్వరూపమనను, ఉండును, దీనికే 'పింగల' అని పేరు. 'ఈ' అను స్వరమును క్రూరశక్తియందును, హరబీజము (ఉకారము) శరీరములో అగ్ని రూపమున నుండును. ఇదియే సమానబోధిక విద్య. దీనిని 'గాంధారి' అందురు. దీనిలో దహనాత్మక శక్తి యున్నది. 'ఏ' కారయు శరీరములో జలరూపముస నున్నది. దీనిలో శాంతిక్రియ యున్నది. ఓకారము శరీరములో వాయురూపమున నున్నది. ఇది అపాన-వ్యాన-ఉదానాదిపంచస్వరూపములను పొంది, స్పర్శ చేయుచు, గతి శీలమై యుండును,

ఓఙ్కారః శాన్త్యతీతాఖ్యః ఖశబ్దయూథపాణినః. 13

పఞ్చవర్గాః స్వరా జాతాః కుజజ్ఞగురుభార్గవాః | శనిః క్రమాదకారాద్యాః కకారాద్యాస్తధః స్థితాః. 14

ఏతన్మూలమతః సర్వం జాయతే సచరాచరమ్‌ | విద్యాపీఠం ప్రవక్ష్యామి ప్రణవః శివఈరితః. 15

ఉమాసోమః స్వయం శక్తిర్వామా జ్యేష్ఠా చ రౌద్ర్యపి |

బ్రహ్మా విష్ణుః క్రమాద్రుద్రో గుణాః సర్గాదయస్త్రయః. 16

రత్ననాడీత్రయం చైవ స్థూలః సూక్ష్మః పరో7పరః | చిన్తయేచ్ఛ్వేతవర్ణం తం ముఞ్చమానం పరామృతమ్‌.

ప్లావ్యమానం యథాత్మానం చిన్తయేత్తం దివానిశమ్‌ | అజరత్వం భ##వేద్దేవి శివత్వముపగచ్ఛతి. 18

అఙ్గుష్ఠాదౌ న్యసేదఙ్గాన్నేత్రం మధ్యే7థ దేహకే | మృత్యుఞ్జయం తతః ప్రార్చ్య రణాదౌ విజయో భ##వేత్‌.

శూన్యో నిరాలయః శబ్దః స్పర్శం తిర్యఙ్నతం స్పృశేత్‌ | రూపస్యోర్థ్వగతిః ప్రోక్తా జలస్యాధః సమాశ్రితా.

సర్వస్థానవినిర్ముక్తో గన్ధో మధ్యే చ మూలకమ్‌ | నాభిమూలే స్థితం కన్దం శివరూపం తు మణ్డితమ్‌. 21

శక్తివ్యూహేన సోమోర్కో హరిస్తత్ర వ్యవస్థితః | దశవాయుసమోపేతం పఞ్చతన్మాత్రమణ్డితమ్‌. 22

కాలానలసమాకారం ప్రస్ఫురన్తం శివాత్మకమ్‌ | తజ్జీవం జీవలోకస్య స్థావరస్య చరస్య చ. 23

తస్మిన్న ష్టేమృతం మన్యే మన్త్రపీఠే 7నిలాత్మకమ్‌ |

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యుద్దజయార్ణవే జ్యోతిఃశాస్త్ర సారోనామ చతుర్వింశత్యధికశతతమో7ధ్యాయః.

పంచస్వరముల సంమిలితసూక్ష్మరూప మగు ఓంకారము ''శాన్త్యతీతము'' అను పేరుతో బోధితమై శబ్దగుణకమగు ఆకాశము రూపమున నుండును. ఈ విధముగ ఏర్పడిన ఐదు స్వరములకు క్రమముగా కుజ-బుధ-గురు-శుక్ర-శనులు. కకారాదివర్ణములు ఈ స్వరములకు క్రింద నుండును. ఇవే ప్రపంచమూలకారణములు. వీటివలననే అన్ని చరాచరపదార్థముల జ్ఞానము కలుగును. ఇపుడు విద్యాపీఠస్వరూపమును చెప్పెదను. దీనియందు ఓంకారము శివరూపముగ చెప్పబడినది. సాక్షాత్తు ఉమసోమ (ఆమృత) రూపిణి. ఈమెనే వామా - జ్యేష్ఠా -రౌద్రీ నామములతో కూడ వ్యవహరింతురు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులే వరుసగ మూడు గుణములు, సృష్టి - స్థితి - సంహారకారణభూతులు. శరీరములోపల మూడు రత్ననాడు లున్నవి; వీటికి స్థూల - సూక్ష్మ - పర లని పేరు. ఇవి శ్వేతవర్ణములు . వీటి నుండి సర్వదా అమృతము స్రవించుచుండును. దానిచే ఎల్లప్పుడును ఆత్మ తడుపబడుచుండును. దీనిని ఈ విధముగ దివారాత్రులు ధ్యానించవలెను. దేవీ ! అట్టి సాధకుని శరీరము అజర మగును. అతడు శివసాయుజ్యమును పొందును. మొదట అంగుష్ఠాదులందును. నేత్రములందును, దేహమునందును అంగన్యాసము చేసి, పిదప మృత్యుంజయార్చన చేసి యాత్ర చేయువాడు యద్ధాదులందు విజయవంతుడ గును. ఆకాశము శూన్యము, నిరాధారము, శబ్దగుణకము. వాయువు నందు స్పర్శగుణ మున్నది. అది అడ్డముగా ప్రసరించుచు స్పృశించును. రూపము (అగ్ని) ఊర్ధ్వగతి గలది. జలము అధోగతి గలది. గంధగుణము గల పృథివి అన్ని స్థానములను విడచి మధ్య యందుండి, అన్నింటికిని ఆధారముగా నుండును. శివుడు నాభిమూలమునందు కంద (దుంప) రూపమున నున్నాడు. శక్తిసముదాయముతో గూడ సూర్య- చంద్ర - విష్ణువులును, పంచతన్మాత్రలతో దశ ప్రాణములను అచటనే ఉన్నవి. ఆ శివమూర్తి కాలాగ్ని వలె దేదీప్యమానమై సర్వదా ప్రకాశించుచుండును. అదే చరాచర జీవలోకమునకు ప్రాణము. ఆ మంత్రపీఠము నష్టమైనపుడు వాయురూపుడగు జీవుడు నశించి నట్లు తెలిసికొనవలెను.

అగ్ని మహాపురాణమునందు యుద్ధజయార్ణవమున జ్యోతిఃశాస్త్రసార మను నూటిఇరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters