Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ద్వాదశోత్తరశతతమో7ధ్యాయః

అథ వారాణసీమాహాత్మ్యమ్‌.

అగ్నిరువాచ :

వారాణసీ పరం తీర్థం గౌర్త్యె ప్రాహ మహేశ్వరః | భుక్తిముక్తిప్రదం పుణ్యం వసతాం గృణతాం హరిమ్‌.

రుద్ర ఉవాచ :

గౌరీక్షేత్రం నముక్తం వై అవిముక్తం తతః స్మృతమ్‌ | జప్తం తప్తం హుతం దత్తమవిముక్తే కిలాక్షయమ్‌.

అశ్మనా చరణ హత్వా వసేత్కాశీం న హి త్యజేత్‌ | 3

హరిశ్చన్ద్రం పరం గుహ్యం గుహ్యమామ్రాతకేశ్వరమ్‌ .

జప్యేశ్వరం పరం గుహ్యం గుహ్యం శ్రీపర్వతం తథా |

మహాలయం పరం గుహ్యం భృగుశ్చణ్డశ్వరం తథా. 4

కేదారం పరమం గుహ్యమష్టౌ సన్త్యవిముక్తకే | గుహ్యానాం పరమంగుహ్యమవిముక్తం పరం మమ. 5

ద్వియోజనం తు పూర్వం స్యోద్యోజనార్దం తదన్యథా | వరణా చ నదీ చాసీన్మధ్యే వారాణసీ తయోః. 6

అత్ర స్నానం జపో హోమో మరణం దేవపూజనమ్‌|

శ్రాద్ధం దానం నివాసశ్చ యద్యత్స్యాద్భుక్తిక్తిదమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వారాణసీమాహాత్మ్యం నామ ద్వాదశాధిక శతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు చెప్పెను. వారాణసి అత్యుత్తమ మైన తీర్థము. శ్రీహరి నామస్మరణ చేయుచు అచట నివసించువారు భుక్తిముక్తులను పొందుదురు. పరమేశ్వరుడు పార్వతితో వారాణసీమాహాత్మ్యము నీవిధముగ వర్ణించిచెప్పెను? పార్వతీ! నే నీ క్షేత్రమును ఎన్నడును విడువను. కావుననే దీనికి అవిముక్తమని పేరు వచ్చినది. ఈ అవిముక్తక్షేత్రమునందు చేయు జపతపోహోమములు అక్షయఫలము నిచ్చును. రాయితో రెండు కాళ్లు విరుగగొట్టుకొని యైనను కాశీని విడువకుండ పడియుండవలెను. హరిశ్చంద్ర-అఘాతకేశ్వర-జప్యేశ్వర-శ్రీపర్వత-మహాలయ-భృగు-చండేశ్వర-కేదారతీర్థములను ఎనిమిదియు ఈ అవిముక్త క్షేత్రమున పరమగోపనీయము లగు తీర్థములు. నా అవిముక్తక్షేత్రము గోపనీయములలో కెల్ల గోపనీయము. అది రెండు యోజనములు పొడవు, అర్ధయోజనము వెడల్పు ఉన్నది. వరణా అసీ అను నదుల మధ్య 'వారాణసి' ఉన్నది. ఇచట జరగు స్నాన - జప-హోమ-మృత్యు-దేవపూజన-శ్రాద్ధ-దాన-నివాసాదులవలన భుక్తిముక్తులు రెండును లభించును.

అగ్నిమహాపురాణమునందు వారాణసీ మాహాత్మ్యవర్ణన మను నూడపండ్రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters