Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ ఏకాధిక శతతమో7ధ్యాయః.

అథ ప్రాసాదప్రతిష్ఠావిధిః

ఈశ్వర ఉవాచ :

ప్రాసాదస్థాపనం వక్ష్యే తచ్చైతన్యం స్వయోగతః | శుకనాసాసమాప్తౌ తు పూర్వవైద్యాశ్చ మధ్యతః. 1

ఆధారశక్తితః పద్మే విన్యస్తే ప్రణవేన చ | స్వర్ణాద్యేకతమోద్భూతం పఞ్చ గవ్యేన సంయుతమ్‌. 2

మధుక్షీరయుతం కుమ్భం న్యస్తరత్నాదిపఞ్చకమ్‌ | స్రగ్వస్త్రం గన్దలిప్తం చ గన్దవత్పుష్పభూషితమ్‌. 3

చూతాదిపల్లవానాం చ కృతీ కృత్యం చ విన్యసేత్‌ | పూరకేణ సమాదాయ సకలీకృతవిగ్రహః. 4

సర్వాత్మాభిన్నమాత్మానం స్వాణునా స్వాన్తమారుతః | ఆజ్ఞయా బోధయేచ్ఛమ్భౌ రేచకేన తతో గురుః. 5

ద్వాదశాన్తత్సమాదాయ స్ఫురద్వహ్నికణోపమమ్‌ | నిక్షిపేత్కుమ్భగర్భే చ న్యస్తతన్త్రాతివాహికమ్‌. 6

విగ్రహంతద్గుణానాం చ బోదకం చ కలాదికమ్‌ | క్షాన్తం వాగీశ్వకరం తత్తు వ్రాతం తత్ర నివేశ##యేత్‌. 7

తత్ర నాడీర్దశప్రాణానిన్ద్రియాణి త్రయోదశ | తదధిపాంశ్చ సంయోజ్య ప్రణవాద్యైః స్వనామభిః. 8

స్వకార్యకారణత్వేన మాయాపాశనియామికాః | విద్యేశాన్‌ ప్రేరకాన్‌ శమ్భుం వ్యాపినం చ సుసమ్బరైః. 9

అఙ్గాని చ వినిక్షిప్య నిరుంధ్యాద్భోధముద్రయా | సువర్ణాద్యుద్భవం యద్వా పురుషం పురుషానుగమ్‌. 10

పఞ్చగవ్యకషాయద్యైః పూర్వవత్సంస్కృతం తతః |

శయ్యాయం కుమ్భమారోప్య ధ్యాత్వా రుద్రముమాపతిమ్‌. 11

తస్మింశ్చ శివమన్త్రేణ వ్యాపకత్వేన విన్యసేత్‌ | సన్నిధానాయ హోమం చ ప్రోక్షణం స్పర్శనం జపమ్‌. 12

సాన్నిధ్యబోధనం సర్వం భాగత్రయవిభాగతః| విధాయైవం ప్రకృత్యన్తే కుమ్భే తం వినివేశ##యేత్‌. 13

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ప్రాసాదప్రతిష్ఠావిధానం నామ ఏకశతతమో7ధ్యాయః

పరమేశ్వరుడు పలికెను; స్కందా! నే నిపుడు ప్రాసాద (దేవాలయ) ప్రతిష్ఠావిధి చెప్పెదను. దానియందు చైతన్యసంబంధమును చూపుచున్నాను. దేవాలయమునందలి శుకనాసము సమాప్తియగు చోటపూర్వవేదిమధ్యభాగమునందు ఆధారశక్తిని భావించి ప్రణవమంత్రముతో కమలమున్యాసము చేయవలెను. దాని పైన సువర్ణాదిధాతువులలో ఏదేన ఒక దానితో చేసిన కలశను స్థాపించవలెను. దానిలో పంచగవ్యములు, మధువు, పాలు, రత్నములు, మొదలగు ఐదు వస్తువులు ఉంచవలెను. కలశ##పై గంధము పూసి, వస్త్రముచే కప్పి సుగంధపుష్పములతో వాసితము చేసి, చూతాదిపంచవృక్షముల పల్లవములచే దాని ముఖమును ఆచ్ఛాదించవలెను. హృదయమంత్రముతో హృదయకమలభావన చేయుచు ఆ కలశను అచట స్థాపించవలెను. పిదప గురువు పూరక ప్రాణాయామముతో శ్వాసను లోనికి గ్రహించి, శరీరముతో సకలీకరణక్రియ చేయవలెను. స్వమంత్రముతో కుంభక ప్రాణాయామము ద్వారా ప్రాణావాయువును లోపల అవరుద్ధము చేయవలెను. ఈశ్వరుని అనుమతితో సర్వాత్మాభిన్నమైన జీవచైతన్యమును జాగృతము చేయవలెను, రేచకప్రాణాయామముతో ప్రజ్వలించుచున్న అగ్నికణము వలె నుండు జీవచైతన్యమును ద్వాదశాంతస్థానమునుండి గ్రహించి, కలశములో స్థాపించి, దానియందు అతివాహికశారీరన్యాసము చేసి, దాని గుణములను బోధించు కాలాదికమును, ఈశ్వరసహితములగు పృథ్వీపర్వంతతత్త్వ సముదాయమును దాని యందు నివేశింపచేయవలెను. పదమూడు ఇంద్రయములను, తదధిపతులను నామమంత్రముతో కలశ##పై స్థాపంచి, ప్రణవము మొదట చేర్చిన నామమంత్రములతో పూజించవలెను. తమతమ కార్యములు చేయించు మాయాపాశనియామికలను ప్రేరకులగు విద్యేశ్వరులను, సర్వవ్యాపియగు శివుని తమమంత్రములతో న్యాసముచేసి పూజించవలెను. సకల అంగముల న్యాసముచేసి, అవరోధినీముద్రతో వాటి న్నింటిని నిరోధించవలెను. లేదా సువర్ణదిధాతువులతో ఒక మానవాకృతి నిర్మించి దానిని పంచగవ్యములతోను, కషాయద్రవ్యములతోను శుద్ధి చేసి శయ్యపైకూర్చండబెట్టి ఉమాపతి యైన రుద్రుని ధ్యానించుచు, శివషుంత్రముతో ఆ పురుషశరీరమునందు వ్యాపకరూపమున ఆ శివుని న్యాసము చేయవలెను. శివసాన్నిధ్యముకొరకై హోమ-ప్రోక్షణ-స్పర్శ-జపములు చేయవలెను. సంనిధాపనము రోధకము మొదలగు సకలకార్యములను భాగత్రయవిభాగపూర్వకముగ చేయవలెను. ఈ విధముగ ప్రకృతిపర్యంతన్యాసము నకు సంబంధించిన న్యాసవిధానము పూర్తి చేసి ఆ పురుషుని కలశములో స్థాపించవలెను.

అగ్ని మహాపురాణమునందు ప్రాసాదప్రతిష్ఠావిధాన మను నూటఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters