Sri Vamana Mahapuranam    Chapters   

ఇతి శ్రీ వామన పురాణ షష్ఠితమో%ధ్యాయః

సర్వ పాప ప్రమోచన స్తోత్రమ్‌

పులస్త్య ఉవాచ :-

నమస్తే%స్తు జగన్నాధ! దేవదేవ! నమో%స్తుతే | వాసుదేవ! నమస్తే%స్తు బహురూప నమో%స్తుతే || 1

ఏక శ్రుంగ! నమస్తుభ్యం నమస్తుభ్యం వృషాకపే | శ్రీనివాస! నమస్తే%స్తు నమస్తే భూతభావన || 2

విష్వక్సేన! నమ స్తుభ్యం నారాయణ! నమోస్తుతే | ధ్రువధ్వజ! నమస్తే%స్తు సత్యధ్వజ! నమో%స్తుతే || 3

యజ్ఞధ్వజ! నమస్తుభ్యం ధర్మధ్వజ! నమో%స్తుతే | తాలధ్వజ నమస్తే%స్తు నమస్తే గరుడధ్వజ! || 4

వరేణ్య! విష్ణో! వైకుంఠ! నమస్తే పురుషోత్తమ! | నమో జయంత! విజయ! జయానంత! పరాజిత! || 5

కృతావర్త! మహావర్త! మహాదేవ! నమో%స్తుతే | అనాద్యాద్యం త మధ్యాంత నమస్తే పద్మజ ప్రియ! || 6

పురంజయ! నమ స్తుభ్యం శత్రుంజయ! నమోస్తుతే | శుభం జయ! నమస్తే%స్తు నమస్తే%స్తు ధనంజయ || 7

సృష్టిగర్భ! నమ స్తుభ్యం శుచిశ్రవః | పృధుశ్రవః | నమో హిరణ్యగర్భాయ పద్మగర్భాయ తే నమః || 8

నమః కమల నేత్రాయ కాల నేత్రాయ తే నమః | కాల నాభ నమస్తుభ్యం మహానాత్ర నమో నమః || 9

వృష్టి మూల! మహామూల! మూలావాస! నమో%స్తుతే | ధర్మావాస! జలావాస! శ్రీనివాస! నమోస్తుతే || 10

ధర్మాధ్యక్ష! ప్రజాధ్యక్ష! లోకాధ్యక్ష! నమో నమః | సేనాధ్యక్ష! నమస్తుభ్యం కాలాధ్యక్ష! నమో%స్తుతే || 11

గదాధర! శ్రుతిధర! చక్రధారిన్‌! శ్రీయో ధర!| వనమాలీ ధర! హరే! నమస్తే ధరణీ ధర! || 12

ఆర్చిషేణ! మహోసేన! నమో%స్తు పురుష్టుత! | బహుకల్ప! మహాకల్ప! నమస్తే కల్పనా ముఖ! || 13

సర్వాత్మన్‌! సర్వగ! విభో! విరించే! శ్వేత! కేశవ! | నీల! రక్త! మహానీల! అనిరుద్ధ! నమో%స్తుతే || 14

ద్వాదశాత్మక! కాలాత్మన్‌! సామాత్మన్‌! పరమాత్మక! | వ్యోమకాత్మక! సుబ్రహ్మన్‌! భూతాత్మక! నమో%స్తుతే|| 15

హరికేశ మహాకేశ గుడాకేశ నమో%స్తుతే! | ముంజ కేశ హృఫీకేశ సర్వ నాథ నమో%స్తుతే || 16

సూక్ష్మ! స్థూల! మహాస్తూల! మహాసూక్ష్మ! శుభంకర! | శ్వేత! పీతాంబరధర! నీలవాస! నమో%స్తుతే || 17

శ్రీ వామన పురాణంలో అరువదియవ అధ్యాయము

శ్రీ సర్వ పాప ప్రమోచన స్తోత్రము.

పులస్త్యుడు నారదుని కాస్తోత్రం యిలా వినిపించాడు-

ఓ జగన్నాధా! నీకు ప్రణామము. దేవ దేవా నీకు నమస్కారము!వాసుదేవా! బహురూపీ! నీకు నమస్కారము. ఏకశృంగా! వృషాకపీ! శ్రీనివాసా!భూతభావనా! నీకు నమస్సులు. విష్వక్సేనా! నారాయణా! ధ్రువకేతనా! సత్యధ్వజా! నీకు నమోవాకములు! యజ్ఞధ్వజా! ధర్మధ్వజా! తాళధ్వజా! (బలరామ), గరుడధ్వజా! నీకు నమస్కారము. సర్వోత్తమా! విష్ణూ!వైకుంఠా!పురుషోత్తమా!జయంతా!విజయా! జయా!అనంతా!పరాజితా! (భక్తపరాజితా)! నీకు నమస్కారము. కృతావర్తా! (కల్పాల రూపాన తిరిగేవాడా)! మహావర్తా! (అందరనూ ముంచివేయు సుడిగుండం)! మహాదేవా! ఆది లేని వాడా! ఆది అంతమూ నైన వాడా! మధ్య అంతమునగువాడా!బ్రహ్మప్రియా! నీకు నమస్సులు. పురంజయా! శత్రుంజయా! శుభంజయా(మంచికి అధిపతి)! ధనుంజయా నీకు జోహారులు! సృష్టికినెల వగువాడా! పవిత్ర నాముడా! గొప్పగా విన బడువాడా (పృథుశ్రవా) హిరణ్యగర్భా! కమల గర్భా! నీకు ప్రణామము. కమల నేత్రా (కాటుకకన్నులవాడా) కాలనాభా (సమయమే నాభి అయినవాడా)! మహానాభా! నీకు నమస్సులు. వృష్టిమూలా! (వర్షానికి కారణమైనవాడా)! మహామూలా!(సర్వానికి గడ్డ), మూలవాసా (మొదటి ఆశ్రయమా)! ధర్మానికీ జలానికీ సంపదలకు నిలయమైన వాడా! నీకు నమస్సులు. ధర్మాధ్యక్షా! (ధర్మాన్నిపరిశీలించు వాడా)! ప్రజాధ్యక్షా! లోకాధ్యక్షా!సే నాధ్యాక్షా! కాలాధ్యాక్షా! నీకు జోహారులు! గదాధరా! వేదాల నుద్దరించువాడా! చక్రాన్నీ, లక్ష్మనీ ధరించువాడా! వనమాలను, భూదేవిని, ధరించుదేవా! హరీ నీకు సమస్సులు. అర్చిషేణా! (గొప్ప వెలుగు)! మహాసేనా స్వరూపీ! పురుష్టుతా (గొప్పగా కీర్తింపబడువాడా) ! బహుకల్పా! మహాకల్పా! సమస్త కల్పనలకు ప్రధానుడా! సర్వాత్మా! సర్వగా! విభూ! విరించీ! శ్వేతా! కేశవా! నీలా!రక్తా (ఎర్రనివాడా)! మహానీలా!అనిరుద్దా! నీకు ప్రణామములు. ద్వాదశాదిత్యులను గర్భీకరించుకున్న కాలరూపా! సామవేదరూపా! పరమాత్మా! ఆకాశ రూపా! మంగళకర మగు ఉన్నత తత్వమా! (సుబ్రహ్మన్‌)! సర్వ జీవాత్మకా! నీకు జోహారులు! హరీ (పచ్చని) కేశా! మహాకేశా! గుడా దట్టమైన కేశా! ముంజ (ఒక గడ్డి) కేశా! హృషీకేశా! హృషీకేశా (ఇంద్రియాధిపతి)! సర్వనాథా! నీకు నమస్కారము సూక్ష్మరూపా! మహాసూక్ష్మ! స్థూలా! మహాస్థూలా! కళ్యాణకారీ! తెలుపు బంగారం వన్నె నల్లనైన వస్త్రలు ధరించువాడా నీకు నందనములు!

కుశేశయ! నమస్తే%స్తు పద్మేశయ! జలేశయ! | గోవింద! ప్రీతి కర్తా చ హంస! పీతాంబర ప్రియ! || 18

అధోక్షజ! నమస్తుభ్యం సీరధ్వజ ! జనార్దన! | వామనాయ నమస్తే%స్తు నమస్తే మధుసూదన! || 19

సహస్రశీర్షాయ నమో బ్రహ్మ శ్రీర్షాయ తే నమః | నమః సహస్ర నేత్రాయ సోమ సూర్యాన లేక్షణ ! || 20

నమ శ్చాథర్వ శిరసే మహాశీర్షాయ తే నమః | నమస్తే ధర్మ నేత్రాయ మహానేత్రాయ తే నమః || 21

నమఃసహస్ర పాదాయ సహస్ర భుజమన్యవే | నమో యజ్ఞ వరాహాయ మహా రూపాయ తే నమః || 22

నమస్తే విశ్వేదేవాయ విశ్వాత్మన్‌! విశ్వసంభవ! | విశ్వరూప ! నమస్తే%స్తు త్వత్తో విశ్వ మభూ దిదమ్‌ || 23

న్యగ్రోథ స్త్వం మహాశాఖ స్త్వం మూల కుసుమార్చితః | స్కంధ పత్రాంకుర లతాపల్ల వాయ నమో%స్తు తే || 24

మూలం తే బ్రాహ్మణా బ్రహ్మన్‌! స్కంధస్తే క్షత్రియాః ప్రభో ! | వైశ్యాః శాఖా దలం శూద్రా వనస్పతే! నమో%స్తు తే || 25

బ్రాహ్మణాః సాగ్నయో వక్త్రాః దోర్దండాః సాయుధా నృపాః | పార్శ్వా దిశ శ్చోరు యుగా జ్జాతాః శూద్రాశ్చ పాదతః || 26

నేత్రా ద్భాను రభూ త్తుభ్యం పద్భ్యాం భూః శ్రోత్రయోర్దిశః | నాభ్యా హ్యభూ దంతరిక్షం శశాంకో మనసస్తవ! || 27

ప్రాణా ద్వాయుః సమభవత్‌ కామాద్బ్రహ్మా పితామహః | క్రోధా త్త్రి నయనో రుద్రః శీర్‌ణ్షా ద్యౌః సమవర్తత || 28

ఇందాగ్నీ వదనా త్తుభ్యం పశవో మల సంభవాః | ఓషధ్యో రోమ సంభూతా విరాజ స్త్వం నమో%స్తుతే || 29

ఓషధ్యో రోమ సంభూతా విరాజ స్త్వం నమో%స్తుతే | పుష్పహాస నమస్తే%స్తు మహాహాస నమో%స్తు తే || 30

ఓంకార స్త్వం వషట్కారో వౌషట్‌ త్వం చ స్వధా సుధా | స్వాహా కార నమస్తుభ్యం హంతకార నమోస్తు తే || 31

సర్వాకార ! నిరాకార ! వేదాకార! నమో%స్తు తే | త్వం హి వేదమయో దేవః సర్వదేవ మయ స్తథా || 32

సర్వతీర్థ మయశ్చైవ సర్వయజ్ఞ మయస్తథా | నమస్తే యజ్ఞ పురుష! యజ్ఞ భాగభుజే నమః || 33

భూ ర్భువః స్వః స్వరూపాయ గోదాయామృత దాయినే | సువర్ణ బ్రహ్మ దాత్రే చ సర్వ దాత్రే చ తే నమః || 34

బ్రహ్మేశాయ నమస్తుభ్యం బ్రహ్మాదే బ్రహ్మ రూప ధృక్‌ | పర బ్రహ్మ నమస్తే%స్తు శబ్దబ్రహ్మ! నమో%స్తు తే || 35

ఓ కుశేశయా ! (దర్భశయనా) పద్మేశయా ! జలేశయా ! గోవిందా! హంసరూపా ! పీతాంబర ప్రియా! ప్రీతి కర్తా ! నీకు నమస్సులు అధోక్షజా ! (ఇంద్రియ దమనా) సీరధ్వజా ! (నాగలిటెక్కము గా గలవాడా) జనార్దనా ! వామనా ! మధుసూదనా ! నీకు ప్రణామాలు సహస్రశీర్షా ! బ్రహ్మ శీర్షా ! సహస్ర నేత్రా ! చంద్ర సూర్యాగ్ని నేత్రా ! అధర్వ శీర్షా ! మహాశీర్షా! ధర్మనేత్రా ! మహా నేత్రా ! నీకు నమస్కారములు. ఓ సహస్ర పాదా ! సహస్ర బాహు (బాణుడు) శత్రూ! యజ్ఞ వరాహా ! మహారూపా నీకు ప్రణామములు. విశ్వేదేవా ! విశ్వాత్మా ! విశ్వసంభవా ! విశ్వరూపా ! నీ నుంచియే ఈ విశ్వం ఉద్భవించింది. నీకు ప్రణామములు. మహా శాఖలతో నొప్పుచు మూల (వ్రేళ్లు) కుసుమాలతో నర్చించ బడు న్యగ్రోద (మహా వట వృక్ష) రూపా నీకు స్కంధ (కాండములు) పత్ర అంకురలతా పల్లవాలతో విలసిల్లే నీకు నమస్కారము. నీకు మొదలు బ్రాహ్మణులు. స్కంధాలు క్షత్రియులు. ఓ బ్రహ్మన్‌! వైశ్యులు కమ్మలు. దళ (ఆకు) ములు శూద్రులు. ఓ వనస్పతీ ! ప్రభూ ! నీకు నమస్కారాలు భగవన్‌ ! నీకు నిరతాగ్ని హోత్రు లగు విప్రులు ముఖము. సాయుధు లగు క్షత్రియులు బాహువులు. ప్రక్కలు(తొడలు) వైశ్యులు. శూద్రులు పాదములు. ఆ యా అంగాల నుండి వార లుద్భవించారు. నీ నేత్రా ల నుండి సూర్యుడు, పాదాల నుంచి భూమి, చెవుల నుంచి దిక్కులు, నాభి నుండి అంతరిక్షం, చంద్రుడు మనస్సు నుండి, నీ ప్రాణాల నుండి వాయువులు, కామం (కోరిక) నుండి బ్రహ్మ, ఉద్భవించారు. నీ క్రోధం నుండి త్రినేత్రు డగు రుద్రుడు, శిరస్సు నుండి దివి జననము, నోటి నుండి యింద్రాగ్నులు, మలము నుండి పశువులు జననము. నీ రోమాల నుండి ఓషధు లుద్భవించాయి. అట్టి విరాజ పురుషుడ వగు నీకు ప్రణామాలు. పుష్పములే నన్వుగా గల వాడవు! అట్టహాసము గావించు వాడవు నగు నీకు నమస్సులు. నీవు ఓంకారానివి. వషట్కారానివి. వౌషట్‌ స్వధా స్వాహకారాలు సుధ హంతకారము అన్నీ నీవే. నీకు ప్రణామాలు. అన్ని ఆకారాలు నీవే. నీకే ఆకారం లేదు. వేద రూపివి నీవు వేద మయుడవు. సర్వ దేవ మయుడవు. సర్వతీర్థ మయుడవు. సర్వ యజ్ఞ మయుడవు. అట్టి నీకు ప్రణామములు.ఓ యజ్ఞ పురుషా ! యాగ భాగ భోక్తా ! వేయి అంచులు నూరు అంచులు గల వజ్ర స్వరూపా ! నీకు ప్రణామాలు. భూః భువః స్వః లోకాలు నీవు. గో (యింద్రియ) దాయివి, అమృతదాయివి, సువర్ణ జ్ఞాన దాతవు, సర్వము యిచ్చు వాడ వగు నీకు నమస్కారము. నీవు బ్రహ్మేశ్వరుడవు. బ్రహ్మకు ఆదిమూర్తివి. బ్రహ్మరూప ధారివి. పరబ్రహ్మవు. శబ్ద బ్రహ్మవు. నీకు నమస్కారములు

విద్యాస్త్వం వేదరూప స్త్వం వేదనీయ స్త్వమేవ చ | బుద్ది స్త్వ మపి బోధ్యశ్చ బోధస్త్వం చ నమో%స్తు తే || 36

హోతా హోమశ్చ హవ్యం చ హూయమాన శ్చ హవ్యవాట్‌! | పాతా పోతా చ పూతశ్చ పావనీయశ్చ ఓం నమః || 37

హంతా చ హస్యమానశ్చ హ్రియమాన స్త్వ మేవ చ! | హర్తా నేతా చ నీతిశ్చ పూజ్యో%గ్ర్యో విశ్వధార్యసి || 38

సృక్‌ సృవౌ పరధామా%సి కపాలోలూఖలోరణిః | యజ్ఞపాత్రారణయ స్త్వ మేకధా బహుథా త్రిథా || 39

యజ్ఞ స్త్వం యజమాన స్త్వ మీడ్య స్త్వమసి యాజకః | జ్ఞాతా జ్ఞేయ స్తధా జ్ఞానం ధ్యేయో ధాతా%సి చేశ్వరః || 40

ధ్యాన యోగశ్ఛ యోగీ చ గతి ర్మోక్షోధృతిః సుఖమ్‌ | యోగాంగాని త్వమీశానః సర్వగస్త్వం నమో%స్తు తే || 41

బ్రహ్మా హోతా తథోధ్గాతా సామ యూపోధ దక్షిణా | దీక్షా త్వం త్వం పురోడాశస్త్వం పశుః పశువాహ్యసి || 42

గుహ్యో ధాతా చ పరమః శివో నారాయణ స్తథా | మహాజనో నిరయనః సహస్రార్కేందు రూపవాన్‌ || 43

ద్వాదశారో%థ షణ్ణాభిః త్రివ్యూహోదివ్యయుగ స్తథా ! | కాలచక్రో భవానీశో నమస్తే పురుషోత్తమ || 44

పరాక్రమో విక్రమ స్త్వం హయగ్రీవో హరీశ్వరః | నరేశ్వరో%థ బ్రహ్మేశః సూర్యేశస్త్వం నమో%స్తు తే || 45

అశ్వవక్త్రో మహామేధాః శంభుః శక్రః ప్రభంజనః | మిత్రావరుణ మూర్తి స్త్వ మమూర్తి రనఘః పరః || 46

ప్రాగ్వంశకాయో భూతాది ర్మహా భూతో%చ్యుతో ద్విజః | త్వమూర్ద్వ కర్తా ఊర్ద్వశ్చ ఊర్ద్వరేతా నమో%స్తు తే || 47

మహాపాతకహా త్వం చ ఉపపాతకహా తథా | అనీశః సర్వపాపేభ్య స్త్వా మహా శరణం గతః || 48

ఇత్యేత త్పరమం స్తోత్రం సర్‌%వ పాప ప్రమోచనమ్‌ | మహేశ్వరేణ కథితం వారాణస్యాం పురా మునే || 49

కేశవస్యా గ్రతో గత్వా స్నాత్వా తీర్థే సితోదకే | ఉపశాంత స్తథా జాతో రుద్రః పాపవ శాత్‌ తతః || 50

ఏత త్పవి త్రం త్రిపురఘ్న భాషితమ్‌ పఠన్‌ నరోవిష్ణుపరో మహర్షే! || 51

విముక్త పాపో హ్యుపశాంత మూర్తిః సంపూజ్యతే దేవ వరైః ప్రసిద్దైః || 52

ఇతి శ్రీ వామన పురాణ షష్ఠి తమో %ధ్యాయః సమాప్తః

ప్రభూ! నీవు విద్యవు. వేద్య రూపివి. తెలిసికో దగిన వాడవు. బుద్దివి. బోధ్యుడవు. బోధజ్ఞానానివి. నీకు నమస్కారములు. హోతవు. నీవు హోమం, హావ్యం, హూయ మానం (హవ్యముగా అర్పించబడునది) గూడ నీవే. హవ్య వాహను డవు (అగ్ని) పాతవు (రక్షకుడు) పోతవు. (పవిత్రం గావించువాడు), పూతుడవు(పవిత్రుడవు), పావనీయుడవు, సర్వమూనైన ప్రణవానివి. నీకు నమస్సులు. హంత (చంపువాడ)వు. చంప బడు వాడవు, అపహరింప దగిన వాడవు గూడ నీవే. హరించు వాడవు, నాయకుడవు, నీతివి, పూజ్యుడవు, అగ్ర్యుడవు (మొదటివాడవు), విశ్వాన్ని ధరించే వాడవు నీవే, స్రుక్‌ స్రువాలు నీ రూపాలే. పరమ పదానిని నీవు. కపాలం(పురోడాశంయిచ్చే పాత్ర), ఉలూఖలం (రోలు), అరణి (అగ్నికై మధించే కొయ్య) నీవే. యజ్ఞ పాత్ర యగు ఆరణయం నీవు. ఒకటిగా రెండుగా మూడుగా రూపొందునది నీవే. నీవు యత్రానివి, యజమానుడవు, ఈడ్యుడవు (ఆరాధింపబడువాడవు), యాజకుడవు నీవే. జ్ఞాత (తెలిసినవాడ)వు, తెలిసి కోవలసిన వాడవు, జ్ఞానానివీ నీవే. నీకు ప్రణామాలు. జ్ఞాన యోగం, యోగి గతి, మోక్షం, ధృతి, సుఖం, యోగాంగాలూ నీ రూపాలే. సర్వ వ్యాపి వగు నో ఈశ్వరా ! నీకు నమస్సులు (యజ్ఞశాలలోని) బ్రహ్మవు, హోతవు, ఉద్గాతవు, సామగానానివి, యూపం, దక్షిణ, దీక్ష, పురోడాశం (యజ్ఞేశ్వరునకిచ్చేనైవేద్యం), యజ్ఞ పశువు, పశువును తెచ్చేవాడు ఈ అన్ని రూపాల్లో నీవే వ్యక్త మౌతావు. నీవు గుహ్యుడవు. (రహస్యం) ధాతవు, పరముడవు, శివుడవు, నారాయణుడవు. జనసమూహం, నిరయనం, వేయి చంద్ర సూర్యుల శోభతో వెలుగు వాడవు. నీకు నమస్సులు పన్నెండు (చక్రపు) ఆకులు ఆరు యిరుసులు మూడు వ్యూహాలు రెండు యుగము (కౌడి) లు కాల చక్ర రూపి వగు భవానీశ్వరు (మహాకాళేశ్వరు) డగు నగు నో పురుషోత్తమా! నీకు కైమోడ్పులు, పరాక్రమం, విక్రమం, హయగ్రీవ, హరి, ఈశ్వరులు, నీవు. సర్వేశ్వరుడవు (పృథ్వీపతి) బ్రహ్మేశ్వరుడవు సూర్యేశ్వరుడవు నగు నీకు నమస్కారములు. నీవు హయ ముఖడవు. (కిన్నరుడు) మహామేధా (గొప్పయజ్ఞా) నివి. శంభుడవు. యింద్రుడవు. ప్రభంజనుడవు. మిత్రావరుణమూర్తివి పాపరహితుడవైన పరముడవు. ప్రాగ్వంశకాయుడవు (రూపుకట్టిన మోదటివంశానివి). జీవులందరకు మొదలు అయిన వాడవు. పెను భూతానివి. చ్యుతి లేని వాడవు. ద్విజుడవు, ఊర్ద్వకర్తవు, ఊర్ద్వానివి, ఊర్ద్వ రేతస్కుడవు, నీకు నమస్సులు. మహా పాతక ఉపాతకాలు నశింప చేయు వాడవు సర్వపాపాలకు అతీతుడ వగు నీకు శరణాగతుడ నగు చున్నాను.

ఓ నారదా! పరమోత్తమ మైన ఈ సర్వ పాప మోచన స్తవాన్ని నీకు వినిపించాను దీనిని మహేశ్వరుడు వారణసి క్షేత్రంలో ప్రకాశింప జేశాడు. సితోదక తీర్థంలో స్నాం చేసి కేశవుని ఎదుటకు వెళ్లి రుద్రుడు పాప విముక్తుడైనాడు. త్రిపురాంతకుడు చెప్పిన ఈ స్తోత్రం విష్ణు పరమైనది. పవిత్రమైనది. దీనిని శ్రద్దతో పఠించిన నరుడు పాప విముక్తుడై శాంతిని పొందుతాడు. ప్రసిద్దు లైన దేవతలకు కూడ పూజ్యు డౌతాడు.

ఇది శ్రీ వామన పురాణం లో అరువదియవ అధ్యాయం ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters