Sri Vamana Mahapuranam    Chapters   

శ్రీ వామన పురాణ సప్త చత్వారింశో%ధ్యాయః (47)

పులస్త్య ఉవాచ -

ఏతదర్ధం బలి ర్దైత్యః కృతో రాజా కవిప్రియ!, మంత్ర ప్రదాతా ప్రహ్లాదః శుక్ర శ్చాసీ త్పురోహితః|| 1

జ్ఞాత్వా%భిషిక్తం దైతేయం విరోచనసుతం బలిమ్‌, దిదృక్షవః సమాయాతాః సమయాః సర్వ ఏవ హి || 2

తా నాగతా న్నిరీక్ష్యైవ పూజయిత్వా యథాక్రమమ్‌, పప్రచ్ఛ కులజాన్‌ సర్వాన్‌ కంను శ్రేయస్కరం మమ|| 3

తమూచుః పర్వ ఏవైనం శ్రుణుష్వ సురమర్దన!, యత్తే శ్రేయస్కర కర్మ యదస్మాకం హితం తథా|| 4

పితామహ స్తవ బలీ అసీద్‌ దానవపాలకః, హిరణ్యకశిపు ర్వీరః స శక్రో%భూ జ్జ గత్రయే|| 5

తమా గమ్య సురశ్రేష్ఠో విష్ణుః సింహవపు ర్ధరః ప్రత్యక్షం దానవేంద్రాణాం నఖై స్తం తు వ్యదారయత్‌|| 6

అనకృష్టం తథా రాజ్య మంధకస్య మహాత్మనః , తేషా మర్ధే మహాబాహూ! శంకరేణ త్రిశూలినా|| 7

తథా తవ పితృవ్యో%పి జంభో శ##క్రేణ ఘాతితః, కుజంభో విష్ణునా చాపి ప్రత్యక్షం పశువ త్తవ|| 8

శంభుః పాకో మహేంద్రేణ భ్రాతా తవ సుదర్శనః, విరోచన స్తవ పితా వనిహతః కథయామి తే|| 9

శ్రుత్వా గోత్ర క్షయం బ్రహ్మన్‌ ! కృతం దానవః, ఉద్యోగం కారయామాస సహ సర్వై ర్మహాసురైః|| 10

రథై రన్యై గజై రన్యై వాజిభి శ్చాపరే%సురాః, పదాతయ స్తథైవాన్యే జగ్ము ర్యుద్ధాయ దైవతైః|| 11

వయో%గ్రే యాతి బలావాన్‌ సేనానాధో భయంకరః, సైన్యస్య మధ్యే చ బలిః కాలనేమిశ్చ పృష్ఠతః|| 12

వామపార్శ్వ మవష్టభ్య శాల్వ ః ప్రధిత విక్రమః, ప్రయాతి దక్షిణం ఘోరం తారకాఖ్యే భయంకరః|| 13

దానవానాం సహస్రాణి ప్రయుతా న్యర్చుదాని చ, సంప్రయాతాని యుద్ధాయ దేవైః సహ కవిప్రియ|| 14

పులస్త్యుడిట్లనియెను. ఓ కలహప్రియుడవగు నారదా! ఈ కారణాననే బలి దైత్యుని రాజును గావించారు. మంత్రి ప్రహ్లాదుడైనాడు. శుక్రాచార్యుడు పురోహితు డైనాడు. విరోచన పుత్రుడు బలి దైత్యుడు రాజ్యాభిషిక్తుడు గావటం వినగానే మయదానవునితో సహా రాక్షసు లందరు తమ ప్రభువును దర్శించుటకు వచ్చి చేరారు. ఆ వచ్చిన దైత్యుల నందరను యథావిధిగా పూజించి నాకు శ్రేయస్కరమైన కర్తవ్య మేదో చెప్పుడని అర్ధించాడా వినయశీలి యగు బలిరాజేంద్రుడు. అంతట నా దైత్యులంద రాబలితో యిలా అన్నారు - "సురమర్దనా! సావధానంగా వినుము. నీకూ మాకూ మనవారందరకూ శ్రేయస్కరమైన విషయం చెబుతున్నాము. నీ ప్రపితామహుడు హిరణ్యకశిపుడు సర్వదైత్య పాలకుడై ముల్లోకాలకూ యింద్రుడై యుండగా, సురశ్రేష్ఠుడైన విష్ణుడు సింహరూపంతో వచ్చి అందరూ చూస్తూండగా గోళ్లతో చీల్చి సంహరించాడు.అంతే కాదు మహాత్ముడగు అంధకుని రాజ్యాన్ని అపహరించేందుకు త్రిశూలి అయిన శంకరుని చేత కుట్ర పన్ని అంతని సంహరింప జేశారు. అంతట పోక మీపిన తండ్రి జంభుని ఇంద్రుడూ, కుజంభుని విష్ణువు, పశువుల మాదిరిగా వధించారు. మహేంద్రుడు శంభు పాక దైత్యులను నీ సోదరుడు సురదర్శనుని తండ్రి యగు విరోచనుని హతమార్చాడు. ఈ అత్యాచారాలన్నీ నీకు జ్ఞాపకం చేస్తున్నాము. "ఆ విధంగా శక్రుని కారణంగా జరిగిన తన వంశ నిర్మూలన వివరాలన్నీ విని, ఓ నారదా! ఆ బలి, రాక్షసు లందరనూ కూడ దీసుకొని ప్రతీకారానికి ఉద్యమించాడు. వారంతా మహోత్సాహంతో రథాల మీద కొందరు, ఏనుగుల మీద కొందరూ, గుర్రాలెక్కి కొందరూ, పాదచారులై కొందరూ, మహా శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధానికి బయలు దేరారు. దేవతలతో తలపడ టానికి బయలు దేరిన ఆ రాక్షస బలాన్ని ముందుండి సేనాపతి భయంకరాకారుడు మయ దానవుడు, మధ్యభాగాన బలి, వెనుక నుండి కాలనేమి, ఎడమ పార్శ్వాన మహావీరుడు శాల్వుడు, కుడి పక్షాన మహా భయంకరుడైన తారకాసురుడు నడిపించారు. నారదా! ఆ దానవ వీరులు వేలు లక్షలు అర్బుదాల సంఖ్యలో భూమ్యాకాశాలు ఆక్రమించి ప్రచండ ఘోషతో బయలు దేరాదు. - 14

శ్రుత్వా%సురాణా ముద్యోగం శక్రంః సురపతిః సురాన్‌, ఉవాచ యామ దైత్యాం స్తాన్‌ యోద్ధుం సబల సంయుతాన్‌|| 15

ఇత్యేవ ముక్త్వా వచనం సురరాట్‌ స్యందనం బలీ, సమారురోహ భగవాన్‌ యత మాతలి వాజినమ్‌ || 16

సమారూఢే సహస్రాక్షే స్యందనం దేవతాగణాః, స్వం స్వం వాహన మారుహ్య నిశ్చేరు ర్యుద్ధకాంక్షిణః|| 17

ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యా విశ్వే%శ్వినౌ తథా, విద్యాధరా గుహ్యకాశ్చ యక్ష రాక్షస పన్నగాః|| 18

రాజర్షయ స్తధా సిద్దా నానాభూతాశ్చ సంహతాః, గజా నన్యే రథా నన్యే హయా నన్యే సమారుహన్‌|| 19

విమానాని చ శుభ్రాణి పక్షివాహ్యాని నారద!, సమారుహ్యా%ద్రవన్‌ సర్వే యతో దైత్య బలం స్థితమ్‌|| 20

ఏతస్మిన్నంతరే ధీమాన్‌ వైనతేయః సమాగతః, తస్మివిష్ణుః సురశ్రేష్ఠ అధిరుహ్య సమభ్యగాత్‌|| 21

తమాగతం సహస్రాక్షః త్రైలోక్యపతి మవ్యయమ్‌, వవంద మూర్ధ్నావనతః సహసర్వైః సురోత్తమైః|| 22

తతో%గ్రే దేవ సైన్యస్య కార్తికేయో గదాధరః, పాలయం జఘనం విష్ణు ర్యాతి మధ్యే సహస్రదృక్‌|| 23

వామం పార్శ్వ మవష్ట భ్య జయంతో వ్రజతే మునే ! దక్షిణం వరుణః పార్శ్వ మవష్టభ్యావ్రజ ద్బలీ|| 24

తతో%మరాణాం పృతనా యశస్వినీ| స్కందేంద్ర విష్ణ్వంబుప సూర్య పాతా, నానాస్త్ర శస్త్రోద్యతదోః సమూహా, సమాససాదారి బలం మహీధ్రే|| 25

ఉదయాద్రి తీటే రమ్యే శుభే సమ శిలాతలే, నిర్వృక్షే పక్షి రహితే జాతో దేవాసురో రణః|| 26

సన్నిపాత స్తయో రౌద్రం సైన్యయో రభవ న్మునే, మహీధరోత్తమే పూర్వం యథా వానర హస్తినోః|| 27

రణరేణూ రథోద్దూతః పింగళో రణమూ ర్ధని, సంధ్యానురక్తః సదృశో మేఘః ఖే సురతాపన!|| 28

తదాసీ త్తుములం యుద్ధం న ప్రాజ్ఞాయత కించన, శ్రూయతే త్వనిశం శబ్దః భింధి భింధీతి సర్వతః|| 29

తతో విశసనో రౌద్రో దైత్యానాం దైవతైః సహ; జాతో రుధిర నిష్యందో రజః సంయమనాత్మకః|| 30

శాంతే రజసి దేవాద్యా స్తద్దానవ బలం మహత్‌, అభిద్రవంతి సహితా:సమం స్కందేన ధీమతా|| 31

నిజఘ్న ర్దానవాన్‌ దేవాః కుమార భుజ పాలితాః, దేవాన్‌ నిజఘ్న ర్దైత్యాశ్చ మయ గుప్తాః ప్రహారిణః|| 32

తతో%మృత రసాస్వాదా ద్వినాభూతాః సుర్తోమాః| నిర్జితా స్సమరే దైత్యైః సమం స్కందేన నారద!|| 33

వివ ర్జితాన్‌ సురాన్‌ దృష్ట్వా వైనతేయ ధ్వజో%రిహా, శార్‌ ఙ్గ మానయ్య బాణౌఘై ర్నిజఘాన తత స్తతః|| 34

తే విష్ణు నా హన్యమానాః పతత్రిభి రయోముఖైః, దైతేయాః శరణం జగ్ముః కాలనేమిం మహాసురమ్‌|| 35

రాక్షసుల యుద్ధానికి వస్తున్న విషయం విని దేవరాజు యుంద్రుడు, మనం కూడ మన సైన్యాలతో వెళ్లి దానవులతో పోరాడుదము లెండని దేవతలను పురి కొల్పాడు. వెంటనే ఆయన మాతలిగొని వచ్చిన ఉత్తమ రథాన్ని ఆరోహించాడు. ఇంద్రుడు రథారూఢుఢుకాగానే యితర దేవతల లందరు తమ తమ వాహనాల మీద యుద్ధానికి బయలు వెడతారు. ఆదిత్యులు, వసువులు, యక్షులు, రుద్రులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్వినులు, విద్యాధర యక్ష రాక్షస పన్నగులు రాజర్షులు, సిద్ధులు నానా భూతగణాలు అందరూ గజాల మీద కొందరు, అశ్వాల మీద కొందరు, రథాల నెక్కి కొందరు విమానాలను, పక్షివాహనాల నారోహించి కొందరూ, బయలు దేరి దైత్య సైన్యాల కెదురుగా పయనించారు. నారదా! ఇంతలో నీ విషయం తెలసికొని వినతాసుతుడైన గరుడుడు, ఆయన మీద ఆసీనుడై దేవశ్రేష్ఠుడు విష్ణువు కూడ వచ్చి కలిశారు. ఆ వచ్చిన త్రిలోకనాధుని చూచి, ఇంద్రుడు దేవతలందరితో కలిసి వినమ్ర ప్రణామాలు గావించాడు. దేవ సేనా సమూహానికి ముందు గదాధారియై స్కందుడు నడిచాడు. మధ్యబాగాన యింద్రుడు, జఘన భాగాన విష్ణువు, ఎడమ భాగాన జయంతుడు, కుడివైపు మహాబలశాలి వరుణుడు, సేనా సంచాలనం గావించారు. ఆవిధంగా స్కంద యింద్ర విష్ణు వరుణ భాస్కరులు రక్షించుచుండగా యశస్విని అయిన ఆ దేవసేనా వాహిని నానా ఆయుధాలతో ముస్తాబై ఉదయగిరి పార్శ్వాన చెట్టు చేమలు పక్షిమృగాలు లేకుండా సమతలంగా అందంగా ఉన్న శిలామైదానానికి చేరుకుంది. అంత నా ప్రదేశంలో దేవాసురుల సైన్యాలు రెండు భయంకరంగా నొకదాని నొకటి ఢీకొనగా, ప్రాచీనకాలంలో వానర గజాల మధ్య జరిగిన ఘోరసంగ్రామాన్ని తలపిస్తూ తుముల యుద్ధం సాగింది. ఓ దేవర్షీ! యుద్ధానికి ముందు భాగాన రథాల వేగానికి రేగిన ఎర్రని ధూళి మేఘాలు, సంధ్యాకాలాన పడమటి దిశను కమ్ముకొనే అరుణ మేఘాలను మరపింప జేశాయి. ఆ సంకుల సమరంలో ఏదీసరిగా తెలియ రాలేదు, కనిపించలేదు. కొట్టుడు, చంపుడు, పొడువుడు! అనే భయంకర ధ్వనులు తెరపిలేకుండా నలువైపులా వ్యాపించాయి. రోమహర్షకమైన ఆ యుధ్ధంలో యిరుపక్షాలలోను హతులైన వారల రుధిర ధారలలో ఆ ధూళిమేఘాలు అణగిపోయాయి. అలా ధూళి తగ్గగానే స్కందుని వెంట దేవ సైన్యాలన్నీ ఒక్కపరిగా రాక్షసుల మీద విరుచుక పడ్డాయి. దేవసేనాపతి రక్షణలో దేవతలు దానవులను సంహరించగా మయుని అండ చూచుకుని రాక్షసులు సురలను చెండాడ సాగారు. అంతవరకూ అమృతపానానికి నోచుకోని దేవతలంతా స్కందునితో సహా రాక్షసుల ధాటికి నిలువలేక ఓటమి పాలయ్యారు. దేవతల ఓటమి చూచి శత్రు హంత అయిన శ్రీహరి శార్‌ ఙ్గ చాపాన్ని ఎక్కుబెట్టి బాణవర్షంతో నలువైపులా గల శతృవుల నూచకోత కోయ సాగాడు. ఉక్కు మొనలతో పిడుగుల్లాగ తాకే ఆ బాణాలకు హతశేషులయిన రక్కసులు వెన్నిచ్చి పారపోయి మహాదైత్యుడు కాలనేమిని శరము పొందారు. 35

తేభ్యఃసచా బయం దత్వా జ్ఞాత్వా%జేయం చ మాధవమ్‌|

వివృద్ధిమ గమద్‌ బ్ర హ్మ్రన్‌ యథా వ్యాధి రుపేక్షితః|| 36

యంయంకరేణ స్పృశతి దేవం యక్షం సకిన్నరమ్‌|

తంతమాదాయ చిక్షేప విస్తృతే వదనే బలీ|| 37

సంరంభా ద్దానవేంద్రో విమృదతిదితిజైః సంయుతో దేవసైన్యమ్‌|

సేంద్రం సార్కం సచంద్రం కరచరణ నఖై రస్త్రహీ నో%పివేగాత్‌ 38

చక్రై ర్వైశ్వానరాభై స్త్వవని గగనయో స్తిర్య గూర్ధ్వం సమంతాత్‌,

ప్రాప్తే%తే కాలవహ్నేర్జ గదఖిలమిదం రూప మానీద్దిధక్షోః|| 39

తం దృష్ట్వా వర్ధమానం రిపుమతి బలినం దేవగంధర్వ ముఖ్యాః,

సిద్ధాసాధ్యా శ్విముఖ్యా బయతరల దృశః ప్రాద్రవన్‌ దిక్షుసర్వే| 40

పో ప్లూయంతశ్చ దైత్యా హరి మమరగణౖ రర్చితం చారుమౌళిం,

నానా శస్త్రాస్త్ర పాతై ర్విగలిత యశసం చక్రు రుత్సిక్తద ర్పాః|| 41

తా నిత్థం ప్రేక్ష్య దైత్యాన్‌ మయబలిపురగా9కాలనేమి ప్రధానాన్‌,

బాణౖ రాకృష్య శార్‌ ఙ్గం త్వనవరత మురో భేదిభి ర్వజ్రకల్పైః 42

కోపా దారక్త దృష్టిః సరథ గజ హయాన్‌ దృష్టి నిర్ధూత వీర్యాన్‌ నారాచైఖ్యైః

సంపుఖై ర్జల దివగిరీన్‌ ఛాదయామాసవిష్ణుః|| 43

తైర్బాణౖశ్ఛాద్య మానా హరికరనుదితై ః కాలదండ ప్రకాశై,

ర్నారాచై రర్థచంద్రై ర్బలిమయపురగా భీత భీతా స్త్వరంతః| 44

ప్రారంభే దానవేంద్రం శతవదన మథో ప్రేషయత్‌ కాలనేమిం,

స ప్రాయా ద్దేవసైన్య ప్రభు మమర బలం కేశవం లోకనాథమ్‌|| 45

తం దృష్ట్వా శతశీర్ష ముద్యత గదం శైలేంద్ర శృంగాకృతిమ్‌,

విష్ణుఃశార్‌ ఙ్గమపాస్య సత్వర మధో జగ్రాహ చక్రంకరే|| 46

సో%ప్యేనం ప్ర సమీక్ష్య దైత్యవిట ప ప్రచ్ఛేదనం మానినమ్‌,

ప్రోవాచా%థ విహస్యతం సురుచిరం మేఘస్వనోదానవః|| 47

ఆయం స దనుపుత్ర సైన్యవిత్రాసకృద్రివపుః, పరమకోపితః స మధోర్విఘాతకృత్‌|

హిరణ్య నయనాంతకః కుసుమపూజారతః, క్వయాతి మమదృష్టి గోచరే న పతతః ఖలః|| 48

యద్యేష సంప్రతి మమాహవ మభ్యుపైతి నూనం స యాతి నిలయం నిజ మంబుజాక్షః|

మన్ముష్టి పిష్ట శిథిలాంగ ముపాత్త భస్మ సంద్రక్ష్యతే సురజనో భయకాతరాక్షః|| 49

ఇత్యేవ ముక్త్వా మధుసూదనం వై సకాలనేమిః స్పురితాధరోష్ఠః|

గదాం ఖగేంద్రో పరి జాతకోపో ముమోచ శైలే కులిశం యథె%ద్రః|| 50

తా మాపతంతీం ప్రసమీక్ష్య విష్ణు ర్ఘోరాం గదాం దానవ బాహు ముక్తామ్‌|

చక్రేణ చిచ్ఛేద సుదుర్గతస్య మనోరథం పూర్వకృతేవ కర్మ|| 51

గదాం ఛిత్వా దానవాభ్యోశ మేత్య భుజౌ పీనౌ సంప్రచిచ్ఛేద వేగాత్‌|

భుజాభ్యాం కృత్తాభ్యాం దగ్ధశైల ప్రకాశః, సందృశ్యేతా ప్యపరః కాలనేమిః|| 52

తతో%స్య మాధవః కోపాత్‌ శిర శ్చక్రేణ భూతలే,

ఛిత్వా నిపాతయామాస పక్వం తాళఫలం యధా|| 53

తథా విబాహు ర్విశిరా ముండతాలో యథా వనే|

తస్థౌ మేరు రివాకంప్యః కంబంధః క్ష్మాధరేశ్వరః|| 54

తం వైనతేయో%ప్యురసా ఖగోత్తమో, నిపాతయామాస మునే! ధరణ్యామ్‌|

యథాంబరా ద్బాహు శిరః ప్రణష్ట బలం మహేంద్రః కులిశేన భూమ్యామ్‌|| 55

తస్మిన్హతే దానవసైన్య పాలే సంపీడ్యమానా స్త్రిదశైస్తు దైత్యాః

విముక్త శస్త్రాలక చర్మ వస్త్రాః సంప్రాద్రవన్‌ బాణ మృతే%సురేంద్రాః|| 56

ఇతి శ్రీ వామన పురాణ సప్త చత్వారింశో%ధ్యాయః సమాప్తః||

భయాతురులైన దానవులకు అభయం యిచ్చి, మాధవుని జయింప లేనని, తెలిసికొనిన ఆ కాలనేమి, మాయపన్ని, చికిత్స చేయకుండా ఉపేక్షించిన జబ్బు మాదిరిగా తన శరీరాన్ని పెంచసాగాడు. ఓ నారదా! అలా దేహాన్ని పెంచి చేతికి అందిన దేవతల నందరనీ వారు యక్షులుగానీ, కిన్నరులు గానీ, ఒడిసి పట్టుకొని కొండ గుహ లాంటి నోటిలో వేసుకోసాగాడు! ఆ సంరంభంలో వాడు రాక్షసుల సహాయంతో, యింద్ర చంద్ర సూర్యాదులతో సహా దేవతల నందరనూ, చేతిలో ఆయుధ మంటూ ఏదీ లేకపోయినా కాళ్లతో చేతులతో గోళ్లతో మర్దించ మొదలు పెట్టాడు. వాడి దేహం ప్రళయ కాలాన భూమ్యాకాశాలను భస్మం చేసే కాలాగ్ని చక్రంలాగా దుర్నరీక్ష్యంగా వెలిగి పోసాగింది. ఆ విధంగా దిక్కుల నన్నింటినీ ఆక్రమిస్తూ పెరిగపోతున్న ఆ ప్రబల శత్రువు దేహాన్ని చూచి దేవ గంధర్వ యక్ష సిద్ధసాధ్యాదులు సకల దేవతలు భయంతో వణికిపోతూ ఎటుపడితే అటు పారిపో సాగారు. కాగా గర్వంతో కనులు కానని దైత్యులు ఆనందంతో గంతులేస్తూ సర్వ దేవారాధ్యుడైన ఆ శ్రీహరి మీద తమ తమ శస్త్రాస్త్రాలు వర్షించి ఆయన యశస్సును కళంకితం చేసేందుకు ఉపక్రమించారు. కాలనేమి అండతో మయుడు బలితో కలిసి అలా విజృంభించే ఆ రాక్షసులను చూచి క్రోధారుణ నేత్రాలతో నిప్పులు వర్షిస్తూ, శార్‌ ఙ్గ ధనుస్సు ఎక్కు పెట్టి శతృ హృదయాలను చీల్చిచెండాడే పిడుగు ల్లాంటి బాణాలు పుంఖాను పుంఖాలుగా ఆ శ్రీహరి గుప్పించిన, రథ గజ, హయాల సహితంగా ముంచివేశాడు. ఆయన చూపులకే శత్రువుల తేజం హరించుకోపోయింది. గుములు గట్టి మేఘాలు పర్వతాన్ని కాలదండాల్లాంటి ఆ అర్ధచంద్ర బాణాల ధాటికోర్వలేక భయాతురులై మయుడు బలి మొదలైన వారంతా వెనుకకు తగ్గి నూరునోళ్లతో భీభత్సం సృష్టిస్తున్న కాలనేమిని ముందుకు పంపారు. వాడు బొబ్బలు పెడుతూ లోకేశ్వరుడైన కేశవుని సమీపించాడు. నడిగొండలాగ గత ఎత్తికొని తనమీదకు వస్తూన్న కాలనేమిని చూచి ధనుస్సును వదలి హరి చక్రం పట్టి నిలబడ్డాడు. దైత్య వృక్ష మూలోచ్ఛేదకుడైన ఆ ప్రభువును చూచి చాలా సేపు వికటాట్టహాసం చేసి ఆ రాక్షసుడు మేఘ గర్జన స్వరంతో యిలా అన్నాడు. "వీడే! రాక్షస లోకాని కంతా గుండె దిగులుగా పరిణమించిన మహా కోపిష్టి శత్రువు! వీడే మధువును సంహరించాడు. హిరణ్యాక్షుణ్ణి పొట్టన బెట్టుకున్నాడు. పుష్ప పూజల కోసం కలువరిచేవాడు. ఈనాటికి నా ఎదుట బడ్డాడు. ఇక నీ ఖలుడెక్కడకు బ్రతికి పోగలడు? తిరిగి ఈ రాజీవాక్షుడు తన యింటికి పోజాలడు!నా ముష్టి ఘాతాలకు నుగ్గునూచమై పోయే వీడి సర్వాంగాలను దేవతలు భయ విహ్వల నేత్రాలతో చూచే గడియ ఆసన్నమైనది. ఈ గడియతో వీడిపని సరి!" అంటూ పెదవులు కంపిస్తూండగా పండ్లు పటపట కొరుకుచు ఆ కాలనేమి దైత్యుడు, మహేంద్రుడు పర్వతం మీద వజ్రాన్ని ప్రయోగించినట్లు తన ప్రచండ గదాదండాన్ని గరుడుని మీద విసిరివేశాడు! ఆ భయంకరమైన గదమీదికి, మధుసూదనుడు తన చక్రాన్ని వదలి దానిని ముక్కలు గావించాడు. గదను భగ్నం చేసి ఆ చక్రం వేగంతో వాడి పెనుబాహువులు రెండూ నరికి వేసింది. బ్రహ్మాండమైన చేతులు రెండూ తెగిపోవడంతో ఆ దుష్టుడు ఎర్రగా మండి పోతున్న పర్వతంలాగా, మరొక వ్యక్తిలాగా కనిపించాడు. అంతటితో కోపం తీరక ఆ రాక్షసాంతకుడు, చక్రంతో వాడి తలను పండిన తాటి కాయలాగ నరికి నేల మీద పడగొట్టాడు. అలా చేతులు తల తెగ, మొండితాటి చెట్టులాగ కబంధ మాత్రుడుగా మిగిలిన ఆ మహాదైత్యుడు చలించని మేరు పర్వతంలాగ నిలచాడు. అలా నిలచిన వాడి మొండెమును, గరుత్మంతుడు తన వక్షోభాగంతో నెట్టివేయగా, ఇంద్రుడు బలుని వజ్రంతో ఆకాశా న్నుంచి భూమిమీదకు పడద్రోసి నట్టుగా ఆకాలనేమి నేలమీద పడిపోయాడు. అలా తమ ప్రధాన సేనాధ్యక్షుడు హతుడు కాగా, దేవసేనల చేతిలో చావు దెబ్బలు తిని శేషించిన దైత్యులు ఆయుధాలు, కవచాలు కట్టుబట్టలతో సహా వదలి ప్రాణ రక్షణకై పారిపోయారు. ఒక్క బాణాసురుడు మాత్రం యుద్ధభూమిన వదలి వెళ్లలేదు -51

ఇది శ్రీ వామన పురాణంలో నలుబది యేడవ అధ్యాయము ముగిసినది.

Sri Vamana Mahapuranam    Chapters