Sri Vamana Mahapuranam    Chapters   

నలుబది ఒకటవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

హరో7పి శంబరేయాతే నమాహూయాథ నందినమ్‌ | ప్రాహామంత్రయ శైలాదే యేస్థితా స్తవ శాననే. 1

తతోమహేశ వచనా న్నంది తూర్ణతరంగతః | ఉసస్ప్యశ్యజలం శ్రీమాన్‌ సస్మార గణనాయకాన్‌. 2

నందినా సంస్మృతాస్సర్వే గణనాధాః సహస్రశః | సముత్పత్య త్వరాయుక్తాః ప్రణతాస్త్రిద శేశ్వరమ్‌. 3

అగతాంశ్చ గణాన్నందీ కృతాంజలిపుటో7వ్యయః | సర్వాన్‌ నివేదయామాస శంకరాయ మహాత్మనే. 4

నంద్యువాచ :

యానేతాన్‌ పశ్యసేశంభో త్రినేత్రాన్‌ జటిలాన్ము చీన్‌ | ఏతేరుద్రా ఇతిఖ్యాతాః కోట్య ఏకాదశైవతు. 5

వానరాస్యాన్‌ పశ్యసేయాన్‌ శార్ధూలసమ విక్రమాన్‌ | ఏతేషాం ద్వారపాలాస్తే మన్నామానోయశోధనాః. 6

షణ్ముఖాన్‌ పశ్యసేయాంశ్చ శక్తిపాణీన్‌ శిఖిధ్వజాన్‌ |

షట్చషష్టిసథా కోట్యః స్కందనామ్నః కుమారకాన్‌. 7

ఏతావత్యస్తథా కోట్యః శాఖానామషడాననాః | విశాఖాస్తావదేవోక్తా నైగమేయాశ్చ శంకర. 8

సప్తకోటిశతం శంభో అమీవై ప్రమథోత్తమాః | ఏకైకం ప్రతిదేవేశ తావతో7హ్యపి మాతరః. 9

భస్మారుణిత దేహాశ్చ త్రినేత్రాః శూలపాణయః | ఏతేశైవా ఇతిప్రోక్తా స్తవభక్తా గణశ్వరాః. 10

తథా పాశుపతాశ్చాన్యే భస్మ ప్రహరణావిభో | ఏతేగణాస్త్వసంఖ్యాతాః సహాయార్థం సమాగతాః. 11

పినాకధారిణో రౌద్రా గణాః కాలముఖాః పరే | తవభక్తాః సమాయాతా జటామండలినోద్భుతాః 12

ఖట్వాంగయోధినో వీరా రక్తచర్మ సమావృతాః | ఇమేప్రాప్తాగణా యోద్ధుం మహావ్రతిన ఉత్తమాః. 13

దిగ్వాససో మౌనినశ్చ ఘంటా ప్రహరణాస్తథా | నిరాశ్రయా నామగణాః సమాయాతా జగద్గురో. 14

సార్ధద్వినేత్రాః పద్మాక్షాః శ్రీవత్సాంకిత వక్షసః | సమాయాతాః ఖగారూఢా వృషభద్వజినో7వ్యయాః. 15

మహాపాశుపతా నామ చక్రశూల ధరాస్తథా | భైరవో విష్ణునాసార్థ మభేదేనార్చితోహియైః. 16

ఇమేమృగేంద్ర వదనాః శూలబాణ ధనుర్ధరాః | గణాస్త్వద్రోమ సంభూతా వీరభద్ర పురోగమాః 17

ఏతేచాన్యేచ బహవః శతశో7థ సహస్రశః | సహాయార్థంతవాయాతా యథా ప్రీత్యా77దిశన్వతాన్‌. 18

పులస్త్యుడిలా అన్నాడు : శంబర దైత్యుడు వెళ్ళిన పిమ్మట హరుడు నందిని పిలచి నీ యేలుబడిలో గల వారల నందరను, ఓ శిలాదనందనా ! వెంటనే పిలుపుమని ఆదేశించాడు. మహేశ్వరుని మాట విన్నంతనే నంది అచమనం గావించి శివగణాల నాయకులందరిని స్మరించాడు. శ్రీమంతుడైన నందీశ్వరుడు స్మరించినవెంటనే వేల సంఖ్యలో, ఆ గణ నాయకులంతా ఎగిరివచ్చి ఆ దేవదేవునకు ప్రణమిల్లారు. నంది చేతులుజోడించుకుని పరమశివునకావచ్చిన వారలనందరును ఎరుకపరిచాడు. ప్రభో శంకరా ! మూడుకన్నులతో జటాధారులైన ఈ వీరులు రుద్రులుగా ఖ్యాతిగాంచారు. వీరి సంఖ్య పదకొండు కోట్లు. ఇక శార్ధూల విక్రమంగలిగి వానరముఖాలతో కనిపించే ఈ యశోధనులు నా పేరుతో విరాజిల్లే శూరులు. ఈ రుద్రులు ద్వారపాలకులు. శక్తిపాణులై శిఖికేతనాలతో ఆ కనిపించే షణ్ముఖులున్నారే వారు అరవై ఆరుకోట్లు. స్కందులనే పేరుగల ఆ వీరులు కుమారులు. ఆరుతలలు కల వీరలు శాఖులు. వీరి సంఖ్యకూడా అంతే. ఇక నా విశాఖులు, నైగమేయులనబడే వారలుకూడ, షడాననులు, అరవైఆరుకోట్ల సంఖ్యలలో ఉన్నారు. శంకరా ! ఆ నిలబడిన ఉత్తమ ప్రమథులు ఏడునందల కోట్లమంది, వారందరకూ నదేసంఖ్యలో మాతృకలున్నారు. ఇక భస్మారుణ శరీరాలతో మూడు కన్నులూ శూలాలు ధరించిన శైవులనే ఈ గణనాయకులు నీభక్తులు. భస్మంతోనే ప్రహరించి శత్రునాశం చేసే పాశుపత గణాధిపతులరుగో, నీ సహాయార్థం వచ్చిన వీరలు లెక్కకు మించి ఉన్నారు. కాలముఖులనే భయంకరులైన, నీ భక్త గణాలు అరుగో జటాధారులై పినాకాలు పట్టుకొని వచ్చారు. ఎర్రని కవచాలు ధరించి ఖట్వాంగాలతో యుద్ధంచేసే ఉత్తమ వ్రతధారులైన నీ భక్తగణాలు యిరుగో, యుద్ధంచేయుటకు వచ్చారు. ఓ జగద్గురూ ! అరుగో మౌనధారులై ఘంటాప్రహారాలు చేసే దిగంబరులైన నిరాశ్రయులనబడే గణనాయకులు వచ్చారు. కమలాలను బోలిన రెండున్నర కన్నులతో, శ్రీవత్సలాంచనాలు ధరించి ఖగాలమీద కొందరు గణాధిపతులు వచ్చారు. మరికొందరు వృషభ##కేతనాలతో వచ్చారు. వారు మహాపాశుపతులు. చక్రశూలధరులు, వారు భైరవు (శివ) ని విష్ణువును అభేదబుద్ధితో అర్చిస్తారు. శూలబాణ చాపాలు ధరించి వీరభద్రుని పురస్కరించుకొని వచ్చిన ఈ గణాలు, నీ రోమాలనుంచి ఉద్భవించారు. వీరలూ, యింకనూ వందలూ వేల సంఖ్యలలో ఎందరో గణాల వారలు ప్రభో ! నీకు సహాయం చేయుటకు వచ్చారు. వీరలకు తగిన ఆదేశాలు యివ్వండి.

తతో7భ్యేత్యగణాః సర్వే ప్రణముర్వృష ధ్వజమ్‌ | తాన్‌ కరేణౖవ భగవాన్‌ సమాశ్వాస్యోప వేశయత్‌. 19

మహాపాశుపతాన్‌ దృష్ట్వా సముత్థాయ మహేశ్వరః | నంపరిష్వ జతాధ్యక్షాం స్తేప్రణము ర్మహేశ్వరమ్‌ 20

తతస్తదద్భుత తమం దృష్ట్వాసర్వే గణశ్వరాః | సుచిరం విస్మితాక్షాశ్చ వైలక్ష్య మగమనృరమ్‌. 21

విస్మితాక్షాన్‌ గణాన్‌ దృష్ట్వా శైలాదిర్యోగినాంవరః | ప్రాహప్రహస్య దేవేశం శూలపాణిం గణాధిపమ్‌. 22

విస్మితామీ గణాదేవః సర్వఏవ మహేశ్వరః | మహాపాశుపతానాం హి యత్త్వయాలింగనం కృతమ్‌. 23

తదేతేషాం మహాదేవ స్సుటం త్రైలోక్యవిందకమ్‌ | రూపం జ్ఞానం వివేకంచ వదస్వ స్వేచ్ఛయావిభో. 24

ప్రమథాధిపతే ర్వాక్యం విదిత్వా భూతభావనః | బభాషేతాన్‌ గణాన్‌ సర్వాన్‌ భావా భావవిచారిణః. 25

రుద్ర ఉవాచ :

భవద్భిర్భక్తి సంయుక్తై ర్హరోభావేన పూజతః | అహంకార విమూఢైశ్చ నిందర్భిర్వైష్ణవం పదమ్‌. 26

తేనాజ్ఞానేన భవతో7నాదృత్యానువిరోధితాః |

యో7హంస భగవాన్‌ విష్ణు ర్విష్ణుర్యః సో7హమప్యయః. 27

నావయోర్వై విశేషో7స్తి ఏకానమూర్తిర్‌ ద్విధాస్థితా | తదమీభిర్నరవ్యాఘ్రైర్భక్తి భావయుతైర్గణౖః. 28

యథాహం వైసరిజ్ఞాతో నభవద్భిస్త థాద్రువమ్‌ | యేనాహం నిందితోనిత్యం భవద్భిర్మూఢ బుద్ధిభిః. 29

తేనజ్ఞానం హివైనష్టం నాతస్త్వా లింగితామయా | ఇత్యేవముక్తేవచనే గణాః ప్రోచుర్మ హేశ్వరమ్‌. 30

కథంభవాన్‌ యథైక్యేన సంస్థితో7స్తి జనార్థనః | భవాన్‌ హినిర్మలః శుద్ధః శాంతః శుక్లోనిరంజనః. 31

సదాప్యంజన సంకాశః కథంతేనేహయుజ్యతే | తేషాంవచన మర్థాఢ్యం శ్రుత్వాజీమూతవాహనః. 32

విహస్యమేఘగంభీరం గణానిదమువాచహ | శ్రూయతాం సర్వమాఖ్యస్యే స్వయశోవర్థనం వచః. 33

నత్వేవయోగ్యా యూయంహి మహాజ్ఞానస్య కర్హి చిత్‌ | అపవాదభయా ద్గుహ్యం భవతాంహి ప్రకాశ##యే. 34

ప్రియధ్వమపి చైతేనయ న్మచ్చిత్తాస్తునిత్యశః | ఏకరూపాత్మకందేహం కురుధ్వంయత్న మాస్థితాః. 35

అలా ఆ గణాల వారందరు ఆ వృషభధ్వజుని సమీపించి ప్రణామాలు గావించారు. వారందరను ఆ హరుడు చేతితో సంభావించి సైగచేసి కూర్చుండజేశారు. మహాపాశుపతులను చూచి స్వయంగా లేచివెళ్ళి ఆలింగనం చేసుకొనగా వారలాయనకు నమస్కారాలు గావించారు. శివుని ఆ విచిత్రమైన ప్రవర్తనచూచి గణాధిపతులంతా చాలా ఆశ్చర్యపడి సిగ్గుతో ముడుచుకొని పోయారు. అలా సిగ్గుపడిన గణాలనుచూచి నందీశ్వరుడాదిగాగల యోగులు నవ్వుతూ సకల గణాధిపుడైన ఆ శూలపాణిని చూచి యిలా అన్నారు. ''దేవా! మీరొక మహా పాశుపతులను మాత్రమే కౌగలించుకొని ఆదరించడం చాచి యితరులంతా ఆశ్చర్యచకితులయ్యారు. అందుచేత త్రైలోక్యాభినందనీయాలైన విశేషరూపజ్ఞాన వివేకాది లక్షణాలు వారిలో ఏమేమిగలవో అన్నీ వివరించండి. నందీశ్వరుని మాటలు విని ఆ భూతభావనుడైన హరుడు భావాభావవిచక్షుణులైన ఆ సర్వ గణాలతో యిలా అన్నాడు. ''మీరందరూ భక్తిభావంతో హరుని పూజించినా అహంకార విమూఢులై విష్ణుపదకమలాలను నిందిస్తారు. మీలోని ఆ అజ్ఞానంవల్ల మిమ్ములను నిరాకరించడం సంభవించింది. నేనా భగవంతుడగు విష్ణువునే ! ఆ విష్ణువే అవ్యయుడనైన నాస్వరూపం. మాకు భేదంలేదు. ఒకే తత్వం రెండు రూపాల్లో ఉన్నాము. ఈ రహస్యాన్ని ఈ పురుష శార్దూలాలు గుర్తించినట్లుగా మీ యితర గణాల వారందరూ తెలిసికొనలేకపోయారు. శివభక్తులుగా చలామణి అయ్యే మీలాంటి మూర్ఖుల కారణంగా నేను నిందలకు గురి అవుతున్నాను. ఆ భేదబుద్ధివల్ల మీలోని జ్ఞానం నశించి నందున నేను మిమ్ముల నాలింగనం చేసుకోలేదు''. ఇలా మహేశ్వరుడనగా ఆ గణాధిపతులు మరల యిలా అడిగారు. ''ప్రభూ ! మీరూ జనార్దనుడూ ఒక్కరే ఎలా కాగలరు ? మీరో శుద్ధ, శాంత, నిర్మల, శుక్ల, నిరంజన స్వరూపులు కాగా ఆ విష్ణువు కాలాంజన (కాటుక) సన్నిభుడు ! ఆయన మీతో కలియడం ఎలా సంభవం ? అర్థయుక్తాలైన వారల మాటవిని ఆ జీమూతవాహనుడు (హరుడు) మేఘగంభీర స్వరంతో నవ్వి యిలా చెప్పసాగాడు అయితే అందరూ వినండి. నా కీర్తి ప్రతిష్ఠలను యినుమడింపజేసే విషయాలు చెబుతాను. మీరు ఉన్నత జ్ఞానానికి అర్హులుగారు. అపవాదానికి వెరచి మీ కా రహస్యాన్ని వెల్లడిస్తున్నా. మీ చిత్తాలన్నీ నాయందే లగ్నమైయున్నవి. ప్రయత్నించి మీ శరీరాలను ఏకరూపంగా చేసుకొని వినండి.

పయసాహవిషా ద్యైశ్చ స్నపనేన ప్రయత్నతః | చందనాదిభిరేకాగ్రైర్న మేప్రీతిః ప్రజాయతే. 36

యత్నాత్‌ క్రకచమాదాయ ఛిందధ్వం మమవిగ్రహమ్‌ | నరకార్హా భవద్భక్తా రక్షామి స్వయశో7ర్థతః. 37

మా7యంవదిష్యతే లోకే మహాంతమపవాదినమ్‌ | యథాపతంతినరకో హరభక్తాస్త వస్వినః. 38

వ్రజంతినరకంఘోరం ఇత్యేవం పరివాదినః | అతో7ర్థం సక్షిపామ్యద్య భవతో నరకే7ధ్బుతే. 39

యన్నిందధ్వం జగన్నాధం పుష్కరాక్షంచ మన్మయమ్‌ |సచై వభగవాన్‌ సర్వః సర్వవ్యాపీ గణశ్వరః. 40

నతస్యసదృశో లోకే విద్యతే సచరాచరే | శ్వేతమూర్తిః సభగవాన్‌ పీతోరక్తో7ల జనప్రభః. 41

తస్మాత్సరతరం లోకే నాన్యద్ధర్మంహి విద్యతే | సాత్వికం రాజసంచైవ తామనం మిశ్రకంథా |

సఏవధత్తే భగవాన్‌ సర్వపూజ్యః సదాశివః.

శంకరస్యవచః శ్రుత్వా శైవాద్యాః ప్రమథోత్తమాః | ప్రత్యూచుర్భగవన్‌ బ్రూహి సదాశివ విశేషణమ్‌. 43

తేషాం తద్భాషితంశ్రుత్వా ప్రమథానామథేశ్వరః | దర్శయామాస తద్రూపం సదాశైవం నిరంజనమ్‌. 44

తతః పశ్యంతిహిగణాః తమీశం వైసహస్రశః | సహస్రవక్త్ర చరణం సహస్రభుజ మీశ్వరమ్‌. 45

దండపాణిం సుదుర్దృశ్యం లోకైర్వ్యాప్తం సమంతతః| దండసంస్థా7స్య దృశ్యంతే దేవప్రహరణాస్తథా. 46

తతఏకముఖం భూయో దదృశుః శంకరంగణాః | రౌద్రైశ్చ వైష్ణవైశ్చైవ వృతంచిహ్నైః సహస్రశః . 47

అర్ధేనవైష్ణవ వపు రర్దేన హరవిగ్రహః | ఖగద్వజం వృషారూఢం ఖగారూఢం వృషధ్వజమ్‌. 48

యథాయథా త్రిణయనో రూపంధత్తే గణాగ్రణీః | తథాతథా త్వజాయంత మహాపాశుపతా గణాః. 49

తతో7భవచ్చై కరూపీ శంకరోబహు రూపవాన్‌ | ద్విరూవశ్చా భవద్యోగీ ఏకరూపో7ప్య రూపవాన్‌. 50

''మీరునాకు గావించే క్షీర హవిస్సుల అభిషేకాలుగానీ ఏకాగ్ర చిత్తంతో చేసే చందనలేపాది అర్చనలు గాని నాకు సంతోషం కలిగించవు. మీరొకరంపంతో నా దేహాన్ని రెండుగా చీల్చండి. నరకగాములైన శివభక్తులను రక్షించుకో డానికిలా చెబుతున్నాను. ఎందుకనగా శివభక్తులంతా నరకానికి అర్హులు అనే అపనింద ఈ లోకం నాకు అంటగడుతుంది. తపస్సంపన్నులగు హరభక్తులు గూడ నరకానికి పోతారనే అపవాదుకు పాత్రులయ్యేవారు. ఘోర నరకాల్లో పడకుండా చేసేందుకే నేను యిలాచేస్తున్నాను. శివమయుడా కమలపత్రాక్షుడైన ఏ జగన్నాధు (విష్ణువు) నైతే మీరలు నిందిస్తున్నారో, ఆయన నేనే. మరెవరోకాదు. ఆయన సర్వవ్యాపియైనశర్వుడే. సర్వగణాధిపుడే ఆయన శ్వేతపీఠ రక్తకృష్ణ వర్ణాలు గలవాడు. అలాంటి ప్రభువు చరాచర జగత్తులో మరొకడు లేడు. ఆయనను మించిన ధర్మం లోకంలో లేదు. ఆ సర్వ పూజ్యుడు భగవంతుడు నగు సదాశివుడే సాత్విక, రాజసిక, తామసిక, మిశ్రగుణాశ్రయుడు సుమా !'' శంకరుడు చెప్పిన ఆ అద్భుత వచనాలు విని శైవాదులైన ప్రమథోత్తములు విస్మయంతో ప్రభో ఆ సదా శివుని మహిమా విశేషాలెట్టివో అనుగ్రహించుడని ప్రార్థించగా నా ప్రమథులకా హరుడు సదానిరంజనమైన ఆ శైవ రూపాన్ని చూపించాడు. అంతట నా గణాలు ఆ ఈశ్వరుని సహస్ర రూపాల్లో సహస్ర ముఖాలు కరచరణాదులతో దండపాణియై సర్వవ్యాపియైన విశ్వమూర్తిగా నవలోకించారు. ఆ తేజస్సును చక్కగా చూడలేక పోయారు. ఆ ప్రభువు చేతిలోని దండాన్నాశ్రయించుకొని సర్వదేవతల ఆయుధాలు కనిపించాయి. మరుక్షణాన ఆ గణాలకాప్రభువు శంకరుడు, ఏకముఖంతో శరీరం నిండా వేలాది శైవ వైష్ణవ చిహ్నాలతో దర్శనమిచ్చాడు. ఆ హరుని విగ్రహంలో సగభాగం విష్ణువు సగ భాగం శివుడు. గరుడధ్వజం ధరించి వృషభం మీద కూర్చొని ఒకవరీ, వృషభధ్వజం పట్టుకొని ఖగవాహనుడై మరొకపరి కనిపించాడు. సర్వగణ గ్రేసరుడైన ఆ త్రినేత్రుడలా అనంతరూపాలు దర్శిస్తుండగా మహాపాశుపత గణాలవారు అసంఖ్యాకంగా వస్తూ ఉన్నారు. అంతట నా బహురూపి ఏకరూపి అయ్యాడు. ద్విరూపధరుడయ్యాడు, రూప రహితుడై కూడ ఆ మహాయోగి ఒక రూపం ధరించాడు. క్షణకాలం తెల్లగా ఉంటే మరుక్షణంలోనే ఎరుపుగా, పచ్చగా, నల్లగా క్షణాలమీద మార్పుచెందాడు.

మిశ్రకోవర్ణహీనశ్చ మహాపాశుపతస్తథా | క్షణాద్భవతి రుద్రేంద్రః క్షణాచ్ఛంభుః ప్రభాకరః. 51

క్షణార్ధాచ్ఛం కరోవిష్ణుః క్షణాచ్ఛత్వః పితామహః | తతస్త దద్భుతతమం దృష్టవా శైవాదయోగణాః. 52

అజానంత తదైక్యేన బ్రహ్మవిష్ణ్వీశ భాస్కరాన్‌ | యథా7భిన్న మమన్యంత దేవదేవం సదాశివమ్‌ . 53

తదానిర్దూత పాపాస్తే సమజాయంత పార్షదాః | తేష్వేవంధూత పాపేషు అభిన్నేషు హరీశ్వరః. 54

ప్రీతాత్మావిబభౌశంభుః ప్రీతియుక్తో7బ్రవీద్వచః | పరితుష్టో7స్మివః సర్వే జ్ఞానేనానేన సువ్రతాః. 55

వృణుధ్వం వరమానంత్యం దాస్యేవో మనసేప్సితమ్‌ | ఊచుస్తేదేహి భగవాన్‌ వరమస్మాకమీశ్వర|

భిన్నదృష్ట్యుధ్బవం పాపం యత్తత్‌ భ్రంశం ప్రయాతునః. 56

పులస్త్య ఉవాచ ః

బాఢమిత్య బ్రవీచ్ఛర్వ శ్చక్రే నిర్దూత కల్మషాన్‌ |

సంపరిష్వజతావ్యక్త స్తాన్‌ సర్వాన్‌ గణయూథపాన్‌. 57

ఇతివిభునా ప్రణతార్తి హరేణ గణపతయో వృషమేఘరథేన |

శ్రుతిగదితాను గమేనేవమందరం గిరిమవతత్య సమధ్య వసంతమ్‌. 58

ఆచ్ఛాదితోగిరివరః ప్రమథైర్ఘనాభైః ఆభాతి శుక్లతనురీశ్వర పాదజుష్టః|

నీలాజినాతతతనుః శరదభ్రవర్ణో యద్వద్విభాతి బలవాన్‌ వృషభోహరస్య. 59

ఇతి శ్రీ వామనమహాపురాణ ఏకచత్వారిం శో7ధ్యాయః.

మరుక్షణాన ఆ రుద్రేంద్రుడు మిశ్రవర్ణంలో కనిపిస్తే ఆ మరుక్షణాల్లో వర్ణహితుడయ్యాడు. మహాపాశుపతుడయ్యాడు, ఇంద్రుయ్యాడు, ప్రభాకరుడయ్యాడు. అనంతరం క్షణార్ధంలో విష్ణువుగా మారాడు, పితామహ బ్రహ్మరూపం ధరించాడు. ఆ అద్భుతానికి వెరగుపడి చూచే ఆ శైవ గణాలకు బ్రహ్మ విష్ణు శివ భాస్కరుల ఏకరూపత బాగా అవగతమైనది. సదాశివుని దేవదేవుడుగా గుర్తించినంతనే ఆ పార్షదులందరూ పాపరహితులయ్యారు. అలా ధూతపాపులైన తన గణాలను చూచి ఆనందించి హరిహరుడైన ఆ శివుడు - శివకేశవాభిన్న దృష్టు పొందిన మీరందరు ధన్యులు. మీ వ్రతాలు ఫలించాయి. నాకానందం కలిగింది. మీరు కావలసిన వరం కోరుకొనుడనగా వారలో దేవా, ఇంతవరకు భిన్న దృష్టితో వ్యవహరించి మేము మూట గట్టుకొన్న పాపాలు నశించు నట్లనుగ్రహించడంని వేడుకున్నారు. ఓ నారదా ! అంతట శంభుడు మంచిదని వారందరకు పాపనాశం కలిగించాడు. వారలను గూడ కౌగలించుకొని ఆనందపరచాడు. ప్రణతార్తి హరుడు వృషభ మేఘవాహనుడునగు ప్రభువు చెప్పిన మాటలువిని ఆ గణాధిపతులందరు వేదోక్తమైన క్రమంలో ఆ మందర గిరిని ఆక్రమించి నిలచారు. అలా శివుని పాదాలను నలువైపులా పరివేష్టించి నీలమేఘకాంతితో నిలబడిన ఆ సంఖ్య గణాలతో ఆ శ్వేతమహాపర్వతం మందరం నల్లని చర్మంతో కప్పబడి శరత్కాల మేఘంలాగా వెలిగే హరుని వృషభరాజంలాగా విరాజిల్లింది.

ఇది శ్రీవామన మహాపురాణంలో నలభై ఒకటవ అధ్యాయం ముగిసింది.

Sri Vamana Mahapuranam    Chapters