Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది తొమ్మిదవ అధ్యాయము

పులస్త్య ఉవాచ :

కస్యపస్యదనుర్నామ భార్యాసీద్ద్విజసత్తమ | తస్యాఃపుత్రత్రయంచాసీత్‌ సహస్రాక్షాదృలాధికమ్‌. 1

జ్యేష్ఠఃశుంభఇతిఖ్యాతో నిశుంభశ్చాపరో7సురః | తృతీయో నముచిర్నామ మహాబలసమన్వితః. 2

యో7సౌనముచిరిత్యేవం ఖ్యాతోదనుసుతో7సురః | తంహంతుమిచ్చతిహరిః ప్రగృహ్యకులిశంకరే. 3

త్రిదివేశంసమాయాంతం సముచిస్తద్భయాదథ| ప్రవివేశరథంభానో స్తతోనాశకదచ్యుతః.

4

శక్రస్తేనాథసమయం చక్రేసహమహాత్మనా | అవధ్యత్వంవరం ప్రాదా చ్ఛసై#్త్రరసై#్త్రశ్చనారద. 5

తతో7వధ్యత్వమాజ్ఞాయ శస్త్రాదస్త్రాచ్చనారద | సంత్యజ్యభాస్కరరథం పాతాళముపయాదథ| 6

సనిమజ్జన్నపిజలే సాముద్రంఫేనముత్తమమ్‌ | దదృశేదానవపతి స్తంప్రగృ హ్యేదమబ్రవీత్‌. 7

యదుక్తందేవపతినా వాసనేనవచో7స్తుతత్‌ | అయంస్పృశతుమాంఫేనః కరాభ్యాం గృహ్యదానవః. 8

ముఖనాసాక్షికర్ణాదీన్‌ సంమమార్జ యథేచ్చయా | తస్మిన్‌ శక్రో7సృజద్‌ వజ్ర మంతర్హితమపీశ్వరః. 9

తేనా7సౌభగ్ననాసాస్యః పపాతచమమారచ | నమయేచతథానష్టే బ్రహ్మహత్యా7స్పృశద్దరిమ్‌. 10

సవైతీర్థంసమాసాద్య స్నాతఃపాపాదముచ్యత | తతో7న్యభ్రాతరౌవీరౌ క్రుద్దేశుంభనిశుంభకౌ. 11

ఉద్యోగంసుమహత్కృత్యా సురాన్‌ బాధితుమాగతౌ | సురాస్తే7పిసహస్రాక్షం పురస్క ఎత్యవినిర్యయుః. 12

జితాస్త్వాక్రమ్యదైత్యాభ్యాం సబలాఃసంపదానుగాః | శక్రస్యాహృత్యచగజం యామ్యంచమహిషంబలాత్‌. 13

వరుణస్యమణిచ్ఛత్రం గదాంవైమరుతస్యచ | నిధయఃపద్మశంఖాద్యా హతాస్త్వాక్రమ్యదానవైః. 14

త్రైలోక్యంవశగంచాస్తే తాభ్యాంనారదసర్వతః | తదాజగ్ముర్మహీపృష్ఠం దదృశుస్తేమహాసురమ్‌. 15

రక్తబీజమధోచుస్తే కోభవానితిసో7బ్రవీత్‌ | సచాహదైత్యో7స్మివిభో సచివోమహిషస్యచ.16

రక్తబీజేతివిఖ్యాతో మహావీర్యోమహాభుజః | ఆమత్యౌరుచిరౌవీరౌ చండముండావితిశ్రుతౌ.

17

తావాస్తాంసలిలేమగ్నౌ భయాద్దేవ్యామహాభుజౌ | యస్త్వాసీత్ర్పభురస్మాకం మహిషోనామదానవః. 18

నిహతః స మహాదేవ్యా వింధ్యశైలేసువిస్తృతే | భవంతౌకస్యతన¸° కావానామ్నాపరిశ్రుతౌ

కింవీర్యౌకింప్రభావౌచ ఏతచ్ఛంసితుమర్హతః. 19

పులస్త్య వచనము : నారదా ! కశ్యప మర్షి భార్యదనువు. ఆమెకు యింద్రునికన్న బలవంతులగు మువ్వురుకు కుమారులు కలిగారు. వారిలో జ్యేష్ఠుడు శంభుడు, రెండవవాడు శంభుడు మూడవవాడు మహాబలినముచి. ఇంద్రుడు వడ్రాయుధంతోనమునిచి చంపుటకుద్యమింపగా నతడు సూర్యుని రథంతో ప్రవేశించాడు. అంచేత అతడిని చంపనలవిగాక వాడితో యింద్రుడు సంధిచేసుకొని వాడికి ఆస్త్రస్త్రాలతో చావులేకుండునట్లు వరమిచ్చాడు. ఆ విధంగా అవధ్యుడైవాడు సూర్యరథం వదలి పాతాళానికి చేరుకున్నాడు. నీళ్ళలో మునిగిన వానికి సముద్రపు నురుగు (ఫేనం) కనిపించగా ఇంద్రుడు చెప్పినట్లు జరుగగాక అని సంకల్పించి ఆ సురుగును చేతులో పట్టుకొని గట్టిగా నోటిని ముక్కును చెవులను కన్నులను దానితో గట్టిగా రుద్దుకున్నాడు. ఆ నురుగలో ఇంద్రుడు రహస్యంగా తన వజ్రాయుధం సృష్టించాడు.అంచేత వాడిముక్కు చెవులు కండ్లు భిన్నాలైపోయి మరణించాడు. నియమ విరుద్ధంగా జరిగిన ఆ దనుజవధ వల్ల ఇంద్రుడికి బ్రహ్మహత్య చుట్టుకోగా తన తీర్థంలో మునిగి ఆ పాపం పోగొట్టున్నాడు. ఆ సంగతి తెలిసిన ఆ నముచిసోదరులు శుంభనిశుంభలు కోపాతిరేకంతో గొప్ప సన్నాహాలుచేసి దేవతలను బాధించసాగారు దేవతలు యింద్రుని నాయకత్వంలో వారలతో పోరి ఓడిపోయారు. ఆ దానవులు యింద్రుని ఐరావతాన్ని యముని మహిషాన్ని వరుణుడి ఛత్రాన్ని మరుత్తలగదను కుబేరుడి శంఖపద్మాది నిధులనూ బలప్రదర్శనం చేసి అపహరించారు. ఆ విధంగా ముల్లోకాలు వంచేసుకొని ఆ రాక్షస వీరులు భూలోకానికివచ్చి అక్కడ మహాఅసురుడు రక్తబీజునిచూచి నీ వెవెవ్వడవని ప్రశ్నించారు. అందుకువాడు నేను రక్తబీజునిగా పేరొందిన మహాబలుడను మహిషాసురుని సచివుడను. మా ప్రభువు మంత్రులు చండముండులనే వీరులు దేవికి భయపడి ఈ సముద్ర జలాల్లో దాగుకున్నారు. కాగా మా పభువైన మహిషుడు దేవిచేత వింధ్య శైలం మీద వధింపడినాడు అని తన కథ చెప్పి మీరెవరు. ఎవరి కుమారులు మీ పేరులు బలపౌరుషాలు తెలుపమని అర్థించాడు.

శంభనిశుంభాపూచతుః

అహంశుంభతి ఖ్యాతో దనోఃపుత్రస్తథౌరసః | నిశుంభో7యంమమభ్రాతా కనీయాన్‌ శత్రువూగహా. 20

అనేనబహుశోదేవాః సేంద్రరుద్రదివాకరాః | సమేత్యనిర్జితావీరా యే7న్యేచబలవత్తరాః. 21

తదుచ్యతాంకయా దైత్యోనిహతోమహిషాసురః | యావత్తాంఘాతయి ష్యావః స్వసైన్యపరివారితౌ. 22

ఇత్థంతయోస్తుదదతోర్నర్మదాయాస్తటోమునే | జలవాసాద్వినిష్క్రాంతో చండముండౌచదానవౌ. 23

తతోఛ్యేత్యాసురశ్రేష్ఠౌరక్తబీజంసమాశ్రితౌ| ఊచతుర్వచనంశ్లక్ణకో7యంతవపురస్సరః. సచోభౌప్రాహదైత్యో7సౌశుంభోనామసురార్థనః|కనీయానస్యచభ్రాతాద్వితీయోహినిశుంభకః. 25

ఏతావాశ్రిత్యతాందుష్ఠాంమహిషఘ్నీం నసంశయః | అహంవివాహయిష్యామి రత్నంభూతాం జగత్రయే. 26

చండ ఉవాచ :

నసమ్యగు క్తంభవతా రత్నార్హో7సి స సాంప్రతమ్‌ |

యఃప్రభుస్యాత్సరత్నార్హ స్తస్మాచ్ఛుంభాయయోజ్యతామ్‌. 27

తదాచచక్షేశంభాయనిశుంభాయచకౌశికీమ్‌ | భూయో7పితద్యిధాంజాతాం కౌశికీంరూపశాలినీమ్‌. 28

తతఃశుంఖోనిజందూతం సుగ్రీవం నామదానవమ్‌ | దైత్యంచప్రేషయామాస సకాశంవింధ్యవాసినీమ్‌. 20

సగత్వాతద్వచఃశ్రత్వా దేవ్యాగత్యమహాసురః | నిశుంభశుంభావాహేదం మన్యునాభిపరిప్లుతః. 39

సుగ్రీవ ఉవాచ :

యువయోర్వచనాద్దేవీం ప్రదేష్టుందైత్యనాయకౌ | గతవానహమద్యైవ తా మహంవాక్యమబ్రువమ్‌. 31

యథాశుంభో7తివిఖ్యాతః కకుద్మీచానవేష్వపి | సత్వాంప్రాహమహాభాగే ప్రభు రస్మిజగత్రయే. 32

యానిస్వర్గేమహిపృష్ఠే పాతాళేచాపిసుందరి | రత్నానిసంతితావంతి మమవేశ్మనినిత్యశః.

33

త్వముక్తాచండముండాభ్యాం రత్న భూతాకృశోదరి | తస్మాద్భజస్వమాంవాత్వం నిశుంభంవామమానుజమ్‌.

సచాహమాంవిహసతీ శృణుసుగ్రీవమద్వచః | సత్యముక్తంత్రిలోకేశః శుంభోరత్నార్హఏవచ.

35

కింత్వస్తిదుర్వినీతాయా హృదయేమేమనోరథః | యోమాంవిజయతేయుద్దే సభర్తాస్యాన్మహాసుర. 36

మయాచోక్తా7వలిప్తా7సి యోజయేత్ససురాసురాన్‌ | సత్వాంకథసజయతే సాత్వముత్తిష్ఠభామిని. 37

సా7థమాంప్రాహకింకుర్మి యదనాలోచితఃకృతః | మనోరథస్తుతద్గచ్ఛ శుంభాయత్వంనివేదయ. 38

తయైవముక్తస్తభ్యాగం త్వత్సకాశంమహాసుర | సాచాగ్ని కోటిసధృశీ మల్వైవంకురుయత్‌ క్షమమ్‌. 39

శుంభనిశుంభులన్నారు : నేను దనువు ఔరసపుత్రుడను, పేరు శుంభుడు. ఇతడు నా అనుజుడు నిశుంభుడనువాడు. ఇంద్ర రుద్ర దివాకరాది దేవతలెందరనో ఇతడు జయించాడు. సరే ఇక చెప్పుము. మహిషాసురుని వదించినదెవరు ? యీ క్షణాన్నే సైన్యంతో వెళ్ళి వధించి వస్తాను ''నారదా! వారిద్దరూ నర్మదతీరాన అలా మాటాడుకుంటూండగానే చండ ముండులనే రాక్షసులు జలావాసంవదలి అక్కడు వచ్చి రక్తబీజుని ఆశ్రయించి, మృదువైన భాషలో, నీవెవరితో మాటాడుతున్నావని అడిగారు. అందుకతడు వీరిద్దరు శుంభనిశుంభులను దైత్యులు మహాబలశాలురు. వీరిద్దరి సాయంతో మహిషుని చంపిన ఆ దుష్టురాలిని జయించి, ఆ మహిశారత్నాన్ని వివాహమాడతాన్నాడు. అందుకు చంద్రుడు యిలా అన్నాడు. ''అలా అనకుము. ఆ త్రిలోక రత్నం ప్రభువైన శుంభునకేతగి ఉంటుంది. ఆమెను శుంభునకు రూపశాలిని అయిన కౌశికిని నిశుంభునకు ఏర్పాటు చేద్ధాము'' అంతట శుంభుడు సుగ్రీవుడను దూతను వింధ్యవాసిని యొద్దకు పంపించాడు. అతడువెళ్ళి దేవితో మాటాడి కోపంతో తిరిగివచ్చి శుంభని శుంభులతో ఇలా అన్నాడు. ''ప్రభూ! మీ తరపున నేనువెళ్ళి ఆ దేవితో రాక్షస లోకంలో సర్వోన్నతుడూ మహాపరాక్రమవంతుడునగు శుంభుడు ముల్లోకాలకూ అధినేత. ఆ మహారాజు యింట్లో ప్రపంచంలో గల రత్నాలన్నీ ఉన్నయి. ఆయన చండముండుల వలన నీవు స్త్రీ రత్నానివని విన్నాడు. నిన్ను తననుగాని తన తమ్ముడు నిశుంభుని గాని పెండ్లాడవలసినదిగా నాద్వారా సందేశం పంపాడని చెప్పాడు. ఆ మాటలకామె పకపక నవ్వి ఇలా అన్నది. సుగ్రీవా! నీవు చెప్పింది నిజమే. త్రిలోకాధిపతి శుంభుడు రత్నాలు ఉంచుకోతగినవాడే. అయితే నేను నీతులు గాలికి వదిలేసి నన్ను యుద్ధంలో జయించినవానినే పెండ్లాడతానని నిశ్చయించుకున్నాను అని చెప్పింది. అందుకు నేను త్రిలోకాలు జయించినవాడు నిన్ను జయించలేడా ? వేరుమాటాడక రావలసినదనగా అందుకామె, అందులకు నేనేమి చేయగలను ? అనాలోచితంగా ఒక నిర్ణయం తీసికొన్నాను. ఆమనోరథం మార్చుకోను. నీవువెళ్ళి శుంభుడితో చెప్పమని త్రిప్పిపంపించినది స్వామీ. ఆమె మాటలు మీకు చెప్పేందుకు తిరిగివచ్చాను. ఒక్క విషయం. ఆమె కోటి అగ్నులతో సమానంగా వెలిగిపోతోంది. ఇది మనస్సులో పెట్టుకొని తర్వాత ప్రయత్నాలు చేయండి.

పులస్త్య ఉవాచ :

ఇతిసుగ్రీవచనం నిశమ్యసమహాసురః | ప్రాహదూరస్థితంశుంభో దానవంధూమ్రలోచనమ్‌|| 40

శుంభ ఉవాచ :

ధూమ్రాక్ష గచ్ఛతాంద్రుష్టాం కేశాకర్షణవిహ్వలామ్‌ | సాపరాధాంయథాదాసీం కృతాళీఘ్రమిహానయ|| 41

యస్యాస్యాః పక్షకృత్‌ కశ్చిత్‌ భవిష్యతి మహాబలః | సహంతవ్యో7విచార్వైవ యదిహిస్యాత్‌ పితామహః 42

సఏవముక్తః శుంభేన ధూమ్రక్షో7క్షౌహిణీశ##తైః | వృతఃషడ్భిర్మహాతేజా వింధ్యంగిరిముపాద్రవత్‌|| 43

సతత్రదృష్ట్వాతాందుర్గాం భ్రాంతదృష్షిరువాచ|

ఏహ్యేహిమూఢేభర్తారం శుంభమిచ్ఛస్వకౌశికీ | నచేద్బలాన్నయిష్యామి కేశాకర్షణవిహ్వలామ్‌ | 44

శ్రీదేవ్యువాచ :

ప్రేషితో7సీహశుంభేన బలాన్నే తుంహిమాంకిల | తత్రకింహ్యబలాకుర్యా ద్యథేచ్ఛసితథాకురు | 45

పులస్త్య ఉవాచ :

ఏవముక్తోవిభావర్యా బలవాన్‌ ధూమ్రలోచనః | సమభ్యదావత్‌ త్వరితో గదామాదాయవీర్యవాన్‌ | 46

తమాపితంతంసగదం హుంకారేణౖవకౌశికీ | సబలంభస్మసాచ్చక్రే శుష్క మగ్నిరివేంధనమ్‌ | 47

తతోహాహాకృతమభూ జ్జగత్యస్మింశ్చరాచరే | సబలంభస్మసాన్నీతం కౌశిక్యావీక్ష్యదానవత్‌ | 48

తచ్ఛశుంభో7పిశుశ్రావ మహచ్ఛబ్దముదీరితమ్‌ | అథాదిదేశ బలినౌ చండముండౌ మహాసురౌ | 49

రురుంచబలినాంశ్రేష్ఠ తథాజగ్ముర్ముదాన్వితాః | తేషాంచసైన్యమతులం గజాశ్వరథసంకులమ్‌ | 50

సమాజగామసహసా యత్రాస్తే కోశసంభవా | తదాయాంతంరిపుబలం దృష్ట్వాతొటిశతావరమ్‌ | 51

సింహో7ద్రువద్దుతసటః పాటయన్‌ దానవాన్‌ రణ | కాంశ్చిత్‌ కరప్రహారేణ కాంశ్చిదాస్యేనలీలయా | 52

నఖరైఃకాంశ్చిదాక్రమ్య ఉరసాప్రమమాథచ | తేవధ్యమానాఃసింహేన గిరికందరవాసినా | 53

భూతైశ్చదేవ్యనుచరైః చండముండౌసమాశ్రయన్‌ | తావార్తంస్వబలందృష్ట్వా కోపప్రస్ఫురితాథరౌ | 54

సమాద్రవేతాందుర్గాంవై పతంగా మివపావకమ్‌ | తావాపతంతౌరౌద్రౌవై దృష్ట్వా క్రోధపరిప్లుతా| 55

త్రిశాభాంభ్రుకుటీం వక్రై చకారపరమేశ్వరీ|

భ్రుకుటీకుటిలాద్దేవ్యా లలాటఫలకాద్‌ దృతమ్‌ | కాళీకరాళవదనా నిఃసృతాయోగినీ శుభా | 56

ఖట్వాంగమాదాయక రేణరౌద్ర మసించ కాలంజనకోశముగ్రమ్‌ |

సంశుష్కగాత్రారుధితాప్లుతాంగీ నరేంద్రమూర్ద్నాంస్రజముద్వహంతీ. 57

కాంశ్చిత్‌ ఖడ్గేనచిచ్ఛేద ఖట్వాంగేనపరాన్‌ రణ | స్వషూదయభృశంక్రుద్ధా సరధాశ్వగజాన్‌ రిపూన్‌. 58

చర్మాంకుశంముద్గరంచ నధనుష్కంసఘంటికమ్‌ | కుంజరంసహయంత్రేణ ప్రచిక్షేపముఖేంబికా. 59

సచక్రకూబరరథం ససారధితురంగమమ్‌ | సమంయోధేనవదనే క్షిప్య చర్వయతే7బికా.

60

ఏకంజగ్రాహ కేశేషు గ్రీవాయామపరంతథా | పాదేనాక్రమ్యచైవాన్యం ప్రేషయామాసమృత్యవే. 61

తతస్తుతద్బలందేవ్యా భక్షితంసబలాధిపమ్‌ | రురుర్‌ ధృష్ట్వా ప్రదుద్రావ తం చండీదదృశేస్వయమ్‌. 62

ఆజమానాథశిరసి ఖట్వాంగేనమహాసురమ్‌ | సపపాతహతోభూమ్యాం ఛిన్నమాలఇవద్రుమః. 63

పులస్త్యుడిలా అన్నాడు : సుగ్రీవుని మాటలు విని ఆ మహారాక్షసుడు దూరంగా కూర్చొనిఉన్న ధూమ్రాక్షుడనే రాక్షస వీరునిచూచి, ''ధూమ్రాక్షాః ఈ క్షణమేవెళ్ళి ఆ దుష్టురాల్ని నేరస్థురాలిని, బానిసను మాదిరి జుట్టుపట్టుకొని ఈడ్చుకొనిధా, పో! దాని పక్షాన ఎవరైనా, పితామహుడైనా సరే, నిలబడ్డాడంటే నిర్దాక్షిణ్యంగా వధించి, ఆమెను లాగుకొని రా ! అని ఆజ్ఞాపించాడు. శుంభుని ఆదేశం వింటూనే ధూమ్రాక్షుడు ఆరు వందల అక్షౌహిణుల రాక్షస బలంతో వింధ్యాద్రికి పరుగు తీశాడు. అక్కడ దుర్గాదేవిని చూడగానే దిగ్భ్రమ కలిగింది. వెంటనే ఆమెనుచూచి - ఓ మూర్ఖా ! కౌకికీ ! వచ్చి శుంభుణ్ని వరించలేకపోతే నిన్ను బలవంతంగా జుట్టుపట్టిలాగుకొనిపోతానని గర్జించాడు, అబలనైన నేనేం చేయగలను ? నీ యిష్ట ప్రకారమే చెయ్యమన్నది. అంతట ధూమ్రలోచనుడు గదనెత్తుకొని దేవిమీదికి లంఘించాడు. తన మీదకు దూకుతున్న ఆ దుష్టునిచూచిఅంబిక హుంకారంగావించింది. దానితో తన సైన్యంతో సహా వాడు అగ్నిలోబడిన సమిధల్లాగా మాడి బూడిదైపోయారు. దానితో చరాచర జగత్తంతా హాహాకారాలతో దద్దరిల్లింది. ఆ భిషణ రవాన్ని శుంభుడు కూడా విని మహాబలవంతులైన శంభ నిశుంభులను రురుదైత్యుణ్ని యుద్ధానికి పంపాడు. వారంతా గజాశ్వరథ పదాతులతోకూడిన అసంఖ్యసేనతో ఆ కౌశికి ఉన్నచోటికి వెళ్ళారు. వందల కోట్ల సంఖ్యలో వస్తూన్న ఆ రాక్షస సేనను చూడటంతోటే కౌశికి వాహనం సింహంజూలు ఝుళిపించి పంజాచాపి గర్జిస్తూ దానవమూక మీదపడి సంహారకాండ సాగించింది. కొందరను పంజాదెబ్బలతో, కొందరను కోరలతో చీలిస్తే మరికొందరను గోళ్ళతో పరిమార్చింది. అలా సింహంచేతనూ గిరకందరాల్లో ఉండే భూతగణాలూ తదితర దేవి అనుచరులచేత వధింపబడి చావుదెబ్బలు తింటూ ఆ దానవులు తమ నాయకులు చండ ముండుల వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఆర్తనాదాలు చేస్తున్న తమ బలగాలను చూచి ఆ మహ7సురులు మండిపడి అగ్ని మీద దుకే శలభాల్లాగా దేవిమీదకు దుమికారు. ఆ క్రోధోన్మత్తులను చూడగానే, కోపంతో దేవి భ్రుకుటి ముడిబడింది. అంతనామె ఫాలభాగాన్నుంచే కరాళాకృతితో కళ్యాణిఅయిన కాళి ఊడిపడి ఖట్వాంగం కరవాలం ధరించి మాంసశుష్కమై రక్తసిక్తమైన శరీరంతో నరముండమాల మెడలో వ్రేలాడుతూంటే శత్రుమూకలను సంహరింపసాగింది. కొందరను కత్తితో నరుకగా కొందరను తలలను ఖట్వాంగంతో నుగ్గుచేసింది. ఎందరనో రథగజాశ్వాలతో సహా యమసదనానికంపింది. అంతనాయంబిక కాళిక నోటిలోని ఎందదనో శత్రువీరులను చర్మాంకుశ ముద్గరఘంటా గజయంత్రాలతోసహా విసిరివేయగా నాచండి తన విశాలమైన కోరలమధ్య వారందరను నమిలి పొడిపొడిగావించింది. ఒకడిని జుట్టుపట్టుకొని మరొకడిని మెడపట్టుకొని నేలబడగొట్టి కాళ్ళతో మర్దించి మృత్యువుకప్పగించింది. ఆ విధంగా దేవి సైన్యాధిపతితోసహా శత్రుబలాలన్నింటినీ భక్షించడం చూచి రురుడు కాలికి బుద్ధి చెప్పసాగాడు. అది చూచిన దుర్గ ఖట్వాంగంతో తలమీద ప్రహరించగా వాడు నరుకబడి మహా వృక్షంలాగా నేలకొరిగాడు.

తతస్తంపతితం దృష్ట్వా వశోరివవిభావరీ | కోశముత్కర్తయామాస కర్ణాదిచరణాంతికమ్‌.

64

సాచకోశంసమాదాయ బబంధవిమలాజటాః | ఏకానబంధమగమత్‌ తాముత్పాట్యాక్షిపద్‌ భువి. 65

సాజాతాసుతరాంరౌద్రీ తైలాభ్యక్తశిరోరుహా | కృష్టారమర్థశుక్లంచ ధారయంతీస్వకంవపుః

66

సా7బ్రవీద్వరమేకంతు మారయామిమహాసురమ్‌ | తస్యానామతదాచక్రే చండమారీతివిశ్రుతమ్‌. 67

ప్రాహగచ్చస్వసుభ##గే చండముండావిహానయ | స్వయంహిమారయిష్యామి తావానేతుంత్వమర్హసి 68

శ్రుత్వైవంవచసందేవ్యాః సా7భ్యద్రవతాతావుభౌ | ప్రదుద్రువతుర్భయార్తౌ దిశమాశ్రిత్యదక్షిణామ్‌ 69

తతస్తావపివేగేన ప్రాధావత్‌ త్యక్తవాసనే | సా7ధిరుహ్యమహావేగం రాసభంగరుడోపమమ్‌. 70

యతోగతౌచతౌదైత్యౌ తత్రైవానుయ¸°శివా | సాదదర్శతదాపౌండ్రం మహిషంవైయమస్యచ. 71

సాతస్యోత్పాటయామాస విషాణంభుజగాకృతిమ్‌ | తంప్రగృహ్యకరేణౖవ దానవావన్వగాజ్జవాత్‌. 72

తౌచాపిభూమింసంత్యజ్య జగ్ముతుర్గగనంతదా | వేగేనాభిస్వతాసాచ రాసభేనమహేశ్వరీ.

73

తతోదదర్శగరుడం పన్నగేంద్రంచిఖాదిషుమ్‌ | కర్కోటకంసదృష్ట్వైవ ఊర్ద్వరోమావ్యజాయత. 74

భయాన్మర్యాశ్చగరుడో మాంసపిండోపమోబభౌ | న్యపతంస్తస్యపత్రాణి రౌద్రాణిహిపతత్రిణః. 75

ఖగేంద్రపత్రాణ్యాదాయ నాగంకర్కోటకంతథా | వేగేనానుసరద్దేవీ చండముండౌభయాతురౌ. 76

సంప్రాప్తౌచతదాదేవ్యా చండముండౌ మహాసురౌ | బద్దౌకర్కోటకేనైవ బద్ద్వావింధ్యముపాగమత్‌. 77

అలావాడు పడిపోవడం చూచి ఆ దుర్గ చెవి నుంచి చరణాల వరకు గల తన కోశాన్ని (కవచం) కోసి దానితో జడ నల్లింది. అందులో ఒకటి ఉపయోగించకపోగా దాన్ని నేలకు విసిరి కొట్టింది. అందులో నుంచి నూనెకారుతున్న జుట్టుతో, సగం నలుపూ, సగం తెలుపూ అయిన దేహంతో ఒక రౌద్రాకృతి బయలుదేరి, ''నేను కనీసం ఒక మహాదైత్యుడి నైనా సంహరిస్తాన''ని బొబ్బ పెట్టింది. అంచేత ఆమెకు చండమారి అనే పేరు వచ్చింది. ఆమెను చూచి దేవి, ''కళ్యాణీ! నీవు వెళ్ళి చండముండుల కట్టి తీసుకొని రమ్ము. నేను స్వయంగా వారలను వధిస్తా''నని ఆజ్ఞాపించింది. అంతటనా దేవి చండముండులను వెంబడించగా వాండ్లు దక్షిణ దిక్కుగా గుడ్డలూడిపోగా పరుగిడసాగారు. అంతనాదేవి గరుడునిలాంటి వేగంగల గాడిదమీదనెక్కి వారల వెంటబడినది. అంతటనామెకు యముని మహిషం పౌండ్రం కనిపించగా, కాల సర్పం లాంటింది దాని కొమ్ము పెకలించి పట్టుకొని త్వరగా రాక్షసులననుగమించింది. ఆ దైత్యులు భూమి వదలి గగనమార్గానకు పోగా దేవి కూడ గాడిదమీద వారల వెంటనే విజృంభించింది. దారిలోనొకచోట కర్కోటక మహాసర్పాన్ని తినబోతున్న గరుడపక్షి కనిపించింది. దేవిని చూడడంతో ఆ పక్షి భయంతో కంపించి మాంసం ముద్దగా అయిపోయింది. దానివంటి మీదిరెక్కలన్నీ ఊడిపడ్డాయి. అంతట ఆ చండమారి ఆ రెక్కలనూ కర్కోటక నాగాన్ని చేజిక్కించుకొని రాక్షసులను వెంబడించి భయంతో గడగడవణికిపోతున్న ఆ చండముండులను పట్టుకున్నది. వారలనాకర్కోటక నాగంతో బంధించి వింధ్యకుగొని తెచ్చింది.

నివేదయిత్వాకౌశిక్యై కోశమాదాయభైరవమ్‌ | శిరోభిర్దానవేంద్రాణాం తార్యక్షపత్రైశ్చశోభ##నైః. 78

కృత్వాస్రజమనౌపమ్యాం చండికాయైన్యవేదయత్‌ | ఘర్ఘరాంచమృగేంద్రస్య చర్మణఃసాసమర్పయత్‌. 79

స్రజమన్యైఃఖగేంద్రస్య పత్రైర్మూర్ద్నినిబధ్యచ | ఆత్మనాసాపపౌపానం రుధిరందానవేష్యపి. 80

చండాత్వాదాయచండంచ ముండంచాసురనాయకమ్‌ | చకారకుపితాదుర్గా విశిరస్కౌమహాసురౌ. 81

తయోరేవాహినాదేవీ శేఖరంశుష్కరేవతీ | కృత్వాజగామకౌశిక్యాః సకాశంమార్యయాసహ.

82

సమేత్యసా7బ్రవీద్దేవి గృహ్యతాంశేఖరోత్తమః | గ్రథితోదైత్యశీర్షాభ్యాం నాగరాజేనవేష్టితః.

83

తంశేఖరం శివాగృహ్య చండాయామూర్ద్నివిస్తృతమ్‌ | బబంధ ప్రాహచైవైనాంకృతంకర్మసుదారుణమ్‌. 84

శేఖరంచండముండాభ్యాం యస్మాద్ధారయసేశుభమ్‌ | తస్మాల్లోకేతవఖ్యాతి శ్చాముండేతిభవిష్యతి. 85

ఇత్యేవముక్త్వావచనంత్రినేత్రా సాచండముండస్రజధారిణీంవై|

దిగ్వాససంచాభ్యవదత్‌ ప్రతీతా నిషూదయస్వారిబలాన్యమూని. 86

సాత్వేవముక్తా7థవిషాణకోట్యా సువేగయుక్తేనసరాసభేన|

నిషూదయంతీరిపుసైన్యముగ్రం చచారచాన్యానసురాంశ్చఖాద. 87

తతో7బికాయాస్త్వథచర్మముండయా మార్యాచసింహేనచభూతసంఘైః|

నిపాత్యమానాదనుపుంగవాస్తే కకుద్మినంశంభుముపాశ్రయంత. 88

ఇతి శ్రీ వామనమహాపురాణ ఏకోనత్రింశో7ధ్యాయః.

అంతట భయంకరమైన కోశా (కవచా)న్ని దేవికి సమర్పించి, గరుడుని ఈకలతో అలంకరించబడిన ఆ రాక్షసుల తలలను తులలేని మాలగా చండికకు యిచ్చింది. వానితోబాటు సింహం చర్మంతో చేసిన వడ్డ్యాణాన్ని గూడ సమర్పించుకొని కడుపార రాక్షస రుధిరం త్రాగింది ఆ చండమారి సమర్పించిన ఆ చండముండుల శిరస్సులను ఆ దుర్గాదేవి మహాక్రోధంతో ఖండించింది. అంతట శుష్కరేవతీదేవి వారల సర్పాలతో నొకశిరోవేష్టనం తయారుచేసి చండమారితో కౌశికివద్దకు వెళ్ళి ''భగవతీ!దైత్యుల శిరస్సులను నాగరాజుతోగూర్చి చేసిన ఈ ఉత్తమ శిరోవేష్టనాన్ని స్వీకరించు''మనెను. దేవి దానిని తీసికొని చండమారి శిరస్సున అలంకరించి ''నీవు భయంకరమైన కార్యం సాధించావు. ఈ చండముండుల శిరోమాలను ధరించి నేటి నుండీ 'చాముండ' అనే శుభనామంతో ఖ్యాతిని గాంచగలవనెను. ఈ మాటలు చెప్పి ఆ త్ర్యంబకేశ్వరి చండముండుల శిరోమాల ధరించి దిగంబరంగా ఉన్న ఆ చాముండతో యికవెళ్ళి మిగిలిన శత్రువులనందరను మట్టుపెట్టుమని ఆదేశించింది. అట్లేయని ఆ రాసభవాహిని దున్నపోతు కొమ్ముతో విజృంభించి శత్రుసైన్యాన్ని సంహరించింది. మిగిలిన వారలందరను మ్రింగివేసింది. ఆ విధంగా అంబిక, చర్మముండ, సింహంభూతగణాలచేతుల్లో నిశ్శేషంగా వధించబడి ఆదనుపుంగవులంతా శంభులోకానికి చేరారు.

ఇది శ్రీ వామన మహాపురాణంలో యిరువది తొమ్మిదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters