Sri Vamana Mahapuranam    Chapters   

ఇరువది అయిదవ అధ్యాయము

సనత్కుమార ఉవాచ :

స్థాణోర్వటస్యోత్తరతః శుక్రతీర్థంప్రకీర్తితమ్‌ | స్థాణోర్వటస్యపూర్వేణ సోమతీర్థంద్విజోత్తమ. 1

స్థాణోర్వటందక్షిణతో దక్షతీర్థముదాహృతమ్‌ | స్థాణోర్వటాత్పశ్చిమతః స్కందతీర్ధం ప్రతిష్ఠితమ్‌. 2

ఏతానిపుణ్యతీర్థాని మధ్యేస్థాణురితిస్మృతః | తస్యదర్శనమాత్రేణ ప్రాప్నోతిపరమంపదమ్‌. 3

అష్టమ్యాంచ చతుర్దశ్యాం యస్త్యేతానిపరిక్రమేత్‌ | పదేపదే యజ్ఞఫలం సప్రోప్నోతి నసంశయః. 4

ఏతానిమునిభిఃసాధ్యై రాదిత్యైర్వసుభిస్తదా | మరుద్భిర్వహ్నిభిశ్చైవ సేవితానిప్రయత్నతః. 5

అన్యేయేప్రాణినః కేచిత్ర్పవిష్టాః స్థాణుముత్తమమ్‌ | సర్వపాపవినిర్ముక్తాః ప్రయాంతిపరమాంగతిమ్‌. 6

అస్తితత్సంనిధౌలింగం దేవదేవస్యశూలినః | ఉమా చ లింగరూపేణ హరపార్శ్వంనముంచతి. 7

తస్యదర్శనమాత్రేణ సిద్ధంప్రాప్నోతిమానవః | పటస్యఉత్తరేపార్శ్వే తక్ష

కేనమహాత్మనా. 8

ప్రతిష్ఠితంమహాలింగం సర్వకామప్రదాయకమ్‌ | వటస్యపూర్వదిగ్భాగే విశ్వకర్మకృతంమహత్‌. 9

లింగం ప్రత్యజ్‌ ముఖందృష్ట్వా సిద్ధిమాప్నోతిమానవః | తత్రైవలింగరూపేణ స్థితాదేవీసరస్వతీ 10

ప్రణమ్య తాంప్రయత్నేన బుద్ధింమేధాంచవిందతి | వటపార్శ్వేస్థితంలింగం బ్రహ్మణాతత్ర్పష్ఠితమ్‌. 11

దృష్ట్వావటేశ్వరందేవం ప్రయాతిపరమంపదమ్‌ | తతః స్థాణువటందృష్ట్వా కృత్వాచాపిప్రదక్షిణమ్‌. 12

ప్రదక్షిణీకృతాతేన సప్తద్వీపావసుంధరా | స్థాణోఃపశ్చిమదిగ్భాగే నకులీశోగణఃస్మృతః. 13

తమభ్యర్చ్యప్రయత్నేన సర్వపాపైఃప్రముచ్యతే |

సనత్కుమారుని వచనము : స్థాణువటానికి ఉత్తరంగా శుక్రతీర్థం ఉంది. స్థాణువటానికి తూర్పున సోమతీర్థం దక్షిణాన దక్షతీర్థం పడమరగా స్కంద తీర్థం ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాల నడుమనున్నది స్థాణువు. దాని దర్శన మాత్రాన్నే పరమ పదం లభిస్తుంది. అష్టమీ చతుర్దశీ తిథులలో వానికి ప్రదక్షిణం చేస్తే అడుగడుగూకూ యజ్ఞఫలం లభిలస్తుంది. సందేహం లేదు. ఈ తీర్థాలను మునులు సాధ్యులు ఆదిత్యులు వసువులు, మరుత్తులు అగ్నులు మొదలగు వారందరూ శ్రద్ధగా సేవించారు. ఈ స్థాణు క్షేత్రారాజాన్ని దర్శించి యితర ప్రాణులందరూ సర్వపాపాలు తొలగి పరమపదం పొందుతారు. దాని సన్నిధిన మహాదేవుడగు శూలపాణి లింగం దానికి ప్రక్కనే ఎప్పుడూ విడవకుండ లింగ రూపంలో ఉమాదేవీ ఉన్నారు. వానిని చూచినంతనే మానవుడు సిద్ధిపొందుతాడు. వటవృక్షానికి ఉత్తరంగా మహాత్ముడగు తక్షకుడు ప్రతిష్ఠించిన సర్వకోర్కెలు వర్షించే మహాలింగం ఉంది. వటానికి తూర్పుదిశగా విశ్వకర్మ నిలిపిన గొప్ప లింగాన్ని చూస్తే సిద్ధి లభిస్తుంది. అక్కడే లింగరూపంలో సరస్వతీ దేవి ఉన్నది. ఆమెకు భక్తితో నమస్కరిస్తే బుద్ధి మేధాశక్తులు లభిస్తాయి. వటానికి ప్రక్కగా బ్రహ్మప్రతిష్ఠితమైన వటేశ్వర లింగదర్శనం పరమపదం ప్రసాదిస్తుంది. అంతట స్థాణు వటాన్ని దర్శించి ప్రదక్షిణం చేస్తే సప్తద్వీపా వసుంధరను ప్రదక్షించిన ఫలం లభిస్తుంది. స్థాణువునకు పడమర దిశగా నకులీశగణం ఉన్నారు. దానిని చక్కగా అర్చిస్తే సర్వపాపాలు పోతాయి.

తన్యదత్రిణదిగ్భాగే తీర్థంరుద్రకరంస్మృతమ్‌. 14

తస్మిన్‌ స్నాతఃసర్వతీర్థే స్నాతోభవతిమానవః | తస్యచోత్తరదిగ్భాగేరావణనమహాత్మనా. 15

ప్రతిష్ఠితం మహాలింగం గోకర్ణంనామనామతః | అషాఢమాసేయాకృష్ణా భవిష్యతి చతుర్థశీ.

తస్యాంయో7ర్చతిగోకర్ణం తస్యపుణ్యఫలంశృణు. 16

కామతో7కామతోవాపి యత్పాపంతేనసంచితమ్‌ | తస్మాద్విముచ్యతేపాపా త్పూజయిత్వాహరంశుచిః. 17

కౌమారబ్రహ్మచర్యేణ యత్పుణ్యంప్రావ్యతేనరైః |

తత్పుణ్యం సకలంతస్య అష్టమ్యాంయో7ర్చయేచ్ఛివమ్‌. 18

యదీచ్ఛేత్పరమంరూపం సౌభాగ్యంధనసంపదః | కుమారేశ్వరమాహాత్మ్యాత్‌ సిద్ధ్యతేనాత్రసంశయః. 19

తస్యచోత్తరదిగ్భాగే లింగంపూజ్యవిభీషణః| | అజరశ్చామరశ్చైవకల్పయిత్వాబభూవహ. 20

ఆషాఢస్యతుమాసస్య శుక్లాయాచాష్టమీభ##వేత్‌ | తస్యాంపూజ్యసోపవాసో హ్యమృతత్వమవాప్నుయాత్‌. 21

ఖరేణపూజితంలింగం తస్మిన్‌స్థానేద్విజోత్తమ | తంపూజయిత్వాయత్నేన సర్వకామానవాప్నుయాత్‌. 22

దూషణస్త్రిశిరాశ్చైవ యత్రపూజ్యమహేశ్వరమ్‌ | యథాభిలషితాన్‌కామా నాపతుస్తౌముదాన్వితౌ. 23

చైత్రమాసేసితేపక్షే యోనరస్తత్రపూజయేత్‌ | తస్యతౌవరదౌదేవౌ ప్రయచ్ఛేతే7భివాంఛితమ్‌. 24

స్థాణోర్వటస్యపూర్వేణ హస్తిపాదేశ్వరః శివః | తందృష్ట్వా ముచ్యతేపాపై రస్యజన్మనిసంభ##వైః. 25

తస్యదక్షిణతోలింగం హారీతస్యఋషేఃస్థితమ్‌ | యత్ర్పణమ్యప్రయత్నేన ముక్తింప్రాప్నోతి మానవః. 26

తస్యదక్షిణపార్శ్వేతు వాపీతస్యమహాత్మనః | లింగంత్రైలోక్యవిఖ్యాతం సర్వపాపహరంశివమ్‌. 27

కంకాళరూపిణాచాపి రుద్రేణసుమహాత్మనా | ప్రతిష్ఠితంమహాలింగం సర్వపాప్రణాశనమ్‌. 28

భుక్తిదంముక్తిదంప్రోక్తం సర్వకిల్బిషనాశనమ్‌ | లింగస్యదర్శనాచ్చైవ అగ్నిష్టోమఫలంభేత్‌. 29

అచటకు దక్షిణంగా రుద్రకర తీర్థముంది. దానిలో స్నానంచేస్తే అన్ని తీర్థాల్లో స్నానంచేసినఫలం కలుగుతుంది. దానికి తూర్పున మహాత్ముడైన రావణుడు ప్రతిష్ఠించిన గోకర్ణేశ్వర మహాలింగం ఉంది. ఆషాఢకృష్ణచతుర్దశినాడు ఆ గోకర్ణ స్వామిని అర్చిస్తే కలిగేపుణ్యం ఎట్టిదో వినండి. ఆ లింగార్చనల్ల తెలిసీ తెలియకాచేసిన పాపాలన్నీ తొలగిపోయి. ఆ హరుని శుచియై అష్టమినాడు పూజిస్తే బ్రహ్మచర్యవ్రతం చక్కగా పాలించిన ఫలమంతా కలుగుతుంది. కుమారేశ్వరుని మహిమవల్ల కోరిన రూపసౌందర్యం సౌభాగ్యం ధన సంపదలన్నీ నిస్సంశయంగా నెరవేరుతాయి. దానికి ఉత్తరంగా ఉన్న లింగాన్ని పూజించి విభీషణుడు జరామరణాదుల జయించాడు. ఆషాఢ శుక్ల అష్టమినాడు ఉపవసించి ఆ లింగ పూజ చేసినచో అమరత్వం లభిస్తుంది. ఓ బ్రాహ్మణులారా ! అక్కడ ఖరుడు (దానవుడు) పూజించిన లింగాన్ని యత్నపూర్వకంగా అర్చిస్తే సకలకోర్కెలు ఫలిస్తాయి. అక్కడే మహేశ్వరారాధన గావించి దూషణుడు త్రిశిరుడుకూడ చింతిత ఫలాలుపొంది సంతోషించారు. చైత్రశుద్ధ పక్షంలో ఆ రెండు లింగాలను అర్చించిన వారలకాదేవతలు కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తారు. స్థాణువటానికి తూర్పుగా హస్తిపాదేశ్వర లింగం ఉంది. దాన్ని దర్శిస్తే జన్మాంతరార్జిత పాపాలన్నీ తొలగిపోతాయి. దానికి దక్షిణదిక్కుగా హారీతముని ప్రతిష్ఠించిన లింగానికి భక్తితో ప్రణమిల్లిన వానికి సిద్ధులు లభిస్తాయి. దానికి దక్షిణంగా మహాత్ముడగు వాసీతుడు ప్రతిష్ఠించిన, ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందిన, సర్వపాపహర లింగం ఉంది. ఇక అస్థిపంజరంలో రుద్రునిచేత ప్రతిష్ఠితమైన మహాలింగ రూపం సర్వపాపాలు హరించి భుక్తి ముక్తులు ప్రసాదిస్తుంది. దాని దర్శన మాత్రాన్నే అగ్నిష్టోమ యాగఫలం లభిస్తుంది.

తస్యపశ్చిమదిగ్భాగే లింగంసిద్ధప్రతిష్ఠితమ్‌ | సిద్ధేశ్వరం తు విఖ్యాతం సర్వసిద్ధిప్రదాయకమ్‌. 30

తస్యదక్షిణదిగ్భాగే మృకండేనమహాత్మనా | తత్రప్రతిష్ఠితం లింగం దర్శనాత్‌సిద్ధిదాయకమ్‌. 31

తస్యపూర్వేచదిగ్భాగే ఆదిత్యేనమహత్మనా | ప్రతిష్ఠితంలింగవరం సర్వకిల్బిషనాశనమ్‌. 32

చిత్రాంగదస్తుగంధర్వో రంభాచాప్సరసాంవరా | పరస్పరంసానురాగౌ స్థాణుదర్శనకాంక్షిణౌ. 33

దృష్ట్వాస్థాణుంపూజయిత్వా సానురాగౌపరస్పరమ్‌ | అరాధ్యవరదందేవం ప్రతిష్ఠాప్యమహేశ్వరమ్‌. 34

చిత్రాంగదేశ్వరందృష్ట్వా తథారంభేశ్వరంద్విజ | సుభగోదర్శనీయశ్చ కులేజన్మ సమాప్నుయాత్‌. 35

తస్యదక్షిణతోలింగం వజ్రిణాస్థాపితంపురా | తస్యప్రసాదాత్ర్పాప్నోతి మనసాచింతితంఫలమ్‌. 36

పరాశ##రేణమునినా తథైవారాధ్యశంకరమ్‌ | ప్రాప్తంకవిత్వంపరమం దర్శనాచ్ఛంకరస్యచ. 37

వేదవ్యాసేనమునినా ఆరాధ్యపరమేశ్వరమ్‌ | సర్వజ్ఞత్వంబ్రహ్మజ్ఞానం ప్రాప్తందేవప్రసాదతః. 38

స్థాణోఃపశ్చిమదిగ్బాగే వాయునాజగదాయునా | ప్రతిష్ఠితంమహాలింగం దర్శనాత్పాపనాశనమ్‌. 39

తస్యాపిదక్షిణభాగే లింగంహిమవతేశ్వరమ్‌ | ప్రతిష్ఠితంపుణ్యకృతాం దర్శనాత్సిద్ధికారకమ్‌. 40

తస్యాపిపశ్చిమేభాగే కార్తవీర్యేణస్థాపితం | లింగంపాపహరంసద్యో దర్శనాత్పుణ్యమాప్నుయాత్‌. 41

తస్యాప్యుత్తరదిగ్భాగే సుపార్శ్వేస్థాపితంపురః | ఆరాధ్యహనుమాంశ్చాప సిద్ధిందేవప్రసాదతః. 42

తసై#్యవపూర్వదిగ్భాగే విష్ణునాప్రభవిష్ణునా | ఆరాధ్యవరదందేవం చక్రంలబ్ధంసుదర్శనమ్‌. 43

తస్యాపిపూర్వదిగ్భాగే మిత్రేణవరుణనచ | ప్రతిష్ఠితౌలింగవరౌ సర్వకామప్రదాయకౌ. 44

ఏతానిమునిభిఃసాధ్యై రాదిత్యైర్వసుభిస్తథా | సేవితానిప్రయత్నేన సర్వపాపహరాణివై. 45

దానికి పడమరగా సిద్ధులచే ప్రతిష్ఠింపబడి సకల సిద్ధులు ప్రసాదించే సిద్ధేశ్వర లింగమనే ప్రసిద్ధమైన లింగం ఉంది. దానికిదక్షిణంగా మహాత్ముడగు మృకండు ప్రతిష్ఠితమై దర్శనమాత్రాన్నే సకలసిద్ధులుయిచ్చే శివలింగముంది. దానికి తూర్పున మహాత్ముడగు నాదిత్యుడు నెలకొల్పిన సర్వకిల్బిషాలు నశింపజేసే శ్రేష్ఠలింగం ఉన్నది. చిత్రాంగదుడనే గంధర్వుడూ అప్సరోమణి రంభ పరస్పరానురాగ బద్ధులై స్థాణు మహాదేవుని దర్శించుటకు వెళ్ళి ఆ మహాదేవుని పూజించి తమ అనురాగానికి ప్రతీకలుగా ఆ వరదుడగు మహేశ్వరుని లింగాలు రెండు ప్రతిష్ఠించారు. ఓ ద్విజులారా ! చిత్రాంగదేశ్వర రంభేశ్వరులనే ఆ లింగాలను దర్శించినవారు సుందర సుభగాకారాలతో సత్కులంలో జన్మిస్తారు. దానికి దక్షిణంగా యింద్రుడు పూర్వం స్థాపించిన లింగం అనుగ్రహంవల్ల చింతితఫలాలు సిద్ధిస్తాయి. అలాగే పరాశరముని కూడ ఆ స్వామిని ఆరాధించి దర్శించి ఉత్తమ కవిత్వశక్తి సంపాదించాడు. వేదవ్యాసుమునికూడ ఆ పరమేశ్వరునాధించి సర్వజ్ఞత్వం బ్రహ్మ జ్ఞానం పొందాడు. ఆ స్థాణులింగానికి పడమరదిశన జగత్ర్పాణుడు వాయుదేవుడు నెలకొల్పిన మహాలింగం దర్శనమాత్రాన్నే పాపాలు పోద్రోలుతుంది. దానికి దక్షిణంగా ఉన్న హిమవతేశ్వరలింగం దర్శించిన పుణ్యాత్ములకు సిద్ధులు ప్రసాదిస్తుంది. దానికి గూడ దక్షిణంగా కార్తవీర్య స్థాపితమైన పాపనాశక లింగం చూచినంతనే పుణ్యాలు ప్రసాదిస్తుంది. దానికి ఉత్తరంగా సుపార్శ్వుడు స్థాపించిన లింగాన్ని ఆరాధించి హనుమంతుడు సిద్ధులుగడించాడు. దానికి తూర్పునఉన్న మహాదేవుని అర్చించి ప్రభ విష్ణువైన విష్ణువు సుదర్శన చక్రాన్ని సంపాదించాడు. దానికి తూర్పున మిత్రావరుణులు సర్వకామ్యాలు తీర్చే రెండు లింగాలు ప్రతిష్ఠించారు. మునులు సాధ్యులు ఆదిత్యులు వసువులు అందరు వీనిని శ్రద్ధాభక్తులతో సేవించి సర్వపాప విముక్తులయ్యారు.

స్వర్ణలింగస్యపశ్చాత్తు ఋషిభిస్తత్త్వదర్విభిః | ప్రతిష్ఠితానిలింగాని యేషాంసంఖ్యానవిద్యతే. 46

తథాహ్యుత్తరతస్తస్య యావదోఘవతీనదీ | సహస్రమేకంలింగానాం దేవపశ్చిమ

తఃస్థితమ్‌. 47

తస్యాపిపూర్వదిగ్భాగే వాలఖిల్యైర్మహాత్మభిః | ప్రతిష్ఠితారుద్రకోటి ర్యావత్సంనిహితంసరః. 48

దక్షిణనతుదేవస్య గంధర్వైర్యక్షకిన్నరైః| ప్రతిష్ఠితానిలింగానియేషాంసంఖ్యానవిద్యతే. 49

తిస్రః కోట్యోర్ధకోటీచ లింగానాంవాయురబ్రవీత్‌ | అసంఖ్యాతాఃసహస్రాణి యేరుద్రాఃస్థాణుమాశ్రితాః. 50

ఏతజ్‌జ్ఞాత్వాశ్రద్దదానః స్థాణులింగంసమాశ్రయేత్‌ | యస్యప్రసాదాత్ప్రాప్నోతి మనసాంచితితంఫలమ్‌. 51

అకామోవాసకామోవా ప్రవిష్టః స్థాణుమందిరమ్‌ | విముక్తః పాతకైర్‌ఘోరైః ప్రాప్నోతిపరమంపదమ్‌. 52

చైత్రేమాసే త్రయోదశ్యాం దివ్యనక్షత్రయోగతః | శుక్రార్కచంద్రసంయోగే దినేపుణ్యతమేశుభే. 53

ప్రతిష్ఠితం స్థాణులింగం బ్రహ్మణాలోకధారిణా | ఋషిభిర్దేవ సంఘైశ్చ పూజితంశాశ్వతీస్సమాః. 54

తస్మిన్‌కాలేనిరాహారమానవాశ్రద్ధయాన్వితాః|పూజయంతిశివంయేవైతేయాన్తిపరమంపదమ్‌. 55

తదారూఢమిదంజ్ఞాత్వా యేకుర్వంతిప్రదక్షిణమ్‌ | ప్రదక్షిణీకృతాతైస్తు సప్తద్వీపావసుందరా. 56

ఇతి శ్రీవామనమహాపురాణ సరోమాహాత్మ్యే పంచవింశోధ్యాయః సమాప్తః.

స్వర్ణలింగానికి వెనుక భాగాన తత్త్వద్రష్టలయిన ఋష్యాదులు స్థాపించినలింగాలు లెక్కకుమించినవి. అలాగే దానికి ఉత్తరాన ఓఘనతీనది వరకుగల భూభాగంలో స్వామికి పశ్చిమాన ఒకవేయి లింగాలు స్థాపింపబడినవి. దానికి తూర్పు దిశగా సంనిహిత సరస్సువరకుగల భూమిలో మహాత్ములగు వాలఖిల్య మునులొకకోటి లింగాలు ప్రతిష్ఠించారు. స్వామికి దక్షిణంగా గంధర్వ యక్షకిన్నరలు ప్రతిష్ఠించిన లింగాలు అసంఖ్యాకాలు. వాయువు చెప్పినట్టుగా మూడున్నరకోట్ల లింగాలు ఆ పుణ్య భూమిలో వెలసినవి. ఇకపోతే ఆ స్థాణ్వీశర్వుని ఆశ్రయించి అచటఉన్న వేలాదిరుద్రుల సంఖ్యయిందులో చేరదు. ఈ విషయాలన్నింటినీ గ్రహించి ఆ స్థాణ్వీశ్వర మహాలింగాన్ని శ్రద్ధాభక్తులతో ఆశ్రయించినవారల కోరికలన్నీసిద్ధిస్తాయి. సందేహం లేదు. సకామంగాగానీ లేక నిష్కామంగా కానీ ఆ స్థాణువు ఆలయాన ప్రవేశించిన ప్రతిమానవుడూ ఘోర పాపాలనుంచి ముక్తుడై పరమపదం పొందుతాడు. చైత్రత్రయోదశినాడు దివ్యనక్షత్రాలు శుక్ర సూర్య చంద్రగ్రహాలతో కలిసి పరమ పుణ్యదినాన ఆ స్థాణులింగాన్ని సాక్షాత్తు విరించి బ్రహ్మ ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా దానిని ఋషి ముని దేవతా సంఘాలు సేవిస్తూ ఉన్నాయి. ఆ పవిత్ర దినాన ఉపసించి శ్రద్ధాభక్తులతో ఆ పరమ శివునారాధించిన నరులు పరమపదాన్ని పొందుతారు. అచ్చట ఆ పరమేశ్వరుని నన్నిధానాన్ని భావించుకొని ఆ ప్రదేశానికి ప్రదక్షిణం చేసినచో సప్త ద్వీపాలతోకూడిన ఈ భూమండలాన్నంతా చుట్టివచ్చిన పుణ్యఫలం లభిస్తుంది.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోమాహాత్మ్యంలోని యిరువది అయిదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters