Sri Vamana Mahapuranam    Chapters   

ఇరవదవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ :

సముద్రాస్తత్రచత్వారో దర్విణా ఆహృతాఃపురా | ప్రత్యేకంతునరఃస్నాతో గోసహస్రఫలంలభేత్‌. 1

యత్కించి త్ర్కియతేతస్మిం స్తపస్తీర్థేద్విజోత్తమాః | పరిపూర్ణంతుతత్సర్వ మపిదుష్కృతకర్మణః. 2

శతసాహస్రికంతీర్థం తథైవశతికం ద్విజాః | ఉభయోర్హినరఃస్నాతో

గోసహస్రఫలంలభేత్‌. 3

సోమతీర్థంచతత్రాపి సరస్వత్యాస్తటే స్థితమ్‌ | యస్మిన్‌ స్నాతస్తు పురుషో రాజసూయఫలం లభేత్‌. 4

రేణుకాశ్రమమాసాద్య శ్రద్దధానోజితేంద్రియః | మాతృభక్త్యాచయత్పుణ్యం తత్ఫలం ప్రాప్నుయాన్నరః.

ఋణమోచనమాసాద్య తీర్ధం బ్రహ్మనిషేవితమ్‌ | ఋణౖర్ముక్తోభ##వేన్నత్యం దేవర్షిపితృసంభ##వై ః

కుమారస్యాభిషేకంచ ఓజసంనామవిశ్రుతమ్‌. 6

తస్మిన్‌ స్నాతస్తుపురషో యశసాచసమన్వితః | కుమారపురమాప్నోతి కృత్వాశ్రద్ధంతుమానవః| 7

చైత్రషష్ఠ్యాంసితేపక్షే యస్తుశ్రాద్ధంకరిష్యతి | గయాశ్రాద్దేచయత్పుణ్యం తత్పుణ్యం ప్రాప్ను యాన్నరః. 8

సన్నిహిత్యంయథా శ్రాద్ధం రాహుగ్రస్తేదివాకరే | తథాశ్రాద్దంతత్రకృతం నాత్రకార్యావిచారణా. 9

ఓజసేహ్యక్షయం శ్రాద్ధం వాయునాకథితంపురా | తస్మాత్సర్వప్రయత్నేన శ్రాద్ధంతత్రసమాచరేత్‌. 10

యస్తుస్నానంశ్రద్దధాన శ్చైత్రషష్ఠ్యాంకరిష్యతి | అక్షయ్యముదకం తస్య పితృణాముపజాయతే. 11

లోమహర్షణుడన్నాడు - ప్రాచీన కాలంలో దర్వినాలుగు సముద్రాలను వెలయించాడు. వానిలో ఒక్కోక్కదానిలో స్నానం చేసిన వానికి గోసహస్ర దానఫలం లభిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తములారా ! ఆ తీర్థాలలో చేసిన తపస్సు ఎంత స్వల్పమైనను ఎంతటి దుష్టుడు చేసిననూ పరిపూర్ణమవుతుంది. అక్కడే శతసాహస్రిక శతికతీర్థాలు కూడా ఉన్నవి. ఆరెంటిలో స్నానం చేస్తే వేయి ఆవులు దానం చేసిన ఫలం దక్కుతుంది. అక్కడే సరస్వతీ తీరాన ఉన్న సోమతీర్థంలో మునిగినవాడు రాజసూయ యాగఫలం పొందుతాడు. రేణుకాశ్రమాన్ని సేవించిన శ్రద్ధాశువు జితేంద్రియుడు మాతృసేవ చేసిన ఫలం పొందగలడు. బ్రహ్మసేవితమైన ఋణమోచన క్షేత్రాటనం చేసిన పుణ్యుడు దేవర్షి పితృఋణాలనుండి ముక్తుడౌతాడు. ఓజస తీర్థంగావినుతిగాంచిన కుమారాభిషేక తీర్థాన మునిగినవాడు యశస్విఅవుతాడు. అచ్చట శ్రాద్ధ మొనరించినచో కుమార పురప్రాస్తి కలుగుతుంది. అక్కడ చైత్రశుద్ధ షష్ఠినాడొనర్చిన శ్రాద్ధం గయాశ్రాధ్ద ఫలంయిస్తుంది. అంతేకాదు. సన్నిహిత క్షేత్రంలో సూర్యగ్రహణవేళ చేసిన శ్రాద్ధఫలం గూడ లభిస్తుంది. సందేహం లేదు. ఓ జసక్షేత్రంలో చేసిన శ్రాద్ధం. అక్షయ ఫలమిస్తుంది పూర్వం వాయుదేవుడుచెప్పాడు. కనుకఎలాగైనా ప్రయత్నించి అక్కడ చైత్రషష్ఠినాడుచేసిన స్నానం పితరులకు అక్షయమైన ఉదక ప్రాప్తి కలుగజేస్తుంది.

తత్రపంచవటంనామ తీర్థంత్రైలోక్యవిశ్రుతమ్‌ | మహాదేవఃస్థితోయత్ర యోగమూర్తిధరఃస్వయమ్‌. 12

తత్రస్నాత్వా7ర్చయిత్వాచ దేవదేవం మహేశ్వరమ్‌ | గాణపత్యమవాప్నోతి దైవతైస్పహమోదతే. 13

కురుతీర్థంచవిఖ్యాతం కురుణాయత్రవైతపః | తప్తంసుఘోరంక్షేత్రస్య కర్షణార్థం ద్విజోత్తమాః. 14

తస్యఘోరేణతపసా తుష్టఇంద్రో7బ్రవీద్వచః | రాజర్షేపరితుష్టో7స్మి

తపసా7నేనసువ్రత. 15

యజ్ఞంయేచకురుక్షేత్రే కరిష్యంతి శతక్రతోః | తేగమిష్యంతిసుకృతాం లోకాన్‌ పాపవివర్జితాన్‌. 16

అవహస్యతతఃశక్రో జగామత్రిదివంప్రభుః | ఆగమ్యాగమ్యచైవైసం భూయోభూయో7వహస్యచ. 17

శతక్రతురనిర్విణ్ణః పృష్ట్వాపృష్ట్వాజగామహ | యదాతుతపసోగ్రేణ చకర్షదేవమాత్మనః.

తతఃశక్రో7బ్రవీత్‌ ప్రీత్యా బ్రూహియత్తేచికీర్షితమ్‌. 18

కురురువాచ :

యేశ్రద్దధానాస్తీర్థే7స్మిన్‌ మానవానివసంతిహ | తేప్రాప్నువంతు సదనం బ్రహ్మాణఃపరమాత్మనః. 19

అన్యత్రకృతపాపాయే పంచపాతకదూషితాః | అస్మింస్తీర్థేనరాఃస్నాత్వా ముక్తాయాంతుపరాంగతిమ్‌. 20

కురుక్షేత్రేపుణ్యతమం కురుతీర్థం ద్విజోత్తమాః | తందృష్ట్వా పాపముక్తస్తు పరం పదమావాప్నుయాత్‌. 21

కురుతీర్థేనరఃస్నాతో ముక్తోభవతి కిల్పిషైః | కురుణాసమనుజ్ఞాతః ప్రాప్నోతిపరమంపదమ్‌. 22

అక్కడ ముల్లోకాల్లో ఖ్యాతిగాంచి యోగమూర్తియైన మహాదేవ నివాసమైన పంచవట తీర్థముంది. అక్కడ స్నానంచేసి మహేశ్వరుని అర్చించినచో గాణపత్యం సిద్దించి దేవతలతోకలిసి సుఖిస్తాడు నరుడు. ఓ బ్రాహ్మణోత్తములారా! అక్కడే భూమిదున్నుటకై కురురాజు ఘోరతపస్సు చేసినకురుతీర్థంఉంది. ఆయన చేసిన ఉగ్రతపస్సుకు సంతోషించి"రాజర్షీ! నీ తపస్సుకు సంతోషించాను. ఈ కురుక్షేత్రంలో ఇంద్రయాగం చేసిన వారు పాపరహితములయిన సుకృతలోకాలను పొందుతారన్నాడు. అంతట నవ్వుతూ ఆ యింద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. అలాగే యింద్రుడు నవ్వుతూ మాటిమాటికి వస్తూవెళ్తూ కురుతోమాట్లాడుతూ గడిపాడు. చివరకు తీవ్రమైన తపస్సుచేసి కురు తనదేహం పవిత్రంగావించికొనగా ఇంద్రుడు సంతోషంతోవచ్చి నీకేం కావలెనో కోరుకొనుమని ప్రేమతో అడిగాడు. అప్పుడు కురువిలాఅన్నాడు. " యీ తీర్థంలో శ్రద్ధా భక్తులతో నివసించిన వారికి బ్రహ్మలోకప్రాప్తి కలగాలి. ఈతీర్థంలో స్నాంచేసిన వారలెక్కడ ఏ పాపాలుచేసినా పంచపాతకాలు చేసినాసరే ముక్తులై పరమపదం పొందవలె." కురుక్షేత్రంలోని తీర్థాలన్నింటిలో కురుతీర్థం పవిత్రమైనది. బ్రాహ్మణులారా ! దాని దర్శనమాత్రానే పాపముక్తులై పరమపదం పొందుతారు. కురుతీర్థంలో స్నానంచేసినవాడు ముక్తపాపుడై కురువు అనుగ్రహంతో పరమపదం పొందుతాడు.

స్వర్గద్వారంతతోగచ్ఛేత్‌ శివద్వారేవ్యవస్థితమ్‌ | తత్రస్నాత్వాశివద్వారే ప్రాప్నోతిపరమంపదమ్‌. 23

తతోగచ్చేదనరకం తీర్థంత్రైలోక్యవిశ్రుతమ్‌ | యత్రపూర్వేస్థితో బ్రహ్మా దక్షిణతు మహేశ్వరః. 24

రుద్రపత్నీపశ్చిమతః పద్మనాభోత్తరేస్థితః | మధ్యేఆనరకంతీర్థం

త్రైలోక్యస్యాపిదురభమ్‌. 25

తస్మిన్‌ స్నాతస్తు ముచ్యేత పాతకైరుపపాతకైః | వైశాఖేచయదా షష్ఠీమంగలస్యదినం భ##వేత్‌. 26

తదాస్నానంతత్రకృత్వా ముక్తో భవతిపాతకైః |యఃప్రయచ్ఛేతకరకాంశ్చతురోభక్ష్యసంయుతాన్‌. 27

కలశం చతథాదద్యా దపూపైః పరిశోభితమ్‌ | దేవతాఃప్రీణయే త్పూర్వం కరకైరన్నసంయుతైః. 28

తతస్తుకలశం దద్యాత్‌ సర్వపాతకనాశనమ్‌ | అనేనైవవిధానేనయస్తు

స్నానంసమాచరేత్‌. 29

సముక్తఃకలుషైః సర్వైప్రయాతిపరమంపదమ్‌ | అన్యత్రాపి యదాషష్ఠీ మంగళేన భవిష్యతి. 30

తత్రాపిముక్తిఫలదాక్రియా తస్మిన్‌ భవిష్యతి | తీర్థేచ సర్వతీర్థానాం యస్మిన్‌ స్నాతోద్విజోత్తమాః. 31

సర్వదేవైరనుజ్ఞాతః పరంపదమవాప్నుయాత్‌ | కామ్యకంచవనం పుణ్యం సర్వపాతకనాశనమ్‌. 32

యస్మిన్‌ ప్రవిష్టమాత్రస్తు ముక్తోభవతికిల్బిషైః | యమాశ్రిత్య వనంపుణ్యం సవితాప్రకటఃస్థితః. 33

పూషానామద్విజశ్రేష్ఠా దర్శనాన్ముక్తిమాప్నుయాత్‌ | ఆదిత్యస్యదినేప్రాప్తే తస్మిన్‌ స్నాతస్తుమానవః.

విశుద్దదేహోభవతి మనసాచింతితంలభేత్‌. 34

ఇతి శ్రీ వామనమహాపురాణ సరోమాహాత్మ్యే వింశో7ధ్యాయః

తర్వాత శివద్వారంలో ఉన్న స్వర్గద్వారానికి వెళ్ళాలి. అక్కడ శివద్వారంలో స్నానంచేస్తే పరమపదం లభిస్తుంది. అచటనుంచి ముల్లోకాల్లో పేరొందిన అనరకతీర్థాన్ని చేరుకోవాలి. అక్కడ తూర్పుదిక్కున బ్రహ్మ దక్షిణాన మహేశ్వరుడు పశ్చిమాన రుద్రపత్ని ఉత్తరంగా పద్మనాభుడు ఉంటారు. మధ్యభాగాన అనరకమనే దుర్లభ##మైన తీర్థంఉంది. అక్కడస్నానంచేస్తే మహాపాతక ఉపపాతకాలన్నీ పోతాయి. వైశాఖషష్ఠి మంగళవారంనాడచట స్నానంచేసి పాపవిముక్తులు కాగలరు. అక్కడ నాలుగుపాత్రలలో అన్నము, అప్పాలతో నింపిన కలశాన్ని దేవతలకు ప్రీతిగా సమర్పించాలి. సర్వపాప నాశనానికి కలశదానం చేయాలి. ఈ విధంగా ఎవరుస్నానం చేస్తారో వారు సర్వపాపముక్తులై పరమపదానికి వెళ్తారు. షష్ఠితో కూడిన మంగళవారంరోజున యితరత్రాకూడ యీ విధంగాచేస్తే ముక్తిలభిస్తుంది. ఓ బ్రాహ్మణులారా ! తీర్థాల్లో ఉత్తమ మైన ఈ తీర్థంలో స్నానంచేసిన నరుడు సర్వదేవానుమతుడై పరమపదం పొందుతాడు. పుణ్యదాయి అయిన కామ్యకవనంలో ప్రవేశించినతనే సర్వపాతకాలు నశించి మానవుడు ముక్తిపొందుతాడు. ఆ వనంలో సూర్యుడు పురుషుడనే పేరుతో విరాజిల్లుతున్నాడు. ఆయనను దర్శించినంతనే ముక్తికలుగుతుంది. ఆదివారంనాడచట స్నానంచేయు నరుడు విశుద్ధదైహుడై మనోరథాలన్నీ సఫలంగావించుకుంటాడు.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోమాహాత్మ్యంలో యిరువదవ అధ్యాయం సమాప్తం.

Sri Vamana Mahapuranam    Chapters