Sri Vamana Mahapuranam    Chapters   

పన్నెండవ అధ్యాయము

లోమహర్షణ ఉవాచ :

ఇతిఋషేర్వచనంశ్రుత్వా మార్కండేయస్య ధీమతః | నదీప్రవాహసంయుక్తా కురుక్షేత్రం వివేశహ. 1

తత్రసారంతుకంప్రాప్య పుణ్యతోయా సరస్వతీ | కురుక్షేత్రంసమాప్లావ్య ప్రయాతా పశ్చిమాందిశమ్‌. 2

తత్ర తీర్థసహస్రాణి ఋషిభిః సేవితానిచ | తాన్యహం కీర్తయిష్యామి ప్రసాదాత్‌ పరమేష్ఠినః. 3

తీర్థానాంస్మరణంపుణ్యం దర్శనం పాపనాశనమ్‌ | స్నానంముక్తికరం ప్రోక్త మపి దుష్కృతకర్మణః. 4

యేస్మరంతిచతీర్థాని దేవతాః ప్రీణయంతిచ | స్నాంతిచశ్రద్దధానాశ్చ తేయాంతి పరమాంగతిమ్‌. 5

అపవిత్రఃపవిత్రోవా సర్వావస్థాం గతో7పివా | యఃస్మరేత్‌ కురుక్షేత్రం సబాహ్యాఖ్యాంతరః శుచిః . 6

కురుక్షేత్రం గమిష్యామి కురుక్షేత్రే వసామ్యహమ్‌ | ఇత్యేవంవాచముత్సృజ్య సర్వపాపైః ప్రముచ్యతే. 7

బ్రహ్మజ్ఞానంగయాశ్రాద్ధం గోగ్రహే మరణంతథా | వాసఃపుంసాంకురుక్షేత్రే ముక్తిరుక్తా చతుర్విధా. 8

సరస్వతీదృషద్వత్యోర్దే వనద్యో ర్యదంతరమ్‌ | తందేవనిర్మితందేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే. 9

దూరస్థో7పి కురుక్షేత్రే గచ్ఛామి చ వసామ్యహమ్‌|

ఏవం యః సతతం బ్రూయాత్సో7పి ప్రాపైః ప్రముచ్యతే. 10

తత్రచైవసరఃస్నాయీ సరస్వత్యాస్తటేస్థితః | తస్యజ్ఞానం బ్రహ్మమయముత్పత్స్యతినసంశయః. 11

రోమహర్షణుడు చెప్పదొడగెను. బుద్ధిమంతుడగు మార్కండేయుని మాట విని సరస్వతి ప్రవాహరూపంతో కురుక్షేత్రంలో ప్రవేశించింది. ఆ పుణ్యసలిల రంతుకం చేరి కురుక్షేత్రాన్ని తడుపుతూ పశ్చిమ దిశగా మళ్ళింది. అక్కడ మహర్షి సేవితాలయిన వేయితీర్థాలున్నవి. పరమేష్ఠి కృపవల్ల వాటిని వర్ణిస్తాను వినండి. పవిత్ర తీర్థాలను స్మరిస్తే పుణ్యం చూస్తేపాపక్షయం, స్నానం చేస్తే పరమదుశ్చేష్టితులకు గూడ ముక్తి కలుగుతాయి. ఎవరు తీర్థాలను స్మరిస్తారో అచట దేవ ప్రీతికరాలయిన కార్యాలు చేస్తారో స్నానాలు చేస్తారో వాని పట్ల శ్రద్ధ గలిగి ఉంటారో వారంతా ఉత్తమగతులను పొందుతారు. అపవిత్రుడైన పవిత్రుడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే కురుక్షేత్రాన్ని స్మరించినంతనే మానవునకు బాహ్య అంతరశుచిత్వం కలుగుతుంది. ఇంతేకాదు. నేను కురుక్షేత్రం వేళ్తాను. అక్కడనివాసం చేస్తాను అనునోటపలికినంత మాత్రాన్నే పాపక్షయం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం, గయాశ్రాద్ధం, గోగ్రహంలో మరణం, కురుక్షేత్రవాసం వల్ల నాలుగు విధాల ముక్తులు చెప్పబడినవి. సరస్వతి ద్పషద్వతీ ఈ రెండు దేవనదుల మధ్యగల భూమి దేవనిర్మితమైంది. దానిని బ్రహావర్తమంటారు. దూరాన ఉంటూకూడ నేను కురుక్షేత్రం వేళ్తాను. అక్కడ ఉంటాను. అనినిరంతరం అంటూ ఉండే వాని సర్వపాపాలు పోతాయి. అచట సరస్సులో స్నానం చేస్తూ సరస్వతీ తీరాన ఉండే వారికి బ్రహ్మ జ్ఞానం కలుగుటలో సందేహం లేదు.

దేవతా ఋషయః సిద్ధాః సేవంతే కురుజాంగలమ్‌ | తస్య సంసేవనాన్నిత్యం బ్రహ్మాచాత్మని పశ్యతి. 12

చంచలంహిమనుష్యత్వం ప్రాప్యయేమోక్షకాంక్షిణః | సేవంతినియతాత్మనో అపి దుష్కృతకారిణః. 13

తేవిముక్తాశ్చకులుషై రనేకజన్మసంభ##వైః | పశ్యంతినిర్మలందేవం హృదయస్థంసనాతనమ్‌. 14

బ్రహ్మవేదిఃకురుక్షేత్రం పుణ్యంసాన్నిహితంసరః | సేవమానానరానిత్యం ప్రాప్నువంతిపరంపదమ్‌. 15

గ్రహనక్షత్రతారాణాం కాలేనపతనాద్భయమ్‌ | కురుక్షేత్రేమృతానాంచ పతనంనై వవిద్యతే. 16

యత్రబ్రహ్మాదయోదేవా ఋషయఃసిద్దచారణాః | గంధర్వాప్సరసోయక్షాః సేవంతిస్థానకాంక్షిణః. 17

గత్వాతు శ్రద్ధయా యుక్తః స్నాత్వా ణుమహాహ్రదే |

మనసా చింతితం కామం లభ##తే నాత్రసంశయః. 18

నియమంచ తత్య కృత్వా గత్వా సరః ప్రదక్షిణమ్‌ |

రంతుకం చసమాసాద్య క్షామయిత్వాపునః పునః 19

సరస్వత్యాంనరఃస్నాత్వా యక్షం దృష్ట్వా ప్రణమ్య చ |

పుష్పంధూపంచనై వేద్యం దత్వా వాచ ముదీరయేత్‌. 20

తవప్రసాదాద్‌ యక్షేంద్ర వనానిసరితశ్చయాః | భ్రమిష్యామిచతీర్థాని అవిఘ్నం కురుమేసదా. 21

ఇతి శ్రీ వామనమహాపురాణ సరోమాహాత్మ్యే ద్వాదశో7ధ్యాయః.

దేవతలు, ఋషులు, సిద్ధులు కురుజాంగలాన్ని సదాసేవిస్తారు. ఆ కారణాన వారు బ్రహ్మను తమలోనే చూడగలుగు తున్నారు. క్షణ భంగురమైన మానవజీవితాన్ని పొంది, మోక్షమును కోరువారు జితేంద్రియులై ఈ క్షేత్రాన్ని సేవిస్తారు. ఎంతటి దురాచారులై ననుసరే అనేక జన్మార్జితాలయిన పాపాలనుంచి ముక్తులై తమహృదయాల్లో ఆ పవిత్ర బ్రహ్మతత్వాన్ని చూడగలుగుతారు. నిత్యమూ బ్రహ్మదేవుని కురుక్షేత్రాన్ని సన్నిహిత సరోవరాన్ని భజించే మానవులు పరమపదప్రాప్తి పొందుతారు. గ్రహనక్షత్ర తారలకైనా కాలంతీరిన తర్వాత పతనం పొందుతామనే భయంఉండవచ్చుగాని కురుక్షేత్రంలో మరణించువారకు అలాంటిభయం ఉండదు. బ్రహ్మ మొదలగు దేవతలు ఋషులు సిద్దులు యక్షులు గంధర్వాప్సరసాదులు తమతమ పదవులు నిలబెట్టుకొనుటకు ఆ క్షేత్రాన్ని సేవిస్తారు. అక్కడకువెళ్ళి శ్రద్ధతో స్థాణుసరోవరంలో స్నానంచేస్తే మనస్సులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి. సందేహం లేదు. వ్రతనిష్ఠతో ఆ సరోవరానికి ప్రదక్షిణంచేసి, రంతుకానికి వెళ్ళి మరల మరల క్షమాయాచనచేస్తూ సరస్వతినదిలో స్నానంచేసి యక్షుని దర్శించి ధూప దీపపుష్పనైవేద్యాదులతో పూజించి ఓ యక్షేంద్రా ! నీ అనుగ్రహం వల్ల నే నేను తలపెట్టిన ఈ తీర్థఅరణ్య సరోవరాల పర్యటనం నిర్విఘ్నంగా నెరవేరుగాక, అని ప్రార్థించవలెను.

ఇది శ్రీ వామన మహాపురాణంలోని సరోమహాత్మ్యంలోని పన్నెండవ అధ్యాయం సమాప్తము.

Sri Vamana Mahapuranam    Chapters